స్వచ్ఛ మైన ప్రేమ 20102020

 


నిర్వహణ

శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

****""************"

1.కోరాడ గారు

2.సుధారాణి గారు

3.సునంద వురిమిళ్ళ గారు

4.భరద్వాజ గారు

5.అయిత అనిత గారు

6.ఇంద్రవత్ రాహుల్ గారు

7.డా.బల్లూరి ఉమాదేవి గారు

8.విట్టు బాబు గారు

9.కె.సి.నరసయ్య గారు

10. వల్లాల విజయ లక్ష్మి గారు

అక్షర చిత్రాల రూపశిల్పి

11.మర్రి జయశ్రీ గారు

12.దీపక్ న్యాతి గారు

13.కోరాడ గారు

14.రాపోలు అరుణా స్వామి గారు

*********""

[20/10, 8:37 PM] Korada: కవితాగానం

అంశం:-

స్వచ్ఛమైనప్రేమ...........!

కోరాడ నరసింహా రావు !

"గొప్పగా చెప్పుకునేలా!"

********************

ఔను.....!

స్వచ్ఛమైనప్రేమవున్నచోటే....అందమైన...ఆనందమైన జీవితం విలసిల్లు తుంది ...!యిదినిజం!!

అందుకే......!

ప్రేమించాలి...! జీవితాన్ని

ప్రేమించాలి...!

సాటిమనిషినిప్రేమించాలి....!

ఈ ప్రకృతిని ప్రేమించాలి!

సృష్టి సమస్తాన్నీ..... ప్రేమించాలి !!

కన్న తల్లిని చూడు .....,

ఎలాప్రేమించాలోనేర్చుకో

ప్రేమిస్తేనే...సేవలోనికష్టంకూడా...ఆనందాన్నేకలి గిస్తుంది ....!

స్వసుఖత్యాగానికిసైతం

ప్రేరేపిస్తుంది....!

 నువ్వు పుట్టి,పెరిగిన ఈ 

దేశాన్ని ప్రేమించు...!

అలా నువ్వు ప్రేమించి నపుడే....ఈ దేశం కోసం

నీ ప్రాణాలను కూడా ఇవ్వ టానికి సిద్ధ పడ గలవ్....!

ఎందరో...పుట్టారు...!

అయినా...కొందరే...ఈ

దేశాన్ని స్వచ్ఛంగా ....

ప్రేమించారు....! గాంధీ...

భగత్...అల్లూరిల్లా ...!!

అందుకే....వారంతా....

చరిత్రలో...నిలిచిపోయారు...!తర తరాలూ...

గొప్పగా చెప్పుకునేలా !!

********************

.........కోరాడ.

2

[20/10, 9:18 PM] +91 74165 92715: **కవితా గానం**

🙏🙏 సుధారాణి కృష్ణంరాజు🙏🙏"నేటి అంశం-స్వచ్చమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో 

అందమైన జీవితం అక్కడే ఉంటుంది"

గాంధీజీ ‌సిద్దాంతాలు సమ సమాజానికి సోపొనాలు

పగ ప్రతీకారం అనేవి మనిషిని

దహించి వేస్తాయని

వాటిని జయించ వలెనంటే

ప్రేమ అనే ఆయుధం తో జయించ గలమని

అహింస అనే ఆయుధం

ఎల్లవేళల రక్షణ కవచంగా ఉంటుంది 

మనం చేసే ప్రతి పని అంతరాత్మ సాక్షిగా ఉండాలని

మానవ సంబంధాలు స్వచ్చమైన ప్రేమ బంధం తో ముడిపడి ఉంటాయి

పగ ప్రతీకారం అనేవి మనిషిని

కలుషితం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తాయి అదే ప్రేమ ను పంచినట్లయితే మనతో పాటు ఎదుటి వారు కూడా సంతోషంగా ఉంటారని

