స్వీయ కవిత సమీక్ష 19/2021
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
VEERA GUDIPALLY
****************
కవి వరుల జాబితా
***********
1. ధనాశి ఉషారాణి గారు
2.ముడుంబతిరు వేంకటా చార్యులు గారు
3. Ch. విజయలక్ష్మి గారు
4. అపరాజిత్ గారు
5. పరాంకుశం రఘునారాయణ గారు
6. ఆంజనేయులు గారు
7. భారతీ శ్రీనివాస్ గారు
8. సుగుణ గారు
9. భేతి నాగలక్ష్మి గారు
10. సుధా రాణి కృష్ణం రాజు గారు
11. మన్నె పిన్నకలలిత గారు
12. భూపతి గారు
13.జక్కిడి వెంకట్ రెడ్డి గారు
14.మిట్టా లక్ష్మి గారు
15. వాణి సింహాద్రి గారు
16. ల్యాదాల గాయత్రి గారు
17. చిన నరసయ్య గారు
18. వురిమళ్ళ సునంద గారు
19. మర్రి జయశ్రీ గారు
20. డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు
******
1
శీర్షిక :లోకం పోకడ
********** లలితా కృష్ణ
పెదాలకు ఆత్మీయ పరిమళాన్ని అలదుకొని
మనసంతా మాలిన్యాన్ని పులుము కొన్న వారిని మహానుభావులను చేస్తూ మర్యాదలపల్లకీ లో మోయడాని కలవడ్డ లోకమిది
ముక్కు సూటిగా పోతే
మూర్ఖశిఖామణి అంటూ
సమన్యాయం అంటే అన్యాయంగా అడిపోసుకుంటుంది
అభాండాల పద భాండాగారాన్ని గుప్పిస్తూ...
నియంతృత్వ పాలన కు గులాంగిరీ చేయడానికలవడ్డ లోకమిది
నిజాయితీ యే ఇజంగా
నిఖార్సుగా నియమాలను పాటిస్తున్న వారికి
అహపు కొమ్ములు అసూయా సొమ్ములను
అందంగా అలంకరిస్తుంది
అంతేనా....!!
ఒదిగి ఉన్న వారి
ఎదుగుదలను ఏమాత్రం ఓర్వలేక
ఈగో...లని రాగాలు తీస్తూ భూగోళానికి పరిచయం చేస్తుంది.
నిర్వేదపు చీకట్లను వెంటేసుకుని పాతాళానికి కూరుకు పోయే
పిచ్చిమాలోకమా..!!!
లోకం పోకడ ఇంతే నని
ఆత్మ విశ్వాసపు పొద్దు పొడుపు వై
ఆత్మావలోకనం చేసుకుంటూ
అభ్యుదయ శిఖరాలవైపు సాగిపో
********** లలితా కృష్ణ
కవన జ్యోతి
కవి: లలితా కృష్ణ
లోకం పోకడ పై సమీక్ష
సమీక్షకులు: కెసి నరసయ్య
లలితా కృష్ణ మేడంగారు లోకం పోకడ కవితను చక్కని ఎత్తుగడతో ప్రారంభించారు
పెదాలకు ఆత్మీయ పరిమళాన్ని అలదుకొని
మనసంతా మాలిన్యాన్ని ఫులుముకున్న వారిని.....
మర్యాద పల్లకిలో
మోయడానికికలవడ్డ లోకమిది
ఇక్కడ లోకం తత్వాన్ని స్పష్టం చేశారు
మనసంతా మాలిన్యాన్ని పూనుకోవడం అనే వాక్యం లో గొప్పవాళ్ళ దౌర్భాగ్యం తో పాటు వారి ఆంతర్యాన్ని తత్వాన్ని చెప్పకనే చెప్పారు దోపిడీ చేసి కోటానుకోట్లకు ఎగబడ్డ వారిని గొప్పవాళ్ళ గా మనం కీర్తించటం ఇక్కడ కవి యొక్క ఆంతర్యం అని స్పష్టమవుతుంది
ఇక్కడ దోపిడి సమాజాన్ని ప్రశ్నిస్తుంది
ముక్కుసూటిగా పోతే మూర్ఖ శిఖామణి
సమన్యాయం కాపోతే అన్యాయం గా ఆడిపోసుకోవడం అని చెప్పడంలో
దోపిడీని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిన సంఘటనలు ఇక్కడ గుర్తుకు వస్తున్నాయి
అబాండాల పద భాండాగారాన్ని గుప్పిస్తూ అనటంలో కవయిత్రి ఔచిత్యం తెలుస్తుంది
నియంతృత్వ పాలనకు గులాంగిరి చేయడానికి అలవాటు పడ్డ లోకమిది
పాలకులు నియంతృత్వంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పక్కన పడేసి ప్రజా వ్యతిరేక ధోరణులతో పాలన సాగించడం పై ప్రజలు ప్రశ్నించడాన్ని తట్టుకోలేని పాలకులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టింది
