గ్రామీణ వృత్తులు November 2020
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
Author of వెన్నెల శిల్పం
వీరా గుడిపల్లి
****************
కవి వరుల జాబితా
1.అపరాజిత్ గారు
2.సుధారాణి కృష్ణంరాజు గారు
3.కోరాడ గారు
4.డా.ఆంజనేయులు గారు
5.అయిత అనిత గారు
6.డా.బల్లూరి ఉమాదేవి గారు
7.సునంద వురిమిళ్ళ గారు
8.కెసి నరసయ్య గారు
9.భరద్వాజ గారు
10. మన్నె పిన్నక లలిత గారు
11.వల్లాల విజయ లక్ష్మి గారు
12.y k. సంధ్యా శర్మ గారు
13.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
14.మర్రి జయశ్రీ గారు
**********************
1
శ్రమజీవుల స్వేదంతో తడిసిన
మా పల్లె ఓ చూడచక్కని మల్లెపూవు !!
హలాలతో సాలిర్వాలు దున్నే రైతన్నలు
ఇత్తుకో చెట్టు అన్నట్టు నాగేటి సాలులో విత్తనాలు వేస్తూ తన ఇల్లాలు
పొద్దు నడినెత్తి కొచ్చాక ఆకలితో ఆరగించే సద్ది అన్నం !
వంచిన నడుము ఎత్తకుండా పొద్దుగూకే దాక వరాలు పెట్టుడు !!
అవును దేశానికి వెన్నెముక రైతన్న
అందుకే అదనులో పనిచేయి !!
పెద్దయ్య పెద్దమ్మ అంటూ పలకరింపులు
తీయతేనియల ఊటలు అనుబంధాలు !!
సేటు బీర్లు విస్కీలు దందా ఎంతచేసినా
తాటి కల్లు ఈతకల్లు అమృతంలా తాగేవాళ్ళు కోకొల్లలు !!
గీతకార్మికులు పాటందుకుంటే
ముస్తాదుతో ప్రాకుతూ ఎంత పెద్ద తాటి చెట్టయినా
ఇట్టే బలాదూర్ !!
ఏం మామ జర కల్లుతాగరాదె
దీని మజా నీకు తెల్వందానే !!
వడ్లకమ్మరి నాగళ్ళు, గుంటకలు, గొర్రులు చెక్కుతూ
కర్రులు, మొలలు నాటుతూ,,,,,,,, !!
సత్తెయ్య తాత వానలు జోరందుకున్నాయి !!
ఈ ఏడు మోతుబరి నువేనే
నీ అంత కష్టం చేస్తోడు ఉండా ఈ పరగణాన !!
గొర్ల మేతకు నీ కంచె కావాలె బావ
ఇంటకిస్తావో చెప్పరాదు !!
ఎయ్యి రూపాయలకు తక్కువియ్యను బామ్మర్ది !!
సీతక్క నీళ్లు చెదుతుంటే
దూపగొన్న ఎడ్లు బర్లు కుడితినీళ్లు తాగుతూ
కళ్ళు మూసుకొని స్వర్గం ఇందులోనే వుంది కాబోలు !!అన్నట్లు
తెల్లవారక ముందే రాములమ్మ
బర్ల పాలు పిండి, సానిపి జల్లి
ఇంటి ముందర సూడ సక్కని ముగ్గులేసి
వండి వార్చి చెలక్కాడికెళ్లేందుకు తయారు !!
చాకలమ్మ !అమ్మా రాములమ్మ అత్తా !
ఉతికే బట్టలు వెయ్యి
గిట్టుబాటు లేని చాకిరీ ఆయే !సణుగుతూ
పండుగలకేం తక్కువ !
ఇంద్రధనుస్సు రంగుల మేళవింపుల పూలు
అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మల తీరు ముచ్చటగొల్పు !!
శ్రమజీవి మహిళలు వెలుగు జిలుగుల కొత్త చీరల్లో
అందాల భరిణెలు !!
