కథ చెప్పవా please 2021
నిర్వహణ శివునూరి లలితాకృష్ణ
*****************
1.భరద్వాజ గారు
2.పరాంకుశం రఘు నారాయణ గారు
3.కూసుమంచి శ్రీ దేవి గారు
4.సుధారాణి కృష్ణం రాజు గారు
5.ధనాశి ఉషారాణి గారు
6.సంధ్యా శర్మ గారు
7.మన్నె లలిత గారు
8.సునంద వురిమళ్ళ గారు
***********
1
[02/01, 8:23 PM] భరద్వాజ గారు: కవనజ్యోతి
శనివారం
అంశం -కథానిక
🌹🏹మేమున్నాము 🌹🏹
''ఓం నమ శి వాయ" అంటూ శివపంచాక్షరీ మంత్రం తో ఆప్రాంతమంతా మారుమ్రోగసాగింది .- రోజులు నెలలైనాయి. నెలలు సంవత్సరాలుగా మారాయి .ఆకైలాసవాసుడు కరుణించడాయే .-ఆతపస్సు వేడికి చల్లటి ఆప్రాంతమంతా సెగలతో అల్లాడింది మంచుపర్వతాన మంటలుపుట్టాయి ప్రమథగణాలు,పరిగెత్తుకువెళ్లి శివుడితో మొరపెట్టుకున్నాయి ,ఈ పరిస్థితి నుండి కాపాడమని కళ్లుతెరిచాడు శివుడు -మంత్లీ ఇయ ర్లీ రిపోర్ట్స్ పరిశీలిస్తున్నఆదిదేవుడి కి డ్రాప్ బాక్స్ లోఉన్నఈ కేసు కనబడి రిపోర్టును పరిశీలించకపోతే ---హైకమాండ్ ,నుండి ,మాటవస్తుందని వారిని సమీపించి,యేమి నీకోరికని తపస్సుచేస్తున్న అడగబోయి క్రిమిని చూసి విస్తుపోయాడు శివుడు. తానుక్రిమినని భూలోకాన తమకు పని లేకుండా పోయిందని విన్నవించింది,గతాన పోలియో,డెంగు వంటివ్యాధులతో జనాన్ని పీడించాము అప్పుడు వాళ్ళుమందులు అవి కనిపెట్టి తప్పించుకున్నారు. దాంతో పని లేని మేము రోడ్డున పడ్డాము.తనకు చావు రాకుండా మానవులను చంపే వరం ఇవ్వమంది. దానికి ఆపరమాత్మ నవ్వి గతంలో భస్మాసురుడు అడిగిన వరం లాగావుంది-మాకువరమిస్తే మానవుని హింసించి మీకు పని తగ్గేట్లుచేస్తామనికోరాయి. మేము ఎవరిని ముట్టుకుంటే వారు మృత్యువును కౌగలించుకున్నట్లే. ఆ విధంగా వరమివ్వమనిఅడిగింది క్రిమి. గతంలో భస్మాసురుడిలాగా యేమిటీ కోరికా అన్నాడు శివుడు.తనకదె కావాలని పట్టుబట్టింది క్రిమి చేసేది లేక తధాస్తు అన్నాడుశివుడు. కనిపించని రూపాన నాశనం చెయ్యటానికి బయలుదేరింది కరోనా.
గత మీటింగులన్నీ దానికళ్ళముందు తిరిగాయి - అఖిల భారత వైరస్ ల మీటింగ్ గ్రాండ్ గా జరుగింది . .దేశ విదేశాల నుండి వచ్చిన వైరస్ ప్రతినిధులతో సభా ప్రాగణమంతా కిటకిటలాడుతుంది. .ముందుగా పోలియో వైరస్ లేచి సభకు నమస్కారం..- నేనుఎప్పుడో షుమారు అరవై ఏళ్ళకు ముందు మనుగడలోవున్న వైరస్ కుటుంబవారసురాలిని. అప్పట్లో నా తీవ్రత తట్టుకోలేక మందు కనిపెట్టి నా ఉధృతాన్ని ఆపారు .,అయినా నన్నింకా మర్చిపోకుండా సంవత్సరానికి రెండుసార్లు ఉద్యంలాగా పోలియో చుక్కలు వేయిస్తున్నారు -తరవాత వచ్చిన మలేరియా డెంగీ ,ఇంకా అనేక వైరస్లు మనం తెస్తున్నా ఈమానవులు మందులు కనిపెడుతున్నారు మనల్ని అంతం చేస్తున్నారు. -మానవుల్ని పీడించే అవకాశంలేక,మనకు పని లేక అల్లాడిపోతున్నాము. మానవులు లాగా మనకూ ఆకలి బాధలు ఉంటాయిగా . మనం బ్రతకాలంటే మనం కొత్త వైరస్ ను కనిపెట్టాలి మన ఆకలి బాధ తీర్చుకోవాలి. ఎలా....?
అని అధ్యక్షుడు అడిగిన ప్రశ్నకు సభంతా మౌనం దుప్పటి కప్పుకొంది. ఎవరు మాట్లాడలేదు ఆ మౌనాన్నిచీలుస్తూ
అధ్యక్షా ...--?నాపేరు డెంగీ మానవులు గతం లో లాగా లేరు. తెలివి మీరారు ..-పోలియోకి చుక్కలు,దోమలకు ఆలౌట్లు,ఇలా ఏవేవో కనిపెట్టి మనల్ని తమ దారికి రాకుండా చేసుకుంటున్నారు ఓట్లేయించుకుని పరిపాలన చేసుకోక జనం సంగతిఎందుకండి ప్రభుత్వాలకి -వాక్సినని,ఇంజెక్షణని కనిపెట్టి మనప్రాణం తీస్తున్నారు. అంతేనా ఆరోగ్యశ్రీ కార్డులని పెట్టి మన పని చేసుకోనివ్వటం లేదు. అంతేకాదు అధ్యక్షా మనలో ఐకమత్యంలేకపోబట్టే ఈసమస్యలన్ని.
అంది మలేరియా దోమ -అవును నిజమే అన్నాయి.ఇప్పుడు మనమంతాఏమిచెయ్యాలి మానవుడ్ని నాశనంచేసే వైరస్ కానీ పెట్టాలి. చివరకు అనేకచర్చల అనంతరం కొత్త వైరస్ కనిపెట్టటానికి తపస్సుచెయ్యాలి .చివరకు అందరు కలసి ఏకగ్రీవంగా ఒక యువకుడైన ఉత్సాహవంతుడైన ఒకర్ని ఎంపికచేసి అతన్ని మానవుల్ని పీడించే వైరస్ కనిపెట్టేందుకు తపస్సు చెయ్యమని దారి ఖర్చులు ఇచ్చి ఓ.డి.మీద పంపేందుకు సభలో ఏకగ్రీవతీర్మానం చేసి పంపారు.వైరస్ సంఘంవారు.
