తోబుట్టువులు feb9/2021
నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ
న్యాయ నిర్ణేత ః శ్రీ కాంత్ కడార్ల గారు
:::::::::::::
కవి వరుల జాబితా
1.డా.బల్లూరి ఉమాదేవి గారు
2.సుధారాణి కృష్ణం రాజు గారు
3.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
4.భరద్వాజ గారు
5.డా.బల్లూరి ఉమాదేవి గారు
6. చేతి నాగ లక్ష్మి గారు
7.కోరాడ నరసింహారావు గారు
8.కొలచన విజయ భారతి గారు
9.భూపతి గారు
10. వేదాల ఇందిర గారు
11.పరాంకుశం రఘు నారాయణ గారు
12.మన్నె పిన్నక లలిత గారు
13. ధనాశి ఉషారాణి గారు
14.మిట్టా లక్ష్మి గారు
15. కె.సి. నరసయ్య గారు
16. YK సంధ్యా శర్మ గారు
17.సునంద వురిమళ్ళ గారు
***********
[09/02, 4:37 PM] శ్రీకాంత్ కడార్ల Poet:
*🪔కవన జ్యోత
తేది : ౦౯-౦౨-౨౦౨౧
వారం: మంగళవారం
*అంశం*: *తోబుట్టువులు*
అమ్మ కడుపులో ఒకరివెంట
ఒకరొమొచ్చి
ఆమె గోరుముద్దల్ని ఒకరి వెనక ఒకరం తిని
నాన్న చేతిలో చేయివేసి
భుజాలపై తిష్ఠవేసి
దేన్నైనా
హక్కుగా పంచుకున్న అందమైన అల్లికలు తోబుట్టువులు...
నాది అన్నదానికి పునాదిరాయి
మనది అన్న స్వార్థానికి వేసిన మైలురాయి
తోబుట్టువు....
జీవితాంతం నీడగా ఉండే అందమైన బంధం
మేమున్నాం అనే గొప్ప భరోసా బంధం
అన్న తమ్ముడు
అక్క చెల్లి
అన్న చెల్లి
అక్క తమ్ముడూ.... ఈ పిలుపులో గాఢత కమ్మగా ఉంటుంది
రుచికోల్పుకూడదు
అమ్మ నాన్నకు కావాల్సిన సంతోషం అదే...
కవనసుమములైన మీరు ఆరని ఈ కవనజ్యోతిలో
వీడని బంధమైన తోబుట్టువులు పై మీ ప్రేమని తోడివ్వండి🙏🙏🙏🙏
1.
[09/02, 5:25 PM] Balloori Umadevi Poetess: 9/2/21
కవన జ్యోతి
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అంశం:తోబుట్టువులు
ఆ.వె:ఒక్క తల్లి రుధిర మొప్పుగా పంచుకు
నాట పాట లందు ననవరతము
తిరుగు చుందురుగద తేడాలు లేకుండ
ఆత్మబంధ మన్న నవని నిదియె.
ఆ.వె:కష్ట కాలమందు కాపాడు కొనుచును
తోడబుట్టువులిల నీడ గాను
కలిమి లేము లందు కలసి మెలసి యుంద్రు
కయ్యమాడ బోరు కలను నైన.
ఆ.వె:చిన్నతనము నందు చిలిపి పనులు చేసి
అన్నమీద నెపము లన్ని వేసి
అమ్మ కొట్ట బోవ నాపు చేయుచు నుండు
నదియె ప్రేమబంధ మౌను గనుము.
అమ్మ రక్తము పంచుకు నన్యు లట్లు
పుట్టి పెరిగి పెద్దలవగ బుద్ధి తరిగి
యీర్ష్య తోడపరస్పర మిలను తాము
స్వార్థ బుద్ధిని బూనుచు సాగు చుంద్రు.
.తే.గీ::అమ్మ రక్తము పంచుకు నవని యందు
పుట్టి పెరిగి పెద్దలవగ బుద్ధి తరిగి
యీర్ష్య తోడపరస్పరమిర్వు రెపుడు
స్వార్థ బుద్ధిని బూనుచు సాగు చుండ్రు.
.ఆ.వె:అన్నదమ్ములున్న నాయిల్లె నాకమౌ
పెద్దవార లవగ ప్రేమ తరిగి
ఆస్తి కొరకు వారు నాగడములు చేసి
బ్రతుకు చుందురయ్య వసుధ యందు.
2
[09/02, 8:12 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*తోబుట్టువులు*
09-02-2021(మంగళవారం)
అన్ని బంధాల కన్నా మించిన
బంధం రక్త సంబంధం అన్న తమ్ముడు అక్క చెల్లి తో ఏర్పడిన బంధాలు , అనుబంధాలు, ఆత్మీయత, అనురాగాల సమ్మేళనం
తోబుట్టువులు.