అందమైన జీవితానికి అదే పునాది

ఒకరి ద్వారా సంక్రమించిన ది ఏదయినా నీకు తాత్కాలిక ఆనందం మాత్రమే అదే నీకు నువ్వు గా శ్రమ పడి పొందింది

ఏదయినా శాశ్వత ఆనందాన్ని కలిగిస్తుంది

పరోపకారం చేసి ఎల్లప్పుడూ అవసరం ఉన్నా వారికి అందుబాటులో ఉంటే అలాంటి వ్యక్తి భగవంతుడి కి ప్రీతి పాత్రుడు ఎవరినైనా నిందించే ముందు ఎవరికి వారు తమను తాము ప్రశ్నించు కోవాలి 

తాము చేసే పాపాలు ఎవరికి తెలియవు అనుకోవద్దు ప్రతి ఆలోచనలో భగవంతుడు చూస్తూ తీర్పు ఇస్తాడు

సత్యమేవ జయతే అహింసో పరమో ధర్మహ

ప్రేమ ను కాపాడితే ప్రేమ జీవితాన్ని కాపాడుతుంది

అందుకే మహాత్మా గాంధీ జాతిపిత చిరస్మరణీయుడు🙏🙏👍

3

[20/10, 9:27 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*

తేదీ:20-10-2020

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: స్వచ్చమైన ప్రేమ

**********************

పసితనమంత స్పటికంలా మెరుస్తూ

పల్లవించే పచ్చని చెట్టులా 

ప్రాణ వాయువుతో 

పరిసరాలను ఆరోగ్య వంతంగా మారుస్తూ...


తనువూ మనసును అర్పించే స్వచ్చమైన ప్రేమ మూర్తులు.

మానవతా విలువలకు మారు రూపులు.

దేశం కోసం దేహాన్ని పణంగా పెట్టిన అల్లూరి భగత్ రాజుగురులు!


సత్యాహింసల శాంతీ రూపుడై స్వాతంత్ర్యం సాధించిన గాంధీ మహాత్ముడు!


లాల్ బాల్ పాల్ 

లక్ష్మీ బాయి రుద్రమలు ..

రామ కృష్ణ పరమహంస, వివేకానందులు!

స్వచ్ఛమైన మనసులున్న మహోన్నత రూపాలు!


మన దేశ యవనికపై సువర్ణాక్షరాలతో లిఖించుకున్న  ఎందరో మహానుభావులు!


అందుకే స్వచ్ఛమైన జీవితమున్న చోటే...


సత్యం ధర్మం నాలుగు పాదాలతో నడుస్తూ

అందమైన జీవితం అక్కడే ఉంటుందని తెలిపిన 

మానవతా విలువల ప్రతి రూపాలు!


