మాఘ మాసం పౌర్ణమి సమతామూర్తి

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
***************
కవి వరుల జాబితా
1.డా.తంగిరాల నాగలక్ష్మి గారు
2. డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
3.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
4.కోరాడ గారు
5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
6.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
7.మద్ది పుల్లారావు గారు
8.డా. బల్లూరి ఉమాదేవి గారు
9.జోషి పద్మావతి గారు
10.అపరాజిత రెడ్డి గారు
11.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
12.సింహాద్రి వాణి గారు
13.గొర్రెపాటి శ్రీ ను గారు
14.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
15.వేమూరి సత్యవతి గారు
16.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
17.తోట సులోచన గారు
18..టేకుమళ్ళ విజయ లలిత గారు
19.
20.కవిత వెంకటేశ్వర్లు గారు
21.లలితా చండీ గారు
22.మొహమ్మద్ అఫ్సర వలీషా గారు
23.పిన్నక నాగేశ్వరరావు గారు
24.వేదాంతం సురేష్ బాబు గారు
*************
సమీక్ష లు

కవితాగానం సమూహంలోని మిత్రులందరూ
చాలా చక్కటి కవితలతో అలరించారు.
శ్రీ రామానుజుల వారి తత్వాన్ని, జీవిత విశేషాలను తమ కవితలలో తెలియజేయడంతో పాటు..సమ సమాజ నిర్మాణం కోసం సమతామూర్తి బోధనలను ఆచరించాల్సిన  ఆవశ్యకతను తమ అక్షరాలలో చక్కగా ప్రతిబింబింపజేశారు..
అందరికీ అభినందనలు💐💐💐

సమూహ
నిర్వాహకులు వీరాగుడిపల్లి గారు...
సాహితీ సేవాభిలాషతో
నగదు బహుమతులనిస్తూ 

కవులను ప్రోత్సహించడం
అభినందనీయం
💐

అందరి కవితలు చదివే అదృష్టం కలిగించినందుకు గాను నిర్వాహకులకు ధన్యవాదాలు 
🙏

.................శివునూరి సావిత్రి




మొహమ్మద్ అఫ్సర వలీషా గారు ....


ఆత్మవిశ్వాసంతోనే అసమానతలను దూరం చేయొచ్చని చెబుతూ 'ఆచారాల గొడుగు కింద ఉన్నా మానవత్వపు దారిలో నడిచినప్పుడు 'అనే వాక్యాలతోఆచారాలకన్న మానవత్వమే మిన్న అని మానవత్వం లోనే సమతా మూర్తిని సందర్శిం పజేసిన కవిత చాలా బాగుంది..మీకు అభినందనలు💐💐💐


లలితా చండి గారు....
మాయా మోహంలో పడి తన వెంటే ఉన్నా భగవత్ స్వరూపాన్ని గుర్తించలేక పోతున్నానని తన ఆటలోని ఆంతర్యాన్ని తెలుసుకో లేక పోతున్నా... అని ఒకవైపు, మరొకవైపు తమకు.. భగవంతునికి అభేదం చూపిస్తూ చివరికి ఆ  నిత్య చైతన్య స్వరూపిని వరించడం, స్మరించడం చాలా బాగుంది... మీకు అభినందనలు 💐💐💐


కవిత వెంకటేశ్వర్లు గారు....
సమతా మూర్తి శ్రీ రామానుజుల వారి తత్వాన్ని ప్రస్పుటీకరించినది మీ కవిత. గాలి ,వెలుతురు ,ఆకాశం పూల పరిమళం ,జ్ఞానము వీటికి కులమత భేదాలు లేవని 1000 సంవత్సరాల కిందట శ్రీ రామానుజుల వారు నిరూపించారు. దాన్ని నేటి సమాజం ఆచరించాల్సిన అవసరం ఉందని అను వర్తింపజేస్తూ రాసిన కవిత చాలా బాగుంది... 💐💐



బొప్పెన వెంకటేష్ గారు....
ఆదిశేషుని అంశగా అవతరించిన శ్రీ రామానుజులు 'బహుజన హితం' తో కుల మత జాఢ్యాలను, చాందస వాదాలను, దురాచారాలను తరిమికొట్టి 'అందని శాస్త్రాలను' అందరికీ అందేలా చేసిన సమతా మూర్తి సమానత సంకల్పాన్ని ఈ కవితలోచక్కగా చూపారు.. అభినందనలు💐💐💐


టేకుమళ్ళ విజయలలిత గారు....
విశిష్టాద్వైత బోధనతో తన రచనలతో విశ్వ యవనికపై సమతకు పెద్దపీట వేసిన సమతా మూర్తి , తన జ్ఞాన బోధ తో ప్రజలను 'ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి' తీసుకెళ్ళిన శ్రీరామానుజుల తత్వాన్ని మీ కవితలో చక్కగా ఆవిష్కరించారు... అభినందనలు 💐💐💐


తోట సులోచన గారు.....
మీ కవితలో శ్రీ రామానుజుల వారి జీవిత విశేషాలను వెలువరించిన విధానం బాగుంది .  సమత్వ భావనతో సమాజ శ్రేయస్సుకై కృషి చేయడంతో పాటు భగవంతుని ప్రజల దరికి చేరువ చేసిన సమతా మూర్తిని అక్షరాలతో సందర్శింప చేశారు...అభినందనలు💐💐💐💐💐


గజవెల్లి శ్రీనివాసాచారి గారు...
భగవంతుని పూజించి మోక్షం సాధించడం ప్రతి మానవుని హక్కు అని చాటిన సంఘసంస్కర్తగా, నారాయణ తిరు మంత్రాన్ని సామాన్యులకు గోపురం ఎక్కి బోధించిన 'ఆస్తిక హేతువాది' గా సమతా మూర్తి గా రామానుజులవారి ని మీ కవితలో  చూపిన విధానం బాగుంది విగ్రహరూపంలో రామానుజుల వారి దర్శనం భక్తుల భాగ్యమే...అను మాటలు బాగున్నాయి... అభినందనలు 💐💐💐


సింహాద్రి వాణి గారు....
తనకు నష్టమైనా ఇతరులకు మేలు కూర్చమని బోధించిన మానవతా వాదిగా శ్రీ రామానుజుల వారిని కీర్తించడం బాగుంది. సమతా మూర్తి తత్వాన్ని ' భావనా ఝరీ ప్రవాహంగా 'కవితారూపంలో చక్కగా అందించారు...అభినందనలు💐💐💐



తిప్పా వఝల నరసింహ మూర్తి గారు..
ధర్మం దారితప్పిన సమయంలో భగవంతుడు ధర్మ సంస్థాపనకై అవతరిస్తాడని రాసిన వాక్యాలు శ్రీ రామానుజుల వారి అవతరణ పరమార్ధాన్ని సూచించాయి. అలాగే వ్యక్తి శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సు ముఖ్యమని దైవారాధనకు స్త్రీ ,పురుష భేదం లేదని చాటిచెప్పిన తత్వాన్ని మీ కవితలో ప్రతిఫలింప చేశారు .లోకా సమస్తా సుఖినోభవంతు అనే ఆర్యోక్తిని సమతా మూర్తికి ప్రతిరూపంగా చెప్పడం చక్కని పోలిక... మీకు అభినందనలు 💐💐💐



అపరాజిత్ రెడ్డి గారు...
మహాత్మా గాంధీ గారిని సమతా మూర్తిగా వర్ణిస్తూ మీరు రాసిన కవిత బాగుంది. మతోన్మాదులకు
కుల మతాలకు అతీతంగా 'సమసమాజ 'స్థాపన జరగాలని కోరుకుంటూ ఆ మహాత్ముని ఆకాంక్షలను మీ కలంలో ప్రతిఫలింప చేశారు... అభినందనలు 💐💐



డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు...