ఒక కొమ్మకు పూసిన పూవులు గా అమ్మ ఒడి లో ఎదిగి ఒదిగి
పోయి చిన్న తనం లో చిలిపి చేష్టలు అల్లరి పనులు ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పి
అమ్మ నాన్న లు దండించి నప్పుడు ప్రేమ తో కూడిన ప్రతీకారం రాను రాను వారిలో
మమకారం అనే అనురాగం తో
పెంచుకున్న అధికారం ఇంటికి
పెద్ద గా ఒక అన్నయ్య తన చెల్లెలిపై చెలాయిస్తే
ఒక చెల్లెలు అన్నయ్యమీద ప్రేమానురాగాలతో కూడిన
పెత్తనం తో అన్నయ్య తనకు మాత్రమే అనురాగం పంచాలని
అమ్మ నాన్న తో చెప్పుకోలేని అన్ని విషయాలు అన్నకు చెప్పుకుని సేద తీరుతుంది
రక్త సంబంధం తోబుట్టువులను
ఎంత దూరం లోఉన్నాఏకష్టం కలిగిన అక్కున చేర్చుకుని ఆదరించేవారు తోబుట్టువులు
మమతల మకరందాలను పంచే గొప్ప బంధం తోబుట్టువులు
ఎప్పుడూ తమ తోబుట్టువులు
సంతోషంగా ఉండాలని ఆడపడుచు కష్టాన్ని సహించలేని సోదరులు తమ ఇంటి రూపం మరో ఇంటికి వెలుగులు పంచిన వారు ఎప్పుడు కష్టపడకుండా తమ ఇంటి మహాలక్ష్మి ని మరో ఇంటికి పంపుతున్నప్పుడు
అమ్మ నాన్న లతో పాటు అన్నయ్య తమ్ముడు కళ్ళలో నుండి భావోద్వేగం తో కూడిన
ఆనందభాష్పాలు కురిపిస్తారు
ఆడపిల్లలు ఎప్పుడూ "ఆడ పిల్లే "కాని ఈడ పిల్ల కాదని తెలిసినా తమ ఇంటి పరువు
ప్రతిష్టను కాపాడే తోబుట్టువులు పిల్ల పాపలతో
చల్లగా ఉండాలని ఏకష్టం వచ్చిన తాము ఉన్నామన్న
మనో ధైర్యాన్ని కలిగించే వారు
తోబుట్టువులు
ఆడపిల్లలు తమ అన్నయ్య తమ్ముడు చల్లగా ఉండాలని
రక్ష బంధనం తో శ్రీరామ రక్ష గా
సొదరులకు సంతోషం లోను
బాధలోను చల్లని నీడనిచ్చె
అమృత ఫలాలు అమ్మ తరువాత అమ్మగా ఆప్యాయత ఆదరాభిమానాలు
పంచి పుట్టింటికి మెట్టినింటికి
వన్నె తెచ్చేవారు తోబుట్టువులు🙏👍
3
[09/02, 8:19 PM] భరద్వాజ గారు: 🦚🚹కవనజ్యోతి ♈☂️
పేరు-భరద్వాజరావినూతల
ఊరు -కొత్తపట్నం
9866203795
రచన- 50
09-02-21
అంశం-తోబుట్టువులు
శీర్షిక - -మనసునింపే మమకారం !
