విహంగ 5/1/2021

 నిర్వహణ శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam


************************************

[05/01, 8:00 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️


జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా కవితా గానం ప్రత్యేక కవితలకు ఆహ్వానం పలుకుతుంది.


అంశం :విహంగం


రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


 ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా

సహకరించగలరు.


✳️✳️✳️✳️✳️✳️

[05/01, 8:38 PM] Gummannagari Balsaraswati: శీర్షిక:బర్డ్స్ నేచర్..


బంగారు పిచ్చుకా...!

బర్రుమని సవ్వడి తో

సర్రున ఇంట్లో దూరి

నాతో పోటీ పడుతూ

అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుం టే

నీ అందానికి నువ్వూ

నా చందానికి నేనూ

ఎంతగా మురిసి పోయేవాళ్ళం...

చిట్టి నేస్తమా!

నేను అన్నం తింటున్నంత సేపూ,

ఇంటి దూలాలకు

క్రమ బద్ధంగా వేలాడదీసిన

మొక్కజొన్న పొత్తులకు

ఒక్కో గింజా  ఏరుకుంటుంటే

నన్ను పరికిస్తూ నువ్వూ,

నిన్ను గమనిస్తూ నేనూ

కడుపు నిండా తినేవాళ్ళం_

పిచ్చుకా...

నువ్వు లయబద్ధంగా

రెక్కల ల్లా డిస్తూ

గాల్లో గిరికీలు కొట్టి

వాకిట్లో వేపచెట్టు స్థావరానికి దూసుకె ల్తే

నీ లానే నేనూ

రెండు చేతు లూ గాల్లోకి సాచి తుర్రున

బడికి పరిగెత్తే దాన్ని...

నేస్తమా...!నీ స్నేహాన్ని తల్చుకుంటే

స్తబ్ధ మనుకున్న నా మనస్సు

రెక్కలు తొడుక్కుని

గతపు  గగన వీధుల్లో

స్వేచ్ఛా విహారం చేస్తుంది

నా బంగారు పిచ్చుకా!

అంతలోనే ఆవేదన..

నా గతించిన బంగారు బాల్యాన్ని తిరిగి పొందడం ఎంత అసంభవమో..,

నీ స్నేహాన్ని తిరిగి పొందడమూ అంతే...

చిన్ని నేస్తమా..!

మా చేతుల్లో పదును లేని కత్తులూ,

పేల్చలేని బాంబులూ

మొనలు లేని బల్లేలూ

భద్రంగా పట్టుకుని,

విసరకుండానే వాటితో నిన్ను కర్కశంగా

తరిమి తరిమి చంపుతున్నాం..

ఇక రమ్మంటే ఎలా వస్తావ్?

బంగారు పిచ్చుకా...!

"నేచర్ 'కు ప్రతీకగా కనిపించే నిన్ను

చేజేతులా పోగొట్టుకొని

నీకు మారణా యుధమైన మాటల యంత్రం లో

నీ కువ కువల "బర్డ్స్ నేచర్ "రింగ్ టోన్ నివింటూ,

యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తున్నా...

పిచ్చుకా... ఎక్కడినుండైనా నన్ను గమనిస్తే,నువ్వు నన్ను

నీ స్నేహపు గురుతు లను

తల్చుకుంటన్నానను కుంటావో...లేక

గాయం చేసిన,లేపనం పూసే

"కిరాత"ననుకుంటావో...

