YKS November 2020
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
Author of వెన్నెల శిల్పంవీరా గుడిపల్లి
The mathematics teacher and poet
******************
న్యాయ నిర్ణేత ః సంధ్యా శర్మ గారు
***********************
1.పరాంకుశం రఘు నారాయణ గారు
2.భరద్వాజ గారు
3.సుమన ప్రణవ్ గారు
4.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
5.సి.హెచ్ విజయ లక్ష్మి గారు
6.ఇంద్రవత్ రాహుల్ గారు
7.డా.ఆంజనేయులు గారు
8.మిట్టా లక్ష్మి గారు
9.కొలచన విజయ భారతి గారు
[10/11, 8:00 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవనజ్యోతి కవిసమయం*
*అంశం :విశ్వాసం*
*****************************
*కవితా శీర్షిక :విశ్వాసమే విజయ రహస్యం*!
*******************************
రచన :పరాంకుశం రఘు నారాయణ
జిల్లా :మహబూబాబాద్
మానవీయ కోణంలో విశ్వాసం?
అప్రతిహత ప్రహాసనం!
మనిషి విషయంలో విశ్వాసానిదే తొలి అడుగు!
మానవ కళ్యాణానికి విశ్వాసమే మలి అడుగు !
మనిషి నైజానికి విశ్వాసమే కొలమానం!
మనిషి తేజస్సుకు విశ్వాసమే ఆభరణం!
మనిషిలోని అంతర్లీన గుణాలలో....,
విశ్వాసానిదే అగ్రస్థానం!
మనిషి విజయ పరంపరలో....,
విశ్వాసానిదే మహోన్నతస్థానం!!
విశ్వాసమే అంతిమ విజయం!
విశ్వాసమే శాశ్వత విజయ రహస్యం!!
వృద్ద్దాప్యదశలో తమ ఆలనా పాలనను..,
చూసుకొంటారని తల్లి తండ్రుల విశ్వాసం !
పెంచి పోషిస్తున్న పంట పొలాలు సైతం భవిష్యత్తులో..,
మంచి పంటనిస్తాయని రైతు విశ్వాసం !
చదివిన చదువు సుదూర భవిష్యత్తులో..,,
ఉపాధిమార్గాన్ని చూపిస్తుందనీ విద్యార్ధి విశ్వాసం !
సంక్షేమ ఫలాల సహకారంతో..,
స్వయంవృద్దిగా అడుగులు పడుతాయనీ...,
ప్రభుత్వ విశ్వాసం !
*************************
2
[10/11, 8:18 PM] భరద్వాజ గారు: కవనజ్యోతి
మంగళవారం
కవితాంశం- *విశ్వాసం*
శీర్షిక ఃజగమంతానిండిపోయింది
పేరుఃభరద్వాజ
ఊరు-కొత్తపట్నం
9866203795
విశ్వాసం అనేదిమూడక్షరాల పదం కాదు.
విశ్వాంతరాళమంతానిండి ఉన్నబంధం-
అక్షరాలలో వర్ణించలేనిది
భావాలకు అందనిది
భాషలేనది.-
ప్రతిమనిషి నరనరాలలో జీర్ణించుకుని ఉండేది-
నమ్మకానికి మారు పేరు-
నాణ్యత ఎరుగదు దీని తీరు
భార్యాభర్తల మధ్య బంధం విశ్వాసానికి మూలం-
అదిలేక పోతే నడవవు కాపురాలు-
అధికారికి ఉద్యోగి చూపాలి విశ్వాసం-
నాయకుడు ఓటరుకు-
శిష్యులుగురువుల పట్ల-
ప్రేమికులు ప్రేమ పట్ల-
జంతువులు మనుషుల పట్ల-
మనిషి మరొక.మనిషిపట్ల విశ్వాసం ఉంది కాబట్టే నడుస్తుంది ప్రపంచం-
నల్లటి నేలపైవిశ్వాసం ఉంచి రైతు వేస్తాడు భూమిలో విత్తు-
వర్షం కురుస్తాయని భూమి పై పెడతాడు సొత్తు యావత్తు-
బ్రతుకు అనే పడవసాగాలంటే విశ్వాసం అనే చుక్కాణి తోడు కావాల్సిందే-
తండ్రి పైన విశ్వాసం ఉంది కాబట్టే అడవుల కెళ్ళాడు రాముడు-
భక్తి అనేవిశ్వాసం ఉంది కాబట్టేహనుమంతుడికి అంతగురి-
విశ్వాసం లేని జగతి లేదు.
బంధాలుఅనుబంధాలు తెలియనివిశ్వాసం కానరాదు-
విశ్వాసానికివిశ్వాసం తగ్గితేప్రపంచం కుంటు పడ్తుంది-!
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల(RB)✒️
3
[10/11, 8:36 PM] +91 89196 96972: కవన జ్యోతి
అంశం:విశ్వాసం
పేరు:సుమన ప్రణవ్
విశ్వాసం!
కారు చీకటిని చీల్చి
అరుణతారలా ఉదయిస్తుంది
మట్టిపొరల బీటల నుండి
లేత మొక్కై శ్వాసిస్తుంది
అంతులేని పయనంలో
మలుపెరుగని పాదానికి
సెలయేటి తీరమై పలుకరిస్తుంది
సోలిన మనోరథంముపై
రుధిరముప్పొంగిన
స్పూర్తి పతాకమై రెపరెపలాడుతుంది
మరణమెదురు నిలిచిన కనుపాపపై
రేపటి సూర్యుడిలా కలకంటుంది
✍️✍️సుమనప్రణవ్
4
[10/11, 8:49 PM] Gajula Bharati KS 20: కవనజ్యోతి కవిసమయం
****†*************
అంశం:విశ్వాసం
శీర్షిక:విశ్వాసమే నీ ఊపిరి
ఓ నైరాశ్యం నిన్ను ఆచేతంగా మారుస్తున్నా
ఓ వేదన నిన్ను దిగులు బావిలోకి తోస్తున్నా
నీలోని శక్తి సామర్ధ్యాలు నిన్ను వొదిలిపోతున్నా
నీ పరివారం నిన్నే వెక్కిరిస్తున్నా
విశ్వాసమే ఆయుధంగా చేసుకొని వేగంగా ముందుకి సాగిపో
మనిషికి విశ్వాసం తోడైతే
తిరుగేలేదు,ఈ జగనా ఎదురేలేదు
కష్టాలు,నష్టాలు ఎదురైన
కన్నీళ్లు,ఖర్మలు బెదిరించినా
విశ్వాసమే మనిషికి నిజమైన ఆభరణం
విధిని సైతం ఎదిరించే ఆత్మస్తైర్యం
తలరాతను సైతం దిక్కరించే ఆత్మబలం
విశ్వాసంతో ,, సంకల్ప బలం తోడైతే విజయం నీ వెంటే
అవయవ లోపాలు మరిచి
ఎవరిసాయం కోసం చూడక
స్వయంకృషితో
నిరంతర పట్టుదలతో అనుకున్నది సాధించే ప్రయత్నశీలురు
విజయాలను అలవోకగా అందిపుచ్చుకునేవారు
విశ్వ సామ్రాజ్య విజేతలు
కలిమికి పొంగక
లేమికి కుంగక
ఆశయసాధనతో..విశ్వాసం తో ముందుకు సాగు
ఈ విశ్వమంతా నీ పాదాక్రాంత మగు
ఓడిన తీరాలను పక్కన పెట్టు
గెలవాల్సిన లక్ష్యం వైపు గురిపెట్టు
నీ పట్టుదలే ఆయుధంగా
నీ శ్రమే ఇంధనంగా
నీ సంకల్పమే సిద్దించగా
నిరంతర నీ పొరటపటిమే నిన్ను విజయ తీరాలకు చేర్చు
అనంత శిఖరంపై
విజేయుడివై వెలుగొందేలా..చేర్చు!!
