నాగేటి చాలు 3/2021
నిర్వహణ :శివునూరి లలితాకృష్ణ
Author of Vennela shilpam
*********
1.డా.సిహెచ్.ఆంజనయులు గారు
2.కోరాడ నరసింహారావు గారు
3.సుధారాణి కృష్ణం రాజు గారు
4.వెంకట్ రెడ్డి గారు
5.మన్నె పిన్నికి లలిత గారు
6.అపరాజిత్ గారు
7.కొలచన విజయ భారతి గారు
8.పరాంకుశం రఘు నారాయణ గారు
9.సునంద వురి మళ్ళ గారు
***********
1
[02/03, 8:02 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: నాగేటి చాలు తరతరాలుగా కష్టాల కొలిమిలో కాల్చబడిన
రైతు సూర్యుడు అతడు నిరంతరం నేల తోనే అతని పోరాటం పుట్టెడు ధాన్యాన్ని పండించి మార్కెట్లో దివాలా తీయబడుతుంది మమతల మూర్తి అతడు
అతడే ఈ దేశపు రైతు రారాజు రైతు రాజ్యం రావాలని కలలు కంటూనే ఉన్నాం అయినా రైతు దగా పడుతున్నాడు కార్పొరేట్ శక్తుల మధ్య నలిగి పోతున్నాడు
నాడు నేడు రైతన్న అతివృష్టి అనావృష్టి ల మధ్య చిరకాలంగా జూదం ఆడుతున్నది ప్రకృతి
అయినా శ్రమ జలంలో స్నానం ఆడుతూనే ఉన్నాడు
ఆ అర్ధరాత్రి అపరాత్రి వెన్నెల రాత్రి అమావాస్య రాత్రి తన పొలమే సర్వస్వంగా నమ్మి తన శక్తిని ధార పోసే రైతన్న మంచి రోజులు రావాలని కలలు కంటూనే ఉన్నాం
నేలతో నీ పోరాటం అమోఘం అద్భుతం రైతన్న నీకు మా సలాం రైతన్న నీకు వందనం అభివందనం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
2
[02/03, 8:13 PM] Korada: కవనజ్యోతి
అంశం :- నాగే.టి చాళ్ళు
కోరాడ నరసింహా రావు......!
నాగేటి చాలుకు కోటి దండాలు
🙏🌷🙏🌷🙏🌷🙏
బీటలు వారిన...నేలతల్లి హృదయ సీమను....
ప్రేమ హలమున కలియదున్ని
ఆకలిదీర్చి... ఆనందమోసగి
ఆయువుపేంచేవ్యవసాయానికి
శ్రీకారం చుట్టేది... రైతు నాగలితోనే నోయీ...!
నాగరికతకు తొలి ఉపకరణం
నాగలే...!!
శ్రీ కృష్నుడు గో పాలకుడై...
పాడిని వృద్ది గావిస్తే...
బలరాముడు హల ధారియై...
వ్యవసాయమునకు ప్రతినిధి
యై నాడు...!తనఆయుధమ్ము
హలమని చాటి... నాగలి విలువను తేలియ జేసేను...!!
ఈ నాగలి... యేన్నేన్నో భోగాలకు మూలమయ్యేగా!
వ్యాపార, వాణిజ్య....మానవ జీవన వికాసానికే... యిది నాంది పలికేగా...!!
స్తిరత్వ0 లేని దేశ దిమ్మరులను
స్ఠిరముగా కూచోబేట్టి... నాగరికతను నేర్పిందోయీ ఈ
నాగలి...!
కళ లు... వికసించగలిగిందీ ఈ
నాగలి మూలముననే...!!
కడుపు యాతనతీరి... ఖాళీ సమయం దోరకబట్టే....
మనిషి బుద్ధి అభివృద్ధి పధ0
వైపు పరుగులుతియ్యగలిగింది
మనిషిని... రాతి యుగం నుండి... రాకేట్టు యుగానికి చేర్చింది... నాగేటిచాలే...
అందుకే... అందరం అందాం...
నాగేటిచాలుకు కోటిదండాలని!
*************************
........కోరాడ.
