ఉల్లాసం 1/12/2020
నిర్వహణ
వీరా గుడిపల్లి
శివునూరి లలితాకృష్ణ
న్యాయ నిర్ణేత
వైకె సంధ్యా శర్మ గారు
***************
కవనజ్యోతి(కవి సమయం1)
"ఉల్లాసం" అంశంపై స్పందించి వ్రాసిన
కవివర్యులందరికీ అభినందనలు
💐💐💐💐💐💐💐💐💐💐
ఫలితాలు
కవనజ్యోతి(కవి సమయం1)
"ఉల్లాసం" అంశంపై మరింత ఉల్లాసంతో
పాల్గొన్న విజేతలందరికీ శుభాబినందనలు
💐💐💐💐💐💐💐💐💐💐
*ప్రథమ విజేతలు*
భరద్వాజ రావినూతల గారు
పరాంకుశం రఘునారాయణ గారు
మన్నెపిన్నక లలిత గారు
అపరాజిత్ గారు
చెన్నా విజయలక్ష్మి గారు
వురిమళ్ళ సునంద గారు
గాజుల భారతీ శ్రీనివాస్ గారు
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
*ద్వితీయ విజేతలు*
సుధారాణి గారు
వేదుల ఇందిర గారు
సుమన ప్రణవ్ గారు
ఇంద్రావత్ రాహుల్
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
*తృతీయ విజేతలు*
డాక్టర్. సి.హెచ్. ఆంజనేయులు గారు
కొలచన విజయ భారతి గారు
కె.సి. నరసయ్య గారు
ధనాశి ఉషారాణి గారు
సింగీతం సంతోష్ కుమార్ గారు
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
👏👏👏👏👏👏👏👏👏👏👏
1.సుధారాణి గారు
2. భరద్వాజ రావినూతల గారు
3. అపరాజిత్ గారు
4.పరాంకుశం రఘు నారాయణ గారు
5.మన్నె పిన్నక లలిత గారు
6.ఇందిర వేదుల గారు
7. చెన్న విజయలక్ష్మీ గారు
8.. వురిమళ్ళ సునంద గారు
9.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
10. ఇంద్రావత్ రాహుల్
11. డా.సి.హెచ్.ఆంజనేయులు గారు
12.కొలచన విజయ భారతి గారు
13.కోరాడ నరసింహారావు గారు
14. సుమన గారు
15.కె.సి.నరసయ్య గారు
16. ధనాశి ఉషారాణి గారు
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
1
[01/12, 8:01 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏 సుధారాణి కృష్ణంరాజు🙏
*కవితాంశం*ఉల్లాసం*
*ఇంటికి దీపం ఇల్లాలు
ఆ దీప కాంతుల కిరణాలే
పిల్లలు అన్నట్టు పిల్లలు ఉన్న
ఇంట్లో సందడే సందడి
పుట్టగానే పిల్లల స్పర్శ తల్లికి
ఎంతో ఉల్లాసం కలిగిస్తుంది
కల్మషం లేని పసి పిల్లల చిరునవ్వు మానసికొల్లాసం
కలిగిస్తుంది
పని భారంతో అలసి,సొలసి
ఇంటికి వచ్చిన తండ్రి కి పిల్లల
ముద్దు మాటలతో అలసట పొయి ఆనందం కలుగుతుంది
చిరు ప్రాయంలో ఇంటికి వచ్చిన వారిని తమ ముద్దు, ముద్దు మాటలతో వారిని ఎంతో మేధావుల వలె పిల్లల
హావా భావాలు పలకరించే విధానం వారికి కూడా ఉల్లాసం
కలుగుతుంది
తల్లి మందలించి నప్పుడు ఒక మూలకు మూతి ముడుచుకుని కూర్చుంటే తల్లిదండ్రులు వెళ్ళి బతిమాలితే ఎంతో ఉల్లాసంగా
పరుగెత్తి అమ్మ నాన్న ల అనురాగం పొందే పసి పిల్లలను చూసి నప్పుడు చాలా
సంతోషంగా ఉంటుంది
పండుగలు వచ్చాయంటే పిల్లల అల్లరి అంతా ఇంతా కాదు దీపావళి పండుగ రోజు తల్లికి దీపాలు వెలిగించుటకు
ఎంతో ఉల్లాసం గా సహాయం
చేయాలని ఆరాటం టపాకాయలు నాన్నతో కలిసి
కాల్చాలనే వారి తపన నాన్నకు
ఎంతో ఆనందం ఆఇంట వెల్లి
విరుస్తుంది
మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి పిల్లలే వైద్యులు గా వారు చేసే అల్లరే ఔషధంగా పనిచేస్తుంది
పెరిగి పెద్దయ్యాక పసి వయసులో చేసిన పనులు
ఆనందంగా గడిపిన రోజులు
జ్ఞాపకం వస్తుంటాయి
ఆరోజులు తలుచుకుని పొందే
ఉల్లాసం మాటలలో వర్ణించలేనిది🙏🙏👍
2
[01/12, 8:02 PM] భరద్వాజ గారు: 🚹🎊కవనజ్యోతి 🎊☘️
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
రచన-18
01-12-20
అంశం- ఉల్లాసం
శీర్షిక -- మనిషికి ప్రశాంతత !
