సన్మానం 3/3/2021

 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

వెన్నెల శిల్పం రూప శిల్పి

***************

1. మన్నె లలిత గారు

2.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు

3. సుధారాణి కృష్ణం రాజు గారు

4. సుగుణ మద్ది రెడ్డి గారు

5. కోరాడ నరసింహారావు గారు

6. డి.ఉషారాణి గారు

7. భరద్వాజ గారు

8.పరాంకుశం రఘు నారాయణ గారు

9.విజయ లక్ష్మి యాదాద్రి గారు

10. ప్రమోద మునిమడుగు గారు

11.సునంద వురిమళ్ళ గారు

12.మర్రి జయశ్రీ గారు

********

1

[03/03, 8:05 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం.

 తేదీ :3/3 /21 .

అంశం : సన్మానం .

శీర్షిక :జ్ఙాపిక.

 పేరు :మన్నె పిన్నక లలిత .

 ఊరు: హైదరాబాద్.

************************************************

  గుర్తింపు పొంది ,చేసిన ,రాసిన

 పనికి సత్కారం

 గుంపులో గోవిందంలా

 పని చేయక, పరుల రచనలను

  తస్కరించి తన పేరుతో

 చెలామణీ చేసుకునే కుహనా  

 కవనాల సృష్టికర్తలు

 నీతిబాహ్యమైన చర్యలు

 ఏహ్యమైన ఏర్పాట్లతో

 ఒక పువ్వు, ఒక దండ,

 ఒక జ్ఞాపిక కోసం వెంపర్లాడుతూ

 గౌరవ డాక్టరేట్  అంటూ

కూరగాయలు కొనుక్కున్నట్టు

ధనంతో కనుక్కుంటూ

 సన్మానాల మీద సన్మానాలు పొందుతూ

  విర్ర వీగుతున్న వెర్రినాగన్నలు( నాగమ్మలు)


  ఇవా సన్మానాలు!!!!!!!

 20వ శతాబ్దం చివరలో 

కలుషితమైన సన్మానాలు

 రాయల వారి ఆస్థానంలో

 గండపెండేరం తొడిగించుకున్న పెద్దనలా

 అవధానాలలో తమను ఓడించేవారు 

లేరంటూ

మీసాలు మెలివేసిన పండిత ప్రకాండులులా 

 నేనే ఈ యుగకవిని అంటూ

 గుండె ధైర్యంతో చెప్పిన మహాకవిలా

 కవి చక్రవర్తిలా,యుగ కవిలా ,వేగుచుక్కలా

  జ్ఙానపీఠ్  పొందిన మహాకవులలా

 గండపెండేరాలు ,కంకణాలు, గజారోహణాలు

ఘన సన్మానాలు....అవీ సన్మానాలంటే!!

2

[03/03, 8:06 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: సన్మానం అదొక వేడుక

ఏ రంగంలో ఎవరు కృషి చేసిన నా వారిని సన్మానించడం మర్యాద



సన్మానం చేయడం ఆ వ్యక్తిని గౌరవించడం

అద్భుతమైన కృషి చేసిన ఎందరో మహానుభావులు సన్మానాలు అందుకొన్నారు


సన్మానం అంటే అతని ప్రోత్సహించడమే అతనికి ఉత్తేజం కలగా చేయడమే



మరింతగా ప్రేరణ కలుగజేసి

ఇంకొంత ప్రోత్సాహాన్ని అందించడమే సన్మానం యొక్క ప్రధాన బాధ్యత


సకల జనావళికి సన్మానాల కు ఆనంద సాగరంలో మునిగి తేలుతారు


సన్మానం అంటే అందరికీ 

ఉత్సాహమే కదా శాలువాలు మెమొంటో లు అందుకని ఎక్కడలేని సంతోషంలో ఆనంద పడతారు


సన్మానం అంటే గొప్ప పండుగ వారికి చప్పట్ల సంబరాలలో ప్రశంసలు అందిస్తారు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453

3

[03/03, 8:11 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*నేటి అంశం*సన్మానం*

