నిరాడంబరత ౨౦౨౧

నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
*****
కవివరుల జాబితా
1.ఆళ్ళ నాగేశ్వర రావు
2.గొర్రెపాటి శ్రీను గారు
3. తరణికంటి సూర్య లక్ష్మి గారు
4.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
5.మన్నె పిన్నక లలిత గారు
6.విజయ శ్రీ దుర్గ గారు
7.ధనాశి ఉషారాణి గారు
8.మేకల రామస్వామి గారు చెన్నూరు
9.జలజ గారు
10.డా.బల్లూరి ఉమాదేవి గారు
11.తాతపూడి సోమశేఖర శర్మ గారు
12.డా.నాయకంటి నరసింహ శర్మ. గారు
13.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
14.సునంద వురిమళ్ళ గారు
15.కోరాడ గారు
16.వినీల గారు
17. కె.ఇ.నిలమంగై గారు
18.కె.దేవికారాణి గారు
19..పిల్లి హజరత్తయ్య గారు
20తిప్పావఝల నరసింహమూర్తి గారు
21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
22..కవిత వెంకటేశ్వర్లు గారు
23.వనపర్తి గంగాధర్ గారు
24.బొప్పెన వెంకటేశ్ గారు
25.చేబియ్యం శ్రీ నివాస్ గారు
26.జోషి పద్మావతి గారు mbnr
*******
1
అంశం;, నిరాడంబరత
శీర్షిక:
    "" అణుకువతో మెలగాలి""
ఎడిగేకొద్ది ఒదిగి ఉండటం
ఎదిగొచ్చిన మూలాలను మరువక పోవడం
వినయ విధేయతలు ప్రదర్శించడం
నిరాడంభారుని ప్రధమ లక్షణాలు
మానవుని మనుగడకు మార్గదర్శకాలు!
ఎత్తయిన కొండకూడా
అద్దంలో కొంచమై యున్నట్లు
అనువుగాని చోట అధికులమై
ప్రవర్తించక
సమయానుకూలంగా వర్తిస్తూ
అదంభ రాలకు తిలోదకలిస్తూ
అన్నార్తులకు చేయూతనిస్తూ
ఉడుతాభక్తిగా సమాజ సేవ చేస్తూ
అందరికి తలలో నాలుకయై నిలుస్తూ
పరహితాన్ని ఆకాంక్షిస్తూ
మానవసేవే మాధవ సేవగా తలుస్తూ
సంచిక రుగ్మతల నిర్ములనకు కృషిచేస్తూ
పర్యావరణమును పరి రక్షించేందుకు ఉద్యమిస్తూ
అందరూ బాగుండాలి  అందులో నేనుండాలను కుంటూ
ప్రతి భారతీయుడు నిరడంబరుడై
ప్రగతి పదాన పయనించాలి
ప్రపంచ గమనంలో భారతదేశాన్ని ప్రథమంగా నిలపాలి!
..........................................
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
................ .......................
పై కవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
2
: వీరాస్ కవి సమయం
అంశం: నిరాడంబరత
పేరు : గొర్రెపాటి శ్రీను
శీర్షిక :  "దైవస్వరూపులు"  


అంబరాన్నంటేంత విజ్ఞానాన్ని స్వంతం చేసుకున్న మహనీయులు ఎందరో !
గాంధీజీ,అబ్దుల్ కలాం,రామకృష్ణ పరమహంస,
స్వామి వివేకానంద,రమణ మహర్షి,
జిడ్డు కృష్ణమూర్తి,మదర్ థెరిస్సా,సావిత్రిబాయి ఫూలే ..
వంటి వారెందరో ఘనమైన పేరుప్రఖ్యాతులు జీవితంలో సాధించినా..
వారెన్నడు తమ గొప్పతనాన్ని ఆర్భాటంగా ప్రదర్శించలేదు !
జనుల హృదయల్లో ఉన్నతమైన స్థానాన్ని కలిగినా
సకల జనులు తమ తోబుట్టువులుగా భావించి..
అందరితో సఖ్యతగా మసలుకుంటూ..
ప్రేమ,ఆప్యాయతలకు మారు పేరై జీవన యానం సాగించారు !
నిరాడంబరత ను తమ జీవితాల్లో భాగం చేసుకుంటూ..
సామాన్యుల్లా జీవించిన "అసామాన్యులు" ఎందరో !
స్వార్ధాన్ని తమ దరిదాపుల్లోకి రానీయకుండా
సాటి మానవులని దయ,స్నేహ భావనలతో పలకరిస్తూ..
..సహృదయులై ..హృదయ నిరాడంబరత తో ..
సమస్త మానవాళికి ప్రేరణ,స్ఫూర్తిప్రదాతలై..
తమ జీవితాలని సుసంపన్నం చేసిన మహోన్నతమానవతామూర్తులు ఎందరో..!
పరిణతి చెందిన మనస్సులతో ..
మంచి మానవత్వాలు ,శాంతి సామరస్యాలకు చిరునామాలై నిలిచిన వారెందరో !
వారంతా భౌతికంగా లోకాన్ని వీడినా ..
ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులై ..
నిత్యకాంతి చైతన్యాలై వెలుగుబాటల్ని పరిచయం చేసే ..దైవస్వరూపలు !
వారు చూపిన సన్మార్గాన్ని మనం కూడా ఆచరిద్దాం..
భావితరాలకి మార్గదర్శకులమై.. సుందరజీవనవిధానాన్ని పరిచయం చేద్దాం !