సమన్వయంతో సహనంగా సద్భావాలతో సత్య పదంలో సహజీవనం సాగించే వారే సమతా మూర్తులు అంటూ సమతా మూర్తి కి సరైన  అర్థాన్ని చెప్పారు. మనిషి మనీ+షి తో కలిసి ధర్మబద్ధంగా జీవిస్తేనే సమత అని అహాన్ని వదిలి నిస్వార్థంగా సేవ చేయాలని మీ కవితలో ఉద్బోధించడం బాగుంది..అభినందనలు💐💐💐


కేశరాజు వెంకట ప్రభాకరరావు గారు...
శ్రీభాష్య కారుడు శ్రీరామానుజుల వారిని ఈ వేద భూమిలో పుట్టిన మరో వేదవ్యాసుని గా అభివర్ణించడం బాగుంది. అస్పృశ్యత అనేది అమానవీయ మని ప్రకటిస్తూ సమానత్వాన్ని ప్రచారం చేసిన సామాజిక వేత్త గా సమతా మూర్తిని చూపడమే కాకుండా ఆధ్యాత్మిక అమృత వాహిని లో లోకాన్ని ఓలలాడించిన తత్వవేత్తగా మీ కవితలో చూపారు. చాలా బాగుంది... అభినందనలు 💐💐


కోరాడ నరసింహారావు గారు...

దారితప్పిన లోకాన్ని ధర్మమార్గంలో నడపడానికి అవతరించిన అవతార మూర్తి శ్రీ రామానుజుల వారని, జీవుడు ,దేవుడు వేరు కారని, దేవునికి ఎప్పుడు జీవుడు విధేయుడై ఉండాలని ప్రబోధించిన ఆయన తత్వాన్ని మీ కవితలో చక్కగా చూపారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ట ఆ మహనీయునికి మనమిచ్చే తగిన గుర్తింపు గా అభివర్ణించడం బాగుంది... అభినందనలు 💐💐💐


దోసపాటి వెంకట రామచంద్రరావు గారు...

సమతా మూర్తి శ్రీరామానుజుల సమతా స్ఫూర్తిని మీ కవితలో చక్కగా ఆవిష్కరించారు. సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ ఆయన చేసిన బోధలు ,ఆయన జీవిత విశేషాలు మీ కవితలో తెలియజేస్తూ ముచ్చింతల్ లో వెలసిన సమతా మూర్తి విగ్రహం ప్రపంచ అద్భుతాలలో ఒకటి గాఅభివర్ణించిన విధానం బాగుంది.. అభినందనలు 💐💐💐


డా. భమిడి మఱ్ఱి కమలాదేవి గారు....

సమత ,మమత,క్షమతల రూపమే శ్రీరామానుజుల వారు గా మీ కవితలోచూపారు .పలు గ్రంథాలను రచించిన గ్రంథకర్తగా సృష్టి మూలాన్ని జీవాత్మ పరమాత్మ స్వరూపాన్ని విశదీకరించిన తత్వవేత్తగా చెబుతూ భక్తే పరమ మతం అని నిరూపించిన వారుగాసమతా మూర్తిని చూపడం బాగుంది...అభినందనలు💐💐


తాతపూడి సోమశేఖర శర్మ గారు...

గురువు యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రాసిన గేయం బాగుంది. భావిభారత పౌరులుగా బాలలను తీర్చిదిద్ది అక్షర జ్ఞానాన్ని అందిస్తున్న గురువులను ప్రగతి రథ చక్రాల తో పోల్చడం బాగుంది.. అభినందనలు 💐💐


మద్ది పుల్లారావు గారు....

ఆదిశేషుని అంశతో త్రేతాయుగంలో లక్ష్మణుడు ,ద్వాపరయుగంలో బలరాముడు జన్మించారని ఆ ఆదిశేషుని అంశగా కలియుగంలో శ్రీ రామానుజుల అవతరణ అనిచక్కగా చెప్పారు. ఆయన మహాప్రస్థానం తర్వాత ఇప్పుడు ముచింతల్ లో సమతా మూర్తిగా కొలువైనారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ట తో ముచ్చింతల్ పుణ్యక్షేత్రంగా మారింది. మీ కవితలో రామానుజుల అవతరణ నుండి విగ్రహ ప్రతిష్ట వరకు అన్ని విశేషాలు సంపూర్ణంగా అందించారు.. అభినందనలు 💐💐


జోషి పద్మావతి గారు....

శ్రీ రామానుజుల వారిని సమతా మూర్తిగా ఎందుకు పేర్కొనవచ్చో విశదీకరిస్తూ చివరకు శ్రీ రామానుజుల వారి ని సమతా మూర్తిగా పేర్కొనడం సబబే అని నిరూపించారు. వేద నిర్వచనం ఇచ్చిన వేద మూర్తి గా ,విశిష్టాద్వైత వైశిష్ట్యము బోధించినందుకు గురుమూర్తి గా ,యోగమూర్తి గా చివరగా విగ్రహరూపంలో ప్రతిష్ఠింపబడి భౌతిక దర్శన భాగ్యం మూర్తిగా రామానుజులవారి మూర్తులనుచక్కగా ఆవిష్కరించారు... అభినందనలు 💐💐


గొర్రెపాటి శ్రీను గారు...

ముచ్చింతల్ లో ఏర్పాటైన సమతా స్ఫూర్తి కేంద్రాన్ని మన తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని తెలిపే ఆదర్శ పుణ్యస్థలి గా అభివర్ణించడం బాగుంది .'ఆధ్యాత్మిక సౌరభాలని' సామాన్యులకు సైతం అందేలా చేసి ప్రజా సంక్షేమం కోసమే జీవితమని చాటిన రామానుజుల సమతా తత్వాన్ని మీ కవితలో చక్కగా ఆవిష్కరించారు... అభినందనలు 💐💐



అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు...

కుల మత భేదాలు లేవని మూఢ విశ్వాసాలు ప్రగతికి అవరోధం అని 'మానవత్వమే మాధవత్వం' అని చాటిన రామానుజులవారు అందరికీ ఆదర్శనీయుడు అని మీ కవితలో వక్కాణించారు. సమానత్వం ,సోదర భావం మానవత్వం ,ప్రేమ తత్వమే ప్రపంచానికి ఆదర్శమని చెప్పిన రామానుజులు 'సమసమాజ నిర్మాతగా' మీ అక్షరాలలో ప్రతిఫలింప చేశారు. అభినందనలు 💐💐



వేమూరి సత్యవతి గారు...

'సమత 'అనే పదంలో ఉన్న మూడు అక్షరాలకి సరైన భాష్యాన్ని మీ కవితలో చూపారు. అలాగే కులాల  పేరుతో,మతాల పేరుతో ఆశల పల్లకీలు ఎక్కిస్తూ జనాలని మభ్య పెట్టే వారు సమత అనే పదాన్ని ఒప్పుకోరని చెప్తూ ,అటు తథాగతుని బౌద్ధంలో , ఇటుఊరికి దూరంగా ఉన్న జనులను హరికి దగ్గరగా చేర్చి హరిజనులుగా మార్చిన బాపూజీ అభిమతాన్ని 'సమత 'గా చూపుతూ మనోవాక్కాయ కర్మలలోసమతని ఆచరించినపుడే సమతా మూర్తి నిజమైన సాక్షాత్కారం గా అభివర్ణించడం బాగుంది...అభినందనలు💐💐💐


దారల విజయ కుమారి గారు...