@@@ @@@@@ @@@@@@ @@@@@
&&&&&&&&&&&&&&&&&&&&&&
తోబుట్టువులు -
మనతోటి సహజన్ములు -
మనరక్తానికి సహజాతులు -
ఓకేచెట్టుకు పుట్టిన ఫలాలు -
ఒకే తీ గకుపూసినపువ్వులు -
ఒకతల్లిపాలను పంచుకున్న ఆప్యాయతలు -
వయసుతేడాఉండవచ్చు -
లింగబేధాలు కలగవచ్చు -
మమకారాలలో మార్పుండదు -
వయసుతేడా అయినా
మమకారం ఒక్కటిగా -
ప్రేమలు జతగా -
ఆప్యాయతల దీపాలివెలిగిస్తూ పెరిగేటి బంధం
అన్నైనా అక్కైనా చెళ్లియినా తమ్ముడయినా అందరూ ఆఇంటిపూవులే -
ఆ వంశపు పారిజాతాలు -
కష్టంలో సుఖంలో నడుస్తారు ఒక్కటిగా -
అమ్మలేనిబిడ్డలకు అక్కే పెద్ద -
నాన్న లేని పిల్లలకు అన్నే ఆఇంటికి పెద్ద
రక్షాబంధనాలు పెంచుతాయిప్రేమలు -
రక్షణగానిలిచే తోబుట్టువులు అందిస్తారు అనురాగపు దీవెనలు -
ఈర్ష ద్వేషాలు లేని వీరి అనురాగం -
ఆబంధమే ఒకతమ్ముని అడవులకు తీసుకెళ్లింది -
ఒకతమ్ముని పాదుకలు మోసేలా చేసింది -
అన్నతప్పుకు బాధ్యతవహించి అరణ్యవాసాలుచేసింది -
అమ్మఅప్యాయతలముద్దలరుచిచూసిన
యేతోబుట్టువు -మరచిపోదు బంధాలు -
వదిలిపెట్టదు అనురాగాలు -
కాలముమారింది -
బందాలు బరువయ్యాయి
ఆప్యాయతలు కరువయ్యాయి -
తోడపుట్టినవారే కాదు -
ఆప్యాయంగా మాట్లాడే ప్రతి ఆడది తోబుట్టువుగాభావించవచ్చు -
అనురాగం గామాట్లాడే అందరిలో అన్నదమ్ములనుచూసుకోవచ్చు -
భారతీయులందరూ నాసహోదరులూ అనిగుర్తుపెట్టుకుంటే
రావు ఏరాగద్వేషాలు -తగాదాల యూద్దాలు
%%%%%%%%%%%%%%%%
ఇదినాస్వీయరచన
✍️భరద్వాజ రావినూతల (RB)🖍️
4
[09/02, 8:21 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: తోబుట్టువులు
తోబుట్టువులు అంటే రక్తసంబంధీకులు
అనుబంధం జన్మ జన్మల బంధం ఏడేడు జన్మల నుండి పెనవేసుకున్న ఆత్మీయబంధం
చెల్లెళ్లతో అన్నదమ్ములతో అక్కలతో చిరకాలం నిలిచిపోయే బంధమిది
విషాదాల ఆనందాలలో తప్పనిసరిగా కుటుంబ పండుగ సంబరాలలో
చెరగని తరగని అనుబంధం ఇది జనన మరణాలు
అన్ని కార్యక్రమాలలో అందరూ పాలుపంచుకొని పరిస్థితి ఉంటుంది
అందుకే ఓకే అమ్మ తో ఉండే అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయమైనది
నవమాసాలు మోసి ఆప్యాయత ఆదరాభిమానాలు పంచి అటు తండ్రి వైపు వారికి ఇటు తల్లి వైపు వారికి వన్నె చిన్నెలు
అందించేది
ఇంటి పెద్ద అ సోదరులు మాత్రమే
రక్షాబంధన్ ఆలు
గా ఉంటాడు
అనుబంధం అపురూపం అన్న తమ్ముల కథ ఒకటి
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453
50
[09/02, 8:23 PM] Balloori Umadevi Poetess: 9/2/21
కవన జ్యోతి
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అంశం:తోబుట్టువులు
ఆ.వె:ఒక్క తల్లి రుధిర మొప్పుగా పంచుకు
నాట పాట లందు ననవరతము
తిరుగు చుందురుగద తేడాలు లేకుండ
ఆత్మబంధ మన్న నవని నిదియె.
ఆ.వె:కష్ట కాలమందు కాపాడు కొనుచును
తోడబుట్టువులిల నీడ గాను
కలిమి లేము లందు కలసి మెలసి యుంద్రు
కయ్యమాడ బోరు కలను నైన.
ఆ.వె:చిన్నతనము నందు చిలిపి పనులు చేసి
అన్నమీద నెపము లన్ని వేసి
అమ్మ కొట్ట బోవ నాపు చేయుచు నుండు
నదియె ప్రేమబంధ మౌను గనుము.
అమ్మ రక్తము పంచుకు నన్యు లట్లు
పుట్టి పెరిగి పెద్దలవగ బుద్ధి తరిగి
యీర్ష్య తోడపరస్పర మిలను తాము
స్వార్థ బుద్ధిని బూనుచు సాగు చుంద్రు.
.తే.గీ::అమ్మ రక్తము పంచుకు నవని యందు
పుట్టి పెరిగి పెద్దలవగ బుద్ధి తరిగి
యీర్ష్య తోడపరస్పరమిర్వు రెపుడు
స్వార్థ బుద్ధిని బూనుచు సాగు చుండ్రు.
.ఆ.వె:అన్నదమ్ములున్న నాయిల్లె నాకమౌ
పెద్దవార లవగ ప్రేమ తరిగి
ఆస్తి కొరకు వారు నాగడములు చేసి
బ్రతుకు చుందురయ్య వసుధ యందు.
