విహంగ 5/1/2021
నిర్వహణ శివునూరి లలితాకృష్ణ Author of vennela shilpam ************************************ [05/01, 8:00 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️ జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా కవితా గానం ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది. అంశం :విహంగం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ✳️✳️✳️✳️✳️✳️ [05/01, 8:38 PM] Gummannagari Balsaraswati: శీర్షిక:బర్డ్స్ నేచర్.. బంగారు పిచ్చుకా...! బర్రుమని సవ్వడి తో సర్రున ఇంట్లో దూరి నాతో పోటీ పడుతూ అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుం టే నీ అందానికి నువ్వూ నా చందానికి నేనూ ఎంతగా మురిసి పోయేవాళ్ళం... చిట్టి నేస్తమా! నేను అన్నం తింటున్నంత సేపూ, ఇంటి దూలాలకు క్రమ బద్ధంగా వేలాడదీసిన మొక్కజొన్న పొత్తులకు ఒక్కో గింజా ఏరుకుంటుంటే నన్ను పరికిస్తూ నువ్వూ, నిన్ను గమనిస్తూ నేనూ కడుపు నిండా తినేవాళ్ళం_ పిచ్చుకా... నువ్వు లయబద్ధంగా రెక్కల ల్లా డిస్తూ గాల్లో గిరికీలు కొట్టి వాకిట్లో వేపచెట్టు స్థావరానికి దూసుకె ల్తే నీ లానే నేనూ రెండు చేతు లూ గాల్లోకి సాచి తుర్రున బడికి పరిగెత్తే దాన్ని......