చెరువు గట్టున ఆడే కోలాటాలు
వన్నె తరగనిదేనాడు !!
బోనాలు, దసరా పండుగల్లో
వీరుని కెళ్ళేవాడు కొరడా జుళిపిస్తూ !
మాదిగన్నల డప్పు వాయిద్యాల మధ్య !!
అమ్మా బయలెల్లినాదో,,,,,,,,,,, పాడుతూ !
ఊరు ఉరిమినట్లు కదిలే జనం తీరు,,,,,,,,,,,,,, !!
ఏ కల్మషం ఎరుగని పల్లెటూరు శ్రమజీవులు
నిజంగా తెల్లని బొడ్డుమల్లెపూలే !!
Aparajith
2
[03/11, 8:38 PM] +91 74165 92715: 🙏🙏కవితా గానం🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*గ్రామీణ వృత్తులు ప్రొత్సాహం*
గ్రామీణ ప్రాంతాల్లో వారు చేసే వృత్తులను బట్టే కుల వ్యవస్థ ఏర్పడింది అని చెప్పవచ్చు*
కుమరి,కమ్మరి,వడ్రంగి, చాకలి,మంగలి, కంసాలి, పద్మశాలి, మొదలైనవి
అయితే మన భారత దేశం వ్యవసాయ ప్రధానమైన దేశం
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష రాస్యత వలన తమ వృత్తుల ద్వారా కేవలం శారీరక శ్రమ ఆధారంగా తమ,తమ, వృత్తులు ద్వారా జీవనం సాగించేవారు
రాను,రాను, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కులవృత్తులు
కుటీర పరిశ్రమలు వెనుక బడి పోయాయి
*ఈ పోటీ ప్రపంచంలో వారి మనుగడ అసాధ్యం గా మారింది దానికి ప్రధాన కారణం
ప్రోత్సాహం లేక పోవడమే*
వ్యవసాయ రంగాన్ని తీసుకున్న ట్లయితే మనిషి చేసే శ్రమ యంత్రాల ద్వారా చేయడం మూలంగా అందరికీ పని లభించక ఆవిధంగా వీధిన పడుతున్నారు
కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో
వృత్తులకు సరైన ప్రోత్సాహం లభించాలి
ఋణ సదుపాయం కల్పించాలి
వారు తయారు చేసిన వస్తువులు అందరికీ చేరేలా ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రభుత్వం వారి వృత్తులకు గత వైభవం వస్తుంది🙏🙏👍
3
[03/11, 9:05 PM] Korada: కవితాగానం
అంశం:-గ్రామీణ వృత్తుల
ప్రోత్సాహం..!
కోరాడ నరసింహా రావు.,
@బ్రతుకు తెరువు@
@@@@@@@
పరస్పరసహకారసుఖజీవనానికే...ఆవిర్భవించె
గ్రామీణ వృత్తులు..!
గ్రామంలోని అందరికీ...
రైతేకదా...కేంద్రబిందువు
పండించినపంటలో ...
ఎవరివంతు వారికివ్వ
అందరిబ్రతుకులుఆనందంతో...హాయిగా సాగె నాడు...!
కుమ్మరి,కమ్మరి,వడ్రంగి
సాలె,మేదరి,చమారి...
చాకలి,మంగలి,తెలుకలి
కలిసి,మెలిసీ అందరూ ఎర పొర లు లేక జీవించె
ఆంగ్లేయులువచ్చారు ...
ఫ్యాక్టరీ లుతెచ్చారు!గ్రామీణ వృత్తులకు పెద్ద చిచ్చు పెట్టారు...!!
మట్టి,కర్ర కొట్టుకు పోయి
సిలవరు,ప్లాస్టిక్కులుపుట్టుకొచ్చే, రోగాలనూ కొని తెచ్చె...!
గ్రామీణకులవృత్తుల...
బ్రతుకులే...... చితికి పోయెనయ్యయ్యో!!
ఎవ్వరెంతకృషిసలిపిన
చేతివృత్తి బాగుపడక...
