చిత్ర కవిత 15102020

 


నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

****************************

న్యాయ నిర్ణేత ః భరద్వాజ గారు

*********************************

🎊🌱 *కవనజ్యోతి* 🎊🌱

 *చిత్రకవిత* *ఫలితాలు*

 *ప్రథమ*

1అభిరామ్

2వై.కె.సంధ్యాశర్మ

3వురిమెళ్ళసునంద

4సుధారాణి కృష్ణంరాజు

 *ద్వితీయ* 

5ఇందిర వేదాల

6కోరాడ‌నరసింహారావు

7జ్ఞాన ప్రసూనశర్మ.వై

8మిట్టా లక్ష్మీ

 *తృతీయ* 

9.గాజులభారతి

10.పరాంకుశం రఘునారాయణ

11ఇంద్రావత్ రాహుల్

12.కె.సి.చిన నరసయ్య

13కొలచన‌విజయభారతి

14.ఉల్లెంగ ముత్యం

15.చెన్నా‌విజయలక్ష్మి

✳️✳️✳️✳️✳️✳️

కవి వరుల జాబితా

1.సుధారాణి కృష్ణంరాజు గారు

2.కోరాడ గారు

3.అభిరాం గారు

4.సునంద వురిమిళ్ళ గారు

5.ఇందిర వేదాల గారు

6.ఇంద్రవత్ రాహుల్ గారు

7.కొలచన విజయ భారతి గారు

8.కె.సి.నరసయ్య గారు

9.పరాంకుశం రఘు నారాయణ గారు

10.సంధ్యా శర్మ గారు

11.జ్ఞాన ప్రసూనా శర్మ గారు

12.మిట్టా లక్ష్మి గారు

13.గాజుల భారతీ శ్రీనివాస్ గారు

14.ఉల్లెంగ ముత్యం గారు

***********************

1

[15/10, 8:01 PM] +91 74165 92715: 🙏🙏కవనజ్యోతి(కవి సమయం)

సుధారాణి కృష్ణంరాజు

అంశం:చిత్రకవిత*****

శీర్షిక:"న్యాయ దేవత కళ్ళు తెరిస్తే"

న్యాయానికి జరుగుతున్న అన్యాయం కళ్ళు ఉండి చూడ

లేక కళ్ళకు గంతలు కట్టుకున్న

న్యాయ దేవత

"చెడు వినకు"చెడుఅనకు"చెడు చూడకు"

చెవులుండి చెవిటి వారు

కళ్ళు ఉండి గుడ్డివారు

నోరు ఉండి మూగవారు

ఇది నేటి సమాజ పరిస్థితి

కిరాతకులు పెరిగి మారణహోమం సృష్టిస్తుంటే

న్యాయానికి న్యాయ దేవత కు

సంకెళ్లు వేసి

హత్యలు అరాచకాలు అన్యాయం రాజ్యమేలుతుంటే

తప్పు చేసిన వారు తప్పించు కుని నిర్దోషులను దోషులుగా

చిత్రీకరించి మాదే గెలుపు

అన్న అహంకారంతో

విర్ర వీగుతుంటే

వారి అహంకారానికి బలైన

వారు పడే వేదన

అరణ్య రోదన

ఎంతకాలం ఈ అన్యాయాన్ని

భరించాలి అని ఆ న్యాయ దేవత ను ఒక సాధారణ

వ్యక్తి ప్రశ్నించి నప్పుడు

ఆ న్యాయ దేవత తప్పక

సమాధానం చెపుతుంది

న్యాయ దేవత ఇకనైనా

కళ్ళు తెరిచి న్యాయాన్ని

బ్రతికించు అన్నప్పుడు

న్యాయ దేవత చెప్పే సమాధానం

అన్యాయం చేసిన వారు కూడా

ఎదో ఒక రోజు నన్ను ఇదే ప్రశ్న

వేస్తారు

ఆరోజు తొందరలోనే ఉంది

ఎవరికి వారు న్యాయం కాపాడాలన్న ఆలోచన

కలిగి మీ పాప ప్రక్షాళన

జరిగినప్పుడు నా గంతలు

వాటికి అవే తొలగిపోతాయి

ఇప్పుడు మీరు పాప పంకిలమైన మనసుతో చూస్తున్నారు కనుక అన్యాయం అనే గంతలు

కనపడుతున్నాయి

న్యాయం ధర్మం కాపాడినపుడు

నా కళ్ళు తెరుచుకుంటాయి

ఏదేమైనా న్యాయ దేవత నీవు

కళ్ళు తెరవాలి

నవ్య సమాజాన్ని స్థాపించాలి🙏🙏👍

2

[15/10, 8:02 PM] Korada: 🔥 కవన జ్యోతి 🔥

       🔥🔥🔥🔥

అంశం:-  చిత్ర కవిత

కోరాడ నరసింహా రావు !

 @నిలువగలుగుతాం@

      @@@@@@@

కళ్ళకు గంతలు కట్టు కున్న వాళ్లంతా గ్రుడ్డి వా ళ్లను కోవటం...అవి వేక మే కదూ....!

 వకాల్తాపుచ్చుకుని....

న్యాయస్థానంలో.....

న్యాయవాదులు వాదిస్తు న్న వాదనల లోని సత్యా సత్యా లేమిటో...,

ముద్దాయిల వాcగ్మూల

వివరణలోని నిజా నిజా లెంతో...,

సాక్షుల సాక్ష్యంలోని...

నిజాయితీ,ఆధారాల  పటిష్టత ఏపాటి దో...!!

ఇక్కడ చూడటానికి కనిపించేవా...!?

అంతా...వినపడటమే...

తప్ప!!

న్యాయమూర్తి చూడవల

సిందియిక్కడకాదు ....,

ఇక్కడఅంతా శ్రద్దగా వింటూ ...అక్కడ...తన విచక్షణా నేత్రంతో గతం లోకి చూడ గలగాలి!

అంతర్నేత్రంతో అక్కడ సత్యాన్ని దర్శించి...న్యా యాన్ని నిలబెట్టి .... ధ్వార్మాన్ని  కాపాడాలి !!

సునిశితఅంతర్పరిశీలన

జరగాలంటే ...అంతర్ నేత్రం తెరుచుకోవాలిగా  

అదితెరుచుకోవాలంటే 

బాహ్య చర్మచక్షువులు మూత పడాల్సిందే ...!

మనపూర్వులునెలకొల్పి న ఆచార,వ్యవహార ప్రతీ కల్ని...చులకనగా హేళన చెయ్యటం కాదు !

వాటి ఔన్నత్యాన్ని అర్ధం చేసుకుని ...విలువనిచ్చి 

గౌరవించినప్పుడే ....

మనమీ సమాజంలో ....

నిలకడగా నిలువ గలుగుతాం....!!

********************

........కోరాడ.

3

[15/10, 8:32 PM] Abhiram Poet: *అంశం:- చిత్ర కవిత*



*ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...?*


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

న్యాయానికి కట్టిన గంతులు గతిస్తాయి...


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

అవినీతి ఆనకట్టలు నేలమట్టమవుతాయి 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

హెచ్చు తగ్గు తారతమ్య తొణికిసలు తొక్కబడతాయి 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

న్యాయానికి కళ్ళు లేవనే కుళ్ళు సామెత 

ముళ్ళపాలైతది 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

బడుగు బలవంత వర్గాలు సమానరేఖపై 

ఐక్యత శుభ సంకేత అభివృద్ధి మెట్లవుతాయి 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

మృగ స్వరూప భర్తలను భయపు జాడలో అనుసరించే నేటి గాంధారి కథలకు చూపు వస్తది 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

నమ్మకం ఆనంద వెన్నుపూసై దర్జాగా బ్రతుకుబండిని నడుపుకుంటది 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

మూడనమ్మక సమూహం మూడు గుప్పిట్ల మన్నుకింద పండుకుంటది


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

అక్షరం అందరి ఆస్తి అయితది 

పదం పరిణతిని ఇస్తది 

వాక్యం వెలుగు పలుగైతది 


ఆమె కళ్ళకు కట్టబట్ట గంతులు కత్తిరిస్తే...