. పొందిన వరంతో తన కమిటీ కితన ఆత్మీయులకు వాట్సాఫ్ ఎస్సెమ్మెస్ లు ట్విట్టర్లు పోస్టు చేసింది
కంటికి కనిపించకుండా రోగంగా సన్నగా దూరి జనాల్ని నాశనం చేసే తనకు కరోనాఅని పేరుపెట్టుకుని తనవిజయవార్త తనతోటి బంధువులందరికీతెలిపి ఊహించని సునామీలాగా జనాలపై విరుచుకుపడింది ఈ కరోనా
ప్రపంచమంతా అల్ల కల్లోలం చి క్కినవాడ్ని చిక్కినట్టుగా తనబారిన ప డేసుకుని మృత్యుగృహలోకి నెట్టటం ప్రారంభించింది -చాప కింద నీరులా పాకుతూ దేశం నుండి దేశానికి క దులుతూ వెళుతున్న ఈ వైరస్ కు జనం భయం తో పరుగులెత్తుతుంటే ప్రాణ రక్షణకు లాక్ డౌన్లువిధించుకొని,కర్ఫ్యూ లుపెట్టుకుని ఇండ్లలోనే దాగుకొనివుంటే వుంటే,అవస్ట లు పడతావుంటే నవ్వుకుంది కరోనా.జెజెలు కొట్టుకుంది తనకుతానే ఈ జన ప్రపంచాన-
వందలు వేలు లక్షలు కోట్లూ దాటిపోతుంది మరణాల సంఖ్య
ఊర్లువాడ లు శ్మశాన వాటికలైయ్యాయి- ఊహించుని ఉపద్రవం మనుషుల్ని ఇళ్లకు బందీలను చేసింది.పేదలను కూటికి అల్లాడేట్లు చేసింది.యాగాలు యజ్ఞ్ఞాలు లు,స్తోత్రపారాయణాలు ఫలితంశూన్యం ఎన్నోచేసాడు అప్పుడు వచ్చింది మనిషికి ఆలోచన భగవంతుడు తప్పఎవరు రక్షించలేదని -ఆన్లైన్లో స్లాట్ బుక్చేసుకొని బ్రహ్మా దర్శనానికి బయలుదేరాడు. తమకీ మరణ భాధ తప్పించమని. విశ్రాంతిగాఉన్నబ్రహ్మవివరంచెప్పాడు -తనవాళ్ళైయ్యేపనికాదని. -ప్లీజ్ గోటూ విష్ణు అండ్ టెల్ యువర్ ప్రాబులం --అంటూ కళ్ళు మూసుకున్నాడువిధాత
చేసేదిలేక,ఆన్లైన్లో దర్సనంటిక్కెట్లు లేక బ్లాక్ లో కొని విష్ణువు దగ్గరకు బయలుదేరాడు నరుడు నారాయణుడ్నిదర్శించటానికి. విషయంచెప్పాడు. ఇప్పుడు చేయగలిగింది యేమిలేదని తాను కొంతకాలం తర్వాత వాక్సిన్ రూపంలోవస్తానని దానిఅంతుచూస్తానని అభయమిచ్చాడు. ప్రకృతిని నమ్ముకోమని సలహాఉచిత ఇచ్చాడు -తన లోకపు ద్వారాలు మూసేసాడు. పినాలోకాన్నికింద దేవాలయాల్నిమూస్తారనిచెప్పటానికి సింబాలిక్ గా. చెప్పాడు విష్ణువు.
చేసేదిలేక ప్రకృతిలోని వాటితో మీటింగ్ పెట్టాడు సమస్య వివరించాడు. జరుగుతున్న పరిణామాలన్నీ చెప్పాడు.
మూగ జీవాలు తిరగ బడ్డాయి. ప్రకృతి వ్యతిరేకించింది. తనకుసహకరించామని కోరాడు. ప్రకృతితిరగబడింది. ఇంత కాలం తమకు ద్రోహంచేసి తనను ఇన్నాళ్లు అశ్రద్దచేసి ఇప్పుడు రాజీకి వస్తావా అని ఎగతాళిచేసింది. పరిస్థి వివరించాడు. చేసిన పని చెంపలు వేసుకున్నాడు. తమ వారిని డాక్టర్లు,పోలీసులు.పారిశుధ్య కార్మికులుపడుతున్న కష్టాలు వివరించాడు. ప్రకృతిలోని వాటిని బ్రతిమలాడాడు .తులసి జమ మొక్కల కాళ్లు పట్టుకున్నాడు. సబ్బుకు సలామ్ చేసాడు చిన్నప్రాణులకు హాని చె య్యనని ప్రమాణం చేసాడు,ప్రకృతితో పోరు మంచిది కాదని తెలిసి వచ్చింది అని కాళ్లావేళ్ళా బడ్డాడు .ప్రకృతిలోఉండే తమను ప్రేమిస్తే తాము ఎప్పుడు కాపాడటానికి సిద్ధం అని ఆ మనిషికి చెప్పాయి .మనిషి మాస్కులతో సామాజికదూరాలతో తన అదుపుకు ప్రయత్నం చేస్తున్నదితెలిసి కొత్త ఆలోచనలో పడింది కరోనా -ప్రకృతికూడావారి పక్షాన చేరినందుకు కించిత్ బాధపడినా వాక్షిన్ వచ్చిందాకా తిరుగులేదని మీసం తిప్పింది. ఆకలికిఅల్లాడే పేదలగూర్చి మరిచింది.బడులు ,గుళ్ళు,ట్రైన్లు అన్నిఆపింది జనాన్నిఇంటికి పరిమితంచేసింది. సాగుతుంది కరోనావిజృంభణ-వాక్సిన్ ఎప్పుడు వస్తుందా యెదురు చూస్తున్నారు జనం భయాన.
అవసర సమయాన ఆదుకోవటానికి నేనున్నాననంటు ముందుకువచ్చిన ప్రకృతి కి శిరసువంచి చెద్దాంనమస్కారం.
అది మనిషికి ఉండవలసిన సంస్కారం ----కాదంటారా...
2.