*సాహిత్య సాంకేతిక విజ్ఞానం

ఏరంగంలోనైనా విజయం సాధించినప్పుడు సాధించిన

వారికంటే ఆత్మీయుల కు కలిగే

ఆనందం ముందు ఎన్ని సన్మానాలు అందుకున్న

ప్రేమ అనురాగం ఆప్యాయత లు అభినందనల ముందు

చాలా చిన్నదిగా అనిపిస్తుంది

సన్మానం అనేది ‌ఒక పనికి కానీ

కాలానికి కానీ పరిమితం కాదు

సముద్రం లాంటి మేధస్సును

ఎంత చిలికిన జ్ఞాన సముపార్జన పొందుటకు

ఆది,అంతం అనేది లేదు

ఎంత జ్ఞానం పొందిన ఎదుటి

వారి నైపుణ్యం అనేది మనం

పరిశీలించి పరిశోధించిన నాడు

నిత్య నూతనంగా పరిపక్వత పొందే జ్ఞానం ముందు ఎన్ని

సన్మానాలు పొందిన ఫలితం

ఉండదు

ఫలితం ఆశించకుండా చేసే ప్రతి పని సత్ఫలితాలను అందిస్తుంది

సన్మానాలు అనేవి ప్రొత్సాహకాలు మాత్రమే 

అందరి ఆదరణ పొందిన

ఆత్మీయత అభిమానం పొందే

అంశాలు అన్నీ సన్మానాలే🙏🙏👍

4

[03/03, 8:38 PM] +91 90354 73216: అంశం. సన్మానం 


నిరంతర శ్రమతో సమాజసేవలో

నిత్య ప్రకాశమిస్తున్న 

త్యాగఘనుల కిచ్చే గౌరవమైన

 జ్ఞాపిక     *సన్మానం*.  


  విశిష్టమైన జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకు.... 

 కంటికి కునుకు ఎరుగని సరిహద్దుల్లోని రక్షణ కవచానికి  .... 

  నీ ఆకలి తీర్చడానికి తన చమటనే అన్నంగా అందించే

  కర్షకులకు... 

 ప్రతినిత్యం  రోడ్లపై చెత్త ఊడ్చే

 పరిశుద్దాత్ములకు... 


  తమ ప్రాణాలు లెక్కచేయక వైద్య మందించే

ప్రాణదాతలకు...... 

..

   సంస్కృతీ సంప్రదాయాల నైతిక విలువలను భావితరాలకందించే

వెలుగు దీపాలకు.... 

 చైతన్యం రేకెత్తించే 

చిరస్మరణీయులకు... 

  ప్రకృతి   వెచ్చనిఒడిలో

 ఒదిగి  భవితకు  వన్నెతెచ్చే

 కవీంద్రులకు... . . 

     తియ్యని మాధుర్యం తో

గగన తలంలో  తిప్పే

గాన గంధర్వులకు..... . 


 విజ్ఞాన   జ్ఞాన  జ్యోతులకు... 


ఆధ్యాత్మిక  సంపద నందించే

  ఆరాధ్యులకు.....  శతకోటి ప్రమాణం. 

నా   హృదయ కుసుమాలతో

 *సన్మానం*

పై అందరికీ శక్తి నిచ్చి ముందుకు నడిపే

  ఆ  దేవునికి/ దేవతకి

 నా కలంనుంచి జాలు వారిన అక్షర  మాలను సమర్పిస్తూ

ప్రణామం..... ప్రణామం.... ప్రణామం.


సుగుణ మద్దిరెడ్డి

ఐలవారిపల్లె

ఐరాల 🌷

5

[03/03, 8:39 PM] Korada: కవుల

         అంశం :- సన్మానం

  కోరాడ నరసింహా రావు....!

     పుణ్యం.... పురుషార్ధ0

       @@@@@@@@

సన్మా నించి... సత్కరించట మంటే.... కళామతల్లి ని...

ఆరాధించటమే....!

విద్వత్తుపై గౌరవాభిమానాల తో... వినయ విధేయతల్ని

ప్ర దర్శించ టమే....!

ఆయా వ్యక్తులలో ఉత్సాహాన్ని

పేంచి.... ఆ చైతన్యాన్ని 

పదిన్తలుగావిన్చటమే..!

సన్మాన మంటే... పడ్డ శ్రమకు ఆదరణ.... విద్వత్తుకు గుర్తింపు

లభిస్తున్దన్న భరోసా నివ్వట0...!