పేరుకే వచ్చిన స్వతంత్ర 

స్వేచ్ఛా కపోతమై ఆ న్యాయదేవత భుజాలపైనే 

స్వశక్తి స్వరూప సమాజ సన్మాన శాలువా చిహ్నంగా

వాలుతది 


 *అభిరామ్ 9704153642*

4

[15/10, 8:35 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి* (కవి సమయం)

తేదీ::15-10-2020

పేరు:వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: చిత్ర కవిత

శీర్షిక:: న్యాయ దేవతే..

********************

నిష్పాక్షితకు నిలువెత్తు నిదర్శనంగా

కళ్ళకు గంతలు కట్టుకున్న  న్యాయ దేవతా..


చట్టం ముందు అందరూ సమానమేనని

మానవీయ విలువల పరిరక్షణే ధ్యేయమని

నీవు ఎంత  నొక్కి చెప్పినా

గంతలు కట్టుకొన్న నీకు

కనిపించని ఘోరాలెన్నో..

నీకు వినిపించని అభాగ్యుల వేదనలు రోదనలు ఎన్నో...


లయ్యరులైన లాయర్ల జిమ్మిక్కులలో

సత్యాన్ని వధించి ధర్మాన్ని చెరబట్టి

చట్టాలను ఉన్న వాళ్ళ చుట్టాలుగా మార్చిన

అమానవీయ ఘటనలెన్నో...


 అమ్మా! న్యాయ దేవతా!

కనిపించని అంతర్నేత్రంతో  

కఠోర వాస్తవాలను చూడు!

వినిపించే వాదనల వెనుక సత్యా సత్యాల జాడలు వెతుకు!


న్యాయ దేవత కళ్ళు తెరిస్తే చాలు!

నిర్దోషి రక్షణ దుష్ట శిక్షణ జరిగేలా నిరూపించు!

సత్య ధర్మ శాంతి నివాసంగా

ఈ సమాజాన్ని స్థాపించు!

5

[15/10, 8:42 PM] +91 98858 21189: కవనజ్యోతిసమయం:

ఇందిర  వేదాల

అంశం: చిత్ర కవిత 

శీర్షిక: న్యాయ దేవత కళ్లు తెరిస్తే 


న్యాయ దేవత కళ్లు విప్పి చూస్తే న్యాయం చేయలేమోనని, పక్షపాతం చూపుతానేమోనని అనుకుంటుందిట

న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టారు. 

చెవులకు కాదు.

జరుగుతున్న అనేక నేరాలు ఘోరాలు న్యాయ దేవత మనసు కలచివేస్తున్నా,ఆమె కన్నీటి పొరలు ఆమె కళ్లగంతలమాటున నిలిచినవి న్యాయం చేయలేక

సత్యం, ధర్మం రెండు కళ్లు గా కలది న్యాయ దేవత. 

అటువంటి న్యాయ దేవత కళ్ళకి గంతలు తొలగిస్తే న్యాయం మాట దేవుడెరుగు

ఆ సత్యం, ధర్మాల ఊసే మరచిన ఈ లోకంలోని నేరాలు,ఘోరాలు చూడలేక 

ఆ దేవత కంటి నుండి రక్తం ధారలవుతుంది.

ఆమె  తనకు తానుగా అంధురాలవుతుంది

ఎంతైనా 'న్యాయ దేవత' కదా!

ధన్యవాదాలు.

6

[15/10, 8:54 PM] Indravat Rahul Poet Ks 11: *కవన జ్యోతి*

============


అంశం : చిత్ర కవిత 

శీర్షిక : న్యాయం 

తేది : 15/10/2020


 

         *న్యాయం*        



అన్యాయాన్ని సహించని కూడదు

నా న్యాయాన్ని అతిక్రమించకూడదు

ఆ ధర్మాన్ని ఆచరించ కూడదు

ధర్మాన్ని వీడనాడకూడదు

ఆ సత్యాన్ని పలుకకూడదు సత్యాన్ని తప్పకూడదు

చెడును పెంచకూడదు

మంచిని తుంచకూడదు

పొగడ్తకు పొంగిపో కూడదు విమర్శకు కుంగిపోకూడదు

అదే న్యాయం అదే ధర్మం

ధర్మో రక్షతి రక్షితః



*ఇంద్రావత్ రాహుల్* 

      *కొత్తపేట్*

 *నిజామాబాద్*

9848054079..

7

[15/10, 8:59 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి

పేరు: కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం: చిత్ర కవిత

శీర్షిక: న్యాయదేవతా నీకు చోటెక్కడ?

తేదీ:15-10-2020

********************

న్యాయమా నీవెక్కడ?

చట్టం నిన్ను  తన చుట్టంగా

చేసుకుని 

న్యాయదేవత కళ్ళు కప్పి

అన్యాయాలు,అరాచకాలకి

కొమ్ము కాస్తోంది

ఉన్న నిజాలకి మసిపూసి

మారేడు కాయ చేసి

రక్షణ శాఖ భక్షణ రాజ్యమై

మిగులుతోంది

పెచ్చు మీరుతున్న అరాచకాలు

చూడలేక న్యాయదేవత

అంధురాలుగానే

నిలబడుతోంది


తాను కూడా ఒక స్త్రీయే అయినా తోటి స్త్రీలకు

జరరిగే అన్యాయాలు చూడలేక

కళ్ళే కాదు నోరు కూడా

తెరవలేక మౌనముద్ర వహిస్తోంది

న్యాయానికి విలువెక్కడ?

న్యాయ దేవతకు నిలువ నీడెక్కడ?

      🌺🌺🌺🌺🌺

8

[15/10, 8:59 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి


అంశం: చిత్ర కవిత

శీర్షిక: సాక్ష్యానికి సలాం!

తేది: 15/10/2020



న్యాయాన్యాయాల పోరాటం

న్యాయవాదుల ఆరాటం

న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షణలు

వాయిదాలపై వాయిదాలు

ఏళ్ల తరబడి నిరీక్షణలు!

అంధత్వంతో న్యాయదేవత తీర్పు!

మంచి చెడులపై కట్టు కథ లెన్నో?

న్యాయదేవత చేతిలో న్యాయ తూకం!

తీర్పు ఎటు మొగ్గు చూపుతుందో?

న్యాయస్థానంలో సాక్ష్యానికే పట్టం!

కోర్టులను శాసిస్తున్న తప్పుడు సాక్ష్యాలు

వాస్తవాస్తవాల పెనుగులాటలో

న్యాయవాదుల కుస్తీ ఆర్డర్! ఆర్డర్!!

సాక్ష్యం ప్రత్యక్షం! దృశ్యం అదృశ్యం!

బలవంతుల గుప్పెట్లో సాక్ష్యం

బలహీను లెప్పుడు దోషులే

న్యాయస్థానం ముందు

అందరూ సమానులే!

తీర్పు చెప్పవలసిన న్యాయ దేవతే

ఒక్కోసారి బోనెక్కి

న్యాయం కోసం ప్రాధేయ పడుతోంది

ఎంత విచిత్రం! ఏమిటీ వైపరీత్యం?