*****************
గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
********************
5
[10/11, 9:01 PM] Vijayalakshmi Ch KS 38: కవనజ్యోతి (కవి సమయం )
పేరు :చెన్నా విజయలక్ష్మి
ఊరు :బీర్కూర్, కామారెడ్డి
అంశం :విశ్వాసం
శీర్షిక :
***************-**********-
సృష్టిలోని ప్రతి అంశం విశ్వాసం
అమ్మా నాన్నలు లేనిదే జన్మ లేదన్నది
ప్రకృతి లేనిదే జీవం లేదన్నది
బంధాలు ఆనందాన్ని ఇస్తాయి
దుఃఖానికి హేతువవుతాయన్నది
నిజం... నిజమే విశ్వాసం.
ఆరంభానికైనా
ఒక పని చేయాలన్నా
కొనసాగించాలన్నా
ఆటంకాలు ఎదుర్కోవాలన్నా
విజయం రుచి చూడాలన్నా
కావాల్సింది నీపై నీకు విశ్వాసమే
ఓటమిలో వెలుగు చూడాలన్నా
అలసినవేళ ఉత్తేజం పొందాలన్నా
ఉన్నత శిఖరాలు చేరాలన్నా
ధైర్యం తోడై సాగాలన్నా
విశ్వాసమే ముఖ్యం
విశ్వాసము నీ వెన్ను తడుతుంది
కావలసిన అవకాశాలను చూపెడుతుంది
నిన్ను నీకుతెలియ జేస్తుంది
మంచి మార్గం లో నడిపిస్తుంది
విశ్వాసమే నీ ఊపిరై సాగాలి ముందుకు
హామీ :ఇది నా స్వీయ రచన. ఎట్టి అనువాదము కాదు... చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్, కామారెడ్డి. 🙏🙏
6
[10/11, 9:02 PM] Indravat Rahul Poet Ks 11: *🪔కవన జ్యోతి🪔*
*తేది :* 10/11/2020
*శీర్షిక :* విశ్వాసం
*విశ్వాసం*
మానవులకు ఉండాలి విశ్వాసం
జంతువులకు ఉండాలి
విశ్వాసం
దేవుడి మీద ఉండాలి విశ్వాసం
మనకు వచ్చే కష్టాలకు మనం ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం ఉండాలి
మన కర్మకు మనమే కారణం అని ఉండాలి విశ్వాసం
పెద్దలా మాట సద్ది మూట
అని ఉండాలి విశ్వాసం
విశ్వ బాటసారిగా ఉంటూ
విశ్వాసంతో ముందుకు
అడుగులు వేయాలి
నిజ జీవితమును విశ్వాసంతో ఉండాలి ఇది మానవ ధర్మం..
ధన్యవాదములు.. 🙏🌷
*ఇంద్రావత్ రాహుల్*
కొత్తపేట్
నిజామాబాద్
9848054079..
🪔🌸🪔🌸🪔🌸🪔🌸🪔
7
[10/11, 9:05 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆయుర్వేదం చిట్కా
భారతీయ వైద్యం కోసం
చరకుడు సుశ్రుతుడు మొదలైన
ప్రాచీన వైద్యులు ఎందరో
యజుర్వేదంలో
తెలిపారు మన గృహంలోని ఆయుర్వేదానికి సంబంధించిన ఆకుకూరలు చుట్టుపక్కల ఉన్న ఆకులు అలములు
ఈ ఆయుర్వేద మొక్కలు
ఆయుర్వేదం భారతీయ సంప్రదాయ వైద్యం వేప కషాయం
బిల్వపత్రాల కషాయం
పారిజాత ఆకుల కషాయం
తిప్పతీగ కషాయం అన్ని భారతీయ వైద్యానికి సంకేతాలు
తల వెంట్రుకలు చిక్కగా చక్కగా నల్లగా ఉండాలంటే గుంటగలగర ఆకు
తయారు చేసిన నూనెను వాడండి
నువ్వుల నూనె రుద్దుకుంటే
నొప్పులను తీసుకోవడమే కాదు
ఉపశమనం కలిగిస్తుంది
ఎందరో భారతీయ ధన్వంతరి లు
భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రతీక
జిలుకర ఓ మా మెంతులు
ఆవాలు గసగసాలు అన్ని మన వంటల్లో వాడేవి
పసుపు యాంటీబయటిక్ గా పనిచేస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచే ఇలాంటి ఎన్నో కషాయాలు భారతీయ సంప్రదాయ వైద్యానికి నిలయాలు
నేటి కరుణ వేల ఇవన్నీ నేటికీ తట్టుకోవడానికి ఈ కరోనా వేల
తోడ్పడుతున్న విషయాన్ని మరువలేం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
8
[10/11, 9:13 PM] +91 94400 97002: కవనజ్యోతి
10/11/2020
అంశం:విశ్వాసం
...........................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
...............................
శీర్షిక: విశిష్ట శ్వాస
......................
అదరక బెదరక
అలుపు సొలుపు లేక
అడుగు వేయి....
ముందుకి మునుముందుకి
ఆ వేసిన అడుగు
నీ ఆత్మవిశ్వాసం
ఉచ్ఛ్వాస నిశ్వాసల
శరీరంలో ఆత్మ విశ్వాసం దివ్యంగా వెలిగించి 🪔
గుండె నిండుగా ఊపిరిని పీల్చి అడుగు వేస్తే
ఆ అడుగులు దారి
కచ్చితంగా విజయపథం
లక్ష్యం ఏదైనాగమ్యం ఏదైనా ఎంత దూరమైనా
ఎంత గొప్పదైనా
నీ అడుగులు
ఆత్మవిశ్వాసంతో ఆరంభం ...
అవకాశాలలో అడ్డంకులున్నా అడ్డంకులలోఅవకాశాలను చూపు ఆత్మవిశ్వాసం నిలుపునీచూపు
నీ చూపుకు దార్శనికత
నీ మెదడుకు ప్రణాళిక
నీ చేతలకు శక్తి
నీ అడుగుకు ఇంధనం
ధనం ఆత్మవిశ్వాసం
ఉగ్గు పోసిన అమ్మ విశ్వాసం
భరోసా ఇచ్చిన నాన్న విశ్వాసం విద్య గరిపిన గురువుల విశ్వాసం
మొదటి అడుగు వేసినపుడు చేయూతనిచ్చి
వెన్నుతట్టి
నీ వెంట నిలిచియుండగా అనుమానమే సందేహమేల నిన్ను నీవు నిరూపించుకునే అవకాశం
నీ ఆత్మ విశ్వాసం తోనే
అనుమానం భయం అనే చీకట్లు తొలగించుకుని ఆత్మవిశ్వాసం దివ్వెను
వెలిగిస్తే....ఆ దివ్వె
శక్తి,సమర్థత ,
ప్రణాళిక ,బలము ,
మేధస్సు, ఆలోచన
దారి ,లక్ష్యం ,గమ్యం ,
ఆశయం ఇలా ఎన్నో దీపాలను
పక్కపక్కనే
వెలిగించుకుంటూ
దారి అంతా
దీపాల వరుసలతో
🪔🪔🪔🪔🪔
దీపావళి....
దారి అంతా వెలుగులు
దారి అంతా సుస్పష్టం వెలుగుల దారి నీది
దివ్య దీపావళి నీది
నవ్వుల దీపావళినీది
నిన్ను చూసి మురిసే నీ తల్లిదండ్రుల కన్నుల్లో తారకలు నీకు విద్య నేర్పిన వారి
మదిలో మతాబులు
నీ పేరుతో ఊరికి ..
నీవు తెచ్చిన పేరుతో అందరి శుభాకాంక్షల తారాజువ్వలు..