                                            - గొర్రెపాటి శ్రీను 9652832290

"దైవస్వరూపులు" అను కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
                                                                              - గొర్రెపాటి శ్రీను
3
[16/06, 8:32 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2 )16/6/2021/ బుధవారము
అంశము:-" నిడారంబరత "

సీ!  ఆడంబరాలకు  హద్దులుంచినచాలు
గొప్పలు పోకుండ  గోప్యమెరుగు

చేయుకార్యములను  చేయుపరిధిలోన
నీకున్నదానిలో  నీవుచేయి

నీనిడారంబము  నీ మర్యాదలతోడ
ఆదరించే మాట  లందునుండు

అప్పులుచేయుచు  ఆడంబరాలేల
అప్పుచేసిచేయ  ముప్పుకలుగు

ఆ!  అంగ లేయ వలదు  ఆడంబరాలకు
వున్నదంతకూడ  వూడ్చిపెట్టి
చేయి చాచి యడుగ  చేయరు సాయము
తిప్పలుపడ వలదు  మెప్పుకొరకు!
           తరణికంటి సూర్యలక్ష్మి.
                      ---------
4
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం( సీజన్-2) ఆధ్వర్యంలో
అంశం:- నిరాడంబరత
శీర్షిక:-
ఆదర్శజీవనానికి ప్రతీక
.................................
పంచభూతముల కలయికతో పుడమి పై జన్మించిన జీవరాసులలో మానవజన్మ ఉత్క్రుస్టమైనది.
జన్మానామ్ నరజన్మదుర్లబం అన్నది వేదం.
ఎంత ధనం సంపాదించినా
అత్యున్నత పదవులు అలంకరించనా నిస్సార్ద,నిరాడంబర జీవితం. ఆరోగ్యదాయకం
ఆనందప్రదాయకం.
శ్రీరామచంద్రుడు, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు ఎందరో పురాణ పురుషుల నుంచి
శాంతి, అహింసలే ఆయుధాలు గా స్వాతంత్ర సముపార్జన చేసిన జాతిపిత మహాత్మాగాంధీ,సర్ధార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, స్వామి వివేకానంద, టంగుటూరి ప్రకాశం పంతులు, అబ్దుల్ కలాం వంటి ఎందరో మహానుభావులు నిస్వార్థతకు,నిరాడంబరతకు నిలువెత్తు దర్పణాలు
అహంకారం అథఃపాతాళానికి పునాది.
మహాభారతం లో విదురుడు చెప్పిన మృదుస్వభావం,నిస్వార్థ, నిష్కళంక,నిరాడంబర జీవితం మానవునికి 
ముముక్షత్వమును కలుగచేస్తుంది.
కావున మనమందరం  నిరాడంబరత్వం తో జీవించి వసుదైవ కుటుంబాన రామరాజ్యాన్ని 
తిరిగి నెలకొల్పుదాం....!!
..................................
లోకా సమస్తా సుఖినో భవంతు.
................................
పేరు:- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి 
విశాఖపట్నం.
చరవాణి:-9963265762
..................................
5
మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం
 తేదీ :16/ 6/ 21 -బుధవారం 
అంశం :నిరాడంబరత
  శీర్షిక :నిరాడంబర మే ఆభరణం 
పేరు  :మన్నె  లలిత
 హైదరాబాదు 
చరవాణి సంఖ్య: 741 686 32 89
************************************
 మాట ,మంచి, సౌశీల్యం ,సఛ్ఛీలత
 రుజుమార్గం, నిరాడంబరత
 మంచి మనిషికి ఆభరణాలు
 అవే నిజాయితీకి కొలబద్దలు

 మనిషి ఐశ్వర్యం వేసుకునే వస్త్రాల్లో 
పెట్టుకునే ఆభరణాల్లో
 సంపాదించే అక్రమ ఆస్తులలో 
ప్రదర్శించటం కాదు 

అన్నార్తులను ఆదుకోవడంలో 
 కూడు గూడు నీడ ఇవ్వటంలో   
అభాగ్యులను ఆదరించడంలో 
సేవాతత్పరత కలిగి ఉండటంలో
 అహంభావం లేక సేవ చేయడంలో 
నిరాడంబరత    నిఘాఢం.
  