ప్రజాస్వామ్య దేశంలో

సాధ్యాసాధ్యాలకు అసాధ్యమేముంది?

సాక్ష్యాలు అప్పుడప్పుడు

తీర్పులో తిరగబడుతూనే ఉంటాయి

సాక్ష్యమే అంతిమ తీర్పు! సాక్ష్యానికి సలాం!!



పేరు: కెసి చిన నరసయ్య

జిల్లా: ఖమ్మం

చరవాణి: 7981814784

9

[15/10, 9:09 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవన జ్యోతి సమయం* -పరాంకుశం రఘు నారాయణ అంశం :చిత్ర కవిత

******--********-********

 *శీర్షిక :న్యాయదేవత -తీర్పు*

**********-*****--*******

 కళ్ళకు గంతలు లేకుంటే..?  అన్యాయమని నేరస్తుడనీ  తెలిసినా.. 

 మనసు కలత చెంది అయ్యో పాపమనిపిస్తుంది కాబోలు!

 న్యాయం తిరగబడి అన్యాయం అవుతుంది!

 కులాల కుమ్ములాటలు,  లింగభేదాలు,  జాతి భేదాలు, 

 కళ్ళముందు కద లాడుతుంటాయి!

 ఆర్తిని.. వినే! చెవులు తప్ప...

 కన్నీటి గాథలను కరిగిపోయే కండ్లకు గంతలు ఉండడం సహజమే కదా !? 

వడ్డించే వాడు మనవాడైతే మనకు విందు భోజనమే కదా!? 

 అన్నట్లు! ఎక్కడో?  ఏ మూలనో?  కరుణారసం ద్రవిస్తే? 

శిక్షలో భేదానికి తావురాదా? 

 అందుకే?  వీలుంటే ఎక్కువ రోజులు గడిచినా!

 మంచికి పట్టంకట్టే నేపథ్యంలో.. 

 వేగవంతంలో జరిగే  తడబాటుతో..! 

మంచిపై  చెడు గెలిస్తే..?  న్యాయదేవతకు కళ్ళు లేవని!?  చట్టాలు కొందరికి చుట్టాలనీ.. దుమ్మెత్తి పోస్తూ...

 న్యాయ వ్యవస్థకే కళంకం రావడం !

శాశ్వత ప్రతిఫలాలకు న్యాయ మూలాలకు పెద్ద దెబ్బే కదా? 

++++++++++++++++++++

10

[15/10, 9:10 PM] Sandya Sharma Poetess: కవన జ్యోతి

చిత్రకవిత

అంశం: న్యాయ దేవత కళ్ళు  తెరిస్తే....


శీర్షిక: సాక్షీ సంకేతం!


అనైతిక కిరీటం తలపై  ధరించి


ఆధారాల చిట్టాలను చీకటి కోట్లో


మోస్తూ....


అమానవీయ బాహువుల్లో బంధీగా


నిలబడి...


వ్యవస్థ రూపు మార్చలేక


అడ్డుగీతలతో  ధిక్కార స్వరాలను


వాయిదా పర్వాలతో


ఆరోపణల మధ్య  శల్యమౌతున్న


ఓ న్యాయ దేవతా...


అరాచకపు అక్రమాల ఆగడాలకు


అడ్డాగా మారుతున్న  చట్టాలను


చుట్టాలుగా మారుతున్నా


ఛత్రం పట్టే.... సమాజంలో


నీ కళ్ళ గంతలు తెరిచే


కపోతులమవుతాం...


నిశీధి ఛాయలో మగ్గుతున్న


అసమానత్వాన్ని 


వర్ణ వివక్షలను తేట తెల్లం చేయవా...


అత్యాచార నరమేథాన్ని అంతం చేసే


దుష్టశిక్షణ లో  శిక్షకు ఓటేస్తావు కదూ...


తులాభారంలో


మొగ్గుతున్న... అన్యాయంవైపు


నిలబడక... సామాన్యుల


అసువులకు అండగా


నిలబడే... ఆత్మబంధువై....


అంధకారాన్ని ద్రోలే....


న్యాయాన్ని....


నడిపిస్తావు కదూ... 


ధర్మ సంరక్షురాలివై....


ఓ మాటగా సాక్షీ సంకేతమవుతావ్వాలని


ఆశిస్తాం!



*వై.కె.సంధ్యశర్మ*

11

[15/10, 9:19 PM] Prasoona Sharma Madam: *కవనజ్యోతి*


 అంశం::చిత్రకవిత

జ్ఞానప్రసూనాశర్మ యెల్లికంటి

కడ్తాల--రంగారెడ్డి జిల్లా


 ఎన్ని అరాచకాలు, ఎంత మారణహోమం

నిజం.


దహించి వేస్తున్నాయి సమాజాన్ని

సర్వమానవ సౌభ్రాతృత్వ మట

చెప్పుకోవడానికి తప్ప

ఎక్కడుంది?

ధైర్యంగా తిరగలేక వనితలు

భవితను కోల్పోతూ ఎదగలేక పిల్లలు

ఎంత నిర్దయులు

ఈ మానవులు


మానవ సంబంధాలను దెబ్బతీసే

పైశాచికత్వం

క్షణం క్షణం భయం భయం

ఈ సమాజ పరిస్థితి


కొందరికే దొరుకుతుంది న్యాయం

బలి తీసుకుంటోంది ఎందరినో అన్యాయం

కళ్లకు గంతలు కట్టుకున్న

న్యాయదేవత

నిజాన్ని చూడలేక పోతుందా?


ఈ రంగుల ప్రపంచాన్ని ఏలాలనే

దురాశ ముందు

న్యాయాన్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళ ఆశలు

నీరు గారి పోతున్నా ఏమో నని

మన ఆలోచన.


పాలు త్రాగే పసివాడు సైతం

పైసలను ఆశగా చూసే ఈ లోకంలో

న్యాయదేవత కళ్ళు తెరిస్తే

ఈ మాత్రమైనా న్యాయం లభిస్తుందా?


ఈ రంగుల ప్రపంచపు మాయ

ఆమెను కమ్మి వేయ దని 

చెప్పగలరా?


మానవనైజం మాయలో చిక్కకుండా ఉంటుందా? 

మాయతెరను న్యాయదేవత చెల్చివేయగలదా?

ఈమాయ ఆమెను కప్పివే యదనే నమ్మకముందా?

12

[15/10, 9:28 PM] +91 94400 97002: కవనజ్యోతి

15/10/2020

అంశం:చిత్రకవిత

.........................

మిట్టా లక్ష్మి

చిత్తూరు

చరవాణి:9440097002

.................................

ఆమె దేవత

అదీను న్యాయ దేవత 

ఆమెకు తెలియనిది ఏమున్నది?...ఆమె

"అంతర్ముఖ సమారాధ్య

బహిర్ముఖ సుదుర్లభ"   

పక్షపాతి దృష్టి పక్షపాత ధోరణి లేదని మనకు తెలియడానికే ఆమె కళ్ళకు గంతలు కట్టాం

కలియుగాంతం....

వినాశకాలే విపరీత బుద్ధి అను లక్షణాలుఅగుపిస్తునేఉన్నాయి

కల్కి అవతారము అరుదెంచి 

దుష్టశిక్షణ జరిగి శిష్ట రక్షణ జరిగి మనుషులు సత్యవంతుల అయినప్పుడు

ధర్మం నాలుగు పాదాల నడిచినప్పుడు

న్యాయ దేవత కళ్ళకి గంతలు అవసరం ఉండదు 

అవి ఊడిపడిపోతాయి

అంతవరకు వక్ర భాష్యాలు ధారావాహికమే

ధర్మాన్ని ఆచరిస్తూ న్యాయంగా నడుచుకోవడమే మనిషి ప్రధాన కర్తవ్యం

మనిషి మనసే నిజమైన న్యాయస్థానం ...