ఆ సృజనశక్తిని ప్రోత్సహిన్చట0

యేంత పరిస్రమించి పేరు తేచ్చు కుంటే సన్మానిమ్ప బడతారు... నిజంగా గోప్పే కదూ...!

ఐతే...., గుర్తించి... గౌ రవించి

సన్మానిన్చి... సత్కరించటమ్

అదింకా గోప్ప సంస్కారం...!

సన్మానమన్టే... ఆ వ్యక్తి బాధ్యతలు మరింత పేరగటమే

కర్తవ్యాన్ని మర్చిపోవద్దని...

గుర్తుచేస్తూ మరింత కార్యోన్ముఖుని గావిన్చట0!!

సాధించిన గోప్ప సత్కార్యాలకే కదా సన్మానాలు...!

మంచి పట్ల ఆకర్షితులను గావించే మహత్కార్యాన్ని చేస్తు న్నారోయీ...వీళ్ళు...!

 కోందరు... స్వప్రయోజ నాలకోస0...అర్హత లేని సన్మానాలతో... సన్మానాన్నే

అవమానించట0...సోచనీయమే కదూ....!!

అర్హత లేనివారికి అందల మేక్కించట0...ఉన్న వారిని అనగద్రోక్కట0...యివి నేరాలే కాదు... మహా పాపాలుకూడా!!

ఈ పవిత్ర కార్యాన్ని...

పవిత్రంగా చేస్తేనే... పుణ్యము

పురుషార్ధ మూను....!!

   *********************

        .......కోరాడ.

6

[03/03, 8:49 PM] +91 70755 17538: శీర్షిక.సన్మానo

.....

ఆకాశంలో ఊరేగే

మనిషి ఊహాలకు

రెక్కలను కట్టి

ఊరేగించి ప్రతిభను

అమాంతంగా వెలికి తీసి

ప్రతి మది గుండెల్లో

ఊరేగించి కీర్తిలో  నిలుపును

అర్హత వున్నాను లేకున్నాను

గొప్పగాను కీర్తించే దృశ్యమాలిక

ప్రతిభ గలవారికి

పట్టాభిషేకము చేసి

తరించుపోవును

కరెన్సీ వేటలో

అందని ప్రతిభకు పట్టాభిషేకం

అసమర్థులకు జేజేలు

పలుకుతూ సాగిపోయే

నేటి సమాజ తీరుకు

అడ్డుకట్టలు వేసే దారి కానకున్నదే

కీర్తికోసము నడిచే దారిలో

సమర్థతలేని వారికి

సన్మానము జరుగు నేటి

సమాజ తీరును మార్చేవారులేరే


డి.ఉషారాణి

చిత్తూరు జిల్లా

7


[03/03, 9:05 PM] భరద్వాజ గారు: 🦚🚹కవితాగానం☂️♈ 

అంశం-సన్మానం 

శీర్షిక -అబ్బా- వద్దండీ-!

పేరు భరద్వాజరావినూతల 

కొత్తపట్నం 

9866203795

*******************************

*******************************

సన్మానం


 మూడక్షరాల పదం..

