Cనారే కవన జ్యోతి

 


నిర్వహణ

వీరా గుడిపల్లి

శివునూరి లలితా కృష్ణ

**************

కవివరుల జాబితా

1.తాతాపూడి సోమ శేఖర శర్మ గారు

2.మేకల రామస్వామి గారు

3. మద్ది పుల్లారావు గారు

4.ధనాశి ఉషారాణి గారు

5.డా.బల్లూరి ఉమాదేవి గారు

6.కె.దేవికారాణి గారు

7.జక్కిడి వెంకట్ రెడ్డి గారు

8. సునంద వురిమళ్ళ గారు

9.ఏ.భూపతి గారు

10.పిల్లి.హజరత్తయ్య గారు

11.ఆళ్ళ నాగేశ్వర రావు గారు

12.మర్రి జయశ్రీ గారు

13.వల్లాల విజయ లక్ష్మి గారు

14.వాకిటి రాంరెడ్డి గారు

15.నాశబోయిన నరసింహ గారు

16.జంపని శ్రీనివాస మూర్తి గారు

17. కవిత వెంకటేశ్వర్లు గారు

18.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు

19.కె.వి.రమణాచారి గారు

20.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు

21.బి. నాగేశ్వరరావు గారు

22.పిన్నక నాగేశ్వరరావు గారు

23.వనపర్తి గంగాధర్ గారు

24.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు.

25.మన్నె పిన్నక లలిత గారు

26. కొంపెల్లి రామయ్య గారు

27.తరణికంటి సూర్య లక్ష్మి గారు

28. కె.సి.నరసయ్యగారు

29.గాజుల భారతీ శ్రీనివాస్ గారు

30.సుగుణ మద్ది రెడ్డి గారు

31.సునంద వురిమళ్ళ గారు

32.శివునూరి లలితా కృష్ణ గారు

************

1

కవితా గానం( సీజన్ 2 )

అంశం.. డాక్టర్ సి. నారాయణ రెడ్డి 

శీర్షిక: అక్షర శిల్పి సినారె


వేషం,భాష, పదహారణాల తెలుగు తనం

సాహిత్య సంపదలతో వెలిగిన  నిప్పు కణం

తెలుగుకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి‌ని

అందించిన సాహితీ కిరణం అక్షర శిల్పి సినారె!


అతని రాతలు భావి తరానికి కొత్త బాటలు

అతని రచనలు కవి కులానికి పాఠ్యగ్రంధాలు

వీధి బడినుండి జ్ఞాన పీఠాని కెగసిన కవి కోకిల

కవన  ప్రక్రియలన్నిట  కదంతొక్కిన భాషా సెల!


 కలల అలలపై తేలి తెలుగుపాటకు  తనకలంతో

 తేనెల ఊటలు అద్దిన కలం కారీ కార్మికుడు

భావాన్ని భాష తో అందంగా చిత్రించిన 

చేయి తిరిగిన   సాహిత్య చిత్రకా రుడు!


శబ్దాలను లయబద్దంగా అతికే 

ఆల్కెమీ తెలిసినపద స్వర్ణ కారుడు 

మనిషి పరిణామ క్రమం మనసు పరిపక్వ దశలు 

విశ్వంభరగా మనకిచ్చినధీ యుతుడు సినారె!

2.

శీర్షిక:   సినారె_తెలుగు కైతల కినారె

*************************

అతని కలం అమృత వర్షిణి

అతని గళం సప్తస్వరాల ఝరి

అతని మేధ నవ్య పద్యనిధి

అతని ఎద భావ వల్లరుల సౌధ

అతడు ఎవరో కాదు మన "సినారె"

తెలుగు కైతల " కినారె"

మానవతావిలువలకై 

మంటలు_ మానవుడ్ని కన్నాడు 

 లకుమ నర్తకి సోయగాల వలకై

"కర్పూరవసంతరాయల" ప్రేమను లిఖించాడు

విశ్వశ్రేయస్సుకై "విశ్వంభర"ను సంధించాడు 

పాట పద్యాల్లో పదనిసల రాగమైనాడు

మాటల తోటల్లో మరులు పండిస్తాడు

"గజల్" గానామృత సుధలతో

తెలుగుకు తేనియ రుచులనద్దాడు

సినీ వినీలాకాశంలో

వేలపాటల తారకలను వెలిగించాడు

వర్ధమాన కవుల సాహితీ హితముకై

ముందుమాటల అభినందన జల్లులైనాడు

రేపటితరం శ్రేయస్సుకై

"ప్రపంచ పదుల"ను సృజించాడు

నికార్సయిన రాతలతో

అకాడమీ అవార్డులను అందుకున్నాడు 

మానవ వికాస పరిణామ

ఙ్ఞానసుధలు  కురిపించి 

"ఙ్ఞాన పీఠా"న్ని అధిరోహించాడు 

భవితవ్యం బంగరు బాటలకై 

కవిత ఊటలను సృష్టించాడు

నవోదయపు క్రాంతులకై 

"అక్షర గవాక్షా"లను తెరిచాడు,,,,   

************************************

  మేకల రామస్వామి_చెన్నూర్

   జి"మంచిర్యాల,9912747214

************************************

డా" సి.నారాయణరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా

************************************

3

మదురకవి సి.నా.రె

వచన కవిత

11-6-2021

---

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సాహితీ రంగంలో వెలిగించెను బుడ్డి

సాంస్కృతికోద్యమ ప్రతీక

తెలుగునాట కీర్తి ప్రతాక

మహాకవి గా పేరొందె

మదురవక్త గా వాసికెక్కె

సద్విమర్శకునిగా రాణించె

సినీగేయ రచయిత గా ప్రసిద్దుడాయె

బహుముఖ ప్రజ్ఞాశాలి యని కీర్తి గడించె


విశిష్ట అధ్యాపకుడతడు

విశేష పరిపాలకుడు


కవితాయాత్ర లో ఎన్నో మైలురాళ్ళు

సాదించాడెన్నో మేలురాళ్ళు


నలబై కి పైగా కావ్యాలు

వందల సంఖ్య లో గేయాలు


ఆధునికాంద్ర కవిత్వం

నాగార్జున సాగరం

మద్యతరగతి మందహాసం

మరెన్నో యద్భుత రచనలు

 'విశ్వంబర'కు జ్ఞానపీఠ

మారుమ్రోగె ప్రతినోట సి.నా.రె మాట


'గుహనుండి మహలు దాకా

నడక నుండి రోదసీనౌక దాకా

అమ్ముల నుండి అణ్వస్త్రాల దాకా

దివిటీల నుండి విద్యుద్దీపాలదాకా'


విశ్వంబర లో సి.నారె చెప్పిన

మానవుని ప్రగతిపదం

ఏమని చెప్పను ఆ పదవిన్యాసం

లోతైన ఆ వాక్య గాంభీర్యం

అది ఆ పద్మభూషణునికే చెల్లు

అందుకే ఆయన అవార్డు ల హరివిల్లు


తెలుగు నాట సి.నా.రె జన్మము

తెలుగు వారు చేసిన పుణ్యము

 తెలుగు ను వెలిగించి న మహా కవి

జనహృదయాలను గెలిచిన మదురకవి

 జోహార్ సి.నా.రె

అమర్ రహే సి.నా.రె

..........

ఇది నా స్వీయరచన.

....మద్ది. పుల్లారావు

నందిగామ

4.

శీర్షిక.సింగిరెడ్డి నారాయణరెడ్డి

..............

తెలుగు పాటలు ప్రాణము పోసి

సాహిత్యముకు వెన్నెల అద్ది

తెలుగువారి గుండెల్లో నిలిచావు


మానవతావిలువులను రచనల్లో చూపినాడు

సినీలోకములో వెలుగులు నింపి 

చిత్రసీమలో రారాజుగా వెలిసాడు


జనుల హృదయాల్లో నిలిచిన వెలుగు కెరటము

కలము నుండి కురిసిన అమృతఝరి మనసును మురిపించు కమ్మని జల్లు

ఎన్నో గేయాలకు ఊపిరి పోసి

కావ్యాలను రాసిన మేధావి


గజల్ అనే చక్కని చుక్కని సాహితీలోకములో పాతి

తెలుగుదనానికి ఊపిరిపోసినాడు

కవన ప్రక్రీయలకు ప్రాణము పోసిన జ్ఞాన పీఠముకు ఎగిసిన ధీరుడా జోహార్


ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా



9951287113

ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336

5.