సమతా మూర్తి శ్రీ రామానుజుల వారిని దర్శించినంత నే వారి  విశిష్టాద్వైతము మన మనసులకు తాకుతుందని సామాన్య జనానికి వేదసారాన్ని అందించిన శ్రీ భాష్యకారుని సత్వగుణం సంపన్నత గూర్చి చక్కగా చెప్పారు. వేనవేల సంశయాలకు ఒకే ఒక్క సమాధానం ఆ సమతా మూర్తి అని ఆయన అడుగులో అడుగు కలపడమే మన కర్తవ్యం అని మీ కవితలో చక్కగా ప్రబోధించారు... అభినందనలు 
********"""
1.
అంశం: సమతా మూర్తి
డా. తంగిరాల నాగలక్ష్మి

సమత
 ముచ్చటగ మూడు వర్ణాల సమ్మేళనం
సగుణ లక్షణం సమత
సమత శాంతిని సంతోషాన్ని స్తుంది
ద్వేషాలను దూరంగా తరిమేస్తుంది
సమతకు బాట కలసి ఉండడం
మహాత్ముల జీవిత విధానాలు తెలుసు కోవటం
స్కూల్లో  డ్రెస్ కోడ్ అదే
యూని ఫారం పెట్టడం
ఇక్కడే మొదలవుతుంది 
 సమత గమనిస్తే
సమత కావాలంటే 
మమత పెంపొందాలి
స్నేహంతో చరించాలి
మానవత్వం తో మెలగాలి
సర్వ సమానత్వం చూపాలి 
సత్వ గుణంతో సాధించాలి
మనిషి మనీ+షి తో కలసి  సంస్కారంతో
ధర్మ బద్దంగా 
జీవన విధానం సాగిస్తే సమత అర్ధమవుతుంది
సమత ఉండాలంటే  అహాన్ని దూరం చేయాలి
 నిస్వార్ధంగా సేవ చేయ గలిగితే తెలిసేది 
సమత
రిజర్వేషన్లు ఉండకూడ దెందులోనూ
పేద ధనిక భేదం చూపొద్దు
ఒకటే కులం సమతా కులం
ఒకటే జాతి మానవజాతి
ఒకటే ఆస్తి మనదేశ భక్తి
మనుషులంతా ఒక్కటే
మానవతా ధర్మమొక్కటే
సమానత్వం అర్ధం తెలియాలంటే 
చరిత్ర తెలియాలి
దేశాభిమాని కావాలి
సత్పురుషుల సాంగత్యం 
 తెలుపుతుంది సమతా  విలువలు
తర తమ భేదాలు లేకపోతే ఉండేది సమత
చీమల గుంపు చూడు ఆహారం దొరికితే
అన్నీ కలసి పంచుకుంటాయి
పక్షులను పరిశీలన చెయ్యి 
బియ్యపు గింజలు వేయగానే చూసి 
గుంపుగా వస్తాయి
క్రిమి కీటకాలలో పక్షులలో ఉన్నది సమతా మూర్తిత్వం
తేనె టీగల సమతా సంఘటితమే తేనె పట్టు
ఎన్నికలలో కాదు పరిపాలనలో చూపాలి సమత
గెలుపు కోసం నోట్లు పంచటం కాదోయ్
ఆవేశం కాదోయ్ ఆలోచనుండాలోయ్
మత సామరస్యం తో సుహృద్భావం చూపాలోయ్
విభజన కావాలని భజన చేయటం కాదు సమత అంటే
కలసి కట్టుగా జై కొట్టు వాడే సమతా మూర్తి
సమతా మూర్తులందించు 
మనకు స్ఫూర్తి
సమన్వయంతో సహనంగా 
సాద్భావాలతో సమానత్వం తో సత్య పధంలో ధర్మం తో
సహజీవనం సాగించే  జీవులే  సమతా మూర్తులు
2.
[16/02, 8:32 pm] Lalita Sister: కవనజ్యోతి మాఘమాసం
పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి నా కవిత
అంశం : సమతామూర్తి 
శీర్షిక : సమతామూర్తి రామానుజ
మమత, సమత,క్షమతల రూపు
కాంతిమతి కేశవాచార్యుల పుణ్యఫలము
పెరంబుదూరు జన్మవాసి
తత్త్వవేత్త, ఆస్తిక హేతువాది
విశిష్టాద్వైత మత సంస్థాపకుడు
త్రిమతాచార్యులలో ద్వితీయుడు
అష్టాక్షరి మంత్ర ఉపాసకుడు
తిరుమంత్రసారాన్ని బోధించిన
పరమభాగవతోత్తముడు
దివినుండి భువికి దిగివచ్చిన
ఆ భగవంతుడే 
సమతామూర్తి రామానుజాచార్య
అజ్ఞానాంధకారాలను తొలగింప వచ్చిన వెలుగులరేడు
నారాయణాంశసంభూతుడు
మూఢవిశ్వాసాల వృక్ష గొడ్డలి
రామానుజుడు
ముక్తిమార్గమును బోధించిన దేవదూత
దండం త్రిదండం సతతము ధరించిన యోగిపుంగవుడు
వేదసారాన్ని దేవతారాధ్యాన్ని
తెలిపిన గురువర్యుడు
ఎంబెరువార్.,ఉదయవార్,
యత్రిరాజ బిరుదాంకితుడు
వేదాంతసారం, వేదాంతదీపం
వేదార్థసంగ్రహం , గీతాభాష్యం
రంగనాథస్తవం ఇత్యాది పలు
గ్రంథకర్త
తేజోమూర్తి,  తార్కికుడు, యతీశ్వరుడు
పవిత్రచిహ్నములతో ఉదయించిన భానుడే ఈతడు
ఆదిశేషుని అవతారమట
సృష్టి మూలాన్ని జీవాత్మ పరమాత్మల స్వరూపాన్నే
విశదీకరించిన 
భక్తే పరమమతమని నమ్మిన
భక్తవరేణ్యుడు
సమతామూర్తి రామానుజాచార్యులు.

పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం
అనుకరణ అనువాదంకాదు.
3
[16/02, 8:33 pm] Lalita Sister: కవితాగానం ప్లవనామసంవత్సరం
మాఘపూర్ణిమ నగదు పురస్కారం కొరకు
కవితాంశము:సమతామూర్తి
శీర్షిక:సమదర్శి.
సమతామూర్తి అందించెను సమతాస్పూర్తి
విశిష్టాద్వైతవేత్తగా వినుతిచెందెను
గురువుబోధించిన మంత్రోపదేశము
బహిర్గతము చేసెను
దైవమందరికి ఒక్కడేనను భావనను పెంచెను
ధనిక పేద కులమత బేధములెందుకని ప్రశ్నించెను
గురుమంత్రోపదేశమునకై పద్దెనిమిది పర్యాయములు ప్రయత్నించెను
కఠిననియములెన్నింటినో అవలంబించెను
దైవముదృష్టిలో సర్వులూ సమానులని చాటెను
తన తార్కికశక్తితో మహపండితులను విబేధించెను
తల్లిమాటను తుచాతప్పకపాటించెను
వేయిసంవత్సరములక్రిందటే సమతామూర్తి అవతరించెను
రామానుజాచార్యులుగా ప్రసిద్దిగాంచెను
సమదర్శిగా సమాజశ్రేయస్సునే కాంక్షించెను
ఆయనను స్మరించుటకే భాగ్యనగరమందు వాహనాలు లెసెను సమతాపూర్తి విగ్రహము
చినజియ్యరుస్వామి జీవితము ధన్యమాయెను
చూచివారికి కన్నులపండుగాయెను
అతిరధమహరధులు దర్శించిరి ఆమూర్తిని
ప్రపంచాద్బుతములలో ఒకటిగా నిలుచును
ఆధ్యాత్మికశోభతో విరాజిల్లును
తెలుగునాట ఎర్పరుచుట గర్వకారణము.

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు.
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
4
[16/02, 8:33 pm] Lalita Sister: కవనజ్యోతి., మాఘమాసం 
పౌర్ణమి నగదు పురష్కారాల కవితల పోటీ !
అంశం :- * సమతామూర్తి *
   కోరాడ నరసింహా రావు !
శీర్షిక :- సృష్టించెను ఘన కీర్తి 
           ****************
దైవాన్ని మరచి, ధర్మాన్ని విడచి 
నరజాతి దారితప్పిన తరుణం!
అవతరించెను ఆధ్యాత్మిక చైత న్యం... రామానుజ రూపమై !!

ఆతని ఆత్మ ప్రబోధాభిమతం అందరికీ ఆమోదమై, విలసిల్లెను  విశిష్టాద్వైతమై  ! అద్భుతజ్ఞాన సత్య స్వరూపం!!

జీవుడుదేవుడు వేరుకారని  దేవునిప్రియప్రతిరూపమె జీవుడని... 
సర్వము దేవుని అనుగ్రహమని 
దేవుని కెపుడూ   జీవుడు... 
విధేయుడై యుండ వలె ననీ 
ఈ జన్మకు ఉత్తమ గతి ఇదేనని 
ప్ర భోదించిన సద్గురువితడు !

