ధ్యానం 26112020
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*********
అంశం ః ధ్యానం
******""*************
కవి వరుల జాబితా
1.అపరాజిత్ గారు
2.కోరాడ గారు
3.బండి భాను చందర్ గారు
4.డా.సిహెచ్ ఆంజనేయులు గారు
5.సుధారాణి కృష్ణం రాజు గారు
6.కె.ఇ.నిలమంగై గారు
7.డా.పోరెడ్డి రంగయ్య గారు
8.ఉదయశ్రీ ప్రభాకర్ గారు
9.కందూరి సుజాతా రాణి గారు
10.వల్లాల విజయ లక్ష్మి గారు
11.కోరాడ గారు
12.నారాయణ భాగ్యలక్ష్మి గారు
13.రాపోలు అరుణా స్వామి గారు
14.ఉల్లెంగ ముత్యం గారు
15.కెసి నరసయ్య గారు
16.సునంద వురిమళ్ళ గారు
17.ధనాశి ఉషారాణి గారు
18.డా.బల్లూరి ఉమాదేవి గారు
19.మర్రి జయశ్రీ గారు
20.భరద్వాజ గారు
*********************
1.
నీకే మివ్వను?
నాకు మిగిలింది ఈ కొద్ది వెలుతురే !
అనంత మహాసముద్రంలో
దోసిలి నీళ్లు కూడా తాగలేము కదా !
కనీసం పంట పొలాలకు కూడా
ఆ నీళ్లు పనికిరావు
మరి సాగరమథనం చేస్తే
అమృతమేలా పుట్టిందో? !
అంతు తెలీని ప్రశ్న
హాలాహలం పుట్టిందంటే నమ్మొచ్చు
ఆ అమృతం తాగి దేవతలు దేవుళ్ళు
మరణాన్ని జయించారంటావ్ !
ఈ సమస్త విశ్వంలో
ఏ గ్రహాంతరాళాల్లో వాళ్ళు ఉన్నారంటావ్ !
ధ్యానం చెయ్ నీకే బోధపడుతుంది అంటావ్
నిరంతరాయంగా ధ్యానం చేస్తే మిగిలేది శూన్యం
శూన్యం లో శూన్యంగా మిగిలిపోతావ్ !
ఈ దేవుళ్లంతా శూన్యంలో
కాస్మిక్ పవర్లా ఉన్నారంటావా?
నిన్ను నీవు తెలుసుకుంటే
సమస్తం అవగతమవుతుందంటావ్ !
ఈ భూమండలం లో ఉన్న సమస్త ప్రాణి కోటి
ఎలా ఉదయించిందో
నేను అలానే వచ్చా !
అలానే పోత !
మరి ఈ జంజాటకమంతా దేనికి?
ఎవరిని ఉద్దరించడానికి?
సత్యవంతంగా వుండు చాలు !!??
అపరాజిత్
2.
[26/11, 8:21 PM] Korada: కవితాగానం
నేటి అంశం :- * ధ్యానం *
కోరాడ నరసింహా రావు ...!
@ ముక్తులు...బద్ధులు @
@@@@@@@@@
చంచలమనసు....నిశ్చలత్వాన్ని పొందిందంటే....,ధ్యానంలో
మునిగి నట్టే....!
విషయమేదైతేనేం....,దానియందే...లగ్నమై...అన్య స్పృహను...
కోల్పోవట మేనోయ్....
ధ్యానమంటే...!!
ధ్యానం కుదిరితే...యోగివైనట్టే
ధ్యానమంటే మానాసికప్రశాంతి
శారీరక ఆరోగ్యం,!బుద్ధివికాశం
ధ్యానంతోనే సులభసాధ్యం..!!
పనికిమాలిన విషయాలపై....
దృష్టిపెట్టి...మనల్ని మనం మరచి...ఆ అరధ్యానంలో...
మ్యూనిగిపోతాం..... సామాన్యులం !
బాహ్యం లోని దిక్కులు...మూలలు అంతటా
అన్నిటా...కళ్లెం లేని గుర్రమై
స్వైర విహారం చేసే మనసును
నియంత్రించి...అంతర్ముఖులై
ఆత్మ శోధనాధ్యానంలో....
మునిగి...తరిస్తారు...యోగులు
ముక్తులై....!
వారిని యే విషయములూ...
సంకెళ్లయి బంధించలేవు...!
మనలను....ప్రతి పనికిమాలి
న విషయమూ....వాసనల
సంకెలయై బంధించి...సుఖ,
దుఃఖాలలో ముంచి...జన్మ
పరమార్ధాన్ని మరిపించి....
ఈ సంసార కోపంలో ముంచి
తేల్చుతుంటాయి.....!!
********************
.........కోరాడ.
3
[26/11, 8:22 PM] బండి భానుచందర్: అంశం : ధ్యానం
శీర్షిక : అంతుచిక్కని గమ్యం
ఓ ఏకాంతపు వాతావరణములో
ప్రశాంతతను మదిలో నింపుకుని
నిటారుగా పద్మాసానముపై కూర్చుని
కనుల రెప్పల తలుపులని మూసివేసి
చిక్కులు, చింతలు వదిలి,
దిక్కులు ,దిశలు మరిచి,
రెప్పల తలుపుల వెనుకనున్న తమస్సును చూస్తూ
ఏకాంతమునకు ఏకాగ్రతను జతచేసుకుని
నిశ్చాస, ఉచ్వాసలను గమనిస్తూ ,
ప్రపంచాన్ని మరిచిన మనసుతో
ఆ రెప్పల వెనుకనున్న తమస్సులో
ప్రశాంతకరమైన ప్రయాణమే ధ్యానం.
