నిర్వేదం 4321


 నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ

Author of vennela shilpam

********

1.డా.ఆంజనేయులు గారు

2. కోరాడ గారు

3.రమాదేవి కులకర్ణి గారు

4.సుగుణ మద్ది రెడ్డి గారు

5.మన్నె లలిత గారు

6.కె.ఇ.నిలమంగై గారు

7. సుధారాణి కృష్ణం రాజు గారు

8.రాజశేఖరుని శివ లక్ష్మి గారు

9.డా.దీపక్ ప్రాతి గారు

10.వురిమళ్ళ సునంద గారు

11.వినీలమ్మ

12.డా.బల్లూరి ఉమాదేవి గారు

13.ప్రమోద ముని మడుగు గారు

14.మర్రి జయశ్రీ గారు

***********

1

[04/03, 8:31 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: బ్రతుకులు నిర్వేదం

కొన్నిటి పట్ల అయిష్టత ఏర్పడటం సహజమే కదా


సమాజంలో అవినీతి అక్రమాలు జరిగినప్పుడు అన్యాయాల వాతావరణం వెలసినపుడు నిర్వేదం కలగడం నిరాశకు లోను సహజమే కదా


ప్రేమించే మనుషులు మనిషికి మనిషి దూరమైనప్పుడు

మమతల శక్తి లేనప్పుడు


జీవితం నిర్వేదం చుట్టూరా తిరుగుతుంది


అందుకే నేనంటాను నిర్వేదాన్ని వదిలిపెట్టు ప్రేమమయ ప్రపంచాన్ని ఆవిష్కరించు

నిర్వేదం నిన్ను ఏమీ చేయలేదు నిరాశకు లొంగి పోలేము

మనిషిగా మానవత్వంతో బ్రతికితే చాలు


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453

2

[04/03, 8:32 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️



కవితా గానం


*నేటి అంశం*

04.03.2021


*నిర్వేదం*


ఎనిమిది నుండి తొమ్మిది న్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు.


ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందన లు తెలపకుండా సహకరించగలరు.



✳️✳️✳️✳️✳️✳️✳️

2

[04/03, 8:33 PM] Korada: కవితాగాన0:-@నిర్వేదం@

కోరాడ నరసింహా రావు...!

"చతికిల బడితే... లేవ లేము"

  ***********************

అడుగడుగునా...ప్రతికూలాలు

అడ్డుతగిలి... ఓడించి... వేదిస్తూ... బాదిస్తుంటే....,

ఆ బ్రతుకుల్లో నిర్వేదం ఆవహించక....వారు సందడిగా

సంతోష సంబరాలు చేసు కోగలుగు తారా....!?

వోడుదుడుకుల ఆ జీవన ప్రయాణాలలో... యేన్నేన్ని

యేదురుదేబ్బలు..!

అడుగడుగునా అపజయాలే!

హాయిగా బతకగలమన్న ఆశ

చచ్చి పోయి... నాజీవితమిక

యింతే... నేనేలావున్టే నేం...

యేమైపోతే నేం... అనుకునే

నిర్వేదం తో... నిండి పోతాయా

మనసులు...!డీలా పడిపోయి

మూల చేరిపోతారా మనుషులు...!!

నమ్ముకున్నవారు నట్టేట ముంచారనో..., ఆశ లన్నీ...

అడియాసలైపోయాయనో...

పడ్డ శ్రమంతా... వృధా ఐ పో యిందనో..... కారనమేదైతేనే0

నిరాశ చేంది... నిర్వేదం పోంద టానికి...!!

            నిర్వేదానికి గురైన వారిని... నీకేం భయమ్లేదు...

మేమున్నామనే భరోసా నివ్వాలి...!

ఆ నిరాశా హ్రుదయమ్లో... ఆశలు చిగురిమ్ప జేయాలి...

వారిలో ఆ భయం పోయి...

నేనూ సాధించ గలననే నమ్మకాన్ని కలిగించ గలగాలి!

తననీ.... విజయునిగానిలిపి

అప్పుడే... ఆ మోములోనూ...