3
[02/03, 8:14 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*నాగేటి చాళ్ళు*
02-03-2021(మంగళవారం)
*దేశానికి రైతు వెన్నెముక
రైతులు లేని రాజ్యం లేదు
మానవ జీవనానికి ఆధారం
ఆహారం ఆహార ధాన్యాలు పండించి అందరి కి అందించి
సంతృప్తి పొందే వారు రైతులు
సెలవు అనేది లేని నిత్య శ్రామికుడు రైతు
ఉదయాన్నే సూర్యుడు రాకముందే నాగలి ని భుజాన వేసుకుని పొలానికి వెళ్ళి
నాగలితో పొలం దున్ని దున్నిన
వరుసలలో విత్తనాలు చల్లి
పంటలు పండుతాయన్న ఆశతో పచ్చని పైరు తో పంటలు కోతకు వస్తాయి అని
ఎదురు చూసే సెలవు లేని నిరంతర శ్రామికుడు రైతు
రైతులు చెమటోడ్చి పండించిన పంటలు పండి సశ్య శ్యామలంగా సుభిక్షంగా దేశం
ఉండాలని తమకు కరువు రాకుండా అందు బాటులో ఉండాలని ప్రతి ఒక్కరూ
రైతుల మీద ఆధారపడే ఆశా జీవులే
కాలం కలిసి రాకున్నా పంటలు
చేతికి రాక అతివృష్టి అనావృష్టి
వలన నష్టం వచ్చినా వచ్చే సంవత్సరం పండుతాయి అని
నాగేటి చాళ్ళను నమ్ముకునే
రైతు అందరి జీవితాలలో వెలుగులు పంచేఆశయ సూర్యుడు
రైతు 🙏🙏👍
4
[02/03, 8:34 PM] Venkat Reddy Math Sa Csdo: ** నాగేటి చాళ్ళు **
. ..... .... ......
ఏడ వున్నారో బిడ్డలు ...
దుంకితే బొగ్గుబాయి
దాటితే బొంబాయి అని
కాలం గాక....
ఎవుసం ఇడిచి
ఎండు డొక్కలతో
నా కొడుకులు ....
పొట్టచేతబట్టుకొని పోయిరి ....
ఏడున్నారో పోరలు ...
ఎం తిన్నరో బిడ్డలు..
సాలు బట్టిండ్రంటే
సక్కనికొండ్రేకు
ముందునాగాలి పెద్దోడిదే
ఎట్టున్నాడో బిడ్డ
ఏం తిన్నాడో ....
పెద్దోడు బాంబాయి
చిన్నోడు బొగ్గుబాబు
ఊరు దాటిరి పోరలు
జోడు ఇడిచిరి బిడ్డలు ....
సక్కని సాలుకు
సుక్కాని నా బిడ్డ ...
నాగలి తొక్కివట్టి దున్నితే
పగ్గం బెట్టి కొలిసి
గీతగీసినట్టే ....
ఇత్తనం సాలుకు
ఎలగటి నాగలితో
మక్కిన దుక్కిలో
నా బిడ్డ ...సక్కని సాలు దొళ్తే
ఆముదాలైతే ఆత్రంగా మొలిచేయి ...
సద్దజొన్నలయితే సాంతిమి దక్కేయి
దంతే వట్టేనాటికి
వస్తనన్నబిడ్డలు
కొర్లపుణ్ణం బాయే ....
అయినా....
కండ్లకొలికికి ఆనారాయే....
ఎట్లున్నరో కొడుకులు
ఎం తిన్నారో పిల్లలు .....
సాలువట్టె కొడుకులు
బొగ్గు బాయిలో మునిఁగింన్ద్రో...
కేబుల్గుంతలో జారింన్ద్రో ....
ఎప్పుడొస్తరో కొడుకులు
ఎట్ల వస్తారో పోరలు ....
కళ్లజూస్తానో లేదో ...
కాటికయినా పంపుదేవుడా ......
అట్టయినా .....
ఊరు బాట పడ్తారేమో
నా పిల్లలు.
........... .......... .........
----జక్కిడి వెంకటరెడ్డి ,
ఉపాధ్యాయులు (ఫిసికల్ సైన్స్ ),
భువనగిరి .
5
[02/03, 8:40 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవన జ్యోతి.
తేదీ :2/3/ 21.
అంశం: నాగేటి చాళ్ళు.
శీర్షిక : హలం పట్టి...
పేరు:మన్నె పిన్నక లలిత.
