రమణీయం Dec 2024
రమణ జయంతి సందర్భంగా December 2024
కవనజ్యోతి సమర్పిస్తున్న కవితాహారం
నిర్వహణ
శివునూరి లలితాక్రిష్ణ
వీరా గుడిపల్లి
1. వీరా గుడిపల్లి
2.కోరాడ గారు
3. అపరాజిత రెడ్డి గారు
4.సూర్యనారాయణ గారు
5.మేకల రామస్వామి గారు
6.కొంజేటి రాధిక గారు
....................
1
*చదివిన దేముంది? !చాలినంతయు లేదు*
*పెఱియ పుఱాణమే! పెక్కు మార్లు*
శైవ సిద్ధాంతంబు! శివతత్వ మార్గమ్ము
సృష్టి రహస్యంబు! సృజన గాంచి
*శివభక్త చరితంబు! శిఖరాయ మానమై*
*జీర్ణమై పూర్ణమై! జీవితమ్ము*
అరుణాద్రి చేరగా ! ఆత్రపడినఱేడు
అటనుండి కదలక! యలదు కొనెను
*రమణ మార్గ మన్న! రమణీయ మైనది*
అణువనువున సృష్టి! అమరికలను
*వేరుచేయలేని! వెలిదిప్ప తెలియరా*
భవ్య చరిత నీది ! భరత వీర
2
[30/12, 10:57 am] Korada: రమణుని జననం...
...లోక హితం !
కోరాడ నరసింహా రావు!
****************
కో హం... కో హం...!
నేర్వవలసినవిద్య,తెలుసుకో వలసిన జ్ఞానము ఇదే!!
నిన్ను నీవు తెలుసుకోగలి గితే...,
ఇంక నీవు తెలుసుకో వలసిన దేమున్నదీ ప్రపంచమున!?
ఇదే...రమణుని ఉపదేశము...!
నేను నేను అనుకుంటు న్ననేను, నేను కానని...ఈ నే నే నేను కానపుడు,ఇంక ఈ ప్రపంచములో నాది అనే దేమున్నదీ లోకములో?!
ఇది వ్యామోహ బంధ నాలలో చిక్కు కొన నీయని వేదాంత జ్ఞానం !
ఇంత గొప్ప ఆత్మబోధను బోధించిన బోధకుడు భాగవాన్ శ్రీ రమణమహర్షి
కావ్య కంఠగణపతిమునిని ప్రభాావితం చేసిన దివ్యఓజస్సు...,చలంవంటినాస్తిక స్త్రీవాదిని,మా ర్చిన భవ్యతేజస్సు శ్రీ రమ ణ మహర్షి...!
మానవజీవన సుఖ, సౌ ఖ్యానందములకు,స్వచ్ఛ మైన శా0తికి ఆధ్యాత్మిక జ్ఞానమును మించినది లేదని ప్రపంచమునకు చాటి చెప్పిన మహ నీయులు మన రమణులు
మన భారతీయ ఋషి పుంగవులలో అగ్రగన్యులు
వీ రి జీవితమును, బోధనను అధ్యయనము చేసి ప్రవర్తిల్లు వారు ధన్యు లు...!
ఈ ప్రపంచములో నీ వున్న దెంత సత్యమో....,
నిలోనే ఈ ప్రపంచ మున్న దీ అంతే సత్యము...!
నోటి మాటలు కన్నా...
మౌనమే ఎక్కువ బోధిం చ గలదని నిరూపించిన మౌన స్వామి మన రమణులు...!
3
[30/12, 11:09 am] Aparajith:
వీరాస్ కవి సమయం
పేరు:ఎం ఆపరాజిత్ రెడ్డి
ఊరు: సూర్యాపేట
జిల్లా:సూర్యాపేట
శీర్షిక: ఆత్మఙ్ఞాని
కవిత: రమణ మహర్షి
ఓ మహాఋషీ తపస్వీ మహాజ్ఙానీ
ఎముకలు కొరికే చలి,ఎండలకు,వానలకు వెరవక
ఆ ముళ్ల గుహలో,,,,,,,,,!
విషసర్పాలు తేళ్లు,ఎలుకలు విష కీటకాలు
శరీరాన్ని పీక్కుతిని విషం చిమ్మినా!
అలౌకిక చింతనలో అవేమి స్పృహలో లేక
ధ్యానొన్ముఖుడై!
పరమాత్ముని తలంపులో
ఆత్మ జ్యోతిలా పరమాత్మునిలో లీనమై!
ఆత్మఙ్ఞాన వెలుగులో
దీవిలోని తారలు భువిపై వెలిగిన చందం!
ఓ రమణ భగవానుడా!
అతి క్రూర మృగాలు పులులు,సింహాలు,ఏనుగులు
నీ పాదాల వద్ద మోకరిల్లగా!
విషసర్పాలు నీ మెడలో పూలమాలలై
మహర్షీ అరుణాచల కొండల్లో నీ పాదం మోపని చొటంటూ వుందా!
ఆకలి దప్పికలు ఎరుగక నిరంతరం ధ్యానం!
యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందగా
ఈ మహిలో మహీమాన్విత సాధుపుంగవుడా
లౌకిక అశాంతి ధ్యానంతో తేట పడుతుందని
మనస్సు తెల్లని పాలవలె ప్రశాంతమౌతుందని !
సమస్త జీవకోటిని రక్షించుమని,వధింప కూడదని
మానవత్వముతో తోటివారిలో పరమాత్ముని చూడమని ప్రబోదించావు!