కవయిత్రి తన కవనంలో చక్కని ముగింపు ను అందించారు
ఆత్మవిశ్వాసం పొద్దుపొడువై
ఆత్మావలోకనం చేసుకుంటూ
అభ్యుదయ శిఖరాల వైపు సాగిపో అని పిలుపునిచ్చారు
లోకం పోకడని నిందించకుండా ప్రజల కర్తవ్యాన్ని గుర్తు చేశారు
ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉదయిస్తున్న సూర్యుని తో పోటీపడి జీవన మనుగడ సాగించాలని పిలుపునిచ్చారు అభ్యుదయ భావాలతో ప్రజా ఉద్యమాలను నిర్మించే దిశగా సాగిపోవాలని పిలుపునిచ్చారు
కవయిత్రి లలితా కృష్ణ మేడం లోకం పోకడ అనే శీర్షికన తన కవితలో అభ్యుదయ భావాలతో సమాజం మార్పునకు పాటు పడాలని సందేశాత్మకమైన కవనాన్ని అందించారు వారికి ధన్యవాదాలు అభినందనలు
2
తేటగీతి పద్యాలు
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లాా
**********
కలియు గములోన కరోన రక్కసంటు
ఊరు వాడల పాకుతూ ఊపిరేల
తీసి భయమున ముంచుతూ తియ్య వద్దు
జనుల ప్రాణమును కాచుమ జగతి లోన
కష్ట మొచ్చిన నేమియు కష్ట కాల
మందు మనసున యున్నట్టి మంట తీర్చి
మనిషి లోన మానవతను మలిచి బతుకు
నిచ్చు భవితను మలిచేటి నరుడె నేత
.
విచ్చు కొనెడు గులాబీలువిoదు తోడ
మదిని తట్టును మనిషికి మమత కూర్చి
నడత మార్చును పదుగురు నచ్చి నట్టు
మలచి మలిచెడక్షరములు మoచి నింపి
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లాా
సమీక్షకురాలు :డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు
ధనాశి ఉషారాణి
గారి తేటగీతి పద్యాలు
అదరిని పట్టి పీడిస్తున్న కరోనా గురించి,వ్రాసిన పద్యములు బావున్నాయి.
మనిషిలోని మానవతను మలచిభవితను మలచేవాడే నాయకుడంటూ మానవత్వాన్ని పెంచుకోవాలనే సందేశం బావుంది.
మదిని తాకే అక్షరాలు మంచిని పెంచతాయంటూ నడతనుమార్చే అక్షరాలను గురించి వ్రాసిన పద్యం బావుంది.
ధనాశి ఉషారాణి గారికి అభినందనలు
3
[19/05, 8:16 PM] Tiru Venkatacharyulu Ks6:
**** కవనజ్యోతి ****
తేదీ: 19-05-2021.
ముడుంబ తిరు వేంకటా చార్యులు, మహబూబాబాద్.
#నాకు నచ్చిన నాకవిత#
(నా కవితల్లో నాకు నచ్చినవి చాలా వున్నవి, కానీ ఒక్కటే అన్నారు కనుక, "కవిసమయం" కోసం ది:08-06-2020 నాడు రాసిన మా అమ్మ కథ నాకు అత్యుత్తమైనదిగా తోచింది. పంపుతున్నాను.)
శీర్షిక :
మరణశయ్యపై మనోవ్యధ.
(జానపద గీత రూపం)
రేయి తెలవారినా, బతుకు తెల్లారునా?
ఈ రేయి తెలవారినా, నా బతుకు తెల్లారునా?
ఊరు పొమ్మంటుంటే,
కాడు రావద్దంటే,
గుండె గొంతుకలోన కొట్టాడుతుంటేను
/ఈరేయి తెలవారినా/
కాలుకదపా లేను, పక్కకొరగాలేను, లేచికూసోలేను ఏమిచేతు?
కాల్జేతులాడవు,
కంట్లో కునుకురాదు,
గతము మరపురాదు ఏమిజేతు?
పుట్టింటి గారాలపట్టినై,
అన్నల గారాబు చెల్లినై,
అందరికన్నుల్లో
కనుపాపనై పెరిగి,
ముద్దుముద్దుగా పెరిగిన నేను,
ఎనిమిదేండ్లకే ఇల్లాలినై,
పెద్దబలగంలోన బండచాకిరితో,
గానుగలో పిప్పినై నలిగిపోతి.
అత్తగారు ప్రేమ ఆకులో వక్కాయే,
పంటనలగదాయే,
బయటికుయ్యలేను,
నమిలిమింగలేను,
ఏమిచేతూ?
పేదరికము మాకు పాఠాలు నేర్పింది,
పొట్టతిప్పలకొరకు పల్లెటూరి బతుకు,
ఇంటిదైవానికీ వేన్నీళ్లు, చన్నీళ్లై చేసిన పనులెన్నో,
గుట్టుగా బతుకీడ్వ కిటుకులు నేర్పింది.