నిజాయితీనే న్యాయమూర్తి.

సత్యానికి ఎప్పుడు జయం.

.......‌‌...............................

ఈ కవిత నా స్వీయరచన దేనికి అనుకరణ కాదు.

13

[15/10, 9:28 PM] Gajula Bharati KS 20: శీర్షిక:-సత్యమేవ జయతే

****************

నేరాలకు న్యాయం జరిగేలా

దోషులకు శిక్షలు పడేలా

న్యాయదినోత్సవం నేడు.

దోషి,,నిర్దోషుల వారధి

న్యాయ,,,అన్యాయాల ప్రతిది

స్వేచ్చా,, సమానతల పునాది

న్యాయస్థానం యొక్క వారసులు..న్యాయవాదులు!


చట్టం ముందు అందరూ సమానులే

సత్వర న్యాయ పరిష్కారాలే

వ్యక్తిగత స్వేచ్చా,, ప్రాథమిక హక్కుల పరిచాయలే

విస్తృత పరిచే

పవిత్రవృత్తి.. ప్రత్యక్ష దైవాలు..

న్యాయవాదులు!!


చట్టం డబ్బునోడి చుట్టం కాదని

బాధితుల పక్షపాతిఐ

న్యాయం కోసం పోరాటం చేసే వారై

ప్రపంచ మానవాళి శ్రేయస్సుకూ తపనపడే వారై

సత్వర కేసుల పరిష్కార ఘనులు

ప్రశాంత ప్రపంచ సృష్టి యోధులు

ఉత్తమ న్యాయవాదులు!!


డెబ్భై ఏళ్ళ గణతంత్ర దినోత్సవంలో

సమన్యాయం ఎండమావిగానే ఉంది

అనడం ఏ మాత్రం

అతిశయం కాదు.


ప్రస్తుత విపత్కర పరిస్థితులలో

రాజ్యాంగ స్ఫూర్తి ని మనం చేసుకునేందుకు

ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం అవసరం.


ఉత్తమ న్యాయవాదులకు

వందనం..అభివందనం!

 

సత్యమేవ జయతే!!!

****************

గాజుల భారతి శ్రీనివాస్

ఉపాధ్యాయురాలు

ఖమ్మం.

చర వాని:-9849788108

మెయిల్ ggajulabharathi@gmail.com.

14


ఉల్లెంగ ముత్యం 




***** 


న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టుకుంది

అన్యాయం చూడలేకనా 

న్యాయం చెప్పే ధైర్యం లేకనా

ఆ గంతల మర్మమేమిటో 

సాక్ష్యం గురించే ప్రశ్నించే న్యాయ దేవత 

ఆ సాక్ష్యమును చూడాలి కదా 

కనపడని కళ్ళతో న్యాయం ఎలా చెప్తావమ్మా

హత్యలకూ అత్యాచారాలకు సాక్ష్యాలు ఎక్కడినుండి తేవాలి

బాధితుల గుండె కోత సరిపోదా 

న్యాయ దేవత చేతి లోని త్రాసు 

తూస్తూ ఉందా న్యాయ అన్యాయాల సమత్వం 

ఎవరి గెలుపు కై ఆరాటం 

నిరంతరం ఈ పోరాటం 

జీవితాలకు చెలగాటం 

విడిపోనిదీ జంజాటం

కావద్దు పెద్ద సంకటం 

నిరూపించాలి నిరంతరం 

సత్యమేవ జయతే అని 


















************

Second project

22/10/2020

******************

[22/10, 8:00 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవనజ్యోతి-కవి సమయం* 

 +++++++++++++++++++++++++++

*చిత్ర కవితా శీర్షిక: రైలు ప్రయాణం -ఓ.. మధురానుభూతి!!*

++++++++++++++++++++++++++++

రేయనక పగలనక.. 

దూర భారాలను  లెక్కచేయక  

   బరువు బంధనాలను కూల దోసుకుంటూ...

పచ్చి బాలింత వోలే అవస్థలెన్నో పడుతున్నా.. 

    నేనొస్తున్నానని కూత వేటు దూరం నుండే... 

      అతిథి  మర్యాదల గుమ గుమలతో..

    ప్రయాణికులకు  తీపికబురు మోసుకొని 

    సుఖ ప్రయాణానికై వీలైనన్ని వసతులను తోడ్కొని...

    అలసటకూ...  బడలికకూ.. 

    ఇసుమంతైనా! తావివ్వక !

    సుఖ ప్రయాణానికై  ఎందరెందరికో ? వారి వారి అవసరాలకు అనుగుణంగా !

   గాలి వెలుతురూ, పడకసీనూ..  మాయ మర్మాలతో...

     ప్రసవ వేదన లేన్నో  అనుభవిస్తూనే...  

   నిదానమే ప్రధానమన్న సూత్రం పాటిస్తూనే...

    మమ్మల్ని ప్రమాదపు  అంచుకు దరిచేరనివ్వకుండా

ఎత్తు పల్లాలన్నెంటినో ఎదురీదుకుంటూ....

     కొండలను .. లోయలను ...

వంతెనలనూ,  నిదానంగా దాటుతూనే...  

   ప్రకృతి రమణీయ దృశ్యాలన్నో చూపెడుతూనే ..

     ఆహ్లాద ప్రయాణానికి మారుపేరుగా..., 

   నిలిచిన నీ సేవను  ఎలా మరుస్తాo మేం? 

    ఆత్మీయతాను బంధాలకూ.. దేవతారాధనలకూ..

     శుభ అశుభ కార్యాలకు 

   హాజరయ్యే క్రమంలో... 

       మా తోడుగా నీవుంటే? 

    నిన్నెలా! మరువగలo? 

నీ సేవను తలవకుండా? 

    నీతో బంధం! అనుబంధం !!ఓ మధుర స్వప్నమే?  కదా !? 

    రైలు ప్రయాణమంటేనే 

తీపిగుర్తుల శాశ్వత జ్ఞాపకచిహ్నం కదా !? 

*****************************

- పరాంకుశం రఘు నారాయణ 

       మహబూబాబాద్

[22/10, 8:04 PM] Korada: లు!కవనజ్యోతి :  చిత్ర కవిత

* ఛుక్ ఛుక్ మంటూ ..!*

కోరాడ నరసింహా రావు!

       ************

ఛు క్ఛుక్ మంటూ...పట్టా ల పై...పరుగులు తీసే...

రైలు బండి....!

అందరికీ అందుబాటులో 

ఎందరినో...ఎక్కించుకుని .,వారి వారిగమ్యాలకు

జేర్చుచు....!!

ప్రయాణానికి పసందైనది 

ఆహ్లాదాన్నే....పంచుతుంటది....!

చిరువ్యాపారులసందడులు....కుంటి,గుడ్డి బిక్షాట నలు...వేలం పాటలు...

చిన్నపిల్లల..... ఈటి సర్కసులు యువకుల వద్ద పది నోటుచ్చుకు  దీవించే హిజ్రాలు...!

ఆకాసేపటికే ...కుదిరిన

స్నేహాలెన్నో...మాటకుమాటపెరిగి తగవులు కూడా ఎన్నో...!

ముసలివారని కనిక రిం చక...గర్భిణీలని దయ చూపించక ...కాస్తంతైనా

సర్దుకొనక...మఠాలు వేసుకు కూచుంటారు !

