Posts

Showing posts from February, 2022

శివరాత్రి 2022

Image
నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************** ఆద్యంతరహితుడై యలరారు వానికి యభిషేకమొనరించ నార్తి యేల? దిక్కులన్ ధరియించు దేవదేవునకును  వస్త్రములర్పించ వాంఛ యేల? వాసనలంటక వరలు సాంబనికిని గంధమ్ము నలదనాకాంక్ష యేల? ఆకలియెరుగని యాశుతోషునకును నిడ పంచభక్ష్యాల నిచ్ఛ యేల లోకాలు తిరుగాడు లోకేశు చుట్టి రా నూటొక్కచుట్లని నుడువు టేల ? జ్యోతి స్వరూపమైజోతలందెడు వాన్కి ధూపముల్ దీపముల్ చూపనేల? పరిపూర్ణ  తత్వమై భాసిల్లునీశుని ప్రస్తుతించగచాలు భావమొకటి హృదయ పద్మమందు ముదముగా వెలిగెడి  యాత్మ లింగముపయిననమితప్రీతి భక్తి భావనమున ముక్తిని గోరుచు పరమ శివుని కిడుడు ప్రణతులెపుడు **********లలితాకృష్ణ ******************************** కవి వరుల జాబితా 1.అపరాజిత్ గారు 2.మద్ది పుల్లారావు గారు 3.తోట సులోచన గారు 4.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 5. తరణి కంటి సూర్య లక్ష్మి గారు 6.కోరాడ గారు 7.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 8. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 9.గొర్రెపాటి శ్రీనివాస్ గారు 10.టేకుమళ్ళ విజయ లలిత గారు 11.డా.కమలా దేవి గారు 12/2.కోరాడ గారు 13.డా.తంగిరాల నాగ లక్ష్మ...

విశ్వాసం 22022022

Image
అంశం: విశ్వాసం ****** నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ****** కవి వరుల జాబితా 1.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 2.కోరాడ గారు 3.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 4.కవిత వెంకటేశ్వర్లు గారు 5.వింజమూరి సూర్య లక్ష్మి గారు 6.గొర్రెపాటి శ్రీ ను గారు 7.గజవెల్లి శ్రీనివాసాచారి గారు 8.శివునూరి లలితా కృష్ణ గారు ****************** 1 అంశం: విశ్వాసం పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్ ఊరు: కర్నూలు చరవాణి: 9505152560 **********************       ఉత్తమ గుణం మంచిని పెంచే విశేషణాలలో ముఖ్య గుణం ఉప్పు పెట్టిన పుణ్యానికి ఉప్పు తిన్న ఉపకారము సేవావృత్తులందు లభ్యం అల్ప ప్రాణి శునకానికి పెట్టు ఆహారము తెల్లవార్లు కాపలాకాయు ఉపచారము దీక్షతో ఆరాధించు దేవుని పట్ల విశ్వాసంతో సిద్ధించును దీక్ష సంకల్పము... విశ్వాసము ప్రాణికి నిర్దేశిత మార్గము రేపు అనే పదానికి ఊపిరి పోసిన ఉచ్చ్వాసము.. నేటికి అంతిమమం అనుకునేది  ఊపిరి తీసిన నిశ్వాసము... మనసులో జీర్ణించుకున్న ప్రాపంచిక దృక్పథము  కృతజ్ఞతకు సంతకం కృతఘ్నతకు తిలోదకం       *** సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు. 2 నేటిఅంశం :-  @ విశ్వాస...

మాతృ భాష 21022022

నిర్వహణ శివునూరి లలితాకృష్ణ  వీరా గుడిపల్లి ********** కవివరుల జాబితా 1.అపరాజిత్ గారు 2.సింహాద్రి వాణి గారు 3. 4.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 5.పిన్నక నాగేశ్వరరావు గారు 6.డా.బల్లూరి ఉమాదేవి గారు 7. 8.ముత్యం వెంకటేశ్వర్ రావు గారు 9.మద్ది పుల్లారావు గారు 10.అంబటి నారాయణ గారు 11.శివునూరి లలితా కృష్ణ గారు **********--- 1 ఆశల జీవితం! ఆశలు వదులుకున్న జీవితం  ఆత్మీయులంతా దూరమై  పదుగురి మధ్య బికారినై  వయస్సు నీడలా మీదపడుతూ  కలలలో కనిపించని లోకాలేవో చూస్తూ  విషం తలలో నింపుకున్న కోడెనాగులు  గుండెలు కంపిస్తూ భయకంపితుడనై  గుడ్డి దీపం వెలుగుల్లా కనుల బాసలు  రాత్రి దయ్యాల్లా నీడలు పరచిన భవంతులు  పగిలిన గుండెల్లా పగల్లు వెక్కిరిస్తూ,,,! హృదయం నిండా ప్రేమ నింపుకుని  కవ్వింపుల విశాదాలను వదిలించుకుంటూ  ఆశల ఆరాటాలలో విరిసిన పూల మొగ్గలు  పండుటాకులు రాలిపోనీ కొత్త చిగుళ్లు మొలుస్తాయి కదా! నిరాశ నీడలో ఆశల పొదరిల్లు కట్టాలి  వెండితెరపై వెలిగే తారల్లా  జీవితంలో ఆశల ఆనందాల హరివిల్లు విరియాలి  ఆత్మీయులంటూ వుంటే నీ హృదయం నీదైతేనే...

మాఘ మాసం పౌర్ణమి సమతామూర్తి

Image
నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి *************** కవి వరుల జాబితా 1.డా.తంగిరాల నాగలక్ష్మి గారు 2. డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు 3.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 4.కోరాడ గారు 5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 6.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 7.మద్ది పుల్లారావు గారు 8.డా. బల్లూరి ఉమాదేవి గారు 9.జోషి పద్మావతి గారు 10.అపరాజిత రెడ్డి గారు 11.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 12.సింహాద్రి వాణి గారు 13.గొర్రెపాటి శ్రీ ను గారు 14.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 15.వేమూరి సత్యవతి గారు 16.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 17.తోట సులోచన గారు 18..టేకుమళ్ళ విజయ లలిత గారు 19. 20.కవిత వెంకటేశ్వర్లు గారు 21.లలితా చండీ గారు 22.మొహమ్మద్ అఫ్సర వలీషా గారు 23.పిన్నక నాగేశ్వరరావు గారు 24.వేదాంతం సురేష్ బాబు గారు ************* సమీక్ష లు కవితాగానం సమూహంలోని మిత్రులందరూ చాలా చక్కటి కవితలతో అలరించారు. శ్రీ రామానుజుల వారి తత్వాన్ని, జీవిత విశేషాలను తమ కవితలలో తెలియజేయడంతో పాటు..సమ సమాజ నిర్మాణం కోసం సమతామూర్తి బోధనలను ఆచరించాల్సిన  ఆవశ్యకతను తమ అక్షరాలలో చక్కగా ప్రతిబింబింపజేశారు.. అందరికీ అభినందనలు💐💐💐...