6
[09/02, 8:26 PM] Korada: కవనజ్యోతి
అంశం :- * తోబుట్టువులు *
కోరాడ నరసింహా రావు....!
* కాదంటారా....!? *
************
ఓకే తల్లి కడుపున... ఓకే
రక్తాన్ని పంచుకు పుట్టిన...
అన్నాచేల్లేళ్ళు...అక్కా,
తమ్ముళ్ళ అనుబంధం...
ఆప్యాయత ...ప్రేమాభి మానాలూ... అనిర్వచనీయ0!
అవి.. అనుభవించి... అనుభూతించి...
ఆనందించవలసిందే...!
ఆ భావాలను విశద పరచగల
భాష లేదు....!!
చిన్నపుడన్తా...యేన్నేన్ని
గిల్లికజ్జాలూ... వాటాలు...
కోట్టుకుతగవులాడు కున్నా..,
అన్న నేవరేమన్నా... చేల్లి మనసు తట్టుకోగలదా...!
చేల్లివైపు యేవరు వేకిలి చూపు
చూసినా అన్నదమ్ములు సహించగలరా....!?
ఆడ పిల్లకు పేళ్ళై...
అత్తారింటికి వేళ్ళి పోయినా...
అన్నదమ్ముల పై ప్రేమాభి మానాలు పడింతలు పేరుగు
తాయే గానీ... వీసమంతేతైనా
తరుగు తాయా...!!
అన్నదమ్ముల క్షేమం కోసం...
అక్క, చేల్లేల్లు....తోబుట్టువుల
ఆనందం కోసం పరితపించ లేక
పోతే.... వారు సహజాత లేలా
కాగలరు...!
అన్నదమ్ములోస్తే...సోదరీమణులకు పండగే...!వారి మోములు
సహస్రదళ కమలాలై వికసిస్తై! బాల్యపు తీపి తలపుల గత స్మ్రుతులు గిలిగింతలు పేడతై!
వివాహాలై...యేవరికి వారున్నా
ఆ ఆనందాన్ని యేడాది కోకటి
రేండు మార్లైనా పన్చుకోటానికే
అన్నదమ్ములు... అక్కచేల్లేల్ల
యిల్లకు వేళ్ళి... రక్షా బంధనలు కట్టిన్చుకుని..., కట్న
కానుకలతో వారిని ఆనందిమ్ప
జేస్తూ... తామూ ఆనందించ టమ్లో...యేంత త్రుప్తి...!!
భగినీ చేతి భోజనానికని...
అన్నదమ్ములు వస్తున్నారన్టే
ఆ అక్క, చేల్లేల్లు వన్డేవి కేవలం
వంటలు... వడ్డిన్చేవి పదార్ఢాలేనా...!!
ప్రేమానురాగాల వంటలు...
ఆప్యాతాభిమానాల వడ్డనలు
కదూ...!
తోబుట్టువుల వైసిష్త్యతకు...
మన భారతీయతను మించిన దేమున్నదీ ప్రపంచంలో...!?
యిక్కడ పుట్టటం నిజంగా..
మన జన్మ... జన్మల పుణ్య ఫలమే కదూ...! కాదంటారా!?
******************
......కోరాడ.
7
[09/02, 8:48 PM] కొలచన విజయ భారతి Poetess: "కవన జ్యోతి"
పేరు: కొలచన విజయ భారతి
ఊరు: హైదరాబాద్
అంశం: తోబుట్టువులు
శీర్షిక:ఒకే పేగు పంచుకున్న అనుబంధాలు
తేదీ:9-2-2021
**********************
ఒకే పేగు పాశమై
ఒకే ప్రేమ బంధమై
అనురాగాలు, ఆప్యాయతలు
కలబోసి పంచుకున్న
ఒకే గూటి గువ్వలు
అన్న దమ్ములైనా, అక్కాచెల్లెళ్ళైనా
ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు
పెంచుకొని
ఒకరి కష్టసుఖాలలో
ఒకరు పాలుపంచుకుని
వసుధైక కుటుంబానికి
జీవం పోస్తేనే
అర్థం పరమార్థం
నేటి జీవన శైలిలో
కుటుంబమే పరిమిత
కుటుంబమై పోయింది
తోబుట్టువుల మధ్య
బంధాలు కురచైపోయాయి
రక్త సంబంధాలు పలుచనైపోయాయి
ఎవరికి వారే యమునా తీరే
అన్న చందాన అయిపోయింది
సమాజం
అటువంటి సమాజాన్ని
స్వాగతించవద్దు
కన్న పేగు బంధాలను కూల్చుకుంటూ పోవద్దు
🌺🌺🌺🌺🌺
8
[09/02, 8:50 PM] Nagalaxmi Poetess Ks 43: కవన జ్యోతి
శీర్షిక. తోబుట్టువులు
🌿🌿🌿🌿🌿🌿🌿
అమ్మ జన్మనిచ్చింది మొదలు
పెనవేసుకున్న ఆత్మబంధం రక్తసంబంధం.