ఓ గర్వపు చిరునవ్వును....

చూడ గలుగు తాం....!!

************************

..........కోరాడ.

3

[04/03, 8:34 PM] Rama Kulakarni Hyderabad Poet: కవితాగానం 

************

రమాదేవి కులకర్ణి 

హైదరాబాదు 

8985613123


అంశం నిర్వేదం 

**************

  

                     జాగ్రత్..!!

                      💭💭💭💭

మూసిన కన్నుల కల 

తెరవాలి ఆశలు ఇల 


సుషుప్తి లోని చింతన 

ఆలోచన లోని యోచన 

కర్తవ్యం ఇలను మరచిన 

పగటి కలల్లో  తేలిన 

స్వాప్నిక జగత్తున నిలిచిన 

అందునా లక్ష్యం మున్ముందున ....? ? ? ? 


మనః కొలమానం మననం 

స్వర్ణమయమే స్వప్నం ...

కావాలి మరి సాకారం 

సద్ దిశణ నీ సంకల్పo 

కల్పమంత విస్తరించగా .....

వికల్పమవ్వాలి నిర్వేదం

నీరసించనీ నైరాశ్యం 

ఇక .......! ! ! ! 

గుండెలోని ప్రతిస్వప్నo 

పగటికలలోనూ జాగృతం 

మెలిపెడితే నీలో ఆశయం 

కలలో ఇలలో ఎల్లవేళలో ....

నీవే ఇక నవచైతన్యం .....! ! !

4

[04/03, 8:44 PM] +91 90354 73216: అంశం. *నిర్వేదం*


బాహ్య సౌందర్యం చూసి

మైమరచి పోతుంటి 



పంచేంద్రియ సుఖాలే

పరమప్రీతి అనుకొంటి. 


కామ్యకర్మలే

 కమనీయమనుకొంటి


మోహారణ్యం లో 

విహరించి

మురిసిపోతుంటి 


క్షణ కాల భోగాలే

శాశ్వత మనుకొంటి


కొండంత  సంపద ఉన్నా

దిగులు తీరకుండె


చావు పుట్టుక లు చూసి

  చలించి పోతుంటి...... 


 నీజాడ తెలియక... 

 నీ ప్రేమ  పొందక..... 

     

ఓ నిరాకారుడా,!

 సర్వాంతర్యామీ! 


నీ  వెలుగు తాకిడి తో

 

 బాహ్య బంధాల యెడ

*నిర్వేదం* *చెంది

 ఎగిరింది నామది

 ఎరుక తో... 


తన్మయం చెంది

 లీనమైయ్యింది నీలో. 


సుగుణ మద్దిరెడ్డి 🌹

ఐలవారిపల్లె

ఐరాల.

5

[04/03, 8:53 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం.

 తేదీ :4/3/ 21 .

అంశం :నిర్వేదం.

 శీర్షిక :డీలా  పడితే .

పేరు  :మన్నె పిన్నక లలిత.

 హైదరాబాద్.

************************

 సంసార సమ్మోహనాలు

 పాశుపతాస్త్రాలు

 వేదనా భరిత మోహనాస్త్రాలు 

 సంసార సుడిగుండాలు

 దరి చేరని ఊబి గుంటలు

 నీతిబాహ్యమైన పనులు

 సంఘవిద్రోహ కారకాలు

6

[04/03, 8:58 PM] Komandoori Neela Poet: కవితా గానం

అంశం: *నిర్వేదం*

తేది:04/03/2021

        వచన కవిత్వం


మదిలో కదిలే అనంత భావాలకు వారధి కట్టాలనుకుంటాం..!

ప్చ్..,కట్టలేని నిస్సహాయులమవుతాం..!


గజిబిజి మాలికలు అల్లుకొని ఏదో చేయాలనే తాపత్రయపు జలధిలో మునిగిపోతాం..!

ఈదాలనుకుంటాం..!

ఈదుతూనేవుంటాం గమ్యం కానరాకపోయినా..!


