Posts

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

Image
పౌర్ణమి నగదు బహుమతుల కవితల పోటీ  భాద్రపద మాసం నిర్వహణ  శ్రీమతి లలితా కృష్ణ  కవనజ్యోతి సమూహం  ********************"*********** కీర్తిశేషులు కేశరాజు వరవరరావు నీలాదేవి స్వాతంత్ర్య సమర యోధుడు, తామ్రపత్ర గ్రహీత,పాతర్లపాడు ఖమ్మం. వారి జ్ఞాపకార్థం  శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు నిర్వహిస్తున్న కవితా స్రవంతి  @@@@@@@@@@@@@@@@@@@@@ కవి వరుల జాబితా  ₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹ 1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. చంద్రమౌళి గారు  3.కోరాడ నరసింహా రావు గారు  4.ఆళ్ల నాగేశ్వరరావు గారు  5.నెల్లూరు వేంకట లక్ష్మి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా గారు  6. పిన్నక గేశ్వరరావు గారు  7 .సూర్యనారాయణ గారు  8. మండ నాగేశ్వరరావు గారు  9.సింహాద్రి వాణి గారు  10.తోట సులోచన గారు  11. డా.వేమూరి.సత్యవతి. విజయవాడ గారు 12.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు  13.అపరాజిత్ రెడ్డి గారు  14.కాసుల ధీరాజ శర్మ, గారు  15.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావుSAsocial గారు  16.కూని అంకబాబు గారు  17. డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు...

రమణీయం Dec 2024

Image
రమణ జయంతి సందర్భంగా December 2024 కవనజ్యోతి సమర్పిస్తున్న  కవితాహారం నిర్వహణ  శివునూరి లలితాక్రిష్ణ వీరా గుడిపల్లి ********** కవివరుల జాబితా  1. వీరా గుడిపల్లి 2.కోరాడ గారు  3. అపరాజిత రెడ్డి గారు  4.సూర్యనారాయణ గారు  5.మేకల రామస్వామి గారు  6.కొంజేటి రాధిక గారు  .................... 1 *చదివిన దేముంది? !చాలినంతయు లేదు*                 *పెఱియ పుఱాణమే! పెక్కు మార్లు* శైవ సిద్ధాంతంబు! శివతత్వ మార్గమ్ము                  సృష్టి రహస్యంబు! సృజన గాంచి *శివభక్త చరితంబు! శిఖరాయ మానమై*                   *జీర్ణమై పూర్ణమై! జీవితమ్ము* అరుణాద్రి చేరగా ! ఆత్రపడినఱేడు                 అటనుండి కదలక! యలదు కొనెను *రమణ మార్గ మన్న! రమణీయ మైనది* అణువనువున సృష్టి! అమరికలను *వేరుచేయలేని! వెలిదిప్ప తెలియరా* భవ్య చరిత నీది ! భరత వీర 2 [30/12, 10:57 am] Korada: రమణుని జననం...       ...

పరిశ్రాంత

Image
నేడు  నాడు  మా ముప్పయ్యారవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా  చిన్న పోయెమ్ పరిశ్రాంత ********** తప్పనిసరిగా  నాలుగు మాటలు రాసుకోవాలి  నాకు నేను సమాధానం చెప్పుకోవాలి  నన్ను నన్నుగా  నిలబెట్టడానికి  నిన్ను నీవు  ఎంత దహించుకున్నావో నాకు నేనైనా చెప్పుకోవాలి కదా! ఎవరికివారే అహం మాయలో కొట్టుకుపోతుంటే సంయమనంతో సంతులీకరించిన విషయం గుర్తుచేసుకోవాలి కదా నీవు   త్యాగం చేశావని నీకు తెలియదు  బాధ్యతనే భ్రమలో బతికావన్నది నాకు మాత్రమే తెలిసిన నిజం  పాప పుణ్యాలపై  నమ్మకం గానీ  తానున్నాడనే నమ్మకం గానీ నాకు లేదు  నాకోసం నీవు పడే తపన ముందు  అవి  గొప్ప విషయాలనిపించలేదు. నీవు చెప్పినట్లుగా నడవడం  తప్పనిపించలేదు నీ నమ్మకాన్ని గౌరవించడం కంటే అదో గొప్ప విషయం కాదు  అంతకంటే ముఖ్యమైన పనీ నాకు లేదు  నాదైన ప్రయాణంలో   నీవు కలిసిరావడం  మన ప్రయాణం మొదలవడం  వరమని అనను అలిసి సొలసిన మాకు  ఆసరాగా నిలబడి  నాలుగు స్తంభాలాట లో విజేతగా నిలిచావు నా బాధ్యతను నీ అనుమతి లేకుండా...

శివరాత్రి 2022

Image
నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ************** ఆద్యంతరహితుడై యలరారు వానికి యభిషేకమొనరించ నార్తి యేల? దిక్కులన్ ధరియించు దేవదేవునకును  వస్త్రములర్పించ వాంఛ యేల? వాసనలంటక వరలు సాంబనికిని గంధమ్ము నలదనాకాంక్ష యేల? ఆకలియెరుగని యాశుతోషునకును నిడ పంచభక్ష్యాల నిచ్ఛ యేల లోకాలు తిరుగాడు లోకేశు చుట్టి రా నూటొక్కచుట్లని నుడువు టేల ? జ్యోతి స్వరూపమైజోతలందెడు వాన్కి ధూపముల్ దీపముల్ చూపనేల? పరిపూర్ణ  తత్వమై భాసిల్లునీశుని ప్రస్తుతించగచాలు భావమొకటి హృదయ పద్మమందు ముదముగా వెలిగెడి  యాత్మ లింగముపయిననమితప్రీతి భక్తి భావనమున ముక్తిని గోరుచు పరమ శివుని కిడుడు ప్రణతులెపుడు **********లలితాకృష్ణ ******************************** కవి వరుల జాబితా 1.అపరాజిత్ గారు 2.మద్ది పుల్లారావు గారు 3.తోట సులోచన గారు 4.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 5. తరణి కంటి సూర్య లక్ష్మి గారు 6.కోరాడ గారు 7.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు 8. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 9.గొర్రెపాటి శ్రీనివాస్ గారు 10.టేకుమళ్ళ విజయ లలిత గారు 11.డా.కమలా దేవి గారు 12/2.కోరాడ గారు 13.డా.తంగిరాల నాగ లక్ష్మ...