లౌక్యం 11/2020
నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ
న్యాయ నిర్ణేత ః వై.కె.సంధ్యా శర్మ గారు
*****"
1.భరద్వాజ గారు
2.అపరాజిత్ గారు
3.డా.ఆంజనేయులు గారు
4.కోరాడ నరసింహా రావు గారు
5.సుధారాణి కృష్ణం రాజు గారు
6.మిట్టా లక్ష్మి గారు
7.సునంద వురిమళ్ళ గారు
8.కెసి నరసయ్య గారు
9.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
10.పరాంకుశం రఘు నారాయణ గారు
***************
1.భరద్వాజ గారు
[24/11, 8:16 PM] భరద్వాజ గారు: 🎊⚜️కవనజ్యోతి 🔆🎊
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
రచన-11
24-11-20
అంశం- లౌక్యం
శీర్షిక ---అనుభవంకావాలి !
లౌక్యం లేనిజీవితానికి సౌఖ్యం
సర్దుబాటులేని సంసారానికి సుఖం-
ఉండదు -
లౌఖ్యంలేనిజీవితం అందుకోలేదు ఉన్నతశిఖరాలు
సాధించలేదు ఏ లక్ష్యాలు -
మగ అహంకారానికిసమాధానం చెబుతుంది భార్య ఓపికగా -
ఉద్యోగస్థుడు తన అధికారితో చెప్పేమాటలుతెలివిగా--
అదేలౌఖ్యం -
దానికి మారుపేరు సమయస్ఫూర్తి -
చదువుకున్నప్రతివాడికి లౌక్యం తెలియకపోవచ్చుఉండకపోవచ్చు -
లౌక్యమున్న వాడికి చదువే అక్కర్లేదు -
లౌక్యంతో భారతం నడిపాడు ఓదేవుడు -
లౌక్యంతో ఒక్కడే స్వాతంత్ర ఉద్యమం నడిపాడు
ఓ నాయకుడు -
కష్టాల బ్రతుకుబండిని లాగాలన్నా
బ్రతుకు ఆనందాధామం కావాలన్న ఆశ్రయించక తప్పదు దీనిని -
కోనే వస్తువు కాదు -
బదులు తెచ్చుకునే వస్తువుఅసలే కాదు -
అనుభవం అనే బడిలో నేర్చుకున్న పాఠాల సమాహారం -
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల (RB)🖍️
2
[24/11, 8:17 PM] Aparajith: సాత్వికుడు !
బ్రతక నేర్చిన వాడికే లౌక్యం తెలుసు
కల్లా కపటం తెలియని వాడు అమాయకుడు !
అమాయకుడే కష్టాల కడలి ఈదుతాడు
వాడి మనసు శీతాకాలం కురిసే మంచు ముత్యం
వాడి వేడి సెగలు గుండెలు తొలిచేసినా
కురిసే వానల్లో విరిసిన హరివిల్లు లా
సాత్వికుని హృదయం జలతారు వెన్నెల
మంచితనం మూర్తీభవించిన మంచి మనసు గల మనీషి !!
వెలుగులు చిందించే హృదయమొక వెండి వెన్నెల కిరీటం
అలవికాని చీకట్లో అలమటించినా
గుంభన హృదయంతో దుఃఖితులను ఓదార్చే గుణం !!
కంటక భూయిష్ఠ దారిలో సైతం
పయనించే ఓర్పు గల నేర్పరి !
బ్రతక నేర్వకున్నా ఎన్నెన్ని శోధనలకు గురైనా
పదిమందికి సహాయపడే మంచితనం
మంచితనానికి అమాయకత్వానికి తేడా తెలీని సాత్వికుడు !!
ఎవరెష్ట్ శిఖరం లాంటి మంచుకొండ
ఎవరూహించని శిఖరాలధిరోహించే నేర్పరి !!
జిత్తుల ఎత్తుగడల లౌక్యం లోకం నిండా
సాత్వికుడెపుడు గుంపులో గోవిందం కాడు
అతడొక మంచి వైజ్ఞానిక విపంచి !!
