మాతృ భాష 21022022
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**********
కవివరుల జాబితా
1.అపరాజిత్ గారు
2.సింహాద్రి వాణి గారు
3.
4.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
5.పిన్నక నాగేశ్వరరావు గారు
6.డా.బల్లూరి ఉమాదేవి గారు
7.
8.ముత్యం వెంకటేశ్వర్ రావు గారు
9.మద్ది పుల్లారావు గారు
10.అంబటి నారాయణ గారు
11.శివునూరి లలితా కృష్ణ గారు
**********---
1
ఆశల జీవితం!
ఆశలు వదులుకున్న జీవితం
ఆత్మీయులంతా దూరమై
పదుగురి మధ్య బికారినై
వయస్సు నీడలా మీదపడుతూ
కలలలో కనిపించని లోకాలేవో చూస్తూ
విషం తలలో నింపుకున్న కోడెనాగులు
గుండెలు కంపిస్తూ భయకంపితుడనై
గుడ్డి దీపం వెలుగుల్లా కనుల బాసలు
రాత్రి దయ్యాల్లా నీడలు పరచిన భవంతులు
పగిలిన గుండెల్లా పగల్లు వెక్కిరిస్తూ,,,!
హృదయం నిండా ప్రేమ నింపుకుని
కవ్వింపుల విశాదాలను వదిలించుకుంటూ
ఆశల ఆరాటాలలో విరిసిన పూల మొగ్గలు
పండుటాకులు రాలిపోనీ కొత్త చిగుళ్లు మొలుస్తాయి కదా!
నిరాశ నీడలో ఆశల పొదరిల్లు కట్టాలి
వెండితెరపై వెలిగే తారల్లా
జీవితంలో ఆశల ఆనందాల హరివిల్లు విరియాలి
ఆత్మీయులంటూ వుంటే నీ హృదయం నీదైతేనే
ఉల్లాసంగా సాయం సంధ్య అలా వడి వడిగా నడుస్తూ
పడమటి సంధ్య ఎరుపెక్కిన వెలుగుల్లో
నీ నిరాశను ఎర్రని సూరీడు మింగుతూ మటుమాయం!
ఆశాజీవికి అన్నీట్లో రత్నాల వెలుగులే అగుపిస్తాయి!
ఈ ప్రపంచంలో ఆశ లేని జీవికి జీవం లేదు!!
అపరాజిత్
సూర్యాపేట
2
మాతృభాషా దినోత్సవం సందర్భంగా
గజల్
దేశభాషలందెల్ల ఘనమైనది తెలుగు భాష
రూపురేఖ లందు చూడ సొగసైనది తెలుగు భాష
కవుల ఋషుల కావ్యాలకు ఊపిరులను పోసినదీ
పురాతనా గ్రంథాలకు నెలవైనది తెలుగు భాష
పద్య గద్య పాటలతో నిండి వుంది దండిగాను
ఎన్నెన్నో ప్రక్రియలలొ కొలువైనది తెలుగు భాష
కడుపులోన వున్నపుడే విన్నాములె మధురంగా
సుమతావీ పరిమళాల యింపైనది తెలుగు భాష
నీతి న్యాయ ధర్మాలను బోధించే గ్రంథాలను
కొల్లలుగా కలిగియుండి విలువైనది తెలుగు భాష
తెలుగునేల జన్మించిన వారి జన్మ ధన్యమేగ
అమ్మపాల స్వచ్ఛమంత తేటైనది తెలుగు భాష
మాతృభాష మించి మనకు లేదేదీ సింహాద్రీ
భాషలెన్నొ నేర్చుకొనను మాతైనది తెలుగు భాష
3
భాష యన్న గౌర వముకల వాడభి
వృధ్ధి కొరకు తాను కృషి చేయు
బాట వేయు మనకు భాష అందముగను
మాతృ భాష నేర్పు మంచి మాట
మాతృ భాష నెపుడు మరువకుండుట మేలు
కన్న తల్లి లాగ కంటి రెప్ప
లాగ రక్ష గాను లక్ష్యముతో నుండు
భాష నొసగు మనకు భావ లహరి
4
: మాతృ భాషా దినోత్సవం 20022022
శీర్షిక... *అమ్మ మాట*
స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
వేదిక... తెలంగాణ సారస్వత పరిషత్తు
డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరం.