*******************

రచన:శ్గుమ్మన్నగారి బాలసరస్వతి, సిద్దిపేట

[05/01, 9:04 PM] దీపక్ న్యాతి: *కవితా గానం* 

పేరు : డా.దీపక్ న్యాతి

తేదీ : 05 - 01 - 2021

అంశం : విహంగం

శీర్షిక : ప్రకృతి వరం


విశ్వాన్ని విలాసంగా వీక్షించేదీ విహంగమే

విమానాలు రాకున్న ఉపగ్రహాల వాడుకున్న

ఎత్తు నుండి ప్రకృతి రమణీయత వీక్షించే

అదృష్టం మనకెక్కడిది విహంగానికి తప్ప

విహంగ విహారం అలవికాని తన్మయత్వం

పక్షుల చూచి ఓర్వలేక పోటీ పడి పైకి ఎగరాలని

ఉబలాటంతో మదన పడ్డాడు మేధో మనిషి

ప్రకృతి పరంగా వీలుకాక ఏమిచేయలేక

కృత్రిమ డ్రోన్లతో సర్ధుకొని సంబరపడ్డాడు

నలుగురి సాయం కోరే మనిషికి పక్షులు ప్రేరణ

రెక్కలు మొలిచిన పక్షి ఎవరిపై ఆధారపడదు

ఒంటరిగానే వేట ఒంటరిగానె వెతుకులాట

ఆశ్చర్య పరిచే సాంకేతికతో గూడు నిర్మిస్తుంది

నా ఆస్తి నా సంపద అని దాచుకోదు

అవసరం మేరనే వాడుకుంటుంది మరో గూడు

గుడ్లు పెట్టి పొదగడానికి కట్టుకుంటుంది

వినువీధుల్లో విహంగంలా విహరించాలనుంది


దీపక్ న్యాతి

హైదరాబాద్

[05/01, 9:11 PM] Dhanasi Usha Rani Poetess: అంశం.విహoగo

.......

పెరిగిపోతున్న యాంత్రిక జీవనము

తరిగిపోతున్న అడవులు నేపధ్యంలో

కరువు అవుతున్న పక్షులజాతి


క్రూరoగా వేటాడి కిలకిల రాగాలను అంతము చేస్తూ

కాలుష్య కోరల్లో చిక్కి చితికిపోయే పక్షుల కన్నీరును తుడిచే వారులేరు


ఎండకు బీటలు వారి కరువు కాటకాల్లో చితికిపోయి

గుప్పెడు గింజలు లేక గుక్కెడు నీరు కానక

బిక్కుబిక్కుమనుచున్న పిచ్చుకుల సంతతిని కాపాడుదాము


హాని చేయక వ్యర్థాలతో గూడుకట్టి

వినూత్నమైన గూడు కట్టుకోని 

బతుకుసాగించు

చక్కనైన పిచ్చుకుల  జాతిని కాపాడుదాము

జూపార్కుల్లో భావి తరానికి పిచ్చుకుల సంతతిని కాపాడి రక్షించుదాము


  ధనాశి ఉషారాణి

    చిత్తూరు జిల్లా

    భాకరాపేట

[05/01, 9:25 PM] Sandya Sharma Poetess: కవితాగానం


వై.కె.సంధ్యశర్మ


అంశం : విహంగం


వేకువను తలుపు తట్టి పిలిచే


వెన్నెల మంత్రం....కొక్కొరొక్కోయని


తెలతెలవారగా ఎర్రటి సూర్యూనికి


స్వాగత గీతం పాడుతూ...


గువ్వల గుంపులు


గున్నమావిళ్ళ చిగుర్లతో కబుర్లాడుతూ


రామచిలుకలు....


పొన్న చెట్టు తొర్రలో


చికుబుకుమంటూ హొయలొలికించే


బుర్రుపిట్టలు...


తెలివైన కథకెపుడూ తనే సాక్ష్యమై


పితృదేవతగా ఆరాధనలందుకునే


కాకమ్మలు...


మా ఏటి గట్టుపై... 


ఒంటి కాలిపై నిలబడే కొంగమ్మలు...


వసంతాల కేళీ వినోదాల హేళీ


సుస్వరాల రాణి కోయిలమ్మకు సాటేది...


శ్వేత పద్మ.ధరాలు  సత్య సంధాతలు


హంస వేణుల నయగారాలు..


ఆకు పచ్చని జాతరలో 


జాము రాతిరులన్నీ జత కోరుతూ


జాబిలికై నిరీక్షించే క్రౌంచ పక్షుల జావణీలు


అందాల రాణి అరవింద పూబోణి


అరమోడ్పు కన్నులు గల నాట్య మయూరి..