అపరాజిత్
3
[24/11, 8:43 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: లౌక్యం
అరె బాబు లౌక్యం లేకపోతే ఎందుకు పనికిరావు లౌకికత్వం రాజ్యాలను నడిపించింది
లౌక్యం మనిషిని ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది
కొద్దిమందిలో కాలాను గుణంగా
లౌక్యం తో ప్రవర్తించి
ఈ కాలం ఆ లౌక్యం లేకపోతే
నీవెందుకు పనికిరావు
నిన్ను నిలబెట్టి దోచుకొని వెళ్ళేది మహా ఘరానా జీవులు ఉన్న కాలం ఇది
అరె బేటా కామోసు
లౌక్య జీవుల కాలమిది అవసరానికి ఎట్లా అంటే అటు దూకుతారు ఆయా
రామ్ గయారాం'ల అవుతారు
జంపింగ్ బాబులు అవుతారు
అందుకే తెలుసుకో లౌక్యం తో జీవించడం అలవర్చుకో లోకాన్ని జయించడం నేర్చుకో బ్రతుకును నిలుపుకో
ప్రభుత్వాన్ని వదులుకోకు మంచిని పంచుకో లోకానికి జ్ఞానభిక్ష పెట్టు లౌక్యం తో జీవించు లౌక్యం ని అనుసరించి సాగిపో
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు
4
[24/11, 8:45 PM] Korada: కవనజ్యోతి
నేటికవిత :- * లౌక్యం *
కోరాడ నరసింహా రావు!
@ సార్ధక్యం @
***************
"లౌక్యం"...అంటే ఏమిటి?
అడిగాన్నేను....!
'లౌక్యం' అంటే....అంటూ...
గొప్ప లౌక్యంగా చెప్పాడు...
మా వాడు....! చూడండి...!!
లోక వ్యవహారాల నన్నింటినీ
సమర్ధవంతంగా...నిర్వహించగలగటమేకదూ...లోక్యమంటే...!
అలా నెగ్గుకు రాగల వాడే గా...
లౌక్యుడు....!!
ఎవరితో...ఎప్పుడు...ఎక్కడ...
ఎలా వ్యవహరించాలో తెలుసు
కుని...నొప్పింపక...తానొవ్వక..
ఎలా తప్పించుకోగలగాలో...తెలుసుకోలేకపోతే ఎలా!?
అలా లేకపోతే...ఈ లోకంలో...
ఎదగడం సాధ్యమా...?!
అసలు బ్రతకటమే కష్టంకదూ !
లౌక్యులు కావాలంటే...,లోకం
గురించి బాగా తెలియాలిగా...
అప్పుడే...ఏది...ఏమిటి...ఎందుకు...ఎలా అనేవి చక్కగా
బోధపడేది....!
వారేకదా....అందుకు తగ్గట్టు...
తమనుతాము సమర్ధవంతంగా
మలచుకో గలిగేది...!!
ఎన్నో...పొందాలని...ఎన్నెన్నోఆనందాలందాలనీ...పూర్వ కర్మ వాసనల రెక్కలు కట్టుకు...మరీ
ఈలోకాని కొచ్చాం...!
నీకు లౌక్యం తెలియనిదే... అది
నీలో లేనిదే...ఇదంతా ఎలా...
సాధ్యం ...!?
ఈ లౌక్య మే నోయ్...జన్మకు
సార్ధకతను చేకూర్చగలిగేది!!
నేర్చుకో....లౌక్యాన్నిఅలవరచుకో....నీ జన్మ సార్ధకం చేసుకో!!
***********************
..........కోరాడ.
5
[24/11, 8:58 PM] +91 74165 92715: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*లౌక్యం*
*లౌక్యం లేనిది రాణించ లేము
ఉన్నతంగా ఎదగాలన్న లౌక్యం కావాలి*
మనం మాట్లాడే విధానంలో కూడా లౌక్యం లేకుంటే ఎదుటివారిముందు మనం
తెలివి లేని వారిగా కనిపిస్తాము*
*జీవితంలో స్థిరపడాలనుకున్న,అటు పోటులను ఎదుర్కోవాలన్న లౌక్యం అవసరం*
*అర్థం లేకుండా మాట్లాడేవారిని వాగుడు కాయ అని ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడే వారిని మిడి,మిడి జ్ఞాని అంటుంటారు*
కాని లౌక్యం తెలిసినవారు"ఎప్పటికెయ్యది ప్రస్తుతమో "అప్పటికా మాటలాడు"అన్ని విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది*
*కొంత మందిని పరిశీలించి నట్లయితే వారు చెప్పింది నిజం
ఎదుటి వారు అసమర్ధులుగా కనిపిస్తారు*
*వారు చిక్కుల్లో పడ్డప్పుడు కాని అర్థంకాదు ఎదుటివారు
ఎంత లౌక్యం కలవారో అన్న విషయం*
*అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకొనే నేర్పరి
తెలివి గల వ్యక్తి అయితే
*చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు లౌక్యం లేని
వ్యక్తిగా చెప్పవచ్చు*
*కొంత మంది వ్యక్తులు తాము బాగు పడతారు ఎదుటి వారి లాభం లో కూడా తమకు మేలు
జరిగే విధంగా చూస్తారు
*అందుకే అంటారు స్వామి కార్యం స్వకార్యం అని కొన్ని సార్లు మనం వింటుంటాం అతనికి బొత్తిగా లౌక్యం తెలియదు ఎలా బ్రతుకుతాడో పాపం అంటూ జాలి చూపెడతారు నిజమైన లౌక్యం కలవ్యక్తి ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు*🙏🙏👍
6
[24/11, 9:02 PM] +91 94400 97002: కవనజ్యోతి
24/11/2020
అంశం: లౌక్యం
......................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
...................................