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు... 
ఆ మహనీయుని  తగురీతి 
గుర్తించి సత్కరించు చుంటిమి !
ముచ్చింతల్ ఎంత పున్నెము జేసెనో... !!

 రెండువందల పదహారడుగుల  ఆ సమతామూర్తి స్వర్ణ విగ్రహం 
విని నంతనే తనువు పులకింత 
కనినంతనె మహదానందం !

ఆ సమక్షమునే...ముప్పది మూడు దివ్య దేశముల 
దేవలమ్ములకు ప్రాణ ప్రతిష్ట 
శతాధికంగా యాగ శాలలు 
సహస్రాధిక హోమకుండములు 
చతుర్వేద పారాయణములు 
సాంస్కృతిక కార్యక్రమములు 

జయహో... జయహో.... 
సమతామూర్తీ !
మరో చరిత్ర సృష్టించె... నీ ఘనకీర్తి !!
***********************
   .... కోరాడ.
5
[16/02, 8:33 pm] Lalita Sister: కవనజ్యోతి
మాఘ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ కోసం

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
సెల్ ఫోన్:: 8497924605
సెల్ ఫోన్:: 6281697982
 18/02/2022
అంశం: సమతామూర్తి
శీర్షిక...‌ సమత
***************************************
వేద భూమిలో మరో వేదవ్యాసుడు భద్రవేదిక పైన జనహితం కోరి అష్టాక్షరీ మహామంత్రాన్ని ఎలిగెత్తి ఉపదేశించిన ఉద్యమ కారుడు.

కులగోత్రాలతో కుళ్ళి కంపు కొడుతున్న భావజాలం పై సమతా శంఖం పూరించి 
అభ్యుదయ భావాల బాణాలు ప్రయోగించిన
శ్రీ రామచంద్రుడు 

అనాచారాలతో కునారిల్లుతున్న కుటిల సమాజాన్ని నిరసిస్తూ
వర్ణ భేదాల వివక్షతో వివేకం కోల్పోయిన
సంఘాన్ని ధిక్కరించిన ధీరుడు 
ఆలయ ప్రవేశం నిషిద్ధం చేసిన అగ్రస్వామ్యాన్ని
ఎదిరించి పోరిన వీరుడు

స్పృశ్యులు అస్పృశ్యులన్న అమానవీయ చేష్టల దునిమి దేవుని గుడిలో అందరినీ ప్రవేశ పెట్టిన
ఐక్యతామూర్తి ,
ఆరాధనకు అర్చన విధులకు మనుషుల మధ్య అంతర మెందుకని యుద్ధం ప్రకటించిన సంస్కర్త

మూఢాచారాలు ముప్పిరిగొని అంధవిశ్వాలతో
అలమటించే ప్రజానీకానికి 
విభిన్న వర్గాల వారిని  ఆళ్వార్లుగా అందించి
భక్తిని, సమానత్వాన్ని ,ప్రచారం చేయించిన 
సామాజిక వేత్త ఇళయ పెరుమాళ్

ఉపనిషత్తులకు వేద వేదాంగాలకు వక్రభాష్యాలతో వికృత రూపం కల్పిస్తున్న
అల్పజ్ఞానుల అహంకారమడచిన 
అమేయ మేధో సంపన్నుడు కేశవానందుడు

కాంతి మతి కన్న కన్నడు,.. సమతా ధర్మం
స్థాపన కొరకు భక్తిని ప్రయోగించిన
ధార్మిక వేత్త,
లోకాన్ని ఆధ్యాత్మిక అమృతవాహినిలో
ఓలలాడించిన తత్వవేత్త 


స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
 18/02/2022
6.
అంశం.. ఆచరణల చరణాలు(గేయం) ******************************* 
పల్లవి : చిట్టి చిట్టి హృదయాలలో... చిరు చిరు భావాలకు అలతి అలతి పదాలద్ది..... సాక్షరతను నింపి పసిమనసుల భావనలనుతెలుసుకో.. తెలుసుకుని ఆచరణలోమలచుకో.. గురువా!గురువా!పవిత్రగురుశబ్దాన్నిసార్ధకతచేసుకో.. చరణం : మనసా వాచా కర్మణా మీరే.... మనుగడకు దిక్సూచి మీరే విద్యార్థులందరిని ఏకత్రాటిలోమీరు ఆచరణయోగ్యులుగచేసే!!పసి!! 

 చరణం : భావిభారత పౌరులు నేటిబాలలే ఆ బాలల జ్ఞానదీక్ష బడి ఒడిలోనే ఆబాలలపదిలంగాసంరక్షించుమార్గాన్ని ఆచరణలోపెట్టేమీగురువులచరణాలకు ప్రణామం.... మాదండ ప్రణామం!!చిట్టి చిట్టి!! 

 చరణం : ఐ. ఏ. యస్. లు, ఐ.పి. యస్. లు... ఒకనాటి బడి ఈడు పిల్లలే అలనాడు ఆచరణలో పెట్టిన... గురుదేవుల ఆశీస్సులే ఈనాడు ఈమహానుభావులు ప్రగతిపథరథచక్రాలే వారందరిచరణాలకు సాష్టాంగదండప్రణామం!!చిట్టి!! 

 హామీ పత్రం ఈ గేయ రచన నాది అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
7.
మద్ది పుల్లారావు గారు

శీర్షిక:: సమతామూర్తి భగవద్రామానుజ -
 త్రేతాయుగ లక్ష్మణ ద్వాపర బలరామా కలియుగ రామానుజ ఘన యాదిశేషుడా చైత్రశుద్ద పంచమి శిశువు రామానుజుని కాంతిమతి కన్నదీ కర్కాట లగ్నమున కేశవయజ్వకెంతొ కీర్తి తెచ్చిన దినము చిన్నతనమునుండియు చిచ్చరపిడుగాతడు వేదవిద్యలన్నియు వేగిరముగ నేర్చెను గోష్టి చేయుటకతను గురువులెందరినో గలిసె సన్న్యాసము కోసము సతినొదిలి వేసెను విశిష్టాద్వైతమును విస్తృతముగావించె మహిమలెన్నొజూపెను మహాగురువాయెను బ్రహ్మ సూత్రాలకూ భాష్యమును వ్రాసెను జనుల మేలు కోరెడి జగద్గురువాయెను అష్టాక్షరి మంత్రము యందరికి యందించె పీఠములను నెలకొల్ప ప్రియశిష్యులు నడిపిరి ఎందరినొ ఓడించి యిష్టుడయె అందరికి ధీనులను కాపాడ దేశయాత్ర జేసెను మాఘ శుద్ద దశమిన మహాప్రస్థానమందె తానాన తిరుమేని తనయంత్య శరీరం దర్శనమిచ్చుచుండు ధర శ్రీరంగములో ముచ్చింతల్ లోన నేడు సమతామూర్తిగ కొలువాయె ఆబాలగోపాలాన్ని అలరించుచుండె చినజీయర్ సారద్యాన సమతామూర్తి ప్రతిష్ట వేడుకలు ప్రముఖులంత విచ్చేసి పావనమొనరించు చుండె పుణ్యక్షేత్రమై విలసిల్లి మోక్షదాయకమగు గాక! ..... ధన్యవాదాలు
8.

శీర్షిక:సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు
  ఆ.వె:జగతికెల్ల ప్రభువుసర్వోత్తముడుహరి జీవులెల్లరతనిసేవకులని చాటిచెప్పి సతము జనులమనములందు పెంచె దైవ భక్తి విస్తృతముగ.