అది ఓక అంతుచిక్కని గమ్యం .
పయనించిన ప్రతిసారి ఆత్మానందం,
***************
బండి భానుచందర్
4
[26/11, 8:28 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ధ్యానం
ధ్యానం అంటే ఏకాగ్ర చిత్తం అన్నట్టు
ధ్యానం చేయడం అంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టడం
ధ్యానంలో బ్రూ మధ్యంలో లో
దృష్టి పెట్టినట్లు అయితే
జరగబోయే విషయాలన్నీ అవగతమవుతాయి అంటారు
ధ్యానం అంటే తదేక దృష్టితో కవితలు రాయడం చదవడం
ధ్యానంలో లో లో ఎవరికి వారికి అనేక విషయాలు అందుతాయి
ధ్యానం కరుణ జ్ఞానం అవుతుంది
ధ్యానంలో లో అంత చిక్కని రహస్యాలు బయట పడతాయి
ఈ విశ్వాన్ని మర్చిపోయి తనకు తానే మనసును నిశ్చల సమాధిలో యోగులు తమని మలుచుకుంటారు
యో గు లు ఎన్నో శక్తులు పొంది ఉన్నారు
పూర్వపు తపోధనులు మునులు
ఋషి ఆశ్రమాలలో తదేక ధ్యానంలో తపస్సు చేసేవారు ఆ విధంగానే ధ్యానం ఒక మహాశక్తి ధ్యానం జ్ఞాపకశక్తిని పెంచే ఆయుధం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
ధ్యానం లో లో లో లో ప్రశాంతత గమనం అవుతుంది
ఆత్మలు ఆనందం అవుతుంది
5
[26/11, 8:49 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏 కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*ధ్యానం*
*ధ్యానం చేయవలెనంటే ఏకాగ్రత అనేది చాలా అవసరం*
ఏకాగ్రతతో ధ్యానం చేసినట్లయితే మనసు అనేది
తేలిక పడుతుంది ఈ ధ్యానం వలన చాలా ఉపయోగాలున్నాయి
ధ్యానం వలన జ్ఞాపక శక్తిని పెంపొందించు కోవచ్చు తద్వారా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు
*అరిషడ్వర్గాలు ధర్మ,ఆర్థా,కామ,మోహ,మద, మాత్సర్యము,అనే వాటిని జయించ వచ్చు*
*కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం కాదు ధ్యానం చేసినపుడు మన పక్కన ఏది జరిగినా మన కళ్ళు కావు , చెవులు కావు మన ఆత్మను పరమాత్మలో లీనం చేసిన విధంగా ధ్యాన ముద్రలో ఉన్న ప్పుడు ఆ భగవంతుడే ప్రపంచం కావాలి*
అన్ని అవయవాలు మన నియంత్రణ లో ఉండాలి
దానినే సంపూర్ణ ధ్యాన ముద్ర అనవచ్చు కాని కొంత మంది ధ్యానం దీనికి విరుద్ధంగా ఉంటుంది
ధ్యానం చేస్తూ నే ఉన్నా ఒకవైపు టి.వి మరోవైపు మాట్లాడుతూ ముక్తసరిగా చేస్తారు తప్ప అది ధ్యానం కాదు
అందుకే పూర్వం ఋషులు, మునులు ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన సమాధి లో ఉండే వారు కేవలం శరీరం మాత్రమే ఉండేది ఆత్మ పరమాత్మ లో లీనమై వారు కేటాయించిన సమయం వరకు
ధ్యాన ముద్రలో ఉండేవారు
*అందుకే వారు మహానుభావులు , పుణ్యపురుషులు గా కీర్తింపబడుతున్నారు
*ఏకాగ్రతతో ధ్యానం చేస్తే
ఆభగవంతుడు కూడా ప్రత్యక్ష మవుతాడు ఇది నిజం ధ్యానానికి ఇంత మహత్తర శక్తి
ఉంది🙏🙏👍
6
[26/11, 9:14 PM] Komandoori Neela Poet: కవితా గానం
అంశం: *ధ్యానం*
తేది:26/11/2020
లఘు కవిత
శాంతి,సామరస్యాలకదే పెన్నిధై..,
ప్రశాంత జీవనానికి మూలాధారమై..,
పంచేంద్రియాల నియంత్రణకదే ఆదిస్థానమై..,
అలౌకికానంద లోకపు సోపానమై..,
నిద్రాణమై యున్న శరీర భాగాలకు ఉత్తేజమిచ్చే జీవసారమై..,
పరమాత్ముని లీలా నాటకాన్ని మనస్సుతో వీక్షించే ప్రేక్షక పాత్రనందించే వైలక్షిణ్య పాత్రయై..!
