ఉల్లి 11/2020
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ (వెన్నెల శిల్పం)
వీరా గుడిపల్లి ( the mathematics teacher and poet)
*****""""
న్యాయ నిర్ణేత
భరద్వాజ గారు
*******"
1.సంధ్యా శర్మ గారు
2.సుధారాణి కృష్ణం రాజు గారు
3.పరాంకుశం రఘు నారాయణ గారు
4.ఇంద్రావత్ రాహుల్ గారు
5.ల్యాదాల గాయత్రి గారు
6.కొలచన విజయ భారతి గారు
7.వురిమళ్ళ సునంద గారు
8.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
9.కెసి నరసయ్య గారు
10.మన్నె పిన్నక లలిత గారు
11.మిట్టా లక్ష్మి గారు
12.కందూరి సుజాతా రాణి గారు
*********
1
[05/11, 8:03 PM] Sandya Sharma Poetess: కవనజ్యోతి
వై.కె.సంధ్యశర్మ
అంశం : చిత్రానికి కవిత
శీర్షిక: ఉల్లి పొర
లేలేత కాడలకడుగున
పొరలుపొరలుగా
పొత్తిళ్ళ పాప కను రెప్పలుగా
పుడమి నవ్వితే విచ్చుకునే
పొదరిల్లులా....
పసిడి పంటలో మేలిమి
ముత్యపు కెంపులే
అవి.....
ముగ్ద కాంతలా మురిపిస్తూ
ముదిత చేతిలో చెరచబడే
అరుదైన...
మువ్వన్నెల మిసిమి శిగలు....
సౌదామిని......
వెలిసిన వానలో.....
వాగు నిండిన తోటలో...
మనసుకు నచ్చే సువాసనలో
గోరు వెచ్చని తాపడపు ఘుమఘుమలు
ఉల్లి ...తో సరిసమానమై రాదే
ఏదీ సాటి....
పండించే....
రైతు కంట్లో కన్నీరైనా....
ధరల పట్టీలో నీవే రాజైనా...
రాజ్యాలు కూల్చే నేతవైనా....
రాతిరేళ నీవు లేని ఫలహారమేదిలే....
రంగస్థలంలో ఆటబొమ్మలా
ఆరోగ్యానికి అమ్మవు నీవే
ఆహర్యంలో అపురూపం నీవే....
దేశమంతా సబ్సీడీ కోరే.... మా సంత లోని
సొగసరి నీవే!
నీతో లొల్లి... జేస్తే.... మల్లీ మల్లీ గద్దెనెక్కగలరా...
మా కంచెంలోని ముద్ద తినగలమా...!
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
2
[05/11, 8:05 PM] +91 74165 92715: 🙏🙏*కవన జ్యోతి*🙏🙏
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*చిత్ర కవిత*
*అంశం* *ఉల్లి*
*05-11-2020*గురువారం*
*ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్న దానిని నమ్మి పాటిస్తున్న జనం ప్రతి దానిలో ఉల్లి ని జత చేసి కానీ వంటలు చేయలేక ఉల్లి ని అందలం ఎక్కిస్తే*
*ఈరోజు అదే ఉల్లి అందరిని పాతాళ లోకానికి తోసేసి తను
సింహాసనం పైన కూర్చుని మనని చూసి నవ్వి నేను దిగి రాను నా విలువ తగ్గించుకోను
మీ చావు మీరు చావండి అని
ఎగతాళిగా చూస్తున్న ఉల్లి*
*అమాంతంగా ఉల్లి ధరలకు రెక్కలు వచ్చి సామాన్యులకు
అందనంత ఎత్తుకు ఎదిగిన ఉల్లి తల్లి ని చూసి కన్నీరు
పెట్టే రోజు వచ్చింది*
*ఉల్లి లేని వంట ఊహించ తరమా*
*మానవ మాతృలం ఉల్లిని మరువ వశమా*
*ఉల్లి నీకేల పంతం, మాకోసం దిగి రావా కొంచెం*
*నీవు లేక ముద్ద దిగని ప్రపంచం*
*ఉల్లి పాయలు కోసే టప్పుడు
కంటతడి పెట్టే భార్య లు
ఇప్పుడు కొనలేక కంట తడి పెడుతున్నారు భర్తలు
అన్యోన్య దాంపత్యం లో కూడా చిచ్చు పెట్టిన ఘనత ఉల్లి ది
