రామసేవ
శివునూరి లలితాకృష్ణ
Author of vennela shilpam
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
న్యాయ నిర్ణేత
జ్ఞాన ప్రసూనా శర్మ గారు
అవధాని
****"""*******
కవి వరుల జాబితా
1.భరద్వాజ గారు
2.వేదాల ఇందిర గారు
3.ఉల్లెంగ ముత్యం గారు
4.కొలచన విజయ భారతి గారు
5.సుకన్య వేదం గారు
6.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
7.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
8.వురిమళ్ళ సునంద గారు
9.ఇంద్రవత్ రాహుల్ గారు
10.కె.సి.నరసయ్య గారు
**************
1
[27/10, 8:25 PM] భరద్వాజ గారు: 🙏కవనజ్యోతి 🙏
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
రచన-4
27-10-20
అంశం -రామసేవలో
శీర్షిక- భక్తబృందం
అయోధ్యన పుట్టిన రాముడు-
భార్యావియోగాన వెతుకుతున్న జీవుడు -
మానససరోవరాన చేస్తున్నాడు సంచారం -
సీతావియోగం తొపొందలేకపోతున్నాడు ఉత్సాహం --
ఋష్యమూక పర్వతాలనుండి చూసాడు భక్తుడు -
దరిచేరి అయ్యాడుఆప్తుడు -
సుగ్రీవపరిచియాన పెరిగింది మైత్రి -
ఇరువురిని ఏకంచేసి పొందాడు తృప్తి -
రామదుఃఖాన్ని పోగెట్టే ప్రయత్నం చేసాడు -
వాలిని సంహరించి చేసాడు తనకర్తవ్యం -
ఇచ్చ్చిన మాటప్రకారం నలుదెసల భటులపంపి చాటాడు స్నేహభావం -
ముద్రిక తో లంకచేరి సీతజాడ కనుగొన్నమారుతి -
చేతికిచ్చింది సీత నమ్మి చూడామణి -
రాముడివిషయంతెలిపి వారిమనసులను చేసాడు సుందరం -
తోకకు నిప్పటించుకుని చేసాడు లంకాదహనం -
వారధికట్ట రాళ్లతో పూడ్చారు వానరులు సముద్రాన్ని -
కొద్ది ఇసుకతెచ్చి చేసింది ఉడత సాయాలు -
యుద్దానమూర్ఛిల్లిన లక్ష్మణుని సేదతీర్చా తెచ్చాడు సంజీవిని -
మైరావణుని బారపడకుండా చేసాడు రక్షణ కవచం -
రామాయణాన ముఖ్యులు వానరులు -
రామునికి అండాదండై నిలిచారు -
రావణుని ఎదిరించిపోరాడి కత్తి వేటు వేయించుకున్న జటాయువు -
పడవదాటించి భక్తిచూపిన గుహుడు -
అన్నప్రాణరహస్యం తెలిపిన విభీషణుడు -
వారధికట్టదారి ఇచ్చిన సముద్రుడు -
వీరందరూకదారామభక్తులు---!