బాధలుపడుటెందులకు
మారుతున్న కాలంతో మారక తప్పదు కదా !!
కుల వృత్తుల కాలము ఏనాడో అంతరించె.,
ఎవ్వరేపనులైనాచేసుకునే స్వేచ్ఛ వచ్చే ...!
ప్రతిఒక్కరు ప్రయత్నిస్తే
కలెక్టరో,మినిష్టరో...,
ఇంజనీరొ,డాక్టరొ...ఎవరివైన కావచ్చు ! నీకూ ఒక అవకాశం సుఖ పడేందు కొచ్చింది ! ప్రయత్నించి సాధించు...!
ఆనందంఅనుభవించు!!
*******************
....కోరాడ.
4
[03/11, 9:21 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఇప్పుడు గ్రామీణ వృత్తులు మూలకు పడ్డాయి నగరానికి వలస ఎక్కువైంది
పొలాలన్నీ ప్లాట్లుగా మారాయి
గ్రామీణుల బ్రతుకంతా కూలినాలి బ్రతుకు గా మారింది
కష్టపడ్డ రైతన్న ఫలితం ఏమిటి
గిట్టుబాటు ధర లేకపోవడంతో
అద్దెకి పావు సేరు అమ్ముకున్నాడు
రైతన్న నేడు ఏమి బ్రతుకు నీది
మట్టి బ్రతుకు నేడు కష్టాల కన్నీళ్ల కాలువలో మునిగిపోతున్న ది
అప్పుల కొండకు తల బాదుకుని
పురుగు మందు ఉరితాడు కళ్ల ముందు కదలాడుతుంది
చివరికి నీది తాలూ బ్రతక
తాకట్టుపెట్టి కాలం ఆ కాలమైతే
కాలానికి ఏం సమాధానం చెప్పాలి కరువుకాటకాలతో రైతు బతుకు అయిపోయింది
రైత ఈ నాయకుడు ఈ దూత దాత నీకు సహాయం చేయగలడు
నేడు రైతు తన పంట పొలాన్ని తన కళ్ళ ముందే వంట పెట్టుకుంటున్నాడు
అందుకే రైతన్న నీ బ్రతుకు గురించి ఏమని చెప్పమంటావు అలనాడు తగినట్టుగా జై కిసాన్ జై జవాన్ కాదు
రైతు బ్రతుకు అస్తవ్యస్తం రైతు బాధ తీర్చలేనిది ఎవరు పూడ్చలేనిది
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
5
[03/11, 9:25 PM] Anitha Aitha Poetess: *కవితాగానం*
అంశం : గ్రామీణ వృత్తులు
శీర్షిక: *అద్భుత సృష్టి*
దారపు బహుదూరాలను
దగ్గర చేస్తూ...
పోగుపోగుకు
వర్ణ జీవం పోస్తూ..
అద్భుత సృష్టే ఆ హస్తాలది..!
పండిన పత్తినే ఎత్తకుని
విత్తుల విరహం కలిగించి
వస్త్రాలు వడికే గొప్ప బలమే ఆ చేతులది..!
ఆకలి దప్పుల దరువులు వేస్తూ
ఎండిన డొక్కల శృతిచేస్తూ
నిరంతర శ్రమల లయలతో
సాగే సమరగీతం వారిది..!
అగ్గిపెట్టెలో చీరెలతో
మేలైన జరీతో
కనువిందైన రంగుల హంగులతో
అద్భుతాన్ని సృష్డించే మేధస్సే వారిది..!
కొనుగోలు లేక
పస్తుల పొట్లంలో వెతల పల్లీలను బుక్కే బీదఉదరం వారిది..!
ప్రభుత్వమే చేయూత నందించి
చేనేతను వృద్ధిచేసి
నేతన్న బతుకుల అతుకులను అవకాశపు దారంతో కుడితే
ఆనందమే వారికి!
