పరిశ్రాంత
నేడు
పరిశ్రాంత
**********
తప్పనిసరిగా
నాలుగు మాటలు రాసుకోవాలి
నాకు నేను
సమాధానం చెప్పుకోవాలి
నన్ను నన్నుగా
నిలబెట్టడానికి
నిన్ను నీవు
ఎంత దహించుకున్నావో
నాకు నేనైనా చెప్పుకోవాలి కదా!
ఎవరికివారే అహం మాయలో కొట్టుకుపోతుంటే
సంయమనంతో సంతులీకరించిన విషయం
గుర్తుచేసుకోవాలి కదా
నీవు
త్యాగం చేశావని నీకు తెలియదు
బాధ్యతనే భ్రమలో బతికావన్నది
నాకు మాత్రమే తెలిసిన నిజం
పాప పుణ్యాలపై
నమ్మకం గానీ
తానున్నాడనే
నమ్మకం గానీ నాకు లేదు
నాకోసం నీవు పడే తపన ముందు
అవి గొప్ప విషయాలనిపించలేదు.
నీవు చెప్పినట్లుగా నడవడం
తప్పనిపించలేదు
నీ నమ్మకాన్ని గౌరవించడం కంటే
అదో గొప్ప విషయం కాదు
అంతకంటే ముఖ్యమైన పనీ నాకు లేదు
నాదైన ప్రయాణంలో
నీవు కలిసిరావడం
మన ప్రయాణం మొదలవడం
వరమని అనను
అలిసి సొలసిన మాకు
ఆసరాగా నిలబడి
నాలుగు స్తంభాలాట లో విజేతగా నిలిచావు
నా బాధ్యతను
నీ అనుమతి లేకుండా
నీ బాధ్యతగా చేశానని తెలిసినా
పల్లెత్తు మాటనకుండా
కలిసి అడుగులు వేసిన
నీకు
ఏమివ్వగలను???
ముప్ఫైయ్యారు సంవత్సరాలు
పూర్తయిన సందర్భంగా
ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే
ఒక ఎవరెస్ట్ లా కనిపిస్తావు
అందుకోవడం కష్టం
పసిఫిక్ లా గోచరిస్తావు
అర్థం కావడం ఇంకా కష్టం
నీ పని నీవు చేసుకుంటూ పోవడం తప్ప
ఎవరినీ పట్టించుకోవు
నాకు మాత్రం మినహాయింపు నిచ్చావు
బాపు అంతిమ యాత్ర
ఎన్నో విషయాలు తెలిపింది
నిన్ను హిమాలయాలకంటే ఎత్తున నిలబెట్టింది.
ఓరిమి కూరిమి కలగలిసిన చేతనకు
ఉదాహరణగా నిలబడిన నీవు
నా జీవితంలో ఒక భాగం కాదు
నీవే నా జీవితం
పిల్లల
బాగోగులు కూడా చూసుకొనే అవసరం రానీయలేదు
అది సరికాదని తెలుసు
బాధ్యత తీసుకుని
బాటలు పరిచిన భార్యామణి
నీకు ఋణపడ్డ వారున్నారు తప్ప
నీవు ఋణపడే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు
తీరాలను చేరాలని ఆరాటపడుతున్న అలలోలె
ప్రయత్నించాలే తప్ఫ
అందుకోవడం సులభం కాదు
రియల్ హీరో ఆఫ్ అవర్ లైఫ్ ఈౙ్
యూ ... ఓన్లీ ఉమా!!!!
Happy wedding anniversary dear
ఇన్నేళ్ల తర్వాత ఏర్పడిన
ఈ ఏడునెలల దూరం
ఎన్ని జ్ఞాపకాలు నెమరేసుకునేలా చేసిందో
అవసరం లేనిది మాట్లాడవు
మౌనమంటే ఎంతిష్టమో
అదే నన్నిన్నిరోజులు నిన్నొదిలుండే ధైర్యాన్నిచ్చింది
అక్కరలేనిది వినిపించుకోవు
చెవులు కూడా మౌనం పాటిస్తాయి
ఏదీ వినిపించుకోకుండా నాదారిని నన్ను నడిపిస్తుంది
పనికి రానిది పట్టించుకోవు
పట్టించుకున్న ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు వదిలి పెట్టాల్సిందేకదా
చేతలు మౌనం దాలుస్తాయి
కాదనుకున్నది చూడవు
కళ్ళు తెరిచినా చూడాలనుకుంటేనే చూడగలం
చూపులు పాటించే మౌనమది
వాసనలంటుకోని వ్యక్తిత్వం
వెంపర్లాడటం తెలియని జ్ఞాన సుమం
ఎక్కడున్నా నా పక్కన్నే ఉంటావు
ఏంచేస్తున్నా కలిసే నడుస్తాం
Happy wedding anniversary dear
you are a unique piece in the universe
ఇవ్వడం తప్ప ఆశించడం తెలియని
చిరునవ్వొకటి పంచడం తప్ప
పరులను తూలనాడనెరుగని నీవు
నన్నెన్నిసార్లు క్షమించావో
నీవంటూ నా జీవితంలోకి
రాకపోయుంటే
నేనేమై పోయేవాడినో అనుకుంటూ...
జ్ఞాపకం చేసుకుంటూ
పరిశ్రాంత ప్రేమైక జీవికి
ప్రణతులు చెల్లిస్తూ.....
నీరాకకై ఎదురుచూస్తూ... వీరా!!!!
బెలూం గుహలో
శ్రీశైలం పాలధార పంచధార దగ్గర
పనిచేస్తున్న సమయంలో డిస్టర్బ్ చేసినపుడు
ఏదో ఆలోచిస్తూ
మెడిటేషన్ చేస్తూ
అభీ లేడెందుకు ?? మమ్మీ దగ్గర ఉన్నాడేమో...
అభీతో
నారాయణ హాస్టల్
అభీని హాస్టల్ లో దింపే సమయంలో ....
హాస్టల్ కోసం షాపింగ్
చిరు కోపంతో
అలా అలా....
ఇద్దరూ ఒకటే
ఆలంపూర్
శివగామిగా మారినపుడు
కీసర
ప్రశాంతంగా ఉన్నప్పుడు
అహోబిలం
అనన్య రిసార్ట్స్ లో కావ్య వివాహ రిసెప్షన్ సందర్భంగా
తిలకం దిద్దే కార్యక్రమంలో
వివాహ అనుబంధ కార్యక్రమంలో
హరీష్ తో గృహ ప్రవేశం సందర్భంగా
చరణ్ birthday సందర్భంగా కేక్ తినిపిస్తూ
దీపు marriage day సందర్భంగా
శుభంభూయాత్
Happy wedding anniversary
ReplyDelete