పశ్చాత్తాపం feb9/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

*********

కవివరుల జాబితా

1.సుధారాణి కృష్ణం రాజు గారు

2. కోరాడ నరసింహారావు గారు

3.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు

.4.మన్నె పిన్నక లలిత గారు

5.కోమండూరి నీల గారు

6.పరాంకుశం రఘు నారాయణ గారు

7.డా.బల్లూరి ఉమాదేవి గారు

8. కొలచన విజయ భారతి గారు

9. ధనాశి ఉషారాణి గారు

10.విజయ లక్ష్మి వల్లాల గారు

11.Y.K.సంధ్యా శర్మ గారు

12.మర్రి జయశ్రీ గారు

13. సునంద వురిమిళ్ళ గారు

14.సునంద వురిమళ్ళ గారు

15.మర్రి జయశ్రీ గారు


*********

[09/02, 7:12 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️

కవితాగానం

నేటి అంశం 

09.02.2021

*పశ్చాత్తాపం*

ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు

అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.


✳️✳️✳️✳️✳️✳️

1

[09/02, 8:13 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*పశ్చాత్తాపం*

09-02-2021(మంగళవారం)

కోపోద్రిక్తులైన మనుషులు మాట్లాడే పరుష పదజాలంతో

ఎదుటి వ్యక్తి యొక్క మనసును గాయపరచి వింత

ప్రవర్తన కొందరికి వెన్నతో పెట్టిన విద్య అయితే ఆక్రోశం చల్లారిన

తరువాత ఉరుములు, మెరుపులతో అల్ల కల్లోలం సృష్టించిన ఆకాశం చిరుజల్లుల

తో ప్రశాంతంగా మారినట్టు ఇలాంటి వారి ప్రవర్తన ఉంటుంది కాని తరువాత కాళ్ళ

బేరానికి వచ్చినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం

లాభం ముందు ఉన్న గౌరవం

ఉండదు 

ఎదుటివారు మనసున్న మనుషులు అయితే ఇవేవీ

పట్టించుకోకుండా పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కాదు

అని సరిపెట్టుకున్నప్పుడు

ఆక్రోశం తో కఠినమైన మాటలతో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించింది అని అర్థం చేసుకుని పశ్చాత్తాపం

పడితే దానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు

పరివర్తన కలిగి మిగిలిన జీవితం అంతా అందరితో

మెలిగిన ప్రవర్తన ద్వారా

వారి యొక్క ఆనందం ముడి

పడి ఉంటుంది🙏👍

2

[09/02, 8:25 PM] Korada: కవితాగాన0

  అంశం :- @ పశ్చాత్తాపం @

  కోరాడ నరసింహా రావు...!

          * ప్రాయశ్చిత్తం *

            ************

పాపం చేయని మనిషి...

దోషం లేని జీవితం ఉండవు

కదా....!

మనిషి అన్నాక... తేలిసో...

తేలియకో... పాపాలు చేస్తూనే

ఉంటాం....!!

అందుకోసం... ప్రాయశ్చిత్తం గా

పూజలు... దానాలు... ధర్మాలు

చేసేస్తామే గానీ... అవన్నీ యేవరికి చేస్తున్నాం... ఏవరవన్నీ అందుకుని అనుభవిస్తున్నారు అనేది ఆలోచించం కదా...! 

నిరుపేదలకు...అంటే... కూటికి

గుడ్డకు... గూడుకు... నోచని వారికేవరికైనా... అంది... వారు ఆనందించే లా చేస్తే.... కోంత మేరు గేమో... కానీ అలా జరగటం లేదే....,

అసలు పశ్చాత్తాపం చేందటమంటే... యేమిటి...!?

ఈ పూజలు... దానాలు... ధర్మాలా... యిలాంటి అపాత్ర డానాలతో యేం ప్రయోజనం!?

పశ్చాత్తాపం చేన్దటమన్టే... చేసిన తప్పును తలచుకుంటూ

కుమిలి కుమిలి యేడవట0 !

యింక అటువంటి తప్పే కాదు

యేటువన్టి పాపాన్నీ జన్మలో

చేయనని ఆత్మ సాక్షి గా ప్రమాణం చేసుకోవటం...!