4

[21/10, 8:24 PM] భరద్వాజ గారు: 🎊☘️కవితాగానం13🎻

నేటిఅంశం -స్వచ్ఛమైన ప్రేమయెక్కడుందో అందమైన జీవితం అక్కడేఉంది 

🌹శీర్షిక-మానవత్వం ప్రతిబింబించాలి 🌹

మనిషికి శరీర  శుభ్రత కంటే  -

మనసు శుభ్రత  అవసరం -

స్వచ్ఛత మాటల్లో కాదు మనసులోఉండాలి -

కష్టాన్నిచూసి చలించని మనిషి -

కర్కశసమయం లో ఆదుకోనుముందుకురాని మానవుడు -

సాటిమనిషిని ప్రేమించలేని జీవి 

ఎంత గొప్పవాడైనా  ఉపయోగంలేదు -

కనిపెంచినతల్లిని కాపాడలేనివాడు-

ప్రకృతిని కాపాడుకోలేనివాడు -

పరోపకారబుద్ధిలేనివాడు -

కుట్రకుంతంత్రాలతో బ్రతికేవాడు -

స్వార్ధం  గూడుకట్టుకున్నవాడు -

బ్రతకలేడు  సమాజంలో -

మంచిమనసున్న మనిషి 

బంగారం అద్దిన గులాబీ లాంటివాడు -

ఎదుటివాడిలో మంచి కోరుకునేవారు 

తన మనసు మురికి కాకుండా చూసుకుంటే 

గాంధీజీ కలలుకన్న స్వరాజ్యం రాకపోదు -

ఎవరిమనసును వారు ప్రశ్నించుకోగలిగితే -

ఎవరితప్పును వారు తెలుసుకోగలిగితే -

మనిషిమనీషిగాఎదుగుతాడు -

ఇదినాస్వీయరచన 

భరద్వాజ రావినూతల ((RB)🖍️

కొత్తపట్నం5

5

అంశం : స్వచ్ఛమైన ప్రేమ

శీర్షిక: *విజేత*


కల్మషాన్ని

మనసంతా పూసుకొని

ప్లాస్టిక్ నవ్వును

పెదవులపై పూయిస్తూ

ఎంతకాలం నటిస్తావ్?


చూపుల్లో

అసూయ నింపుకొని

రసనపై తేనెమాటలను

చిందిస్తూ

ఎంతకాలం నటిస్తావ్?


స్వార్థపు పురుగును

హృదయమూలాల్లో

పెంచుతూ

పరోపకారిగా

సమాజ తరువును 

ఎంతకాలం మభ్యపెడతావ్!


ఏదో ఓ నాడు

దురాలోచనల చీడ

నీ కాయపు కట్టెను

నిలువునా కాల్చేయగలదు!


స్వచ్ఛమైన ప్రేమను

మదిలో పల్లవింపజేస్తూ

నిజాల దారిలో

నిర్భయంగా నడువు!

సాయపు చేతులను 

నిర్భాగ్యులకు ఆసరాచేయు!

మానవత్వపు పరిమళాలను పంచుతూ...విజేతవై నిలువు!!


రచన

అయిత అనిత

8985348424

జగిత్యాల

6.

*కవిత గానం*

=================


అంశం : స్వచ్ఛమైన ప్రేమ 

తేది : 21/10/2020




 🇮🇳 *స్వచ్ఛమైన ప్రేమ*🇮🇳


         


మేము భారతీయులం 

భరతమాత ముద్దు బిడ్డలం 

శాంతి కపోత దూతలం 

ఏకత్వంలో భిన్నత్వంలా 

ఐక్యమతంగా ఉంటూ 

గాంధీజీ కలలు కన్నా 

భారత జాతి వారసులం 

నైతాజి సైనికులం 

మేమంతా సోదరులం 

మేము భారతీయులం 

మంచి చేయు పౌరులం 

ప్రాణమిచ్చు స్నేహితులం 

ఒకరికొకరు సేవకులం 

చెడ్డ వారి శత్రువులం

స్వచ్ఛమైన ప్రేమ మాది 

మేము భారతీయులం

న్యాయానికి నాయకులం 

పొలం దున్ను హాలాలం 

ప్రగతి బాట శ్రామికులం 

మేమంతా ఒకే కులం 

మేము భారతీయులం....


      

*హామీపత్రం* : ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను.. 

 

        

      ధన్యవాదములు.. 🌹🌹



*ఇంద్రావత్ రాహుల్* 

      *కొత్తపేట్*

 *నిజామాబాద్*

9848054079..