రచన
అయిత అనిత
8985348424
జగిత్యాల
6
[03/11, 9:26 PM] Balloori Umadevi Poetess: కవితా గానం
పేరు: డా. బల్లూరి ఉమాదేవి
అంశం: కులవృత్తులు ప్రోత్సాహం
అనాదికాలము నుండి కులవృత్తుల
ననుసరించి కులము లేర్పడెనట
కాని
ప్రపంచీకరణ నేపథ్యంలో యంత్రాల
ఆవిర్భావంతో శాస్త్రజ్ఞానంపెరగడంవల్ల
కులవృత్తులన్నికుప్పకూలె నేడు
చేతిలోన చేవయున్న కాసులేక
ఆధునికత ముసుగులో జావకారిపోతున్నాయ్
చాకిరేవు పెట్టు చాకలన్న డ్రైక్లీనింగ్ యంత్రాలవల్ల
వృత్తిమానవలసివచ్చె జగతి యందు
కుమ్మరన్నకుండలెన్నొ చేయుచుండె నెండనక వాననక
మట్టికుండలోన నీరు చల్లనంటూ
మట్టికుండలోన వంట వండ
నావురావురనుచు తినెడివారు
పాలసట్టి ముంత బాన
నీళ్ళతొట్టి కాగు పొంత లాంటి వన్ని
కనుమరుగై పోయె
వడ్రంగులు,గాజులోళ్ళు,వడ్డెర్లు
కంసాలులు వివిధమైన పేర్లతో
కులవృత్తులుండేవి
అగ్గిపెట్టెలోన నిముడు పట్టుచీర
నేయగల్గుపనితనంబువున్ననేతన్నల
ఆక్రందనలు వ్యర్థాలే
మగ్గాలు మూలబడగ కులవృత్తులంతరించె
ఆంగ్లంపైమోజుతో కులవృత్తులువిడనాడి
మాతృభాష విడనాడి ఆంగ్లబడినిచేరి
భాషవంటబట్టలేక కులవృత్తులుచేయలేక
రెంటికిచెడినరేవడిలాఅశాంతితో అర్దాకలితో
అలమటించునేతన్నల.
రైతన్నల,గోడువినేదెవ్వరు?
నేలవిడిచిసాము చేయ ఫలితముండబోదంచు
తెలుసుకొన్ననాడె వచ్చు
కులవృత్తులకు పూర్వవైభవమ్ము
నాదేశమెగొప్పయన్న భావనమ్ము
హెచ్చినపుడె కలలన్నిపండు నిజము
ఆసుదినం కోసమ అహరహంశ్రమిద్దాం
అనుకొన్నది సాధిద్దాం
7
[03/11, 9:28 PM] సునంద ఉరిమిళ్ళ: *కవితా గానం*
తేదీ:03-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:: గ్రామీణ వృత్తుల ప్రోత్సాహం
******************†*
విరిగిన కుమ్మరి చక్రం
బెదిరిన పట్టెడ సమ్మెట
మొద్దు బారిన బాడిస ,రంపం
మూలబడిన అరక నాగలి
ఎటు చూసినా కుదేలైన వృత్తుల దీనగాధలే!
పొట్ట కూటి కోసం బహృకృత అవతారాలే..
ఒక్కసారి వారికి ప్రోత్సాహం ఇద్దాం!
శరీరం లోని భాగాలైన వృత్తులను బతకనిద్దాం..
ప్రోత్సాహం ఇచ్చి సగౌరవంగా ఉపాధి కల్పిద్దాం..
అసామాన్య వృత్తి నైపుణ్యాన్ని వెలికి తీద్దాం!