 కొల్లాయి  కట్టిన గాంధీజీ
 ప్రధాని అయినా కనీస వసతులు
 లేని ఇంట్లో ఉన్న  శాస్త్రీజీ
 రాష్ట్రపతి అయినా పది చొక్కాలైనా లేని
 అబ్దుల్ కలామ్ జీ
 నిరాడంబరతతో సాధించారు 
శాశ్వత విజయాలు
  వారి దారిలో నడిచిన వారికి జయాలు
6
కవితా గానం సముహం కొరకు 

అంశం నిరాడంబరం 
కవితా శీర్షిక నిరాడంబరత 


నిరాడంబరత అంటే సరళత 
నిరాడంబరత స్నేహితులని పెంచుతుంది 
అహం గర్వం శత్రువులను పెంచుతుంది 
నిరాశ నిస్పృహ అన్నిటిని జయించే శక్తీ 
నిరాడంబరత కు కలదు 
నిరాడంబరత సౌశీల్యత వినయం విధేయత ఇవన్నీ సద్గుణాలు 
మంచి గుణాలు మంచి భావాలూ నడక నడత చెయ్యును మనిషి ఉన్నతుడిగా 
లేని పోనీ అత్యాశలు పోకుండా ఉన్నదానిలొ సంతొషం గా జీవించటం యే నిరాడంబరత   
సమస్యలు రాని సునామి రాని అన్నివేళలా చెరగని చిరునవ్వుతో జీవించటం నిరాడంబరత 
నిరాడంబరం గా జీవించే జీవితం ఇచ్చును నిశ్చింత జీవితం 
నిరాడంబరం జీవితం చేయును మనిషికి ఆదర్శమూర్తిగా 
నిరాడంబరం జీవితం చేయునుమనిషికి 
సంతోషమయం



ఈ అక్షరాలు స్వీయరచన 
అని హామి ఇస్తున్నాను 
పేరు వి విజయశ్రీదుర్గ 
ఊరు విజయవాడ 
చరవాణి 9030225437
7
శీర్షిక.నిడారoభత
......
పుట్టుట గిట్టుట మధ్యలోన
మనిషి బతుకు నాటకము
మధ్యలో మనిషికి కెందుకో మరి ఎగిసిపాటు
ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే
ఓ మనిషి మానవత్వంమును 
నింపుకోని మునుముందుకు సాగిపో

బతుకు దారిలో మమతలు నింపుకో
కలలు కనుచూ భవితను దిద్దుకో
మమతల పొదరిల్లుతో మనిషిగా నిలుచిపోమా

ఆకాశము అంటేటి మెరుగులుతో
ఆడoబరముతో  సాగుతూ
తుళ్ళిపడేటి మనిషి
ప్రేమ మాయలో మనిషిని వెన్నుపోటు పొడుస్తూ
పచ్చని స్నేహాన్ని వెక్కిరిస్తూ
తలబిరుసుగా సాగిపోయేవు

నిడారoబతతో సేవా గుణము
నింపుకోని మునుముందుకు సాగిపో
బతుకు దారిలో పరోపకారిగా నిలిచిపో

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా

8
నిరాడంబరత
***********
సౌఖ్యాలను వదులుకోవడం కాదు
ఉన్నదాంట్లో సుఖంగా ఉండడమే నిరాడంబరత
సౌకర్యాలను కోరుకోవడం కాదు
సౌకర్యంగా ఉండడమే నిరాడంబరత
కోరికలను అణచుకోవాలని కాదు
పరిమిత కోరికలుండడమే నిరాడంబరత
పుష్కలమైన సంపదలో కాదు
కూసింత సంతృప్తిగానుండడమే నిరాడంబరత
వస్తువాహనాల వైభోగము కాదు
ప్రయాణముకు ఉపయోగపడడమే నిరాడంబరత
కోటానుకోట్ల డబ్బుండడమే కాదు
పదిరూపాలతో సర్దుకోవడమే నిరాడంబరత
గంటకో విమానమెక్కడం కాదు
ఇందనమవసరంలేని సైకిలుండడమే నిరాడంబరత
వందల ఎకరాల భూములుండడం కాదు
గుంటభూమి గుడిసెలో ఉండడమే నిరాడంబరత
కావాలి కావాలి కావాలి అనే అత్యాశకన్నా
ఏమిలేకున్నా ఉండడంలోనే నిరాడంబరత
తరతరాలకు సరిపడ సంపాదించడం కాదు
ఉన్నదాంట్లో కాసింత దానం చేయడమే నిరాడంబరత
***********
మేకల రామస్వామి-చెన్నూర్
9912747214

9
 కవితాగానం సీజన్ 2
*జంపని శ్రీనివాసమూర్తి* ( *జలజ* )🦜
గుంటూరు
16 - 6 - 2021
80742 97465

అంశము: నిరాడంబరత
శీర్షిక: *విత్తు - వ్యక్తిత్వం*

నీ ఉదాత్త ఆలోచనలకు
పునాది నీ *వ్యక్తిత్వం* లో
*మొక్క* లా పెరిగే *నిరాడంబరత*.

ఆ మొక్క పెరిగి పెరిగి
చిగురులతో శాఖోపశాఖలై...
నీ కళ్ళల్లో మెరుపు,
భావవ్యక్తికరణలో అందం,
జీవితంలో ఔన్నత్యం అన్నీ....
*ఆకులు, పూలు, కాయలుగా*
గుత్తులు గుత్తులతో *మూర్తి* భవిస్తుంది
ఓ అందమైన స్థిరమైన వృక్షంలా.!

ఆ వృక్షంపై నివసించే పక్షులే
నీలో నివసించే *నడత, శైలీ*!