కిలో ల కొద్ది ఉల్లి పాయల బరువుతో వస్తాడన్న భర్తకు
సహాయం చేయాలని వెళ్ళిన భార్యకు ఖాళీ సంచిలో ఏదో ఒక మూల అరకిలో ఉల్లిపాయలు తెచ్చిన భర్త
భార్య వంక కోపంగా చూసి ఈ
ఉల్లి పాయలు నెల రోజులు సర్దుకొమ్మన్నప్పుడు
*ఇదేం విడ్డూరం* ఎప్పుడూ లెక్కలు అడగని భర్తేనా అరకిలో ఉల్లిపాయలు నెల రోజులు సర్దుకొమ్మని చెపుతున్నాడని విస్తు పోయిన భార్య కోపంగా ప్రశ్నిస్తే
*నెలకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరునెలలు కూడా ఈ అర కిలో తోనే సర్దుకు పోవాలి అని చెప్పిన ఆశ్చర్య పడకు అని భర్త అన్నప్పుడు
*ఉల్లి పాయ ఏమిటి నీ మాయ అంటూ వంటింట్లోకి వెళ్ళిన భార్య*
*ఇది మన ఉల్లి చేస్తున్న మాయ*
*మళ్ళీ అందరికి గతవైభవం ఎప్పుడు కలుగ చేస్తుందో కదా
ఉల్లి*🙏🙏👍😃
3
[05/11, 8:32 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవన జ్యోతి కవి సమయం*
అంశం : చిత్ర కవిత
పేరు :పరాంకుశం రఘు నారాయణ
జిల్లా :మహబూబాబాద్
+++++++++++++++++++
*కవితా శీర్షిక :ఉల్లి -మేలు*
+++++++++++++++++++
ఉల్లి చేసే సేవ తల్లి చేయదు ఇది ఓ.. పాత సామెత అనుకోకండి!
నేటికీ ఇది నిత్య నూతన సామెతని మరువకండి!!
అన్ని శాఖాలలో నేనున్నానని తనస్థానం పదిలం పరచుకుంటుంది!
ఉల్లి లేని శాఖం రుచి చూస్తే దాని వెలతి కనిపించకుండా పోదు కదా!
పేదవాన్ని గుడిసెల్లో నాలుగు ఉల్లిపాయలు...,
కారం మెతుకుల్లో కలిసిపోయి భోజనానికి తోడు నీడైతది !
కలవారి విందులో వెండి పళ్లెంలో ఊరేగుతున్నది!
ఉల్లి మానవాళి మ ప్రియ నేస్తం !
ఉల్లి మనిషి విడదీయలేని అనుబంధ హస్తం !!
4
[05/11, 8:48 PM] Indravat Rahul Poet Ks 11: *కవన జ్యోతి*
🪔🪔🪔🪔🪔
అంశం : చిత్ర కవిత
తేది : 05/11/2020
శీర్షిక : నేను ఉల్లిపాయను
*🧅నేను ఉల్లిపాయను🧅*
నేను ఉల్లిపాయను
ఎర్రని, తెల్లని రంగు నాది
పొరలు పొరలుగా ఉంటూ
నన్ను నరికే వాడిని
ఏడిపిస్తూ
కత్తులతో కట్ చేస్తూ
ఎన్నో కూరల్లో తింటూ
నేను లేని వంట
ఎవరైనా తింటారా
ఆమ్లెట్ అంటూ నూనెలో
నన్ను ఉడకబెడితివి
ఓ మానవ నువ్వు
ఏడుస్తూ నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావయ్యా
కూరల్లో వేస్తూ
రోజు నా రుచి ఆస్వాదిస్తూ
నేను ఇచ్చే విటమిన్ను
నేను లేనిదే నీ భోజనం కాదయ్యా....
*ఇంద్రావత్ రాహుల్*
కొత్తపేట్
నిజామాబాద్
9848054079...
5
[05/11, 9:08 PM] ల్యాదాల గాయత్రి: *కవన జ్యోతి*
*5/11/2020*
*అంశం : చిత్రానికి కవిత*
*రచన : ల్యాదాల గాయత్రి*
*ఉల్లి పాలవెల్లి*
తెలుపైనా ఎరుపైనా
చిన్నదైనా పెద్దదైనా
వంటింటి కల్పతరువు ఉల్లి..
అల్పాహారములో అతిముఖ్య
ఆధరువు..
పచ్చడి మొదలు పొలావు వరకూ
ఉల్లి లేదంటే లొల్లే మరి..
జోరున కురిసే హోరువానలో
ఘుమఘుమలాడే ఉల్లిపాయ పకోడి..
కోడికూర గ్రేవీకి గ్రావిటీ పెంచి
రుచులూరించే ఉల్లిమసాలా..