నాగేటి చాలులో దొరికిన సీత ఆదర్శమై
నేటి స్త్రీ మగనితో సమంగా
ఏరువాక పున్నమికి
కాడికట్టి మేడి పట్టి
కోడెడ్లతో పంట కోసం పొలం దున్నుతూ
లల్లాయి పదాలు పాడుకునే భర్తకు
చేదోడువాదోడుగా నాగేటి చాళ్ళలో
రేపటి భవిష్యత్తుకు విత్తనాలు చల్లుతూ
చందమామ వెన్నెలలాంటి చల్లని చిరునవ్వును
చిలుకుతుా
తలలో మందారాన్ని సవరించుకుంటున్న రైతు భార్య
విశ్రాంతిగా కూర్చున్న వేళ వరుణదేవుని
అతివృష్టి ,అనావృష్టి కలగకుండా చూడమని ప్రార్ధిస్తూ
నాగేటి చాళ్లలో వేసిన విత్తులు
క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా కనబడుతుంటే
మనసు ఉప్పొంగి ఊహలలో తేలి
బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చి
తాము కరువుకాటకాలు లేకుండా
పండిన పంట తాము తిని
ఇతరులకు దానం చేసినట్టు
కలలు కంటుంది ఆ పిచ్చి తల్లి
6
[02/03, 8:40 PM] Aparajith: రైతన్నా !!
చిట పట చినుకుల సవ్వడి తో
తొలి కోడి కొక్కొరొకో అని కూసింది
గుండెల్లో గుబులు గుబులు గా రైతన్న మేల్కన్నాడు !!
మండే ఎండల నుండి వానాకాలం వచ్చింది
వాన చినుకుల్లో కొప్పెర పెట్టుకొని
పొలం చెలకంతా కలియతిరిగాడు !!
ఎడ్ల మెడలపై అరకతో సాలిర్వాలు దున్నుతూ
రైతు కళ్ళలో దోరగా పండిన జొన్న కంకులు, వరి కంకులు !!
అప్పటికి పొద్దు బారెడెక్కింది
తన ఇల్లాలు ఏమయ్యో !సద్ది బువ్వ తిందువు రా !!
ఒడి నిండా విత్తనాలు
భర్త దున్నుతున్న సాలువెంట చల్లు తోంది
ఈ ఏడన్నా పంట చేతి కొస్తుందా? !!
అరక ఆగింది !వానజల్లు ఆగింది !
తూర్పు దిక్కున ఇంద్రధనుస్సు తళుకు లీనుతోంది !!
ఇద్దరి కళ్ళల్లో ఏదో అనిర్వచనీయ ఆనందం
బాయి కింది పొలం లో నీళ్లు పెట్టి
నారు మడి దున్ని !దున్నేకొద్దీ పంట !
తనకు తోడుగా పక్క పొలాల రైతన్నలతో
కరిగట్టు దున్ని రైతు కూలీల తో నాట్లు వేసాడు !!
రైతు స్వేద బిందువులే అస్త్రా లయ్యాయ్
తెల్లారి చూస్తే పొలమంతా ఆకు పచ్చ చీర కట్టుకుంది !!
అయ్యా !అయ్యా !అంటూ చిన్నోడు ఒడి చేరాడు
అరేయ్ !బడికి పోయి సదువు కోవురా !!?
పక్షం తిరక్కుండానే ఏపుగా ఎదిగిన వరి పైరు, జొన్న చేను
వరి పైరు దోమకాటుకు పంపుతో మందు కొట్టి, కలుపు తీసి
ఓ సారి నా వైపు సూడు !!
పాల కంకులతో దోబూచులాడుతున్న వైనం
రైతు కళ్ళలో మురిపెం మూడింతలు !!
ఇలాగే కాలమైతే గుమ్ముల నిండా వడ్లు, జొన్నలు
ఏమైందో ఏమో వాన దేవుడికి? !!
ఎండల మంటలతో పైర్లు ఎరుపెక్కాయి
ఎటు చూసినా వాన మబ్బు కానరాదాయె !!
దిక్కు తోచక దిగాలుగా ఇంటి దారి పట్టాడు
దొంగోడు ఉరికొచ్చి మీద పడ్డట్టు
ఓ అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది !!
ఊరు ఊరంతా ఉలిక్కి పడి లేచింది
ఈ ఏడు మన పంటలు గట్టెక్కాయి రో !!
లెగండి !లెగండి !మన పొలాల కాడి కెళ్దాం !