సోదర, సోదరి సొంత బంధం.
ప్రేమలతో చిలిపి అల్లర్లతో
చిన్ననాటి ఎన్నో ఆప్యాయత అనుభూతులను
ఆనందంగా, సరదాగా పెనవేసుకున్న బంధం
చెట్టుకి వెర్లల భూమి లోతుల నుండి బలంగా
దృఢంగా నాతో నన్నే అంటిపెట్టుకుని
నా వాళ్ళు నా సొంత వాళ్ళు అని
సంతోషం లోనైనా, విషాదం లో నైనా
బాధ లోనైనా మొదటగా చెప్పుకునే
మన తోబుట్టువులు మన తోడబుట్టిన
మన నీడ తోడు లు వారే
అమ్మ లా ఆప్యాయతగా చూసి మా అక్క.
నాన్నలా బాధ్యతగా భరోసా ఇచ్చే మా అన్నయ్య.
నాపై ఎనలేని ఆప్యాయత చూపించే నా చెల్లి.
నేనే సర్వస్వం అని భావించే నా తమ్ముడు.
ఉన్నంతకాలం నేనే అందరికంటే అదృష్టవంతురాలిని.
ఆ దేవుడు మాత్రమే నిర్ణయించగల
తోబుట్టువుల బంధం.
ఓకే కొమ్మకు పూసిన అందమైన బాంధవ్యం.
ఎంత దూరంలో ఉన్నా తీయని పలకరింపుతో
పరవశించే అపురూప బంధం
అన్నా, చెల్లెలి, అక్క, తమ్ముడు రక్తసంబంధం.
ఈ కవితా నా స్వీయ రచన
బేతి. నాగలక్ష్మి.
ఆలేరు .
ధన్యవాదములు 🙏
9
[09/02, 8:51 PM] Bupathi Sir: ......కవన జ్యోతి....
పెరు...ఏ భూపతి..
ఊరు...హైదరాబాద్..
9989218154..
అంశం... తోబుట్టువులు
శీర్షిక......కాలం ఏమౌనో...
.......... ..........
తల్లిదండ్రులు ఊసులు ప్రతి
రూపాలు పిల్లలు... వారి
ఊహల నిలయాలు పిల్లలు ,
పిల్లలెందరున్న ,తల్లికి బరువే లేదు ,వారి మధ్య పెరిగే ప్రేమ
ను ,చూసి సమాజం అబ్బుర
పడేలా ఉంటే ఆ తోబుట్టువులు ఆదర్శ కుటుంబమే.. సోదరీ ,సోదరులు జ్ఞాపకాలు
వచ్చినది మొదలు ,చివరి శ్వాస వరకు ఒకరి పై ఒకరు
పేమను పలికించుకొని ,ఏ
వయసుకావయసు లో ,గిల్లి
కజ్జాలు,కొట్టుకోవడాలు ,అమ్మ నాన్న తో తిట్లు ,దెబ్బలు ,ఏడుపులు ,చాడీలు ఇవి అన్ని చిన్న వయసులో షరా మాములే...
వయసు పెరిగి ,మనసు ఎదిగి ,
ఒకరి పై ,ఒకరికి ,అసూయ,ద్వేషం ,
స్వార్ధం ,చోటు చేసు కుంటే ఇక
ఆ తోబుట్టువుల కు బందు వర్గంలో చిన్న చూపే....
కానీ అందరూ ఒకటి గా ఒకమాట పై సాగితే ఆ కుటుంబాలు ఆదర్శ ,ఐక్య
నిలయాలే.... అవి అధ్భుత
దేవాలయా లే... కాలం ఏమౌనో....
ఈ కవిత నా సొంతం..