నీ డాబు, దర్పం లేని నిరాడంబరత జీవితంలో
వృక్ష శాఖల కింద సేద దీరే మూగజీవాల సౌందర్య చిత్రం లా హాయినిస్తుంది.

నీలో నుండి బయటికి వచ్చే దయాగుణమే
వృక్షము నుండి వచ్చే ఆక్సిజన్ కు సాటి.
ఆ నిరాడంబరత నీ సంతృప్తికి పౌర్ణమి వెలుగులై,
పర్వత శిఖరాలపై కొలువైన
ప్రశాంతత నిండుతనం ఏర్పడుతుంది.🦜

10
 కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:నిరాడంబరత
శీర్షిక :నిరాడంబరత

అవసరానికి మించిన ఆడంబరం
అనర్థాలకు మూలస్థానం
చాపక్రింద నీరులా  ముంచుట ఖాయం
వాగాడంబరమైన వస్త్రాడంబరమైన
హానికూర్చు తుదకు బ్రతుకునందు
నిరాడంబరతెపుడు నిండుదనము నిచ్చి
నలుగురిలో నిన్ను గొప్పచేయు
బాహ్యాడంబరముకన్న హృదయాడంబరము
మిన్న టంచు నెంచ బ్రతుకు పండు నిజము
అంతరంగమందత్యాశలు బూని
పైన నిర్లిప్తతున్న మేడిపండు చందమౌను
నిండుకుండ వంటిదీ నిరాడంబరత
చిల్లుపడక చూడ జీవితమెల్లయు
పూలబాట యగుచు తావి నిండు
11
కవితా గానం 
అంశం.. నిరాడంబరo
శీర్షిక.. సాదాసీదా 
తాతపూడి సోమశేఖర శర్మ 
యానాం, 8328079346

అల్పుడెపుడుపల్కు ఆడంబరముగాను 
సజ్జనుండు పల్కు చల్లగాను 
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా 
అని వేమన గారు చెప్పిన పద్యం 
ఈనాటికి ప్రతివారి గుండెల్లో నిలిచింది 

గొప్పవాడుఎప్పుడు నిరాడంబరంగానే  
గొప్పగొప్ప కార్యక్రమాలు చేపడతారు 
అల్పుడు ఎప్పుడుకూడా ఆడoబరంగ
ఢాంభికాలు పలుకుతూ ఎదుటివారిని 
బోల్తాకొట్టిద్దామని తనే బోల్తా పడి  అపహాస్యం పాలుఅవుతూవుంటాడు 

నిరాడంబరత గొప్పవారి లక్షణం 
ఆయన ఎప్పుడూ సాదాసీదాగానే  వుంటారు అంత గొప్పవారు ఐనా 
గర్వం ఉండదు అసలు అని జనులు మాట్లాడుకుంటూ చెప్పుకుంటారు

పెద్ద విఖ్యాతి గడించిన పేరొందిన  మహానుభావులు ఎందరెండరో 
వారందరు నిరాడంబరజీవులే 
గాంధీగారు కొల్లాయిగడ్డతో నే 
భారతదేశానికి స్వాతంత్ర్యo
రప్పించిన గొప్ప నిరాడంబర 
సాదాసీదాగా జీవనాన్నిగడపిన 
మహితాత్ముడు మహాత్ముడు 
మనం నిరాడంబరంగా ఉందాం 
ఎంతోకొంత ప్రగతినైనా సాధిద్దాం 

హామీ పత్రం.. 
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
12.
[16/06, 9:19 pm] +91 94413 57400: కవితాగానం.
తేదీ.16-6-2021
అంశం.నిరాడంబరత.
రచన.డా.నాయకంటి నరసింహ శర్మ.
ఫోన్ నంబర్.9441357400.



ఆరడగుల నేల 
రెండుపూటలా భోజనం 
ఒక అంగీ పంచా లేదా ప్యాంటు 
మాట్లాడుకోవడానికి నలుగురు మనుషులు 
స్నానపానాలకు నాలుగు బకెట్ల నీళ్లు 
చదువుకోవడానికి పుస్తకాలు 
ఇంతే 
చాలదా మన జీవన గమనానికి 
పదిమంది మేలు కోరి చేసే ప్రచారం లేని మంచి పనులు 
ఇవే ఇవే !!
ఇంతకన్నా నిరాడంబరత ఇంకేముంటుంది ?
రమణమహర్శి లాంటి వారు ఇంతే నిరాడంబరంగా బ్రతకలేదా?
అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా  దిగిపోయేటప్పుడు
కారూ పెన్షన్ వదలుకొని 
బ్యాంకు బాలన్స్ కూడా మిగుల్చుకోకుండా 
జీవితశేషం గడపలేదా ??
నిరాడంబరత సాధ్యమే 
నిరాడంబరతపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చెదానికన్నా ఆచరించి చూపించాలి
[16/06, 9:20 pm] +91 94413 57400: హామీ పత్రం 
ఈకవిత స్వీయరచన.
అనుకరణా అనువాదం అనుసరణమూ కాదని హామీ ఇస్తున్నాను
13
[16/06, 9:30 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మనిషికి నిరాడంబరత
నిరాడంబరత ఆదర్శంగా ఉంటుంది