సంసారమనే సంద్రంలో మీనాలమై..,

అలసిన శరీరాలతో విశ్రాంతిని కోరుకొంటాం..!

కన్నులు మూతపడేవేళలో మాయ అనే మత్తు పొర కప్పి కలల ప్రపంచంలో తేలిస్తుంది..!


కలలో అన్నీ కనేస్తాం..!

అన్నీ మన చేతిలోనే వున్నట్లు అనిపిస్తుంది..!

మేలుకొని చూసేసరికి నిషా తొలగి *నిర్వేదం* ఆవహించి ఉసూరనిపిస్తుంది..!


ఇంకా ఎన్నో కష్ట,నష్టాలున్నాయని..,

సత్సంకల్పంతో ముందుకు సాగాలనే చైతన్యస్ఫూర్తిని కలిగిస్తూ మేల్పొలుపుతుంది..!!!!   

     

పేరు: కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

చరవాణి సంఖ్య:8897155600.

*ఈ పై  కవిత ఈ సమూహం కోసం రాసినదేనని హామీ ఇస్తున్నాను.*

7

[04/03, 8:59 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా‌ గానం🙏🙏

🙏సుధారాణి కృష్ణంరాజు🙏

*అంశం*నిర్వేదం*

04-03-2021(గురువారం)

*బాధ తప్త హృదయం లోతుల్లో నుండి వచ్చేది

నిర్వేదం వేదం కానిది నిర్వేదం

వైరాగ్యంతో విరాగిలా మారినపుడు జీవితం అంతా

నిర్వేద భరితమేనా సమాజ

శృంకలాలలో నలిగి పోయి విసిగి వేసారి చెడు బుసలు

కొట్టి యువత అడ్డ దారులు పట్టి పీడిస్తుంటే తట్టుకోలేని

తల్లడిల్లిన తల్లి పడే వేదన

రోదన నిర్వేదం

సమాజం ఎటు పొతుంది

ఎటు చూసినా కక్షలు కార్పణ్యాలు హత్యలు

హింసలు అరాచకాలు దురాగతాలు జీవన వేదం లో

వేదాలు పురాణాలు మటుమాయం కలి కాలం

అన్నట్టుగా వేదానికి బదులుగా

నిర్వేదం గా మారుతున్న

జీవన శైలి లో వేదాలకు చోటేది🙏🙏👍

8

[04/03, 8:59 PM] Lakshmi Chamarthi Khammam: కవితా గానం

04/03/2021

రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి

శీర్షిక : రేపటి కోసం 


నేటిని నిరాసక్తం చేస్తూ 

నిన్నంతా నిరాశల ముసుగేసుకుంది 


గుప్పెట్లోనుంచి రాలిపోతోన్న ఇసుకరేణువుల్లా 

క్షణాలు నిర్లక్ష్యంగా జారిపోతుంటే 


మనసుని పట్టికుదిపే సందేహాల మబ్బులు 

సడలిపోతున్న సంకల్పాల

మేఘ మధనానికి బయలుదేరాయి 


స్వేదజలంతో తడిసిన దేహానికి 

పోరాటాల ఆరాటపు దాహానికి 

ఊరట కలిగిస్తూ ఉరిమింది ఆకాశం 


ఇక రాలేవన్నీ 

రేపటి ఆశల కొత్తచినుకులే 


అలసిన రెప్పలవెనుకంతా 

అందమైన కలలే 


ఈ కవిత నా స్వీయ రచన. ఈ సమూహం కోసమే రాయబడినది.