బొగ్గుల కుంట హైదరాబాద్
****************************************
అమ్మ మాట... అదే అదే అమ్మ భాష
ఆప్యాయంగా ఊ..ఊ..ఉంగ ఉంగ అంటూ
ఉగ్గు పాలతో రంగరించి చూపుడు వేలితో ...
నోరు తెరిచి పోసిన అమృతం.....................
అమ్మ మాటలు నేర్పి తలకెత్తిన సుమధుర మాటల ముత్యాల మూటలు
ఏడ్చినా నవ్వినా పలవరించినా కలవరించినా
అప్రమేయంగా వ్యక్తమయ్యేది మాతృభాషలోనే
అంతరంగంలోని ఆలోచనలు... ఆచరణాత్మక
ప్రణాళికల ప్రాముఖ్యతను స్పష్టంగా వ్యక్తీకరించే
వెసులుబాటు ఉన్న... వెన్న లాంటి మృదువైనది అమ్మ భాషే
అలాంటి భాష ఆపదలో అల్లాడుతోంది
ఒడ్డున పడ్డ చేపలా
మొసలి పట్టిన గజేంద్రుడిలా గజ గజ లాడుతోంది
గిల గిలాకొట్టుకుంటోంది కొన ఊపిరితో... ఇంగ్లీషు అనకొండ నోట చిక్కి
వచన పద్య గద్య అవధాన ప్రక్రియలతో చల్లని వెన్నెల హాయిని గొలిపే మంజుల మనోజ్ఞ మాతృ భాష .....
మరణ శయ్యపై మూలుగుతోంది
సంజీవని చికిత్సకై ఎదురు చూస్తోంది...
అందరూ వైద్యులే కదలమంటోంది కనికరంతో
మాతృ భాష పలకరింపుకే కాదు
సంస్కృతి సంప్రదాయాలు సంస్కారానికి....
ప్రతి బింబం
అందుకే
కదలాలి కదన రంగానికి.... చేయాలి ఉద్యమాల యుద్ధం.... మాతృ భాషా సంరక్షణకు...
వ్యక్తులు శక్తులై ప్రతి గుండెను తట్టాలి...
సంస్థలై వెలసి సమాజాన్ని అనుసంధానించి
మాతృ భాషా ప్రాశస్త్యం ప్రభోదించి పరిరక్షించాలి
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
20022022
5
[21/02, 6:02 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: అంశము :-- మాతృభాషా దినోత్సవం.
పిన్నక నాగేశ్వరరావు. 21--2--2022.
1. తే.గీ.
దేశ భాషల యందున తెలుగు లెస్స
యనుచు రాయలు కీర్తించినట్టి భాష
యమృతమును మరపించెడు నమ్మ భాష
తేనె లూరెడు తీయని తెలుగు భాష.
2. సీ.
యతియు ప్రాసలనెడు వ్యాకరణ నియమా
లున్న తెలుగుభాష యున్నతంబు
ఛందస్సు, గణములు పొందికగా నుండు
తెలుగు పద్యము తేట తేనె యగును
నయ్యలంకారాలు నాభరణాలుగా
కలిగిన పద్యమ్ము కమ్మనగును
నలరింప జేసెడు నవధాన ప్రక్రియ
మన తెల్గు భాషకే మకుటమగును
తే.గీ.
దేశ, పరదేశ మందలి తెలుగు వారు
మమ్మి, డాడీల సంస్కృతి మరచిపోయి
యొప్పుగా మాతృభాషా దినోత్సవమును
జరుపు కొనవలె నందరు సంతసముగ.
**************************************
ప్రపంచ మాతృభాషా దినోత్సవం
సందర్భముగా... ... ...
**************************************
6
[21/02, 7:14 pm] Aparajith: అమ్మ భాష!