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల ((RB)🖍️
2
[27/10, 8:33 PM] +91 98858 21189: కవనజ్యోతి:
వేదాల ఇందిర
అంశం: రాముని సేవలో
శీర్షిక: తరించండి
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం౹
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం౹౹
కవితాశాఖని అధిరోహించిన "వాల్మీకి "అనే కోకిల కూజితానికి చైత్రవనంలా పరవశించని భారత హృదయం లేదు
చైత్ర శుక్లపక్ష నవమి పునర్వసునందు శ్రీ మహావిష్ణువు స్వయంగా భూలోకంలో రాముడు గా అవతరించె
ఈ రోజు సమస్త కోరికలు ఒనగూర్చునట్టిది
శ్రీ రాముడు భారత దేశంలో ని పల్లె పల్లె తిరిగాడు అన్న సాక్ష్యాలు ప్రజలందరినీ ఒక్కటిగా కలిపిఉంచాయి
ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి మహత్తర సృష్టి రామాయణ మహాకావ్యం
శ్రీ రామ చరితం నిత్య నూతనం
మానవజాతి ఎలా జీవించాలో రామాయణం బోధిస్తుంది
ఎలా జీవించకూడదో భారతం తెలుపును
బంధాలు బాధ్యత ల పట్ల మన తీరుతెన్నులు రామాయణం చెపుతుంది
పురుషోత్తముడు పుడమి నేలిన తరుణంలో చల్లగ కురిసే వర్షములు
రాముని సేవ అనగా ఆ ఆదిపురుషుని ఆదర్శములను అనుసరించాలి
అప్పుడే దుఃఖములుండవు రోగములు మొదలగు ఏ క్లేశములు దరిచేరవు
రాముని సేవలో భాగంగా మారుతి
చిరు రూపంలో సీత కు కనపడి
గురు రూపంలో లంకను కాల్చి
భీకర రూపంలో అసురుల ద్రుంచి
రామకార్యమును దీర్చెను
సీత వద్ద నుండి మణిని తెచ్చి రామునకీయగా అది చూచి రాముడు "గోమాతకు తన కన్న బిడ్డ ను చూస్తే కలిగే ఆనందం తనకు కూడా కలిగింది " అని అనుకొనెను
చంద్ర కిరణములు అంధకారం తొలగించునట్లు
మహానుభావుల నడవడిక లు అనుసరించిన మానవుల శారీరక మానసిక దోషాలు దూరమవుతాయి
శ్రీ రాముడంటే రూపు దాల్చిన ధర్మం. అదే 'రామో విగ్రహవాన్ ధర్మః
అటువంటి ధర్మ మూర్తి ని అనుసరించడమే రాముని సేవ
సార్వకాలికమైన నీతికి ధర్మానికి ఆదర్శానికి ప్రతీక రాముడు ఆయన తత్వమే రామ తత్వం
భవభూతి మాటల్లో కరుణరసం ఒక్కటే రసం
కరుణకు స్థాయీభావం శోకం
వాల్మీకి శోకమే 24000ల శ్లోకాల రామాయణ మయింది
రామాయణం ఇహ పర ముక్తిదాయకం
లోక కంటకుడైన రావణుని సంహరించి లోకానికి దీపావళి తెచ్చెను రాముడు
అందుకు వానరులు మొదలైన వారు సాయపడెను
మంచి చూసేవారందరికీ సాయపడదాము. అదే రాముని సేవ
3
[27/10, 8:50 PM] Mutyam Sir Basara KS 41: *శ్రీ భారతి*
( ఉల్లెంగ ముత్యం )
నిర్మల్ .
ధర్మానికి ప్రతిరూపం రాముడు
రామ కార్యమే ధర్మ కార్యమని
ఋషి ముని జనములు దేవత గణములు
కదిలి వచ్చిరి రాముని కండగ
జటాయు పక్షి ప్రాణము లిచ్చి
నాంది వేసె రాముని కార్యముకై
నది దాటించగ గుహుడు వచ్చెను
పాద యుగములు కడిగి మ్రొక్కెను
అగ్ని సాక్షి గా చెలిమి చేసెను
సుగ్రీవుడు తన సేనల నంపెను
సీత జాడ కై నలు వైపులను
వెతికించె రాముని బాధ తీర్చగా
రామ నామమే నమ్మిన హనుమ
నమ్మిన బంటుగ పేరు పొందెను
రాముని కొరకే జీవన మిచ్చెను
రామ నామమే స్మరియించాడు
శత యోజనములు లంఘించాడు
సీత జాడను కనుగొన్నాడు
రావణుని ఆ రాజ్యం లో కూడా
కలరు ఎందరో రాముని సేవ కు
విభిషణుడు తన జీవిత లక్ష్యం
శ్రీరాముని దర్శన భాగ్యము కొరకయి
యుద్ధ మందు శ్రీరామ జయము కై
తపించెను ఆ మహానుభావుడు
ధర్మ అధర్మమము మద్య యుద్ధమని
ధర్మపక్షము రామ పక్షమని
విజయము కొరకై పోరు సలిపిన
ఎందరొ యోధులు వీరులు ఎందరొ
రామ కార్య పరి సమాప్తి కొరకై
నిరంతరం శ్రమ జీవనాలను
గడిపీ గడిపీ విజయము నొందిరి....