కన్నకడుపులను కంటికి రెప్పోలే బువ్వకు, బట్టకు లోటు లేకుండా సాదుకుంటీ.
పెద్దసంతునిచ్చి, నా పసుపుకుంకుమ, దేవున్నిజేరింది,
నా బతుకునేమో నట్టేట ముంచింది,
కష్టకాలమొచ్చే కాపాడు దేవుడా!
కరుణించుమని నే వేడుకుంటి,
ఏ మూలనున్నడో,
నా మొర విన్నడో,
నా కొడుకులే
నాకు ప్రాణమైరీ,
కష్టకాలములోన బుద్ధిమంతులై,
అన్నింట కష్టించి పైకొచ్చిరీ,
ప్రాణంలో ప్రాణంగా
నన్ను జూసుకుంటు,
కంటికి రెప్పోలే సాకుతుండ్రు.
ముదిమివయసులోన మంచాన పడినాక,
చాతనైనంతలో సేవజేస్తున్నరు,
ఎందరున్నగాని
నా ఆర్తి దీరదు,
నా బాధ వినరారు,
ఏమీజేతు?
వొళ్ళంతా నొప్పాయే, పచ్చి పుండ్లాయే
దేవుడా నన్నెందుకు దీస్కపోవు?
ఎన్నాళ్ళు ఆయుష్షు రాసిపెట్టినావు,
ముసలిజీవిమీద జాలిలేదా?
ఎందుకయ్యా సామి ఇట్లేడిపిస్తావు,
దయలేద యీ కట్టె మీద నీకు?
ఎందుకయ్యా సామి ఇట్లేడిపిస్తావు,
నీకేమి లాభము యీ కట్టెతో?
ఎందుకయ్యా సామి ఇట్లేడిపిస్తావు,
ఇంకేమి లాభము యీ కట్టేతో?
@@@******@@@
ఇది నా స్వంతరచన. అనుసరణ, అనుకరణ, అనువాదము కాదు.
మీరూ.. స్పందించరూ..!!
అన్న శీర్షికలో స్వీయ రచనకు సమీక్ష
సమీక్షకురాలు :లలితాకృష్ణ
ముడుంబతిరు వేంకటా చార్యులు గారు తమ స్వీయ రచనలో
అమ్మ మనో వ్యధను అక్షరీకరించారు
వానప్రస్థపు వ్యధను
మరణశయ్య పై మనోవ్యధ అన్న శీర్షిక తో
అచేతనావస్థ శరీరభాగాలను ఆవహించినప్పుడు
పడే నరకయాతనకు అద్దం పట్టిన కవితఇది*
రేయి తెల్లారినా బతుకు తెల్లారునా?
అంటూ..
ఎత్తుగడ తోనే
*ఆర్తి నిండి.....
అక్షరాల వెంటపరుగులు పెట్టించి కంటతడి పెట్టించింది ఈ కవిత*
పుట్టింటి గారాలపట్టిగా
అన్నలముద్దుల చెల్లిగా
ముద్దుగా పెరిగిన తల్లి
ఎనిమిదేళ్ళకే ఇల్లాలై
బండెడు చాకిరి తో తల్లి
పడ్డ కష్టాలను తెల్పుతూ..
పసుపు కుంకుమ దేవున్ని జేరింది అన్న వాక్యప్రయోగం తో
కవి కలం
స్రవించిన అక్షరసిరా
ప్రతీ పాఠకుడి
గుండెను ద్రవింపజేస్తుంది.
గానుగలపిప్పి....
పొట్టతిప్పలు
వేన్నీళ్ళ కు చన్నీళ్లు
కంటికి రెప్పోలె
పదాలప్రయోగంతో
అభివ్యక్తీకరణ బాగుంది
సర్
రెక్కలకష్టం చేసిన శరీరం
తనమాట విననప్పుడు
అందరితో సేవచేయించుకోవడం ఏమాత్రం ఇష్టపడని అమ్మ అత్మాభిమానాన్ని
మనోవ్యధను
పరకాయ ప్రవేశం చేసి చెప్పారు సర్
అభినందనలు సర్
4
Vijayalakshmi Ch KS 38:
కవనజ్యోతి
తేది 19-05-2021
చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
శీర్షిక :స్నేహమయి
ఓ స్నేహమయీ...
నీ నిర్మల నిరాడంబర కోమల హృదయం
కోరింది నా చెలిమి..
నీ రాక చకోరమై మార్చింది వచ్చి..
నా జీవన సరళిని మనోహరంగా..
నీఆప్యాయతా మలయ వీచికలు
నా మనసున కురిపించె తేనె జల్లు
నీ ప్రేమ మాధురి...