కవితా గానం

అంశము: డాక్టర్ సి నారాయణరెడ్డి

శీర్షిక:అక్షరాంజలి


అనగనగా ఒకరాజు

 అనగనగా ఒకరాణి

అంటూ కథలా పాటకూర్చాలన్నా

చదువు రాని మంచిమనిషిదిగులును గమనించి

‘చదువురానివాడవని దిగులు చెందకు’

అని సముదాయిస్తూ ఏ చదువులు లేకపోయినా

పశుపక్ష్యాదుల నైపుణ్యాన్ని వివరిస్తూ మంచిమనసుంటే చాలని చెప్పిన

కవివరేణ్యా అందుకో మాజోహార్లు

‘వగలరాణివినీవే సొగసుకాడను నేనే’ అంటూ ప్రియురాలిని పొగుడుతూ

‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల’అంటూ గోముగా పిలుస్తూ

‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ’అంటూ ఆట పట్టించినా

‘నీమనసే మందిరమై నేనే ఒకదేవతనై’అంటూ తన్మయత్వంతోనాయికతో చెప్పించినా అదికూడా

పద్మభూషణుడైన సినారేకే చెల్లు

కులమతభేదాలను నిరసిస్తూ

‘గాలికి కులమేది ఏదీ నేలకు కులమేదీ ఏదీ’

అని పాటద్వారా ప్రశ్నింప చేస్తూ

‘జీవమున్న మనిషికన్న శిలలే ‘నయమనిపించునని

ఘంటాపథంగా మానవస్వభావాలను చిత్రిస్తూ 

విశ్వాసంలేని మనిషి కంటే కుక్కే నయమని ఉదాహరిస్తూ

‘ఆత్మీయత అనుబంధం అంతా ఒక బూటకం’అంటూ

నేటి స్థితిని పాటలో కూర్చడం మహామనీషి సినారేకే చెల్లు

వరకట్నదురాచారాన్ని నిరసిస్తూ

‘ఇదేనా మనసాంప్రదాయ మిదేనా’ అంటూ అబలల ఆర్తనాదాలను

పాటలా రచించి హృదయాలను ద్రవింపచేస్తూ చెలిమి మధురిమలను

చిలుక కోయిలల ద్వారా తెలియచేస్తూ

‘రంగూ రూపు వేరైనా తమ రీతి జాతి వేరైనా’

అంటూ వారి చెలిమి భావితరాలకు

 తరగని కలిమని చాటి అంతటితో నాగక

స్నేహమాధుర్యాన్ని తెలుపుతూ

‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వితం’

అని చాటడం ఒక్క సినారేకే చెల్లు

‘ఓ నాన్నా నీమనసే వెన్న ‘అని నాన్న మనసును వెన్నతో పోల్చినా

జన్మనిచ్చిన తల్లిని ‘అమ్మను మించి దైవమున్నదా’

అని దైవంతో పోల్చినా

‘అన్నయ్యసన్నిధి అదే నాకు పెన్నిధి’అని గారాలచెల్లితో పాడించినా

‘చెల్లాయి పెళ్ళికూతురాయెనే’అంటూ అన్నయ్య అంతరంగాన్నివ్యక్తం చేయాలన్నా ఆత్మీయతలెరిగిన

సాహితీ సార్వభౌముడైన సినారేకే చెల్లు

‘శ్రీ సూర్యనారాయణా మేలుకో ‘ అంటూ సూర్యుడిని మేల్కొల్పినా

‘అణువూ అణువున వెలసిన దేవా’ అంటూ స్వామిని పిలిచినా

‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ’

అంటూ రామయ్యకు సిఫార్స్ చేయించినా

‘నీపేరుతలచినా చాలు’ అంటూ కృష్ణనామ స్మరణం చేయించినా

‘కృష్ణవేణీ తెలుగింటి విరిబోణి’అని కృష్ణమ్మను స్తుతించినా

‘లాలీ లాలీ లాలీ లాలి’అని వటపత్రశాయిని నిద్రబుచ్చినా అది

విశ్వంభరను రచించి జ్ఞానపీఠ ప్రశస్తి నందిన

మన సింగిరెడ్డి నారాయణరెడ్డి గారికే చెల్లు.

భువిలో మలిగిన దీపం

దివిలో దేదీప్యమానంగా వెలగాలని

మనసారా ఆకాంక్షిస్తూ అందించే అక్షరాంజలి


డా బల్లూరి ఉమాదేవి

11/6/21

6.

సి.నా.రె.

----------------

రచన కె దేవికారాణి రత్నాకర్ తెనాలి.

----------------------------------------


నీవెక్కడ?!


నీ కవితా గానమెక్కడ??!!



పదం పదంలో అక్షరాక్షరం లో

ప్రాస ను పరవళ్లు తొక్కించి

భావాల పరిమళాలను గుప్పించి

గజళ్ళ లోనూ ప్రేయసి సల్లాపాల్లోనూ

సమాజంలోని లోపాలను అధిక్షే పించి

ప్రజా భ్యుదయం కాంక్షించి


కమ్మని కంఠస్వరంతో

కవిత్వాన్ని ఆలపించి

కవితా క్షేత్రం లో పీ యూ షాలను పండించి


తెలుగు సాహితీ మతల్లికి

ఏడువారాల నగలలంకరించి

హృదయాలను పూలవనాలు గా

రంజింప చేసిన కవిత తోటమాలీ.


నీవెక్కడ 

నీ కవితాగానమెక్కడ?!


సినారె

కవితామృతరసం.


తెలుగు సీమలో పోసి.నా.రే.!!!


జ్ఞాన పీఠం

నీకు కాదా అంకపీఠం.


నమస్తే నమస్తే సినారే నమస్తే

7.

***నవయుగవైతాళికుడు సి నా రే ***


 ఇంటిచుట్టూ పైరు  ఆ పక్కన సెలయేరు 

     ప్రకృతిమాత తన జీవనానికి వన్నెలద్దితే 

  వేలకొలది పాటలకు తాను సోకులద్దినవాడు 

       ఆ బాల్య గాయకుడై కావ్య రచన చేసి 

 గంటలకొద్దీ గానం చేసిన నేర్పరితాను 

       తన మదితోటలో పూసిన రెండు పువ్వులు 

 పద్యం -పాటలను 

   దినం కింతెత్తున ఎదిగించి తానందు ఒదిగిన          వాడు 

 పాఠం చెప్తావా ? పాటలు రాస్తావా ? 

          అంటే ........

    పాఠం చెప్తూ పాటలు రాస్తానని నెగ్గినవాడు 

 ఇంటిముందు పక్షి ఎగిరితే ...

    ఇంట్లో టేబుల్మీద తన కలానికి    రెక్కలొస్తాయనిచెప్పి 

 ప్రకృతి నేపథ్యంలో అనామక మనిషి నాయకుడుగా 

  ఈ విశాల ప్రపంచ రంగస్థలంలో "విశ్వంభర "ను 

   విరచించినవాడు 

 "నన్నుదోచుకుందువటే "నంటూ మొదలుపెట్టి 

    వేలకొలది పాటలకు ఊపిరి లూదినవాడు 

మనిషిని మనిషే కరిచిన వేళా -ద్వేషం విషమై 

     కురిసిన వేళ అంటూ ..

 మనిషిలోని దానవత్వాన్ని  నగ్న ౦గా నిలబెట్టినవాడు 

 మెత్తగా ఉంటే లోకం నెత్తిన కాలు పెడుతుంది 

  కత్తిలావుంటే గులామై కాళ్లుపడుతుందంటూ 

మనిషిలోని కప్పదాటు తత్వాన్ని 

      కళ్లముందుంచినవాడు 

తెలంగాణము తేనే మాగణమంటూ 

   తెలంగాణా నుడికారంతో పాటకు సొగసులద్దినవాడు 

 మానవత్వమే హద్దుగా  ప్రగతిశీల దృక్పధంలో 

  నడిచినవాడు 

 కాలన్నీ ఖండికలుగా చేసి 

    మనకున్న కాలం విలువని తెలిపినవాడు 

ఆవార్డులకే వన్నెలద్దినవాడు 

   బిరుదులకే తాను నెళవైనవాడు 

 నిత్యనూతన సాహితి ప్రక్రియకు ప్రాణం పోసి 

 యువ కవులతో పోటీపడి స్ఫూర్తి నింపినవాడు 

తాను తిరిగిరాని లోకాలకు వెళ్లిన 

   తరిగిపోని సాహితీ సంపదను ఈ 

 లోకానికందించి అజరామరుడైనవాడు ..