పాల బువ్వ తిన్నట్లు
జున్ను పాలు తాగినట్లు
లేత కొబ్బరి తిన్నట్లు
లేగదూడ అంభా అన్నట్లు
ముద్దు ముద్దు మాటల పసిపాప
అమ్మ పాలు తాగుతూ హాయిగా
అమ్మ ఒడిలో నిద్దరోయినట్లు
వెన్నెల్లో ఆటలాడే పిల్లలు
ఉల్లాసంగా గంతులేస్తూ
పండు వెన్నెల జాబిల్లిని పట్టుకున్నట్లు
కమ్మ కమ్మని శీతాఫలాలు ఆరగించినట్లు
అమ్మ చేసిన కమ్మని అరిసెలు తింటున్నట్లు
జుంటితేనె జుర్రుకుంటున్నట్లు
చెట్టుపై జామపండును రామచిలుక
ముక్కుతో కొడుతున్నట్లు
ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటున్న పాప
పాలకోవా లాంటి అక్షర సముదాయాలను పలుకుతున్నట్లు
తీయ తీయని పలుకుల అమ్మదనం
కమ్మనైన తెలుగు భాష గొప్పదనం!
తంగెడు పూల లేత పసుపు స్వచ్చదనం
గోరెంట పూల అందాల మొక్కల్లా
గళగళ పారే సెలయేళ్ళు
తెలుగు నేల పులకరించేలా
రైతన్నలు చేసే సేద్యం
సుతారంగా సుతిమెత్తని తెలుగు భాష
నిలవాలి కలకాలం ఈ కమ్మదనం
నిన్ను కన్నతల్లి తెలుగు తల్లి
మరువకు మరియెప్పుడూ
తెలుగు భాష తెలుగు యాస!
అపరాజిత్
సూర్యాపేట
7
[21/02, 7:32 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
అంశం: తెలుగు భాష
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అమ్మ పాల వంటి కమ్మనైన భాష
కండ చక్కెర వంటి తీయనైన భాష
యుగములు మారినా వన్నె తరగని భాష
జగతిలో స్థిరముగా వెలుగుచున్న భాష
ఆత్మీయతను పెంచు అపురూపమౌ భాష
క్షరము కానీ అక్షరాలతో కూడిన భాష
ఆదికవి నన్నయ ను తీర్చిదిద్దిన భాష
తిక్క నాది కవుల ఖ్యాతి పెంచిన
పురాణేతిహాసాలను అందించిన భాష
పోతనాది కవుల నలరించిన భాష
కష్ణ రాయలను ఆంధ్ర భోజునిగా చేసిన భాష
అష్టదిగ్గజ కవుల నాదరించిన భాష
ఉగ్గు పాల తోడ నేర్చు నట్టి భాష
జోల పాట ద్వారా ఆలకించెడి భాష
వాగ్గేయకారుల నోట పాటైన భాష
అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్నందించు భాష
యాస ఏదైనా సుధలు చిందు భాష
విదేశీయులు మెచ్చి కీర్తించిన భాష
చిక్కని పాలపై పేరిన మీగడ లాంటి భాష
చక్కని అనుబంధాలను పెంచు అమ్మ భాష
మహిళల కరములందొదిగినట్టి భాష
పద్య గద్య ములందు పరిఢవిల్లిన భాష
ప్రక్రియ ఏదైనా గరిమ చూపెడి భాష
మధువులొలికించు మధురమైన భాష
అజరామరమైన మన అమ్మ భాష
నవరసాల నలవోకగా చిందించు భాష
తెలుగువారి వేడి వాడి తెలిపేటి భాష
జై తెలుగు భాష జై జై తెలుగు భాష
8
[21/02, 9:06 pm] +91 79978 40591: అంతర్జాతీయ మాతృభాషా
దినోత్సవాన్ని పురస్కరించుకొని
ముత్యం వెంకటేశ్వరరావు
గుంటూరు జిల్లా
చరవాణి: 7997840591
అంశం : " మాతృభాష కొరకు "
ప్రక్రియ: వచన కవిత
శీర్షిక: మాతృభాష మహోదయం కావాలి!
దేశభాషలందు తెలుగు లెస్స అంటూ..
ప్రముఖుల చేత మన్ననలు పొందిన
తెలుగుభాష కాన్వెంట్ చదువుల పుణ్యాన
మరుగున పడిపోయి మసకబారి పోయింది
తేనెలొలుకు మాతృభాష
మృత భాషగా మారింది
ఆనాటి వేమనపద్యాలు, సుమతిశతకాలు,
శుభాషిత రత్నాలు, పెద్దబాలశిక్ష లేవి?