ఇల్లాలికి కంటతడిపెట్టించే
గడుసైన సొగసరి ఉల్లి..
తాను లేనిదే వంటింటి మహారాణికి
వంట పూర్తికాదని హొయలొలికే ఉల్లి..
ధరలో చుక్కల్లో చేరినా
ధరణిలో ఉల్లి వాడే
ధోరణిలో ఏ మార్పూ లేదు..
గృహసీమకు గగనతార
విపణి వీధిలో ధృవతార
కృషీవలుని కలలధార
ఉల్లి నీ మేలు మరువము తల్లీ..!!
6
[05/11, 9:08 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి
పేరు:కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:చిత్రకవిత
శీర్షిక:ఉల్లివే కాని తల్లివి కావు
తేదీ:5-11-2020
*****************
ఓ ఉల్లి రాజమా!
ఏమీ నీ ధీమా!
మా కన్న తల్లిని మించి
నీకు కితాబు ఇచ్చారు
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఈ జనాలు
నిన్ను ఎంత అందలం
ఎక్కించారు
అందుకేనా అందకుండా
ఆకాశాన చేరి కూర్చున్నావు
మేమెంత తనని గుండెకోతకు గురిచేసి బాధించినా
మా తల్లి తాను కన్నీళ్ళు పెట్టుకునేదే కాని
మాచేత ఎప్పుడూ కంటతడి
పెట్టించలేదు
నీవేమిటి కోయకుండానే
కంటనీరు తెప్పిస్తున్నావు
నీవు లేనిదే ఏ వంటకానికైనా రుచి రాదనా
నీవు లేనిదే ముద్ద గొంతు దిగదనా
అమ్మ చేతి గోరు ముద్దకన్నా
నీ రుచి అంత గొప్పదా
ఇదిగో ఆ అతి గర్వంతోనే
కొండెక్కి కూర్చుంటున్నావు
మరల నీ ప్రాబల్యం తగ్గి
నీ విలువ పడిపోయిన నాడు
నిన్ను నెత్తికెక్కించిన ఈ జనాలే
నిను నేలమీద పారేసి పోతారు
అందుకే మరి, నీ ధరను అదుపులో ఉంచుకుని
అందరికీ అందుబాటులో ఉంటేనే నిన్నందరూ
ఆప్యాయంగా పొదుపుకుంటారు
లేదంటే నీకు దూరంగా పారిపోతారు
🍁🍁🍁🍁🍁
7
[05/11, 9:13 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి (కవి సమయం)*
తేదీ:05-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: చిత్రానికి కవిత
శీర్షిక: ఉల్లితల్లి
**********†********
తల్లివై తనువులను కాపాడుతూనే
గురువువై గుప్పెడు శరీరాన్ని పొరలు పొరలుగా విప్పి
అంతా శూన్యమని జ్ఞాన బోధ చేసే ఉల్లీ!
పేదా గొప్ప తేడా చూపని
అందరి ఆరాధ్య ఆహార కల్పవల్లీ!
పుడమి గర్భాన దిద్దుకునే నీ రూపం
పచ్చ పచ్చగా తలెత్తుకొనే కాడలతో
భోజన ప్రియుల వంటల్లో నైవేద్యం అవుతుంటావు!
ఆ కోప తాపాలతో పొగిలిన నీ మనో వేదనతో
కోసేవారి కంట నీరు పెట్టించి శాంతిస్తావు!
కూరల్లో నీవు లేకుంటే రుచి ఎక్కడిది
సరుకుల్లో నీవు లేకుంటే బడ్జెట్ కు విలువెక్కడిది!
సామాన్య రైతును అధిక ధరతో
అందలమెక్కించేదీ నీవే!
అందీ అందక పండీ పండక
సైరికుడి జీవితాన్ని
సందిగ్ధ సంధ్యా చీకట్లో నిలబెట్టేదీ నీవే!
దేశ రాజకీయ స్థితి గతుల దిశా నిర్దేశం చేసే ఉల్లీ!
ఏ కడివెడంత నాయకుడైనా నీ ఘాటు పోటుకి లోకువై
చేతులు కట్టుకుని నిలవాల్సిందే...
ఆరోగ్య సూత్రాల ఆదెరువువైన
ఉల్లి తల్లీ!
అమ్మంత ప్రేమను పంచాల్సిందే!