ఎన్నాళ్లయినా ఈ తెలుగు హృదయాలు 

 తెలుగుజాతి మనది నిండుగా (రెండుగా )

  వెలుగుజాతి మానదంటూ ..కాలమున్నంతకాలం 

 ఇదేపాట ప్రతిచోటా ఇలాగె పాడుకుంటానంటూ 

 నవయుగ వైతాళికుని "కలా"న్ని  ..

  ఆరాధిస్తూనే ఉంటుంది ...

   .....జక్కిడి వెంకటరెడ్డి

8.

*కవితా గానం*

తేదీ:11-06-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: సినారె

శీర్షిక: తెలుగు సాహిత్య ప్రపంచంలో...

*******************

తెలుగు సాహిత్య  ప్రపంచంలో

విశ్వంభరుడు!

సినీ గేయాలకు జాన పద సొబగులద్దిన పాటల రేడు!


అనేకానేక  ప్రక్రియల భూషణాలతో 

భాషామతల్లిని కొలిచిన మహనీయుడు!


జ్ఞాన పీఠ పురస్కారంతో 

తెలంగాణ కీర్తిపతాకను

విశ్వ విను వీధిలో ఎగరేసిన

తెలుగు భాషా భక్తుడు!


శబ్ధశక్తి అర్థ యుక్తితో 

పదాలను పదబంధాలతో అలంకరించి

వాక్యాలను కావ్య కన్యకగా తీర్చిదిద్దిన  మహా శిల్పి!


పంచెకట్టుతో తెలుగు దనం

పాండిత్యంలో మహోన్నత శిఖరం

వర్థమాన కవులకు మార్గదర్శనం

అవార్డులకే గౌరవాన్ని తెచ్చిన

పద్మ భూషణం

మంచితనం మానవీయ విలువల సమాహారం!


సాహిత్య చరిత్రలో

సినారె నామం నిత్య స్మరణీయం

పండిత పామరుల నాలుకలపై 

ఆయన సాహిత్యం జీవ నది ప్రవాహం!

 ఆ మహానుభావునికిదే అక్షర నీరాజనం!

 *వురిమళ్ల సునంద,ఖమ్మం*

9.

......నారాయణ  రెడ్డి.. ....

           సి నా రే...

    అంశం ...జన గళం...


పల్లె టూరి పిల్లోడు ...

పాటల రాయుడు...

తెలంగాణ చిన్నోడు...

చిందులనందించి న తెలుగోడు ,....

యాస మూసల పాటల మాంత్రికుడు , విద్యాలయాల

బోధి వృక్షం ,...తల పండిన 

పాటల రాగాల పరిపక్వమ్..

జన ,పదాల వరవడి ,జాన

పదాల ,కోకిల , తరాల మార్పుకు , వయసుల  చేర్పుకు ,గళ గంధమును

పూసి ,అందరిని ఆకట్టుకున్న

గానా మృత సిరి సి నా రే...

మాటలో , పాటలో , మనిషి లో

వరస తప్పని  , వరదల ప్రవాహ ,గళ ఝరి...సి నా రే..

ఏ నటుడి  గొంతు బాణీ కైనా

సరిపడ తూకం తో దరువు

నేర్పగల , నేర్పరి ,సినారె...

పాటల పారాణి ,పద్యాల పదును ,  సాహిత్య చరిత్ర,

హాస్య , అపహాస్య ,రౌద్ర ,

దరహాసములు , దుఖః ,

దయ , రొమాంటిక్ ,  పల్లె ,పట్న   , ఏ 

రూపు పాటైన ,తన గళ

మాధుర్యం ,చేత మైమరిపించే

జన  గళం .....సి  నా  రే ...


ఈ కవిత నా సొంతం...

10.

కవితా గానం( సీజన్ 2 )

అంశం.. డాక్టర్ సి.నారాయణరెడ్డి 

శీర్షిక:సాహితీ హాలికుడు సినారె


తెలుగు సినీ సాహితీ మాగాణిలో

బంగారు పంటలు పండించారు

తెలుగు సాహిత్య చరిత్రలో

కావ్య వసంతాలను పూయించారు


వ్యవసాయ కుటుంబంలో జన్మించి

హలం బదులు కలం పట్టి

తెలుగు భాషని సుసంపన్నం చేసిన

తెలుగు సాహితీ లోక నిండుచంద్రుడు 


తెలుగుభాష నైపుణ్యానికి తోడు

ఉర్దూ భాష పైన పట్టు సాధించారు

మేధాక్షేత్రంలో సహజమైన బీజాల వలన

ఇంటర్మీడియట్లోనే  కవిత్వంలో మెరిశారు


గజల్ ప్రక్రియలో పేరెన్నికగన్న కవి

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో

అడుగుపెట్టిన తొలి దక్షిణాది కవి

పాత,కొత్త తరాలకి వారిధైన సుకవి


నన్ను దోచుకుందువటే యంటూ

తెలుగు వారి మదిని దోచారు

అలుపెరగని సాహితీ వ్యవసాయం చేసి

'విశ్వంభర'తో జ్ఞానపీఠ మెక్కారు


అధికార భాషా సంఘ అధ్యక్షుడు

ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు

సాహితీ సేవలో విరిసిన పద్మభూషణుడు

తెలుగు వర్శిటీ వైస్ ఛాన్సలరైన

అలుపెరుగని సాహితీ హాలికుడు సినారె


ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.


పిల్లి.హజరత్తయ్య

11.

అంశం:  డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి వర్ధంతి

కవితా శీర్షిక:

    "" సాహితీ సవ్యసాచి""


విశ్వంభర కావ్యరచనతో

విశ్వమంత ఎత్తు ఎదిగి

గజల్ గీతాల రచనలతో 

సాహితీప్రియులకు ఆరాధ్యుడవై

జ్ఞానపీఠ అవార్డును పొంది

సాహితీ వినీలాకాశంలో

ధ్రువతారయై నిలిచిన మహాకవి సి. నా.రే.!

సామాన్య రైతు కుటుంబంలో జన్మించి

సామాజిక  చైతన్యాన్ని కలిగించే

సినీ గీతాలను రచించి

సామాజిక రుగ్మతలపై

కవితాస్త్రాలను సంధించిన

అభ్యుదయకవి సి.నా.రే!

కలాన్ని హలంగా మలచి

అన్ని సాహితీ ప్రక్రియల్లో

రచనలు గావించి

సాహితీ క్షేత్రాన అక్షరపంట

పండించిన అక్షర హాలికుడు సి.నా.రే!

పద్యమైనా, గద్యమైనా, మరేదైనా

హృద్యంగా సాహితీ రచనలు గావించిన

సాహితీ సవ్యసాచి మన సి.నా.రే!

అందుకో మా సాహితీ అక్షరాంజలలు భళారే!

.......................................

రచన

ఆళ్ల  నాగేశ్వరరావు

తెనాలి

గుంటూరు.. జిల్లా

ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం

సెల్ నెంబర్.741668823

శింగరాయకొండ

ప్రకాశం జిల్లా

12.

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..డా.సి.నారాయణ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ప్రత్యేక కవిత.