మాతృభాష నశిస్తే మానవుని
జీవన వికాసం ఆగిపోతుంది
మాతృభాషను గౌరవిస్తే..
సృజన పురులు విప్పుతుంది
ప్రాథిమిక స్థాయి నుంచే విద్యార్థులు
మాతృభాష పరిరక్షణకు నడుం కట్టాలి
ప్రజలలో చైతన్యం తీసుకురావాలి
పరభాషను ప్రేమించి,లాలించి
మాతృభాషాపై మక్కువ చూపాలి
యువత తెలుగు సాహిత్యం చదవాలి
అన్ని రంగాలలో విజయం సాధించాలి
అమ్మపాల కమ్మదనం చూపాలి
మాతృభాష గొప్పదనం చాటాలి
తెలుగుకు వెలుగునిద్దాం..
సమిష్టి కృషితోనే మాతృభాషకు
మహోదయం కల్పిద్దాం..!
******************************
హామీపత్రం: ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను
9
[21/02, 9:13 pm] Maddi Pullarao Poet: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా
.........
శీర్షిక :తెలుగు ను వెలిగిద్దాం
........
మాతృభాషా దినోత్సవం
విశ్వజనులకిది మహోత్సవం
తెలుగు ప్రజలు తెలుసుకోవలె తెలుగు తెగువ
రెండు రాష్ట్రాల రాజనాల మన తెలుగు
తెలుగు గడ్డపై జన్మించుట వరం
తెలుగు భాషను మాట్లాడుట మన తపఃపలం
తెలుగు నువెలిగించు ఘనులకుపాదాభివందనం
పద్యాల మధురిమ మన తెలుగు
గద్యాల సరిగమ మన తెలుగు
అలంకారాల,ఆటవెలదుల మన తెలుగు
సంది,సమాసాల సవ్వడి మన తెలుగు
గుండెలోతుల్లోని భావాలు ప్రసరింపజేసే తెలుగు
కరుణను కలిగించేది తెలుగు
కవిత ను రప్పించేది తెలుగు
మనసులు మెప్పించేది తెలుగు
గలగల పారే సెలయేరు తెలుగు
జలజలపారే ప్రవాహం తెలుగు
సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం తెలుగు
నవరసాలొలుకు నవనవోన్మేషమైన తెలుగు
కవిత్రయ భారతం తెలుగు
పోతన కమ్మని భాగవతం తెలుగు
గురజాడ వెలుగు బాట మన తెలుగు
శ్రీ శ్రీ ,సి.నా.రె ల సిరివెన్నెల తెలుగు
గిడుగు తీర్చిదిద్దిన వ్యవహారం మన తెలుగు
సంభాషణల సౌందర్యం మన తెలుగు
దివిని,భువిని ఏకం చేసిన దేవులపల్లిమనతెలుగు
నందమూరి పోషించిన పౌరాణికం మన తెలుగు
ఆంగ్లకోరల్లో చిక్కుకుంది నేటి మన తెలుగు
మాతృభాష పరిరక్షణ మన కర్తవ్యం
తెలుగులో మాట్లాడుదాం
తెలుగు ఖ్యాతి ని పెంచుదాం
.......
మద్ది. పుల్లారావు
నందిగామ
9951287113
10.
"తెలుగు గొప్ప తనం"
పొగడరా మన తెలుగుతల్లిని...
పాడరా మన తెలుగుపాటని...
నిలుపరా ఈ తెలుగుమాటని...
పలకరా నీ నోట తెలుగుని...
అమ్మపాట కమ్మనైన తేనెఊటని...
పుట్టింది ఈ మట్టిలోనే...
మన భాష పెరిగింది ఈ గడ్డపైనే...
నిలిపింది అందరిలో తెలుగు తేజాన్ని...
ప్రేమ వలికింది తెలుగుమానవత్వాన్ని
అందరిని కదిలించి నోరూరించే తెలుగుపాట అనురాగమై పలికింది అందరినోట...
తల్లిరుణం తీర్చుకో!!
తెలుగులో మాట్లాడి..
గళంవిప్పి పాటపాడు..
అమ్మభాషలోనే!!
అమ్మ పొత్తిళ్లలో పురుడు పోసుకున్న
మధురమైన మన మాతృభాషలో...