 ఆ.వె:
సమరసతకుతానె చక్కని వారధి  ‌
యగుచు సంచరించుచన్ని చోట్ల 
 మతముకాదునేడు మార్గపు గమనమే
   ముఖ్యమనుచు చాటె ముందుగాను

   సీ:జగతిలోనిజనులుసహనగుణమువీడి నిందలు
 వేయుచు నిరతముండ కులమతములపేర కుమ్ము లాడుచునుండ సంఘసంస్కర్తగ సంయమి యగు తానుసామాజికతకుబాటలనువేసి నాధ్యాత్మిక తకు తా నాద్యు డయ్యె హరినియారాధింపనంతరములవేల ననుచునెల్లరికిని ననునయముగ ఆ.వె:బోధపరచినట్టి పుణ్య శ్లోకుండని ప్రస్తుతించిరితని వాసిగాను నతని విగ్రహమునకంజలిఘటియించ రండుసుజనులారరయముగాను ఆ.వె:మతములన్ని కూడ మాధవునిదరికి చేర్చు చుండు నెపుడు శీఘ్రముగన టంచు బోధచేయ నాదిశేషునియంశ నంది నవతరించెనవనియందు. 
 ఆ.వె: 
తల్లి కాంతిమతి కి తండ్రి కేశవునకు 
 చైత్రమాస మందు చక్కగాను
  భూత పురము నందు పుట్టిన పెరుమాళ్ళు 
 తత్త్వవేత్త యయ్యె త్వరితగతిన.
9.
మూర్తిమత్వం 
************** 
వేద నిర్వచన మొనర్చిన వేదమూర్తి విశిష్టాద్వైత వైశిష్ఠ్యమును బోధించిన గురుమూర్తి పద్మాసన యోగ భంగిమ యందాసీనమైన యోగమూర్తి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలోని శ్రీనివాస మూర్తి శివ విష్ణు స్వరూప ప్రత్యక్ష నిర్ధారణనొనర్చిన శ్రీ రామ్మూర్తి శంఖు చక్రధారిగా అవతరించి రామానుజుల వాక్శక్తిని సుస్పష్టమొనర్చెనా మూలమూర్తి అష్టాక్షరీముక్తిమంత్ర పఠనం ఐనది కొందరికే పరిమితి బహిరంగ ఈ ప్రకటనతో నరక ప్రాప్తియన్నది ఆర్యోక్తి నరులకు మేలు చేయుటలో పరిచయమైనా తనకు కలిగించును సంతృప్తి అంటూ సర్వజనులకు బహిర్గత మొనరించిన ఆదర్శమూర్తి సమ భావన సహజీవనం నిర్దేశకుడైన స్త్రీమూర్తి ఆత్మను పరమాత్మలో లీనమొనర్చినా భౌతిక దర్శనమొసగుతూన్న భాగ్యమూర్తి రామానుజాచార్యులు అయినా రందుకే సమతామూర్తి 
10.
[18/02, 1:13 pm] Lalita Sister: 
అంశం: సమతామూర్తి 
శీర్షిక: మహాత్ముడు సమసమాజం!
పేరు:యం అపరాజిత్ రెడ్డి 
ఊరు: సూర్యాపేట 
ఫోన్ నంబర్ 9848532031

మహాత్ముడు నడయాడిన 
ఈ నేల నేలంతా సమసమాజ స్థాపనకే 
మురికి వాడలను తను స్వయంగా శుభ్రం చేసినా 
అంటరానితనం దూరం చేసేందుకు పాటుపడినా 
దళితులను హరిజనులని నామకరణం చేసినా 
హిందూ ముస్లిం ఐక్యతకు పోరాటం చేసినా 
కుల మతాల కుమ్ములాటలను వ్యతిరేకించినా 
హృదయమే దేవాలయం మసీదు అని చాటిచెప్పినా 
సమసమాజోద్దరణకే నని మరవద్దు!
భారతీయులను హీనాతి హీనంగా చూసిన తెల్లవాడిని 
మనుషులను మనుషులుగా చూడలేని దాష్టికున్ని 
దేశం నుండి వెళి వేసిన ధీరుడు మహాత్ముడు!
అందరూ ఆ భగవంతుని సృష్టిలో సమానులే 
విద్య ధనికులు పేదలు అని తేడా లేకుండా ఉచితంగా అందాలని 
విద్యయే అజ్ఞాన అంధకారాలను పారద్రోలే ఆయుధమని 
హృదయం తెరుచుకుని శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని 
మానవత్వమంటే సమతా సామ్రాజ్యమని 
ఆకలిగొన్న నిరుపేదల వరకు స్వాతంత్ర్యం ఫలాలందాలని 
మతోన్మాదాలకు దూరంగా దేశం పరిఢవిల్లాలని 
సమసమాజ స్థాపన కొరకు పాటుపడ్డ సమతామూర్తి 
మహాత్మా గాంధి!!

అపరాజిత్ 

హామీ పత్రం: ఇది నా స్వీయ రచన అని నా హామీ.
11

కవితా గానం
మాఘమాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీకి
అంశం:సమతా మూర్తి
శీర్షిక:విప్లవావతారం.

కాలమేదైనా కొన్ని మతమౌఢ్యలు సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉంటాయి./
దేవతా విగ్రహాల ధ్వంసంవేయిసంవత్సరాలకు పూర్వమే కొనసాగిన విధ్వంసకాండ/
తురుష్కుల దండయాత్రలు పలికాయి ఈ దుశ్చర్యలకు నాంది/
వేదాన్ని ఒప్పుకోని మతాలవిజృంభణతో గాడితప్పింది సనాతనధర్మం/
శివకేశవ భేధంతో చేరాయి అసమానతలు తారాస్థాయికి/
వైష్ణవాలయాల ధ్వంసం,వైష్ణవుల పై అరాచకాలతో అట్టుడికింది సమాజం/
సామాజిక రుగ్మతలైనాయి సమాజానికి మచ్చలు/
ధర్మం ఒంటికాలిపై నిలబడితే తప్పదుకదా భగవదవతారం/
ఆదిశేషుడే అవతరించాడు రామానుజులుగా ధర్మసంస్థాపనార్థం/
రామానుజులు విశిష్టాద్వైత మతాచార్యులే కాదు,సామాజిక విప్లవ వీరుడు./
సమసమాజం స్థాపనకు నడుం బిగించిన సామ్యవాది/
వ్యక్తిగత శ్రేయస్సుకంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమనిన అభ్యుదయ వాది/
ఛాందసాచారాలు సమాజ అభ్యున్నతికి కుత్సితపు అడ్డుగోడలని చాటిచెప్పిన ఆస్తిక హేతువాది/
లింగవివక్షతకువ్యతిరేకంగా స్త్రీ లకుదైవపూజార్హత కల్పించిన సంస్కరణ వాది/
అస్పృశ్యతా నివారణకు కృషిచేసిన మానవతా వాది/
దళితులకు ఆలయప్రవేశం కల్పించిన సమతా వాది/
తర్కంతో మంచో చెడో తేల్చుకొమ్మనిన శాస్త్రీయ వాది/
అందరికోసం తాను నరకానికైనాపోను సిద్ధపడ్డ 
నిస్వార్థ మూర్తి./
పరబ్రహ్మ తత్వాన్ని బోధించిన సమైక్య మూర్తి/
రామానుజులవారయ్యారందుకే సమతా మూర్తి/
లోకస్సమస్తా సుఖినోభవంతు అనే ఆర్యోక్తికి ప్రతిరూపమే సమతా మూర్తి విగ్రహమూర్తి.

తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా

12
: కవితా గానం(సీజన్--2)
కవనజ్యోతి మాఘమాసం‌ పౌర్ణమి నగదు పురస్కారాలు కవితల పోటీ కొరకు
అంశం:--సమతామూర్తి
తారీఖు:--18--2--2022
వారం:--శుక్రవారం
శీర్షిక:-- మానవతావాది
రచన:--సింహాద్రి‌ వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872

కేశవాచార్యులు కాంతిమతి దంపతుల పూర్వజన్మ సుకృత ఫలం ఇళయ పెరుమాళ్ రామానుజాచార్యులుగా పేరు పొందిన దైవాంశ సంభూతుడు జ్ఞాని

సమతా మమతల సర్వ సమానత్వ కులమత భేద రహిత భావనాఝరీ ప్రవాహాన్ని
వెయ్యేళ్ళనాడే ‌ధర పైకి తీసుకొచ్చిన మానవతా వాది.