7

[21/10, 9:12 PM] Balloori Umadevi Poetess: కవితా గానం 

 పేరు: డా. బల్లూరి ఉమాదేవి 

 అంశం :స్వచ్ఛమైన ప్రేమ



ప్రేమంటే మధుకలశం

ప్రేమంటే ఆమృతభాండం

పంచేకొలది పెరిగేది ప్రేమ

వెలగట్టలేనిది కన్నవారి ప్రేమ

విలువ కట్టలేనిది తోబుట్టువుల ప్రేమ

కన్నవారిని వీడి కడదాక నీతో

కలిసి బ్రతుకుటకు సిద్ధమై

కలిమి లేముల్లో కష్టసుఖాల్లో

నీడలా నిన్నంటి వుండే ఇల్లాలిప్రేమ

ఊట బావి అని మరువబోకెపుడు

అందుకే అందరికీ ప్రేమను పంచు

అది పుష్పకవిమానంలాంటిది సుమా

ఎంతపంచినా తరిగిపోని 

అక్షయభాండమది

కానీ

అజరామరమైనది ప్రేమని యెంచు

ప్రేమపేరుతో మోసంచేయకు

ప్రేమను నటించి వంచనకు పాల్పడకు

స్వచ్ఛమైన ప్రేమను కల్తీ చేయకు

ప్రేమను ప్రేమించు ప్రేమను పంచు

అదేకావాలి నీ ఆశ శ్వాస

8

[21/10, 9:16 PM] Vittubabu Poet: *విట్టుబాబు ౼ నానీలు*

21.10.2020


శుక్రాచార్యుని

కపటం పనిచేయలేదు

వామనుడు

విశ్వవ్యాప్తమయ్యాడు


అరిషడ్వర్గాల్లోనే

ఆనందం మనిషికి

అందుకే

వదల్లేకపోతున్నాడు!!


దేవుడికీ

మనిషి లక్షణాలే!

వాడూ వీడిసృష్టేనేమో

అని అనుమానం!!


అన్నీ వదిలేస్తే

స్థితప్రజ్ఞతట...

చెప్పడం

వదల్లేకపోతున్నా నెందుకో!


నాది కానిదేదీ

వ్రాయలేను...

నా పాత్రలకూ

అన్నీ నా గుణాలే!!


నా లోపలివాడు

నాకు నచ్చడు

అందుకే నీలో వాణ్ణి 

కడిగేసే ప్రయత్నం!!


రాగద్వేషాలన్నీ

నీ ఉనికి వల్లనే

అందుకే

నిన్ను వదల్లేను!!


ముక్తికాంతకోసం

సన్యసించాలట...!

అక్కడా

కాంతాపరిష్వంగమే!!


నా వేదననంతా

ప్రపంచమూ

అనుభవించాలనుకుంటా

అందుకే కవిత్వం!!


ఏకరూప సాధనకోసమే

తాపత్రయం

అందుకోసమే

భావాల పంపకం!!


నాతో నే మాత్రమే 

ఉండే ఏకాంతప్రదేశం

బాత్రూం!

అందుకే ఆనందగానం!!


ఏకాంతంలోనూ

ఆలోచనల సాక్షిగా

నువ్వు!

నాకోసం వెతుక్కుంటున్నా!!


అంత గీతాశాస్త్రమూ

అభిమన్యుడు

పోయినప్పుడు

గుర్తుకు రాలేదెందుకో!?