కష్ట-సుఖాల బోతల...

కాలక్షేపపు కబుర్లు.....

అక్కడక్కడా....!

టి క్కె ట్టు లేని ప్రయాణీ కులదోబూచులదొంగాటలు...టీ సీ చేసే..... హడావుడి...!

ఎవరెవరెక్కడఎక్కి...దిగు తున్న...తన గమ్యం చేరేవరకూ...విశ్రమించని కర్మిష్ఠి కదా...రైలు బండి!

ఏవీ ఆ సందడులిప్పుడు  

బోసిపోయినవి..... ఇన్నాళ్లూ స్టేషనులు !ఎక్కడి వక్కడ గప్-చిప్

రైలు ప్రయాణాలకు ...

పడ్డ ది బ్రేక్...!!

యి పు డి పు డే.....

బద్ద కము వదల ఒళ్ళు

విరుచుకు సిద్దపడు చుండె రైలు బళ్ళు....!!

*******************

.........కోరాడ.

[22/10, 8:19 PM] +91 74165 92715: 🙏🙏 కవనజ్యోతి 🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

అంశం: చిత్రకవిత(రైలు )

22-10-2020(గురువారం)

రైలు ప్రయాణం చేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు

రైలును దూమశకటం (పొగబండి) అనికూడా అంటారు

సాంకేతిక పరిజ్ఞానం పెరిగి విద్యుత్తు తో నడిచే రైళ్ళు కూడా వచ్చాయి

ఎన్నో సంవత్సరాలుగా అలుపెరుగని మహారాజులాగా

గమ్యం చేర్చే దారిలో ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ ప్రయాణికుల క్షేమమే తన గమ్యం గా నిరాటంకంగా తన సేవలను అందించడంలో ముందుంటుంది రైలు

రైలును చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది

ఎందుకంటే ముందు బోగీ ని

అనుసరిస్తూ వెనుక బోగీ లు కూడా మెల్లగా కదులుతూ ఊపందుకుంటాయి

మేమంతా ఎంత ఐకమత్యం గా ఉన్నాము అనే విధంగా ఉంటాయి

గిరి గీసు కున్నట్టుగా పట్టాలపై నడుస్తున్నప్పుడు మా ఐకమత్యం ప్రయాణికుల క్షేమం

అన్నట్టుగా ఉంటుంది

మన జీవితాలు రైలు తో పోల్చుకుంటే రైలు చూపిస్తున్న ఆదర్శం మనలో ఎక్కడా కనపడదు

జీవితం మూడు నాళ్ళ ముచ్చటని తెలిసిన రైలు వేదికగా చేసుకుని చేసే నేరాలు ఘోరాలు ఎన్నో 

కొంత మంది తమ పిల్లలను రైలు లో వదిలి వెళ్ళిన సంఘటనలు కోకొల్లలు

అలాగే మాటలలో పెట్టి పిల్లలను ఎత్తుకుని పోయే వారు ఉంటారు

ప్రయాణీకులు గమ్యం చేరే లోపల పరిచయంతో ప్రాణ స్నేహితులుగా మారేవారు కొందరు రైలు ప్రయాణంలో కలిసిన వారు శాశ్వతంగా జీవితభాగస్వాములుగా‌ మారిన వారు ఉన్నారు

రైలులో ఎంతోమంది దేశనాయకులు స్వాతంత్ర్య సమరయోధులు ఎంతో మంది

మేధావులను అక్కున చేర్చుకుని ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ ఒకే రీతిగా గమ్యం చేర్చిన రైలు జీవితం ధన్యం కదా  సమాజంలోని మనిషి కూడా ఎలాంటి తారతమ్యాలు

లేకుండా  అసూయలు ఈర్ష్య ద్వేషాలు లేకుండా జీవించే మనిషి జన్మ ఎంతో ధన్యం

రైలు గమ్యం చేర్చటానికి ఎంత సంయమనం పాటిస్తుందో

మనిషి కూడా జీవితంలో అనుకున్నది సాధించాలంటే

ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగాలి ఇది రైలు ద్వారా మనం

తెలుసు కోవాల్సిన నీతి🙏🙏👍

[22/10, 8:39 PM] +91 98858 21189: కవనజ్యోతి:

ఇందిర వేదాల

అంశం: రైలు  

శీర్షిక: చుక్ చుక్  రైలు 


చుక్ చుక్ రైలు వస్తోంది 

దూరం దూరం జరగండి

ఆగినాక ఎక్కండి-------

ఈ బాలల గేయం తెలియని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదు. 

వస్తుఉన్నప్పుడు దూరం జరగాలి కాని వచ్చాక ఎక్కితేనే కదా గమ్యం చేరేది

ఆలస్యం గా వచ్చిందని బాధపడకండి 

వచ్చే దోవలో దాని కెన్ని ఆటంకాలు

ఎర్ర జెండా పచ్చజెండా లే దానికి తోవచూపేవి

గంట మోగిస్తూ కూత పెడుతూ  వస్తుంది

చకచకా ఎక్కి నిదానంగా ఫలహారములు సేవంచవచ్చు

ఉయ్యాల వంటి కుదుపులతో హాయిగా నిదురించవచ్చు

పగలైనా రాత్రైనా ఆగకుండా తిరుగుతుంది 

గాలి కన్నా వేగంగా పయనిస్తుంది 

కొండకోనల మధ్యనుండి మజా చేస్తూ పోతుంది

చెట్టు చేమలమధ్య చకచకా తిరుగుతుంది 

భూమి మీద ఉన్న అన్ని రవాణా సౌకర్యాల కన్నా దీని వేగమే మిన్న 

తీర్ధయాత్రలకైనా విహారయాత్ర లైనా రైలు ప్రయాణం ఆనందదాయకం 

వస్తువుల చేరవేతకు రైలు పెద్ద దిక్కు 

సుఖంగా సురక్షితంగా తక్కువ ఖర్చుతో గమ్యం చేరుస్తుంది

భారతీయ రైల్వే నినాదం జాతిజీవనరేఖ

ధన్యవాదాలు.

[22/10, 8:42 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి

పేరు: కొలచన విజయ భారతి

ఊరు:హైదరాబాద్

అంశం:చిత్రకవిత

శీర్షిక: చుక్ చుక్ రైలు బండి

తేదీ:22-10-2020

*********************

చుక్ చుక్ రైలు బండి

చకచక పరుగులు తీసే నండి

ఊరూరా తిరుగుతూ

చుట్టాలు బంధువులనందర్నీ

ఎక్కుంచుకుని ఊర్లకు 

తీసుకుపోయేనండి

భాషా బేధం లేదండి

రాష్ట్రాలన్నీ కలుపుకు పోతుందండి


రాక్షస బొగ్గు తింటూ

గుప్పు గుప్పు మంటూ

పొగలు వదిలేబండి

రాచఠీవి నేర్చి

విద్యుత్ తీగలను చుట్టుకుంటూ మెరుపులు మెరిపించేనండి


 చెట్టుపుట్టలు దాటుకుంటూ

ప్రకృతి చిత్రాలెన్నో చూపిస్తుందండి


చిట్టిపొట్టి పాపల

ఆటల నేస్తమండి

దూరం దూరం జరగమంటుంది

జర జాగ్రత్తగా ఉండమంటుంది

ఆగినాక  ఎక్కమంటుంది

ఏడ్చేపాపలకు జోలపాటలు పాడి ,లడ్డూ మిఠాయి తినిపిస్తానంటుంది


రాలుగాయి రైలు బండి

కొత్తకొత్త రాగాలెన్నో నేర్చెనండి

      ☘️🌹☘️🌹☘️

[22/10, 8:43 PM] +91 94400 97002: కవన జ్యోతి

22 /10 /2020 

అంశం :రైలు బండి

 మిట్టాలక్ష్మి 

చిత్తూరు 

చరవాణి :9440097002

‌‌.‌.................................