శౌర్యనికి వీర ప్రతీకయై... వాయు వేగంతో విహరించే


విహంగ వీరుడు పక్షి రాజు గరుత్ముంతుడు


నా దేశ శాంతి చిహ్నమై  వెలుగొందే అందాల పావురం


కొమ్మ కొమ్మలో దోబూచులాడుతూ


రెక్కల రేకుల్లో తల్లి ప్రేమకు నిర్వచనంగా


అడుగడుగునా అందాల అవనిని


ఆకాశమంత ఎత్తులో వుంచిన 


విహంగాలకు నేడు... పొంచి వున్న ప్రమాదాలతో


అంతరిస్తూ.. .. ప్రకృతిలో కనుమరుగవుతున్నాయి!

[05/01, 9:27 PM] Aparajith: గిజిగాని గూడు 


గడ్డిపోసలు పుల్లా పీసు ఏరుకుని 

ఎన్నో ఎన్నెన్నో శ్రమల కోర్చి 

గిజిగాడు గూడు అల్లిన తీరు 

ఓ సంక్లిష్ట విచిత్రం 

ఎండకు గాలివానలకు దుర్భేద్యంగా 

ఆ గూడు ఒక కోట!

శాస్త్రజ్ఙులకు సైతం పెను సవాల్!

ఆ గూటిలో గుడ్లు పెట్టి 

పిల్లలు చేసి 

వాటికి రెక్కలొచ్చి ఎగిరే వరకు 

ఆహారాన్ని అందించే తీరు 

మాతృ ప్రేమంటే ఇది!!

పిల్లలను భారంగా తలచే 

నవీన యుగం పడతులు 

ఆత్మావలోకనం చేసుకోండి ఒకపరి!!

నేడు అంతరించి పోతున్న ఊరపిచ్చుకలు

వికృత మానవ పోకడలు 

సెల్ ఫోన్ టవర్ల తరంగాలే 

వాటి ప్రత్యుత్పత్తి తగ్గిపోవడం!

ఒక్కటొక్కటిగా అదృశ్యమవుతున్నాయి 

దానికి ప్రత్యామ్నాయం కనిపెట్టి 

మనిషి మనిషిలా బ్రతకాలి !

ఆదిమానవుడి అఙ్ఞానిలా కాకుండా 

మనిషి ఆలోచనా తీరు మారాలి 

తను బ్రతకాలి 

సాటి పక్షి జంతుజాలాన్ని 

బ్రతకనివ్వాలి!!


ఆపరాజిత్

[05/01, 9:28 PM] Balloori Umadevi Poetess: కవితా గానం

డా.బల్లూరి ఉమాదేవి

అంశం:చిత్రకవిత


పిచ్చుక గూడు


1ఆ.వె:పుల్ల పుడక దెచ్చి భూమిరుహము పైన

           గూడు కట్టు చుండె గువ్వ యొకటి 

          జంట కొరకు తాను జాలిగా చూచుచు

               గడుపు చుండె గాదె కాలమెల్ల.


2కం:.ముక్కున కరచుకు పుల్లల

         చక్కగ గూడును పిచుకలు సంబరపడుచున్

           అక్కజముగ నిర్మించుచు

         మక్కువ తో పిల్లలకవి  మమతను పంచెన్


3.కం:పుల్లలు పుడకలు దెచ్చుచు

           నల్లుకొనియెనవి గనుమిటు నానందముతో

             పిల్లల కొరకని ముదమున

            చల్లని వేళల మురియుచు చక్కగ పిచుకల్

.

4.కం:బంధము పెంచుట కొరకై

           నందముగానొక్క గూడు నాశతొ గట్టెన్

            డెందెము సంతస మందగ

          నందును సఖుడుండ గోరి యాత్రత తోడన్.


5.ఆ.వె:పిచ్చుకమ్మ కెవరు ప్రేమతో నేర్పిరో

             చిక్కనైన గూడు సిద్ధమయ్యె

             సంతసమున తాను సఖునితో గడపంగ

             నెదురు చూచె పిచుక నిదుర మాని.