శీర్షిక..నూతన ఉత్తేజం



హనుమాజీ పేట మట్టిపరిమళాన్ని

ఆసాంతం పులుముకున్న మట్టిమనిషి

సింగిరెడ్ది వంశ పూదోటలో

విరిసిన సాహితీ కుసుమం

చదువంతా ఉర్దూమాద్యమం

 మాతృభాషపై వదలని మమకారం

మధ్యతరగతి మందహసంతో

అవరోధాలెన్నో 

అవలీలగా దాటిన మహోన్నత కీర్తిశిఖరం

వీధి బడి విశ్వంభరుడే

జ్ఞానపీఠ మెక్కిన ఘనుడు

పలు ప్రక్రియల సృష్టికర్త

కవిగా కవితలల్లి

పరిశోధకుడిగా

సమగ్ర సాహిత్య గ్రంధమందించిన మహాకవి

తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యం

ఉన్నత పదవులెన్నో అలంకరించినా

పదవులకే వన్నె తెచ్చిన

సమగ్ర మూర్తిమత్వం

పలు గ్రంధాలను వెలువరించిన

సాహితీ జగత్తు రారాజు

చిత్ర గీతాలతో

సినీ గగన సీమను ఏలిన నెలరాజు

తెలుగు భాషకు వన్నెలద్దిన కర్పూర వసంత రాయలు

ఎన్ని యుగాలకైనా

చరిత్రలో చెరగని సంతకం సినారె

గజళ్ళతో గుభాళించే సుమ గంధం  సినారె సాహిత్యం

నేటి తరానికి నూతన ఉత్తేజం.

13.

కవితశీర్షిక:**విశ్వంబరుడా*!*

--------------***************-----

ఓ సాహితీసoద్రమా!తెలంగాణ బిడ్డడా!

నీ సాహితీఫలాల రుచి *మా దొడ్డది* !

ఓ రైతుబిడ్డా!నువ్వు *కలంహలం* పట్టిన చాలు

కవితాసుమాల కావ్యఫలాల *సాగే సాగు* 


అపారపాండిత్యంతో *జ్ఞానపీఠం**ను అధిష్టించి

అంబరానికి ఎదిగిన *విశ్వoబరుడా*!

తెలుగు సినిమాపాటలకు వేల ముత్యాలద్ది

సినీగీతాల సొగసును పెంచిన గడసరివాడా!


జనపదాన్ని *ఘన* పథాన నడిపిన

కర్పూర వసంతరాయ లకుమ.. సారధీ!

తెలుగోళ్ళకు 'గజల్ సుందరిని' చెలిని చేసి 

అందరిగుండెల్ని ఝల్లుమనిపించిన వారధీ!


పట్టభధ్రుడయ్యేదాకా ఉర్దూమాధ్యమాన చదివినా

గట్టివాడివి తెలుగుసాహితీ ప్రక్రియలన్నిట!

*దేశవిదేశీ బిరుదులెన్నొ నినువరించి మురిసె*

పదవులెన్నో నినుకోరి చేరే మా 'కళాప్రపూర్ణా'!


హనుమాజిపేటలో ఉదయించిన *సింగిరెడ్డీ*!

పెద్దలసభకెన్నికై సభాగౌరవాన్ని పెంచితివి!

*నవ్వని పువ్వు* నీ తొలిప్రచురణ ఐనా

నీ కావ్యాలన్నీ నవ్వే*పద్మ*ములే సాహితీ'భూషణు'డా!


నీ ప్రతి రచన మాకు నిత్యపఠనీయం!

నీ ప్రతి గజల్ మా ఎదలకు కమనీయం!

నీ ప్రతిసూచన మాకు అనుసరణీయం *సినారె*!

నీ ప్రతిపదం మా స్మృతిపథాన పదిలం*భళారే!


:వల్లాల *విజయలక్ష్మి* (టీచర్)

సిల్క్ నగర్ *ఆలేరు*

*ఆలేరు*


హామీపత్రం:ఇది నా సొంత రచన,ఏ ఇతర రచనకు అనువాదంగానీ,,అనుసరణ కానీ కాదని మీకు హామీ ఇస్తున్నాను

14.

 కవిపేరు     : వాకిటి రామ్ రెడ్డి 

ఊరు        : పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రిభువనగిరి .

చరవాణి   : 9000702093 

అంశం      :వీధిబడి విశ్వంభరుడు 


పల్లవి : వీధిబడినుండి విశ్వంభరుడై 

           జగతిలో జగదేక వీరుడయ్యిండు 

           నిత్యపాఠమువలె సత్యపీఠిక వ్రాసి 

           కొత్తకవులకు రత్న బాటచూపిండు 


చ :      రత్నాలవీణ తెలంగాణ లోన 

           కమనియ రమణీయ కరీంనగరులో 

           సిరులుపండేనేలా సిరిసిల్ల మండలం 

           అపురూపమైన హనుమాజీపేటలో 


చ :      పంతొమ్మిది వందల ముప్పది ఒక్కటి 

           జులై ఇరువైతొమ్మిది నాడు 

           సింగిరెడ్డి ఇంటిలో సింగిడై వికసించి 

           పుణ్యపురుషుడై పుట్టేసినారె 


చ :      అమ్మవడినుండి అ ఆ లు దిద్ది 

           సిరిసిల్ల విద్యతో పెరిగిపెద్దయ్యే 

           పువ్వుపుట్టంగానే  పరిమళించినట్టు 

           విద్యాబుద్దులతోటి వికసించినాడు 


చ :      సింధుబాగోతం పొందుపర్చుకోని 

           ఒగ్గుకథలు విని నిగ్గుతేలాడు 

           సుగుణాలవతి సుశీలాదేవితో 

           సంసార బందమై పందిరేసిండు 


చ :      కృష్ణవేణిగంగా యమున సరస్వతి 

           ఆత్మలో భాగమని ఆశీర్వదించిండు 

           నవ్వనిపువ్వుతో నాటకామేయించి 

           నవ్వనినోరును మనసార నవ్వించే 

      

