ప్రహేళిక

 నిర్వహణశి:వునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

వీరా గుడిపల్లి

The mathematics teacher and poet

ప్రహేళికా సమన్వయం

కొలచన విజయ భారతి గారు

**************

Date: 20/11/2020


శ్రీమతి సుధారాణి గారు--ప్రథమ

శ్రీమతి మిట్టా లక్ష్మి గారు--ద్వితీయ

శ్రీ పాండాల మహేశ్వర్ గారు--ద్వితీయ

శ్రీమతి.మర్రి జయశ్రీ గారు--ద్వితీయ

శ్రీమతి మన్నెపిన్నెక లలిత గారు--తృతీయ

శ్రీ దిడ్డి మారుతి గారు--చతుర్థ

శ్రీమతి సుమన గారు--పంచమ

శ్రీ ఇంద్రావత్ రాహుల్ గారు--

ప్రోత్సాహక బహుమతులు 

గెలుచు కున్నారు

అందరికీ ప్రశంసాపత్రాలు అందచేయబడతాయి

బహుమతి గ్రహీతలందరికీ

***"""*************"""""""******"

https://m.facebook.com/story.php?story_fbid=117580180142639&id=111079594126031

07/11/2020

 కొలచన విజయ భారతి Poetess: 7-11-2020 శనివారం నాటి ప్రహేళిక


1.ఆరుద్ర కలం పేరు గల రచయిత అసలు పేరు?


జ: భాగవతుల శివ శంకర శాస్త్రి


2.పుత్తడిబొమ్మ రూపకల్పన ఎవరు?


జ: గురజాడ అప్పారావు గారు


3.దిగంబర కవుల కలం పేర్లు

వారి నియమం ఏమిటి?


జ:1. నగ్నముని 2.నిఖిలేశ్వర్3.చెరబండరాజు

4.మహాస్వప్న 5.జ్వాలాముఖి

6.భైరవయ్య

2.స్వంత పేర్లతో కవిత్వం వ్రాయకూడదన్నది వారి నియమం


4.అమృత వీణ(1952)గేయమాలిక రచయిత ఎవరు?


జ: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు


5.తెలంగాణ వైతాళికుడు అని  ఏ కవిని అంటారు?


జ: కాళోజీని


6.ప్రబంధ పరమేశ్వరుడని ఎవరిని అంటారు?


జ:ఎర్రన


7.తొలి జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి,ఏ సంవత్సరంలో వచ్చింది?


జ:జి.శంకర కురుప్,1965 వ సంవత్సరంలో


8.మొల్ల రామాయణం ఎన్ని కాండలు?ఎన్ని పద్యాలు?


జ:6కాండలు,138 పద్యాలు


9.పంచతంత్ర కథలు రచయిత ఎవరు?


జ: విష్ణుశర్మ


10: విశ్వనాథ సత్యనారాయణ గారి ఏ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది?


జ: "శ్రీమద్రామాయణ కల్పవృక్షం' కు



11.ఉమర్ ఖయ్యూం రచయిత ఎవరు?


జ:కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు


12."కొవ్వొత్తి రెండువైపులా ముట్టించాను..అది శ్రీశ్రీ లా వెలిగింది"అన్నది ఎవరు?


జ:శ్రీ పురిపండా అప్పలస్వామి గారు



13:కవితా విశారద, కవికోకిల,

కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి,విశ్ర సామ్రాట్ బిరుదులు గల కవి ఎవరు?


జ:గుర్రం జాషువా గారు


14.కోనంగి(1946) (సాంఘికం)

రచయిత ఎవరు?


జ:అడవి బాపిరాజు గారు


15:రాజశేఖర చరితము (నవల) రచయిత ఎవరు?


జ:శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు


     *******************

[08/11, 9:14 AM] కొలచన విజయ భారతి Poetess: శ్రీమతి మిట్టా లక్ష్మి గారు (ప్రథమ)

శ్రీ భరద్వాజ్ రావినూతల గారు

(ద్వితీయ)

శ్రీ ఇంద్రావత్ రాహుల్ (ద్వితీయ)

శ్రీమతి సుధారాణి కృష్ణంరాజు గారు (తృతీయ)

శ్రీమతి గాజుల భారతీ శ్రీనివాస్ గారు (చతుర్థ)

స్థానాలలో నిలిచారు

విజేతలందరికీ హృదయపూర్వక శుభాభినందనలు 

******""**********

1

17/10/2020

ఈరోజు ప్రశ్నావళి

*****************

1.ఓంకారాన్ని స్మరించమని ఏవేదం చెపుతుంది?

జ: యజుర్వేదం


2.ఆదిత్యహృదయం ఎవరు

 ఎవరికి ఉపదేశించారు?


జ.శ్రీరామునికి అగస్త్య మహాముని


3.దివ్యస్నానమని దేనికి పేరు?

జ.ఎండకాస్తుండగా కురిసే వర్షంలో చేసే స్నానం


4.భరత ,శత్రుఘ్నుల భార్యలు పేర్లు ఏమిటి?

జ.భరతుని భార్య మాండవి

శత్రుఘ్నుని భార్య శ్రుతకీర్తి


5.జనకుని తమ్ముని పేరు?

జ.కుశధ్వజుడు


6.విభీషణుని భార్య పేరు ఏమిటి?

జ.సరమ


7.రామాయణంలో శ్లోకాలు ఎన్ని?

జ.24 వేల శ్లోకాలు


8.రావణుడు ఇంకొక సస్త్రీని బలాత్కరించిన అతని తల వెయ్యి ముక్కలవుతుందని శపించింది ఎవరు?

జ.బ్రహ్మ


9.ధర్శరాజు శంఖం పేరు ఏమిటి?

జ.అనంత విజయము


10.జరాసంధుని చంపినది ఎవరు?

జ.భీముడు


11.కర్ణుడి భార్య పేరు ఏమిటి?

జ.వృశాలి


12.మహాభారతానికి ఇంకొక పేరు

జ..జయసంహిత


13.భాగవతాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు?

జ.వేదవ్యాసుడు


14.పూతన పూర్వజన్మలో పేరు ఏమిటి?

జ.రత్నమాల


15.రోలుకి కట్టినతాడు శ్రీకృష్ణుని పొట్టకు కట్టడం వలన

శ్రీకృష్ణునికి వచ్చిన పేరు ఏమిటి?

జ.దామోదరుడు



**************************

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