తాను చేసిన పాపానికి బలై

పోయిన వ్యక్తికి లేదా ఆ కుటుంబానికి శక్తి వంచన లేకుండా సహకరిన్చట0....

యిది కదూ... నిజమైన పశ్చాత్తాపం...!

ఈ పస్చాత్తాపాన్ని మించిన

ప్రాయశ్చిత్తం వేరోకటున్టున్దా!?

యిలాంటి పస్చాత్తాపాన్ని

పోందని మనసు అది మనసే కాదు... అటువంటి వాళ్ళు

మనుషులే కారు...!!

  *************"*******

     ......కోరాడ.

3

[09/02, 8:35 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: జీవితం పశ్చాతాపం తప్పులు చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు చేసిన తప్పుకు చెంపలేసుకుంటున్నారు


జీవితం ఎప్పుడు కష్టాల కన్నీళ్ల మహిమలో


చేసిన తప్పులు చేస్తూ నివారించు కోడానికి ప్రయత్నించాలి

కష్టాలు కన్నీళ్లు తొలగించుకొని పదిమందికి సహాయకారిగా అప్పుడప్పుడు మోసపోతు పశ్చాత్తాప పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి

పశ్చాత్తాపాన్ని ఒకసారి గుర్తు చేసుకో అప్పుడే

బాధల్ని కోల్పోయి పశ్చాత్తాప పడాలి మంచివాడు గా మారాలి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

4

[09/02, 8:38 PM] +91 74168 63289: కవితా గానం

 తేదీ :9/2 /21 

అంశం :పశ్చాత్తాపం

 పేరు  :మన్నె పిన్నక లలిత


 మన చుట్టూ మనుషుల సంఖ్య పెరిగినా 

మానవతా విలువలు తగ్గి 

పరిచయాలు పెరిగినా

 బంధాలు తగ్గుతూ, జరిగింది మర్చిపోయి  

జరగబోయేది  సంతోషంగా గడపాలి 

ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో 

ఆ పని ఇతరులకు చేయకపోవటం ధర్మం 

ఈర్ష స్నేహితులను బంధాలను దూరం చేస్తే 

కోపంలో మనల్ని మనమే కోల్పోతాము

 కోపమే తప్పుల్ని చేయిస్తోంది 

ఆ తప్పు ఆత్మ శుద్ధి తో తెలుసుకుని 

పశ్చాత్తాపపడి, వారికి నిజమైన సహాయం చేస్తే 

అప్పుడే పాప పరిహారం జరుగుతుంది 

కానీ  దేవుడికి లంచాలు ఇచ్చి

చెంపలు వేసుకున్నంత మాత్రాన పాపపరిహారం కాదు పశ్చాత్తాపం మనస్సును శుద్ధి చేస్తుంది

 మనస్సు అనే తెల్ల కాగితాన్ని తప్పులు లేకుండా   ,మరకలు పడకుండా చూసినప్పుడే అందంగా ఉంటుంది 

మరకలు పడిన కాగితం పాపం లాంటిది 

మరక లేని తెల్లకాగితం, పశ్చాత్తాపం వంటిది 

తప్పును ఒప్పుకో గలగటం 

మంచి మనస్తత్వానికి నిదర్శనం.

 జీవితంలో వచ్చే ఆటుపోట్లకు తట్టుకొని 

పదిమందికి సాయం చేసే మనసును పటిష్ట పరుచుకోవాలి

5


[09/02, 8:39 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *పశ్చాత్తాపం*

తేది:09/02/2021

          వచన కవిత్వం


తెలిసీ తెలియని వయసులో గజిబిజి అల్లర్లు చేసి తిట్లుతింటుంటే ఏదో తెలిసేది కాదు..!


గోడదూకి పక్కింటి జామకాయలు దొంగిలిస్తుంటే అమ్మ చెప్పే నీతులన్నీ గాలికి పోయేవి..!


దొంగతనం తప్పని,గిల్లికజ్జాలొద్దని ఎన్నిమార్లు మొరపెట్టుకునేదో అమ్మ..!