8
[05/11, 9:20 PM] Gajula Bharati KS 20: 🌹కవనజ్యోతి కవిసమయం🌹
*****************
చిత్రకవితా పోటీ
అంశం:ఉల్లి
శీర్షిక:ఊరిస్తున్న ఉల్లి
పేరు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:ఖమ్మం
చరవాణీ:9849788108
అన్నిట్లో అదే ప్రధానం
అందరి వంటల్లో అదే మూలాధారం
ఉల్లికి ఘాటెక్కువ
ఘాటుకి రేట్ తోడైతే
రాజ్యాలు కూలుట ఖాయం!
ఉల్లితో కయ్యం కన్నా నెయ్యమే నయం నయం
తల్లి చేసే మేలు ఉల్లి చేయు
కాలుష్యం లేనిది అమ్మ ప్రేమ ఒక్కటే
కల్తీ లేనిది ఉల్లి ఘాటు ఒక్కటే!
సముద్రంలో ఎగిసే అలలు
ఆకాశం వైపు దూసుకుపోయే ఉల్లి ధరలు
కోయకుండానే కంటనీరు పెట్టిస్తున్నాయి
ఘొల్లుమనేలా ధరల కొరడా ఝులిపిస్తున్నాయి!
ఉల్లి అలికిడి ఉలిక్కిపడ్డ గుండే దడెక్కువై గడబిడ చేస్తున్నది
ఒళ్ళంతా కళ్ళు చేసి చూసా
కానరాక కలవర పెడుతున్నది
పర్సులో పచ్చనోటు ఖాళీఐ కలవర పెడుతున్నది
కాసులు కరిగి కన్నీరు తెప్పిస్తున్నది
పసిడిలా మెరుస్తున్నది!
రేటు పదింతలై తారలా
అందనంత ఎత్తులో ఉండి
దిగిరానని మొరాయిస్తున్నది
ఘాటు పరిమళాలను వెదజల్లుతూ..
పసిడి కాంతులతో విరాజిల్లుతున్నా..
ఊరిస్తున్నా... ఉల్లి ధరకు
కళ్లెం వేసే ఐడియా తలపెట్టు
ఈ వెలకట్టలేని ఉల్లిగడ్డ పనిపట్టు!!
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.ఎక్కడ ప్రచురితం కాలేదని హామీ ఇస్తున్నాను
***************
9
[05/11, 9:22 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి
అంశం చిత్ర కవిత
కేసీ నరసయ్య
శీర్షిక కొండెక్కిన ఉల్లి
ఉల్లిగడ్డ
ఉరిమి ఉరిమి
గుడ్లుమురుతుంది
మార్కెట్లో
ఘాటెక్కిన ఉల్లి
రారాజై పోయానని
విర్రవీగుతున్నది
ఉల్లి చేసే మేలు
తల్లికి చేటయి
తారాజు నుండి
సంచిలోకి జారనంటుంది
తాలింపులో
ఎర్రగడ్డ లేక
ఏవగింపు అయింది
కొండెక్కిన ఉల్లి
తోడు రాక
నూనె చిటపటలాడుతూ
చిందులు వేస్తుంది
రుచి రాణి కూర
మారాం చేస్తూ
గొంతులోకి దిగనని
మొండికేస్తుంది
10
[05/11, 9:25 PM] +91 74168 63289: కవన జ్యోతి పేరు
మన్నె పిన్నక లలిత
చిత్ర కవిత -- తరాల ఆధిక్యత
ఉల్లిని నేను ఎర్ర ఎర్రని ఉల్లిని నేను
ఉల్లిని నేను తెల్ల తెల్లని ఉల్లిని నేను
నేను లేనిదే నీ జిహ్వ కు రుచి లేదు
బెండ దొండలకు దోస్తును నేను
చికెను మటన్ లు నేను లేక పసందు లేదు
ఏ కూర అయితే నేమి ఏ మజ్జిగ పులుసు అయితే నేమి
గడ్డ పెరుగు మజ్జిగలో నన్ను నంజుకుని మజాచూడు
పుట్టెడు అంగీలు ఉన్న ఆకాశానికి ఎగురుతా ను
రైతును అందలం ఎక్కిస్తాను
అధః పాతాళానికి దించుతాను
అమ్మను నేను ఉల్లి తల్లిని నేను
పేద గొప్పల ఇంటిలో ఆధిక్యత నాదే కదా
తరతరాల గొప్పతనం నాది కదా
11
[05/11, 9:25 PM] +91 94400 97002: కవనజ్యోతి
5/11/2020
అంశం: ఉల్లి
....................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
...............................
శీర్షిక: ఉల్లిపాయ....
ధర పైకిపాయె
..........................