బాధలనుండి మనసు సేదతీరినప్పుడు పొందే ప్రశాంతత-
కష్టాలనుండి బయటపడ్డప్పుడు పొందే ఓదార్పు -
ఉల్లాసంగా వీచే గాలి మనసుకు ప్రశాంతి -
ప్రశాంతంగా పారే నది చూస్తే శాంతి -
బోసినవ్వులపసిపాపానవ్వులో ఉల్లాసపు అమాయకత్వం -
ఏఉల్లాసాలు మనిషిని చాలాకాలం జీవింపచేస్తాయో -
ఏఉల్లాసాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయో -
వాటినేకొరుకుంటాడుమనిషి -
మనిషిలో మమకారం నిండినప్పుడు-
సాటిమనుషులమధ్య ప్రేమాభిమానాలు పెరిగినప్పుడు
మానవత్వంతో గుండె పొంగినప్పుడు -
కష్టంలో ఉన్నామనిషిని గుండెవిశాలంచేసుకుని ఆడుకున్నప్పుడు -
పొందుతారు ఉల్లాసం-
అడిమానికిఇస్తుంది ఉల్లాసం-
హిమాలయాలంతాచెల్లాగా -
గ్రీష్మంలో కురిసేవానలా-
శరత్కాలపువెన్నెలలా -
ఘంటసాలపాతాలా -
ఆదిమదిని కదిలిస్తుంది -
కొన్నికోట్లుఇచ్చిన పొందలేంది -
ఎవరూ ఎక్కడాగెలవలేనిది-
హృదయాంతరాలలో నుండి పుట్టేది -
ఎప్పుడూ నిత్యనూతనంగాఉండేది -
ఇదినాస్వీయరచన
భరద్వాజ రావినూతల (RB)✒️
3
[01/12, 8:06 PM] Aparajith: ఉల్లాసం!
తెల్ల తెల్లని గులాబీ పువ్వులు విరిసినట్లు
అందమైన బోసి నవ్వుల పసిపాపలు
విరిసిన పసిమొగ్గల ఆహ్లాదం!
వెండి వెన్నెల్లో ఉల్లాసంగా ఆడుకునే పిల్లలు
కల్లాకపటం ఎరుగని కమనీయ ఆనందం!
ఇంటి ముందర అరుగుపై
అచ్చెండ్లు పచ్చీసు ఆటలు ఆడుకునే అమ్మాయిలు!
దాగుడుమూతల దోబూచులాడుతున్న చందమామ!
ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు తీస్తున్న ఎద్దుల బండి!
విరబూసిన జాజిమల్లెల చుట్టూ తుమ్మెదల ఝుంకారం
జాబిలి ఉల్లాసంగా మబ్బుల మద్య అందంగా పరుగులు!
అందమైన వయ్యారి బామలు సంకల్లో బిందెలతో చెరువుకు పయనం
తెల్లని కొంగలు రెక్కలు విప్పుకుని ఉల్లాసంగా ఎగిరే చందం!
ముద్దబంతి పూలు కొప్పున బెట్టిన ఓ కొంటె కోనంగి
ఒక్కొక్క పూవు రాలుతున్న ట్లు వాన చినుకుల సవ్వడి!
జాజులు పూచే వేలాయె నా చెలి ఇంకా రాదాయే
కనకాంబరాలు పూచినవా ఏవీ ఆ పరిమళాల సరాగాలు!
మకరందాల మేళవింపే తీయ తేనియలు
అందం ఆనందం కలబోతే ఉల్లాసం!
