రమణీయం Dec 2024
రమణ జయంతి సందర్భంగా December 2024 కవనజ్యోతి సమర్పిస్తున్న కవితాహారం నిర్వహణ శివునూరి లలితాక్రిష్ణ వీరా గుడిపల్లి ********** కవివరుల జాబితా 1. వీరా గుడిపల్లి 2.కోరాడ గారు 3. అపరాజిత రెడ్డి గారు 4.సూర్యనారాయణ గారు 5.మేకల రామస్వామి గారు 6.కొంజేటి రాధిక గారు .................... 1 *చదివిన దేముంది? !చాలినంతయు లేదు* *పెఱియ పుఱాణమే! పెక్కు మార్లు* శైవ సిద్ధాంతంబు! శివతత్వ మార్గమ్ము సృష్టి రహస్యంబు! సృజన గాంచి *శివభక్త చరితంబు! శిఖరాయ మానమై* *జీర్ణమై పూర్ణమై! జీవితమ్ము* అరుణాద్రి చేరగా ! ఆత్రపడినఱేడు అటనుండి కదలక! యలదు కొనెను *రమణ మార్గ మన్న! రమణీయ మైనది* అణువనువున సృష్టి! అమరికలను *వేరుచేయలేని! వెలిదిప్ప తెలియరా* భవ్య చరిత నీది ! భరత వీర 2 [30/12, 10:57 am] Korada: రమణుని జననం... ...