పరిశ్రాంత
నేడు నాడు మా ముప్పయ్యారవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చిన్న పోయెమ్ పరిశ్రాంత ********** తప్పనిసరిగా నాలుగు మాటలు రాసుకోవాలి నాకు నేను సమాధానం చెప్పుకోవాలి నన్ను నన్నుగా నిలబెట్టడానికి నిన్ను నీవు ఎంత దహించుకున్నావో నాకు నేనైనా చెప్పుకోవాలి కదా! ఎవరికివారే అహం మాయలో కొట్టుకుపోతుంటే సంయమనంతో సంతులీకరించిన విషయం గుర్తుచేసుకోవాలి కదా నీవు త్యాగం చేశావని నీకు తెలియదు బాధ్యతనే భ్రమలో బతికావన్నది నాకు మాత్రమే తెలిసిన నిజం పాప పుణ్యాలపై నమ్మకం గానీ తానున్నాడనే నమ్మకం గానీ నాకు లేదు నాకోసం నీవు పడే తపన ముందు అవి గొప్ప విషయాలనిపించలేదు. నీవు చెప్పినట్లుగా నడవడం తప్పనిపించలేదు నీ నమ్మకాన్ని గౌరవించడం కంటే అదో గొప్ప విషయం కాదు అంతకంటే ముఖ్యమైన పనీ నాకు లేదు నాదైన ప్రయాణంలో నీవు కలిసిరావడం మన ప్రయాణం మొదలవడం వరమని అనను అలిసి సొలసిన మాకు ఆసరాగా నిలబడి నాలుగు స్తంభాలాట లో విజేతగా నిలిచావు నా బాధ్యతను నీ అనుమతి లేకుండా...