అందువలననే శ్రీరామ జయం
శ్రీ రామ జయం శ్రీ రామ జయం
( స్వీయ కవిత )
4
[27/10, 9:06 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:రాముని సేవలో
తేదీ:27-10-2020
********************
జగదానంద కారకుడు
జగత్పరిపాలకుడు
రాముని సేవలో తరించని వారెవ్వరు ఇలలో
అందరినీ దరిచేర్చే ఆ రాముడినే నావపై అద్దరిని చేర్చిన గుహుడెంత ధన్యుడో
సీతమ్మ జాడ కానరాక
వెతికి అలసి వేదన చెంది
శోకించే రామునికి
సీతజాడ చెప్పి తనువు చాలించిన జటాయువు
జన్మ ఎంతటి ఉన్నతమో
హృదయ మందిరాన సీతారాముల నిలుపుకుని
జన్మంతా రామసేవలో సేవించి తరించిన హనుమదెంతటి పుణ్యమో
ఇరవుగ ఇసుకలో పొరలిడి
సేతు నిర్మాణంలో తనవంతు
సాయమిడిన చిన్ని ప్రాణి ఉడుత జన్మ ప్రోవు చేసుకున్న
పుణ్యమెంతటి ఫలమో
రామ రామ యని రాముని
సేవ చేయని వారెవరు
రామజన్మభూమి ని
రాజసముగ నిలిపి
రామ మందిరనిర్మాణమును
రమ్యముగ నిర్మింప తలబెట్టి
రాముని సేవలోతరించే నేటి పరిపాలకులెంతటి పుణ్యులో
శ్రీరామ జయరామ
జయజయ రామ
🙏🙏🙏🙏🙏
ఈ రచన పూర్తిగా నా స్వంతమేనని హామీ ఇస్తున్నాను
5
[27/10, 9:12 PM] సుకన్య Vedam: కవన జ్యోతి
పేరు:- సుకన్య వేదం
ఊరు:- కర్నూలు
అంశం:- రాముని సేవలో
తేది:- 27/10/2020
రామ కార్యం మహా పుణ్యకార్యం...
శ్రీరాముని సేవ ముక్తిప్రదాయం...
సీత కోరిక తీర్చ శ్రీరాముడేగగా...
అన్న కొరకై లక్ష్మణస్వామి వెళ్ళగా...
సీతనపహరింప వచ్చిన రావణుని ప్రాణాలకు తెగించి అడ్డగించెనట ఆ జటాయువు...
రామ పాదము తన పడవలో మోపిన ముక్తిదాయకమని తలచె ఆ భక్త గుహుడు...
లంకలో దాగిన సీత జాడను కనగ సంద్రాన్ని లంఘించె భక్త హనుమంతుడు...
రామ కార్యము దీర్ప రావణుని తమ్ముడు సాయమ్ము చేసెనట ఆ రాఘవునికి...
సేతువు నిర్మింప ఐకమత్యము తోడ అరుదెంచిరట ఆ వానర సేన...
రామ కార్యములోన నేను చేయేతునని చిరుత సాయము చేసె ఆ చిన్ని ఉడుత...
శుభసూచకమైన కలనొకటి కంటినని సీతనూరడించె త్రిజట ఆనందముగ...
ఇందరి సాయమును స్వీకరించిన రాముడు...
రావణ సంహారము చేసి గొనిపోయె సీతమ్మను...
ఎంత చరితార్థములో కదా ఆ భక్తుల సేవలు...
ఎంత పుణ్యాత్ములో ఆ భక్త శిఖామణులు...🙏🙏
హామీ పత్రం:- ఇది నా స్వీయ రచన. ఈ సమూహం కొరకు మాత్రమే వ్రాయబడినది.