నా మనో తటాకపు వేదనా తరంగాలను ఓదార్చి సాంత్వన కూర్చింది
నీ అనుభవ విజ్ఞాన ఖనులు
నా జీవన మార్గపు కరదీపికలు
నాలో విరిసే ప్రతి చిరు నవ్వూ..
నీ స్నేహ సుగంధపు విరిజల్లు..
నీ స్నేహం నాకు అమృత హస్తం
నిలవాలి పారిజాతమై కలకాలం
పూవూ.. తావిలా..
జాబిలీ.. వెన్నెలలా..
జ్యోతి.. కాంతిలా..
ఆత్మ.. శరీరంలా..
వీడని నీడలా...
విడదీయరాని.. వీడిపోలేని.. బంధమై
వినీలాకాశంలో వెలిగే తారల్లా ..
మన స్నేహం విరాజిల్లాలి అజరామరంగా......
కవన జ్యోతి
తేదీ:20-05-2021
కవితా శీర్షిక: స్నేహమయి
కవయిత్రి: చెన్నా విజయ లక్ష్మి,బీర్కూర్
సమీక్షకురాలు: వురిమళ్ల సునంద, ఖమ్మం
********
వినూత్నంగా కవితా సమీక్ష ను ప్రవేశపెట్టిన నిర్వాహకులు వీరా గుడిపల్లి సారుకు లలితా కృష్ణకు హృదయపూర్వక అభినందనలు.
శ్రీమతి విజయలక్ష్మి గారు మన కవన జ్యోతి సభ్యురాలిగా ఏ అంశం ఇచ్చినా అలవోకగా ఎంతో ఉత్సాహంగా కవిత్వ సృజన చేస్తుంటారు.
వీరు రాసిన కవిత చాలా బాగుంది.
శీర్షిక చూడగానే విషయం ఏమిటో అర్థమవుతుంది.
అలాగే వీరు ఎత్తుగడలో కూడా స్నేహమయీ! అంటూ మొదలు పెట్టడం విశేషం.
తన నేస్తంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నేస్తం మనసు ఎలాంటిదో చక్కని ప్రతీకలతో అక్షరీకరించడం బాగుంది.ఎందుకు తనతో చెలిమి కోరుకుంటుందో ఇలా అంటారు" నీ నిర్మల నిరాడంబర కోమల హృదయం" నిరాడంబరం, నిర్మలత్వం మనిషిలో ఉండాల్సిన ఉన్నత గుణాలు.అందుకే స్నేహం కోరుకున్నారు.తన జీవన గమనాన్నే మనోహరంగా మార్చిందని, ఆప్యాయత గంధపు గాలులై మనసులో తేనెజల్లు కురిపించాయి.
"నీ ప్రేమ మాధురి* . వేదనా తరంగాలను ఓదార్చి సాంత్వన కూర్చింది" స్నేహంలో ఉన్న గొప్పతనం అదే. కష్టాల్లో ఉన్న సమయంలో ఓదార్పు లేపనం అవుతుంది.
అందుకే తనతో స్నేహం అమృత హస్తం లా భావిస్తున్నానని ..ఇద్దరి స్నేహం ' పూవు-తావిలా,/ *జాబిలి వెన్నెలలా.. విడదీయరాని విడి పోలేని/ బంధమై... విరాజిల్లాలి/ అజరామరంగా
అంటూ రాసిన ఈ వాక్యాలు చదవగానే స్నేహం అంటే ఏమిటో ఎలా ఉంటుందో ఎలా ఉండాలో తెలుస్తుంది..మన స్నేహితులు కళ్ళముందు మెదులుతూ మనసంతా ఆనందం నిండుతుంది..
ఇక్కడ *నీ రాక చకోరమై *మార్చింది వచ్చి*అనే వాక్యం పాఠకుని సందిగ్ధంలో పెడుతుంది.చకోరం చంద్రుని వెన్నెల కోసం ఎదురు చూసే పక్షి. మొత్తం మీద చక్కగా ఉంది.
కవిత రాసిన విజయలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు..
నాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
వురిమళ్ల సునంద, ఖమ్మం
9441815722
5
[19/05, 8:21 PM] Aparajith
: నేను,,,,,!
అద్దంలో
ముప్పది సంవత్సరాల కిందట
ప్రతిబింబంలా లేదిపుడు
ఏబది ఏళ్లు దాటిపోయె!
వెంట్రుకలు తెల్లబడి
ముహం ముడతలు తెలీ
వృద్దాప్యంలోకి అడుగిడుతున్న ఛాయలు ,,,,,,,,,,,!
ఈ మధ్యకాలంలో,,,,,,,,
వేదనాభరిత సంఘర్షణలెన్నో
సముద్రపు అలలు
రౌధ్రంగా కొండలను ఢీకొన్నట్లు
మనసుకయిన గాయం
ఎవరో శరీరంలోంచి రక్తాన్నంతా తోడేస్తున్నట్లు!