పధ్నాలుగు సార్లు తిరిగి గురూపదేశం పొందిన గాయత్రీ మంత్రాన్ని గుడి గోపుర మెక్కి బహిర్గతం చేసిన సర్వ మానవ సమతావాది

తనకు నష్టమైనా యితరులకు‌ మేలు కూర్చమని‌ బోధించిన మానవతావాది

విశిష్టాద్వైత సిద్ధాంత రూపకర్త, ప్రచారకుడు
తిరుపతి వెంకటేశ్వర స్వామికి శంఖు‌చక్ర ప్రదాత

దేవాలయాల రూప కల్పనకు కారకుడు
గురువును ‌విభేదించి తర్కం ద్వారా విషయాన్ని నిగ్గు తేల్చిన గొప్ప ఆధ్యాత్మికవేత్త

తొమ్మిది సంఖ్య ప్రధానంగా త్రిదండి చిన‌ జియ్యర్‌ స్వామిగారి‌ నేతృత్వంలో ముచ్చింతలలో కావించి బడిన
సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ట
శుభకరం శాంతిప్రదం సర్వ మానవ శ్రేయోదాయకం

హామీ:--ఇది నా స్వీయ రచన
13.

కవిత *
కవితా గానం
 అంశం : రామానుజాచార్యులు
 శీర్షిక : "ఆదర్శ పుణ్యస్థలి" 
 రచన : గొర్రెపాటి శ్రీను
   మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ
 సమానమే అంటూ.. కులమతాలకు అతీతంగా
 అందరినీ సమాదరణ తో అభిమానించి..
 లోకహిత కార్యక్రమాలేన్నో చేసిన 
భారతీయ ఆధ్యాత్మికవేత్త రామానుజాచార్యులు ! 
అష్టాక్షరి మంత్రాన్ని
 ఆలయ శిఖరం పైకెక్కి సమస్త మానవాళికి తెలియపరిచి
.. ప్రజల శ్రేయస్సే ముఖ్యమని తలిచి.
. గురు ఆగ్రహాన్ని చవిచూసి.. 
ప్రజా సంక్షేమం కోసమే జీవితం అని ప్రపంచానికి చాటిన
 సమతా స్ఫూర్తి ప్రదాత 
రామానుజాచార్యులు ! 
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దేశం నలుమూలలా వ్యాప్తి చేసి..
 ఆధ్యాత్మిక సౌరభాలని.. 
భగవంతుని ఆరాధన లో ఉన్న పారవశ్యాన్ని.. సామాన్యులకు సైతం అందేలా కృషి చేసిన
 మహోన్నత మానవతామూర్తి రామానుజాచార్యులు !
 అస్పృశ్యత వంటి దురాగతాలను ఖండించి .. 
ఆలయ ప్రవేశాలు అందరికి సాధ్యమయ్యేలా చేసిన సహృదయులు 
రామానుజాచార్యులు ! 
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. చిన్న జీయర్ స్వామీజీ ఆద్వర్యం లో ముచ్చింతల్ లో ఏర్పాటైన "సమతా స్ఫూర్తి కేంద్రం"
 తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని 
ప్రపంచానికి తెలియ జెప్పే ఆదర్శ పుణ్యస్థలి ! 
 _ గొర్రెపాటి శ్రీను 96528332290
14
అయ్యలసోమయాజుల ప్రసాద్
జిల్లా *
విశాఖపట్నం
ఫోన్ నెంబర్ *
9963265762
మీరు పొందిన యేదైనా ఒక పురస్కారం
కవిమిత్ర పురస్కారం వాగ్దేవి నిలయం విజయవాడ
కవిత *
శీర్షిక:- సమసమాజ నిర్మాత రామానుజులు

కులమతభేధాలు లేవని
జగతిన అందరు పరమాత్మస్వరూపాలేనని
మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ప్రగతికి అవరోధాలని,ప్రేమతత్వమే పరమాత్మ తత్వమని
మానవత్వమే మాధవత్వమని
సమాజాహితమే నా ధ్యేయమని
వెయ్యిసంవత్సరాలక్రితమే చెప్పి ఆచరించిన
సమతామూర్తి రామానుజులు మహనీయులు..!!

తమిళనాడులోని పెరంబుదూర్ లో వైష్ణవ బ్రాహ్మణ
కుటుంబమున జన్మించినా కర్మల కన్నా కర్తవ్యమే
ప్రధానమని విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించి గురువు ఆజ్ఞను ధిక్కరించి
దేముడిముందు అందరూ సమానులే అని
గుడి గోపురం పైకి ఎక్కి పరమపవిత్రమైన
అష్టాక్షరీ మంత్రం"ఓం నమో నారాయణయ"అని
ప్రజలందరికి ఉపదేశించి తాను నరకానికైనా సిద్ధమే
నలుగురికోసం అన్న సంఘ సంస్కర్త రామానుజులు
అందరికి ఆదర్శనీయులు...!!

సమతామూర్తి విగ్రహమును వారి జ్ఞాపకార్ధం
రంగారెడ్డి జిల్లాలో ముంచిత్తలలో నిర్మించి
సమానత్వం, సోదరభావము, మానవత్వము
ప్రేమతత్వమే ప్రపంచానికి ఆదర్శమని చాటి చెప్పిన
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సేవ 
అందుభాగస్వామ్యులైన అందరి జీవితం సాఫల్యమన్నది అక్షర సత్యం
సమతామూర్తి రామానుజులకు శతకోటివందనములు.......!!
15.
వేమూరి.సత్యవతి.
జిల్లా *
కృష్ణాజిల్లా.
ఫోన్ నెంబర్ *
9885136308.
మీరు పొందిన యేదైనా ఒక పురస్కారం
ఉగిది పురస్కారం.
కవిత *
శీర్షిక- మూడే అక్షరాలు. 
 సమత అంటే మూడక్షరాల ముచ్చట కాదు
ఓటు కావాలంటే 
ఒకే జనతని కావాల్సినన్ని ముక్కలు చేస్తూ.. 
మనవాడు మన వాడేనంటూ
 దురదగుంటాకు పూయిస్తుంటే 
గాలానిక్కట్టిన మాంసపు ముక్క కోసం 
ఈదుకొచ్చే చేపలు..
 దీపం చుట్టూ గుంపులుగా మూగిపోయే మిడతలు..
 "సమత" లో ఏ ఒక్క అక్షరాన్నీ ఒప్పుకోరు!!
 పదమూడొందల వత్సరాల కిందటే 
ఆదిగురువు శంకరులు.. 
మనీషాపంచకపు ముచ్చట్లో తళుక్కుమన్నది సమతే!!
 వెయ్య్యేళ్ళ కిందట గహనమైన భక్తి-జ్ఙానసారాన్ని ఎనిమిదక్షరాలుగా పిండి రంగ గోపురమెక్కి వేలాదిమందికి స్వర్గమొస్తె 
తాను నరకానికి సిధ్ధమన్న సమతామూర్తి
 సంపూర్ణ సాక్షాత్కారం!! మధురభక్తి పరిచయం చైతన్య తన్మయ భజనగా.
 స్వరాజ్యం జన్మహక్కన్న లోకమాన్యుని నినాదంగా..
 విశిష్టాద్వెైతపు విశేషపాయలై ప్రవహిస్తూ
 సమతామూర్తి సంపూర్ణ సాక్షాత్కారం!! 
మూర్తీభవించిన కరుణగా తథాగతుని బౌధ్ధంలో ఊరవతల విసిరేసిన జనులందరికీ 
ముందు "హరి" పదం చేర్చిన బాపూజీ మనసులో
 సమతాసుమం ఉందికదా!!
 మరి మూడక్షరాలలో సమతని సరిచూస్తావా?
బంగారు విగ్రహంగా వంగి వంగిదండాలుకాదు, మొక్కుబడిగా మొక్కటం కాదు, 
మనో వాక్కులలో క్రియగా కనిపించాలి!! మీరు మరీనూ..అసాధ్యమని, ఆశపడటం మానేస్తామా??! ####### ఈ కవిత నా స్వంత రచన!!
16.
మాఘమాసం పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కోసం 
....
గజవెళ్ళి శ్రీనివాసాచారి
అంశం: సమతామూర్తి 
శీర్షిక: రామానుజుడు 
...
రామానుజుడే సమతామూర్తి 
ఆయన బోధనలు అందరికి స్ఫూర్తి 
విశిష్టాద్వైతం ప్రచారం చేసిన తత్వవేత్త