భక్తి భావ సుధాలహరిని ఆస్వాదించేలా చేసే సాధనా ఫలానికి సంపూర్తినందించేదే ధ్యానం...!!!!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*
7
[26/11, 9:28 PM] Lalita Sister: సమకాలీన కవితా దర్పణం
....... డాక్టర్ పోరెడ్డి రంగయ్య
కవిత్వం భిన్న కోణాల సమాహారం.సమాజం ఇందులో ప్రతిబింబిస్తుంది.ప్రాచీన సాహిత్యం వరాలు, శాపాలు, వర్ణనలు, ప్రధాన భూమిక నిర్వహిస్తే, ఆధునిక సాహిత్యం భావ, అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్త్రీ వాద,దళిత, మైనారిటీ, అస్తిత్వ వాద ఇలా పలుగతులలో సాగివచ్చింది.ముఖ్యంగా అత్యాధునిక సాహిత్యం మనిషిని పట్టి పీడిస్తున్న, సమస్యలను ఎత్తి చూపడం మనం గమనించవచ్చు.ఊహాలోకాల్లో విహరించిన కవిత్వం భూమార్గం పట్టిందనే చెప్పాలి.
ప్రాచీన సాహిత్యం లో పద్యం ప్రధాన కవితా ప్రక్రియ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆధునిక సాహిత్యం లో పద్యం తో పాటు పలు కవితా ప్రక్రియలు పుట్టుకొచ్చాయి.గురజాడ ముత్యాల సరాలు మొదలు ప్రపంచ పదులు , నానీలు, రెక్కలు, ఇలా తమ ఉనికిని చాటుకున్నాయి.గజల్స్ ,రుబాయిలు,హైకూల వంటి ఇతర సాహిత్య ప్రక్రియలు కూడా తెలుగు సాహిత్యం లోకి వచ్చాయి. అత్యాధునికంగా మణిపూసలు వంటి ప్రక్రియను కూడా కవులు అనుసరిస్తూ వస్తున్నారు.ఏ కవితా ప్రక్రియైనా రూప నిర్మాణం లో ఉన్న పటిష్టతే దాని బలంగా చెప్పుకోవచ్చు.ఇందుకు నానీలు వంటి ప్రక్రియ సోదాహరణంగా నిలుస్తుంది.
"వాక్యం రసాత్మకం కావ్యం" అని అలంకారికులు చెప్పినప్పట్టుగా , ప్రక్రియ తో పాటు అభివ్యక్తి మరింత బలాన్ని చేకూరుస్తుంది.కవిత్వంలో సమాజం ప్రతిబింబించడం అత్యాధునిక కవిత్వ ప్రాధమిక లక్షణం అయ్యింది.ఒక రకంగా సమాజాన్ని వ్యాఖ్యానిస్తుంది.దిశను దశను నిర్ధారిస్తుంది.కాలంతో పాటు కలిసి అడుగులు వేస్తోంది.అవసరమైన చోట ఇదీ నీ మార్గం అంటూ సూచిస్తుంది.సామాజిక ఉద్యమాలు ఇంతగా విజయవంతం అవుతున్నాయంటే దానికి కవిత్వం పోషిస్తున్న పాత్ర కూడా ముఖ్యమైందే.
ఇంకా ఈ కవితా సంపుటి విషయానికి వస్తే ఇందులో చోటు చేసుకున్న కవితలన్నీ సమాజాన్ని పట్టిచూపుతున్న కరదీపికలే ఒక రకంగా రన్నింగ్ కామెంటరీ అని చెప్పుకోవచ్చు.మరికొన్ని తాత్విక దృష్టికోణం లో ఆలోచనల్లో కి నెట్టి వేస్తాయి.మనలోకి తొంగి చూస్తాయి.వస్తువైవిధ్యం ఈ సంపుటిలోని ప్రత్యేక లక్షణం.ఒక అంశాన్ని అలతి పదాలతో ఎంత ప్రతిభావంతంగా ప్రభావవంతంగా చెప్పవచ్చో ఇక్కడ మనం గమనిస్తాం. కవి పొందిన అనుభూతులు అనుభవాలు లోకం పోకడలు ఈ సంపుటి నిండా పరుచుకున్నాయి.
శ్రీ వీరా గుడిపల్లి గారు స్వతహాగా గణిత ఉపాధ్యాయులు.ఈ రంగం లో అగణితంగా ఎందరో విద్యార్థులను గణిత అవధానులు గా తీర్చి దిద్దిన ఘనత ఆయనది.అంతే కాదు, పలు పుస్తకాలు కూడా ప్రచురించారు.మ్యాథ్స్ టీచర్ గా ఆయన కీర్తి శిఖరాయమానం. రెండున్నర దశాబ్దాల పైచిలుకు గా విశేష కృషిని నిరంతరంగా చేస్తూ వస్తున్నారు.శ్రీ వీరా గుడిపల్లి గారు గణిత శాస్త్ర నిష్ణాతులే కాకుండా సమున్నతంగా రాణిస్తున్న కవి.సాహిత్యాభిలాషిగా విస్తార పఠనంతో తనలోని కవిని తట్టి లేపారు.పద్యకవిగా తొలి నాళ్ళ లోనే బలమైన అడుగులు వేశారు.పలు శతకాలు ఆవిష్కరించారు.పేరుకు భక్తి శతకాలైనా లోలోన సమాజ ఎత్తు పల్లాలు గోచరిస్తుంటాయి.ఏ మైలు రాయి వద్దో ఆగిన నడక కాదు ఆయనది.కాలాన్ని గమనిస్తూ తన మార్గాన్ని నిర్దేశించుకుంటున్నారు.సమకాలీనత ఆయన కవితా దృక్పథం.