కాలుష్య రహిత దీపావళి ఆనంద రంగవల్లుల దీపావళి పర్యావరణహిత దీపావళి
ఇదే అసలైన దీపావళి.
.................................
ఈ కవితను ఆశీర్వచన దేనికి అనుకరణ కాదు.
.............................
🪔🌹🪔🏵🪔🌹🪔
9
[10/11, 9:40 PM] కొలచన విజయ భారతి Poetess: "కవన జ్యోతి"
పేరు:కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
అంశం: విశ్వాసం
తేదీ:10-11-2020
*****************
ఏ పని చేసినా ఆత్మవిశ్వాసం
పొదుపుకుని అడుగు ముందుకేస్తే అపజయమనేది ఉండదు
ముందు నీ మీద నీవు విశ్వాసం
ఉంచుకో
ఆపై ఆత్మస్థైర్యం పెంచుకో
గెలుపెక్కడో లేదు
ముందు నిన్ను నువ్వు నిరూపించుకో
గెలుపు నిన్నే వరిస్తుంది
నీ వెనకే నడిచి వస్తుంది
ప్రతి దానిపై నమ్మకముంచాలి
నమ్మకమే విశ్వాసానికి ప్రతీక
🌹🌹🌹🌹🌹
1.కొలచన విజయ భారతి గారు
2. జ్ఞాన ప్రసూనా శర్మ గారు
3.సుమన ప్రణవ్ గారు
4.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
5.వలిపే సత్య నీలిమ గారు
6.సుధారాణి కృష్ణంరాజు గారు
7.ముడుంబ తిరువేంకటాచార్యులు, వరంగల్.
8. శ్రీ దేవి సురేష్ కూసుమంచి గారు
9.వురిమళ్ళ సునంద
10.భరద్వాజ రావి నూతల గారు
11.మిట్టా లక్ష్మి గారు
***********************
1
[13/10, 8:05 PM] కొలచన విజయ భారతి Poetess: కవనజ్యోతి
పేరు:కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:మగువ
శీర్షిక:నీవేమి తక్కువ
12-10-2020
*******************
మగువా!ఓ మగువా
నీవు ఎందులో తక్కువ
అమ్మగా లాలిస్తావు
ఆలిగా మురిపిస్తావు
ఇంటి మహాలక్ష్మి వై
కన్నవారి కనుల దీపాలు
వెలిగిస్తావు
రాజ్యాలు ఏలావు
ఓ ఝాన్సీ రాణి వై
రణరంగాన కత్తిపట్టావు
రాజకీయాల రాటుదేలి
ఇందిరమ్మవై దేశాలు పాలించావు
రక్షకభట నాయకివై
ఓ కిరణ్ బేడిగా రక్షణశాఖ కు
కీర్తి ప్రతిష్టలు చేకూర్చావు
అంతరిక్షంలో అడుగిడి
ఓ కల్పనా చావ్లా గా
భారతదేశానికి ఎనలేని
కీర్తి ప్రతిష్టలు కూర్చి
విధినిర్వహణలో అర్థాంతరంగా అసువులుబాసావు
ఇన్ని రంగాల సబలవై
ఎన్ని సేవలు చేసినా
మగాడనే మృగాడు పైశాచకంగా
నీ మానప్రాణాలు హరించి
నిన్ను అబలను చేస్తున్నాడు
మొగ్గ గానే నీ బతుకులను
తుంచి వేస్తున్న సిగ్గు లేని
మృగాల జన్మలు
నివురు క్రింద ఉన్న నిజాన్ని
వెలుగు చూడనీయకుండా
నీటితో ఆర్పవేస్తున్న
చట్టం న్యాయాలు
మగువా నీవే తెగించాలి
అపర కాళికవై
ఆదిపరాశక్తి వై
వాడి ఆయువుని గురిచూసి
కొట్టి నీవే వాడి జీవితానికి
ఉరివేయాలి
ఇక్కడ కూడా నీ సాధికారత
సాధించడంలో నీదే పై చేయి కావాలి
🌹🌹🌹🌹🌹
2
[13/10, 8:15 PM] Prasoona Sharma Madam: *కవనజ్యోతి*
జ్ఞానప్రసూనాశర్మ ఎల్లికంటి
అంశం::మగువ
13-10-2020
*****************
మగువలు అబలలు
వంటయింటికే పరిమితం
అత్తగారియడుగులకు
మడుగులొత్తుచూ
భర్త కనుసన్నలలో మెలగుతూ
సంతానలక్ష్మిగా
గంపెడుమంది పిల్లల తల్లిగా
విశ్రాంతి వుండకూడని శ్రామికురాలనేధోరణిని
చేరిపేస్తూ,
స్వతంత్ర భావాలతో
సంసారబాధ్యతలతో పాటూ
పురుషునికి సమవుజ్జీగా
విద్యా ఉద్యోగాలతో
అనుకున్న రంగంలో
ప్రగతిపథంలో దూసుకెళ్లతూ
తల్లిగా,చెల్లిగా,భార్యగా,కోడలిగా
బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా
బంధాలు బాధ్యతలు
విస్మరించక
యిందుగలరందుగలరన్నట్లు
విద్యా వ్యాపారవుద్యోగ
రంగాలన్నింటినీ అధిగమించి
నాయకత్వపు పగ్గాలు చేబట్టి
వీరనారులై
శత్రువులపాలిటీ అపర కాళికలై
గరిటె పట్టిన చేతనే
కత్తిని కలమును పట్టగల
సమర్ధవంతురాలై
సాహిత్యప్రియులకు
మంచిరచనలనందిస్తూ
ఎత్తుకుపైఎత్తులువేస్తూ
దుర్మార్గుల చిత్తుచేయగలదిట్ట
నేటి మగువ
3
[13/10, 8:45 PM] +91 89196 96972: కవనజ్యోతి
పేరు: సుమనప్రణవ్
అంశం:మగువ
శీర్షిక: ఆమె
ఆమె విశ్వాంతరాలలో పురుడు పోసుకొనే
పాలపుంత నక్షత్రం దిక్కుల దిక్సూచి యంత్రం
ఆమె మేధస్సు ధవళ హిమ సానువుల సతత హరిత
సౌందర్యాలను ఉత్తుంగ జలపాతాలను
కలబోసుకొనే అవని చందం
ఆమె శత కోటి వేదనల వీణా తంత్రువులను
సవరించి సుడిగుండాల కడలి తరంగములను
ఆనందముగా మోయు భువి అంతరంగ కదనం
ఆమె ప్రేమ మనసు పాలకడలిని మధించి
అందించు అమృతభాండ మధు కలశం
ఆమె కరుణ శరదృతువు వెన్నెలలో హిమ రేణువుల
సమూహ వీచికా నయన సమీరం
ఆమె రౌద్రం రగిలి దహించి వ్యసన
తృష్ణల సంహారమెనరించు
రుధిర ధారల తడిచి శాంతించు కరవాలం
4
[13/10, 8:46 PM] Gajula Bharati KS 20: కవన జ్యోతి ఆధ్వర్యంలో
అంశం:మగువ
కవితా శీర్షిక:- జయహో మగువ
🌷🌷🌷🌷🌷
మహిళలు మహారాణులు
మకుటం లేని పట్టపురాణులు
ఒంటి చేత్తో ఒపలేనన్నీ పాత్రల్ని పోషిస్తూ..
ఒకటో నంబర్ లా
నిటారుగా...నిర్భయంగా..
జీవన సమరంలో
..విజయ దుందుభి మోగిస్తున్నా..
ఏకోన్ముఖ..శత..సహస్ర.నారీ శిరోమణులు నేటిమహిళలు!!
జీవనపయణంలో పొరపోచ్ఛాలు వచ్చినపుడు...
సమస్యల పీట ముడిని విప్పుతూ..పరిష్కార తాళం చేవగును!!