ఆనాడు ఒక సుందరయ్య ఒక ధర్మభిక్షం ఒక ఉత్తములు


సామాన్యుడు లాగా జీవించడమే నిరంతరం అవలంబించాలి

అందరూ ఎప్పుడూ ఆదర్శ జీవులుగా ఉంటారు

నిరాడంబరత ఆభరణం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537
14
[16/06, 9:31 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:16-06-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: నిరాడంబరత
*******************
కాలాలతో మారే కాయానికి
హంగులు ఆర్భాటాలు 
అవసరమానే విచక్షణే
 గ్రహింప జేస్తుంది సూక్ష్మంలో మోక్షాన్ని...

మనసులో మాలిన్యం పెట్టుకుని
తనువునెంత ఆడంబరంగా అలంకరించినా
నిరాడంబరంతో
నలుగురితో మెలిగే ఆత్మీయతే అసలైన అందం!

నిరాడంబర వ్యక్తిత్వాన్ని మించిన  విలువైన ఆనందం ఇంకేముంది!
 మన నడత నడకే మాటామంతీ అపురూప నిరాడంబర భూషణాలు.
వాటిని ధరిద్ధాం.. ఆచరణలో ఆనందంగా ఉందాం..

 *వురిమళ్ల సునంద ఖమ్మం*
15.
[16/06, 8:10 pm] Korada: కవితాగానం :- నిరాడంబరత 
కోరాడ నరసింహా రావు... !
    * నిలువెత్తు రూపం *
       **************
నిరాడంబరతకు నిలువెత్తు 
సాక్షీ రూపం ఎవరు.... !?
జాతిపిత మన మహాత్మా గాంధీ గాక మరెవరు.... ?!

ఆడంబరానికి అప్పులు జేసి 
తిప్పలుపడ్డ బ్రతుకులనెన్నిం 
టిని చూడటం లేదు... !

నీ సంపదల ఆడంబరాలను 
చూసి నిన్ను గౌరవించేవారు 
నిజానికి నీసంపదకే ఇస్తున్నారు 
గౌరవం....భౌతిక  సంపదలు
ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడు పోతా యో... ఎవరికెరుక ?!

నీసంపాదన, శ్రమ ఆడంబరాల కోసం కాదోయ్ నువ్ ఖర్చు 
చెయ్యాల్సింది..., 
నువ్వేభవంతుల్లో ఉంటే ఏమ్ 
ఏ ఖరీదైన తిళ్ళుతింటే ఏమ్ 
నువ్వే కారుల్లో తిరిగితేనేం... 
ఇవన్నీ ఎవడిక్కావాలి... !

నువ్వీ సమాజానికి చేసిందేమిటి... ?
నీనుండి ఎవరైనా ఏ ఉప కారా 
న్నైనా పొందారా.... 
నువ్వు సాటిమనిషికి ఏకాస్తయినా మేలు చేసావా 
ఇవి... ఇవికావాలీ సమాజానికి 

ఆ కవీశ్వరుడు చెప్పినట్టు.... 
*సగము బట్ట లేని సామాన్యుడు 
ఫకీరు తాత యొకడు లోక దాత యయ్యె... *
 ఇదీ బ్రతుకంటే....మనం ఎంత నిరాడంబరం గా బ్రతికినా.... 
చరిత్రలో.... మనకీ... ఒక పేజీ 
కాకపోయినా ఓ పేరాకి సరిపడా చోటును దక్కించు కో 
గలగాలి... !అదీ బ్రతుకంటే !!
    ********************
      ......... కోరాడ.
16
[16/06, 8:29 pm] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : నిరాడంబరత
కవితా సంఖ్య: 48
తేదీ: 16/06/21

హంగులు,ఆర్భాటాలు
హడావుడీ నడకలు
గుర్తింపు భాజా భంజత్రీలు
క్షణ కాలమే....!!

స్వచ్చమైన పాలమనసుతో
నిమ్మళంగా,నిదానంగా
ఎంత ఉన్నా ఒదిగి న జీవనం
పరిమళభరితమైన వాహకం....!!

అందరికి ఆదర్శమైన మార్గమై
వెన్నెల జల్లుల తడుపులై
మనిషి జన్మకు సార్ధకత దారిగ
సమాజాన ఉద్భవించు కీర్తి సంపదగ....!!

నిరాడంబరత తేజస్సును ఇచ్చే
ఆభరణం
నీ ఉనికిని ప్రకాశింప చేసె వెలుగు
సంస్కార దీపాలకు ప్రాణవాయువు....!!


                              వినీల
17
[16/06, 9:24 pm] Komandoori Neela Poet: కవితా గానం (సీజన్1)
పేరు:కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
శీర్షిక: *నిరాడంబరత*    
తేది:16/06/2021
        వచన కవిత్వం
చరవాణి సంఖ్య:8897155600

క్షణ భంగుర జీవితంలో అన్నీ ఆ పై వాడు చేసిన మాయాకల్పిత ఘటనలే..!