భువనగిరి కేంద్రంగా జరిగిన సాహిత్యోద్యమాలతో మమేకం అయ్యారు శ్రీ వీరా సార్. అంతే కాదు పలు కార్యక్రమాల నిర్వహణలో ముఖ్య భూమికను నిర్వహించారు.సామాజిక చైతన్యం ఆయన ప్రతీ చర్యలో అగుపిస్తుంది.ప్రతీ మనిషిలో ఓ కవి దాగుంటాడని బలంగా నమ్ముతారు.
ఆ నమ్మకమే తన స్ఫూర్తితో వందలాది మంది కవులుగా , కవయిత్రులుగా, తమను తాము మలుచుకున్నారు.మలచుకుంటున్నారు.
సామాజిక మాధ్యమాలద్వారా తెలుగు నాట ఎందరికో ఆయన మార్గదర్శి.ముఖ్యంగా ఉదీయమానంగా రాస్తున్న కవులకు, కవయిత్రులకు,సృజనతోపాటు ఆయనలో గొప్ప వ్యక్తిని చూస్తాం.ఎలాంటి భేషజాలు లేకుండా తరతమ భేదాలు లేకుండా ఇట్టే అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం.
గణిత గ్రంధాల రచయితగా ,పద్య గేయ,వచన కవిగా సాహిత్యలోకానికి సుపరిచితులైన శ్రీ వీరా సార్ ఇపుడు ఓ కొత్త కవితా ప్రక్రియతో మన ముందుకు వస్తున్నారు.కొత్త ప్రక్రియ అనేకంటే కాలంతో పాటు నడుస్తూ సమాంతర అంశాలను తనదైన భావుకతను అద్ది "వీరాస్ వర్డ్స్" గా ఆవిష్కరించారనడం బాగుంటుందేమో!! ఇవి ఒక పుస్తకం గా రాసుకున్నవి కావు.అయినా రాశులైనవి. కాలాన్ని వ్యాఖ్యానించిన ఈ కవితా పంక్తులు కాగితాలకే పరిమితం కాకుండా తిరిగి కాలానికే అప్పగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఆ ఆలోచనకు కార్య రూపమే ఈ సంపుటి.
కవిగా శ్రీ వీరా సార్ కి ఓ దృక్పథం ఉంది.ఓ ఆశయం ఉంది.ఏ వాదం వద్దో గిరి గీసుకుని తనలోకి తాను కుంచించుకు పోలేదు.విశాల విశ్వం ఆయన సృజనకు వేదికైంది.
అందుకేనేమో ఇన్ని మెనీ భావాలు ఈ మినీ కవిత్వంలో. అలతి పదాలు గానే అగుపిస్తాయి.కానీ ఏదో ఒకచోట జిగేలుమంటాయి.హృదయాన్ని తాకుతుంటాయి. తాను ఇదో కొత్త ప్రక్రియ అని ఎక్కడా చెప్పుకోక పోయి నప్పటికీ ముమ్మాటికీ ఇది ఒక కవితా ప్రక్రియ గానే పరిగణించవచ్చు. కాలం ఏ తీర్పును ఇస్తుందో వేచి చూద్దాం.
"ఒక్కటే పని
నన్ను నేను కవిత్వం చేసుకోవడం
బ్రతుకు కావాలనుకున్నాక తప్పదు"
ఈ కవితా పంక్తుల్లో కవి లక్ష్యం ప్రస్ఫుటమౌతుంది. కవిత్వం విశ్వ శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది. కవిగా తన జీవితాశయాన్ని ప్రకటిస్తున్నారు.తానే కవిత్వం కావడం ,బతుకంతా కవిత్వం లోనే సాగాలనుకోవడం . కవిత్వం పట్ల తనకున్న గౌరవం ప్రకటించడానికి ఇంతకంటే బలమైన పాదాలు ఏమి కావాలి? తన మార్గం , తన గమ్యం కవిత్వంగా మలచుకున్న నిఖార్సయిన కవి శ్రీ వీరా గుడిపల్లి గారు.
సమాజం ఎప్పుడూ ఒక చోట ఆగిపోదు.స్తబ్దత ఎంత మాత్రం దానికి రుచించదు.మార్పును సదా ఆహ్వానిస్తుంటుంది.అయితే మార్పు, పరిణామాలు ఎలాంటి ఫలాలను అందిస్తున్నాయనేది ముఖ్యం. ప్రపంచీకరణ ప్రభావం స్వచ్ఛమైన పల్లెల పై కూడా ఎలాంటి ప్రభావం చూపిందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.మార్పు సమాజ శ్రేయస్సు కోరేదై ఉండాలంటారు కవి ఇక్కడ.
బావి నీళ్లు, బోరు నీళ్ళు, వాగు నీళ్ళు నాడు
కిన్లీ ,బిస్లరీ, ఆక్వా నేడు
మార్పు మంచిదేనా??