ఊహూ!విన్నామా..లేదే అన్నీ చిన్నతనపు జ్ఞాపకాల మందసంలో నిలిచింది కానీ..,

అప్పుడు ఉపయోగ పడలా..!


ఇప్పుడనిపిస్తుంది..అప్పుడు వినివుంటే బాగుండేదని..!

చిన్నపిల్లల్లా కాయలు,పూల తోట పెంచి,నీరు పోసి పూలకై,కాయలకై వేచిచూస్తున్న తరుణంలో ఎవరన్నా కోసుకుపోతే తోటకూర నాటి మాటలు రింగుమంటూ..,

అప్పుడే..

*పశ్చాత్తాపం* పడుంటే జరిగేది కాదేమో అని అనిపించి కన్నీళ్ళపర్యంతమౌతా...!!!!!!

     

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

6

[09/02, 8:41 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం* 


       అంశం:పశ్చాత్తాపం 


*కవితా శీర్షిక : పశ్చాత్తాపం ఓ..సుగుణం*


 తెలిసి చేసినా, తెలియక చేసినా,


 తప్పు ఒప్పు కాదు కదా !


అవగాహన లోపంతో తెలియకుండా!


 కొన్ని తప్పులు జరిగితే ?


 ఏమరుపాటుగా మనం గ్రహించే లోపలే!


 మరో తప్పు జరగవచ్చు!


  ఆ తప్పును పలువురు గమనిస్తే ?


గోడలకు కూడా చెవులుoటాయoటారు కదా!


 ఆ నోటా! ఈ నోటా! 


ఆ తప్పుకు మరింత రంగు పులమడం  ?


 సహజమే కదా ?


 అందుకే ఉత్తమమైన మానవులు ..,


తప్పును గ్రహించి!


 సవరించుకోవడంతో పాటుగా,


పశ్చాత్తాపంతో! 


స్వీయ విశ్లేషణ చేసుకొని,


 తప్పు మళ్లీ జరగకుండా..,


 చూసుకోవడం మంచి లక్షణం!


పశ్చాత్తాపడటం తప్పు కాదు ?


  అది వాస్తవ జీవనశైలి అని భావిద్దాం!!


 పరాంకుశం రఘు నారాయణ 

      మహబూబాబాద్

7


[09/02, 8:59 PM] Balloori Umadevi Poetess: 9/2/21

కవితా గానం

పేరు: డా. బల్లూరి ఉమాదేవి

అంశం: పశ్చాత్తాపం


తప్పు చేయడం మానవ సహజం

 సరిదిద్దు కోవడమే తగిన పరిష్కారం

 పశ్చాత్తాపం అనేది చేసిన నేరాలను

మన్నించే మహత్తర ఔషధం

 కన్నుల నుండి అవిశ్రాంతంగా  కారే కన్నీరే

  తెలుపుతోంది పశ్చాత్తాపపు లోతు

చేసినట్టి మేలును  పూర్తిగా మర్చిపోయి

కృతఘ్నులు గా మారి పోయి

చెప్పరానట్టి తప్పులు చేసినా

డబ్బు పలుకుబడితో శిక్షనుతప్పించుకున్న

అంతరాత్మ వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక

మనశ్శాంతి దూరమై బ్రతుకు భారమై

ఆత్మన్యూనతతో అలమటించే వేయడం సంజీవిని లా పని చేసేది ఈ పశ్చాత్తాపమే

8

కవితా గానం

పేరు:కొలచన విజయ భారతి

ఊరు: హైదరాబాద్

అంశం: పశ్చాత్తాపం

శీర్షిక: తప్పుకు అదే పెద్ద శిక్ష

తేదీ:9-2-2021

*********************

తప్పులెన్ను వారు తండోపతండంబులు

ఉర్వి జనులకెల్ల ఉండుతప్పు

  .... అని శతక కారుడు వేమన చెప్పినట్లు

తప్పు చేయని మానవులు

భూ ప్రపంచంలోనే లేరు

తప్పు చేయుట మానవ సహజం

చేసిన తప్పు ఒప్పుకుని

పశ్చాత్తాప పడటం

గొప్ప గుణం

పశ్చాత్తాపాన్ని మించిన 

ప్రాయశ్చిత్తం లేదు


కరకు బోయ వాల్మీకి చేసిన తప్పుకు  పశ్చాత్తాపమే

రమణీయమైన రామాయణమై

చరితార్థమై  భువిని నిలిచింది కాదా

     

తప్పు నేరమైతే

పశ్చాత్తాపమే దానికి శిక్ష

     ☘️☘️☘️☘️☘️


చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో మోకరిల్లి 

క్షమాపణ కోరడం పరిష్కారం .