తలచుకుని తలచుకుని
తలదిమ్ముతో
కాలం గతించినా కొద్ది
ఆలంబనగా నిలచిన వాళ్లను తప్ప
కావాలని అందరినీ దూరం చేసుకున్నాను!
ఈ రోజుకీ ఏభై ఆరు నిండి ఏభై ఏడో పడి!
మబ్బుతునకంటూ లేని ఆకాశం
భగ భగ మంటలతో మండుటెండలు
నా బ్రతుకే అంత
విషాద ఘంటికల్లో
ఆనందానికై అర్రులు చాచి చాచి
తలవేలాడేసుకున్న వెర్రిముహం!
దృష్టికందని దృగ్గోచర చిత్రం జీవితం
పగుళ్లుదేరిన బీళ్ళలో
నాగేటి చాళ్ళకై పెనుగులాట!
ఆ నెలవంక సాక్షిగా
నేను అడవిలో పూచిన అగ్నిపూవును!!
ఆపరాజిత్
***************************
కవి అపరాజిత్ గారి కవిత
సమీక్ష :మిట్టాలక్ష్మి
కవి అపరాజిత్ గారి కవిత
నేను....
ప్రతి ఒక్కరి కీ కలిగే ఆత్మావలోకనం ..ఈ కవిత లో
కనిపిస్తుంది.
జీవితం లో శరీరంలో కలిగే
మార్పులు ...
యవ్వనం లో ఉన్న అందం
నల్లని కేశాలు మార్పు చెంది
మొహం లో వచ్చిన ముడుతలను తెల్లని వెంట్రుకలను ప్రస్తావిస్తూ.....
వృద్ధాప్యం లో అడుగు పెడుతున్న ఛాయలు అంటూ
ఈ మధ్య కాలంలో జీవితం లో
జరిగిన సంఘర్షణలు
సముద్రపు అలలు ఢీకొట్టినట్టు
ఉపమానంతో పోల్చుతూ
ఆ ఢీకొట్టడం ఎలా ? ....
రౌద్రం గా ....అక్షరాలా నిజం...
ఆ దెబ్బలతో మనసంతా గాయాలే...ఆ సంఘర్షణల జ్ఞాపకాలు శరీరంలో ని రక్తాన్ని
తోడేసినట్టే అవుతుంది.
ప్రతి ఒక్కరి కీ ఇది అనుభవమే.
దీనికి అక్షరరూపం ఇవ్వడంలో
కవి కృతకృత్యులయ్యారు.
తనవారెవరో ఎవరు ఎవరో
తెలుసుకున్నాక పరిణితి వచ్చిన తర్వాత "అందరినీ దూరం చేసుకున్నాను" అన్నారు.
ఇది కూడా సహజమే ...
ఏబైఆరు నిండి ఏభై ఏడో పడి
అన్నారు.మబ్బుతునకంటూ లేని ఆకాశం ,భగభగ మంటల
మండుటెండలు అని...
"నా బ్రతుకే అంత విషాదఘంటికల్లో ఆనందానికి
అర్రులు చాచి" నిరాశ చెందినట్టు కనిపిస్తుంది.
నాగేటి చాలు కై పెనుగులాట
అన్నారు.
ఆ నెల వంక సాక్షి గా అడవిలో పూచిన అగ్నిపువ్వును అని
అభివర్ణించుకున్నారు.
సృష్టి లో ప్రతిదానికీ ఓ
పరమార్థం ఉంటుంది.
అపరాజిత్ గారు మంచి కవి.
సమాజం గురించి లోతుగా
పరిశీలన, యువత గురించి
ఆవేదన కనిపిస్తుంది.
నాకు అనిపించేదేమంటే
దాదాపు గా అందరి జీవితం ఇంతే .. వడ్డించిన విస్తరి కాదు.
వారు ఎదుర్కొన్న ఒడిదుడుకుల బట్టి అలా
అనిపించిఉండవచ్చు.
కవికి స్పందనే సంపద.
చాలా మంది కన్నా కూడా
మనం ఎంతో అదృష్టవంతులం. మనకు
దేవుడు ఈ స్పందన ,కవితలు
ఈ సాహితీ మిత్రులు, అన్నింటినీ అపురూపమైన బహుమతి ఇచ్చాడు.
ఆశావాదం పెంచుకోవడానికి
ప్రయత్నించాలి.వారు చెప్పేవన్నీ యధార్థములే.
కాని యదార్థం ఇలాగే ఉంటుంది.
నాకు అనిపించింది చెప్పాను.
మొత్తానికి వారి భావాలను
చక్కగా అక్షరీకరించారు.
...............................👌🏿👌🏿👏👏💐💐
6
[19/05, 8:22 PM] పరాంకుశం రఘు నారాయణ KS40
: *కవనజ్యోతి*
•••••••••••••••••••••••••••••
*శీర్షిక: ధనం మూలం మిదమ్ జగత్!*
మనిషి నయా అవతారమెత్తినాడేమో?