ప్రశ్నను పాఠకుని పైకే సంధిస్తున్నారు కవి. సహజ వనరు బడా కంపెనీల వ్యాపార కౌగిలిలో చిక్కుకొని లాభాలు తీసుకొచ్చే వనరుగా మారడం నిజంగా బాధాకరమే.ఇది ఒక పార్శ్వం మాత్రమే. నీరు మాత్రమే కాదు అందమైన లేబుళ్ల ముసుగులో జరుగుతున్న మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కవి ఆవేదన సముచితమైంది.ఆలోచింప దగింది.
భౌతిక వనరులు మాత్రమే కాదు,మానవ సంబంధాలు కూడా కలుషితమవుతూ మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతున్న సందర్భాలను కవితాత్మకంగా ఆవిష్కరించారు.
"ఖండాంతరాలు దాటెల్తూ వాళ్ళు
గడప దాటలేని స్థితిలో వీళ్ళు
ఆనంద భాష్పాలు రాలుస్తూనే"
పేగు బంధాలు దూర ప్రాంతాల్లో ఉన్నపుడు జీవిత చరమాంకంలో వృద్ధ తల్లి దండ్రులు పడుతున్న ఆవేదన అక్షరాలకు అందనిది.బిడ్డలు ఎదిగినందుకు సంతోష పడాలో అవసాన దశలో దగ్గర లేనందుకు దుఃఖపడాలో తెలియని స్థితిని కవి తనదైన శైలిలో ప్రతి గుండెను తాకేట్టు చెప్పారు.
అంతే కాదు "జీ హుజూరని "వాక్యాలను జోకొడుతానంటూ తన కవితాశయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఒక్కటేమిటి లోకం భిన్న పార్శ్వాలు ఈ సంపుటిలో ఆవిష్కరించబడ్డాయి.పంచాంగం కూడా ఏ గడప పాట ఆ గడప దగ్గరే /నేనెప్పుడూ ఓడిపోను/ ఎందుకంటే నా లక్ష్యం నీ గెలుపే కదా!! / అరచినంత మాత్రాన అందుతుందా
అందమైన చందమామ / నీకు నీవే ప్రత్యర్థి కావాలి/ ఇలాంటి కవితా వాక్యాలు పాఠకుడిని ఆలోచింప చేస్తాయి.
ఎండల్ని తగ్గించేస్తా,వానల్ని కురిపించేస్తా ,చలిలేకుండా చేస్తా, బాబ్బాబు ఓటెయ్యండి. ఇలాంటి వ్యంగ్యాత్మక కవితలు కూడా ఈ సంపుటికి సొబగులు అద్దాయి. అయితే కొందరి వ్యక్తులకు సంబంధించి ఫుట్ నోట్స్ ఇస్తే బాగుండేది.పాఠకుడు మరింతగా అవగాహనకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
సుదీర్ఘ కాలంగా సాగివచ్చిన " వీరాస్ వర్డ్స్ " ఇలా పుస్తకంగా తీసుకురావడం అభినందనీయం. "నా వాక్యం బంగారం " అని కవి చెప్పుకున్నట్టు గానే ఈ సంపుటిలోని ప్రతీ కవిత విలువైనదే.చదువుదాం.కవి అంతరంగాన్ని విశ్లేషణ చేసుకుందాం.రండి వీరాస్ వర్డ్స్ లోకి ఇదే స్వాగతం.
..... డాక్టర్ పోరెడ్డి రంగయ్య
14/11/2020
8
[26/11, 9:52 PM] ఉదయ శ్రీ ప్రభాకర్ Poetess: కవితా గానం
పేరు.ఉదయశ్రీ ప్రభాకర్
అంశం.. *ధ్యానం*
ధ్యానం జీవితాలను సరిచేసే ఓ బ్రతుకు మంత్రం
అదుపుతప్పుతున్న ఆలోచనలకు ఆనకట్ట వేస్తూ
తప్పటడుగులు సరి చేసే జ్ఞాన దీపం..
మనసుకు కంచె వేస్తూ
అంతరాలలో ఆధ్యాత్మిక భావాలకు అంకురాలై
జీవన సాఫల్యపు ఫలాలు అందిస్తుంది..
ధ్యానం తనువుకు,మనసుకు గురువై..బ్రతుకు దారులు చూపుతూ..మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది..జీవితపు అర్ధాల సుగంధాలు వెదజల్లుతూ..
ఉదయశ్రీ ప్రభాకర్
9.
🌷ధ్యానం🌷
............. .......... .......
దీప్తి ముక్తావళి ధ్యానం.
దివ్య ప్రకాశం ధ్యానం.
ఉజ్వల మనోవికాసం ధ్యానం .
తనువు ఉత్తేజపరుచు ధ్యానం .
తేజోమయ శక్తి మూలకం ధ్యానం.
శిలను చెక్కిన శిల్పమగును
ధ్యాన భంగిమలు జ్ఞాన శిల్పములు.
ఆరోగ్యానికి అంతరంగమై
క్రియాశీలతకు బాహ్య ముఖ్యమై
కామ క్రోధముకు కళ్లెంవేసి కోరికలను సమతుల్యం చేసి
పరిజ్ఞానం నిరతంచేయు ధ్యానం.
శాంతి సహనం సాధన నిలయం ధ్యానం
తెలియకనే మూగప్రాణుల మౌన ధ్యానం
మానవ పరము జ్ఞాననేత్రము ధ్యానం. పురాణాలు అందించిన
నగరాలు ఆశించిన ధ్యానం.