9

[04/03, 9:02 PM] దీపక్ న్యాతి: *కవితా గానం*

పేరు : డా.దీపక్ న్యాతి

తేది : 04-03-2021

అంశం : నిర్వేదం

శీర్షిక ; మిగిలిందేముంది


జగతిన జీవనమేమున్నది

తొంగి చూసే వైరాగ్య పర్వం

నాగరికత పెరిగిన కొలది

తెరముందుకొచ్ఛేసింది నిర్వేదం

ఎవ్వరిని కదిలించినా ఒకటే ఊసు

ఏముంది బతుకీడుస్తున్నాం అన్నదే

విగత జీవుల్లా మొహం కన్నదే

పోల్చి చూస్తే జీవితం చిన్నదే

అయినా విరహాం ఉన్నదే

ఒక్కడి బతుకు మనుగడకోసం

లక్షల ప్రేరణ ఉపన్యాసాలు

ఉత్సాహ పరచ ఉన్నది దోచుకుంటారు

ప్రతి ఒక్కరు మార్గదర్శకులే

ముందుకు సాగ దారి ఇవ్వరు

తోడు ఉన్నామంటూ తోసేస్తారు

ఎవరినీ నమ్మాలో గందరగోళం

దంపతుల మధ్యే దాపరికాలుఃటాయి

జీవన చదరంగం ఏమిటో

ఎవరు ఆడుతున్నారు అంతుపట్టదు

ఇక మిగిలిందేముంది నిర్వేదమే


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

9


[04/03, 9:03 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం.

 తేదీ :4/3/ 21 .

అంశం :నిర్వేదం.

 శీర్షిక :డీలా  పడితే .

పేరు  :మన్నె పిన్నక లలిత.

 హైదరాబాద్.

************************

 సంసార సమ్మోహనాలు

 పాశుపతాస్త్రాలు

 వేదనా భరిత మోహనాస్త్రాలు 

 సంసార సుడిగుండాలు

 దరి చేరని ఊబి గుంటలు

 నీతిబాహ్యమైన పనులు

 సంఘవిద్రోహ కారకాలు

 మనిషి సంపాదించే డబ్బు యంత్రాలు

 సుఖ సంతోషాలు లేని కాపురాలు

 సమయం ఎరుగక చేస్తున్న పనులు

 వెసులుబాటు లేని ఇరకాటాలు

 సమయపాలన లేని భోజనాహారాలు

తెస్తున్నాయి ఎన్నో రోగాలు

 కనకు పగటి కలలు

 వేయకు ఆకాశానికి నిచ్చెనలు

 నిర్వేదంతో డీలా పడకు

 ఉన్నదానితో తృప్తి పడు💐

10

[04/03, 9:03 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*

తేదీ:04-03-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: నిర్వేదం

*******************

మానవ జీవన గమనంలో

అవరోధాల ఆటుపోట్లను ఎదుర్కొనే  నిర్వేదం

అనంత శక్తిని కూడగట్టుకుని

వేదనల చీకట్లను భరిస్తూ సాగిపోయే  జీవితం!


ఆవేదన లేని వేదమై అందమైన నాదమవ్వాల్సిన బతుకు గమనం

నిరాశా నిస్పృహలతో మొరాయిస్తూ నడవని బతుకు బండిలో

ఆత్మ స్థైర్య ఇంధనాన్ని నింపి

ఆనంద నిలయ తాళం చెవి ఇద్దాం..

ఆత్మ విశ్వాస దీపకాంతిలో అవుతుందిక నిర్వేదం!

11

[04/03, 9:12 PM] Vineelamma: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : నిర్వేదం

కవితా సంఖ్య: 43

తేదీ: 04/03/20 


పగబట్టిన కాలంతో

పరుగులు తీయలేక అలిసేను

జీవనరహదారి

బతుకు నడకను నడపలేక....!!


కొండంత కోయలేకున్నా

కావల్సిన కంటి మెరుపును

పూసుకోలేక

తడబడే క్షణాలను మోస్తున్న

మనసుకు శాంతి ఎక్కడ.....!!


దాహార్తిని తడుపుతూ పోతే

నీటికరువై ఎదురొచ్చి

మూసిన గతంలో దొర్లుతూ అతికిన

వాస్తవం

నిర్వేదంలో లిపి లిఖిస్తున్నది....!!


ఏ వేదమైనా మానవజీవన

వేదమే

అనుకూలత,ప్రతికూలత సరాగాలే

మనమే ఎదగాలి పరిష్కార బాణమై

మలయ మారుతంలా.....!!