కవితా గానం
8
పేరు: కట్టెకోల చిన నరసయ్య
అంశం: గ్రామీణ వృత్తులు ప్రోత్సాహం
శీర్షిక; ఆదరణ కోల్పోయిన కులవృత్తులు
గ్రామం అందరి సమాజం
అన్ని వృత్తులకు నిలయం
సమాజ మనుగడలో
పల్లె అందమైన ఆదర్శం
రైతు చుట్టూ పరిభ్రమించే కులాలు
పంట చుట్టూ అంటుకున్న అంతరంగాలు
పల్లెకు పట్టుగొమ్మలు కులవృత్తులు
మర యంత్రాల ప్రవేశంతో
అంతరించిపోతున్న కులవృత్తులు
కుప్పకూలిన ఉమ్మడి కుటుంబాలు
సాగు సేద్యంలో దూరమైన కులవృత్తులు
పట్టణాలకు వలస పోతున్న కూలీలు
మారిపోతున్న పల్లె చిత్రం
పెట్టుబడిదారీ సమాజంలో
కట్టుబానిసలా కులవృత్తులు
గిట్టుబాటు లేని రైతుల ఆందోళన
వ్యాపారం ముసుగులో రైతు నిలువు దోపిడీ
కులవృత్తులను ప్రోత్సహించాలి
రైతాంగానికి పెద్దపీట వేయాలి
పల్లెలకు నాటి శోభనం తెచ్చి పెట్టాలి
9
[04/11, 8:06 PM] భరద్వాజ గారు: 🎊☘️కవితాగానం☘️🎊
అంశం-గ్రామీణ వృత్హులకు ప్రోత్సహం --!
శీర్షిక- ఆదరణ కరువు
పేరు-భరద్వాజరావినూతల
కొత్తపట్నం
రచన-20
పల్లెటూర్లు కులవృత్తులకు పుట్టినిల్లు -
భిన్నవృత్తులసమాహారంగావిరాజిల్లు -
కష్టించే శ్రమజీవుల మందిరం -
భిన్నత్వంలో ఏకత్వం కలిసినదేవాలయం ---
నీరుతెచ్చుకునే కుండలు -
పొలందున్నేహలాలు -
బట్టలు నేసే మగ్గాలు -
పనికిపనికొచ్చే పనిముట్లు -
పెట్టుకునేబంగారపు ఆభరణాలు -
బండిచక్రాలు చేసేవారు -
కాళ్లకుచెప్పులుకుట్టేవారు -
వీరందరూగ్రామీణజీవితానికి పట్టుకొమ్మలు -
కాలం మారింది కులవృత్తులనొదిలి -
జనం నాగరికథామోజులోపడ్డారు -
కులవృత్తి కుంటుపడింది -
జీవనం గగనకుసుమమైనది -
ఆదరించేవారులేక -
చేసినపని గుర్తింపురాక -
కులవృత్తులు అటకెక్కాయి -
బ్రతుకుభారమైంది -
పట్టించుకోని ప్రభుత్వాలు -
ఆదరించని ప్రజలు -
అత్యాధునిక యంత్రాలతాకిడికి బావురుమంటున్న -
వారిఆడుకునే మనిషియెవ్వరు ?
పేరు భరద్వాజ రావినూతల (RB)🖍️
10
[04/11, 8:43 PM] +91 74168 63289: కవితా గానం
పేరు: మన్నె పిన్నక లలిత
తేదీ: 4/ 11 /2020
అంశం : గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం
శీర్షిక :నిరాదరణ.