[05/01, 9:28 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం.విహంగం

శీర్షిక..సంగీతం



చిన్న పరిణామ0లో కనిపిస్తూ

రంగు రంగుల రెక్కలు ఆడిస్తూ

నింగిలో స్వేచ్చగా ఎగురుతూ

విశ్వ దర్శనం చేసే విహంగాలు

కలిగించు నయనానందం

అమ్మ తెచ్చే ఆహారం తిని

గూటిలో తలదాచుకొని

రెక్కలు రాగానే ఎగిరిపోతూ

ఆహారాన్వేషణలో సాగే కష్టజీవులు

చెట్టు సేమకు మిత్రులు

రకరకాల గింజలను నోట కరచుకొని వస్తూ 

రక రకాల విత్తనాలు వెదజల్లుతూ

వృక్షాల సాగుకు తోడ్పడే

 కర్షకులు

గజిబిజిగా గూడు అల్లి

తూగు టయ్యేల గృహంలో

నిర్భయంగా తూగుతూ

వినిపించే కువ కువ రాగాలు

వీనులకు పసందు చేసే  సంగీతం

మానవాళికి మేలు చేసే పక్షి రాజులు

నాగరికత పేరుతో

స్వార్థంగా మనిషి చేసే అకృత్యాలతో

అంతరించిపోతున్న స్థితి

సమస్త జీవుల మనుగడయే

ప్రకృతి సమతుల్యత

సరక్షించుకుందాం పక్షిజాతులను

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యతగా ముందుకు సాగుదాం

[05/01, 9:28 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: కవితాగానం 

(జాతీయ పక్షుల దినోత్సవం పురస్కరించుకొని) 


అంశం :విహంగం 


*కవితా శీర్షిక :పక్షిరాజo _ఆదర్శం*


స్వేచ్ఛా జీవన సంకేతం !


ఆనందాలు పంచే గగన విహంగం!


 స్వార్థం లేని జీవనం!


నిత్యం ఉత్సుకతతోనే గమనం!


 కల్లా కపటం ఎరుగదు! 


అన్యాయం అంటే తెలియదు !


సహజీవన అనుబంధాలతో!


సంతానమoటే మమకారంతో..,


ఆకాశమే హద్దుగా ...,,


ప్రతికూల పరిస్థితులలో సవ్యంగా...,


 ప్రతిఘటనే ఏకైక లక్ష్యంగా...,


 జీవన వేదాన్ని బోధిస్తున్న !


గుణపాఠాలకు నెలవైన


ప్రతికూల పరిస్థితుల 

నేదుర్కొంటున్న,


వలస జీవనాలతో సతమత మవుతూనే..


అప్రతిహతంగా జీవనం సాగిస్తున్న...,


పక్షిరాజు మనకు ఆదర్శం!


- పరాంకుశం రఘు నారాయణ మహబూబాబాద్

[05/01, 9:30 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:05-01-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: విహంగం

"""""""""""""""""""""""""""""""""

చిన్నారి పొన్నారి విహంగమా

 చిట్టి పొట్టి పిచుకమ్మా!

నీ చిరునవ్వుల కిలకిలరావాలు లేక

 మా ముంగిలి చిన్నబోయింది!


ఆదర్శ దాంపత్యానికి అసలైన నిర్వచనమై

కన్నవారి ప్రేమకు మీ జంటే ప్రతి రూపమై

ఇంటింటా వసారా చూరులోనో

గిలక బావి  వరల సందుల్లోనో

నీవు కట్టుకున్న గూడు

 పసిబిడ్డలకు రెక్కలు వచ్చేంతవరకు

మీరు చూపించే ప్రేమానురాగాలు

పసితనపు మా జ్ఞాపకాల్లో ఓ సజీవ స్మృతి!


అద్దంలో చూసుకుని మురిసే మీ హంగామా కళ్ళముందు కదలాడుతూనే ఉంది..


ఏమై పోయిందో మీ జాతి

మానవ తప్పిదాలకు బలవుతూ

సెల్ టవర్ల రేడియేషన్ కు విగత జీవులవుతూ

మాకు అంతులేని దూరంగా వెళ్ళిపోయారు..


 ఓ విహంగమా! మిత్ర బృందమా!

మీ కోసం నా పెరటిలో వేప మొక్క నాటాను

ఏనాటికైనా మీరు వస్తారనే ఆశతో..


అమ్మ చేటలో బియ్యం ఏరినప్పుడు

కొన్ని మీకోసం దాస్తున్నా..