[02/01, 8:24 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవన జ్యోతి*
*నేటి అంశం: పెనవేసుకున్న అత్తాకోడళ్ల అనుబంధం*
(ప్రక్రియ : కథానిక)
తల్లి గారి ఇంటికి వచ్చిన కోడలు అత్తను మరో తల్లిగా భావించడం మన సాంప్రదాయం. అత్తను అభిమానిస్తూ నోట్లో నాలుకగా కలుపుగోలుతనంతో ఉండే కోడళ్ళ ప్రపంచం ఆనాటిది. ఏమాత్రం పొరపొచ్చాలు లేని జీవితాన్ని అనుభవిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబ మర్యాదలు కాపాడుకుంటూ, ఉత్తమ ఇల్లాలుగా ఎదగడం ఆనాటి కోడళ్ళ సంప్రదాయం. అత్త సలహాలతో అన్ని కార్యాలు నెరవేరుస్తూ, అత్త సలహా సంప్రదింపులతోనే ఏకార్యం ప్రారంభించినా అత్తతో మొదట చర్చించిన మీదటనే ఆ తదుపరి సానుకూల దృక్పథంతో ఆ కార్యాన్ని నెరవేర్చటం జరిగేది.
కార్య నిర్వహణలో ఎలాంటి అవరోధాలు వచ్చినా, మళ్ళీ అత్తతో చర్చించి ముందుకు వెళ్లడం నాటి కోడళ్ళ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం పాటించటం వల్ల ఆనాటి కుటుంబాలు సంవత్సరాల తరబడి ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయ్యి రాణించాయి.
ముఖ్యంగా కోడలు
అత్తగారిoటికి రావడం హైందవ సంప్రదాయంగా స్వీకరించాలి. తన ఆలనా పాలనా చూసుకునే భర్త ను ఇచ్చిన అత్తగా, ఆమెకు ఇచ్చే గౌరవం ఆమెకు ఇవ్వవలసిందే! ఆమె వళ్లనే !కదా !తనకు భర్తగా లభించింది. ఆమె లేకపోతే కొడుకెక్కడ? అనే భావంతో ముఖ్యంగా తనకు భర్తగా లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మంచి సర్దుబాటు గుణంతో చాడీలకు దూరంగా ఉండటంతో పాటు అవసరమైతే, అత్తతో ఓపెన్ గా మాట్లాడటం కోడళ్ళ కనీస ధర్మం. అత్తగారు కూడా తన కోడలిని ఓ పెద్ద కూతురుకు ఇచ్చే గౌరవ మర్యాదలను పాటించాలి. మనసు నొచ్చుకునే మాటలకు స్వస్తి పలకాలి. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల రీత్యా ఒక ఇంటిలో ఉండవలసిన కొడుకు కోడలూ, దూరప్రాంతాల్లో
మఖాoవేస్తున్నారు. వారి మధ్య సంబంధాలు పెరగాలంటే, మనసుంటే మార్గం ఉంటుందన్నట్లుగా రోజుకోసారి కొన్ని నిమిషాలైనా ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకోవడం, వారానికోసారి వీడియో కాల్ ద్వారా మాట్లాడటం. నాయనమ్మ తాతయ్యలతో పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడించడం కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడవలసిన బాధ్యత కోడలిది కాగా, అత్త కూడా బింకానికి పోకుండా కోడలితో సమయాన్ని వీలు కల్పించుకొని మాట్లాడితేనే, సఖ్యత గల కుటుంబంగా రాణిస్తుంది. ఈనాటి సాంకేతికతను దత్తత తీసుకొని అత్తాకోడళ్లు ఉత్తమ ఇల్లాలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇది వారి మధ్య ఆగాధాలను తగ్గిస్తుంది.
పరాంకుశo రఘు నారాయణ
మహబూబాబాద్. .
3
[02/01, 8:46 PM] Kusumanchi Sreedevi: కవనజ్యోతి
శ్రీదేవి సురేష్ కుసుమంచి
అంశం-కథానిక
"దాంపత్యజీవితం-కథానిక"
-------------------------------
"వేడుకుందామా'..వేడు కుందామా..వేడుకుందామా వేంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా "అంటూ రింగు టోన్ తో ఫోను..
తుళ్ళుమంటూ..ఆత్రంగా బాస్ ఫోను కోసం ఎదురు చూస్తున్నా రాజారావు బెడ్ మీద నుండి నిద్ర లేచీ తీసేసరికి" హాయ్ రాజారావు గుడ్ మార్నింగ్ ..
ఎలా ఉన్నారు? మన్నించవయ్యా రాజారావు..కరోనా కారణంగా నేను ఆఫీస్ తెరవటానికి ఇంకా సమయం పడుతుంది..క్రిందటి నెల వరకూ.. మీరు కుటుంబాలతో వీధిన పడకూడదని సగం జీతమిచ్చుకుంటూ వచ్చేను.. నేను ఈ నెల నుండి ఇంకేమి ఇవ్వలేనయ్యా" అంటూ బాస్ నుండి పిడుగులాంటి మాటలు..
..
అప్పటికే కుటుంబాన్ని ఈదలేక..ఇంకో పని చేయలేక అలిసిపోయిన రాజారావు గుండెల్లో ఒక రకమైన హార్ట్ అటాక్ వచ్చినట్టే అయ్యింది..
తన భార్య భాగ్యం చీమలను చూపిస్తూ..కాలం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు..సంపాదించిన దానిలో రెండు రూకలు దాచుకుంటూ ఉండాలంటూ చెపుతున్నా వినిపించుకోలేదు..
మబ్బులను చూసి చేతిలో నున్న చెంబుతో నీళ్ళు ఒంపుకున్న మనస్తత్వంతో గడుపుతూ వచ్చేను...
సొంత ఇల్లు కూడ సంపాదించుకోలేకపోయాను..ఇప్పుడు అద్దె వాళ్ళు కరోనా కనుక మూడు నెలలు బట్టీ ఏమి అనలేదు..ఈ నెల వాళ్ళకి కట్టాలి ..ఎలాగో ?ఏంటో?అని భారమైన హృదయంతో ఫోను ఎత్తిన సోఫాలోనే కూర్చున్నాడు..ఆలోచనలతో యుధ్ధం చేస్తూ...
ఇంతలో "భాగ్యం బ్రష్ చేశారా?కాఫీ తెస్తానుండండి అంటూ"
తెచ్చిన కాఫీని చేతిలో పెట్టేసరికి
నాకిప్పుడు ఏమీ వద్దు!
"ఏమైంది అసలు ఇలా ఉన్నారంటూ" భాగ్యం
"ఏమౌతుంది..?మా బాస్ ఫోను చేసి ,ఈ నెల నుండి మీకు మరి జీతం పంపలేను..ఆదాయం ఏమీ రావటం లేదని అన్నారు"
అవునా!ఏమీ బాధపడకండి..