 ముల్లోకాలను చూపే  ఊహల వాహనం-

 గుండెను పులకింతలుపెట్టే రామబాణం-

 గుర్తుపెట్డుకునే పుణ్య కార్యక్రమం- సన్మానం

ఆమాట పెద్దగమ్మత్తు-

 ఎంతటివారినైనా చేస్తుంది చిత్తు-

మనిషి గుండె పెరుగుతుంది ఎత్తు-

పచ్చగా కనిపిస్తుంది లోకంయావత్తు-

 ఒకనాడు

అక్షరాలను ఔపోసన పట్టి న వారికి-

సంగీత లక్ష్మిని బంగరు పూలతో పూజించినవారికి-

నటరాజుకు నాట్యార్చన చేసినవారికి---

వేదపురాణాల చెప్పేవారికి చేశారు దీనిని-

నిజమైన ప్రతిభకు పట్టడం‌ కట్టడం న్యాయ మని‌నమ్మి,-

 మరినేడో --

ఎంతవారలైన కాంతదాసులే అన్నది‌ఒకనాటిమాట-

ఎంతవారలైన సన్మాన దాసులే అన్నది ఈనాటి మూట-

ఇచ్చుకుంటేవాయనం-పుచ్చుకుంటేవాయనం లాగా-

నావాడయితే-

నాకులంవాడయితే-

నామతం వాడయితే చాలు-

జరుగుతున్నాయి సన్మానాలు-

సిగ్గు పడుతున్నాయి శాలవా,దండలు-

డబ్బులకు సన్మానాలు

 అంగడి లో‌అవార్డులు-

పైసలకు ప్రసంసాపత్రాలు వస్తుంటే -

పొగడ్తల శాలవలు-

చప్పట్లపూలు‌చల్లించుకుంటే

అవుతుందా సన్మానం-

తల్లిని గౌరవించే సంప్రదాయం-

తండ్రిని ప్రేమించే సంస్కారం-

గురువును గౌరవించే మనసు-

మనకోసం బ్రతికే జవానులకు

మనసులోనే నమస్కరించే

మంచితనం ఉంటే -

అదే‌కాదా నిజమైన

 సన్మానం -

************************************

ఇదినాస్వీయరచన 

✍️భరద్వాజరావినూతల (RB)✏️

8

[03/03, 9:05 PM] పరాంకుశం రఘు నారాయణ KS40: *కవితాగానం*


అంశం, సన్మానం


 *కవితా శీర్షిక, సన్మానసాదృశ్యం*


 వ్యక్తి శీలనిర్మాణానికి,


 వ్యక్తి సాధించిన ప్రగతికి, 


వ్యక్తిలోని ప్రతిభకు,


 వ్యక్తిలోని నైపుణ్యతకు,


 వ్యక్తిలోని సౌందర్య దార్శనికతకు,


 వ్యక్తిలోని గుణాత్మక భావజాలాలకు,


వ్యక్తిలోని ప్రామాణీకతకు,


 వ్యక్తిలోని ప్రతిభాపాటవాలకు, 


వ్యక్తి సాధించిన కార్యదీక్షకు, 


వ్యక్తి పడిన కఠోరశ్రమకు, 


వ్యక్తి లోని సృజనాత్మకతకు, 


దార్శనీయ కోణమే సన్మానం ! 


అది ఉత్సాహం నింపే దృక్కోణం!


 సకారాత్మక ఆలోచనా సాదృశ్యం!


 కృతజ్ఞతాభావ సంకేతం !


ఆత్మీయానుబంధ వితరణo!


 పరాంకుశం రఘు నారాయణ 

        మహబూబాబాద్

9

[03/03, 9:07 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:;**సన్మానం***

-----------********-----------


సచ్చీలుర మార్గం సన్మార్గం

సన్మార్గులకే చేద్దాం *సన్మానం*

సైనికులకే కేటాయించాలి అగ్రస్థానం

దేశభక్తులదవ్వాలి ఎద ఆస్థానం


దేశసరిహద్దుల్లో పహారా కాసే

జవానుల కన్నా ధీరులెవరు?

మరణం తప్పదని తెలిసినా సరే

కర్తవ్యాన్నిప్రేమించే దేశభక్తులు వారు


దేశరక్షణకొరకు ప్రాణాలను తృణప్రాయoగ

త్యజించే త్యాగమూర్తులు వీర సైనికులు

దేశమాతచరణాల రాలే నెత్తుటి పువ్వులు

ప్రాణాలుపోతున్నా పౌరుషంతో మండేరవ్వలు


దేశభక్తిలో అందరికన్న మిన్నయిన తారాజువ్వలు

దేశభక్తిరాగాల పలికించే పవిత్ర మువ్వలు

వారి కుటుంబసభ్యులు పుణ్యాత్ములు

దేశంకై తమ సంతోషాలను బలిచ్చే త్యాగధనులు


కవులారా రారండి!దేశభక్తులకేద్దాం కవనహారాలు!

అర్పిద్దాం పా(జ)వనులకు అక్షరసుమాలు!

అంకితమిద్దాం ఛత్రపతులకు  అక్షరచిత్రాలు! 

నైతికబలాన్నిద్దాం జవానుపరివారాలకు అభిమానాలతో!