స్త్రీ లేకపోతే జననం లేదు.
స్త్రీ లేకపోతే గమనం లేదు.
స్త్రీ లేకపోతే సృష్టికి జీవం లేదు...మనుగడనే లేదు.
నాటి ఖడ్గ తిక్కన్న అర్ధాంగి ఛానమ్మ వీరత్వం.
నేటి మగువ సీతారామన్ దీరత్వం
తల్లిగా..చెల్లిగా.
ఆలిగా..దాసిగా..
తనకు తానుగా..సమూలంగా అర్పించే ఆదర్శమూర్తి!!
మమకారం మాధుర్యంతో సవాలక్ష సమస్యలను..సునాయాసంగా మోస్తూ..మోముపై చిరునవ్వుకు శాశ్వత చిరునమై..
బాధ్యత దివిటీని కాంతివంతంగా వెలిగించే..అమృతమూర్తి నేటి మగువ
విభిన్న పాత్రల ప్రతి రూపాలు
నేటి,మేటి
మగువలు
🌷🌷🌷🌷🌷
కవిపేరు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:ఖమ్మం
చారవాణీ:9849788108
****************
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
5
[13/10, 8:50 PM] కె. సత్యనీలిమ
వృత్తి : ఉపాధ్యాయురాలు ప్రవృత్తి :: *కవనజ్యోతి*
*అంశం:మగువ*
శీర్షిక : *అతివ*
అవని అంత సహనం
ఉన్న అతివ
దాతృత్వంలో ధరణిని
పోలిన ధాత్రి
కరుణ చూపే కోమలాంగి
అమ్మలా జన్మనిచ్చి
భార్యలా తోడునీడలా ఉండి
సోదరిలా ధైర్యమిస్తూ
స్నేహితురాలిగా
సలహాలనిస్తూ
కంటికి రెప్పలా
కాచుకునే ప్రేమమూర్తి మహిళ
మమతానురాగాలను
ప్రేమాభిమానాలను
కరుణ,దయ,జాలి,ఓర్పు
వంటి గుణాలను కలిపి
ఒక రూపంగా మారుస్తే
ఏర్పడిన ప్రాణం మహిళ
సాగరమంత లోతుగా
ఆకాశమంత ఉన్నతంగా
ఆలోచించేది మహిళ
అంతరిక్షంలో సైతం
ప్రయాణించగలదు
అతిగా చేస్తే ఎవరినైనా
అణగదొక్కగలదు
ఇంటి దీపమై అందరికీ
వెలుగు పంచగలదు
ద్రోహుల పాలిట
అపరకాళిలా మారి
అంతంచేసే శక్తి మహిళ
మహిళాశక్తిని ఎవరూ
వేయలేరు అంచనా
మహిళయే మహిలోన
సుందర లలన...
*సత్యనీలిమ*
చరవాణి:9502156813.
6
[13/10, 8:55 PM] +91 74165 92715: 🙏🙏కవన జ్యోతి
సుధారాణి కృష్ణం రాజు
అంశం:మగువ
మగువ వంట ఇంటికే పరిమితం నాటి మాట
ఆచార సంప్రదాయాలు
గౌరవించులో నాటి మగువ
చూపెంచెను తన తెగువ
నేటి మహిళ సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక వ్యవహారాలలో తనకు తానే సాటి లేరెవరు తనకు పోటీ
మగువ లంటే లాలించిన పాలించిన చివరకు దండించిన
తమ పిల్లలు చదువు సంస్కారం నేర్పించటంలో
మగువ ఎల్లప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ
అటు కుటుంబానికి ఒక మూల
స్తంభం మగువ
మగువ లేని నాడు మనుగడే లేదు అన్న చందంగా
భర్తకు ప్రతి పనిలో సహాయ సహకారాలు అందిస్తూనే
అటు ఉద్యోగ నిర్వహణలో
తనదైన ముద్ర వేసుకుంటూ
అందరి మన్ననలు పొందుతూ
తన జీవన యానం సాగిస్తుంది
సహనంలో మగువ ను భూమాత గా అనుకున్న
ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగిన తనను తాను రక్షించుకోవడానికి అపరకాళిక
అవతారం ఎత్తిన అది మగువకు మాత్రమే సాధ్యం
నేటి సమాజంలో అన్యాయాన్ని
ఎండగట్టే దగ్గర నుంచి
ప్రతి విషయం లో ముఖ్య భూమిక పోషించేది మగువే
అవసరమైతే ఆమగువ తన తెగువ చూపుటకు వెనుకాడదు
మగువ (మంచిని గుర్తించే వనిత)అందుకో వందనం
7
[13/10, 9:10 PM] Tiru Venkatacharyulu Ks6: మనసు ద్రవిస్తే వరాలధార,
హృదయం ద్రవిస్తే ప్రేమామృత ధార,
మనసు క్షోభిస్తే
బాష్పాశ్రు ధార, హృదయం హర్షిస్తే
ఆత్మీయ అనురాగధార,
ఆకలితీర్చే మాతృప్రేమ, బాధలో సాంత్వన,
హృదయాన్ని మించిన దేహ సున్నితత్వం, పట్టుదలలో కత్తిని మించిన పదును, ఎంచుకున్న మార్గాన్ని మార్చుకోని వజ్రసదృశ సంకల్పం,
అర్థించిన వారిని ఆదరించే తత్వం, చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ పూర్తవ్వని వర్ణం, ఎంత చదివినా ఇంకా తెరవని పుస్తకం,....
మగువ...,
ప్రేమిస్తే మాతృమూర్తి, సాధిస్తే త్రిశక్తి స్వరూపిణి.
ముడుంబ తిరువే0కటాచార్యులు, వరంగల్.
8
[13/10, 9:21 PM] Kusumanchi Sreedevi: కవనజ్యోతి
శ్రీదేవి సురేష్ కుసుమంచి
అంశం-మగువ
------------------------------------
ఆ మాటే ఒక ధైర్యము కదా
తలవగానే మదినంతా
అల్లుకుపోయే హిమపవనము
కదా..
స్వార్థమన్న మాటెరగని
నిస్వార్ధ దేవతే కదా..
ఆమె ఒడి వేయి ఏనుగుల బలం కన్నా మిన్న కదా..
సృష్టికి ప్రతిసృష్టి ఆమె
కదా...
వంశవృక్షముని చిగురించే
ఇంటి వెలుగు ఆమె కదా..
బ్రహ్మ భువిలో సృష్టించిన
అధ్భుతపాత్ర ఆమె కదా..
అమ్మ అనగానే కష్టాల కడలిలో
కూడ తీరము చేర్చే దిక్సూచి
ఆమె కదా...
ఆమె ఒక అమృత కలశం..
అనురాగాల పెన్నిధి..
ప్రతీ మగువకి దేవుడిచ్చిన
వరం అమ్మతనం..
9
తేదీ:13-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:మగువ
శీర్షిక:: ఆమెను గౌరవిస్తేనే...
******************
సృష్టి కర్త ఎంత తపస్సు చేశాడో
ఎన్ని వేళ సార్లు ఆలోచించాడో
తనకు ప్రతిగా ఓ రూపాన్ని సృజించాలని
సృష్టికే ప్రతిసృష్టి చేసే అతివను
విలువలు కాపాడే సజీవ ప్రతిమను
ఈ జగతికి బహుమతిగా ఇవ్వాలని...
అవని నుంచి సహనాన్ని
తరూ లతల త్యాగాన్ని
పూబాలల సౌకుమార్యాన్ని
జీవనదిలా ప్రవహించే నైజాన్ని
సూర్య చంద్రుల వెలుగుల చైతన్యాన్ని..
అన్నింటి సమ్మిళితమైన మహోన్నత రూపిణీ మగువ!
ఆమె ఓ అద్భుత దృశ్య కావ్యం!