చ :      సాహిత్యమే నాకు సర్వమన్నాడు 

           విశ్వనాధుడై విహరించినాడు 

           గజల్స్ వ్రాసి గలమెత్తి పాడి 

           జ్ఞానపీఠంతోటి గగనమెక్కిండు

15

గజల్ రారాజు

~~~~~~~~~~~~~

నిండు కండువా పంచెకట్టు 

తెలుగుతనం తొణికిసలాడగ 

లక్షల అక్షర మెదళ్లకు ప్రేరణగా 

సాహితీ చెలక చదునుగా దున్నేసి                                                         

టన్నుల కొద్దీ కవన సిరులు పండించిన                                                   

భళారే!తెలుగు గజల్ రారాజు సినారె! 


ఎగురలేని అక్షర పక్షులకు 

రంగు రంగుల రెక్కలు తొడిగి 

మేరువన్నె మెరుగుల సొబగులద్ది 

విశ్వమంతా విరజిమ్మే తెలుగుతేజం  

రెపరెప లాడే విశ్వంభర విజయ ధ్వజం 

భళారే!పద్మ విభూషణ సినారె! 

                                 

ఉరకలేసే గజల్ జలపాతాలతో

ఆరని జ్వాలల విప్లవ వేడి రాజేసి                                                    

సృజనాత్మక భావుకత సమపాళ్ళలో

చమత్కార రసాత్మకాలు రంగరించి                      

సామాజిక రుగ్మత శస్త్ర చికిత్సకారీ                                                                       

భళారే!జ్ఞానపీఠ కీర్తి కిరీటి సినారె!! 


సగటు మనిషి ఆలోచనాంకురం నుంచి 

తాత్విక సిద్ధాంత ప్రయోగకర్త దాకా 

శ్రమజీవన సౌందర్యావిష్కరణతో 

వెలిగించే మనోవికాస చైతన్య దీపకళిక                                  

విశ్వమానవ హృదయాంతర్య శోధకా                                   

భళారే!నిత్య సత్య ఆచార్య సినారె!                                     

                             

మది దోచే మధుర సినీ గీతాలైనా

ఆణిముత్యాల కావ్య రాసులైనా                                          విలసిల్లిన కవితాశిల్ప సౌందర్యం             

శబ్ద లయల హొయలొలికించే విశ్వగీతి  

అద్భుత అజంతా సుందరి సుచిత్ర శిల్పి  

అక్షర నివాళి!కవిలోక నారాయణ సినారె!

(12జూన్,సి.నా.రె నాల్గవ వర్థంతి సందర్భంగా అక్షర నివాళితో)

రచన: కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్యపర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,9542236764

16

[12/06, 8:03 PM] +91 80742 97465: *జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* ),

గుంటూరు

12 - 6 - 2021

80742 97465

 

శీర్షిక : *సరస సాహితీ చతుర్ముఖుడు*


ఆనందపల్లకి మీద

గాలి తంతువులపై నిలిచి

విశ్వకళ్యాణ జగత్తుకొక

వినూత్న చైతన్యం కలిగించిన

ఓ విశ్వకవన *మూర్తీ*!


క్రొంగొత్త వెచ్చదనాల కౌగిలింతలుగా

నూతన క్రియా రూపకాల సృష్టి చేసి,

మదిలో ఆనంద పువ్వుల జల్లులు కురిపించి

అక్షరాలను బంగారపు ఉయ్యాలలు ఊగించి

సుధా స్రవంతుల భావగర్భములు కల్పించి,

సాహిత్య పురంలో *కృతి పురుళ్ళు* తో

కీర్తి గడించిన ఓ తపస్వీ!

సరస సాహితీ చతుర్ముఖా!


అమ్మ చేతి తాలింపు కమ్మదనంలా

విశ్వ మనస్సుల్లో ముద్రవేసుకున్న

ఓ *విశ్వంభర మూర్తీ*!

నవరస రుచితములైన

సాహిత్య వంటలతో పరిశోధకుడివై

ఎందరెందరి నోటికో రుచి మాధుర్యాన్ని తెల్పిన

*ఓ సినారె*

మీకు దోసెడు పారిజాత అక్షర కుసుమాలు.

17

[12/06, 8:06 PM] +91 83099 20625:

 విశ్వంభర సింగిరెడ్డి

నారాయణ రెడ్డి

----------------------------


రూపమా అది అనంత విశ్వ0

కలమా అది సర్వజన హితం

గలమా అది సంగీత లయ విన్యాసం

తెలుగును వెలిగించి

ఖండాంతరాలలో ప్రవచించి

తెలుగును జాతిని విస్తరించి

తెలుగు ప్రజలను జాబిలి వెన్నెల్లో విహరింప జేసి

తెలుగును వెన్నముద్దలా తినిపించి

మనసును మైమరిపించి

తనువును ఆయాలలూగించి

గులేబకావలికథతో సినీరంగా

ప్రవేశం చేసి

మధురాతిమధురమైన గీతాలెన్నో లిఖించి

రచనలలో కొత్త పుంతలుతొక్కినావు


పుట్టుక హనుమాజీపేట

కవితలతో పెరిగినాడు తెలుగునాట

ఆయన కవితలు మధుర వూట

మోములో ఉండదు చిటపట


వదనం సరస్వతీ సదనం

కవనం మందార మకరంద వనం

గళం మాధుర్య మధురస సలీలం

పంచకట్టుతోనే ఏచ్చోటికైనా పయనం


తెలుగుభాషకు తేనెలద్దినాడు

ప్రాసలతో పండిత పామరుల మెప్పించినాడు

క్రొత్త పుంతలతో గజళ్లు ఫజల్లా

నొదిలినాడు

పద్మవిభూషణ్ చేపట్టి పరవసించినాడు

కర్పూరవసంతరాయలతో 

ప్రేమకథ నాయకుడైనాడు

ఏకవీరతో ఎవరెస్టు శిఖరమైనాడు

మంటల మానవుడుతో మనిషిలోని మాలిన్యాని కాల్చాడు

విశ్వ0బరతో జ్ఞానపీఠమెక్కాడు

తెలుగు ఉర్దూ భాషలకు వారదైనాడు

తెలుగు రాష్ట్రాల జన హృదయాలయంలో నిలిచాడు

అతడే మన సి.నా.రె

కవి లోకానికి భళారే!!

                  కవిత వేంకటేశ్వర్లు

కర్నూలు.....8309920625

పై కవిత నా స్వంత రచన అని

హామీ

&&&&&&&&&&&&&&&&&&

18

[12/06, 8:12 PM] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: శీర్షిక:-

సరస్వతీ పుత్రులు సి.నా.రె

..................................

సాధారణ రైతు కుటుంబంలో  జన్మించినా

అసాధారణ ప్రతిభ చూపి

జానపదాల నుంచి జ్ఞానపీఠం వరకు హిమాలయమంత ఎత్తు ఎదిగిన సి .నా. రె.

మీ కివే శతకోటి వందనములు......!!


బాల్యంలోనే సుశీలమ్మను

ధర్మపత్ని గా స్వీకరించి

నలుగురు కుమార్తెలకు 

గంగ, యమున, సరస్వతి మరియు కృష్ణవేణి అని నామకరణం చేసి  ఆర్షధర్మమే నా ఆదర్శం

అని చాటిన సి.నా. రె.

మీకు శతకోటి వందనములు.......!!


విశ్వంభర కావ్యంతో

జ్ఞానపీఠం పురస్కారాన్ని పొంది విశ్వానికే తెలుగుభాష మధురిమను అందచేసిన మహనీయులు.

భారతదేశాభాషలలోనే గాక

పాశ్చాత్య భాషలలో మీ రచనలు అనువదింపబడటం తెలుగుజాతికే గర్వకారణం.

స్రవంతి సాహిత్య మాసపత్రిక సంపాదకునిగా

సేవలందించిన సాహితీమూర్తులు.

పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ ,అత్యున్నత జ్ఞానపీఠ  వంటి ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలకే

వన్నె తెచ్చిన  సి.నా. రె

మీకివే శతకోటి వందనములు......!!


భారతమాతకు జేజేలు

బంగరు భూమికి జేజేలు అన్న,

నన్నుదోచుకొందువటే వెన్నెల దొరసాని అన్న,