9

[21/10, 9:17 PM] KC Narsaiah KS 26: కవితా గానం


పేరు: కట్టెకోల చిన నరసయ్య

చరవాణి: 7981814784

అంశం:  స్వచ్ఛమైన జీవితం ఎక్కడ ఉంటుందో అందమైన జీవితం అక్కడే ఉంటుంది

శీర్షిక: ప్రేమ పోరాటం 


 మాయమవుతున్న స్వచ్ఛత

 కల్తీ పాలవుతున్న నాణ్యత

 ప్రేమలో మాయలు మంత్రాలు

 మాయదారి నటనలో

 కుళ్లు కుతంత్రాలు 

 విలువలు కోల్పోతున్న మానవత

 వెండితెరపై ప్రేమ విహారాలు

 బుల్లి తెరపై రగులుతున్న

 ప్రేమ ఆగ్రహజ్వాలలు

 అరచేతిలో వైకుంఠం

 అదో అందమైన రంగుల లోకం

 మంచి చెడుల తూకం

 వంచెనకు గురవుతున్న మంచి

 ఆవిరై పోతున్న అందమైన జీవితం

 వృద్ధాశ్రమాల గుంజలకు

వేళ్ళాడుతున్న కన్నపేగు బంధాలు 

 ఇప్పటి ప్రేమజంటలు

 విలన్ పాత్రలతో చిందులు తొక్కుతున్నయి

 స్వచ్ఛమైన గాలి కోసం పక్షుల విహారం 

 స్వచ్ఛమైన ప్రేమ కోసం

  సమాజంలో మానవత ప్రాకులాట 

 అందమైన జీవితం కోసం ప్రేమ పోరాటం

10

[21/10, 9:27 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుంటే*-

*అందమైన జీవితం అక్కడేనంట*


కష్టాలకడగండ్ల నుండి

కన్నీటివడగండ్ల నుండి

కలలపంటను కాపాడే

ఛత్రం అమ్మానాన్నల ప్రేమ


బాధ్యతలబరువు తెలియనివ్వక

ఇబ్బందుల ఎండ తగలకుండా

సంతోషజ్యోతి ఆరకుండా చూసే

చల్లనిచేతులే తల్లిదండ్రుల ప్రేమ


జన్మదాతల ప్రేమకు మించినది

జగాన ఎక్కడా ఉండదు!

బ0గరుబాల్యాన్ని మించిన

భాగ్యమూ లేదు ప్రపంచాన


స్వచ్ఛమైన మనస్సులతో

సదా హర్షించే పిల్లలమనస్సు

స్వచ్ఛమైన ఇంద్రధనుస్సు

బాల్యమే జ్ఞాపకాలగొలుసు


అ మదురోహాల జత కోరే

స్వచ్ఛ ప్రేమాభిమానులు

సృష్టికి అందాన్నిచ్చే మణులు

వారున్న తావులే ఆనందబృందావ నులు

  

: వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

11

[21/10, 9:27 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో

అందమైన జీవితం అక్కడే ఉంటుంది సూక్తి కవిత.


శీర్షిక..సిరి సంపదలు


మనిషిగా ఈ నేలపై జన్మించినందుకు

చేసుకోవాలి జన్మ సార్థకం

వెదజల్లాలి మానవత్వ పరిమళం

సాటి మనుషుల పట్ల దయ చూపడం ధర్మం

స్వార్థం అనే కుబుసం వదిలి

స్వచ్ఛమైన మనసు కలిగియుండి

సక్యతతో  మెలగాలి

నాకు నేనే అంటూ విర్రవీగితే

ప్రమాదమే ఎప్పటికి

ఎదుటివారి మంచిని కోరే వాడు

సదా వందనీయుడు

సాటి జీవుల పట్ల 

ప్రేమాభిమానాలే చూపని మనిషి పేదవాడే ఎన్నటికీ

శాంతి సౌఖ్యాల సిరులే

చేకూర్చును ఆరోగ్యమనే మహా బాగ్యాన్ని

సత్యం,శాంతి బాటలో నడచిన 

మహాత్ముడు

స్వచ్ఛమైన మనసున్న ఇంకెందరో మహానుభావులు

పరోపకారమే పరమావధిగా జీవించి

అందమైన జీవితం అక్కడే ఉండునని రుజువు చేసి నిలిచారు చరిత్రలో.

12

[21/10, 9:28 PM] దీపక్ న్యాతి: *కవితా గానం* 

పేరు : డా.దీపక్ న్యాతి

తేది : 21-10-2020

అంశం : స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అందమైన జీవితం అక్కడే ఉంటుంది