ఆమె ఉన్న చోటు ఓ సుందర నందనవనం!
కార్యేషు మంత్రి కరుణేషు దాసి
భోజ్యేషు మాతా
శయనేషు రంభ క్షమయా ధరిత్రియై
పరిచయం చేయనవసరం లేని ప్రాణదీపం!
అష్టావధానం శతావధానాలను
అలవోకగా చేస్తూ
కుటుంబాన్ని ప్రేమానురాగాల
పొదరిల్లుగా మార్చే మగువ!
ఆమే సృష్టికి ప్రతి సృష్టి చేసే అమ్మ
మూడు ముళ్ల బంధంతో అనుబంధాలతో అల్లుకుపోయే పూల కొమ్మ!
జీవితం అస్పష్టతా చిత్రమై చెరిగిపోకుండా
హరివిల్లు వర్ణాలతో ఆనందమయం చేసి
శిశిరాల్లోనూ వసంతాన్ని పూయించగల మగువ!
నీదైనా నాదైనా ఆమె ఇచ్చిన భిక్షనే ఈ జీవితం!
ఆమెను గౌరవిస్తేనే మన జన్మ సార్థకం!
10
[13/10, 9:22 PM] భరద్వాజ గారు: 🎊కవనజ్యోతి సాహితీ సుమాలు 🙏🌱
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
రచన-1
13-10-20
అంశం -మగువ
🌹శీర్షిక - చూపించుతెగువ🌺
ఆకాశంలో మబ్బులు లేవు -
భూమిపొరలపై ప్రకపంపాలు రావటం లేదు -
కానీ ఆడదాని కళ్ళమేఘాలవెంట కన్నీటివర్షం కురుస్తూనే వుంది -
ఆమె హృదయభూమిపై ప్రకంపనాలు వస్తూనే ఉన్నాయి -
కారణాలు అనేకం -
పాలుగారే పసిపిల్లను కన్యాశుల్కాలు ఒకనాడు కలవరపెడితే -
సతీసహగమనాలు చితులపైకి చేరిస్తే -
కనిపెంచిన పిల్లను ముక్కూమొఖం తెలియని
వాడి చేతిలో పెట్టటానికి కట్టే జి.యస్ టి .వరకట్నం -
ఆమెబ్రతుకు కట్టలేకపోతుంది పట్టం -
సతీ సహగమనాల నుండి బయట పడి -
బాల్యవివాహాల నుండి తప్పించుకొని -
కన్యాశుల్కాల పెన మీద నుండి దొర్లిపడి -
వరకట్నాల గాడిపొయ్యిలో పడింది ఆడదాని జీవితం -
పడతిబ్రతుకు ప్రేమల పల్లకీ ఎక్కినదాని కంటే -
కష్టాలకొలిమిలో కాలిందెక్కువ -
ముగ్ధజీవితం మురిపాలల్లో మురిసిందానికంటే
మూతిముడిచిన సంఘటనలు ఎక్కువ -
ఆమె ప్రేమ మయి -
గుండె కొలిమిలో అనుక్షణం నిప్పులకుంపటి మోస్తూ -
బ్రతికేఆమె సంతోషాల పడవ యెక్కిందెప్పుడు -
ప్రేమించిన దాన్ని దక్కించుకోవటం లో ఆమెఆదిశక్తి -
మమతానురాగాలు పంచె మగువ చూపిస్తుంది
వేదన కలిగినప్పుడు తెగువ -
ముదిత మనసుపెట్టకపోతే నడవవు కాపురాలు -
తరుణి తలుచుకోకపోతే పుట్టవు జీవితాలు
ఆడపిల్లగా పుట్టినప్పటినుండి తండ్రికి -
తాను కరిగిపోతూ కుటుంబానికి వెలుగులివ్వాలనే ఆమె ఆలోచన -
సుఖసంతోషాలకు దీవెన -
యత్రనార్యస్తు పూజ్యంతే రమన్తేదేవతాః అంటూ రాశాయి శ్లోకాలు -
ఈజగతికిమూలం మగువ -
ఆమేమనసు కాకూడదు కన్నీటివెల్లువ -
ఆమె మనసు మాగాణంపై ప్రేమల విత్తనాలుజల్లాలి -
అవి ఆనందాలాపంటలు పండిస్తాయి
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల (RB)🖍️
11
[13/10, 9:30 PM] +91 94400 97002: కవిసమయం
13/10/2020
అంశం: మగువ
....................
మిట్టాలక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
...............................
శీర్షిక: అనురాగ గంగ
మగువ మనసు అనురాగ గంగ నిరంతరం ప్రవహించే జీవనది బ్రతుకు మైదానాలను సస్యశ్యామలం చేసే గంగా గంగా ఉత్తగనే కాదు
ఆకాశం నుంచి ఉరుకులెత్తి నేలకు దిగిన గంగ
ఎంతో ఉన్నతంగా
మరెంతోపవిత్రంగా
ఇలకు చేరిన గంగ
ఆ గంగ మనసు
తల్లడిల్లి తే
కపట కల్మషాలు చేరితే
ఆ మనసుకు వరదలే
ఆశ్రువరదలే....
మొత్తం సంసారము కుటుంబం వ్యక్తులు మునిగిపోయే వరద
కలకంఠి కంట కన్నీరు రాకూడదు అందుకే
మగువ మనసు లో
వివక్షలు, అధికార పెత్తనాలు ఒత్తిడిలు, పనిభారం,
హింస,దురాచారాలు
లైంగిక హింసలు,
దాడి చేసి ఆమె మనసు ఘనీభవిస్తే
శిశిరము జొరబడి
ఘనీభవించి పోతే
ఒక్క మమతా పుష్పమూ పూయదు
ఒక్క చిన్న చిగురు చిగురించదు
బ్రతుకంతా మోడు పోవడమే
బ్రతుకంత మూగ పోవడమే
ఋతువులలో శిశిరం తరువాత వసంతాలు వస్తాయేమో
కానీ ఒక్కసారి మనసు కు
మంచుదుప్పటి
కప్ప పడిపోయి
ఇసుక మేటలు వేస్తే
దానిని కరిగించే భాస్కరుడెవరు?
మగువ మనసును
తాకే గలిగే సూర్యరశ్మి ఏది?
మగువ మనసు
విరిగితే ..శిశిరం వస్తే
మళ్లీ వసంతాలు కల్లనే
ఆ చీకటికి ఉషోదయాలు కల్లనే
చెలియలి కట్ట దాటితే
నది ఉప్పొంగి నట్లే
మగువ మనసు ఆక్రోశిస్తే
చండిక కాళిక మరాళిక,
ఎవరు నిలవలేరు ఇక
తాళలేరు ఆశక్తి ధాటికి
మగువ మనసును తెలిసే
కళ .. ఆరాధిస్తే ఇక సర్వస్వం
జీవితం సమర్పణం
ఓర్పు ,నేర్పు ,కూర్పు ,అల్లిక,
అనురాగ మాలిక ఆమెనే
బ్రతుకులు అంతా ఆమని
....................................
ఈ కవిత నా స్వీయ రచన దేనికి అనుకరణ కాదు.
**************
20/10/2020
****"""
కోరాడ గారు
ఇందిర వేదాల గారు
సుధారాణి కృష్ణంరాజు
కొలచన విజయ భారతి గారు
కె.సి.నరసయ్య గారు
భరద్వాజ గారు
మిట్టా లక్ష్మి గారు
సునంద వురిమిళ్ళ గారు
ఇంద్రవత్ రాహుల్ గారు
పరాంకుశం రఘు నారాయణ గారు
గాజుల భారతీ శ్రీనివాస్
1/2
[20/10, 8:01 PM] Korada: కవనజ్యోతికవిసమయం
అంశం:అక్షరశిల్పిమహిళ
కోరాడ నరసింహా రావు !