ఆపరాజిత్
4
[01/12, 8:09 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవన జ్యోతి-కవి సమయం*
*********************
*కవితాoశం: ఉల్లాసం*
****************-*****
నిలువెత్తు స్వార్దం నిండిన మనుషుల్లో..!
ఉల్లాసం ఆమడదూరం చేరింది!
కల్మషం నిండిన మర మనషులు..,
కడుపు నిండా నవ్వేoదుకు..,
సైతం భయపడుతున్నారు!!
ఆనందం వారి ఆయుష్షును పెంచుతుందని తెలిసినా...,
ఎక్కడా? దాని జాడ కానరావడం లేదు?
ఏదో? తెలియని వెలతి ప్రతి మనిషిని వేధిస్తూనే ఉన్నది !
అసంతృప్తి జీవనంలోనే
జనం కొట్టుమిట్టాడుతున్నారు!
నిర్లిప్తత, నిర్వీర్యత, మనిషిలో రాజ్యమేలుతుంది?
కోరికలు తోరణాలుగా మసక తెంపరలను కురిపిస్తున్నాయి !
వెరసి..వెరసి.. వారి జీవితం
మసకబారి పోతున్నది !
ప్రతి మనిషిలో..,
కొత్త జీవితాన్ని....,
నూతన పంథాను అలవరచేoదుకై...,
ఆనందపు ఆనవాళ్లను పంచుదాం !
ఉత్సాహంతో ఉల్లాసం పెంచుదాం !!
-పరాంకుశం రఘు నారాయణ
మహబూబాబాద్
5
[01/12, 8:21 PM] +91 74168 63289: కవన జ్యోతి
తేదీ :1/ 12 /20
పేరు :మన్నె పిన్నక లలిత
కవితాంశం: ఉల్లాసం .
శీర్షిక :ఉత్సాహంగా.... ఉల్లాసంగా .
కొత్తగా అమ్మైన తొలిబిడ్డ స్పర్శలో
పసిపాప బోసి నవ్వుల్లో
పసి వయసు కేరింతల్లో
పసిప్రాయపు పలుకుల్లో
యవ్వన సరదాల్లో
విద్యాలయ విద్యార్థినుల ర్యాగింగ్ ల్లో
ఉల్లాసంగా .......ఉత్సాహంగా.....
ఎంత హాయి ఆ జీవితాలు ఉల్లాసంగా ....ఉత్సాహంగా
పండు వెన్నెల రేయి లో గడిపే ఉల్లాసం
ఉదయారుణ కిరణాలలో వేగవంతమైన కారు ప్రయాణం ఉల్లాసంగా...... ఉత్సాహంగా
నందనవనంలాంటి తోటలో మొక్క మొక్కను పరికిస్తూ ,పువ్వు పువ్వును పలుకరిస్తూ నడుస్తుంటే ఉల్లాసంగా .........ఉత్సాహంగా
అంబరం నుండి అవనికి వచ్చే మెరుపు తీగలు
వెన్నంటి వచ్చే వాన చినుకుల వెండి దారాలు ఉల్లాసంగా..... ఉత్సాహంగా
రైతు ఉత్తర చూచి ఎత్తిన గంపను
కాడెద్దుల జోడు బండి ,కాడి పట్టిన సోగ్గాడిని చూస్తే ఎంత ఉల్లాసము ....ఉత్సాహము
కవాతు చేసే సైన్యాన్ని చూస్తే ఎంత ఉల్లాసం ...ఉత్సాహం
బ్రతికిన నాలుగురోజులు ఉల్లాసంగా సంఘ సేవ చేస్తూ
ఉత్సాహం నింపుకొని ముందుకు సాగాలి
[01/12, 8:28 PM] +91 98858 21189: కవనజ్యోతి:
అంశం: ఉల్లాసం
శీర్షిక: హృదయానికి ఔషధం
పేరు: వేదాల ఇందిర
'ఉల్లాసం' చాలా చిన్న మాట సుమండీ కానీ జీవితానికి అది ఒక ఆణిముత్యం అది మానవునికి అత్యంతావశ్యకమైన భావోద్వేగం
దానికి అనుకూల దృక్పథం అత్యంత ఆవశ్యకం
సంతోషం అనేది ఒక ఐచ్చికం దాన్ని ఎన్నుకుంటే అన్నీ మంచి పనులే చేస్తాం అప్పుడు అంతా మంచే
ఉల్లాసం హృదయానికి ఔషధం