తెలిసి తెలిసి మోహావేశంతో కొట్టుకులాడుతాం..!
మానవ మాత్రులం కదా..!

మానవత్వ పరిమళాలు విరిసే చిన్నపాటి సాయం మనిషి పోయినా కీర్తి కిరీటమై నిలిచి పోతుంది..!

నీటి బుడగ జీవితం కోసం సహాయ చిత్రాలు తీయించు కోవటం అవసరమా..?
నిరాడంబరతే ఉన్నత శిఖరాలను చేర్చే మార్గమని తెల్సినా ఎందుకో పాకులాడుతాం..! హంగులు,ఆర్భాటాలకు పోతూ విచిత్ర పోకడలకు నాందీ పలుకుతూ..!!!!!

*ఈ కవిత ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను.*

*నీలా రంగనాధం*
18[17/06, 8:16 pm] +91 99087 06218: నిరాడంబరతా...?!
18
రచనకే దేవికారాణి రత్నాకర్ తెనాలి.

కవితాగానం సీజన్ టు
అంశం నిరాడంబరత
శీర్షిక: నిరాడంబర తా.....????


ఉన్నవాడు ఆడంబరాలు పోతాడు
లేనివాడు బిక్కుబిక్కుమంటాడు.

ఆ వున్న వాడికి ఈ లేని వాడికి
మధ్య వ్యత్యాసం ఎందుకు అన్న వాడికి


కొంతమంది మేధావులు చేసిన
'
హితబోధ"
ఆడంబరాలు పోకు లేనివాడిని రెచ్చగొట్టకు అని

ఉండడానికి తో సరి పెట్టుకోమని లేనివాడికి


ఇంత సంపాదించి తినిఇంకే లయని తనియ రాదని ఉన్నవాడికి నూరిపోసే
వింత వ్యవస్థలో బ్రతుకుతున్న వాళ్ళం .


ఉన్నా లేనట్టెందుకు?

లేకున్నా ఉన్నట్టెందుకు?


అంతా సమానంగా లేని ఈ వ్యవస్థ మనకు ఎందుకు?

[17/06, 8:16 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఆమె ఎవరైతే నేమ్

జీవితమంతా కష్టాల మయం
ఆమె అడివిని సృష్టించిన నా దేవత అమ్మ


అలెప్పి దగ్గర తన ఇంటిని నాలుగు ఎకరాల మహారణ్యం సృష్టించి పద్మశ్రీ అందుకొన్నది ఇవన్నీ ఆమెకు లెక్కలేదు అవార్డులతో ఎప్పుడు రాజీపడలేదు

ఆమె ఇంటిలోనే చిన్నారి

ఆమెకు మొక్కలతోనే స్నేహం విత్తనాలు తెచ్చి నాటి

పొలం పనులు చేస్తూ జీవితాన్ని గడిపిన పర్యావరణ వేత్త పర్యావరణం యొక్క గొప్పతనాన్ని అందించిన ఘనురాలు

ఆమె దేవత అమ్మ

పర్యావరణమే ఆమె జీవితం ప్రకృతి ఆమె ప్రాణం రకరకాల మొక్కలను నాటిన అద్భుతమైన హస్తం 


ఆమెను ఆరాధించండి ఇ అలాంటి గొప్ప వ్యక్తులను
ఎడారి భయంలేని నేలను పచ్చని మొక్కల వాతావరణాన్ని సృష్టించిన ఆమెకు జయహో లు

19
[17/06, 8:18 pm] +91 98486 06573: కవితా గానం సముహం కొరకు 

అంశం: నిరాడంబరం 
కవితా శీర్షిక:హృదయ నిరాడంబరత 

ఎదిగినా ఒదిగి ఉండడం 
నిరాడంబర లక్షణము
ఉన్నదాంట్లోనే తృప్తి చెందుతూ
సౌఖ్యాలను త్యజిస్తూ
కోరికలను,కాంక్షలను జయిస్తూ 
మనసుపై ఏకాగ్రత సాధించడమే
నిరాడంబరతకు నిలువుటద్దము
సజ్జనుడి పలుకు వలె
చంద్రుని చల్లని వెన్నెల వలె
మనిషిలోని ఉదాత్త భావనలే
నిరాడంబరతకు ఆభరణము
యదార్థ స్థితిని గ్రహించి
వాస్తవికతను చేరుకోవడం
హృదయ నిరాడంబరము
అదే మనిషికి ఆదర్శము
ఎందరో మహానుభావులు
జీవితంలో ఎదిగిన వైనం
నిరాడంబరతకు నిదర్శనము
వారి సహృదయత స్ఫూర్తి వంతము
భావి తరాలకు మార్గదర్శకము