"చదువులతల్లి తానే !!"
*****************
సకల విద్యల సాకార మూర్తి.... సాక్షాత్తూ సరస్వతీమాతయేతాను
తన ఒడి నే...బడి ని... చేసి,సంస్కారం నేర్పిన...
తల్లీ...తానే...!!
సృష్టికి సగ బాధ్యత యై
పురుషునికి ప్రేయసియే కాదు.,కన్నతల్లియుతానె
వివక్షతో...వంచించి....,
అణగద్రొక్కినా సహించి
భరించి...సేవలకే పరి మి తమై...ప్రేమానురాగాలను పంచిన త్యాగమూర్తి!
కుటుంబ బాధ్యతలో...
కీలకపాత్రవహించినా...
గుర్తింపునుఆశించని...
గుణ వతి...! ఎందరో సంస్కరణ వాదుల సహకారం...! తానూ ...
అక్షరాస్త్రాలను చేబూని
సమరం సాగించిన వీర వనిత....! ఐనా...యిదె న్నో వంతు విజయం !?
పోపుల డబ్బాలో ఆవ గింజంత ....!
తోటి విద్యార్థులు.....
సాటి ఉద్యోగులు .....
ఎక్కడచూసినా ...వేధింపులు...సాధింపులే ...!
సమానంగాసంపాదిస్తున్నా...యింటిచాకిరీకి ...
తర తరా ల గుత్తే తాను!
ఆమె లో...సహనం చావ కముందే.,ఆశాంతమూర్తి
భద్రకాళిగా...ఉగ్రరూపం
దాల్చక ముందే...ఆ ప్రకృ
తి...వికృతి గా మారక ముందే...గుర్తించి గౌరవి ద్దాం ...మనపరువునుమనం...నిలుపుకుందాం ********************
........కోరాడ.
2/2
[20/10, 8:01 PM] +91 98858 21189: కవనజ్యోతి :
అంశం: మహిళ
ఇందిర వేదాల
మహిళ , ఏమని చెప్పేది ఎంతని చెప్పేది
ఎంత చెప్పినా తక్కువే
అనంతమైనది ఆమె గొప్పతనం
ఆకాశమంతది ఆమె మనసు
భూదేవంతది ఆమె సహనం
నిద్రలేచినప్పటినుంచి ఇంటిలోనివారిగురించే ఆమె ఆలోచనలు
ఇంటి శుభ్రతగురించే ఆమె ఆరాటం
ఆమె ప్రతి ఆలోచన సంస్కారవంతమైనదే
అందుకే ఆమెకు ఉపనయన సంస్కారముల అవసరం లేదు
'మాతృదేవోభవ అని మొదటి పూజ మహిళకే
త్రిగుణాత్మకమైన ప్రకృతి కి ప్రతీక ఆమె
ఆది పురుషునకైన ఆమె లేనిదే జన్మ లేదు
కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన జేసి మరలాలంటారు పోతన
"స్త్రీ హి బ్రహ్మ బభూవిధ"
మహిళ బ్రహ్మ ఙ్ఞాని కావాలి
మహిళ విద్యావతి ఐతే నే సమాజశ్రేయస్సు కలుగుతుంది (వేదాన్ని ప్రమాణం గా స్వీకరించి మనువు అన్న మాటలివి
తాను మరణయాతన పొంది మరోజన్మనెత్తి జాతి మొత్తాన్ని కని పాలిచ్చి పెంచి సకలసేవలందిస్తూ సృష్టి ని సుస్థిరం చేస్తున్న మహోన్నత మూర్తి మహిళ
అందుకే మహిళలు మహరాణులు
3/2
[20/10, 8:03 PM] +91 74165 92715: ***కవనజ్యోతి-(కవిసమయం)
🙏🙏సుధారాణి కృష్ణంరాజు🙏🙏
అంశం: అక్షర శిల్పి-మహిళ
తేది:20-10-2020(మంగళవారం)
"ముదితల్ నేర్వని విద్య గలదే ముద్దార నేర్పించగన్ "మహిళ అంటే నే సహనంలో సీతగా
క్షమా గుణం లో భూమాత గాను ఏ సమస్యనైనా పరిష్కరించడంలో రాజకీయ చతురత గల మహిళా మణులు ఎందరో
అక్షరాలకు జీవం పోసి పాత్ర లనే శిల్పాలుగా చెక్కి ఆ పాత్రలకు జీవం పోసి తమదైన శైలిలో ఏ అంశమైనా దానిని పాఠకుల మనసుకు హత్తుకునే
విధంగా చేయగల కవయిత్రులు
"అక్షర శిల్పాలను పొదగగల దిట్టలు "మహిళలు
నాటి కవయిత్రి మొల్ల రామాయణం ఎంతో వాసికెక్కినది ముప్పాళ్ళ రంగు నాయకమ్మ గారి నవల బలిపీఠం ఆధారంగా వెండితెర పై ఆమె చెక్కిన పాత్రలనే శిల్పాలు ప్రేక్షకుల ను రంజింప చేశాయనడంలో అతిశయోక్తి లేదు సామాజిక అంశాలను
తీసుకుని తన రచనా ద్వారా
సమాజం ఎలా ఉంది అంటరాని తనం సమాజంలో ఏవిధంగా ఉంది దాని పర్యవసానం ఎలా ఉంది చక్కగా తమ రచనా శిల్పం ద్వారా వెండితెరకెక్కించిన
మహిళా మణి
యద్దనపూడి సులోచనారాణి
తన రచనా బంగారు కలలు
ద్వారా ఆడవారి పై జరుగుతున్న అమానుషం అన్యాయాన్ని ఎండగట్టారు
భారత కోకిల ఈ బిరుదాంకితురాలు సరోజినీ నాయుడు ఈ విధంగా మహిళలు ఎందరో నేటి మహిళలకు మార్గదర్శకులు
వర్థమాన కవయిత్రులకు వారి అక్షర శిల్పలే ఆదర్శాలు
నాటి మహిళ నేటి మహిళ
అందరూ అక్షర శిల్పాలు పొదిగి
కవనజ్యోతులుగా చరిత్ర పుటల్లో నిలిచి పోవడం తథ్యం🙏👍
4/2
[20/10, 8:13 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి
పేరు:కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:మహిళ
శీర్షిక:ఓ శక్తి
తేదీ:20-10-2020
*******************
సృష్టికి చైతన్యమూర్తి మహిళ
ఆప్యాయతలు కురిపించే అమృతమూర్తి
అసురుల పాలిట ఆదిపరాశక్తి
నట్టింట నడయాడే మహాలక్ష్మి
ఆమె అన్ని రంగాలలోను
తన సాధికారత నిరూపించుకుంటూనే ఉంటోది
దేశ కీర్తి శిఖరాలపై ఎన్నో
విజయ బావుటాలు
ఎగురవేస్తూనే ఉంది
అటువంటి మహిళల పట్ల
లింగ వివక్షత చూపి
చిన్నచూపు చూడనేల
అబలను చేసి ఆడించనేల
అత్యాచారాలు,అమానుషాలు
చేసి హింసించనేల
కలకంఠి కన్నీరొలికించిన
కూలిపోవా రాజ్యాలు
తరలిపోవా సౌభాగ్యాలు
🌺🌺🌺🌺🌺
5/2
[20/10, 8:50 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి సమయం
పేరు: కట్టెకోల చిన నరసయ్య
చరవాణి: 7981814784
తేది: 20-10-2020
అంశం: అక్షర శిల్పి మహిళ
శీర్షిక: లేదు భద్రత
ఇహలో మహిళ
ఆకాశంలో సగభాగం!
అవకాశాలలోనూ సగం!