నిరుడు కురిసిన హిమసమూహాలు ఈ యేడు కురవలేదని బాధ వద్దు
ఈరోజు బాధ రేపటి నీ శక్తి
మనసు ని ఉల్లాసం గా ఉంచగలిగిన రోజు ఒక అద్భుతమైన రోజు
కృతజ్ఞతలు తెల్పడం అనేది ఉల్లాసానికి మూలం
నీ సంతోషాన్ని రంగులు గామలచి ఈ ధాత్రినంతా వద్దు
హృదయం లో సంతోషానికి కొంత స్ధానం కల్పించు
ఉల్లాసమే నీ జీవన దిక్సూచి
దీపం వెలగాలంటే మంట ప్రధమం బాధలతర్వాతే సంతోషం విలువ తెలుస్తుంది
మానసిక చైతన్యాన్ని వికసింపచేస్తే ఉల్లాసం దానంతటదే లభించింది
మన జీవితాన్ని మనంగా జీవింపచేయాలి
నీ శక్తి కి విలువ వుంది నీ యత్నం ఫలిస్తుంది
నిన్ను నీవు గా పైకి తీసుకు రావాలంటే ఉల్లాసభరిత జీవితాన్ని కొనసాగించటమే ఏకైక మార్గం
నిరాడంబరంజీవితం చక్కని వ్యాయామం ఉల్లాసభరిత జీవితాన్ని అందించగలవు
ఇది నా స్వీయరచన
ధన్యవాదాలు
[01/12, 8:43 PM] Vijayalakshmi Ch KS 38: కవనజ్యోతి
కవితాంశం :ఉల్లాసం
తేది :01-12-2020
పేరు :చెన్నా విజయలక్ష్మి
బీర్కూర్, కామారెడ్డి
శీర్షిక :ఉల్లాసం... పొందాలంటే
*****************************
చిరునవ్వుల చిరుజల్లు వసంతాలు వెదజల్లు
పసిపిల్లల ముద్దు ముద్దు మాటలు వినసొంపైన తీపి ఊటలు
కష్టాలను మరిపించే అమృత ధారలు
ఆవేదనతో నిండిన హృదయకడలి
ఉప్పెనలో తల్లడిల్లిన నావైతే
ఒక ఆత్మీయ స్పర్శ అమృత లేపనమై
తనువెల్ల పులకించిఉల్లాసం కలిగించు
ఇంకా....... స్వార్ధం ఎరుగని మనసులు
ఆపదలో ఆదుకొనే హస్తాలు
తృప్తితో నిండిన జీవనాలు
వెలుగు పంచే వెన్నెల కిరణాలు
నిష్కల్మష హృదయాలు
మసకబారని మమతలు
అలరించే ఆప్యాయతలు
నిజాయితీతో కూడిన వ్యాపారాలు
ప్రజల మేలుకోరే ప్రభుత్వాలు
పేదరికం పోగొట్టే అద్భుత పధకాలు
జ్ఞానాన్ని పెంచే చదువులు
విలువలను పెంచే పెంపకాలు
మంచి..... మంచే..!.. ఎక్కడున్నా
ఎవరికైనా.... కలిగించును... ఉల్లాసం
అలరారును... విశ్వ శాంతి తేజం
హామీ -ఇది నా స్వీయ రచన. ఎట్టి అనువాదం, అనుకరణ కాదు.... చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్, కామారెడ్డి. 🙏
[01/12, 8:44 PM] సునంద ఉరిమిళ్ళ: *కవన జ్యోతి*
తేదీ::01-12-2020
అంశం: ఉల్లాసం
*********************
సాధించిన విజయాలు సంబురాన్ని నింపినప్పుడో
సమస్యలు పరిష్కారమై
సంతోష కెరటాలై ఎగిసినప్పుడో
ప్రకృతి సౌందర్యము
పరవశంలో మునకలేయించినపుడో
పరోపకారం ప్రసంశయై
ముందు నిలిచినపుడో
పసిపిల్లల బోసి నవ్వులు చూసినప్పుడో..
కళ్ళల్లోంచి హృదయంలోకి
పాకే ఆనందం
పెదవులపై ఉల్లాసపు
లాస్యమై మెరుపులీనుతుంది!
ఉత్తేజపు ఊపిరియై ప్రవహిస్తుంది!
మనసు మల్లెల పూదోటై విరుస్తుంది
జగమంతా ఆనంద నిలయమై
కనిపిస్తుంది!