ఆగండి!ఇప్పుడే వస్తాను అంటూ..ఓ లక్ష రుపాయల చెక్ రాజారావు చేతిలో పెట్టింది..
లక్షరూపాయలా!!!!ఎలా వచ్చేయి నీకు!నీ బంగారం వస్తువులు కుదువ పెట్టేవా?
"లేదండి!"
"మరి ఎలా వచ్చాయి..అదీ ఈ కరోనా సమయంలో" .
.
నాకు మా నాన్న గారు చిన్నప్పటి నుండి ..చీమల పొదుపు కోసం.నేర్పుతూ.సంపాదించినప్పుడు కొంత దాచుకోవడం..అవే మన కష్టాలని ఒడ్డుకు చేర్చుతాయని..తెలియజేసేవారు...అలా నేర్చుకున్న నేను..మీరు నాకిచ్చిన ఖర్చుకి డబ్బులని,ఇంకా డ్వాక్రా నుండి వచ్చిన డబ్బులని దాచిపెట్టేను..అవే ఇవి..
"ఎప్పుడూ భార్య మాటలని పెడచెవిన పెట్టిన రాజారావు కళ్ళల్లో ఏదో తెలియని అనురాగం ఊప్పెన్నై ఎగిసింది..-"
ఎందుకండి అలా కన్నీరు పెడతారు..దాంపత్య జీవితమంటే సంసార నావ కి
ఇద్దరం రెండు తెడ్డులుగా మారడం..అప్పుడే కష్టాల కడలిని దాటి ఆనందతీరాలను దర్శించగలము.
హామీపత్రం-ఈ కథ నా సొంతం..ఏ కథకి అనుకరణ కాదు
4
[02/01, 8:46 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*కథానిక ప్రక్రియ*
*అంశం*మనసున మనసై*
02-01-2021(శనివారం)
రాధా ఒకసారి ఇలారా అని పిలిచిన మాధవ్ పిలుపుతో
వంటింట్లో ఉన్నాను కాస్త ఆగండి ఏమిటో ఈయన గారికి
ఎప్పుడూ తొందరే
తన పనులు లిప్తపాటులో జరిగి తీరాలి నేను ఏమైనా అడిగితే మాత్రం
ఎందుకంత తొందర ఓపిక పట్టాలి రాధా అంటారు
తన పనులలో ఏమాత్రం తేడా వచ్చినా ఒంటి కాలి మీద లేచి నిలబడుతారు
పెళ్ళై పదేళ్ళు గడిచినా సర్దుకు
పొవడమే తప్ప చేసేదేమీ లేదు
పిల్లలు కూడా వాళ్ళ నాన్న గారు షాపింగ్ కి తీసుకు వెళతారని తమకు అవసరమైనవి తెచ్చుకోవచ్చన్న కోరిక కోరిక గానే మిగిలిపోయింది ఈయనకు తీరిక లేక
అమ్మా ఎదురింటి శ్రావణి వాళ్ళ
నాన్న గారు అడిగిన వెంటనే తీసుకుని వెళ్ళి అన్ని ఇస్తారట
అని బాధ పడే పిల్లలకు సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది
ఏమైనా ఈరోజు అటో ఇటో తేల్చేస్తాను
ఏమిటి రాధా పిలిచి పది నిమిషాలు అయినా సమాధానం లేదు నీకు ఈమధ్య పరధ్యానం పెరిగింది
వస్తున్నాను ఉండండి అంటూ ఆలోచనల నుంచి బయటకు వచ్చిన రాధ
ఏమిటో చెప్పండి మళ్ళీ ఏదైనా పరోపకారం చేసే అవసరం మీతో ఎవరికైనా పడిందా?
అబ్బా ఎంత అర్థం చేసుకున్నావు రాధా అందుకే
మంచి శ్రీమతిలా నా మదిలో ఉంటావు రాధా భరించే వాడు భర్తే అయినా సహించేది మాత్రం భార్యే కదా
అబ్బా పొగడ్తలకు ఏమీ తక్కువ లేదు ఇంతకీ అసలు విషయం చెప్పండి
మా క్లాస్ మేట్ రమ్య ఈరోజు హైదరాబాద్ వస్తుందట నన్ను
మెట్రో స్టేషన్ కు రమ్మంది
వెళ్ళి రమ్యను వాళ్ళు అన్నయ్య గారి ఇంట్లో దిగ బెట్టి
వస్తాను
ఈరోజు ఇంట్లో ఉంటాను అన్నారు దానికి ఇదా కారణం
దానికి నా పర్మిషన్ ఒకటి అవసరమా వెళ్ళి రండి మహానుభావా
నవ్వుతూ పంపించాలి రాధా
మనసులో బాధ ఎంత ఉన్నా నవ్వడమే నాపని గత పదేళ్ళుగా జరుగుతుంది అదేగదా
అందుకే అందరితో మా రాధ చాలా మంచిది అని చెప్తాను
అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు గదా
ఇంట్లో దిగబెట్టి రావడమే వచ్చేసరికి పిల్లలు నువ్వు రెడీగా ఉండండి బయటకు వెళదాం
ఇన్నాళ్ళకు నా కోరిక తీరబోతోంది అందుకే అంటారు
మనసెరిగిన భర్త దొరికితే మనసున మనసై బ్రతుకున బ్రతుకై కష్టంలో ను సుఖం లోనూ భర్త మనసు అర్థం చేసుకుంటే అడగకుండానే అన్నీ ఇవ్వాలన్న ఆలోచన వస్తుంది
నిజంగా నేను మాధవ్ ను తప్పుగా అర్థం చేసుకున్నాను
పిల్లలను ఆయన వచ్చే వరకు
రెడీ అవ్వమని చెప్పాలి
అదేమిటో రేడియో లో కూడా
మనసున మనసై బ్రతుకున బ్రతుకై పాట కూడా మాకొరకే
వస్తుంది అది విని మిగిలిన పని
చేసుకోవాలి👍
5
[02/01, 9:04 PM] Dhanasi Usha Rani Poetess: *కథ.ఆకాశానికి నిచ్చెన*
***************
ధనకొండ ప్రాంతములో ఓ చిరు ఉద్యోగి వుండే వాడు.అతను చిన్నతనములోనే ప్రేమించి పెళ్లి చేసుకోవడముతో బాధ్యతలు చిన్నతనములో
చుట్టిముట్టినాయి.భార్య ఏమియిను చదువుకోకపోయినా కష్టపడి వ్యవసాయం చేసేది .గయ్యాలి అత్త గౌరమ్మ ఎప్పుడు చిత్రహింసలకు గురిచేసేది. రాము వచ్చే మూడువందల రూపాయిలతో కుటుంబం గడవడము కూడా కష్టమైపోయింది.ముగ్గురు పిల్లలతో చిన్న గుడిసెలో ఉన్నoతలో తింటూ
హాయిగా బ్రతుకుతూ ఉండేవారు.ఐతే చేస్తున్న వృత్తికి న్యాయము చేస్తూనే అప్పుడప్పుడు
కుటుంబ అవసరాలు నిమిత్తం అప్పులు చేయడము మొదలు పెట్టాడు రాము.ఉన్న కొద్ది పొలము గుట్టలు రాళ్లతో నిండి ఉన్నందున పొలము బాగుజేయుటకుగాను
మితిమీరి పొలాన్ని చదునుచేస్తూ వ్యవసాయం
కష్టపడి చేస్తూ పూరిగుడిసే నుండి మిద్దె ఇల్లును
కట్టుకున్నారు .ఐతే పిల్లలు పైచదువు కోసము బయట ప్రైవేటు స్కూల్లో చేర్చాడు రాము.