పరిస్థితులకు తలవంచిన -
పరిశీలనలు కొనసాగించిన -
మది మహనీయం ధ్యానం.
ప్రశాంత చైతన్య నిచ్చెన ధ్యానం.
కందూరి సుజాతారాణి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822🌷
10.
[27/11, 8:48 PM] విజయ లక్ష్మి యాదాద్రి: *ధ్యానం*
*********
ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి
హింస నుండీ అహింసామార్గానికి
అజ్ఞానం నుoడి ఆత్మజ్ఞానం వైపుకు
మానవత్వం నుండీ ధైవత్వం దాకా
చేర్చేదే ధ్యానం*
శారీరక ఆరోగ్య పరిరక్షణ
మానసిక ప్రశాంతత రక్షణ
బుద్ధికుశలతల మెరుగుదల
జ్ఞాపకశక్తి ఏకాగ్రత కొన్ని ధ్యానఫలాలు
ఆత్మవిశ్వాసం ధైర్యాల కలిగిoచి
సందర్భోచిత ప్రవర్తనతో మెలిగేలా
భావోద్వేగాలపై అదుపును పెoచి
మూఢనమ్మకాలు భయాల తగ్గించి
చావుపుట్టుకల జ్ఞానాన్నిచ్చి
మరణభయాన్నీ జయించే
ప్రయత్నం చేయగల ధైర్యం
ధ్యాన సాధనతోనే సాధ్యం
బయటి చికాకులను తగ్గించి
లోపటి ప్రశాంతతను కాపాడే
అద్భుత దివ్యసాధనం
వాడిన కొలదీ పెరిగే జీవఇంధనం
తనలో తాను ఆస్వాదించి
ఆనందించే ఒక పరిమళం
అందరూ చేయాల్సిన కార్యం
ఎoతో ప్రయోజనకరం ధ్యానం
వల్లాల విజయలక్ష్మి
ఆలేరు
11
[27/11, 8:58 PM] Korada: కవితాగానం
నేటి అంశం :- * ధ్యానం *
కోరాడ నరసింహా రావు ...!
@ ముక్తులు...బద్ధులు @
@@@@@@@@@
చంచలమనసు....నిశ్చలత్వాన్ని పొందిందంటే....,ధ్యానంలో
మునిగి నట్టే....!
విషయమేదైతేనేం....,దానియందే...లగ్నమై...అన్య స్పృహను...
కోల్పోవట మేనోయ్....
ధ్యానమంటే...!!
ధ్యానం కుదిరితే...యోగివైనట్టే
ధ్యానమంటే మానాసికప్రశాంతి
శారీరక ఆరోగ్యం,!బుద్ధివికాశం
ధ్యానంతోనే సులభసాధ్యం..!!
పనికిమాలిన విషయాలపై....
దృష్టిపెట్టి...మనల్ని మనం మరచి...ఆ అరధ్యానంలో...
మ్యూనిగిపోతాం..... సామాన్యులం !
బాహ్యం లోని దిక్కులు...మూలలు అంతటా
అన్నిటా...కళ్లెం లేని గుర్రమై
స్వైర విహారం చేసే మనసును
నియంత్రించి...అంతర్ముఖులై
ఆత్మ శోధనాధ్యానంలో....
మునిగి...తరిస్తారు...యోగులు
ముక్తులై....!
వారిని యే విషయములూ...
సంకెళ్లయి బంధించలేవు...!
మనలను....ప్రతి పనికిమాలి
న విషయమూ....వాసనల
సంకెలయై బంధించి...సుఖ,
దుఃఖాలలో ముంచి...జన్మ
పరమార్ధాన్ని మరిపించి....
ఈ సంసార కోపంలో ముంచి
తేల్చుతుంటాయి.....!!
********************
.........కోరాడ.