ఈ అక్షరాలు స్వీయరచన 
అని హామి ఇస్తున్నాను 

పిల్లి.హజరత్తయ్య
శింగరాయకొండ 
ప్రకాశం జిల్లా

20
ప్రభుత్వ ఆడంబరం
ప్రజలనెత్తిన భారం.
పలుకులో ఆడంబరం
అందరూ అవుతారు దూరం.
ప్రవర్తన లో ఆడంబరం
అతిగాడనే హేళన ఖాయం.
వివాహ వేడుకల్లో ఆడంబరం
ఎదురుగా స్తోత్రం,
చాటుగా విమర్శించడం
అప్పు చేసి ఆడంబరం
అంతకంటే లేదు హీనం.
వేషభాషలందు ఆడంబరం
ఏమాత్రం పొందలేదు గౌరవం.
నిరాడంబరమే మన సనాతన సంస్కృతి.
నిరాడంబరత్వమేవ నిజమైన
భూషణం.
నిరాడంబరత్వంతోనే ప్రజల
మనస్సుల్లో స్థానం
అబ్దుల్ కలాం నిరాడంబరత్వం
అందరికీ కావాలి ఆదర్శం.
కవితా గానం
అంశం.నిరాడంబరం .శీర్షిక.ఆడంబరంవద్దు.
పేరు.తిప్పావఝల నరసింహమూర్తి. బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లావ

21

[17/06, 8:53 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహించు కవితా సమాహారం

అంశం: నిరాడంబరత

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:950515250
***************************
చీకటి వెలుగుల తెరమీద మెరుగు
అద్దిన నక్షత్రాలు
ఏ ఆడంబరాలు కోరని పేద బతుకులు
సహజసిద్ధంగా కదిలే చిత్రాలు!

ఊహకందని రీతిలో
ఊసరవెల్లి తీరులో
రంగుల మార్పిడి నైజాలు
డాబూ దర్పం నటనకు 'ఆస్కారం'
డబ్బా మోతలు డప్పు వాయింపుడు కోతలు
పొద్దుగడవని మందబుద్ధులు
సొమ్మొకడిది సోకెక్కడిదో శరీరానికి
పూత వేసి వెలుగుతారు!

అంతరంగాన కుళ్ళుబోతుతనం
కనుబొమ్మలు అలవోకగా చిట్లించి
పెదాలు వంకరపెట్టి
భుజాలెగరేయడం
ముక్కు ఎగబీల్చి పరిసరాలను చీదరించుకొంటూ
అదో చిత్రం విచిత్ర వైఖరి
ఆడంబరత్వానికి ఆనవాళ్ళు!

సాటి సమాజానికి దూరంగా
సో-కాల్డ్ సొసైటీలో ఉత్తములు
నిరాడంబరతకు విలువ లేదిక్కడ.

నిరాడంబరతను ప్రేమించతరము గాదు!

సగటు మనిషి సంఘజీవనంలో
మమేకమై
నిరాడంబర జీవితమే
సుఖ సంతోషాలమయం!!
       ***
 *సయ్యద్ జహీర్ అహ్మద్ కర్నూలు* .
22
[17/06, 8:56 pm] +91 83099 20625:
 కవితా గానం కొరకు
అంశం:: నిరాడంబరత
శీర్షిక:::: ఉన్న లేనట్లే బండాలి

ఎంత ఉన్న
ధనమున్న ధాన్యమున్న
పదవున్న అధికారమున్న
ఏదున్న 
నిరాడంబరం మేలన్న
అదే మనిషికి గౌరమన్న

ఏదీ వెంట రాదని తెలుసు
ఏదీ శాశ్వతము కాదని తెలుసు
ఎవరు నీ తోడు రారని తెలుసు

తెలిసి ఎందుకు ఆడంబరాలు 
గొప్పల కోసమేల ఆడంబరాలు
పది మంది ఆర్భాటానికా
ఆడంబరాలు
చుట్టాల మెప్పుకా ఆడంబరాలు
ఊరంతా అనుకోవాలనా ఆడంబరాలు
వాటికై లక్షలు తగలేస్తారు
పోటికై కోట్లు ఖర్చు పెడతారు
డాబుకు పోయి డబ్బంతా
గుల్లజేసుకుంటరు
కాబట్టి ఆడంబరాలకు పోక
నిరాడంబరతే చాలా చౌక
ఆడంబరాలు లేకుంటే అంతా
హాయే
నిరాడంబర జీవితానికే ఓటు
వేద్దాం పదండోయో!!
                  కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు:::; 8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
*************************
23
[17/06, 9:00 pm]
 Vanaparthy Gangadhar Poet: *
కవితా గానం సీజన్ 2*
*****************************
*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435
తేదీ:17.06.2021
*అంశం:నిరాడంబరత*
*శీర్షిక:సహనశీలత*

మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం
నీవు పరులతో  భాషించు విధానం
నీవు చూపించే సహనం
నీ నడతను రూపుదిద్దేది నిరాడంబరత

ఆస్తులు,అంతస్తులు కాదు ముఖ్యం
మనసు విప్పి మాట్లాడితే నిరాడంబరత
శరీర సౌందర్యం కాదు ముఖ్యం
కష్టాల్లో సాయపడితే నిరాడంబరత
బంగారు ఆభరణాలు కాదు
ప్రేమమయ జీవితం నిరాడంబరత

నీ కలుపుగోలు తనము
నీ ఉన్నత సౌశీల్యము
నీ వినయ విధేయతలు
నీ సహణము,శాంతి తత్వము
నీ మాటల మాధుర్యము అసలైన నిరాడంబరత