మనసు చచ్చుబడిపోయింది! మనసాక్షేమో!మరయంత్రంమైoది!
నేటి మనిషి అంతర్ముఖ భావమేమిటో?
ఊహించటం బహు కష్టమే మరి!
అజ్ఞాన తిమిరంలో బంధీ అయ్యిoది!
భౌతిక సంపదపై మక్కువెక్కువైంది!
ఉత్పత్తి ప్రధాన ప్రత్యామ్నాయమై
ఉరుకులు పరుగులతో ఏకంగా దౌడునే తీస్తోంది?
నాణ్యతా ప్రమాణాలకు కొలమానాలేమీ లేవు? గుణాత్మక దిశలోను మరో ఆలోచనే లేదు !
దృష్టంతా పరిమాణం పైనే, ఆకర్షణల భ్రమణం వైపే...,
నిలువెత్తు స్వార్థం నీలి మబ్బు ముసుగు తొడిగింది!
ఆ మందబుద్ధి ఆలోచన కుబుసాన్ని కప్పుకొన్నది!
ఈ మబ్బు తెరల నడుమ మనిషి ఎటు పోతున్నాడో? ఏమో?
సాటి మనిషిపై మాత్రం విషం చిమ్ముతున్నాడు!
అడుగు తీసి అడుగు వేస్తే
ప్రతి అడుగులోనూ ప్రతిఫలాకాంక్షే!
ప్రతిక్షణమూ పోరాటమే?
ధనదాహపు ఆరాటమే మరి??
అత్యాశనో ? పేరాశనో?? ఏమోగానీ,
ధనప్రవాహపు అలల్లో
కొట్టుమిట్టాడుతున్నాడు !
జీవితం అర్థం పరమార్థం అదేనని...కాబోలు?
*****************************
*పరాంకుశం రఘు నారాయణ*
*మహబూబాబాద్*
****************************
కవనజ్యోతి.
20-05-2021.
సమీక్ష.
సమీక్షకులు: ముడుంబ తిరువేంకటాచార్యులు
కవితాశీర్షిక: ధనమూలమిదంజగత్.
రచన: పరాంకుశం రఘునారాయణ.
ఈ కవితలో రఘునారాయణగారు 'ధనార్జనే' పరమార్థంగా సాగుతున్న మనిషి యొక్క క్రొత్త పోకడలను 'నయా అవతారం' గానూ మనసును'చచ్చుబడిన మరయంత్రం' గానూ అభివర్ణించారు. మనిషి మనసులోమాట అత్యంత నిగూఢంగా మారి 'ఊహించడం' సాధ్యపడని రహస్యంగా పేర్కొన్నారు. భౌతిక సంపదపై మక్కువ నాణ్యతా ప్రమాణాలపై దృష్టిపెట్టని స్వార్థం కలగలసిన 'అజ్ఞానతిమిరం'లో మునిగిపోయిన గ్రుడ్డి వానివలే తానేం చేస్తున్నాడో అనే వివేచన కొరవడిన మనిషి నిలువెత్తు స్వార్థమనే నీలిమబ్బుతోనూ వివేచన లేని ఆలోచనలను 'కుబుసం' తోనూ పోల్చారు. ఈ స్వార్థపు చీకట్లలో మనిషి గమ్యం సాగే తీరుపై ఆందోళన వెలిబుచ్చుతూ , తనలోని స్వార్థాన్ని గుర్తించలేని మనిషి , 'గురివిందగింజ తన నలుపెరుగనట్లు' ఎదుటివారిలో స్వార్హాన్ని ఎత్తిచూపుతూ , ప్రతీకార విషం చిమ్ముతున్నాడని ఆవేదన చెందారు. ప్రతీక్షణం ప్రతిఫలాపేక్షదృష్టితో చేసే పోరాటంలో ధనార్జన వ్యామోహప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషి , జీవితపరమార్థాన్ని గుర్తించడంలో తప్పటడుగు వేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ధన వ్యామోహం వీడితేనే స్వార్తత్యాగం సాధ్యమని , మునుపటి మనుగడ సాధ్యమని పరోక్షంగా ప్రబోధిస్తున్నారు.
మనిషి పోకడలపై , మనసుపై కమ్ముకున్న స్వార్థపు మబ్బుతెరలను 'విశేషించిన' అద్భుత కవిత ఇది.
సమీక్షకు అవకాశం కలిగింది. నేను చేసిన తొలి సమీక్ష ఇదే. ధన్యవాదములు.