ఆనాడు గ్రామీణ వృత్తులతో రాజిల్లి
కూటికి గుడ్డకు లోటులేకుండా
"కడుపులో చల్ల కదలకుండా" నిశ్చింతగా ఉండి
కులవృత్తినే దైవంగా నమ్మి జీవనం సాగించిన గ్రామీణ ప్రజ
నేడు నాగరికత మోజులో
కులవృత్తి కొంపను కొల్లేరు చేసి
అటకెక్కిన పనిముట్లను చూస్తూ, చేతనైన పని చేయలేక
చేతులు ముడుచుకున్న కళాకారులు
"నారు పోసిన వాడు నీరు పోయాడా"
అన్నట్లు
"ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోక"
జీవనోపాధికి ఏదో ఒక పని చూచుకుని
ముందుకు పోవటమే ప్రథమ కర్తవ్యం
ప్రభుత్వం గ్రామీణ వృత్తులను ప్రోత్సహిస్తూ
రుణాలు ఇచ్చి ,ఉత్పత్తులను కొనుగోలుచేసి
ఉపాధి కల్పనతో ఆదుకుని ఆదరించి
నిరాశతో ఉన్న నిరుపేదలకు భరోసా కల్పించాలి
11
శీర్షిక:**గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహo*
---****************------
ఒకనాటి *పల్లెలు* స్వయంపోషకాలు
నిన్నటిదాకా వెలసిన 'ముసలి'గోడలు
కులవృత్తులతో అలరారిన బజార్లు
కరుణించే నాయకుడు లేక బేజార్లు
మానవపరిణామగతిలో వృద్ధినొందిన
గ్రామీణ వృత్తిపనులు చేనేతలు హస్తకళలు
నిస్సత్తుతో మూలన పడినవి అస్తవ్యస్థమై
గ్రామాల నుండి పట్టణాలకు వలసలధికమై
అభిమాన సంరక్షణలైన వస్త్రాల సృష్టించు
హస్తాల గాంచి తెల్లోళ్లముఖాలు నల్లబడ్డాయట
అగ్గిపెట్టెలో పట్టె పట్టుచీరల చూసి ఆంగ్లేయులు
అసూయతో మనోళ్ల చేతివేళ్ళు నరికించినారట
విదేశీవస్తువులకెగబడుతూ నేడేమో మనమే
విచక్షణలేక మనోళ్ళ పొట్టగొడుతున్నా"మాయే'
అసలే అంతంతమాత్రంగా ఉండిన వృత్తుల
పరిస్థితి కరోనాతో కకావికలమయిపోయే!
చేనేతన్నలదే కాదు అందరిదీ దుస్థితే
గీతకార్మికులబ్రతుకులు గాల్లో వేలాడుతుoడే
రజకజీవితాలు మురికి మయమాయే
పశుపోషక మేదర..వృత్తులన్నీ అన్యాయమాయే
మట్టితో పాత్రల సృష్టించిన తొలియంత్రం *చక్రo*
హిమయంత్రాల దాడికి గడ్డకట్టి వణుకుడాయే
అతిసూక్ష్మ హస్తకళల పంచలోహ కార్మికులవీ..
ఒక్కటేంటి!అన్నివృత్తులూ అనాథలై రోధిస్తుండే
సాంప్రదాయకవృత్తుల అన్ని ఉత్పత్తులు
మన వాతావరణానికి తగిన ఆరోగ్యప్రధాతలు
చేతివృత్తులకు హా(ఆ)ర్థిక చేయూతనిస్తూ
ఆదరిద్దాం'కరోనా'వల్ల పల్లెజేరిన మనవారిని.
:వల్లాల *విజయలక్ష్మి*
ఆలేరు*
12.
కవితాగానం
అంశం: గ్రామీణ వృత్తుల ప్రోత్సాహం
వై.కె.సంధ్యశర్మ
మసక బారిన బతుకుల్లో
వడికిన చక్రాలకు
కొంగ్రొత్తగా ముతక మేలని
కితాబులిస్తున్నారు.....
మసిబారిన ఎర్రమట్టిపై
తివాచి పరచి...
మట్టి ప్రమిదల వెలుగులను
విరజిమ్ముతున్నారు....
పసిడి కరిగించే
ఆ చేతులిపుడు....
మణిమాణిక్యాలకు
చేవ్రాలయ్యాయి....
రేవు బండలో మొద్దుబారిన
తనువులు...
నలిగిన చొక్కాలకు
బొత్తాలయ్యాయి
కమిలిన చర్మాలు
కరిగిన కండలకు
ఆసరాగా అద్దాల మేడల్లో
కొలువయ్యే మేజోళ్ళకు
మేరువయ్యాయి...
నిత్యం రాలే పండుటాకుల
పంజరాన్ని వదిలి...
పల్లె పల్లకిని మోసే బోయీలంతా
పట్టణ హంగుల పొంగులకు
మెరుపులద్దుతూ...
మూలలను... తడుముకుంటూ
ఉనికి
చాటుతున్నారు..!.