పాలనలో పోటీతత్వం
ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు
రాజ్యపాలనలో మహారాణులు
కుటుంబ పాలనలో
అవిశ్రాంత యోధురాలు
మతాలలో పెద్దపీట
ప్రకృతిలో ఆరాధనలో
అందమైన మానవ శిల్పి
ఆమె అక్షర శిల్పి
సాక్షాత్ సరస్వతీ మాత!
అయినా
వివక్షతలో అణచివేత?
అణచివేతలో వివక్షత?
అతనికి చెల్లి అక్క అమ్మ
ఇతనికి ఓ ఆట వస్తువు
అర్ధరాత్రి స్వాతంత్ర్యం
హద్దులు మీరిన అరాచకం
అనునిత్యం మృగాళ్ల వేట
మృగ్యమవుతున్న మానవ విలువలు
మహిళకు లేదు మహిలో భద్రత?
6/2
[20/10, 8:50 PM] భరద్వాజ గారు: 🎷🎊కవన జ్యోతి -కవిసమయం 🎻
మంగళవారం
అంశం- అక్షరశిల్పి -మహిళ
శీర్షిక-ఓమహిళా నీకునమస్కారం ..!
అక్షరం ,అమ్మ కవల పిల్లలు -
పుట్టినబిడ్డకు వచ్చిరాని గానం తో పాతపాడి-
తెలిసీతెలియని సాహిత్యాన ఎన్నోకబుర్లుచెప్పి -
పాటలు నేర్పి మాటలు చెప్పి కధలు బోధించి -
అక్షరాన్ని ఔపోసనపట్టింది ఆడది -
అక్షరాలురాకపోయినా -
ఒకనాటిచాదస్తపు ఆచారాలు
ఆమెను చదువుకుచేసిన దూరం-
సతీసహగమన,కన్యాశుల్కాల కష్టాలతో మోసింది భారం భారం-
అక్షర వెలుగు చూడనివ్వని పితృస్వామ్య వ్యవస్థ -
కాలప్రభావన తగ్గించుకుంది తన అహంకారపు భావన -
అక్షరాల వెలుగులో అక్షరజ్యోతులు వెలిగించుకుని -
తనబ్రతుకును నిండుపున్నమి చేసింది -
వెలుగుల వెన్నెలవపంచింది -
ఇంటిదీపం ఇల్లాలు అన్న కీర్తికి అర్హురాలైంది -
మొ ల్లగా రచనలుచేసింది -
అక్షరాలా పట్టాలు పుచ్చుకుని ఆకాశపు అంచుకు ఎదిగింది -
ఎక్కడమ్మానీవులేనిది -
యేమిటీనువ్వుచెయ్యలేంది -
అన్న విజయపు అంచుకిచేరింది -
అంతరిక్షాలకెగసింది-
అలీన దేశాలకధ్యక్షత వహించింది-
ఉన్నత పదవులధిరోహించింది-
ఉద్యమ కేతనమై నిలిచింది-
యాభై శాతపు రిజర్వేషన్లు సాధించుకుంది-
అక్షరాన్ని నేర్చిన ఈనాడు -
తాను చదివి తనబిడ్డలను అక్షరాల ఉలితోచెక్కి -
శిల్పాలుగా మార్చిన మారుస్తున్న -
ఓమహిళా నీకు నమస్కారం ..!
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల ((RB)🖍️
కొత్తపట్నం
9866203795
7/2
[20/10, 8:50 PM] +91 94400 97002: కవనజ్యోతి
20/10/2020
అంశం: అక్షర శిల్పి మగువ
...............................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
...........................
శీర్షిక: హృదయ నేత్రి
...........................
ఆప్యాయత అనురాగాలు ప్రేమ
హృదయమును నిండా నింపుకొని మనసారా స్పందించి ఆ భావాలను ఒడుపుగా పట్టుకొని తనను తాను చెక్కుకుంటూ అక్షరాలు చెక్కి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన అక్షర శిల్పులు మహిళా కవయిత్రులు
ఎందఱో ఎందరెందరో
కుమ్మరి కులంలో పుట్టిన ఆధ్యాత్మిక సేవ కు రచనలకు కులం అడ్డు కాదు నిరూపించి
ఆత్మలో రాముని నింపుకొని
ఆ రాముని ధ్యానించి
మొల్ల రామాయణం రచించి
16వ శతాబ్దం లో ఉన్న ఏకైక కవయిత్రి మొల్ల
మొల్ల రామాయణం తో ఎంతో ప్రసిద్ధి చెందినది.
వెంకటేశ్వరుని సేవించి సన్నిధిలో గడుపుతూ
ఎన్నో కీర్తనలు రచించిన
తరిగొండ వెంగమాంబ
రాధికా పరిణయంతో కవయిత్రిగా నిలిచిన
తాళ్ళపాక తిమ్మక్క
శృంగారాన్ని మహిళలు కూడా
రస రమ్యంగా రాయగలరని
నిరూపించిన ముద్దుపళని
భారత కవి కోకిల గా పేరుపొందిన సరోజినీ నాయుడు
దురాచారాలను నిరసించి స్త్రీవాద సాంఘిక సేవకురాలిగా
స్త్రీవిద్యకు ప్రాముఖ్యత నిచ్చి పేరుపొందిన
సావిత్రిబాయి పూలే
కవిత ప్రవీణ బిరుదాంకితులు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ కవితాగోష్ఠి లో పాల్గొన్న కనుపర్తి వరలక్ష్మమ్మ
సాహిత్యంలో విజయబావుటా ఎగరేస్తున్న ఎందరో పురుషాధిక్య సమాజంలో
సుందర దృశ్యాలతో
హృదయానికి హత్తుకునే
భావాలతో , రచనలతో
సాహిత్యంలో పేరొందిన రచన రచయిత్రులు యద్దనపూడి సులోచనారాణి
ముప్పాళ్ల రంగనాయకమ్మ
అబ్బూరి ఛాయాదేవి
ఎందరెందరో అక్షరాలను చెక్కి
స్త్రీ మూర్తులను
సమాజాన్ని చెక్కిన
అక్షర శిల్పులు
కేవలం అక్షరాలను గాక జీవితాలను తీర్చిదిద్దిన శిల్పులు
తొలి పాఠశాలగా తన ఒడిలో
అక్షరాలను దిద్దించే ప్రతి తల్లి అక్షర శిల్పి
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని...
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ అని అన్ని రంగాలలో దూసుకుపోతున్న ప్రతి మహిళ అక్షర శిల్పి......
అక్షరాల నేర్చి నేర్పుతో
ఆ క్రాంతి లోభవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్ది కొని
ఆదర్శవంతంగా నిలచిన
మహిళా మణులు మాణిక్యాలు
అక్షర శిల్పులు.
అందరికీ వందనాలు 🙏
..........................
ఈ కవిత నా స్వీయరచన దేనికి అనుకరణకాదు.
8/2
[20/10, 8:55 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి*
తేదీ:20-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:అక్షర శిల్పి-మగువ
ఎందరికో ఆదర్శప్రాయులు
""""""""""""""""""""""""""""""""""""
కుసుమ కోమలమైన దేహంతో
మానవతా పరిమళాలు వెదజల్లే మగువ
మస్తిష్కంలోంచి గుబాళించిన అక్షర చైతన్యం
అనాదిగా ఎందరికో ఆదర్శప్రాయం!
గరిట తిప్పిన చేతులతో చరిత్ర గతులు మార్చిన స్త్రీ మూర్తులు!
పురుషుల కవులతో ధీటుగా
సాహిత్యంతో వెలిగిన గార్గీ మొల్ల తరిగొండ వెంగమాంబ
తాళ్ళపాక తిమ్మక్క!
బండారు అచ్చమాంబ,
యద్దనపూడి మాదిరెడ్డి, పాకాల యశోద రెడ్డి ఎందరెందరో సాహితీ లోకంలో
వెలుగుల తారకలు..