ఏ ప్రదేశములో ఉన్నాగాని
తెలుగుభాష గొప్పతనమే తెలుపరన్న...
నిన్ను మోసిన తల్లి కన్నా...
నీకు మాటఇచ్చిన తెలుగు మిన్న...
తెలుగుతోనే తెలివి తెచ్చుకో...
తెలుగే ఒక మూలధనంగా మలుచుకో!
నీడనిచ్చి..నిద్రపుచ్చి..బతుకునిచ్చి
బాధలను తీర్చిందిరా...
తెలుగేరా అస్తిత్వం!!...
తెలుగేరా వ్యక్తిత్వం!!...
సర్వకళల సృష్టికర్త తెలుగేరా!!...
ఏ దేశములో భాష పుట్టకముందే...
వినిపించే మన నేల తెలుగుతోనే...
ద్వేషాలు మోసాలు తెలియని తెలుగు
స్నేహదీపాలు వెలిగించు తెలుగింటిలోనే...
పసిడిపూల కలల వెలుగు మనభాష..
రత్నదీపాలవెలుగు మన తెలుగు..
కలలన్నీ కళ్లలో కాంతిరూపాలై రాలు..
కొలవలేని వెలుగును నింపుకున్న తెలుగు...
మనసులో మమకారం ఒదిగిన తెలుగు...
ఆత్మీయదృశ్యమై అల్లుకున్న తెలుగు!!
త్యాగయ్య నాదమై వెలిగిన తెలుగు...
జాలువారిన తేనె తెలుగుదనము...
అన్నిభాషలందు తెలుగు గొప్ప...
తెలుగులోగిళ్లలో తెలివి కాంతులే..
తెలుగింటి గుమ్మాలకు..
వెలుగుకాంతులే!!...
తెలుగుపొత్తిళ్లలో పుట్టిన మనము...
అమ్మ ఉగ్గు పాలతో పెరిగినాము..
ఎన్నిచరిత్రలు ఉన్నా గాని...
తెలుగువెలుగే గొప్ప గాని...
ఎన్నిజాతులు ఉన్నా గాని...
మన తెలుగుజాతే గొప్పది!!...
ఏ భాషలో లేని తీపి...
తెలుగుభాషలో తీపెక్కువ...
కమ్మని మధురమై భావమున్న
నవరసాల తెలుగుజిలుగు!!...
ప్రకృతి అందాల సొగసు నిండు...
తెలుగువారి మనసులో ప్రేమనిండు..
తెలుగువారి మోములో తేజముండు..
విరిసిన ఎద పరిమళాల తెలుగునిండు!
అంబటి నారాయణ
నిర్మల్
849326801
అంతర్జాతీయ
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు
11
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా......
తేనెలొలుకునట్టి తీయనయిన భాష
అచ్చులoతముండు నమృత భాష
తలపులందు నిండి తరగిపోకుండెడు
మాతృభాష కన్న మధురమేది?
పలుకు లెన్నొ గల్గి ప్రాచీన మైన నా
తెలుగుభాష కిలను దీటుగలదె?
పద్య కవనములును పలుకు బడులతోడ
పరిఢ విల్లునట్టి భాష తెలుగు
చక్కనైన తెలుగు సాహిత్య సoపద
మిక్కుటముగ నున్న మేటి భాష
దేశ దేశములను తేజరిల్లె తెలుగు
మాతృభాష యన్న మనసు మురియు
హృద్యమైన వియగు పద్యములను గల్గు
తెలుగు భాష ఘనత తెలుప తరమె?
ప్రాసయతులతోడ పద్యమ్ము రచియిoప
పరవశించి మనసు పదిలమగును
మాతృభాష తెలుగు మాధుర్యముల పంచు
ననుభవైక వేద్యమదియు నిజము
అన్య భాష లెన్ని యవనిలో నేర్చినా
మాతృభాషయందు మాటలాడు
అన్నుల యజంత భాషగ
పన్నుగప్రస్తుతిని వొందె పాశ్చాత్యులచే
కన్నులవిందగు లిపిచే
మిన్నగ నా తెలుగు భాష మేదిని వెలిగెన్
లలితాకృష్ణ
Comments
Post a Comment