[01/12, 8:48 PM] Gajula Bharati KS 20: కవనజ్యోతి కవిసమయం
****************
అంశం:ఉల్లాసం
శీర్షిక: అంబారానంటే ఆహ్లాదం
తేదీ: 1/12/2020
నా ప్రియసఖి అన్వేషణలో....
రేయి పగలు తెలియక,,క్షణమొక యుగంగా..
రాత్రంతా జాగారంగా
నీకు దూరంగా..
నీ పిలుపుకు అందనంతగా..
నేను,,,నాకే లేనంతగా..
నా..అంతా
నీ ఉనికే చేరినంతగా
నిన్ను..వీక్షించడానికి
చకోరి పక్షిలా..
నిరీక్షించే నాకు..
భళ్ళున తెల్లారినట్టు
ఝల్లున వాన జల్లులో తడిసినట్టు
ఘల్లునా మిలింద రాగం మోగినట్టు..
కాన్వాస్ కుంచెతో..
నా ఎదపై చిత్రించిన..
నా ఊహ సుందరి ప్రత్యక్షం..
కలిగేనులే దివ్య దర్శనం..
ఉవ్వెత్తున ఎగిసే అల
ఉప్పనై..ఉల్లంగ తరంగమై...
ఎగసేగసే నా ఎద...
పరవళ్లతో... ప్రకంపనాలతో...
రేసుగుర్రాలై కాలానికే అందక...
నేలను విడిచి...నింగినంటే ఉద్వేగంతో...
ఉరకలెత్తే ఉత్సాహంతో..
నా తనువంతా...
నా అణువణువంతా.
కలిగేనులే...ఉప్పొంగేలా...."."ఉల్లాసం""!
@@@@@@@@@
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
*******************
పేరు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:ఖమ్మం
చరవాణీ: 9849788108
*******************
[01/12, 8:53 PM] Indravat Rahul Poet Ks 11: *కవన జ్యోతి*
============
అంశం : ఉల్లాసం
తేది : 01/12/2020
*ఉల్లాసం*
పసిపాపకు కావలెను ఉల్లాసం
పెద్దలకు కావలెను ఉల్లాసం
జంతువులకు కావలెను ఉల్లాసం
మనవ సృష్టిలోను
ప్రతి ప్రాణి ఆనందం, ఉల్లాసంతో
నిత్యం జీవించును
జీవితం ఉల్లాసంతో గడుపుతూ
తినడానికి బువ్వ ఉన్నా లేకున్నా ఉల్లాసంతో ఉంటూ
ఇతరులతో స్నేహ భావంబుతో
ఉల్లాసంగా ఉయ్యాలా ఊగుతూ గడిపేయాలి ఈ జీవితం...
*ఇంద్రావత్ రాహుల్*
*కొత్తపేట్*
*నిజామాబాద్*
9848054079..
[01/12, 9:00 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: ఉల్లాసం శీర్షిక
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం
ఉల్లాసం ఉత్తేజాన్నిస్తుంది
మనసుకు ఇంత సంతోషాన్ని ప్రకటిస్తుంది
ఉల్లాసం లేని మనసు ఉ డీలా పడుతుంది
ఉల్లాసం ఉన్నప్పుడే వృదయము పొంగిపోతుంది
ఉల్లాసం ఉన్నప్పుడే హృదయం పదేపదే స్పందిస్తుంది
ఉల్లాసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి సహకరిస్తుంది
ఉల్లాసం కాస్త ఊరట నిస్తుంది
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
[01/12, 9:04 PM] కొలచన విజయ భారతి Poetess: కవన జ్యోతి
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం:ఉల్లాసం
శీర్షిక: ఉల్లాసమే ఊపిరి
తేదీ:1-12-2020
*******************
మనసు ఉల్లాసంగా ఉంటేనే
మనిషికి కులాసా
ప్రకృతి పచ్చని చెట్లతో అలరారుతుంటే
పర్యావరణం కాలుష్య రహితమైన గాలులతో
చల్లగా సాగుతుంటే
వరి కంకులు బరువుతో
పచ్చని పైరులు నిండుగ
నవ్వుతున్న పంటపొలాలు
చేలగట్లపై పరుగులు తీస్తుంటే
గున్నమావి గుబురులలో దాగిన కోయిలమ్మ రాగాలకు
వంత కలిపి కూనిరాగాలు తీస్తుంటే
సన్నజాజి విరులన్నిటినీ
ఒడినింపుకుని ఆడిపాడి వనమంతా సందడి చేస్తుంటే
ఆ ఉల్లాసపు ఉత్సాహమే
అలవికాని ఆనందం
☘️🌹☘️🌹☘️
[01/12, 9:07 PM] Korada: కవనజ్యోతి
అంశం :- ఉల్లాసం
కోరాడ నరసింహా రావు!