ఆదిశేషువు అంశతో 
భువిపైన మానవ రూపంలో
కాంతిమతి గర్భంలో
ఉదయించిన రామానుజుడు 

భూమిపై పుట్టిన 
ప్రతి జీవి సమానమేనని 
చాటిచెప్పిన మానవతావాది 

దేవున్ని పూజించి 
మోక్షం సాధించడం 
ప్రతి మానవుడి హక్కని 
చాటిన సంఘసంస్కర్త 

నారాయణ తిరు మంత్రాన్ని 
తిరుకొట్టియార్ ఆలయ గోపురం ఎక్కి 
సామాన్యులకు బోధించిన ఆస్తిక హేతువాది 

తిరుమలలో మూలవిరాట్టు 
శ్రీనివాసుడేనని నిర్ధారించిన 
రామానుజుడు  

ఆ రామానుజుడు 
సమతామూర్తి భారీ విగ్రహ రూపంలో 
భక్తులకు దివ్యదర్శనం 
మనందరి భాగ్యం 
...
హామీ పత్రం 
...
ఈ కవిత నా స్వంత రచన 

గజవెళ్ళి శ్రీనివాసాచారి
17
కవన జ్యోతి పౌర్ణమి నగదు
పురస్కారాలు   మాఘ మాసం
తోట సులోచన
నెల్లూరు
చరవాణి    9490173053
పురస్కారాలు    ప్రభుత్వ ఉగాది పురస్కారాలు రెండు సార్లు

అంశం     సమతా మూర్తి
శీర్షిక . శ్రీ రామానుజాచార్యులు

జనులందరిని  సమత్వభావనతో   ఏకత్రాటిపై
తీసుకుని  వచ్చి  ప్రేమను  చూపిన  మహానుభావుడు
మానవత్వానికి   భాష్యం  చెప్పిన సమతామూర్తి
విశిష్టాద్వైతాన్ని   వ్యాప్తి లోనికి తెచ్చిన గొప్ప యతి
సమాజ శ్రేయస్సే  ముఖ్యమని   చాటిన  మానవతావాది
వెయ్యేళ్ళ క్రిత  మీ భూమి మీద నడచి
విశ్వ మానవ తత్త్వ్తాన్ని   ప్రపంచానికి చాటే
తమిళ నేలపై   శ్రీ పెరంబునూరు పట్టణంలో  జన్మించె
ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి దంపతుల  సంతానమై, ఏకసంతాగ్రాహియై విరాజిల్లే
పదహారో యేట  తంజమ్మతో   వివాహం . జరిగే
శాస్త్రం చెప్పగల్గిన   గురువు కోసం కంచికి చేరే
యాదవ  ప్రకాశుని   దగ్గర   శిష్యరికం చేసే
శిష్యుని ప్రతిభకు  యీర్ష్య పడి రామానుజుని
అడ్డు తొలగించుకోవాలని  కుట్ర చేసే
అది గ్రహించిన  రామానుజుడు   యచ్చట
నుండి  సొంతవూరుకు  పయనమాయే
నూట యాభై మైళ్ళు ముగ్గురు శిష్యులతో
పద్దెనిమిది  సార్లు నడచి  తుదకు గురువు
అనుగ్రహం పొంది  మంత్రోపదేశంను  బొందె
ఆ మంత్రోపదేశాన్ని  ప్రజలందరికి  తెలియ జేసి
దేవుని ప్రజల దగ్గరకు  చేరువచేసి 
సకల జనుల సమానత్వాన్ని  నిరూపించే
అట్టి సమతామూర్తికి   శిరస్సు వంచి ప్రణామం 

హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ ఇచ్చుచున్నాను
18
కింకర్తవ్యం*
***********
సహస్ర వత్సర పూర్వమే,
మాతాపితరులనే గురుదేవులుగా భావించి,
పూజించి,సేవించి,
వారి దివ్య ఆశీస్సులచే
సహేతుక వాదనా పటిమతో
సాక్షాత్ గురుదేవునే ఓడించి,
శిష్యునిగా స్వీకరించి..,
ఆదర్శ ప్రాయ తాత్విక ఆలోచనల ప్రవాహ ఝరిలో
శత సంవత్సరాలకు పైబడి
ప్రజా జీవితాలను
సన్మార్గంలో నడిపించి,
వారిని ఉన్న స్థితి నుండి సమున్నత స్థితికి చేర్చ..,
అహరహం శ్రమించి..,
ప్రకృతిలోనే దేవుని జీవుని గని
పాంచరాత్ర ఆగమన,
విశిష్టాద్వైత బోధన,
శ్రీభాష్యం రచన గావించి,
అనన్య సామాన్య భక్తిప్రపత్తులతో
జ్ఞాన పరంపర మోక్ష సాధనా మార్గాన్వేషణను..,
పీడిత, దీన, ధనిక భేద భావం చూపక,
కులమతాలకతీతంగా సకల జనులకు అత్యంత సునాయాసముగా మంత్రోపదేశం చేసి..,
విశ్వ యవనికపై సమతా భావజాల దర్శనంబు గలిగించిన
సమతామూర్తి
భగవద్ రామానుజాచార్య పాదపద్మముల అనుసరణీయమే 
సదా ముక్తిదాయకం..!!
సర్వమానవాళి కింకర్తవ్యం..!!
**************************
టేకుమళ్ళ.విజయలలిత
ఉపాధ్యాయిని

19
కవిత శీర్షిక : సమం సుమం శ్రీ రామానుజం భజే

ఆది శేషుని అంశన సర్వ సమానత సంకల్పాన్ని సాధించిన సమతావాది

పాషండ వేషాలను విధిళించి తాత్విక పరమార్ధాన్ని ప్రసాదించిన పరమయోగి

ఆధ్యాత్మిక ఆశయంతో 
మత జాడ్యాలను ఝుళిపించి
జనజీవన స్రవంతిని వికసింప చేసిన కారుణ్యమూర్తి

దురాచారాలను దులిపి మానవతా విలువలను మహిన కూర్చిన ధర్మశీలి

చాందస వాద భూతాలను తరిమి ధర్మసంస్థాపన కావించిన పావన మూర్తి

అందని శాస్త్రాలను అందరికీ అనుసరణీయంగా ప్రవచించిన ఆత్మజ్ఞాని

దారి తప్పిన తోవను సనాతన సాంగత్యంతో తీర్చిదిద్దిన సర్వజ్ఞాని

సర్వసంగ పరిత్యాగం తో సమా'నవతా' భాష్యాలు చెప్పి శారదమ్మను అనుగ్రహించిన ఆదర్శమూర్తి

బహుజన హితాయ బయలుదేరిన స్ఫూర్తి ప్రదాత
భువిపై వెలిసిన సమతామూర్తి తరించినది ఈ ధాత్రి ధన్యోస్మి
20
కవితా గానం - 2
అంశం:: సమతా మూర్తి
తేదీ:: 18.2.22..శుక్రవారం
శీర్షిక:: మానవతామూర్తి