10
[09/02, 8:53 PM] +91 98858 21189:
కవనజ్యోతి:
అంశం: తోబుట్టువులు
శీర్షిక: రక్త సంబంధం
పేరు: వేదాల ఇందిర
కుటుంబ వ్యవస్థ లో తల్లి దండ్రుల నీడలో తోబుట్టువులంతా అనురాగతరంగిత హృదయులై ఆనందమయ జీవనం గడుపుతుంటారు ముఖ్యంగా భారత దేశంలో
పాపం పుణ్యం కష్టం సౌఖ్యం తేడా తెలియక వారికున్న దేదైనా సమానంగా పంచుకుని ఆనందంగా ఆటల పాటలతో గడిపేస్తారు తోబుట్టువులు వారి బాల్యాన్ని
దక్షిణాదిన దీపావళి అనంతరం వచ్చే విదియ నాడు యమద్వతీయ అని భగినీహస్తభోజనం అనే పేర్లతో సోదరి తన సోదరుడిని ఇంటికి ఆహ్వానించి విందు భోజనం పెట్టడం ఆనవాయితీ ఆరోజు ఆ యిద్దరు యముడిచే ఆయురారోగ్యాలు పొందేలా ఆశీర్వదింపబడతారని ప్రతీతి ఉత్తరాదివారు కూడా ఆ రోజు ని భాయిదూఙ్ అనే పేరుతో ఘనంగా జరుపుకుంటున్నారు రాఖీ పండగ గొప్ప తనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ పండుగలు తోబుట్టువుల మధ్య అనురాగం ఎంత లాభదాయకమో ఉద్ఘాటిస్తున్నాయి
అఖిల బాధలకోర్చి పెంచి పెద్దవాళ్ళను జేయునంతవరకే తలిదండ్రులు ఆతరువాత వారి సంగతే పట్టదు ఈ కాలపు వారి సంతానానికి అందుకే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదంటారు
లోకంలో ఆడపడుచులు మరుదుల కన్నా ఆత్మ బంధువు లు ఉండరంటారు అనగా భర్త తోబుట్టువులు కూడా స్త్రీలకి ఎంత దగ్గరో భారత సంస్కృతి చెప్పకనే చెబుతోంది
కానీ ఈరోజు ఎవరి పనుల్లో వారు ఎవరి తొందరలో వారు ఒకరినొకరు పట్టకుండా స్మరించకుండా జీవితాలు గడిపేస్తున్నారు
కుటుంబ సభ్యులు తోబుట్టువుల ఐక్యమత్యమే ఆనందమయిన ఆరోగ్యదాయకమైన సమాజానికి పునాది
ఇది నా స్వీయరచన
ధన్యవాదాలు
11
[09/02, 9:19 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవనజ్యోతి*
అంశం :తోబుట్టువులు
*కవితా శీర్షిక :తోబుట్టువుల వైశిష్ట్యం*
ఒకే తల్లి తండ్రి పిల్లలు!
రక్త సంబంధాన్ని పంచుకొన్న నెలవులు !
ఆప్యాయతానురాగాలు పంచే పరిమళాలు !
అనుబంధానికి సరైన నిర్వచనాలు!
సృష్టిలో శాశ్వత తీపిగుర్తులు!
మమతానురాగాలు విరబూసే పూలతోటలు!
కష్టాల్లో నష్టాల్లో సుఖదుఃఖాల్లో..,
నిత్యం తోడుగా నడిచే!
జీవిత చరమాంకం వరకు సపర్యలు చేసే!
అనుబంధ భాoధవ్యాల ప్రియ నేస్తాలు!
అమ్మానాన్నల కీర్తి పతాకలు!
ఆలనా పాలన లోనూ,
బాధ్యతాయుత వ్యక్తులు!
నిస్వార్థ జీవనానికి నిలువుటద్దాలు !
కుటుంబ బాంధవ్యాలలో పరమోన్నతులు!
వారే వారే..మన తోబుట్టువులు !1
పరాoకుశం రఘు నారాయణ మహబూబాబాద్
12
[09/02, 9:21 PM] +91 74168 63289: కవన జ్యోతి
తేది :9 /2 /21
అంశం :తోబుట్టువులు
రచన : మన్నె పిన్నక లలిత
హైదరాబాద్.
శీర్షిక :ఐకమత్యంతో...
***************************************
అమ్మ నాన్న అమృత వంశవృక్షానికి
పూసిన పువ్వులం
ఏకోదర సంజాతులం
రక్త బంధాన్ని అక్క చెల్లెళ్ళనే ప్రేమబంధంగా
చెప్పిన అమ్మ
అమ్మ రక్త బంధంతో పాటు
ప్రేమ బంధాన్ని పెనవేసుకున్న అపూర్వ తోబుట్టువులం
ఎక్కువ తక్కువ భేదాలు లేని వాళ్ళం
అమ్మ నాన్న ల మాట జవదాటని వాళ్ళం
''చిన్ని 'చిట్టి 'కలహాలున్నా పాలు నీళ్ళలా కలిసేవాళ్ళం
' బుజ్జి 'బుజ్జి చేతులతో తాయాలు పంచుకునే వాళ్ళం
దాచుకున్న తాయాన్ని తినకు 'బాబు' అనేవాళ్ళం
పసి'పాప'ల మై పండు వెన్నెలలో ఆటలాడే వాళ్ళం
ఒక్కగానొక్క నా తమ్ముడు
మా నలుగురితో కలిసి ఆడిన
అచ్చం గాయలు ,తొక్కుడు బిళ్ళ , పాచికలాట, గవ్వలాట ,
నేలా బండ ఎలా మరువగలను?