ఏ పాఠ్యాంశంలో లేనిది
ఏ పాఠశాలలో నేర్పనిది
పట్టాల పుచ్చుకున్నా
తెచ్చుకున్నా రానిది
ఈ ప్రపంచంలో బతకడానికి అత్యవసరంగా
ప్రతి మనిషికి కావలసినది లౌక్యం... ఖచ్చితంగా లౌక్యమే
లౌక్యం ఉంటే
ఏమున్నా లేకపోయినా
విత్తమున్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా ఎక్కడైనా ఎప్పుడైనా
మన గలడు
"మన వాడు" అని అనిపించుకో గలడు
పలు కాకులు లోకులు
ప్రతి కదలికను గమనిస్తూంటారు
తప్పులు వెతుకుతూంటారు ప్రశ్నలతో వేధిస్తుంటారు లౌక్యంతో మెలగడమే
మనకు ఉన్న ఏకైక దారి
నొప్పింపక తానొవ్వక మెలగాలన్నా లౌక్యమే శరణ్యం అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు
సమయానికి తగు లౌక్యంతో మెలగువాడే ధన్యుడు
అష్టావధానం ప్రక్రియలో సంధించిన ప్రశ్నలకు
పృచ్ఛకుడు
అప్పటికప్పుడు లౌక్యంతో
సమాధానాలు ఇవ్వడం జనరంజకం.
వేగం ,స్పందన ,తెలివి ,చొరవ అన్ని కలిపి ప్రవర్తించడం ప్రతిస్పందించడం
సమయానికి తగినట్లుగా వ్యవహరించడం లౌక్యం
మన తెనాలి రామలింగడి వినోద విజ్ఞాన కథలలో
లౌక్యందే ప్రధాన పాత్ర
అర్థం చేసుకుంటే
అంత కన్నా
అర్థవంతం అయినది
ఆదర్శమైనది
ఆనందకరమైనది ఏదీ లేదు
లౌక్యం లోకహితం జనహితం
ఆధునిక కాలంలోనూ ప్రతిభ కన్నా ప్రవర్తన ముఖ్యం లౌక్యం ఉన్నవాడే ముందుకు దూసుకుపోతున్నారు
సాఫ్ట్ స్కిల్స్ అంటూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటూ లౌక్యంనకు పెద్దపీట
సాహిత్యంతో సంబంధం ఉన్నవారు
చిన్ననాటి నుండి పఠనాసక్తి కలవారు ...చదువరులు
లౌక్యం గురించి అర్థం చేసుకొని సాధన చేసుకుని కొంత వరకు సాధించుకోవచ్చు
పెద్దల మాటలు లో సారాన్ని
అర్థం చేసుకుని లౌక్యం సాధన చేయవచ్చు
అనుభవంతో పరిశీలనతో నలుగురిలో మెలగడం ఇప్పుడు పరిణితి చెందుతూ జీవించడమే లౌక్యం
కృష్ణుడి కన్నాలౌక్యుడు
చాణిక్యుడి కన్నా లౌక్యుడు
ఎవరున్నారు?
దైనందిన జీవితంలో అంతోఇంతో లౌక్యంతో మెలగడమే అందరికీ
శ్రేయస్కరం ఆనందకరం.
...............................
ఈ కవిత నా స్వీయరచన దీనికి అనుకరణ కాదు.
7
[24/11, 9:04 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి*
తేదీ:24-11-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: లౌక్యం
********************
కూసింత ఇది లేకపోతే
వసంతంలో శిశిరాన్ని ఆహ్వానించినట్టే..
చల్లని శీతల పవనాలు ఆస్వాదించే సమయంలో
మండుటెండలను మనసులో
అనుభవిస్తున్నట్ఠే..
నిండు పున్నమి వెన్నెల్లోనూ మనసును
చిమ్మ చీకట్లో నిలబెటట్టినట్టే..
అందుకే కాసింతైనా
లౌక్యం ఉండాలని పెద్దల ఉవాచ!