జీవులన్నీ మనుగడ సాగిస్తున్నాయి

జీవిస్తున్నాయి మరణిస్తున్నాయి

జనన మరణాలు ప్రతి జీవికి సాధారణమే

ప్రేమ అన్ని జీవుల లో ఉన్నా

ప్రేమ విలువ తెలిసింది మనిషి ఒక్కడే

స్వార్థంతో ఎదగాలనుకున్న మనిషి

తోడుగా మోసాలనెంచుకుంటాడు

నమ్మకాల వమ్ము చేస్తాడు

నమ్మకం నశించిన చోట స్వచ్ఛత కొరవడుతుంది

ప్రేమ నాటకీయమౌతుంది

మనిషి మనిషికీ మధ్యన

అనురాగం అగాధానికి జారుతుంది

మమత కనుమరుగైపోతుంది

ఆప్యాయత అంటరానిదైపోతుంది

ప్రేమకు ప్రతిరూపాలైన

మమతానురాగాలు ఆప్యాయతలు

అందని ప్రేమ కలుషితమౌతుంది

జీవితం అసంతృప్తితో నరకాన్ని తలపిస్తుంది

స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో

అందమైన జీవితం అక్కడే ఉంటుంది


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

13

[21/10, 9:31 PM] Korada: కవితాగానం 

అంశం:- స్వచ్ఛమైనప్రేమ

కోరాడ నరసింహా రావు !

గొప్పగాచెప్పుకునేలా...!!

********************

ఔను.....!

స్వచ్ఛమైనప్రేమ వున్న చోటే....అందమైన,ఆనందమయజీవితంవిలసిల్లు తుంది ....!యిదినిజం!!

అందుకే..!ప్రేమించాలి!!

జీవితాన్నిప్రేమించాలి !

సాటిమనిషినిప్రేమించాలి !

కన్నతల్లిని చూడు ...!

ఎలాప్రేమించాలోనేర్చుకో

ప్రేమిస్తేనే...సేవ లోని కష్టం కూడా ఆనందాన్నే కలిగిస్తుంది ....!

స్వ సుఖ త్యాగానికి సైతం ప్రేరేపిస్తుంది ...!

నువ్వు పుట్టి,పెరిగిన నీ దేశాన్ని ప్రేమించు...!

అలా...ప్రేమించగలిగినపుడే....నీ దేశం కోసం...

నీ ప్రాణాలను కూడా...

ఇవ్వటానికి సిద్ద పడ గలుగు తావ్...!

ఎందరో....పుట్టారు....!

ఐనా....కొందరే...ఈ దే  శాన్ని ప్రాణ ప్రదం గా... ప్రేమించ గలిగారు !!

గాంధీ,అల్లూరి,భగత్ సింగుల్లా ....!

అందుకే...వారంతా....

చరిత్రలో...చిరస్థాయిగా

నిలవగలిగారు...!

తరతరాలూ...గొప్పగాచెప్పుకునేలా....!!

*******************#

......కోరాడ.

14

రాపోలు అరుణా స్వామి గారు

అంశం:స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అందమైన జీవితం అక్కడే ఉంటుంది


సూక్తికవిత


స్వచ్ఛమైన ప్రేమకు

ఇచ్చుటయే తెలుసుగాని

ఎటువంటి

ప్రతి ఫలము నాశించదు


ఏదో ఆశించి

ప్రేమిస్తున్నానడం సరికాదు

ఏ స్వార్థము లేకుండా

ఎక్కడవున్నా 

అవతలివ్యక్తి క్షేమం కోరుకోవడం

స్వచ్ఛమైన ప్రేమ లక్షణం


ఆ ప్రేమను పొందగలిగే 

అర్హత ఉండి

తిరిగి ప్రేమించగలిగితే

ఆస్వాదించే మంచి మనసులుంటే

ఆ యింటికి స్వర్గమే దిగివస్తుంది

ఆ యిల్లు బృందావనమై వికసిస్తుంది


వారి ఆలోచనల్లో

రాగద్వేషాలకు తావు లేకుండా

కలిమిలో లేమిలో కలిసి మెలిసి ఉంటూ ఆనందంగా జీవిస్తారు

✍రాపోలు అరుణాస్వామి, సిరిపురం

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