అన్నయ్యసన్నిధి అదేనాకు పెన్నిధి అన్న

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం  అని

మూడువేల సినీగీతాలను వ్రాసి సినీప్రపంచంలో రారాజు గా నిలచిన

సి.నా. రె.మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సాక్షాత్తు సరస్వతీ పుత్రులే .అందుకోండి

మీకివే మా శతకోటి వందనములు......!!

..............................

పేరు:-

 కవిమిత్ర, సాహిత్యరత్న

ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి.

విశాఖపట్నం

చరవాణి:-9963265762

.................................

19

[12/06, 8:26 PM] +91 94904 14273: *మన సినారే*

అచ్చమైన తెలుగు కడప,

అక్షర లక్షణ కోవిదుడు,

పాటలా పూతోట, 

బహు గ్రంథ లా తోటమాలి,

గజ మంత ఏత్తూ పురస్కార లా అద్దం,

తెలుగు తేజపు మరో రూపు,

చిత్రలేఖ పు మరో బ్రాహ్మ,

మనసెరిగి న మగమహారాజు,

తెలంగాణ తెగింపు బిడ్డ,

సకల కలల కోవిదుడు,

మాటలతో జనానికి మంత్ర దండం,

చిత్ర సీమలో ఓ కలికితురాయి,

అందాల  చందమామ,

సహనానికి సరిహద్దు మైలు రాయి, 

యాస గునపాలు దింపే రైతు,

కవిలోక పూ నిట్టాడు

మర్యాద పూ మరో రామన్న,

20

[12/06, 8:33 PM] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) 

సినారె వర్ధంతి సందర్భంగా


పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్

ఊరు: కర్నూలు

చరవాణి:9505152560

************************


 *సాహిత్య సవ్యసాచి*


సత్యనారాయణ వ్రత ఫలం

సత్యం జీవితంలో జీర్ణించుకొని

నారాయణుడు సాహిత్యంలో

ప్రభవించె సరస్వతీ మానస పుత్రుడు..


విభిన్న పార్శ్వాల కదలిక

ఉర్దూ తెలుగు సంస్కృతం

ఔపోసన పట్టిన ఆచార్యుడు

విద్యా వికాసపు మచ్చు తునక


పంచెకట్టు లాల్చీ కండువా ఆహార్యం

తెలుగుదనపు నిండు విగ్రహం

కవి భూషణంకు ప్రతీక

కృతి ధృతి ఆకృతి నీవని

రాగాల రసధుని

శివరంజని రాగ మాలిక


వివిధ ప్రక్రియలలో

సృజించిన సాహితీ సవ్యసాచి

జానపదులు మొదలు వెండితెర జిలుగులు

అలరించే జీవఝరీ గమనమై..


సాహితీ వినీలాకాశంలో

తళుకు బెళుకు పాలపుంత వలె

విరాజిల్లెనతడు

విశ్వంభర చరితార్థుడు

జ్ఞానపీఠ మధిరోహితుడు!


తెలుగు ప్రజల నాల్కల మీద నిత్యం

ప్రశంసలందుకున్న 

కవి కర్పూర కళిక

సినారె నీకు జోహార్లు!!

      ***


        హామీ పత్రం


     ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.

          ఇట్లు మీ

సయ్యద్ జహీర్ అహ్మద్

21.

[12/06, 9:14 PM] +91 88015 26321: అశం:డా సినారె వర్ధంతి సందర్భంగా

కావ్యగానం

శీర్షిక: తెలుగు తేజం సినారె

రచన: బి నాగేశ్వరరావు 8801526321


అతనొక నిప్పు కణం

వెలిగించని వజ్ర శకలం

తెలుగులొ వెలిగిన కలం

సినారె ఒక కావ్యజలం!!


అభ్యుదయం అతని పొలం

శబ్ద సౌరభం అతని హలం

విశ్వంభర  తను నాటిన అంకురం

జ్ఞాన పీఠం అతని కొచ్చిన ఫలం!!


అతనొక  త్రిభాషా త్రిశూలం

ప్రాసల సినీ పాటల ప్రవాహం

ఉర్రూతలూగించే గజల్ సమాహారం

మది దోచే మధుర రాగాల సుస్వరం!!


నవ్వని పువ్వుఅతని తొలి ప్రచురణం

సాహిత్య భారతి కొక అలంకారం

కర్పూర వసంత రాయలొక మందారం

మంటలు  మానవుడు విలువల తోరణం!!


వేష భాషలలో తెలుగు తనం

యువ కవులకు చేయందించే గొప్ప గుణం

మనసు మాత్రం తెలంగాణా మగాణం

కావ్య రతనాలు పాఠ్య గ్రంధాలైన మగతనం!!


పద్మశ్రీ , పద్మభూషణ్ లకు భూషణం

పదవి, పురస్కారాలకు స్వర్ణ సింహాసనం

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలుగు తేజం

ఆధునిక కవులకు సినారె ఒక మార్గదర్శకం!!


ఇది నా స్వీయ రచన అనుసరణ,అనుకరణ కాదని

తెలియజేయు చున్నాను

బి నాగేశ్వరరావు వైజాగ్ 8801526321

22

[12/06, 9:18 PM] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2).       12--6--2021.

పిన్నక నాగేశ్వరరావు.


అంశము:-- సి.నా.రె.కు నివాళి.


1. తేటగీతి.

తెలుగు భాషలో దాగిన తీయదనము

వివిధ ప్రక్రియలందున వెలికితీసి

తెలుగు సాహిత్య శోభను దేశమంత పరిఢవిల్లగ జేసిన పండితుండు.


2. తేటగీతి.

పద్య కావ్యములనె కాదు గద్య కావ్య

ములను నవలీలగా వ్రాసె మోదమలర

చేసి"విశ్వంభర" రచన వాసిగాంచి

జ్ఞానపీఠము నెక్కిన ఘనుడతండు.


3. తేటగీతి.

ఇతర భాషలౌ యుర్దున, హిందిలోన

యెన్నియో రచనలు చేసె మిన్నగాను

సకల పండితలోకము సన్నుతించ

పేరుగాంచె సి.నా.రె. కోవిదుడు గాను.


4. తేటగీతి.

చలనచిత్రాల కెన్నొ పాటలను వ్రాసి

క్రొత్త యొరవడి దిద్దిన యుత్తమ కవి

తప్పక దివిని సాహితీ తార వోలె

వెలుగు చిమ్ముచు సతతము నిలిచియుండు

నట్టి సాహితీవేత్తకు నంజలింతు.

**************************************

23

*కవితా గానం సీజన్ 2*

*******************************

*పేరు:వనపర్తి గంగాధర్*

ఊరు:హన్మకొండ

చరవాని:9440146435

*శీర్షిక:విశ్వనరుడు*


రైతు కుటుంబంలో పుట్టిన కైతల రైతు సినారె

సామాన్య కుటుంబంలో జన్మించిన అసామాన్యుడు

సరస్వతమ్మ ఒడిలో అక్షరాలతో ఆడుకున్న అక్షరశిల్పి

ఎన్నో మహా కావ్యాలకు శిల్పాక్షరాలు దిద్దిన చిత్రకారుడు


'పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికంటూ'

మనిషిలోని స్వార్థాన్ని ప్రశ్నించిన నిస్వార్థవాది

నల్లని రాళ్లతో గుండె సవ్వడిని ఆలకించినవాడు

సమతా భావన కోసం అక్షరాలు సంధించిన అభ్యుదయవాది


సమాజపోకడలపై కవితాక్షరాలను సంధించిన సవ్యసాచి

అతని కలానికి రెండు వైపులా పదునే ఒకటి ప్రాణాయమైతే రెండోది హృదయం

వచనమైన పాధ్యమైనా సంధించడమే తెలుసు

అది శరాఘాతమో ,పులవర్షాన్నో కురిపించేది


మానవత్వ విలువలను కావ్యాలుగా మలచి

కమ్మని కోయిల పాటల ఝంకారాన్ని ఆలపించాడు

సినారె సింగిడి అందం నీ కావ్యాలు

నవరస భరితం నీ అక్షర అమృతాభిషేకాలు


తెలంగాణా మాగాణంలో అక్షరాలు చల్లి

కవన సేద్యం చేసిన రైతు కవివి

సాహితీ లోకానికి పద్మ భూషణుడివి


తెలుగు భాషకు తేనె సుదలొలికించిన

తెలుగు భాషామ తల్లి ఒడిలో మణిహారం

ఆధునికాంధ్ర సాహిత్యాన్ని గగనసీమలో

విహరింప చేసిన కళాప్రపూర్ణుడివి


ఓ తెలంగాణ ముద్దు బిడ్డ నిన్ను మరువదు ఈ గడ్డ