శీర్షిక:జీవిత శకటం

........................

ఎవరన్నారు అది 

రైలు బండి అని 

అది రైలుబండి మాత్రమే కాదు ధూమశకటం మాత్రమే కాదు బతుకు బండి

ఎందరో బ్రతుకులకు ఆధారమైన బండి 

ఎందరు బ్రతుకులలో నిత్యకృత్యమైన బండి

అచ్చంగా కాలంలానే 

అచ్చంగా మన జీవితం లాగానే పరుగులు తీస్తూ ఉంటుంది రైలుబండి

రైలుబండి కూకూ అని శబ్దం వింటూనే మన ఆత్మీయులను తీసుకురావడం 

మనల్ని మన ఆత్మీయులను కలుసుకోవడమో తెలిపే 

ఒక మంచి శబ్దం

ఆ శబ్దం లో ఒక ఆలయంఉంది

ఆ రైలు బండి నడక లో 

హొయ లు ఉంది..

మొత్తానికి మన జీవితంలో రైలుబండి నిత్య 

అవసరంగా ఉంది

మన భూతకాలంలో, చరిత్రలో మనతో పెనవేసుకున్న బండి ఎన్నో కథలను తెలిపే బండి వర్తమానం లో మనకు ఆధారమైన బండి 

ఎప్పుడూ మనకు తోడుగా ఉండే బండి రైలు బండి

కుదుపులు లేకుండా అలసట తెలియకుండా 

పచ్చని ప్రకృతిని చూపిస్తూ

ఆసనము,శయనము, ఆహారం

జలము, ప్రాథమిక చికిత్స,

రక్షణ శాఖ సహాయం, తపాలా,

రవాణా, కాలకృత్యాల అవసరాలు తీర్చడం,

ఒకటేమిటి ఒక చిన్ని ప్రపంచం ఒక చిన్ని సంసారం అన్నీ ఇముడ్చుకుని..

ఎన్నో చిరుకుటుంబాలకు జీవనాధారంగా

వాణిజ్య అవసరాలకు అనువుగా

ధనికులకు ,పేదలకు, అందరికీ అందుబాటులో ఉంటూ

అత్యాధునిక సౌకర్యాలను

అమర్చచుకుంటూ 

సాంకేతికతను అందిపుచ్చుకుంటూ

ప్రయాణికులు వేచి ఉండుగది

పగలు ,రాత్రి భేదం లేకుండా ఎప్పుడూ విద్యుత్ సౌకర్యము లిఫ్ట్, ట్రాలీ ,వీల్చైర్ వంటి సౌకర్యాలు అందిస్తూ.....

రిజర్వేషన్, సర్దుబాట్లు,

ఎందరెందరి మనోభావాలను మోసుకుంటూ

ఉయ్యాలలూపుతూ

జో కొడుతూ నిద్రపుచ్చుతూ

ప్రయాణం ఒక తీపి గుర్తుగా

నిలిచేలా ఉంటుంది రైలుబండి

జీవితాలలో జరిగే 

విషాదాలు, ప్రమాదాలు

అన్నింటికీ తోడుగా ఉంటూ మనుషులు చేరవేస్తూ

మనకందరికీ ప్రియమైన ప్రముఖమైన బండి రైలు బండి

...‌.....................................

ఈ కవిత నా స్వీయరచన దేనికి అనుకరణ కాదు.




ఎంత దూరం అయిన ప్రయాణిస్తూ 

ఎంత దూరమైనా

మనషులను కలుపుతూ

[22/10, 8:46 PM] +91 74168 63289: కవన జ్యోతి

 పేరు :మన్నెపిన్నక లలిత

  అంశం: చిత్ర కవిత తేదీ 22/ 10/ 2020

 ఆంగ్లేయుల రైలు   భారతానికి ధూమశకటం

 నిజాము  కాలంలో ధూమశకటం  మొదలై

 రవాణా సౌకర్యం ఏర్పడి    త్వరితగతిని  వ్యాపారం  నిర్వహించేవారు

 రైలు మార్గాలకు  పడ్డారు ఎన్నో కష్టాలు భారతీయులు

 ఆంగ్లేయుల వ్యాపారానికి పునాదులు వేయడానికి భారతీయులను రైలుమార్గాలు నిర్మించేలా చేసి

 రాత్రింబగళ్ళు చిత్రహింసలు పెట్టి వేలాది కిలోమీటర్లు రైలు మార్గాలను వేయించితే

  ఈనాడు ప్రథమ తరగతిలో శీతల వాహనాల్లో ప్రయాణిస్తూ ఆనందించటం మన వంతు

 ఆనాటి కష్టాలు ఈనాటి మనకు సుఖాలు

కదలకుండా ఇంట్లో కూర్చుని ఉన్నట్టు ప్రయాణించటం

 రైలు వేగంగా వెళ్తుంటే చెట్లు ఆకాశం సూర్యచంద్రులు పరిగెత్తుతున్న టు వెళ్ళటం వింత అనుభూతి కలిగేది

    ఆనాడు   చుక్ చుక్  అని పొగ వచ్చే బండి ఆలస్యంగా వెళ్ళే బండి

 ఈనాడు  పొగలేని బండి 

త్వరితగతిని వెళ్లే బండి 

ఆనందాల బండి 

ఆహారాలు ఇచ్చే బండి

 రైల్ పలహారాలు  ఇచ్చే బండి

 ఒక బండి కాదు ఇప్పుడు రైలు బండి

[22/10, 8:46 PM] +91 74168 63289: కవన జ్యోతి

 పేరు :మన్నెపిన్నక లలిత

  అంశం: చిత్ర కవిత తేదీ 22/ 10/ 2020

 ఆంగ్లేయుల రైలు   భారతానికి ధూమశకటం

 నిజాము  కాలంలో ధూమశకటం  మొదలై

 రవాణా సౌకర్యం ఏర్పడి    త్వరితగతిని  వ్యాపారం  నిర్వహించేవారు

 రైలు మార్గాలకు  పడ్డారు ఎన్నో కష్టాలు భారతీయులు

 ఆంగ్లేయుల వ్యాపారానికి పునాదులు వేయడానికి భారతీయులను రైలుమార్గాలు నిర్మించేలా చేసి

 రాత్రింబగళ్ళు చిత్రహింసలు పెట్టి వేలాది కిలోమీటర్లు రైలు మార్గాలను వేయించితే

  ఈనాడు ప్రథమ తరగతిలో శీతల వాహనాల్లో ప్రయాణిస్తూ ఆనందించటం మన వంతు

 ఆనాటి కష్టాలు ఈనాటి మనకు సుఖాలు

కదలకుండా ఇంట్లో కూర్చుని ఉన్నట్టు ప్రయాణించటం

 రైలు వేగంగా వెళ్తుంటే చెట్లు ఆకాశం సూర్యచంద్రులు పరిగెత్తుతున్న టు వెళ్ళటం వింత అనుభూతి కలిగేది