6
[27/10, 9:16 PM] Prasoona Sharma Madam: *రామునిసేవలో*
సీసమాలిక
*********
వినయమ్ముగావంగి వెదురు కర్రలునాడు
రామబాణములయ్యి రమ్యతొందె
పాదధూళియుసోకి పడతి గాతామార
రాతి జన్మమదెంత రాజసంబు
పడతి సీతనొసగి పరిణయంబునుజేయ
పుడమిజేసికొనిన పుణ్య మేమి
వారధి దాటించి పావనంబయినట్టి
పడవదెంతసుగుణ భాగ్యవశము
రాజుగా తాముండి రాజ్యమేలినయట్టి
పాదుకలెంతయో పావనంబు
సతిజాడ నుతెలిపి సేతువునిర్మించి
వానరంబులుఘన వాసిగాంచె
మధురరుచులనిచ్చి మహనీయు మెప్పించు
ఫలరాజములదెంత పరవశంబు
ఇసుకలోన పొరలి వసుధలో ననుడుత
రామయ్యగురుతుల రాజిలంగ
రావణునెదిరించి రమణిగురుతుతెల్పి
ప్రాణంబు విడిచిన పక్షిఘనుడు
ఆ.వె
*****
రామసేవలోనరంజిల్లినట్టి యా
ధన్యజీవులన్ని ధరణిలోన
మనిషి కంటెతాము మహనీయమై యొప్పి
రామ పథముజేరు ప్రేమగాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన;; జ్ఞానప్రసూనాశర్మ ఎల్లికంటి
కడ్తాల/ రంగారెడ్డి జిల్లా
7
[27/10, 9:17 PM] Gajula Bharati KS 20: కవనజ్యోతి
కవితాంశం:రామసేవలో
శీర్షిక:రాముడే దేవుడు
రామనామం సకల పాప హారణం
ఆదర్శ జీవనమునకు ప్రమాణం
రామాయణం నిత్య పారాయణం
సప్తకాండాలు కల కావ్యం
రఘుకులనందన రత్న దీపం
శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు ల్యం రామనాధం వరాననే
భక్తికి,ముక్తికి రామాయణం
ప్రకృతి రమణీయ దృశ్యకావ్యం
రామ రామ అంటే పరవశించిపోయే
రామనామం వింటే తరించిపోయే
రామసేవలో తరించే,,నీవే నాకు దిక్కు రామయ్యా అనుకుంటూ..నిత్యం రామయ్య సేవలో తనకు తాను సమూలంగా అర్పించిన వినయాశీలి హనుమయ్యా!!
అత్యంత ప్రియమైన సోదరుడు
అరవీర భయంకరుడు, అన్న మాట దాటని సేవకుడు
రామసేవలో నిద్రాహారాలు మాని,తన సర్వసుఖాలు వదులుకొని,,రాముని సేవలో ప్రాణత్యాగానికి వెనుకాడని ధర్మ సౌశీలుడు లక్ష్మణుడు
నిరాడంబరంగా రాముని సేవలో తరించి పునీతులైన శ్రీరాముడి గొప్ప భక్తుడు తులసీదాసు
రామసేవలో తరిస్తున్నా...
రామాయణం రాసామృత కావ్యం
జగతిన నిలిచే రసరమ్య కావ్యం
ఎన్ని యుగాలు,తరాలు మారినా
బాతృప్రేమకు తార్కాణం
ఒక మాట,ఒక భార్య
భారతీయ సంస్కృతి
సాంప్రదాయానికి నిలువుటద్దం
తండ్రిమాట జవదాటని ఆదర్శమూర్త్,ఆర్యపుత్రుడు,,లోక కర్త
ఉత్తమ జ్ఞాని రామచంద్రుడు
శ్రీ మాద్రా రామాయణం కన్నా,విన్నా
రమణీయం..కమనీయం..
అంతకు మించి ఆచరణీయమం
****************
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
8
*****************
[27/10, 9:18 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి*
తేదీ:27-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:రామ సేవలో
*******************
రామో విగ్రహవాన్ ధర్మః సత్య ధర్మ పరాక్రమఃఅన్న. మహితోక్తిని
మారీచునితో పలికించిన వాల్మీకి మాటలే అక్షర సత్యాల
ఆణిముత్యాల మూటలు!