బహుముఖ ప్రజ్ఞాశాలివి అతిరథ కవితా విశారధుడివి

ఓ విశ్వంభరమా,ఓ జ్ఞానపీఠమా

ఓ సింగిరెడ్డి నీకు వంగి దండాలర్పిస్తున్నాము

హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన

24

అతని కవనం

పగలే వెన్నెల జగమే ఊయల

అతని గీతం జలపాతం


అతని కవిత లయాత్మకం

అతని అక్షరం మంటలు మానవుడు నవమి చిలుక మిగిలిపోతాడు


అతని అక్షరాల గవాక్షాల ని వినియోగించుకో లోకాన్ని చూడు లో చూపులతో



అతను హనుమాజీపేట మట్టిబిడ్డ బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతుల ముద్దుబిడ్డ


తెలుగు కవిత ఓజస్సు తేజస్సు అతని రచన

హరికథలు జానపద పాటలు చేన్లో పాడుకుంటూ తిరిగిన సినారె సినిమా పాటలు

హుషార్ ఎక్కాడు



మాటలో ఏముంది నా పాటలో ఏముంది విశ్లేషణ చేశాడు


తన గీతాలతో ఉర్రూతలూగించాడు


కవిత్వం తీరని దాహం లాగా అనేక రచనలు చేశాడు 70 కావ్యాలతో విరాజిల్లువాడు



మట్టి మనిషి ఆకాశం భూమిక లో లో ఏముందో చూడమన్నాడు



అధికార భాషకు పట్టం కట్టి అధ్యక్షుడయ్యాడు


నడక నా తల్లి సమత నా కవిత విశ్వంభర తో జ్ఞాన పీఠాన్ని కైవసం చేసుకున్నాడు 1988లో


గాంధీ మార్టిన్ లూథర్ లెనిన్ క్రీస్తు అబ్రహం లింకన్ ఇలా ఎందరో మహానుభావులను విశ్వ ఆకాశం పై నిలిపిన కవిత ఉత్తముడు మహనీయుడు


సినారె పాఠాలు చెబితే పక్క క్లాసులో ఉన్న విద్యార్థులు పరుగులు పెట్టి వినడానికి కిటికీ లోంచి తొంగి చూస్తూ వినేవాళ్ళు


ఆయన ఉపన్యాసం అసామాన్యం ఆయన రస భావాల మేళవింపుతో కూడిన వాక్యం రసాత్మకం కి నిలువెత్తు నిదర్శనం అతని సంతకం తెలంగాణ సాహితీ భూమిక పై నిలిచిపోయే మధుర గీతం


యాస భాషలకు 

వచ్చాడన్నా వచ్చిందన్న వరాల తెలుగు తెచ్చిందన్న


ఆయనకే చెల్లు


కళాపూర్ణుడు రాజ్యసభ సభ్యుడు పద్మ విభూషణ్


పద్మశ్రీ కేంద్ర సాహిత్య అకాడమీ ఇలా ఎన్నో నో

పురస్కారాల పరంపరతో నిలిచిన తెలంగాణ సాహితీ కేదారంలో 

పసిడి కలువ సినారె మర్చిపోలేని జ్ఞాపకాలను చలోక్తులు విసిరినా జలపాతం నిరంతరం తరం తరం సినారె నిలిచే 

కవన బేరి

25.

*


 *ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  గారి వర్ధంతి సందర్భముగా *

 కవితా గానం

 తేదీ :12/ 6 /21 

అంశం:బాల సుబ్రహ్మణ్యం

శీర్షిక:  సుస్వరాల చక్రవర్తి

----------------------------


తెలుగు సినీ ప్రపంచానికి  కోదండపాణి   అందించిన మర్యాదరామన్న మన

సుస్వర సంగీత బాలు(డు)!!

 "నెత్తి మీద నీలి తెర నుండి కాళ్ళ కింద ధూళి పొరకు"

సౌదామిని సింగిరెడ్డి వారింటికి 

వచ్చిందో కాంతి కిరణం, కర్పూర వసంతరాయలు


 "మట్టిమనిషై "అక్షర సేద్యం చేసి 

మణులు పండించిన మహాకవి 

పలుకు  పలుకులో పలికే

 పల్లవించే పదముల  పరిమళ పుష్పాలు

 కరీంనగర్ ను కవితల నగరంగా 

మార్చిన కవితా రారాజు

 "హనుమాజీపేట" కు "నారాయణ రెడ్డి పేట" గా

 గుర్తింపు నిచ్చిన గురు విద్వన్మణి


 విజయకేతనం తో "విశ్వంభర " చుట్టివచ్చి 

" పంచె కట్టుటలో ప్రపంచాన మొనగాడు 

కండువా లేనిదే గడపదాటని వాడు ,

 ఎవడయ్య ఎవడు వాడు ?

 ఇంకెవడయ్యతెలుగువాడు"

 అంటూ పంచకట్టు ,కండువాతో 

మూర్తీభవించిన తెలుగు తనంతో

 జ్ఞానపీఠమెక్కిన   విజ్ఞాన గని 

అక్షర సిరి గంధపు మణి 

కవితా సుగంధాలు  వెదజల్లి కనుమరుగైతే 

మూగవోయింది కవితా కోయిల


విషాద , ప్రేమ , మాస్ బీట్స్ , సందేశాలు,

  గాత్రానుకరణ నటనలతో ప్రాణప్రతిష్ఠ చేసి

ఇరవైతొమ్మిది నందుల పొందిన చరితార్థుడు

ఆ స్వరం ఏ స్వరాన్ని పలుకరించదు?

క్లాసికల్ పాటలతో 

"విశ్వనాథ" "శంకరాభరణం"  సుస్వర సంగీత చక్రవర్తికి తొలిసారి జాతీయ ఉత్తమ గాయక మణి కిరీటం!!


ఆ స్వరం పరవశింప చేసిన భక్తి పాటలు 

ఇంటింటి వేకువ నాదాలు 

అత్యధికంగా పాటలు పాడిన ఏకైక గాయకుడు 

గిన్నిస్ రికార్డు సాధించిన  స్వర చక్రవర్తి!!


మిథునం చిత్రంతో తన నటనతో

"నభూతోనభవిష్యతి" అనిపించి 

ఇంటింటా ప్రతి ఒక్కరి 

గుండెగూటిలోని దీపం  అయ్యారు బాలు!!11


ఆ స్వరం మూగపోయింది భువిలో

ఆనందించేవారు  ఇప్పుడు  ఆ దివిలో

ఆస్వాదిస్తారు

సుస్వరాల చక్రవర్తి ఎస్పీ బాలు గాత్రం!!

-------------------------------

*మన్నె పిన్నక లలిత*

26.

[13/06, 8:06 PM] Kompelli Ramaiah Poet Kmm: అంశం: అతనొక విశ్వంభరమంత జ్ఞానపీఠం...!

_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

చరవాణి:7032504646

అతనొక విశ్వంభర మంత  జ్ఞానపీఠం

అతనొక కర్పూర వసంత రాయలు రాజసం

అతనొక సాహితీ పద్మ భూషణం

అతనొక సుశీల గుణ సంపన్నం...!


అతని కలం విభిన్న కృతులకు సాక్ష్యం

అతని గళం గజళ్ళ గజరాజస గాంభీర్యం

అతని బలం భూగోళమంత  మానవత్వం

అతని దళం కలిసి నడిచే వ్యక్తిత్వం...!


అతని పద్య గద్య కావ్యాలు రాగ ఝరీ  తరంగం

అతని హృదయం గంగ యమున సరస్వతి కృష్ణవేణి ల సంగమం

అతని వర్ణన అజంతా సుందరి యవ్వన సౌందర్యం

అతని చలన చిత్ర గీతాలు తేనె తీయని మధురాతి మధురం...!


అతని తపస్సు వసుధైక కుటుంబమంత సంక్షేమం

అతని తేజస్సు అక్షర మాలల ఉషాకిరణం

అతనే...

మల్లారెడ్డి బుచ్చమ్మ ల ముద్దు బిడ్డ పౌర్ణమి నాటి చంద్రుడు

సింగిరెడ్డి నారాయణరెడ్డి సి నా రే  నామధేయూడు...!

హామీ పత్రం

ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

27.

[13/06, 8:08 PM] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్‌ 2)

" డా. సి.నారాయణ రెడ్డి గారి ఘనత"


సీ!  విశ్వంబరుడుగాను  వినుతికెక్కె సినారె

జ్ఞానపీఠమునకు  ఖ్యాతిదెచ్చె


సాహితీరంగాన  సత్కేర్తి గాంచెను

కవితాదురంధుడు  కలము నెత్త


ఆధునికతయంత  నందల మెక్కగ

గేయకావ్య రచన  చేయ సాగె


రాటుదేలెనితని   రామప్ప ఘనతంత

నభినవ శ్రీ నాధు  డనగ పొగడ


ఆ!  చిత్ర సీమలోన  చిగురించి గీతాలు

వెండి తెరకు జిమ్మి   వెలుగు లన్ని

ఘనత నొందె యితని  ఘనమైనగీతాలు

మధుర కవిత లల్లె  మనసి నారె!

           తరణికంటి సూర్యలక్ష్మి.

                     ------------

డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453

28