పొంగి పొర్లే వాగులు, వంకలు
అలుగులు దుంకుతున్న చెరువులు !!
మోటారు బావుల నిండా నీళ్లు !!
కొన ఊపిరి తో ఉన్న చేలన్నీ దూప తీర్చుకుంటున్నాయ్ !!
రైతన్నల కళ్ళలో ఆనందం అర్ణవమాయే !!
చిరిగిన అంగీ అయినా తొడుక్కో
పుడితే రైతన్న గా పుట్టు !!
అపరాజిత్
7
[02/03, 8:42 PM] కొలచన విజయ భారతి Poetess: "కవన జ్యోతి"
పేరు:కొలచన విజయ భారతి
ఊరు:హైదరాబాద్
అంశం:నాగేటి చాలు
శీర్షిక:రైతన్న నేస్తం
తేదీ:2-3-2021
***********************
తొలకరి చినుకు పుడమిని తాకిన సంబరం
ఏరువాక పొంగిన సందడి
రైతన్నల భుజాలకెతుకున్న
నాగేటి చాలు
రైతుల అడుగులతో
అడుగులు కలిపి
పొలం గట్లకి చేరుకుంటుంది
కాడి జోడెడ్లతో నేస్తం కట్టి
నేలను దుక్కి దున్ని
మురిసిపోతుంది
నాటిన విత్తులు మొలకెత్తి
పచ్చని చేలు కంకులతో
నిండుగా నవ్వుతూ
పంటసిరులు రైతన్న ఇంటచేరితే
రైతన్న లోగిలి ధాన్యాలతో
నిండి సందడి చేస్తే
నాగేటి చాలు రైతన్న ఇంటి గోడకి చేరగిలబడి హాయిగా
నవ్వుతుంది
🌺🌺🌺🌺🌺
8
[02/03, 9:07 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితా జ్యోతి*
అంశం,నాగేటి చాళ్లు
*కవితా శీర్షిక,నాగేటి చాళ్లు- రైతు లోగిళ్ళు*
రైతు బతుకునూ,
ఆయన తలరాతనూ,
మార్చేది నాగేటి చాళ్లే కదా!
కడుపు మంట తీరాలంటే,
దేశం అన్నపూర్ణగా
కీర్తించబడాలంటే,
నాగేటి చాళ్ల చలువనే కదా !
కూటికోసం కోటిపాట్లు పడినా,
చివరికి మనిషి పళ్ళెంలోకి వచ్చేది,
అన్నదాత కృషితోనే కదా!
ఆ కృషిలో మిళితమయ్యేది,
నాగేటి చాళ్లే మరీ ముఖ్యం కదా!
నాగేటి చాళ్ళతోనే,
మనిషి జీవితచక్రం తిరిగేది,
నాగేటి చాళ్లతోనే,
మనిషి గతిచక్రం మారేది!
ప్రగతిచక్రం వడివడిగా సాగేది !!
పరాoకుశం రఘు నారాయణ
మహబూబాబాద్
9
[02/03, 9:25 PM] సునంద వురిమళ్ళ గారు: *కవన జ్యోతి*
తేదీ:02-03-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: నాగేటి చాళ్లు
********************
పుడమి పలకపై కృషీవలుడు రాసిన బతుకు రాతలు!
భుజాన వేసుకున్న నాగలి
బతుకు పథాన్ని నిర్దేశించే మహర్షి !
అవని ఎదపై గీసిన నాగేటి చాళ్ళపై
రాసుకున్న విత్తనాక్షరాలకు
నరాల్లో ప్రవహించే నెత్తురు సిరాను
ధారలుగా చేసి తడుపుతూ
పంటల ఫలితాలకై ఎదురు చూసే శ్రమ జీవి!
నింగీ నేలకు నేస్తుడై
ఎద కలంలో చినుకుల కలలను నింపుకుని
ధరణి కాగితంపై పంటల కావ్యాలను రాసే సైరిక కవి!
ఆరు ఋతువులు పెట్టే అగ్ని పరీక్షలో
ఓరిమి రక్షణ కవచంగా ధరించి
ఆశను జీవన శైలి గా శ్రుతి చేసుకుని
సీతా దేవిలా నెగ్గుతూ వచ్చే రైతే
ఆకలి బాధలు తీర్చే అన్నదాత!
Comments
Post a Comment