:;*వల్లాల విజయలక్ష్మి**

*ఆలేరు*

10

[03/03, 9:22 PM] Pramoda Munimadugu Poetess: అంశం: సన్మానం.                     కృతజ్ఞత ను తెలియచేసే గౌరవమైన ప్రక్రియే సన్మానం

ప్రతిభకు పట్టం కట్టే....ఆత్మీయ ప్రశంస యే సన్మానం

ఇతరుల గొప్పతనం గుర్తింపే సన్మానం

భాధ్యతెరిగిన...ప్రవర్తనకు బహుమతియే...సన్మానం.                    మన మంచి ప్రవర్తన నే....అమ్మ కు చేసే సన్మానం.                                  మన అందమైన భవిష్యత్తే...గురువుకు మనం చేసే సన్మానం.                                         అందమైన హరివిల్లే......ఆకసా నికి సన్మానం.                                                           వసంతుడి  ఆగమనం తో ప్రకృతి మాతకు సన్మానం                                                                      

రాను రాను....ఈ పదమే పలుచనబడిపాయే

ప్రతిభ బదులు డబ్బు చేరే...సన్మాన మే చిన్నబో యే

స్వార్థపు రెక్కల మధ్య ..అస్తిత్వ మె కోల్పోయే.                                            ప్రమోద మునిమడుగు                      సరూర్ నగర్

11

[03/03, 9:24 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:03-03-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: సన్మానం

శీర్షిక: సన్మానం మోములో..

*******************

సన్మానం మొహంలో  అలుముకున్న విచార ఛాయలు !


సరియైన వ్యక్తిని

సాదరంగా గౌరవించలేక పోతున్నందుకు..


అర్హులైన వారికి

అందని ఫలంగా మిగులుతున్నందుకు...


కర్షకునిలా నిత్య సేద్యం చేస్తున్న కవి 

నాణ్యమైన కవితల పంటలెన్ని పండించి

మనసాకలి తీర్చినా

తృప్తి పడని  దళారి మనసు

ఇంకా ఏదో ఆశిస్తూ...


చచ్చు పుచ్చు తాలు రాశికి తబ్బిబ్బు అవుతూ 

చేయి తడిపిన వారికి ఇచ్చే 

మహత్తరమైన బిరుదు ప్రదానాలను చూసి..


సన్మానం మొహంలో రంగులు మారుతున్నాయి

ప్రశ్నించే గొంతు చుట్టూ

పకడ్బందీగా అల్లిన మాటల వలయాలు..


 రూపు రేఖా విలాసాలు మారిన సన్మానం..

సమాజం గర్వించదగిన వారి అండ చేరాలని తహ తహ లాడుతుంది..

12

[03/03, 9:28 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..సన్మానం

శీర్షిక..నిర్మలమైన మనసుల

పసిపిల్లలు దైవస్వరూపులు

చిరు ప్రాయంలో 

అరమరికలకు తావు లేదు వారి మదిలో

తెలిసి చేసే కుటిల మతులు కారు పిల్లలు

వారివి నిర్మలమైన మనసులు

పువ్వులా నవ్వులు రువ్వుతూ

ఆప్యాయంగా అల్లుకుపోయే

అమాయకత్వమే తెలుసు

పెద్దల స్వార్ధ బుద్ధులు ఎరుగని పిల్లలు స్వచ్ఛమైన మల్లెలు 

పేద ధనిక వ్యత్యాసం

పౌరుషం కోపం

పొగరుబోతుతనం ఏవి ప్రదర్శించని అమాయకత్వం 

ప్రేమానురాగాలే ఎరిగిన పసి పిల్లలు

ఆప్యాయత చూపిస్తే చాలు

మన చుట్టే తిరుగుతారు

పీడించుట భావ్యమా

పోరుతో పొందగలమా

పిల్లల మనసులో చోటును

నచ్చిన వారిని అభిమానిస్తారు

పూజ్యనీయులుగా గుర్తిస్తారు

పిల్లలు పిడుగులే కొన్నిసార్లు

చిన్ని బుర్రలో లెక్కలేనన్ని తలపులు

నూతన ఆవిష్కరణలతో

అప్పుడప్పుడు

అబ్బుర పరుస్తూ

ఆనందంలో ముంచే చిన్నారులపై

అభినందల సుమ జల్లులు కురిపిస్తే

పొగడ్తలతో ప్రోత్సహిస్తే చాలు

అత్యంత శక్తివంతులైపోయి

అనుకున్నది సాధిస్తారు

ప్రోత్సాహం కన్నా ఘనమైన సన్మానం ఉంటుందా 

చిట్టి గువ్వలకు

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