నాన్న చేతి నేతిగోరుముద్దలు
అమ్మ ఆప్యాయతానురాగాలు ,సంగీత శ్రవణాలు
అమ్మ ,అమ్మమ్మల చదువుపై శ్రద్ధ
లేజీి లేకుండా పీజీల వరకుా చదివినా
అమ్మ నాన్నల క్రమశిక్షణతో
సంఘంలో ఉన్నత స్థానంలో నిలబెట్టినా
ఇసుమంత ఈర్ష్య లేక
పెళ్లిళ్లయి పిల్లలు మనుమలు మనుమరాళ్ళు వచ్చినా
మా స్థానం తరగని నిధి
చేతికి వెళ్ళలా తోబుట్టువులు నలుగురు మధ్య
ఒక్కగానొక్కడు చేతికి బొటనవేలు లా
ఆ బొటనవేలు లేని చేయి
రోజుా రుధిరాశ్రువులు కారుస్తోంది
నాలుగు అంగుళీయకములు
అంగిట్లో దుఃఖాన్ని మింగి
రుధిరాశ్రువులు తుడుస్తున్నాయి.
('......'ఉన్నవి మా ముద్దు పేర్లు)
13
[09/02, 9:25 PM] +91 70755 17538: శీర్షిక.తోబుట్టువు
.....
అందమైన లోగిలి
బంధాలకు హరివిల్లు
మమతలు విరబూసేను
సమతలు నిత్యము నిలిచేను
కోటి వెలుగుల సంతోషము నిచ్చి
బంధాలు పెనవేసుకోని
అనుబంధాలుతో వీరభూసేటి
అనుభూతుల లోగిలిగా
అమ్మా నాన్నల మమతలకు
నిత్యము వారధిగా
మదిని మురిపించేను
భవితను దిద్దును
కష్టములను దాటించి
ఓదార్పును ఇస్తూనే
ఎన్ని రోజులుకైనా
చెరిగిపోని స్థానాలకు నిలయం
శుభకార్యాలకు ముందుండి
రాఖీ కట్టినాను
కన్నీరు తుడిచి
పుట్టింటి కోసము
నిత్యము తపించినాను
అది వన్నెతగ్గని నాన్న ప్రేమకు
నిత్యము నిలువెత్తు కొండగా
నిలిచే ఏకైక బంధమ
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
14
[09/02, 9:28 PM] +91 94400 97002: కవన జ్యోతి
9/2/2021
అంశం: తోబుట్టువులు
..............................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి: 9440097002
..................................
శీర్షిక: అనుబంధాల స్రవంతి
...................................
ఒక కడుపున పుట్టి
ఒక గూటిలో పెరిగి
అనురాగ లతలతో
అల్లిబిల్లిగా అల్లుకుని
ఆటలు పాటలు
చదువులు ... అభిరుచులు
అన్నింటిలో ఒకరికొకరైన
తోబుట్టువులు...
"దేవుడు అన్నితావులలో
తాను ఉండలేక
అమ్మను సృష్టించాడు"అంటారు
అమ్మ కలకాలమూ
మనతోనే ఉండలేదు
కనుక అక్కాచెల్లెళ్లు
అన్నదమ్ముల ను
ఇచ్చింది..మనకు
అమ్మతనాన్ని , అనుబంధాన్ని
కొనసాగింపజేసింది
అమ్మతనం అక్కాచెల్లెళ్లు
అన్నదమ్ముల కు
బదిలీ చేసింది...
ఒక్కమాటలో చెప్పాలంటే
రిలే పరుగులాగా
రిలే జ్యోతి లాగా
రిలే అమ్మతనం
అక్కాచెల్లెళ్లు
అన్నదమ్ములు..
అమ్మ లోని" అ"కారము
నాన్న లోని "న్న"కారము
కలుపుకుని ,రక్త బంధం
తో పాటు అనుబంధాల
"అన్న"అయినాడు....
అన్నీ తానయినాడు...