అమ్మా నాన్నల అనురాగ పుత్రుడై
అన్నదమ్ముల ఆప్యాయత రూపమై
ఆలుమగల అపురూప బంధమై
గురు శిష్యుల అనుబంధానికి సాక్షిగా నిలిచిన అసలైన శిష్యుడై
స్నేహానికి ప్రాణమిచ్చే హృదయ వైశాల్య సంపన్నుడై
అనేకానేక విశిష్ట గుణాలు విలువలతో మూర్తీభవించిన మహనీయుడు శ్రీరాముడు!
ఆయన సేవలో తరించిన అదృష్టం ఎందరిదో..
అనుంగు సోదరుడైన లక్ష్మణుడు
ఆత్మీయ స్నేహితుడైన సుగ్రీవుడు
సదా రామనామంతో తాదాత్మ్యం చెందిన హనుమంతుడు!
సీతమ్మ జాడ తెలిపి పుణ్య లోకాలకు చేరుకున్న జటాయువు!
సీతారామ లక్ష్మణులను నదిని
దాటించిన గుహునిదెంత భాగ్యమో....
స్నేహ ధర్మంతో సేవ చేసిన సుగ్రీవుడు
శత్రు మూకలోని విభీషణుడు
వారధి సమయంలో సహకరించి
ప్రేమ పాత్రుడైన బుజ్జి ఉడత చేసిన సేవ!
ఒకటా రెండా.. కోకొల్లలుగా.
సేవ చేసుకుని తరించిన అదృష్టం వారిది!
వారి గాథలు చదువుకుని తరిస్తూ
ఇలలో భద్రాచల రామున్ని కొలిచి తరించిన భక్త రామదాసు
ఎంగిలి పండ్లతో ఆ దేవి దేవుని
ఆకలి తీర్చిన శబరి ముగ్ధ భక్తిని...
ఆ కోదండ రామయ్యను ఎదలో కొలుస్తూ
మనుషుల్లో దేవుడిని చూస్తూ
అది రామయ్య సేవేననీ మురుస్తున్నా!
ఏనాటి పుణ్య ఫలమో
ఏనాటి ఫూజల వరమో..
ఆ దేవ దేవునికి చేస్తున్నా అక్షర నీరాజనం!
9.
*కవన జ్యోతి*
============
అంశం : రామ సేవలో
శీర్షిక : అందాల రామయ్య
తేది : 27/10/2020
*అందాల రామయ్య*
ఈ పుణ్యభూమిలో
రాముడు రామ రాజ్యాం
దశరథ తనయుడు
దశకంటూన్ని వధించిన వాడు
జనకుడి అల్లుడు
జగమును ఏలే వాడు
అయోధ్య వాడు
అందాల వాడు
ఏకాపత్ని వాడు
అయోధ్య గారాల బిడ్డ
ఆడిన మాట తప్పనివాడు
పితృ వాక్య పరిపాలన వాడు
సకల గుణాభిరాముడు
జగమేలు స్వామికి
జనమంతా జే జే లు
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
9848054079..
10
కవన జ్యోతి
పేరు కేసి నరసయ్య
అంశం రాముని సేవలో
చరవాణి: 7981814784
తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు
అన్న కు అండగా లక్ష్మణుని త్యాగం
అడవులకెగిన సీతారామలక్ష్మణులు
రాక్షసి వ్యామోహం
రామచంద్రుడి సోదరుడు ఆగ్రహం
శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు
ఆగ్రహ జ్వాలతో రగిలిన రావణబ్రహ్మ
వేటకు వెళ్లిన శ్రీరాముడు
మాయలేడి వేశంలో సీతాపహరణ
శోక సంద్రంలో రామలక్ష్మణులు
సీతాదేవి కోసం అన్వేషణ
రాముడు నీ హృదయంలో నింపుకున్న హనుమంతుడు
రావణాసురుడిని వెంటాడిన జటాయువు
సీతా రక్షణలో ప్రాణత్యాగం
రాముడి చెంత చేరిన సుగ్రీవుడు
రామలక్ష్మణులను నది దాటించిన గుహిని పరాక్రమం
రామనామ స్మరణతో లంకా దహనం చేసిన హనుమ
రాముని సేవలో తరించిన భాగ్య లందరో
Comments
Post a Comment