12
[27/11, 8:59 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: ధ్యానం దైవతం
ధ్యానం దివ్య గుణం
ఆత్మ దర్శనం ధ్యానం
ఆత్మ దేహపు అంత్లర్లీనం ధ్యానం
నిర్మల చిత్తం ధ్యానం
నిర్వికార నిర్గుణత్వం ధ్యానం
పంచేంధ్రీయాల నియంత్రణ
నిజమైన ధ్యానం
అందకారం తొలిగించి వెలుగు నింపే
కాంతి పుంజం ధ్యానం
అజ్ఞాన తిమిరాన్ని హారించి
విజ్ఞాన సూర్యోదయం ధ్యానం
మానవత్వం ధైవత్వం మేలవింపు ధ్యానం
నారాయణ భాగ్యలక్ష్మి
13
[27/11, 9:02 PM] Rapolu Aruna Siripuram Poet: కవితాగానం
అంశం:ధ్యానం
శీర్షిక:మనీషిగా మారిపో
మోనానికి పరాకాష్ట యే ధ్యానం
అనంతమైన అలౌకికానందాన్నిచ్చే
అమూల్యమైన భావనం
త్రికరణ శుద్ధిగా చేసే ధ్యానం
దివ్యగ్రంథాలను చదివినట్లు
పంచేంద్రియాలను
అదుపులో నుంచి
కోర్కెలకు కళ్లెంవేసి
స్థితప్రజ్ఞతకు మూలమైనిలిచే
అపురూప సాధనం
భవబంధాలకు దూరంగా
ఓంకార నాదం వినిపించేదాకా
ఏక చిత్తంతో ధ్యానం చేస్తే
భ్రుకుటి మధ్యవెలిగే దివ్య జ్ఞానజ్యోతిని దర్శించవచ్చు
ఎనిమిదేళ్ల ప్రాయంలోనే జగద్గురువు ఆదిశంకరులు
కనకధారా స్తోత్రం ఆశువుగా చెప్పారు
వేశ్యాలోలుడైన వేమన్న
యోగివేమనగా మారి
అన్నికాలాలకు సరిదూగు సాహిత్యవిజ్ఞానాన్ని సముపార్జిం చాడు
విష్ణురూపుడైన వ్యాసమహర్షి
వేదశాస్త్రాలను మనకందించాడు
శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి
ధ్యానయోగముతోనే మనకు
కాలజ్ఞానాన్ని అందించాడు
వాల్మీకి మహర్షి
రామాయణ ఇతిహాసాన్ని
రమ్యంగా వ్రాసినాడు
మునులు,ఋషులు, దివ్యర్షులు, మహర్షులు ఎందరో మరెందరో మహానుభావులు ధ్యానం తోనే
అసాధ్యాన్ని సుసాధ్యంగా మలిచారు
ఆత్మానందానికి సులువైన మార్గం ధ్యానం
లక్ష్యాన్ని ఛేదించగలిగే ఆత్మస్థైర్యం ప్రసాదించేది ధ్యానం
మనిషిని మనీషిగా
మార్చగలిగేదే ఏకైకధ్యానం
✍రాపోలు అరుణాస్వామి, సిరిపురం
[27/11, 9:09 PM] Mutyam Sir Basara KS 41: మనసు తో మాట్లాడటం
మనలో మనమే మాట్లాడుకోవడం
ఆలోచనల తరంగాలను
నిశ్శబ్దం లోకి
అలజడుల భావాలను ఆకాశం లోకి
నిరంతరం ఆలోచించే మనిషి ని
నిశ్శబ్దం లోకి తీసుకెళ్ళి
తానెవరో తెలుసుకునే ప్రయత్నం
అసత్తు నుండి సత్యం లోకి
చీకటి నుండి వెలుగు లోకి
మృత్యువు నుండి అమృతత్వం వైపు
తీసుకెళ్ళేదే ధ్యానం ...
ఏకాగ్రతతో సాధన చేస్తే
లోకేశ్వరున్ని చేర్పించేది ధ్యానం
నేను ఎవరిని? అనే విచిత్ర ప్రశ్న కి
నిశ్శబ్ద సమాధానం ధ్యానం
ఈ సృష్ఠి లో అందరూ చేసేది ధ్యానమే
కొందరిది స్వ ధ్యానం
మరికొందరిది పరధ్యానం ...
---- శ్రీ భారతి
( ఉల్లెంగ ముత్యం )
లెక్చరర్ , ఐఐఐటి బాసర - నిర్మల్ జిల్లా
15.
కవితా గానం
పేరు: కెసి నరసయ్య
జిల్లా: ఖమ్మం27-11-2020
చరవాణి: 7981814784
అంశం:ధ్యానం
శీర్షిక: గురి తప్పని అస్త్రం
ధ్యానం
మౌనంలో దాగిన జ్ఞానం
ధ్యానంలో పరద్యానం
అజ్ఞానానికి కళ్లెం వేసే యోగం
చంచలమైన మనసుకు
అచంచలమైన విశ్వాసం
అదుపు తప్పుతున్న
ఆలోచనలకు అడ్డుకట్ట
శబ్ద తరంగాలలో నిశ్శబ్ద పయనం
ధ్యానం మహాయోగం
మంచి నడవడికకు మార్గం
కార్యసాధనలో ఆత్మస్థైర్యం
సాధనలో అదొక ఆయుధం
లక్ష్యసాధనలో గురితప్పని అస్త్రం
16
*కవితా గానం*
తేదీ:27-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: ధ్యానం
""""""""""""""""""""""""""""""""
మనసును శుద్ధిచేసుకునే మహిమాన్వితమైన సాధనం!
విరుద్ధ భావోద్వేగాల అదుపు
ప్రతీకార యోచనల హరణం
పవిత్ర హృదయ సాధనం!
పరిశుద్ధమైన మనఃస్పృహ
అమేయమైన ఆనందం
అత్యుత్తమ చైతన్య స్థితి
అత్యధికమైన ఏకాగ్రత ఆధ్యాత్మిక ప్రశాంతత
లక్ష్య సిద్ధికి సాధనా
సహన రూపమే ధ్యానం!
అంతులేని కోరికలకు కళ్ళెం వేసేందుకు
అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి
అంతులేని వెలుగులోకి మనసును పట్టుకుని నడిపిస్తూ
తమస్సు నుండి జ్యోతి లోనికి తీసుకొని పోయే ధ్యానం!
స్థితప్రజ్ఞతకు తోడ్పడే ప్రేరకం!
ఈ ధ్యానమే ఆత్మ పరమాత్మలను సమ్మిళితం చేస్తుంది!
ఈ ధ్యానమే దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది
ఈ ధ్యానమే దైవత్వమై ప్రకాశిస్తుంది
ఈ ధ్యానమే సాధు సజ్జన సాంగత్యం కలిగించి
అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది!