అమ్మ మమకారం
నాన్న అధికారం
కలగలిసి చిన్నప్పుడే
పెద్దగా భావించే
చిన్న పెద్దమనిషి ...అన్నయ్య
పెద్ద మనసుగల అన్నయ్య
అమ్మానాన్నల ఆత్మీయతా
అనుబంధాలను కొనసాగించే
ప్రతినిధి ...మన నిధి
వెనుక వెనుకే తిరుగుతూ
అన్నింటినీ పంచుకుంటూ
చెల్లి .. తమ్ముడు....
ఈ అదృష్టం ఈ జన్మకే
తరువాత
ఎవరికి ఎవరో.....
ఇప్పుడు మాత్రం
ఎవరికివారే యమునా తీరే
తీరు వద్దు...వద్దు...
రక్షాబంధనం...
భగినీ హస్త భోజనం....
అనుబంధాలను
ముడివేసి ఒకరి క్షేమం
కోసం ఒకరు తపిస్తూ
కలుస్తూ ...కలబోసుకుంటూ
తలపోసుకుంటూ
సాగిపోదాం...
ఎవరైనా తీసుకుపోయే ది
ఏముంది గనుక....
మనము అమ్మానాన్నల
అనురాగ ఫలాలం
పువ్వులం...నవ్వులం
మ్రోగే మువ్వలం....
అనుబంధాలను చాటే
దివ్వెలం....
ఒకే గూటి గువ్వలం.
...........................
ఈ కవిత నా స్వీయ రచన దేనికి అనుకరణ కాదు.
15
[09/02, 9:29 PM] KC Narsaiah KS 26: కవన జ్యోతి
అంశం: తోబుట్టువులు
పేరు: కెసి నరసయ్య
తేది: 09-02-2021
శీర్షిక: వికృత చేష్టలు
దాయాదుల పోరు
దరిదాపులు దొరకని వివాదాలు
ఉమ్మడి కుటుంబాలు
ఊరినే వెలేసిన విచ్చిన్న కుటుంబాలు
తోబుట్టువులు
తోవలు మూసుకున్న స్వార్ధపు మడుగులు
రక్త సంబంధాలు
జలగలా రక్తాన్ని పీల్చుతున్న ఆర్థిక బంధాలు
మానవ సంబంధాలు
మానవత్వాన్ని కమ్మేసిన విషసంస్కృతి
16
కవనజ్యోతి
అంశం: తోబుట్టువులు
****************
తాయిలాల తక్కిడలో
తప్పటడుగుల చక్కిలమై
చెకుముకి ముక్కెరలో
ముత్యపు పగడాలుగా
మంచు పల్లకి కెరటాల్లో
మౌనగీతాల్లా...
మనో వాక్కుకు ప్రతిరూపంగా
మమతను పంచే బంధాలు
తొలి ప్రేమకు సాక్ష్యాలు....
జ్ఞాపక తీగలుగా అల్లుకున్న
అల్లరి ఫలాలు...
చిన్నా పెద్దల ఆదరింపులతో
ఆరిందలా ఆడపడుచుల
అలకల కులకులు తీర్చే
అన్నా దమ్ముల ఆకతాయి
పేచీలు...
మధురాలే మనసులో మన్నించేస్తే...
తగాదాల తెగతెంపుల్లో అమలిన ప్రేమలు
బలి కాకపోతే...
రక్తబంధం ఏ బంధానికి సాటి లేదులే...
విలువైన వజ్రానికి లేదు ఏ విలువ
వెలకట్టలేని ఆప్యాయత తో
17
*కవన జ్యోతి*
తేదీ:09-02-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: తోబుట్టువులు
*******************
ఒకే కొమ్మకు పూచిన పువ్వులు
రాగబంధాలతో అల్లుకున్న రక్త బంధాలు!
అమ్మా నాన్నల కంటి పాపలై
ఆత్మీయానురాగాలతో వెలిగే దివ్వెలు!
కన్నవారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న
భవిష్యత్తు తరాల వారధులు!
మమతల కోవెలలో కొలువైన
ప్రేమాభిమానాలకు
మమకారపు హారతులిస్తూ కాపాడుకునే బాధ్యతా పూజారులు..
అమ్మ గోరు ముద్దల కోసం పోటీ పడుతూ
అల్లరి చేసే తోబుట్టువులు
ఆజాన్మాంతం అమ్మ పేగు బంధాన్ని
నిలుపుకుంటే ధన్యులు
వెన్నంటే తన నీడుంటే చాలులే..
రియల్ ఎస్టేట్ మాఫియా
మచ్చుకైనా కానరాని పిచ్చుక గూళ్ళు
ప్రకృతిలో వికృత చేష్టలు
వెంటాడుతున్న మానవ మృగాలు
Comments
Post a Comment