కరోనా మాకు గుణపాఠం నేర్పింది

మమ్మల్ని క్షమించి వస్తారు కదూ.



 ( *అంతరించి పోతున్న పిచుకల* *కోసం)*

[05/01, 9:30 PM] +91 74168 63289: కవితా గానం 

పేరు మన్నెపిన్నక లలిత 

తేదీ 5/1/ 2021

 అంశం విహంగం

 శీర్షిక ఆకాశయానం

 

ఆకాశ మధ్యాన అరిగేటి ఓ చిలుక

 అంతూ పొంతూ లేని  యానా  మదెచటి కో

 చెంత నిలిచి నీ సొంపులు చూపంగ

వింత వింతగ నీవు వలయాలు తిరుగంగ

 చూడ బుద్ధిగనుండు    చూపిమరి పోవమ్మ//ఆకా//

 స్వేచ్ఛ శాంతులు గలవు నీకు చీకు చింతలు లేవు లేవు లేనే లేవు 

మా కవి కరవాయె మహినిబుట్టుట వలన //ఆకా//


 కరువులు  యుద్ధాలు కలతలు గలవిచట 

ఈతిబాధలు నీకు ఎందుకు లేవని 

ఈసుతో  కుందేము ఎంత భాగ్యము నీది

 వైహయస వీధుల్లో వైభవముగా నీతో

 విహరింప గోరెదము వినవమ్మ మామాట

 ఆకాశ మథ్యానఅరిగేటి ఓచిలుక 

అంతూ పొంతూ లేని యానామదెచటికో

[05/01, 9:35 PM] Korada: కవితాగానం

అంశం :-     విహంగం

 కోరాడ నరసింహా రావు...!

          * పూరక శక్తి *

        ***************

ప్రకృతి అందాలను పెంచటంలో

పక్షుల పాత్ర...తక్కువేమీ...

కాదుగా....!

రకరకాల...రంగు-రంగుల...

ఎగిరే పక్షుల అందాలు..

మన మనసులను మురిపించి

మైమరపించేయవూ...?!


కావు-కావు మను కాకమ్మ

మేలుకోలుపులు....,

తీయని పలుకుల చిలకమ్మ ,

కమ్మని పాటల కోయిల...,

వినసొంపైన మైనగోరమాటలు

పక్షులు...మన నేస్తాలే...కాదన

గలమా....!?

గిజిగాడిగూడుకట్టేనైపుణ్యానికి

అచ్చెరువొంది...మెచ్చుకొనివారెవరైనా వుంటారా...?!

 ఈ పక్షులసునిశిత దృష్టినుండి

యే కోడిపిళ్ళైనా...పాక్షిపిళ్ళైనా

తప్పించుకోగలవా....!?

ఇవి పళ్ళు-కాయలు తిని....

ఉసిన గింజలనుండి...కఠిన

శిలలనుండి...సుందర 

వృక్షాలే పుట్టుకురావటం...,

ఒకజాతి చెట్టు నుండి...

వేరొక జాతి చెట్లు....

వేపనుండి ఏ రావి చెట్టు,లేదామర్రిచెట్టు...కాకపోతే...మరేదో చెట్టు...ప్రకృతికి

ఇదో వింత శోభ....!!

ఈ ఎగిరే పక్షేనోయ్.... మనిషి

విమానాన్ని సృష్టించటానికి

మూల ప్రేరణ...!

పర్యావరణ సమతులుగానికి

పక్షులూ పరోక్ష ప్రేరకాలేనోయ్!

ఈ రోజుకి ఎన్నెన్నోపక్షిజాతులు

అంతరించిపోవటం,దురదృష్టం

సెల్ టవర్లు పెరుగుతు న్నయ్

పక్షులు తరిగిపోతున్నయ్ !!

ఈ ఉదాసీనం...రేపు మన

మనుగడకూ ముప్పుగా పరిణ

మించ వచ్చేమో....!

కేవలం మనం బ్రతకటమేకాదు

మనచుట్టోవున్న...జీవజాలాన్నీ

బ్రతకనిద్దాం...,మనమూ సుఖంగా బ్రతుకుదాం..!!

*************************

........కోరాడ.

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