"ఎప్పటి కెయ్యది మాటలాడి.. తానొవ్వక నొప్పింపక ఒప్పించుకు తిరుగువాడే లౌక్యుడని
సుమతి శతక కారుడు మర్మగర్భంగా
ఎప్పుడో సెలవిచ్చాడు!
పెదవులపై పూసే చిరునవ్వు
పెద్ద శత్రువు మనసునైనా
ఒక్కసారి కుదిపి ఆలోచింపజేస్తుంది!
ఆత్మీయంగా మాట్లాడే మాట
ఎంతటి కరకు గుండెనైనా కరిగేలా చేస్తుంది!
సమాజంలో ఒంటరితనాన్ని దూరం చేసేది
పనులను చక్కబెట్టుకునే నేర్పు కలదీ లౌక్యమే..
8.
[24/11, 9:27 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి
అంశం: లౌక్యం
పేరు: కెసి నరసయ్య
శీర్షిక: లౌక్యానిదే రాజ్యం
లౌక్యం అలౌక్యం
సమాజంపై అవగాహన
మనుగడలో మెళకువలు
నడవడికలో కుడిఎడమల మార్గం
మడత పేచీలు లేని వ్యవహారం
లౌక్యమెరిగిన కాలం కలి కాలం
రాజ్య పాలనలోనూ రాచరికలౌక్యం
పెట్టుబడుల సమాజంలో వ్యాపార లౌక్యం
రచ్చబండ రాజ్యంలోపెద్దమనుషుల లౌక్యం
స్వార్థ రాజకీయంలో లౌక్యానికే పెద్దపీట
లౌక్య వ్యవహారంలో మంచిచెడుల తారుమారు
లౌక్యం ముసుగులో ఓటు నోటుకు తాకట్టు
లౌక్యమెరిగిన వాడే సమాజంలో మనగలిగినవాడు
లోక వ్యవహారంలో లౌక్యానిదే రాజ్యం
9
[24/11, 9:28 PM] Gajula Bharati KS 20: కవనజ్యోతి కవిసమయం
***************
అంశం: లౌక్యం
శీర్షిక: బతకనేర్చిన సమర్ధుడు
చేతుల్లో స్వర్గాన్ని చూపిస్తూ
ఆకాశానికి నిచ్చేన్లు వేస్తూ
హరివిల్లులో విహరింపచేస్తూ
ఏ రొటికడా ఆ పాట పడుతూ
ఏ పార్టీకి ఆ జెండా ఎత్తుతూ
జనాన్ని,జగాన్ని నొప్పింపక,,మెప్పిస్తూ
విజయతీరాలకు చేరుకుంటున్నా
జగమెరిగిన జాదుగాళ్ళు
ఇందుగలరు అందులేరన్నా సందేహం వలదు,, వలదు అన్నట్టు
సమర్ధవంతంగా జగాన్నేలే జగన్నటాక సూత్రాదారులు,,పాత్రధారులు
నిత్యం నటించే నటశేఖరులు
మాటల గారడీలు చేసే మాయల మాంత్రికులు
సంసార సాగరాన్ని చాకచక్యంగా నడిపే నావికులు
మహా గొప్ప మేధావులు లౌక్యం వీరులు,,శూరులు
లౌక్యం గల వారిదే లోకం
లౌక్యం గల వారిదే సాగేను సుఖ జీవనయానం
లౌక్యంతోనే సాగేను బ్రతుకు ప్రయాణం
లౌక్యంతో కూడిన జీవితం
నేడు కావాలి అవసరం
********************
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను,దేనికి అనుకరణ,అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
******************
గాజుల భారతి శ్రీనివాస్
ఖమ్మం
9849788108
10.
*కవన జ్యోతి కవిసమయం*
కవితాoశం :లౌక్యం
పేరు: పరాంకుశం రఘు నారాయణ
జిల్లా :మహబూబాబాద్
************************
కవితా శీర్షిక :లౌక్యo-
సుఖజీవనం
*************************
లౌక్యం కుటుంబాల్లో గెలుపు!
లౌక్యమే వ్యక్తి జీవితంలో మలుపు!
లౌక్యమే సమాజాన ఓదార్పు!
లౌక్యమే అందరికీ నిట్టూర్పు!
లౌక్యమే కలుపుగోలుతనానికి దిక్సూచి!
లౌక్యమే ఐక్యతారాగ విపంచి !
లౌక్యమే అనుబంధాలకు సంకేతం!
లౌక్యం సుఖ జీవన విధానం!
లౌక్యమే సంస్కారాల సమూహం !
లౌక్యమే ఆదర్శాల సమాహారం !
లౌక్యమే మనిషి సమ్మోహనం !లౌక్యమేసత్సoప్రదాయ సమ్మిళితం!!
Comments
Post a Comment