    ఆనాడు   చుక్ చుక్  అని పొగ వచ్చే బండి ఆలస్యంగా వెళ్ళే బండి

 ఈనాడు  పొగలేని బండి 

త్వరితగతిని వెళ్లే బండి 

ఆనందాల బండి 

ఆహారాలు ఇచ్చే బండి

 రైల్ పలహారాలు  ఇచ్చే బండి

 ఒక బండి కాదు ఇప్పుడు రైలు బండి

[22/10, 8:47 PM] +91 74168 63289: కవన జ్యోతి

 పేరు :మన్నెపిన్నక లలిత

  అంశం: చిత్ర కవిత తేదీ 22/ 10/ 2020

 ఆంగ్లేయుల రైలు   భారతానికి ధూమశకటం

 నిజాము  కాలంలో ధూమశకటం  మొదలై

 రవాణా సౌకర్యం ఏర్పడి    త్వరితగతిని  వ్యాపారం  నిర్వహించేవారు

 రైలు మార్గాలకు  పడ్డారు ఎన్నో కష్టాలు భారతీయులు

 ఆంగ్లేయుల వ్యాపారానికి పునాదులు వేయడానికి భారతీయులను రైలుమార్గాలు నిర్మించేలా చేసి

 రాత్రింబగళ్ళు చిత్రహింసలు పెట్టి వేలాది కిలోమీటర్లు రైలు మార్గాలను వేయించితే

  ఈనాడు ప్రథమ తరగతిలో శీతల వాహనాల్లో ప్రయాణిస్తూ ఆనందించటం మన వంతు

 ఆనాటి కష్టాలు ఈనాటి మనకు సుఖాలు

కదలకుండా ఇంట్లో కూర్చుని ఉన్నట్టు ప్రయాణించటం

 రైలు వేగంగా వెళ్తుంటే చెట్లు ఆకాశం సూర్యచంద్రులు పరిగెత్తుతున్న టు వెళ్ళటం వింత అనుభూతి కలిగేది

    ఆనాడు   చుక్ చుక్  అని పొగ వచ్చే బండి ఆలస్యంగా వెళ్ళే బండి

 ఈనాడు  పొగలేని బండి 

త్వరితగతిని వెళ్లే బండి 

ఆనందాల బండి 

ఆహారాలు ఇచ్చే బండి

 రైల్ పలహారాలు  ఇచ్చే బండి

 ఒక బండి కాదు ఇప్పుడు రైలు బండి

[22/10, 8:52 PM] +91 74168 63289: కవన జ్యోతి

 పేరు :మన్నెపిన్నక లలిత

  అంశం: చిత్ర కవిత తేదీ 22/ 10/ 2020

 ఆంగ్లేయుల రైలు   భారతానికి ధూమశకటం

 నిజాము  కాలంలో ధూమశకటం  మొదలై

 రవాణా సౌకర్యం ఏర్పడి    త్వరితగతిని  వ్యాపారం  నిర్వహించేవారు

 రైలు మార్గాలకు  పడ్డారు ఎన్నో కష్టాలు భారతీయులు

 ఆంగ్లేయుల వ్యాపారానికి పునాదులు వేయడానికి భారతీయులను రైలుమార్గాలు నిర్మించేలా చేసి

 రాత్రింబగళ్ళు చిత్రహింసలు పెట్టి వేలాది కిలోమీటర్లు రైలు మార్గాలను వేయించితే

  ఈనాడు ప్రథమ తరగతిలో శీతల వాహనాల్లో ప్రయాణిస్తూ ఆనందించటం మన వంతు

 ఆనాటి కష్టాలు ఈనాటి మనకు సుఖాలు

కదలకుండా ఇంట్లో కూర్చుని ఉన్నట్టు ప్రయాణించటం

 రైలు వేగంగా వెళ్తుంటే చెట్లు ఆకాశం సూర్యచంద్రులు పరిగెత్తుతున్న టు వెళ్ళటం వింత అనుభూతి కలిగేది

    ఆనాడు   చుక్ చుక్  అని పొగ వచ్చే బండి ఆలస్యంగా వెళ్ళే బండి

 ఈనాడు  పొగలేని బండి 

త్వరితగతిని వెళ్లే బండి 

ఆనందాల బండి 

ఆహారాలు ఇచ్చే బండి

 రైల్ పలహారాలు  ఇచ్చే బండి 

పొగబండి కాదు ఇప్పుడు రైలు బండి

[22/10, 8:54 PM] దీపక్ న్యాతి: కవన జ్యోతి

తేది : 22-10-2020

డా.దీపక్ న్యె

అంశం : చిత్ర కవిత

శీర్షిక : సమాంతరము


కాలచక్రం రైలుబండి కవలలు కాకపోయినా

విలువల పోలికలు కొన్నున్నాయి

రెండింటా మనది కాదు ఒంటరి ప్రయాణం

కాలచక్రం నిరంతర ప్రయాణం

రైలుబండి నిర్దేశిత ప్రయాణం

కాలచక్రానిది మనమెరుగని గమ్యం

రైలుచక్రానిది మనమెంచుకోగల గమ్యం

కాలచక్రాన జననమరణాలతో

జీవుల ప్రయాణం

రైలుబండి మీద మనది తాత్కాలిక ప్రయాణం

కాలచక్రం సృష్టి సూత్ర భ్రమణ కక్ష్యను వదలదు

రైలుబండి సమాంతర జోడి పట్టాలను వదలదు

కాలచక్రాన అడుగిడితే బంధువుల బంధాలు

రైలుబండిన అడుడిగితే కుదిరె స్నేహ బంధాలు

కాలచక్రంతో నిరంతరం ప్రయాణం చేయలేము

రైలుబండితో నిరంతరం ప్రయాణం చేయలేము

కాలమైనా రైలైనా మనుషికి ప్రయాణం అనివార్యం


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

[22/10, 9:06 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి సమయం


 పేరు: కెసి నరసయ్య

చరవాణి: 7981814784

తేదీ: 22-10-2020

చిత్ర కవిత: రైలు ప్రయాణం ఓ మధురానుభూతి!



కూతల మేలుకొలుపులు

కోడికూత సూర్యుడు వస్తున్నాడని

తొందర పెడుతుంది

రైలు కూత

నేను వస్తున్నానని

అప్రమత్తం చేస్తుంది

ఆశయం ప్రయాణీకులకు సేవ

లక్ష్యం గమ్యం చేర్చటం

వచ్చిన రైలు తక్షణమే వెళ్ళి పోతుంది

దిగే వాళ్ళు ఎక్కే వాళ్లతో భోగిల సందడి

ఎనౌన్సర్ల హెచ్చరికలు

తిరునాళ్లను మరిపించే రైల్వేస్టేషన్ సందడి

రైల్ వెళ్లిన తర్వాత

వాన కురిసి వెలిసిన అంత ప్రశాంతత

పయనంలో ధనిక పేద తారతమ్యాలు

విలాసవంతమైన ఏసీ బోగీలు 

సుఖవంతమైన రిజర్వేషన్ల బెర్తులు

లగేజీ మూటలు

ఒకదానిపై ఒకటి విసిరి కొట్టి నట్టు

జనరల్ బోగీలలో పేదోడి ప్రయాణం

దేశం నలుమూలలా

దిక్కుదిక్కుల రాత్రింబవళ్లు

విరామమెరుగని అవిశ్రాంత రైళ్ల ప్రయాణం

పాములా పాకు కుంటూ

అడవులు కొండలు  నదీనదాలు దాటుకుంటూ

సాగిపోతున్న సాహసోపేతమైన పయనం

రైలు బోగీలో కళ్ళులేని కంచుకంఠం స్వరం

కాళ్లు లేని దయనీయ వేడుక

చాయ్ కాఫీ పల్లీ అంటూ జీవన పోరాటం

ఈసడింపులు ఒకవైపు

అయ్యో పాపం

అనే దయాగుణం మరోవైపు

రైలు ప్రయాణం ఓ మానవీయ కోణం

అదొక మధురాతి మధురమైన అనుభూతి!