ఉన్నత వర్గాలు ముందు ఓ స్థాయిని నిలుపుకోని ముందుకు సాగుతూనే ఊరిలో
కూడా పెద్దరికముగా ఉంటూనే పక్క ఊరి రైతు వద్ద ఇంకో కొంచెము పొలము కొనుక్కోవడము
జరిగింది.దానిని బాగు చేయడము కోసము
వేలు వేలు డబ్బులు ఖర్చుచేసి గుట్టలను కూడా జేసీపీతో పిండిచేసి భూమిని ఏర్పరుచుకుoటూ
మామిడి పంటను సాగు జేస్తూ నీటి వసతి కోసము అనేక బోర్లు వేస్తూ లక్షలు లక్షలు అప్పులు పెరిగిపోవ సాగాయి.ఇక కొడుకు పైచదువులు కోసము లక్షలు లక్షలు ఫీజులను
కట్టి ఇంజనీయర్ని చేసే ప్రయత్నంలో అప్పులు
మితిమీరి పోయాయి.కానీ బాధ్యత తెలియని
కొడుకు మాత్రము విలాసాల దారిలో డబ్బులు
దుబారా చేయసాగాడు.ఇది గమనించని తండ్రి
లక్షలు పంపడమే తెలుసు గానీ.కొడుకు అసలు
రంగును కనుక్కోలేకపోయాడు.
ఇక ఉన్న ఒక్కకూతురుని
దగ్గర బంధువులకు ఇచ్చి పెళ్లి చేశారు రాము.ఐతే ఏ రోజు కూతురి బాధ్యతల్ని ఓ తండ్రిగా గుర్తించలేదు.అవసరాల బోనులో ఒక్క బలిపశువులా కూతురి వద్ద అందింది లాక్కుoటూ తన కుంటుబ అవరాలను తీర్చుకో సాగాడు.ఐతే కుతురికి తలదాచుకివడానికి ఓ గూడు కట్టిఇవ్వాలనే ఆలోచన లేకపోగా.అప్పులు ఉన్నాయి అవి తీర్చేయండి.తరువాత అన్నీ సమకూర్చి ఇస్తాను అని చెప్ప సాగాడు కూతురికి.ఐతే కాలము గడిచిపోయింది గానీ కూతురికి ఏమియు చేయకపోగా సంతానం కలగడముతో కొన్ని మనస్పర్థలు వలన కూతురు వేరుకాపరము పెట్టుకోని బ్రతకసాగింది.ఐతే
పిల్లల చదువుకోసము పట్టణముకు వెళ్లి ఓ మూడు అంతస్తుల భవనంను కట్టుట ప్రారంభించిoది కూతురు.ఇది జీర్ణించుకోలేక పోయిన తండ్రి రాము.ఆవేశముతో ఊగిపోయాడు మీరు అంతస్థుల్లో ఉంటే మీము
చిన్న ఇంట్లో ఉండేదా అంటూ కొడుకి మనస్సులోకి పౌరుషంని నూరిపోసాడు.అంతే
గుట్టలుగా పోరి ఉన్న అప్పులును గమనించక.ఇంద్రభవనము లాంటి ఇల్లును కల్లు జిగేలు మనేలా హుటాహుటిన కట్టేసాడు రాము.
వెనక్కి తిరిగిచూసుకుoటే ఇంక ఏమి మిగలలేదు.సగటి జీవితాలు చితికిపోయాయి కొడుకు త్రిశంకస్వర్గములో
ఊరేగుతూ పచ్చనోటు విలువ తెలుసుకోలేక విలాసాలతో మితిమీరిన ఖర్చులు చేసినా
ఎక్కడ చూసినా గుట్టలు పేరుకుపోయాయి అప్పులు లక్షలు నుండి కోట్లల్లోకి అప్పులు చేరుకున్నాయి.అందని ఆకాశానికి నిచ్చెన వేశామని తెలిసినా కన్నీళ్లు మాత్రము మిగిలాయి .సమాజములో పరువు పోయి
జీవచ్చావాలుగా మిగిలాడు రాము.కూతురు ఐనా కొడుకు ఐనా వివక్ష చూపకూడదని.డబ్బుతో చెలగాటము ప్రాణము మీదికి తెచ్చి పెడుతుందని రాము గ్రహించాడు. మితిమీరిన ఆశలు మనిషికి కన్నీరును మిగిల్చినాయని తెలుసుకునే లోపు బతుకులో చీకటి మిగిలింది.
హామీ పత్రము.ఇది నా స్వంత కథ అని హామీ ఇస్తున్నాను
ధనాశి ఉషారాణి
భాకరాపేట
చిత్తూరు జిల్లా
6
[02/01, 9:16 PM] Sandya Sharma Poetess: *కవనజ్యోతి*
కథా సమయం
పేరు: వై.కె.సంధ్యశర్మ
*శీర్షిక: రాజీనామా*
*******************
తొమ్మిదేళ్ళ సంజు రకరకాల కలర్ క్రెయాన్స్ తో డ్రాయింగ్ బుక్ లో బొమ్మలేసుకుంటున్నదల్లా...అందులోనే ఓ కాగితం పై పెద్ద పెద్ద అక్షరాలతో రెండు పదాలు వ్రాసి
క్రింద నలుగురి పేర్లు వ్రాసి దాని పక్కన రెండు చుక్కలు వేసి సరాసరి టీవి ప్రవచనాలకు అతుక్కుపోయిన నాయనమ్మ దగ్గరకు వెళ్ళింది.