పుట్టుట,గిట్టుట సహజము
ఎందుకు ఈ హంగు ఆర్భాటాలు
నాలుగు రోజుల ఆడంబరాలు
ఆశాశ్వత ఆశల పల్లకీలు
మన స్నేహ హస్తము
పరులకై చేసే సేవయే నిరాడంబరత

మది నిండా ఆప్యాయత నింపుకో
పరుల కోసం జీవితం అర్పించుకో
మానవీయ విలువలను చాటుకో
అదే బతుకును ఆదర్శ నిరాడంబరత


హామిపత్రం:
                   ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
24.
[17/06, 9:21 pm] +91 98665 84062: కవితా గానం సముహం కొరకు 

అంశం: నిరాడంబరం

కవితా శీర్షిక: అసలైన ఆభరణం

నీ నిరాడంబరతే నిజమైన ఆభరణం
పై పైన అలంకరణలు వట్టి పాట్లు
మనసులోని అందమే తీయని మకరందం
ఎన్ని ధరించినా అనువుగా లేనిది ఏం లాభం
నయా కట్టుబొట్టు కనికట్లు ఎన్ని కట్టినా
సహజమైన అందమే నవ్యతకు నగిషీలు
నిరాడంబరత నీలోని నిజమైన వ్యక్తి కి నిదర్శనం
అందని ఎత్తులకు పోతే తప్పవు అగచాట్లు
ఉన్నవాటితో సరిగ్గా ఉంటే ఉంటుంది సంతోషం
చేతలలో లేనిది చూపులలో మెరిపించుటెందుకు
నిరాడంబరతే అసలైన గొప్ప మెప్పు
ఆడంబరం అసత్యపు హోదాలకు చిహ్నం
మేనికి మెరుగులు అద్ది ఒద్దికగా లేనిచో ఆడంబరత ఆగునా?
పరులకు చిన్న సాయం చేయక గొప్ప మాటలు ఎన్ని చెప్పినా ఆడంబరతకు చెంపపెట్టులే


పేరు : బొప్పెన వెంకటేష్ 
జిల్లా: సిద్దిపేట్ 
చరవాణి : 9866584062


హామీ పత్రం: నేను రాసిన నా కవిత దేనికి అనువాదము అనుకరణ కాదు, నా సొంతం అని హామీ ఇస్తున్నాను.
25
[17/06, 9:27 pm] చేబియ్యం శ్రీనివాసరావు గారు: కవితాగానం (సీజన్ -2 )
అంశం -- నిస్సహాయత 
రచన - చేబియ్యం శ్రీనివాసరావు 
ఊరు -- గుజరాతిపేట , శ్రీకాకుళం 

కరోనా ప్రళయం 
పనీపాటా బందైనా కాలం 
జిందగీ నడవడం కష్టం 
పని దొరకడం బహు క్లిష్టం 
ఉన్న పాటుగా పల్లెకు పొమ్మన్న ప్రభుత్వం 
యజమాని పైస్లీయకుండా పరారైన వైనం 
కాలిబాటలో ప్రయాణం ప్రారంభం 
ఆపన్న హస్తం కోసం యెదురు చూపులు 
మంచి నీరే మాకన్నము  
చెట్టు నీడ అయింది గృహం 
బహుదూరపు బాటసారిగా పయనం 
దారిపొడుగునా మాలాంటి అభాగ్య జనం 
గమనం కష్టమాయెను 
దారిలో అడుగు పడక పోయెను 
సహాయత కోసం ఎదురుచూపుతో 
నిస్సహాయత తో తీరని ఆకలి బాధలు 
భగవంతుడా ఏమిటీ గడ్డు కాలం 
ఎలా చేరుతాము మా గమ్యం
26
కవితాగానం సమూహం కొరకు

అంశం : నిరాడంబరత

నా కవితాశీర్షిక: దిశానిర్దేశం
--------------------------------------------------

నిరుపేదకెరుక నిరాడంబరతానిర్వచనం!
నీలాకాశానికెరుక ఆడంబరంగా ఉరమటం,

మిలమిల మెరుపులనే చిమ్మి
చిరు జల్లులుమాత్రమేకురిపించటం

ఆడంబరులకు హంగులధికమేకాదా! 
ఆశించిన ఫలితం చేజారి పోదా!

ఆశయ సాధనకొక ఊతం లభించునా! 
విజయ పథానికి దిశానిర్దేశమవునా!

నిష్కల్మషత్వమున్నది నిరాడంబరత్వానే కాదా!
నిర్మల చిత్తులకాభరణం నిరాడంరత్వమే కాదా!

ఆడంబరత్వం నడిచేది పతనపథముననే! 
నిరాడంబరతకు ఎదురౌను విజయసోపానమే! 
                ________________
జోషిపద్మావతి మహబూబ్ నగర్ చరవాణి:9542910502

హామీపత్రం:ఈకవిత నా స్వీయరచన.దేనికీ అనువాదం,అనుకరణ కాదని మరే ఇతర కార్యక్రమాలకొరకు రచించినదికాదని  హామీ ఇస్తున్నాను.

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022