బ్రిటిష్ సామ్రాజ్యం విస్తుపోయేలా
చంద్రముఖి బసు కాదంబినీ గంగూలీలు అందుకున్న పట్టభద్రుల పట్టాలు!
భారతీయ విశ్వ విద్యాలయం నుంచి సైన్స్ డాక్టరేట్ పొందిన అసిమా చటర్జీ!
కాలేదా మహిళలకు ప్రేరణా దీప్తి!
స్వాతంత్ర్య ఉద్యమానికి నడుం బిగించిన
భారత కోకిలమ్మ సరోజినీ నాయుడు
సాహిత్యంతో హృదయాన్ని దోచుకున్న మణి దీపం!
అక్షర నక్షత్రాలను ఆడపిల్లల దోసిట్లో నింపిన
సావిత్రి భాయి ఫూలే
అమ్మను మించిన అమ్మైన చదువులమ్మ !
అప్రతిహతంగా పదిహేడేళ్ళు పైగా దేశాన్ని పాలించిన ఇందిరమ్మ!
అంతరిక్షంలోకి అడుగిడిన కల్పనా చావ్లా సునీత విలియమ్స్!
ముదితలు నేర్వగరాని విద్య ఈ లోకంలో లేనేలేదని
సాధించి చూపిన సాహస వనాలు వారు!
చదువుల్లో సాహిత్యంలో విరబూసిన వెన్నెల కిరణాలు!
ఇంటికి నుంచి దేశ దేవళం నిండా ఉత్సాహపు కాంతులు నింపిన అక్షర శిల్పులు
అవుతున్నారు నాడూ నేడూ ఆదర్ళనీయులు!
9/2
[20/10, 9:10 PM] Indravat Rahul Poet Ks 11: *కవన జ్యోతి*
============
అంశం : *అక్షర శిల్పి-మహిళ*
శీర్షిక : ఆదిపరాశక్తి మహిళా
తేది : 20/10/2020
*ఆదిపరాశక్తి మహిళా*
అద్భుతమైన మాటలకు
అక్షరాలని చేర్చి
ప్రేమ, బంధాలకు దారంగా
నేటి సమాజంలో
ఎన్నో కష్టాలకు తను
దినం దినం అందరి
మాటల తూటాలతో
అన్ని రంగాలలో ముందుకు
ఆప్యాయత, అనురాగలకు
ఆమె మొదటి మెట్టు
కష్టాలలో సీతలా
నాటి గృహాలక్ష్మి
కుటుంబ బాధ్యతతో
కోడలిగా, భార్యగా, తల్లిగా
ఎనలేని ప్రేమకి సంపదవై
కష్టానికి కార్యషు దాసీవై
ఇష్టంకి తోలకరి జల్లువై
బంధాలకు ఆది వై
యువతరంకు జగతికి
మూలమైన ఓ మహిళా
నీకు వందననం పాదాభివందనం....
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
9848054079..
10
[20/10, 9:18 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవన జ్యోతి -కవిసమయం*
పేరు :పరాంకుశం రఘు నారాయణ
చరవాణి సంఖ్య9949749987
తేది :20/10/2020
*అంశం: అక్షర శిల్పి -మహిళ*
******************************
*కవితా శీర్షిక :మహిళ మహత్మ్యం* *******************************
ఈ సృష్టిలో గర్భస్థ శిశువుకు కూడా,
జ్ఞానామృతాన్ని పంచిన మహోన్నత మూర్తి మాతృమూర్తే కదా!
తల్లి ఒడి శిశువుకు మొదటి బడి !
ఇది ఒక నానుడి కాదు! ఓ వాస్తవికరూపం! దర్శనీయం !!
తల్లి ఓరిమికి ప్రతిరూపమై,
ఆదర్శగుణ సంపదోత్తమురాలై..
చరిత్రలో ఆమె స్థానమే ప్రథమం!
ఇది మార్పులేని మార్చలేని చారిత్రక నేపథ్యం!
బుడిబుడి నడకలతో పాటే బుల్లి బుల్లి మాటలను సైతం వచ్చీరాని చిలుక పలుకుల సవ్వడిలో...
మాతృమూర్తి గొప్పతనం దాగుంది!
మాతృమూర్తి అభినయాన్ని. అనుకరిస్తూ..
అక్షరమూర్తిగా శాశ్వత మూర్తిమత్వాభివృద్ధి వ్యక్తిగా..
తన అస్తిత్వాన్ని బయటి ప్రపంచానికి వెలువరించే క్రమంలో...
తల్లి పాత్ర అమోఘం !అద్భుతం!!అత్యంతకీలకం !!!
సమసమాజ స్థాపనలో
సంస్కరణోద్యమాలలో
చురుకైన పాత్రను పోషిస్తూ..
కలాన్ని ఆయుధంగా చేబూని చరిత్రలో పురుషులతో సమానంగా
చారిత్రక నేపథ్య సృష్టికర్తగా...
మహిళామూర్తి చరిత్ర అజరామరం!
చరిత్రకే నూతన జవ సత్వాలను నింపే
ప్రధాన బాధ్యతలో నే (ఆ)టి మహిళ ఓ ఆదర్శనీయం!
----------------------------------------
హామీ పత్రం :ఈ కవిత నా స్వీయ రచన.
11/2
[20/10, 9:24 PM] Gajula Bharati KS 20: కవన జ్యోతి
************
అంశం:-అక్షర శిల్పి మహిళ
శీర్షిక:మహిళ ఔదార్యం
స్త్రీ లేనిదే జననం లేదు
స్త్రీ లేనిదే గమనం లేదు
సీతా దేవి సౌమ్యం
లక్ష్మీ దేవి భాగ్యం
కలగలిసి మూర్తీభవించిన
అక్షర శిల్పులు మహిళలు
మూడు ముళ్ల బంధంతో ఏకమై
మనమే లోకమై
మనతో మమేకమై
ఇంటిని ఇంటివారిని కంటికి రెప్పలా కాపాడే ఇంటిమహారాణి
మహిళలు!!
అందరికి తలలో నాలుకల ఉంటూ
అందరి అవసరాలు తీర్చుతూ
భూదేవి అంత సహణమూర్తి స్త్రీ
ఇంటికి సూచి
బిడ్డలకు డిక్సూచి
తానే
ఇంటిబారంతో తనముకలై ఉన్నా.. మోముపై చెరగని చిరునవ్వుకు శాశ్వత చిరునామై హరివిల్లులా వేణి.. స్త్రీ
పతిలో భాగమై
ఇల్లే లోకమై
ఇల్లే స్వర్గమై తలచి వలచి ప్రేమించే ఔదార్య గల మహామనిషి స్త్రీ మూర్తి
ఇల్లు సాఫీగా సాగాలంటే ఆమె శ్రమ శక్తే ఇంధనం
ఆమె శ్రమకు లేదు వేతనం
శ్రమే విజయానికి సంకేతం
కష్టాలను,,కన్నీళ్లను
తక్కెట్లో వేసి సమానంగా తూచి ధైర్యశాలి
ఏనాడు తొనకని,బెనకని నిండు కుండా
లలితమైన లాలిత్యానికి
ఖచ్చితమైన చిరునామై ఎదలో నిలిచే వెలుగు దీపాలు
నిత్య చైతన్య క్రాంతి
నవ నవనీత దీప్తులు
అక్షర శిల్పులు మగువలు
తపనపడే సేవలు చేసే సేవకురాలు
నిత్య చైతన్య శ్రామికురాలు..అర్ధాంగి
అన్నీ తానై..అంతా తానై ..
.నలిగినా.. వెలుగుతూ ఉండే
శ్రామిక సౌందర్య మణిమాణిక్యాల కోటి రత్న ప్రభలు..
అక్షర శిల్పులు..మహిళలు
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.
గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
********************












Comments
Post a Comment