భక్తులెల్లరు నీ దర్శనానికి పరితపించేవారు
భక్తులు సమర్పించిన పట్టువస్త్రాలను
పట్టుపురుగుల దేహాత్మల సమ్మిళితమీ పట్టువస్త్రమని త్యజించావు!
సమస్త ప్రాణికోటి పరందాముడా
అహింసో పరమో ధర్మహా అని
ప్రతి ప్రాణి పరమాత్ముని రూపమన్న భగవానుడా!
ఎన్నని తెలపను ఓ యోగీ
రమణ మహర్షీ!!
హామీపత్రం:ఇది నా స్వీయ రచన
ఆపరాజిత్
4
*రమణీయ మహర్షి...!*
రమణ మహర్షి
రమణీయ ఋషి
అదైత్వం ఆయన మతం
అరుణాచలం వారి ఆత్మబలం..!
చిరు ప్రాయంలోనే పొందే
అరుదైన దివ్యమోక్ష జ్ఞానం
మృత్యువు నీలి జాడను పసిగట్టే
మనిషిలో ఆత్మవుందని కనిపెట్టే.!
మరణం శరీరానికే తప్ప
ఆత్మరాముడికి లేదని బోధించె
స్వీయ సాధన, శోధన ద్వారా
నిరంతర చింతనము చేత
దేవునికి మనం దగ్గరవుతాము...!
నాదు భౌతిక పాదాలను కాదు ?
మన రస హృదయంలో ఉన్న
భగవంతుడి పాదాలను పూజిస్తే
అలౌకికానందాన్ని పొందుతాం
మౌన ముద్రల ద్వారా తత్వాన్ని
భక్తులకు బోధించిన మహా ముని..!
శరీరాన్ని చీమలు పీక్కుతింటున్న
ఆరువారాలు పాటు నిర్వికల్ప
నిశ్చల సమాధిలోనే ఉండి
బయటకు వచ్చిన భగవంతుడు..!
నిరాడంబరంగా వున్న ఈ రమణుడు
నిశ్చయంగా సచ్చిదానంద మూర్తే...!
( రమణ మహర్షి జయంతి సందర్భంగా)
*జి.సూర్యనారాయణ* *6281725659.*
*హామీ పత్రం..!*
ఆర్యా...సదరు కవిత నా స్వీయం.దేనికీ అనువాదంలేదు.అనుకరణ కాదని
మీ పోటీకి మాత్రమే ప్రత్యేకంగా రాసానని
హామీ ఇస్తున్నాను.
మీ సూర్యనారాయణ.
5
Mekala Ramaswamy Poet: రమణానందజీవితం
*****************
తనను తాను తవ్వుకుంటూ
మనసుపొరలు తెరచుకుంటూ
ఙ్ఞానచక్షువులు విప్పుకుంటూ
అఙ్ఞాననిశిని దాటుతుంటే
అదే రమణానందజీవితం
నేను నాదని గొప్పలేల
అహం స్వార్థం నిప్పుయేల
ఏదోఉందని వెతికితేనే
సాధనెంతో సాగితేనే
అదే రమణానందజీవితం
బాగాతెలుసని రోషమేల
బాగుతెలియని శ్వాసయేల
రాగబంధపు రొచ్చునుండి
విరాగితత్వము విశదమైతే
అదే రమణానందజీవితం
బాధలన్ని తోడుగుండవు
సంతసమ్ములు అంటియుండవు
తామరాకున నీటిబొట్టుగా
నిలిచియుండు నెనరు యున్న
అదే రమణానందజీవితం
మౌనసంద్రనీదగలిగితే
మట్టిబుర్రను తొలువగలిగితే
అవ్యక్తానుభూతిని అనుభవిస్తే
ఆత్మనుపరమాత్మ ఒడిలో నిలపగలిగితే
అదే రమణానందజీవితం
**********************
మేకల రామస్వామి
6
అంశం...రమణ మహర్షి జయంతి సందర్భంగా
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
శీర్షిక...మహా మనిషి
హృది గదిలో మూసుకున్న ఆధ్యాత్మిక ప్రపంచపు తలుపుల్ని తెరచుకుని, ముక్తి మార్గం వైపు నడిచి, నడిపించిన మహర్షి రమణుడు...
అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటూ, భక్తి భావనను పెంపొందించుకుంటూ,నాది నేనను వ్యామోహపు మత్తులో చిత్తుగా ఓడిపోయి, బాంధవ్యాల చిత్తడిలో పచ్ఛడైపోయి,భవ బంధాల వేళ్ళతో పాతాళం దాకా కూరుకుపోయి, తేరుకునేలోగా పుణ్య కాలం కాస్త ఆవిరైపోతుంది అవశేషంగా మారిన మనసు శేషంలాగా...
అత్యాశతో నిరంతరం పరుగులు పెట్టక, స్వచ్ఛమైన మనసుతో మౌనాన్ని ఆభరణంగా ధరిస్తే, మనశ్శాంతి మనకు భరణమౌతుందని,
నిరాడంబరతకు నిర్వచనమై,
సూర్యుడి తేజస్సుతో ప్రకాశవంతమైన వదనంతో,నీలోనే వున్న ప్రపంచాన్ని చూస్తే చాలు,అవధులు లేని అలౌకిక ఆనందాన్ని పోందే అద్భుతమైన అవకాశం లభిస్తుందని తెలిపిన వ్యక్తి...
రుద్ర అంశతో జన్మించిన రమణుడు ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టి, అరుణాచలాధీశుని సేవలో తరించిన పుణ్య పురుషుడు...
ఆకలి దప్పికను మరచి ధ్యాన సాగరంలో తరించిన నిజమైన భక్తుడు.

Comments
Post a Comment