అన్ని వంటలలో మేళవింపు
పదార్థాలపై అలంకరింపు
ఆనందంగా ఆరగింపు
ఇప్పుడు మాత్రం కంటగింపు
ఘాటైనదీ ఉల్లి..
ఇప్పుడు ఘాటైనది ఉల్లి వెల
కొనకనే తరగకనే వినగానే కంట్లో నీళ్లు తెప్పించు ...
ఉల్లి వెల
ధరను చూసి సామాన్యుడు విలవిల..
తారాజువ్వలు ఎగిసే ఉల్లి వెల
తారాజువ్వ కన్నా ముందే ఎగిసే ఉల్లి వెల
ఉల్లి తోని వచ్చు రుచి
అందరూ మెచ్చే ఉల్లి రుచి
ఉపయోగాల ఉల్లి
దీని తర్వాతే తల్లి
ఏ పదార్థమైన ఉల్లితోనే చవులూరించు
ఉల్లి లేని పదార్థం లేదు
ఉల్లి లేక ఏ వంటకము లేదు
గంజి అయినా దోస అయినా పప్పు అయినా ఉల్లి ఉంటేనే
ఉల్లి లేక ఇల్లాలు తల్లడిల్లి
ఉల్లి కారం లేక చంటాడు పేచీ
పేద ధనిక అందరికీ నిత్యావసరం ఉల్లి
ఇంటి వైద్యానికీ ఉల్లి
రక్త పోటు గుండె జబ్బులు జలుబు నిద్రలేమి ఉబ్బసం అలర్జీలు అన్నింటికీ ఉపశమనం
వ్యాధి నిరోధక శక్తి ..
ఔషధగుణాలుఎన్నో
వైరస్ బ్యాక్టీరియాల
నుండి రక్షణ.....
వెరసి కూరగాయలలో సింహాసనం ఎక్కి రాజుల ఉల్లి
రాజ్యాలను కూల్చ గల ఉల్లీ
ఉల్లి కోసం బారులు తీరు
ఎప్పుడు మారునో ఈ తీరు
ప్రకృతులు కరువులు రవాణాలో అంతరాయాలు
విపరీతాలు సహజం
ఇది ప్రతి సంవత్సరం తప్పని అధ్యాయం
ఉల్లి లొల్లి కి మన లొల్లి
జత చేయక
సంయమనం పాటించి కొద్దిరోజులు ఓర్పు వహించి
వేచియుండుట
సముచితం.
.......................
12.
🌰🌷ఉల్లి 🌷🌰
వచన కవిత
*************************
*దిగిరావే ఉల్లి దయచూపవే తల్లి .
ధరల గుర్రమెక్కి 100 చేరినావు .
సమాజాన్ని వీడి సమాన్యుని మరచినావు
దిగిరావే ఉల్లి దయచూపవే తల్లి .🌰
*ఉల్లి తల్లి కన్న మేలట అంగడిలో లేవట
అపహరించే నిన్నెవరో అయ్యాయం ప్రజలకాయే .
బతుకుకు నివే బలమువూ మెతుకుకు నివే దిక్కువూ .
దిగిరావే ఉల్లి దయచూపవే తల్లి .🌰
*వంట ప్రార్థన నీతోనే మొదలు .
కూరకు తాలింపువు అన్నము అంచుగా .
ప్రతి పాకం నీ స్ధానం సరి లేదు నీకేది .
అన్నిటితో జతకట్టి ఆకలి పెంచేవూ .
ఉట్టిమీద ఉండక .
దిగిరావే ఉల్లి ,దయచూపవే తల్లి .🌰
*ముట్టకనే మొట్టి ఏడిపించకే ఉల్లి .
పొరలు పొరలుగా ఉండి తెరలో దాగకే ఉల్లి .
పుట్టేడంగులా గట్టిదానవే ఉల్లి .
మా పొట్టుదీయక ,పంటికిందికి రావే ఉల్లి .
ఊరంతా నీ లొల్లే అందరు నీ బంధువులే
యాదిమరువాకే ఉల్లి .🌰
*సర్కారు చౌరస్త కు తేబోతే దళారులు దాగిస్తున్నారు .
వీరి వీరి గుమ్మడిలా ముందర ధన లాభంకు .
ఆదరణతో అటుక్కెక్కకు ఆహారం నీవేనే
చుక్కలనెక్కిన ఉల్లి .
నీ జాగకు దిగిరావే ఉల్లి దయ చూపవే తల్లి .🌰
కందూరి సుజాతారాణి .
రాజంద్రనగర్ ,హైదరాబాద్
9392162822🌷
Comments
Post a Comment