ధ్యానం 26112020
నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ********* అంశం ః ధ్యానం ******""************* కవి వరుల జాబితా 1.అపరాజిత్ గారు 2.కోరాడ గారు 3.బండి భాను చందర్ గారు 4.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 5.సుధారాణి కృష్ణం రాజు గారు 6.కె.ఇ.నిలమంగై గారు 7.డా.పోరెడ్డి రంగయ్య గారు 8.ఉదయశ్రీ ప్రభాకర్ గారు 9.కందూరి సుజాతా రాణి గారు 10.వల్లాల విజయ లక్ష్మి గారు 11.కోరాడ గారు 12.నారాయణ భాగ్యలక్ష్మి గారు 13.రాపోలు అరుణా స్వామి గారు 14.ఉల్లెంగ ముత్యం గారు 15.కెసి నరసయ్య గారు 16.సునంద వురిమళ్ళ గారు 17.ధనాశి ఉషారాణి గారు 18.డా.బల్లూరి ఉమాదేవి గారు 19.మర్రి జయశ్రీ గారు 20.భరద్వాజ గారు ********************* 1. నీకే మివ్వను? నాకు మిగిలింది ఈ కొద్ది వెలుతురే ! అనంత మహాసముద్రంలో దోసిలి నీళ్లు కూడా తాగలేము కదా ! కనీసం పంట పొలాలకు కూడా ఆ నీళ్లు పనికిరావు మరి సాగరమథనం చేస్తే అమృతమేలా పుట్టిందో? ! అంతు తెలీని ప్రశ్న హాలాహలం పుట్టిందంటే నమ్మొచ్చు ఆ అమృతం తాగి దేవతలు దేవుళ్ళు మరణాన్ని జయించారంటావ్ ! ఈ సమస్త విశ్వంలో ఏ గ్రహాంతరాళాల్లో వాళ్ళు ఉన్నారంటావ్ ! ధ్యానం చెయ్...