నానీ ...ఇటు చూడు నానీ ...అంటూ చేతులు పట్టుకుని
నానీ నానీ ...నీకు సంతకం పెట్టడం వచ్చా అని అడిగింది.
సుభద్రమ్మ మనవరాలి మాటకు అయ్యో రామా ..అలా అడిగావేమే..ఏదో నా వానాకాలం చదువులో నేర్చేసుకున్నాలే... ఐతే ఇందులో నీ పేరు రాయి అంటూ
ఆ కాగితం చూపింది .. సుభద్రమ్మ ఆ కాగితం చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ... సరే ఇటివ్వు అంటూ
తన పేరు వ్రాసి ఇచ్చింది.
"నానీ "..అమ్మమ్మ ఎక్కడ?
అదిగో ఆ గదిలో వుంది... చూడు అంటూ అటు వైపు చూపింది.
అమ్మ... అమ్మ... అని పిలుస్తూ అమ్మమ్మ ఇందులో నీ పేరు వ్రాసివ్వు అమ్మమ్మ అనగానే ...
ఏంటమ్మ ఇది అంటూ చేతికి తీసుకుని ఎందుకే నీకిది అనగానే ... నీ పేరు వ్రాసివ్వు అమ్మమ్మ అనగానే మనవరాలితో వాదన ఎందుకని నవ్వుతూ సంతకం చేసి ఇచ్చింది.
మమ్మీ మమ్మీ అంటూ వంటగదిలో వున్న సుధ దగ్గరకు వెళ్ళి మమ్మీ ఈ కాగితం పై నీ సంతకం పెట్టవా అంటూ తన ముందు పెట్టింది....
ఇంతలో అక్కా ఏంచేస్తున్నావంటూ.. తోడికోడలు శ్రీజ రావడంతో....
హమ్మయ్య ,పిన్ని నీకోసం వెతకాల్సిన అవసరం లేకుండా నువ్వే వచ్చేశావు... ఇందులో నీ సంతకం కూడా పెట్టేశాయ్..అంటూ సుధ చేతిలోని కాగితం తీసి
శ్రీజకు ఇచ్చింది.... సుధ ,శ్రీజ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు
ఆశ్చర్యంగా చూసుకుంటుంటే...
మీకిద్దరికీ సంతకం చేయడం రాదా...అంటూ ఎగతాళి గా
నానీ ,అమ్మమ్మను చూడు నేనడగ్గానే సంతకం చేసి ఇచ్చారు అంది ముద్దుగా బొంగరంలా మూతి ముడుచుకుంటూ... సంజు.
దీనిపై సంతకం చేస్తే.ఏ చేస్తావే అంటూ శ్రీజ ,సంజును దగ్గరకు తీసుకుని అడగ్గానే...
మిమ్మల్ని తాతయ్య , నాన్న , బాబాయ్ వాళ్ళెవరూ సరిగ్గా చూసుకోవటం లేదుగా
ఎప్పుడూ కోప్పడుతూనే వుంటారు ,ఆలస్యమైందని
భోజనం బాగాలేదని .. మీతో మాట్లాడటం కన్నా కూడా ఎక్కువ సేపు తిడుతూనే వుంటారుగా. మీకు వాళ్ళంటే ఎలాగూ ఇష్టం లేదు కదా అందుకే మీరందరూ మీ పోస్టులకు
"రాజీనామా" చేసేయండి. అంతే....ఈజీగా చెప్పుకుపోతోంది సంజు...
రాజీనామా అంటే తెలుసా నీకు.. అంది శ్రీజ బుగ్గన వేలుపెట్టుకుని...
నిన్న మీ ఆఫీసులో జాబ్ నచ్చలేదని రాజీనామా
చేశావని చెప్పావు కదా పిన్ని...
మమ్మీ .... ,లాస్ట్ వీక్ అత్తయ్య వచ్చినపుడు
ఇప్పుడు చేస్తున్న జాబ్ కంఫర్ట్ గా లేదు వదిన, దీనికి రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకుంటాను అన్నారు కదా మమ్మీ.
అందుకే ,మీరు కూడా మీకు నచ్చిన విధంగా వుండాలంటే
'రాజీనామా' పై సంతకం చేస్తే సరిపోతుంది కదా పిన్నీ.
సంజు మాటలు వింటూ సుభద్రమ్మ ,సుధ అమ్మ వంట గదిలోకి వచ్చారు. ఎన్ని మాటలు నేర్చావే నా చిట్టితల్లి అంటూ గారం పోయి నెటికలు విరిస్తూ ....
సుభద్రమ్మ,
... మనం చేసేది ఉద్యాగాలు కాదే వదిలి వెళ్ళడానికి ... జీవితం.
మనం వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం బతకాలి.
ఒకరికోసం మరొకరు వుండి తీరాలి. సంసారమన్నాక సర్దుకుపోవాలి... మార్చగలిగితే... మగాడ్ని మార్చాలి.
మూర్ఖుడని తెలిస్తే... మర్యాదగా మౌనం వహించి
అర్థం చేసుకోగలిగే నేర్పును ఓర్పును ధైర్యంతో
జీవితాన్ని నడిపించే సామర్థ్యాన్ని ఒడిదుడుకులు లేని
నౌకలా సాగించాలి.
అంతేకాని అమ్మ తనానికి రాజీనామా ఇవ్వలేమే... బంగారం అంటూ దగ్గరికి పొదువుకుంది.....
అమ్మ బాబోయ్ , ఈ ఒక్క రోజుకు మీ దగ్గర రాజీనామా చేయించి...
ఈ కరోనా లాక్డౌన్ రోజుల్లోనైనా
నాన్న ,తాతయ్య ,బాబాయ్ దగ్గరే ఇంటి పని చేయించాలనుకుంటే...మీరేమో మేము రాజీనామా చెయ్యమంటున్నారు... మీ ఇష్టం... మీ రాజ్యంలో మీరే ఉండండి అంటూ పరిగెత్తింది సంజు...
అందరి మొహల్లో... ఆశ్చర్యం... ఆనందం రెండూ విరిశాయి ... చిన్నారి తెలివికి..
*సమాప్తం*
7
[02/01, 9:27 PM] +91 74168 63289: కవనజ్యోతి
ప్రక్రియ: కథానిక .
తేదీ .2/1/ 2021
పేరు:మన్నె పిన్నక లలిత
శీర్షిక :రోజులు మారాయి
"అమ్మ !నేను కాలేజీకి వెళ్తున్న"
"నీకు ఎన్ని సార్లు చెప్పాలి? వెళ్తున్నా అనకూడదు ,వెళ్లి వస్తా అనాలి అని ఉండు .ఉండు .ఇవాళ ఫైనల్ పరీక్షలు కదా!