[22/10, 9:09 PM] Indravat Rahul Poet Ks 11: *కవన జ్యోతి*

============


అంశం : చిత్ర కవిత రైలు 

శీర్షిక : రైలు ప్రయాణం  

తేది : 22/10/2020


 

    *రైలు ప్రయాణం*



మానవ జీవితం

ఒక రైలు ప్రయాణం లాంటిది

ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు

జీవితానికి పటిష్ట పునాదులు

చూడాల్సిన ప్రదేశాలు

ప్రకృతి  దృశ్యాలు

సమాంతరమైన చక్రాలు 

దూర ప్రయాణం

రైలు బండే మార్గం

బాల్యంలో  తీర్థయాత్రకు

వెళ్ళిన మధురానుభూతి

పట్టాలపై నడిచిన రోజులు 

రైలు వేంగంగా వెళ్తే 

ప్రకృతి మనతో వస్తున్నట్టు 

మాయదారి కరోనా 

ఇంట్లోనే బందీ అవ్వడం 

ఎన్ని రోజులో రైలు బండి ఎక్కి 

రైలు బండ్లు మళ్ళా రావాలే 

ఆనందమే ఆనందం... 



*ఇంద్రావత్ రాహుల్* 

      *కొత్తపేట్*

 *నిజామాబాద్*

9848054079..

[22/10, 9:23 PM] Gajula Bharati KS 20: కవనజ్యోతి సమయం

*************

శీర్షిక:మధుర స్మృతి


ప్రయాణికుల భద్రత మా బాధ్యత అంటూ

ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తూ

కిటకిటలాడుతూ రద్దీగా ఉండే

తిరునాళ్ళ జాతర్లు రైల్వేస్టేషన్ లు

పేద,ధనిక జీవులకు

ఒకే వేదికై

ఒకే ప్రయాణమై

ఒకటే బాటగా దూరతీరాల తావులకు బంధం వేస్తూ

హాయిగా తీసుకువెళ్లే మంచి నేస్తం

బంధాలను..బంధువులను చేరువచేస్తూ

అలసట,,ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ

సుఖ ప్రయాణానికి సౌకర్యాలు కల్పిస్తూ

ఉన్నా నిజమైన నేస్తం

పచ్చని చెట్లు,పచ్చికబయళ్లు

ప్రకృతి రామనియతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ

ప్రకృతితో మమేకమై

సేద తీరిస్తూ దారుల వెంట పరుగులు పెడుతూ

పరవశించేలా చేసే

అపురూప నేస్తం

నీతో స్నేహం మధురం

నీతో ప్రయాణం అతి మధురం


ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను


గాజుల భారతి శ్రీనివాస్

ఖమ్మం

9849788108


*********************

[22/10, 9:26 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి*

తేదీ:22-10-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: చిత్ర కవిత

శీర్షిక:జీవితమొక రైలు బండి

********************

సరిహద్దులు దాటి  పయనిస్తూ

ఎల్లలు కల్లలు మనకెందుకనీ

గిరులు తరులు సెలయేరులను

పలకరిస్తూ పరుగులు తీస్తూ సాగిపౌయే రైలు బండి! 


ఎందరెందరో అనుబంధాలు బంధాలను కలుపుతూ

గమ్యం చేరే సమయంలో తామరాకు మీద నీటి బొట్టులా

నిర్వికారంగా ఉండమని చెప్పే రైలు బండి ఓ తాత్వికతా రూపం!


కాలమనే పట్టాల మీద నడిచే జీవితమూ రైలు బండేననీ

ఒడుదుడుకులను ఒడుపుగా దాటుకుంటూ గమ్యం వైపు సాగిపోవడమే 

బతుకు పరమార్థం తెలిపే

రైలు బండి ఓ సత్య దర్శిని!


చిత్ర విచిత్ర మనుషుల మనోగతాలను 

అంతర్నేత్రంతో పసిగట్టాలనీ!


బతుకు తెరువుకై  నిత్యం పోరాటం చేసే

శ్రమ జీవుల ఆత్మ విశ్వాసాన్ని

ఛాయ్ టీ అరుపుల్లోనో

బోగి బోగీకి తిరిగి అమ్ముకునే

వేడి వేడి పల్లీలు  పండ్లండీ పండ్లు తాజా తాజా పండ్లంటూ పలకరించే పిలుపుల్లోనో చూపించే

బడుగు బతుకుల జీవితాలను కళ్ళముందుంచే బతుకు బండి!


 ఘంటసాల పాటనో

రామదాసు కీర్తననో ఆధారం చేసుకుని

పెట్టె పెట్ఠెకూ వినిపించే  ఆకలి రాగాన్ని పరిచయం చేసే దయా హృదయిని !

జీవితంలో ఒక్కసారైనా చేసే రైలు ప్రయాణం

 అనుభవాలను  ఆత్మీయతను

బతుకుకు జీవితానికి మధ్య ఉన్న కనిపించని జీవన రేఖను

జన్మ జన్మలకు సరిపోయేలా చూపించే క్రాంత దర్శి రైలు బండి!

ఒక్క సారి మనం  చుక్ చుక్ రైలు బండిలో వెళ్ళొద్దాం రండీ!

[22/10, 9:34 PM] Vijayalakshmi Ch KS 38: కవన జ్యోతి 

పేరు :చెన్నా విజయలక్ష్మి 

అంశం :చిత్ర కవిత 

తేది :22-10-2020

************************

ఛుక్ ఛుక్ రైలు చక్కని రైలు 

ప్రాంతాలను కలిపే బంధం రైలు 

ఆంగ్లేయులు వ్యాపారానికై ప్రారంభిస్తే 

అందరికీ రవాణా సౌకర్యంగా వచ్చింది అందుబాటులోకి 

రకరకాల హంగులతో పెళ్ళి కూతురులా ముస్తాబై వేడుక చేస్తుంది 

కొన్ని బంధాలను కలుపు కుంటూ కొన్నిటిని విడదీస్తూ జీవనదిలా సాగిపోతుంది 


గరీబోళ్ల కైనా, సంపన్నులకైనా, మధ్య తరగతోళ్ళకైనా ఆప్యాయత తో సేవ లందించే పెన్నిధి 


వేల మైళ్ళు ప్రయాణిస్తూ లక్షల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించిన అమ్మవంటి పెద్ద సంస్థ 


ఆబాలగోపాలాన్ని ఉత్సాహం తో ఉరకలెత్తించే చక్కని ప్రయాణం రైలు ప్రయాణం 


పట్టాలు రెండైనా గమ్యం ఒక్కటి గా సాగాలని చెప్పే దాంపత్య రహస్యము 


ఇంట్లో ఉన్నట్లే సకల సౌకర్యాలను అందిస్తూ అన్ని వర్గాల వారిని అలరించగలిగిన పుష్పక విమానము 


అన్ని అవసరాలను తీర్చగలిగే కల్పతరువై అనేక సేవలందించు ప్రభుత్వ సేవిక


పెరుగుతున్న విజ్ఞానానికి అనుగుణంగా ఒదిగిపోతుంది 


తనను తాను నవీకరించుకొంటూ నవవధువుగా మారుతూ...


సదా మీ సేవలో అంటూ సకల ప్రజానీకానికి తనదైన సేవనందించే చక్కని ప్రజా సేవిక... మన ధూమశకటము.... 


ఈ కవిత నా స్వీయ రచన ఎట్టి అనువాదం కాదు ---చెన్నా విజయలక్ష్మి

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