17
పేరు. ధనాశి ఉషారాణి
జిల్లా. చిత్తూరు జిల్లా
శీర్షిక.ధ్యానము
.....
మనసు మూగపోయి
అలజడి తరంగాలు చెలరేగినపుడు
గుండెల్లో దాగిన బాధను
ధ్యానముతో అలా అలా చిత్తు చేయవచ్చును
ఏగతాళి చేసిన మనుషులపై
గెలుపు పిలుపు అందుకోని
విజయాల సాధన చేయుటకు
నిజమైన అస్త్రం ధ్యానము
చదువుల తల్లి ఒడిలోన
అలా హాయిగా లీనమవ్వుటకు
నిజమైన వారధిగా
గుండెల్లో గూడుకట్టుకునే
నిజమైన దేవుని రూపు ధ్యానము
ఆధ్యాత్మిక జ్ఞానంను
అలా గుండెల్లో నిలిపి
పరమాత్ముని చేరుటకు నిజమైన దేవుని ప్రతిరూపము ధ్యానము
కోటి వెలుగుల ప్రేరణను ఇచ్చి
గుండెల్లో నిలిచే నిజమైన గెలుపు
కోర్కెలు గుర్రాలు ఐనప్పుడు
18
27/11/20
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశము: ధ్యానం
అలౌకికానందాన్ని అందిస్తూ
దైవ సన్నిధికి ఆత్మను చేర్చే
దివ్యౌషధం నిరంతర ధ్యానం
ఆత్మ స్థైర్యాన్ని కలిగించే
శక్తివంతమైన ఆయుధం
మునులు ఋషులు తపోశక్తితో
ధ్యాన బలంతో తో శ్రీహరిని చేరారని
తెలియచేస్తున్నాయి పురాణాలు ఎన్నెన్నో
ఇంద్రియనిగ్రహాన్ని కలిగించి
అరిషడ్వ ర్గాలని జయించే
మానసిక శక్తినిచ్చే సంజీవిని ధ్యానం
అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తూ
స్థితప్రజ్ఞత ను కూర్చే సాధనం
నిలకడలేక అటు ఇటు తిరిగే మనసును
దారి మళ్ళించే ఆలోచనలను
అదుపులో నుంచే అతీంద్రియ
శక్తి సామర్థ్యాల నిచ్చే అమృతపానం
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే
మానసిక స్థితిని చేకూరుస్తూ
ముక్తి మార్గానికి దారి చూపే సోపానం
మనసును అధీనoలో ఉంచేది ధ్యానము
మానసిక ఉల్లాసము కలిగించు నిజమైన జ్ఞాన తేజస్సు ధ్యానము
ధనాశి ఉషారాణి
19
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..ధ్యానం
శీర్షిక...ముక్తి మార్గం
లక్ష్యం చేరేందుకు మార్గం
నిశ్శబ్దానికి ప్రతీకగా
మనసును అభినందిస్తూ
జ్ఞాన సముపార్జనకు చేసే సాధన
అదుపుతప్పిన ఆలోచనలకు వేసే కళ్ళెం
ఇంద్రియ నిగ్రహం సాధిస్తూ
ఆధ్యాత్మిక ముక్తి మార్గాల వైపు పయనం
అంతర్గత శక్తులను బలపరిచి
ఆందోళనలను చిత్తు చేసి ప్రశాంతతనిచ్చే ధ్యానం
జీవిత గమ్యాన్ని ఉన్నత స్థితికి చేర్చే ఆలోచన
ఏకాగ్రత పెంచే గొప్ప కార్యం
నైపుణ్యాలను మెరుగుపరిచే నిర్మలమైన చిత్తం
మానవతా మూర్తులుగా తీర్చిదిద్దే దివ్యగుణం
ఒకే పని మీద మనసు లగ్నం
నేటి యాంత్రిక జీవనంలో
ఒత్తిడిని దూరంగా ఉంచే చికిత్స
ఆరోగ్యానికి రక్ష
ధ్యానమే సర్వ మానవాళికి అమృత పానీయం.
20
🎊☘️కవితాగానం🎊☘️
అంశంఃధ్యానం
శీర్షిక ః
పేరుఃభరద్వాజ
ఊరు-కొత్తపట్నం
రచనః31
ధ్యానం
అది ఒక యోగం
దారి తప్పుతున్న జీవితాలను సరిచేసే గానం-
తప్పుడు ఆలోచనలకు ఆటకట్టు-
నిలకడ లేని మనసులనుఒడిసి పట్టు-
ఆధ్యాత్మిక వైపు మనసును చూపెట్టు-
పంచే్ద్రియాలను-
మితిమీరిన కోరికలను-
లౌకిక ఆనందాలను అదుపులో పెట్టి-
అలౌకిక ఆనందాల వైపు
ముక్తిమార్గాలవైపు నడిపించేటిమార్గం
ఎందరో ధ్యానాన ముణిగి పొందారుముక్తిమార్గం-
అరిషడ్వర్గాలను జయించి పొందారు దైవ సాన్నిధ్యం-
నిలకడలేనిబ్రతుకును
నిర్మలంగా ఉంచేటి సాధనం- ధ్యానం--!
ఇది నాస్వీయరచన
భరద్వాజ రావినూతల🖍️
Comments
Post a Comment