9.

కవితా గానము

.......

నేటి అంశం.పశ్చాత్తాపం

**********

లేనిపోని కళ్లబొల్లిమాటలతో

నోటిమాటను అదుపు చేసుకోలేక

గుండెల్లో గుణపాలు గుచ్చేటి మాటతోను

నిత్యము వెంటాడుతూ వేధించేటి

మనిషి కళ్లుతెరిచుకునేలా

నిత్యము ఓపిక కలిగి నడుచుమా

తప్పులు మీద తప్పులను చేస్తూ

మనస్సు వేసే ప్రశ్నలకు

సమాధానం చెప్పుకోలేక

దోషిగా నిలబడకూ ఓమనిషి 

బతుకును నీతి మార్గములో నడిచి  సాగించుమా

రామాయణ మహాభారతం గాధలను వింటూ 

మంచి చెడు  మార్గాల తేడా తెలుసుకోని బతుకును సాగించుమా

తప్పును ఓ ఆత్మవిమర్శతో

దిద్దుకోని బంధాలకు ప్రాణము యిస్తూ

బతుకును సాగించు  మనిషిగా

భవితకు నిత్య మార్గదర్శము పశ్చాత్తాపం

ధనాశి ఉషారాణి

 చిత్తూరు జిల్లా

10

*పశ్చాత్తాపం*

*************

బలహీనమైన శరీరానికి

తోడుగా ఉండనీలే"

అనుకున్నావేమో!దేవా!

సున్నితమైన మనసునూ ఇచ్చావు

ఆలోచనలతో అంతరంగాన్ని

నింపే మనస్తత్వాన్నిచ్చావు

తెలియక చేసిన తప్పులకే

తెగ బాధపడి వాడిపోతుంటుంది

పిచ్చి(న్ని) మదిమందారం

అనుకోకుండా జరిగిన పొరపాట్లకే

అలుపు లేని ఆలోచనల హోరుతో 

అల్లకల్లోలమవుతుంది హృదయసంద్రం

అవాంచితంగా దొర్లిన తప్పులకే

అశాంతి రొదల మధ్య చిక్కి

మూగబోతుంది హృదయవీణ

తెలిసి తెలిసి తప్పులు ..

నే(ఘో)రాలు చేయలేని బాలను

లలిత పల్లవ చిగురుటాకును


*పశ్చాత్తాప జ్వాలల్లో* చిక్కి

దహించుకుపోతూ మనలేని

చిన్నారి అశక్త విహంగాన్ని


:వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

11

వై.కె.సంధ్యా శర్మ

కవితాగానం

అంశం:పశ్చాత్తాపం

################


అసహనపు నిప్పులు చెరగడం కాదు

ఆత్మీయత పంచే అనుబంధాన్ని

అరువియ్యాలి...


ఆక్రోశపు నీడలో చెలరేగడం కాదు

అల్లనల్లన పిలుచుకునే పిలుపుకు

దగ్గరవ్వాలి...


అనుమానపు నుసిని వెదజల్లడం కాదు

ఆలోచనా తరగలను పల్లవించాలి..


అసంతృప్తి సెగలో ఉడికిపోవడం కాదు

అభిప్రాయాలు పంచుకునే అభివ్యక్తవ్వాలి...


కుతంత్రపు వేళ్ళలో మగ్గిపోవడం కాదు

మమతల మొగ్గలు విచ్చుకునే ఫలమవ్వాలి...


స్వార్థపు ముళ్ళను పెంచుకోవడం కాదు

సతతం సామరస్యపు పత్రహరితమవ్వాలి...!

౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧

వై.కె.సంధ్యశర్మ✍️

12.