రాధత్తను శకునం రమ్మంటాను."
అబ్బా టైం అయిపోతుంది అమ్మ నాకు ఇష్టం ఉండదని తెలిసి ఎందుకు చేస్తావు
పెద్దవాళ్లు పెట్టినవి ఆచరించాలి మన మంచి కోసమే కదా పెట్టింది ఉండు ఒక్క నిమిషం రాధా ఓ రాధా
ఆ ఆ ఏమిటి వదిన
ఒకసారి ఇటు రామ్మా రిత్వికకు శకునం రా ఈ రోజు ఫైనల్పరీక్షలు మొదలు
అలాగే వదిన వస్తున్నా అంటూ రాధా చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది
రాధా నవ్వుకుంటూ ఎదురుగా రావటం రిత్విక నవ్వుకుంటూ అమ్మ అత్తలకు బై చెప్తూ వెళ్ళింది
విమలకు కొంచెం ఆచారాలు ఎక్కువ పూజలు ఎక్కువ చేస్తుంది రిత్విక తల్లి కోసం తల్లి చెప్పినట్టు చేస్తుంది గాని తనకు ఎంతమాత్రం ఇటువంటివి ఇష్టం ఉండవు
సాయంత్రం ఇంటికి వచ్చిన కూతురు తో ఎలా రాశావు ఎగ్జామ్ చాలా బాగా రాసానమ్మా
అత్త ఎదురు వచ్చింది కదా ఇంకేంటి బాగానే రాస్తావ్
అంతే అంతే లే కష్టపడి చదివిన నేను పోయాను అత్త ఎదురు వస్తే రాశాను అంట అని బాత్రూం లోకి వెళ్ళింది నవ్వుకుంటూ
రాధా విమల పక్క పక్కనే ఉంటారు వయసులో కొంచెం తేడా ఉన్నా ఇచ్చి పుచ్చుకోవడాలు కలిసి బయటకు వెళ్ళటం అన్ని
జంటగా చేస్తుంటారు రాధకు బాబు ఒక్కడే ఐదవ తరగతి చదువుతున్నాడు క్లాసులో ఫస్ట్ వస్తాడు బొద్దుగా ముద్దుగా ఉంటాడు విమలకు మగపిల్లలు లేకపోవటంతో బాగా ముద్దు చేస్తుంది బాబును ప్రతిదానికి రాధను పిలుస్తూ ఉంటుంది
రాధ ఎదురొస్తే పనులన్నీ సజావుగా అయిపోతాయి అని నమ్మకం
విమల భర్త శేఖర్ కూడా సొంత చెల్లెలా చూసుకుంటారు రాధను రాధ భర్త మోహన్ మితభాషి సౌమ్యుడు పలకరిస్తే మాట్లాడుతాడు చూడగానే నవ్వుకుంటూ వెళుతుంటాడు మోహన్ ఒకరోజు బండిమీద వస్తూ ఇంటిదగ్గర మూలతిరుగుతుండగా ఆటో వచ్చి బండిని గుద్దేస్తే పక్కన ఉన్న రాతి మీద తలపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు మోహన్
రాధాను బాబును ఆపటం చేతకాలేదు ఎవరికీ మోహన్ మీద పడి ఏడుస్తున్నారు ఇద్దరు అంత కష్టం లోనూ రాధకు ఏమి చేయాలో బోధపడింది మోహన్ సహజ మరణమే కనుక వీలైనంత వరకు అవయవ దానం చేయాలని శేఖర్ ని పిలిచి చెప్పింది తను అనుకున్న విషయం శేఖర్ ఏర్పాటు చేయగా నలుగురికి ప్రాణదానం జరిగింది ఇద్దరు అంధులకు శేఖర్ కళ్ళు అమర్చి నేత్ర దానం చేసి వెలుగు కిరణాలు ప్రసరింపజేశారు
కాలం ఎవరికోసం ఆగదు కార్యక్రమాలన్నీ యధావిధిగా జరిగిపోయాయి కాలం నెమ్మదిగా గడుస్తోంది
రాధ బయటకు రావటం మానేసింది కానీ బాబు ని తీసుకొని స్కూల్ కి వెళ్ళవలసి వస్తుంది అప్పుడప్పుడు ఏదో తప్పు చేసిన దానిలాగా భుజాల నిండా చెంగు కప్పుకొని తలవంచుకుని వెళ్లి వస్తుంది
ఉదయం లేవగానే తనను చూచి పక్కకు వెళ్ళటం తలుపులు వేసుకోవడం చూచి చాలా బాధపడింది శతాబ్దాలు గడిచినా ఈ మనుషులు మారరా వారికి ఈ స్థితి వస్తే అనుకోకూడదు కానీ అప్పుడు అప్పుడు వారు ఇంతే బాధ పడతారు కదా
రాజా రామ్మోహన్ రాయ్ గురజాడ కందుకూరి మొదలైన వారు ఎన్ని సంస్కరణలు చేసినా మనసును అంటి పెట్టుకున్న మాలిన్యం పోదు మోహన్ ఎప్పుడు అంటుండేవాడు రేపు అనేది మనకు తెలియదు నిద్రలేచిన అప్పుడే మనం బతికినట్టు నేను లేక పోయినా నువ్వు మాత్రం పూలు గాజులు పసుపుకుంకుమలతో కళకళలాడాలి అంటుంటే లేచి వెళ్ళి నోరు మూసి టక్కున నేను పుణ్యస్త్రీగానే వెళ్తాను అని అనేది
అంత చిన్న వయసులో అలా ఎందుకు అనేవాడు తెలియదు కానీ ఇప్పుడు జరిగినది ముందే తెలిసి అలా అన్నాడా అని అనిపిస్తుంది ఒక్కోసారి రాధకు మోహన్ పోయిన బాధ ఒకవైపు ఉంటే మరొక వైపు చుట్టుపక్కల వారు చేసే పనులు చిన్నచూపు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి ప్రతి చిన్న పనికి రాధా శకునం రా అనే విమల పిలవటం మానేసింది ఇప్పుడు
తన ఏమి తప్పు చేసిందని మనుషులు ఇలా మారటానికి కారణం ఎవరు పూర్వం కన్నా కొంత మెరుగైన మారని మనుషులే కనిపిస్తున్నారు స్త్రీకిఈ తిప్పలు తప్పవా
భార్య చనిపోయిన భర్త కు ఏ మార్పు ఉండదు పొద్దున్నే లేచి వాళ్ళ ముఖం చూడవచ్చు వాళ్లను అన్ని శుభకార్యాలకు పిలుస్తూ ఉండవచ్చు ఇదెక్కడి న్యాయం తనలో తనే బాధపడుతూ ఆలోచిస్తూ కళ్ళవెంట నీళ్ళు కారుతుండగా కాలింగ్ బెల్ విని తలుపు తీసింది