                                   🌹వినీల🌹

12

[04/03, 9:20 PM] Balloori Umadevi Poetess: కవితా గానం

04/3/21

పేరు:డా.బల్లూరి ఉమాదేవి

అంశం: నిర్వేదం


 గాలి బుడగ లాంటిది జీవన యానంలో   

 ఎప్పుడేం జరుగుతుందో ఎరుగని వైనం

  సక్రమం అయితే కర్త కర్మ క్రియలం మనమే

  ఎదురుతిరిగితే అంతులేని ఆవేదనతో  

  నిర్వేదంలో పడిపోవడం తథ్యం 

  అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు

  మెదడు మొద్దుబారి ఏం తోచని స్థితిలో  

   కలిగేదీ మానవాళికి కలిగేదీ నిర్వేదం  

 ఆత్మస్థైర్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ

 ముందుకు సాగడమే కావాలి జీవిత లక్ష్యం

 ఎవరో వస్తారని ఏదో చేస్తారని   

 ఎదురుచూస్తూ కూర్చోక 

  లక్ష్య సాధనకై చేయాలి ప్రయత్నం

  అప్పుడే నిర్వేదం మటుమాయం  

 బ్రతుకంతా తోంది ఆనందమయం

 పగటి కలలు కంటూ నిజం  కాలేదని  

 ఆవేదన పడుతూ ఏడవడం కన్నా 

 స్వశక్తితో నిర్వేదాన్ని పారద్రోలి

 విజయపథం వైపు సాగడమేకావాలి గమ్యం

  చేరుకోవాలి దాన్ని సత్వరం

13


[04/03, 9:35 PM] మర్రి జయశ్రీ: కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..నిర్వేదం



అనంత జీవన పయనంలో

అడుగడుగునా ఎదుర్కొనే అవాంతరాలు ఎన్నో

వేధించే వేదనలెన్నో

బతుకు బండి సాగలేక

నిరాశలో కూరుకుపోతే

నావ తీరం చేరేది ఎలా

ఆత్మవిశ్వాసంతో

ముందడుగు వేస్తూ

ఆత్మస్థైర్యంతో సాగిపోవాలి

అప్పుడే కదా

నిర్వేదం నిండిన జీవితాల్లో

కొత్త ఆశలు చిగురిస్తూ

సంతోషం వెల్లివిరిసేది

విజయానికి చేరువయ్యేది

14

[04/03, 10:05 PM] Lalita Sister: కవితా గానం 04/3/21..                                    .ప్రమోద ముని మడుగు.                   అంశం: నిర్వేదం.                          ఉత్సాహం తో ఉరకలు వేసే.....

మనసుకు కళ్లెం వేస్తూ.....

గుండెలు పగిలే......వార్త 

సాధికారత సాధించా మంటూ..సంబరాలను జరుపుకుంటూ...

ఆధునిక యువతి..అన్నిట్లో..ముందే. అంటూ....

ఆకాశానికి నిచ్చెనలే కట్టుకుని

ఆత్మ విశ్వాసం తో ముందుకు పరిగెడుతున్నా...

ఆడపిల్లగా..పుట్టడమే ఓ వరమని

సభలల్లో....చెబుతున్నా.....

కానీ.....

ఈరోజు నా మది మూగబోయింది

 కాళ్ళ కింద భూమి తలకిందు లయ్యింది

ఓ...పసిపాపపై అత్యాచారం అంటూ...

వినిపించిన...ఆ వార్త

అప్పటివరకు ఉన్న ఉత్సాహం ఆవిరై పోయింది...

మనసంతా ...ఓ.నిర్వేదం

నా ఆశయాలను అపహాస్యం చేస్తూ..

నా గుండెను రంపంతో.... చీలుస్తూ

ఆడపిల్ల...పుట్టుకే..ప్రశ్నా ర్థకమై

నన్ను వెక్కిరిస్తున్నట్టుగా

నా మనసు నిర్వేదానికి గురైంది....

కానీ...ఆ నిర్వేదమే....చివరికి

ఓ ఆశయానికి.ఆలంబన గా దారిని చూపింది

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