"ఉత్సాహపు ఉరకలే"
**************
హృదయానందం....ఉత్సాహపువిందునాస్వాదించి....,ఉల్లాసపుఉరుకులతో....విజయతీరాల వెంట పరుగులుతీస్తుంటే
అలుపు - సొలుపు..... తెలియదుగా...!
నిరాసెప్పుడూ......నరకప్రా యమే....!!
ఉత్సాహమేకదా స్వర్గ ధామం!
మనం మనుషులం....,
ఆశా జీవులం....!
నేటికి లేకున్నా....రేపు పొందగలమన్న నమ్మకంతో...
ఆశతో...బ్రతికేటోళ్లం....!!
మనకి తప్పనిసరిగా..... ఉండాల్సింది ఉత్సాహం...
ఉల్లాసం....!!వ్యతిరేకస్పందనలను దరికి
రానీయక....అన్నివిషయాలలో
క్రీడా స్పూర్తితో...ముందుకు
ఉత్సాహంతో...ఉల్లాసంగా...
సాగిపోవలసిందే..!!
******************
.....కోరాడ.
[01/12, 9:17 PM] +91 89196 96972: కవన జ్యోతి
అంశం:ఉల్లాసం
శీర్షిక: చిరు ఆనంద నర్తనం
పేరు :సుమనప్రణవ్
మౌనమైన మనసు లోగిలిలో
చిగురాకు కదలికలా
ఆనాటి గుర్తు చిరునవ్వుల మధుమాసం
చీకటేలు రాతిరిలో
నిట్టూర్పుల నిరాశలలో
నమ్మకమేదో తారకయన సంతోషం
మంచు కురియు వేకువలో
మసక రహదారి మలుపులలో
చేతిలోన బాస చేయు దిశా నిర్దేశం
కానరాని తీరాలలో
కత్తులిసిరే కాలాలలో
నేనున్నానులే పద పదమనే స్పూర్తి గీత ఉపదేశం
ఒక గళం
ఒక పాదం
ఒక ధరహాసం
ఒక తూరుపు కిరణం
ఒక చెలిమి కరం
ఒక స్వప్నం
ఒక ఆనంద బాష్పం
మదిలో మాయని ఉల్లాసం
✍️✍️✍️సుమనప్రణవ్
[01/12, 9:20 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి
అంశం: ఉల్లాసం
కేసి నరసయ్య
7981814784
శీర్షిక:
ఉల్లాసం ఉత్సాహం
జీవితం ఆనందమయం
కష్టం సుఖం
జీవితంలో ఒడిదుడుకులు
పడి లేస్తున్న కెరటం
గమ్యం కోసం గమనాలు
లక్ష్య సాధన కోసం
నిరంతర పోరాటాలు
యుద్ధాలు అంతర్యుద్ధాలు
గెలుపోటములపై సాహసం
సూర్య చంద్రుల రాకపోకలు
చీకటి వెలుగులలో జీవన పోరాటం
ఆనందంలో ఉల్లాసం
దుఃఖంలో కడతేరని నిరుత్సాహం
[01/12, 9:29 PM] Dhanasi Usha Rani Poetess: కవన జ్యోతి
పేరు. ధనాశి ఉషారాణి
అంశం: ఉల్లాసము
......
పరిగెత్తే కాలానికి సంకెళ్లు వేసి
బతుకుపోరులో నిజమైన గెలుపు పోరాటానికి
నిజమైన జీవము పొసే ఔషదం
నూతన ఆవిష్కరణతోను
విజయకేతం ఎగురవేసి నిజమైనట్టి ఉత్తేజము
జీవము పోసేను ఆత్మీయ అనురాగములకు వెలుగుదీపమై
జీవన పోరాటంలో జీవితమును నడుపు
నిలువెత్తు కొండగా నిలిచి
మనోధైర్యం నిచ్చేను నిండు నూరేళ్లుగాను
బతకాలని కసిని పెంచి శత్రువులను ఎదురించే ఆయుధo
హామీ పత్రము.ఇది సొంత కవిత అని హామీ ఇస్తున్నాను
Comments
Post a Comment