ఎదురుగా రిత్విక రామ్మా రా చాలా రోజులకు కనిపించావు
ఏంటక్కా ఇంకా ఇంత కాలం అయినా ఇంకా బాధ పడుతున్నారా
మన చుట్టుపక్కల జరిగే విషయాలు బాధ కలిగిస్తున్న వి రిత్విక
రిత్విక రాధా కళ్ళు తుడుస్తూ చేతిలో శుభలేఖ పెట్టింది మొదటి శుభలేఖ అనేక ఇస్తున్నాను అక్క అంటూ బొట్టు పెట్టింది నిర్ఘాంతపోయింది రాధ
రాధా భుజాలు పట్టుకుని ఏంటక్కా అంత ఆశ్చర్యపోతారు రోజులు మారాయి మా అమ్మ కు నచ్చచెప్పి నేనే మీకు నా చేతులతో శుభలేఖ ఇద్దామని వచ్చాను బొట్టు మనకు వెనకటి నుండి వచ్చే సంప్రదాయమే పెళ్లికి వచ్చిన మంగళసూత్రం తీస్తే చాలు పసుపు కుంకుమలు పూలు పుట్టినప్పటి నుండి వచ్చినవే మంగళసూత్రం భర్తతో వచ్చేది కాబట్టి అది తీస్తే చాలు అని నా అభిప్రాయం అమ్మకు ఇదే నచ్చచెప్పి మొదటి నుండి మీరే ఎదురొచ్చి నాకు శకునం వచ్చే వాళ్ళు ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదు మేలు బావ గారు లేరన్న లోటు ఒక్కటి తప్ప ఇంక మార్పు ఏమీ లేనప్పుడు నేను మీ శకునము నా పెళ్లిలో కూడా తీసుకుంటాను రోజులు మారాయి అని నేను నిరూపిస్తాను అంది రిత్విక
మాటరాక నీరు నిండిన కళ్ళతో రిత్వికను కౌగిలించుకుంది రాధ
8
[02/01, 10:02 PM] సునంద వురిమళ్ళ గారు: *కవన జ్యోతి*
తేదీ:02-01-2021
పేరు:వురిమళ్ల సునంద,ఖమ్మం
ప్రక్రియ: కథానిక
శీర్షిక: బలవంతుడ...
***********************
బామ్మా! బామ్మా! కథ చెప్పవా
సాయంకాలం ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న సుగుణమ్మ చుట్టూ మూగారు పిల్లలు.
అందులో కోటేశు ఏయ్! మా బామ్మ .. మీరంతా జరగండి! గట్టిగా అరుస్తూ పక్కనున్న పిల్లలను నెట్టేసి స్థలమంతా ఆక్రమించుకుని కూర్చున్నాడు. కోటేశును ఇంట్లో వాళ్ళు బాగా గారాబం చేయడంతో అలా తయారయ్యాడు. ఏదైనా అరవడమో..అన్నం తిననని మంకుపట్టు పట్టడమో చేస్తుంటాడు. వాడికేమైనా అవుతుందేమోనని ఏమీ అనక పోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా తయారయ్యాడు..
ఈ మధ్యనే మనవడిని చూద్దామని వచ్చిన సుగుణమ్మ వాడి ధోరణి ఎలా మార్చాలాని ఆలోచిస్తోంది. కథలు వినడానికి రోజూ రమ్మంటే రాడు. వాళ్ళంతా బామ్మకు దగ్గరగా ప్రేమగా ఉండటం సహించలేక పోయాడు. అందుకే ఇవ్వాళ వచ్చి కూర్చున్నాడు.
అనగా అనగా ఒక ఊరు.ఆ వూరిలో సాగర్, సంతోష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిలో సాగర్ కు బాగా గర్వం . డబ్బున్న వారి అబ్బాయినని. సంతోష్ పేదింటి పిల్లవాడు. వాడితో స్నేహం తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసమే చేసేవాడు. స్నేహం విలువ తెల్సిన సంతోష్ భరించే వాడు. ఓ రోజు
సాయంత్రం పిల్లలతో కలిసి తోటకు వెళ్ళాడు సాగర్.
వారంతా కోతి కొమ్మచ్చి,దాగుడు మూతలు, కబడ్డీ ఆటలు ఆడుతుంటే ఎంచక్కా తాను తెచ్చుకున్న మిఠాయిలు ఊరిస్తూ ఒక్కడే తినసాగాడు. చెట్టు పైన కోతుల గుంపు చూసింది . అందులో ఒక కోతి పిల్ల కిందికి దిగి. ఇవ్వమని కిచకిచా అరవసాగింది. నేను మా ఫ్రెండ్స్ కే పెట్టలేదు నీకు పెడతానా అనుకుంట పక్కనే ఉన్న రాయి తీసి కోతి పిల్ల మీద విసిరాడు.అంతే..కోతుల గుంపు చూసి కిందికి వచ్చి మీద పడబోయాయి. భయంతో అరవసాగాడు. పిల్లలంతా సంతోష్ తో వచ్చి తాము కోసుకున్న జామ కాయలు వాటికి విసిరేసారు. అవి సాగర్ ను వదిలి పండ్ల కోసం అటు తిరిగాయి. సంతోష్ గబగబా స్నేహితుని దగ్గరకు వచ్చి భయం లేదని భుజం తట్టాడు. పిల్లలు అన్నా ఏం కాలేదుగా అని అడుగుతుంటే.. ఇంతకాలం తన అహంకారానికి సిగ్గుపడి ఇంటికి వాళ్ళను తీసుకుని వెళ్లి అందరికి వాళ్ళమ్మ తో చెప్పి మిఠాయిలు పంచాడు.
విన్నారా పిల్లలూ! అహంకారం తో ఆ పిల్లలను తక్కువగా చూసినా వాళ్ళెంత బాగా సహాయం చేశారో..
అందుకే సుమతి శతక కారుడి ఓ పద్యం చూడండి. బలవంతుడ నాకేమని....చావదే సుమతి అని.. అహం గర్వం ఉండకూడదు తెల్సిందా అంటుంటే తప్పు తెలుసుకున్న కోటేశు పిల్లలకు తప్పైంది అంటూ క్షమాపణలు చెప్పాడు.
మనవడిలో మార్పు చూసి అందరూ సంతోషించారు..
Comments
Post a Comment