[09/02, 9:31 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..పశ్చాత్తాప0



మానవుని సహజగుణం

ఏదో సందర్భంలో

ఎప్పుడో ఒకప్పుడు

పొరపాటు చేయడం

అనుకోని జరిగినా

అనుకోకుండా జరిగినా

పెద్ద మనసుతో మన్నించడం ఉత్తమం

పదే పదే ఆలోచిస్తూ

మరోపది జోడిస్తూ పోతే

ఇంతింతై వటుడింతై అన్నట్లు

గుండెకు భారమై పోయే సంఘటనలే అధికం లోకంలో

జరిగిందేదో జరిగిందని

అన్ని పాపాలకు పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమనుకుంటే 

అంతకన్నా మహాభాగ్యమేమున్నది

అదే ఆరోగ్యానికి మేలైన ఔషధం

బింకానికి వెళ్ళి తప్పులను ఒప్పులుగా 

తామే నిజాయితీ పరులమని భావిస్తూ పోతే

అనుబంధాలకు విలువనివ్వకపోతే

ఏదో ఒకరోజు కాలమైనా జవాబు నిస్తుంది 

అంతరాత్మైనమైనా ప్రశ్నిస్తుందికదా

అవగాహన లోపంతో తప్పులు జరిగేనా

పశ్చాత్తాప పడడం

క్షమాపణ కోరడం తప్పేమీ కాదు

అదే మన సంస్కారానికి నిదర్శనం.

13

[09/02, 9:33 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం* 

తేదీ 09-02-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: పశ్చాత్తాపం

*******************

అంతరంగమనే అద్దం ముందు

ఆత్మ శోధన చేసుకునే అవకాశమే పశ్చాత్తాపం...


తప్పొప్పుల త్రాసులో వేసుకున్న తూకం 

వేదన కలిగించినప్పుడు పడే ఆవేదన రూపం..


చేసిన పొరపాట్లు వెంటాడుతూ

గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే

పడే అపరాధ భావనే..


చేసిన తప్పుని ఒప్పుకుని

సగౌరవంగా తలెత్తుకుని నిలబడే 

సంస్కారమే పశ్చాత్తాపం..

14

*కవితా గానం* 

తేదీ 09-02-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: పశ్చాత్తాపం

*******************

అంతరంగమనే అద్దం ముందు

ఆత్మ శోధన చేసుకునే అవకాశమే పశ్చాత్తాపం...


తప్పొప్పుల త్రాసులో వేసుకున్న తూకం 

వేదన కలిగించినప్పుడు పడే ఆవేదన రూపం..


చేసిన పొరపాట్లు వెంటాడుతూ

గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే

పడే అపరాధ భావనే..

15

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..పశ్చాత్తాప0



మానవుని సహజగుణం

ఏదో సందర్భంలో

ఎప్పుడో ఒకప్పుడు

పొరపాటు చేయడం

అనుకోని జరిగినా

అనుకోకుండా జరిగినా

పెద్ద మనసుతో మన్నించడం ఉత్తమం

పదే పదే ఆలోచిస్తూ

మరోపది జోడిస్తూ పోతే

ఇంతింతై వటుడింతై అన్నట్లు

గుండెకు భారమై పోయే సంఘటనలే అధికం లోకంలో

జరిగిందేదో జరిగిందని

అన్ని పాపాలకు పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమనుకుంటే 

అంతకన్నా మహాభాగ్యమేమున్నది

అదే ఆరోగ్యానికి మేలైన ఔషధం

బింకానికి వెళ్ళి తప్పులను ఒప్పులుగా 

తామే నిజాయితీ పరులమని భావిస్తూ పోతే

అనుబంధాలకు విలువనివ్వకపోతే

ఏదో ఒకరోజు కాలమైనా జవాబు నిస్తుంది 

అంతరాత్మైనమైనా ప్రశ్నిస్తుందికదా

అవగాహన లోపంతో తప్పులు జరిగేనా

పశ్చాత్తాప పడడం

క్షమాపణ కోరడం తప్పేమీ కాదు

అదే మన సంస్కారానికి నిదర్శనం.


చేసిన తప్పుని ఒప్పుకుని

సగౌరవంగా తలెత్తుకుని నిలబడే 

సంస్కారమే పశ్చాత్తాపం..



Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