పదకొండవ శతాబ్దపు
వైష్టవాచార్యుడు
శ్రీ రామానుజచార్యుడు
వెయ్యేళ్ళ కిందటే
సమతా మమతా చాటినాడు
బూజుపట్టిన కులమత చాందస 
అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన
జ్ఞాన భాస్కరుడు
విజ్ఞాన విష్వెశరుడు
దేశమంతా పర్యటించి
పరమత వాదులతో వాదించి
సత్య ప్రమాణాలతో నిరూపించి
విశిష్టాద్వైతానికి వ్యాప్తి కలిగించే 
గాలి వోలె గగనం వోలె
వెలుతురు వోలె పుష్ప పరిమళము వోలె
జ్ఞానము అందరిదని
చిన్న జాతి పెద్ద జాతి భేదాలు లేవని
అందరూ సమానమేనని
ప్రభోదించిన మానవతామూర్తి
సర్వ జన సమతామూర్తి
తిరుమంత్రము ప్రజాలందరిదని
ఆడ మగ వివక్షకు తావు లేదని
గోపురము ఎక్కి ప్రకటించిన
పావనమూర్తి
అంత్యజులకు ఆలయ ప్రవేశము 
ధనుర్దాసుకు దైవ దర్శనము
కలిగించిన సంఘ సంస్కర్త
ధనుర్దాసును ఆంతరంగిక
శిష్యునిగా స్వీకరించే
కులమత భేదాలు లేవని నిరూపించే
కుల మత లింగ అసమానతల
వివక్షల ఆనాడే త్రుంచేసిన
ఆదర్శమూర్తి
సమత మమతకు ఆయనే
సవితామూర్తి
ఆయన సిద్ధాంతము నేడు అందరికి అవసరము
నేడది పాటించడమే సర్వ మానవ కర్తవ్యము!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
పై కవిత నా స్వంత రచన అని హామీ
21.
[20/02, 7:41 am] Lalita Sister: *నీ చైతన్యం* 

నీకు నాకు మధ్య ఎన్ని వేల వేల యోజనాల  దూరం  
నీవేమో అయోనిజవై ఆ బ్రహ్మాండానికి ఆవల
నేనేమో పునరపి జననం అంటూ  పిండమై ఈ *వల* లో
 
నా వెంటే ఉన్నా వంటూ నీవు  ...
దరినే ఉన్న దర్శించలేని స్థితిలో నేను..
అనంత సృష్టి చేస్తూ మోహా తీతంగా  నీవు
నీ అనంత మాయా మోహంలో  నుసి నుసిగా నేను 

అస్తవ్యస్తపు వ్యత్యాసాలలోను 
కనిపించని వలయాల నడుమా
నీ విభూతులు వెలుగులతో నీవు
నీ విన్యాసాలు అర్ధంకాక
బుద్భుదమై  నేను ....

నీ బుద్ధికి పుట్టిన ఆట మొదలుపెట్టి చూస్తూ... నీవు  
ఆంతర్యం ఎరుగని నీఆటలో అలిసిపోతూ నేను  
ముల్లోకాలకు ఆవల ముప్పయి మూడు కోట్ల దేవుళ్ల పూజలు అందుకుంటూ నీవు
కలల నడుమ కలకలారావలలో కవ్వించే  కసరత్తులను చూస్తూ, చేస్తూ నేను
నువ్వు  నేను అబేధమంటూ వెల్లువలైన వాదనలెన్నో
చలించి సవరించిన విరంచి రూపాల్లా
స్రవించే  సృష్టి చైతన్యంలో
 నేనో క్షణం నీకై తపిస్తూ  
నిన్నే వరిస్తూ  స్మరిస్తూ

లలితా చండి
1 8-2-2022
న్యాయవాది 
హైదరాబాదు 
 9885552922 

 కవిత  నా స్వీయ  రచన
ఎక్కడ ప్రచురితం  కాలేదు
22
[20/02, 7:42 am] Lalita Sister: కవితా గానం( సీజన్ 2)
అంశం....సమతా మూర్తి 
శీర్షిక....మానవత్వపు దారి

ఒకే సారి వేల గొంతుకలు
అంటరానివన్నప్పుడు అందులో
ఒకే ఒక గొంతు అందరి 
రుధిర మొక్కటన్నప్పుడు....

చెదిరిన అసమానత దుప్పటిని 
చెదరనీయని ఆత్మ విశ్వాసం 
 సరి సమానం చేసినప్పుడు....

అందరూ బాగుండాలి 
అందులో తాను ఇమడాలి
అనే కాంక్షల కడియం తొడగనప్పుడు....

ఆచారాల గొడుగు  కింద ఉన్నా
మానవత్వపు దారిలో 
నడిచినపుడు అతను
ముమ్మాటికీ సమతా మూర్తినే..!!

హామీ...నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ. గో .జి )
23.
      18--2--2022.
పిన్నక నాగేశ్వరరావు.    
మాఘ మాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- సమతామూర్తి.
శీర్షిక :-- శ్రీ రామానుజాచార్య.

1. తే.గీ.
తల్లి కాంతిమతియు కాగ తండ్రి సోమ
యాజు దిశితాలు పుణ్య దంపతుల యింట
ప్రభవమొందె తమిళనాడు గ్రామమౌ పె
రంబుదూరులో; నూట యిరవది వత్స
రాల వయసులో చేరె పరమ పదమ్ము
ధార్మికుండు రామానుజ తత్వవేత్త.

2. తే.గీ.
బౌద్ధ, వైష్ణవ, జైన, శైవ మత సంప్ర
దాయములు వైదికమగు మతమ్ము ననుస
రించి వచ్చెననె; ప్రతిపాదించె నతడు
తన మతము విశిష్టాద్వైత మనుచు దేశ
మంతయున్ దెచ్చె దానిని వ్యాప్తిలోకి. 

3. తే.గీ.
దైవ పూజయు, మోక్ష సాధనము జన్మ
నొందిన నరుల హక్కని నుడివినాడు
మత, కులమ్ముల తారతమ్యమ్ము చూపి
కక్షలను పెంచుకొనుట మూర్ఖత్వ మనెను.

4. తే.గీ.
గురువు చెప్పిన దానిని గ్రుడ్డిగాను
నమ్మి నిజమనెడు నవసరమ్ము లేదు
తర్కమును చేసి విషయము తప్పొ,యొప్పొ
నిర్ణయించుకొనుట యందు నేరమేమి 
లేదటంచు రామానుజ బోధ చేసె.

5. తే.గీ.
సృష్టియందున  దేవుని దృష్టి యందు
మనుజు లందరు కూడ సమాన మనుచు
బోధనలు చేయుచు సమతామూర్తి యయ్యె
మానవుల మేలు కోరు రామానుజుండు. 

6. తే.గీ.
సమత, మమతల స్ఫూర్తిని జగతి చాటి
నట్టి రామానుజుని విగ్రహమును తెలుగు
రాష్ట్రమైన తెలంగాణ ప్రాంతమందు
నేర్పరచు టెంతయో మోదమిడెను మిగుల.
**************************************
24
**********************
అంశం:- సమతామూర్తి
""""''"""""""""""""""""""""""""""""""
మానుష రూపం మహిలో దాల్చిన
దివ్య వేదాంత విద్యా దీప్తి
విశ్వానికి ఆయన ఒక స్ఫూర్తి
విశిష్టాద్వైత సిద్ధాంత మూర్తి
సమస్యలకు తగు పరిష్కారాల
మార్గం చూపిన మమతా మూర్తి
సమున్నతమ్మగు ప్రతిభా కీర్తి
ఛాందసభావం సరికాదంటూ
విజ్ఞానం అందరి సొత్తంటూ
నింగీ నేలా గాలీ నీరూ
వెలుగుల పరిమళ మందరిదంటూ
మంత్ర రహస్యం అందరిదంటూ
ఏఒక్కరి స్వంతం కాదంటూ
గోపురమెక్కీ తిరు మంత్రమ్ము
జనులందరి కందించిన దమ్ము
రామానుజులు పంచిన సొమ్ము
సంస్కరణల తొలి బీజం నాటి
సమతా మమతా మార్గం చూపి
కుల మత భేదము వద్దని తెలిపి
వ్యక్తుల కన్న వ్యవస్థే గొప్పని
సమాజ శ్రేయం పరమార్థమ్మని
సు‌‌షుప్తి నుండి ఉషస్సు వైపుకు
నడిపించిన మానవతా మూర్తి
సమసమాజ స్థాపన చేయుటకై
అవతరించిన సమతామూర్తి.

🖋️ వేదాంతం సురేశ్ బాబు
     చంద్రపూర్
     మహారాష్ట్ర

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