13
[05/11, 10:12 PM] Lalita Sister: అంశం:-కులవృత్తులు
శీర్షిక:-కనుమరుగవుతున్న కులవృత్తులు
ప్రక్రియ:-వచన కవిత్వం
భారతీయ సంస్కృతిలో
కులవృత్తులు జీవనోపాదులు
వంశాంకురా బీజాలు
ఆదయమార్గాలు
కులవృత్తులు కర్మకులు జీవనైపుణ్య ఇంజనీర్లు
సమాజంలో ఎన్నో కులాలు..మతాలు
రజక,,గౌడ,,నాయీబ్రాహ్మణ,చేనేత అనేకం
నేడు కులవృత్తులన్ని
కానరాని తీరు
కడుపునిండే దారిలేక
ఆకలికేకల సుడిగుండంలో
కొట్టుమిట్టాడే కడు దయనీయ బ్రతుకు చిత్రం
చేనేత మగ్గం
మరణశేయ్యపై విలపిస్తుంది
ఏరులై పారే మద్యం
జోరు..హుషారులో
గౌడ గుండేకు గుబులు పుట్టబట్టే
రజకుల రేవు
ఎడపాయే
మకిలీలను శుభ్రం చేసి
శ్వేతా వస్త్రాల
మిల మిల మెరుపులు ఏ మూల ములుగుతుండే
నేటి తరానికి
కులవృత్తులు అనే మాటే కొత్తదాయే
అంతా అగమ్యగోచరంగా ఉండబట్టే
మదర్ థెరిస్సా మానవతా వాదుల్లారా
దయగల మారాజులు
శాశ్వత భరోసాతో
భద్రత ఇచ్చి
ఆసరాగా ఉండే
ఆపన్నాహస్తం
ఆదుకునే అమృత మనసులు కావాలి
నోటిమాటలు కాదు కావాలి
నోటు ( డబ్బు) మూటలు కావాలి
కులవృత్తులకు
పూర్వ వైభవం రావాలి
పల్లె పల్లెలు కళ కళ లాడుతూ మేరవాలి
అన్ని కులవృత్తుల వారు మురవాలి!!!
హామీపత్రం
*********
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
***************
గాజుల.భారతి శ్రీనివాస్
ఖమ్మం
సెల్:-9849788108
మెయిల్:-
ggajulabharathi@gmail.com
తెలంగాణ రాష్ట్రం
****************
14.
[05/11, 10:12 PM] Lalita Sister: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..గ్రామీణ కులవృత్తుల ప్రోత్సాహం
శీర్షిక...జీవనాధారం
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు
పల్లె ప్రజల జీవనాధారం కులవృత్తులు
కుమ్మరి చక్రం
కమ్మరి కొలిమి
రంగు రంగుల అద్దకంలో
ఆకర్షించే చేనేత
ఆదరించబడే అపురూప చేతివృత్తులు
చేతినిండా పని లేక
సంపాదన శూన్యమై
రెక్కాడితే గాని పూట గడవని కులవృత్తుల దీన దృశ్యం నేడు
ఆధునికత పేరుతో
కాసుల వేటలో కులవృత్తులకు ఆదరణ కరువై
ఆధునిక వస్తువుల ఉత్పత్తి కి పోటీ పడుతూ
చేతి వృత్తులను మూలన పడేసి
ఆధునికతకు పెద్దపీట వేస్తే
జీవనాదారమైన చేతివృత్హులను కోల్పోయి
ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంటే
ఆదరించి అన్నం పెట్టే అన్నదాత గోడు వినే నాధుడే కరువై
బ్రతుకే భారమై
ఆకలి చావులతో
కుటుంబాలు అనాధలవుతున్న వేళ
నిజం తెలుసుకొని మసలుతూ
కులవృత్తులకు ప్రోత్సహామిస్తూ
పూర్వ వైభవం సాదించుదాం.
ఆ శుభతరుణం కోసం ఎదురుచుద్దాం
Comments
Post a Comment