కవనజ్యోతి 

తేది:12-06-2021

అంశం సినారె 

కవి పేరు: కట్టెకోల చిన నరసయ్య


 తెలుగు సాహిత్యంలో

 అన్ని ప్రక్రియలకు

 ప్రతిరూపమైన వాడు

 నవరసాల మాధుర్యాన్ని

 మేళవించిన వాడు

 ఉర్దూను మర్దన చేసి

 తెలుగు తీయదనాన్ని

 పంచిన వాడు

 తెలుగు భాషను

 పల్లకిలో పవళింపు చేసి

 ఊరేగించిన వాడు

  అక్షరాల ఆటలలో

 పాటల పూతోటల తోటమాలి

 గజల్లతో తెలుగు భాషను

 గలగల పారించినవాడు

 బహుముఖ ప్రజ్ఞాశాలి

 ప్రపంచానికి చాటిన ప్రపంచపదులు

 విశ్వవ్యాప్తమైన విశ్వంభర కావ్యం

 సినారెను వరించిన జ్ఞానపీఠ అవార్డు

 ఆచార్యులుగా సినీగేయ రచయితగా

 అందరి మనసులను చూరగొన్న మహాజ్ఞాని

29.

కవనజ్యోతి కవిసమయం


అంశం: సినారే కవితలు

రచన: గాజుల భారతి శ్రీనివాస్

ఊరు: ఖమ్మం

చరవాణీ: 9849788108

శీర్షిక:సాహితీ శిఖరం

సినారే





బహుముఖ ప్రజ్ఞ

కవి,,పాటల రచయిత,, అనువాదకులు,,పరిపాలనా దక్షులుగా అన్నింటా సింహభాగం..

సినారే - భళారే


వన్నె చిన్నెల కలం

కవితాధార ప్రవాహం

వచన కవిత్వానికి

నాజూకు నడక నేర్పిన నేర్పరి

అష్టాదశ సారంగదుడు

అనన్య సాహిత్య కృషీవలుడు


సినారే పదాలు పరిమలించే కుసుమాలు

తెలుగులో గజళ్ళు ఒదిగేలా చేసిన ఘనుడు

సురుచిర సుందర తీరాలకు

రసరమ్య రమణీయ తావులకు దారిచూపే మహాఘనుడు..


నవ్వని పువ్వును నవ్వించిన వాడు

తెలుగుదనం ఉట్టిపడే

సరస్వతీ పుత్రుడు

రసరమ్య రాగాల రాఘవుడు

మాధురాతి మధుర గేయాల ఘనుడు

సినారే...

.భావవిస్తుతి ఆకాశమంతా...

వైశాల్యం సముద్రమంతా లోతైన..

అనితర సాధ్యుడు

నవీన కవిత్వ కవిచంద్రుడు


సింహద్వారం గుండా

వెండితెర పరిచయమై పాటలు పరుగులు పెట్టించే గానగంధర్వుడు

తెలంగాణ కీర్తి

మనిమాణిక్యాల దీప్తి

హృదయాంతరాల స్ఫూర్తి..

సినారే..తెలుగు వైభోగాల క్రాంతి

తెలుగు గజళ్ళ సొగస్సు

చమత్కారాల విరస్సు

విరహాల తపస్సుల సుప్రసిద్ధుడు


సినారే..

ప్రతీ పాట ఒక కర్పూర కళిక

రచనలో... అగ్నివిరజిమ్మడం..

అమృతం కురిపించడంలో.. ఘనాపటి

అనంత జీవితసత్యం

విశ్వరంభరతత్వం

సినారే..మనసపుత్రిక!

నన్నుదోచుకుందువటే.. పాటతో హృదయాలను దోచిన హృదయచోరుడు.

ఏమా సినారే..ఏమేమి రాసినరే.!!

అని సాహితిలోకంలో మాటలను...పాటలను పరుగులు పెటించిన చీరస్మరనీయుడు

జానపదం అయిన

జ్ఞానపదం అయిన అలవోకగా రాసే రసరాజ ఘనుడు

మాటల మాంత్రికుడు

అనితర సాధ్యుడు

సాహిత్య కృషీవలుడు

పద్మశ్రీ,పద్మభూషణ్

జ్ఞానపీఠ అవార్డు బిరుదాంకితుడు

సినారే గా ప్రసిద్ధుడు

చిరస్మరనీయుడు!!


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

******************

30

అంశం. డా' సి. నా. రె. 

శీర్షిక. సాహిత్య కిరణం

చైతన్య జలపాత సవ్వడులతో విప్లవ జ్వాలల వేడినీ రంగరించిన కవీశ్వరుడు! 

కమ్మనిసినీ పాటల గేయరచయిత! 

తెలుగు సాహిత్యంలో వన్నెలు వచ్చిన సాహితీవేత్త! 

సాంఘిక నాటక రచనా కర్త! తెలుగు వెలుగు 

నవ్వనిపువ్వు నవ్వించిన అఖిలాంధ్రకవి! 

విశ్వంభర ను విశ్వానికి అందించిన మేధావీ! 

జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రజ్ఞాశాలి! 

పద్మశ్రీ పద్మ భూషణ్ బిరుదాంకితుడు! 

కవితలుజలపాతం గా

కుమ్మరించే

  కవితా ప్రవాహం! 

స్రవంతిమాస పత్రికను నడిపిన

సాహితీ కిరణం! 

'కలసి నడచే కలం' తోపయనించిన

తెలుగు భాషాభిమాని

కవితాలోక స్ఫూర్తి ప్రదాత! 

సాహిత్య

మదురిమలతో

ఓ స్వర్ణయుగ

మందించిన

సొగసరి. 

సుగుణ మద్దిరెడ్డి 

ఐలవారిపల్లె 

ఐరాల 

చిత్తూరు జిల్లా 

ఇదినా స్వీయరచన.

31

*కవితా గానం*

తేదీ:12-06-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: సినారె వర్ధంతి సందర్భంగా

శీర్షిక: అజరామరుడు

******************

ఆయన *భూగోళమంత మనిషి* 

 *విశ్వంభరుడై*  వెలిగిపోతూ

 *మట్టి మనిషి ఆకాశం*  

ఈ ముగ్గురి బంధం  ఎంత గొప్పదో

 *కలం సాక్షిగా* చెప్పిన మహోన్నత *వ్యక్తిత్వం* ఆయనది..

 *కలిసి నడిచే కలం* తో

 *తేజస్సే నా తపస్సు* అంటూ అక్షర యజ్ఞం చేస్తూ

 *కొనగోటి మీద జీవితము* ను

తనదైన *దృక్పథం* తో

గడిపిన పద్మ భూషణుడు!

ఆయన చేతి నుండి జాలువారిన అక్షరాలు

 *కర్పూర వసంత రాయలై* ఠీవిని ఒలికిస్తూ

 *విశ్వనాథ నాయకుడై* 

ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ

 *నాగార్జున సాగరమంత* నిండుగా

గడుస్తున్న జీవితం పై

వాక్యాల *రెక్కల సంతకాలు* చేసి

మధ్య తరగతి మందహాసంతో

మనుషుల్లోని కోరికల *మంటలూ లో- మానవుడూ* 

ఎలా  రగిలి పొగిలి పోతున్నాడో

 *మనిషి* లోని - ప్రాణ *చిలుక*  ఎగిరిపోయే దాకా

మృత్యువుతో *ముఖాముఖి* పోరాడాల్సిందేననీ 

జీవన సత్యం తెలిసిన వాడు!

 ఒక్కరోజు కవిత రాయకపోతే

ఏసీగదుల్లో ఉన్నా

ఉక్కపోతగా ఉంటుందని

 చివరి క్షణం వరకు సాహిత్య సృజన చేసిన మహానుభావుడు!

తనదైన శైలిలో సినిమా పాటలు రాసి

శ్రోతల హృదయాలను గెలుచుకున్న సినారె..

 అజరామరుడు..

సాహిత్య చరిత్రలో మరణం లేని రవి కిరణం సినారె


 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

32.


కవితాగానం 

సి. నా. రె వర్ధంతి సందర్భంగా....

ప్రత్యేక కవిత 


శీర్షిక :కావ్యసిరుల సినారె



మానేరు తీరాన

సాహిత్యపు మాగాణి

మణిగా 

వెలిగావు 

నిరంతర అక్షరసేద్యంతో 

కావ్య సిరులను

పండిస్తూ....


సినీవాలి అంబరంలో

నిత్యం సంబరాల

నలదావు 

పాటల సింగిడీలెన్నెన్నో 

విరబూయిస్తూ...


ప్రణయకోనల్లో పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తున్న జలధారలను

మానవీయ కోణపు దారుల్లోకి మళ్ళించి 

ప్రగతిశీలపదమయ్యావు 

ఆక్షేపణల చిరుఅలలనంపుతూ....


నవ్వనిపువ్వుకు నటనలు నేర్పి

జలపాతాల విశ్వగీతమయ్యావు

సంగీతనృత్యాలను

సమ్మిళితం చేస్తూ....


సాహితీసృజనల కవనబ్రహ్మవై

హృదయపుకోవెల లో

నిలిచావు 

పద్మభూషణంతో 


జ్ఞానపీఠకిరీటంతో 

విశ్వంభరుడవై  వెలుగుతూనే ఉన్నావు

నల్లని రాళ్ళలో 

నీలి మేఘాలలో

అక్షరం లో..

అణువు అణువుననీవై...

********లలితా కృష్ణ

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