7
[19/05, 8:25 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: స్నేహం
ఇరువురి హృదయాలను కలిపే స్నేహం అపూర్వం
పెరిగి పెద్దయిన మర్చిపోలేని అమోఘ జ్ఞాపకం స్నేహం
మన బాధలు మన గాధలు మన విహారాలు మన మనసులోని గాయాలు
పాటలు పాడుకుని బడిలో చదువుకొని
మామిడి తోటలో కాయలు దొంగిలించి
వెన్నెల్లో విహరిస్తూ జానపద పాటలు మిత్రులతో కోరస్ గా పాడుతూనే ఉండేవాళ్ళం
స్నేహమంటే తల్లిదండ్రుల తోనూ గురువుల తోనూ ఆ నెలవంక వెన్నెల విహారం గా
ఆకాశం లోని చుక్కల పందిరి కింద అర్ధరాత్రులు ఎన్ని ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు
రాత్రి ఇ ఎంత సమయం గడిచిపోయినా స్నేహపు జాడను వీడి ఉండలేం
స్నేహం వాడిపోని పరిమళ వీచిక వసంత ఋతువు
చిగురాకులు తిన్న కోకిల పాట
అందుకే స్నేహం మరువలేని జ్ఞాపకాల పూదోట
అది జీవితం చివరి శ్వాస దాకా నిలిచిపోయే అపూర్వ గాధ పదేపదే మదిలో తలుచుకొని ఆనందడోలికలలో
ఉయ్యాలలూగే ము కదా
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
సి హెచ్ ఆంజనేయులు సార్ గారు స్నేహం గురించి చక్కగా వివరించారు ఇరువురి హృదయాలను కలిపే స్నేహం
నిజమే కదా హృదయాలు వేరైనా ఆత్మ ఒక్కటే చిన్న తనంలో ఆడిన ఆటలు పాడిన
పాటలు స్నేహం అనేది పరిమళం వెదజల్లే వసంత ఋతువు తో పోల్చి స్నేహానికి
ఉన్న విలువ ఎంతో చెప్పారు
చివరి శ్వాసదాక ఎన్ని బంధాలు వీడినా చివరి దాకా
నిలిచి పోయేది స్నేహం అని
చెప్పడం నాకు చాలా బాగా
నచ్చింది సార్ ధన్యవాదాలు
సమీక్ష
సుధారాణి కృష్ణం రాజు
8
[19/05, 8:27 PM]
Gajula Bharati KS 20: కవనజ్యోతి కవిసమయం
****************
: రవీంద్రనాథ్ ఠాగూర్
శీర్షిక: విశ్వకవి
పేరు: గాజుల భారతి శ్రీనివాస్
ఊరు: ఖమ్మం
భావాలు విరబూసి
ఆలోచనలు ఎగసిపడే
జలపాతాలై
కవితల కావ్యమై
ప్రపంచ సాహితిక్షేత్రంలో మణిరత్నమై వెలుగులీనుతున్న కవిచంద్రుడు..రవీంద్రుడు
జనగణమన జాతీయగీత నిర్మాత
జగతిన నిలిచే రసరమ్య అద్భుతకావ్య
"గీతాంజలి"సృష్టికర్త
అతనొక మహామనిషి
మహోన్నత శక్తి
ప్రకృతిని ప్రేమించే గొప్ప సౌందర్యారదకుడు
మాతృభాష ప్రేమికుడు
కవీంద్రుడు..మన రవీంద్రుడు
అలవోకగా కుంచెపై వర్ణశోభిత చిత్రాలను చిత్రించే గొప్ప చిత్రకారుడు
ప్రపంచశాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చిన నిజమైన శాంతిస్వరూపుడు
మౌనంగానే ఎదగాలనే మనిషికి నిలువెత్తు నిదర్శునుడు
విశ్వమేథా సంపన్నుడు..
కవీంద్రుడు..మన రవీంద్రుడు
ప్రపంచం ఒక రహస్యమని
తెలుసుకొనుటకు కుతుహులపడే.. కవీంద్రుడు
నోబెల్ బహుమతి పొందిన
తొలి భారతీయుడు
చిన్నారి హృదయాలను వికసింపచేసే "శాంతినికేతన్"స్థాపకుడు
చిత్రాంగద గొప్ప నాటకన్ని సృష్టించినవాడు
గ్రామాభ్యుదయమే..దేశాభ్యుదయమని కలలుగని
శ్రీనికేతాన్ని నెలకొల్పిన భారతీయుడు
విశ్వమానవత వికాసానికి కృషిచేసిన
బహుముఖ ప్రజ్ఞావంతుడు
మూర్తీభవించిన భారతీయ సంస్కృతికి నిలువెత్తు దార్శినికుడు
సదా స్మరనీయుడు..
సత్య స్ఫూర్తిదాయకుడు
కవీంద్రుడు..
మన రవీంద్రుడు!!
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను
*****************
కవన జ్యోతి '
మీరూ.. స్పందించరూ..!!!
కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టిన కవన జ్యోతి నిర్వాహకులు శ్రీమతి లలితా కృష్ణ శ్రీ వీరా గార్లకు శుభాభినందనలు.🪴💐💐💐💐🪴
💐' కవన జ్యోతి ' లో నేను శ్రీమతి గాజుల భారతి శ్రీనివాస్ గారి 'కవితాంశం- రవీంద్రనాథ్ ఠాగూర్'
' విశ్వకవి' శీర్షికతో వ్రాసిన కవితను సమీక్షించడం సాహసమే!
అది చంద్రుడు రవీంద్రుడు అన్నా భారతి గారి మాటలు ముమ్మాటికి రవీంద్ర రవీంద్ర నాథ్ ఠాగూర్ గారికి వర్తిస్తాయి .ఎందుకంటే ప్రకృతి అంటే ప్రాణం అయిన ఠాగూర్ గారి భావాలను ఎగిసిపడే జలపాతాలుగా వర్ణించటం, సాహితీ క్షేత్రంలో మణిరత్న మై వెలుగులీనుతున్న కవి చంద్రుడు అనటం సందర్భోచితంగా ఉంది .
కవీంద్రుడు గా రవీంద్రుడు రచించిన జాతీయ గీతం, నోబుల్ బహుమతి పొందిన గీతాంజలి, రవీంద్రుని విశ్వ మేధా సంపన్నుడు అనటం కవయిత్రి భారతి గారి రచనా పాటవాన్ని తెలియజేస్తుంది.
రవీంద్ర కవీంద్రుడు నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు అని చెప్పి ఆరుబయట పాఠశాలను శాంతినికేతన్ స్థాపకుడైన రవీంద్రుని గురించి చిత్రాంగద నాటకాన్ని , శ్రీనికేతనాన్ని పరిచయం చేసి బహుముఖ ప్రజ్ఞావంతుడని, దార్శనికుడని ,సదా స్మరణీయుడు అని చెప్పటం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ముమ్మూర్తులా ఈ వాక్యాలు వర్తిస్తాయి.
ఎంత చెప్పినా అటువంటి పరిపూర్ణ పురుషునికి తక్కువే అవుతుంది.
ఠాగూర్ గారిని గురించి ఇంత స్పష్టంగా , విపులముగా తెలియజేసిన శ్రీమతి భారతి గారిని అభినందిస్తున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.
ధన్యవాదములు.
మన్నె లలిత.
9
[19/05, 8:28 PM] +91 90354 73216:
* *గుప్పెడు మనసు*
మమతలు ఎన్నో మధురిమలెన్నో మధురిమలెన్నో
స్మృతులెన్నో
సుడిగుండాలెన్నో
జ్ఞాపకాలెన్నో
విషాద గాథలెన్నో
భావాలెన్నో
బాధ్యతలెన్నో
అనురాగాలెన్నో
అవమానాలెన్నో
కోపాలెన్నో
కోరికలెన్నో
నిప్పురవ్వ లెన్నో ఆప్యాయతలెన్నో
రాగాలెన్నో
అనురాగాలెన్నో
సంతోషాలె న్నో
కష్టాలెన్నో
కన్నీళ్ళెన్నో
అన్నిటినీ
దాచుకొన్న
మనసేమో గుప్పెడంతే.
సుగుణ మద్దిరెడ్డి
ఐలవారిపల్లె
ఐరాల
ఇది నా స్వీయరచన.
***************************88
సమీక్షకులు :భూపతి గారు
సుగుణ మద్దిరెడ్డి... గారి కవిత
గుప్పెడు మనసు..
............................
గుప్పెడంత మనసు లోని
జీవన తరసంగాలను ,
అనుభవాల మానసిక
చిత్రాన్ని , సూక్ష్మంగా అక్షరాల తో......రంగరించి జీవిత రుచి
చూపారు .....సుగుణ గారు చాలా బాఉన్నదండి.....
10
[19/05, 8:29 PM]
Nagalaxmi Poetess Ks 43: శీర్షిక. కవిత్వము
🌺🌺🌺🌺🌺🌺
అభ్యసిస్తే రానిది
రక్తసంబంధ బంధము కవిత్వం
చిన్ననాటి ప్రాయంలో చిగురు
తొడుగులు వేయునది
లతలా కవితల హరితములు పైపైకి పాకుతూ...
మనసులోని భావాలను రూపకల్పన చేసి
అందమైన కవితల తీగల పందిరి అల్లి
నీడను చేకూర్చును హృదయానికి
ప్రతి కవి హృదయం ఎన్నో కవితలను
అల్లిన అందమైన హృదయమే కదా..
ప్రకృతి సోయగాలను తివాచి లుగా చేసి
తన అక్షర కుసుమాలను అందంగా
నందనవనంలా అనుక్షణం తీర్చిదిద్దే నేర్పరి కవి
ఈ కవిత నా స్వీయ రచన
బేతి నాగలక్ష్మి
ఆలేరు
సుగుణ మద్దిరెడ్డి
*
శీర్షిక. కవిత్వం.
కవి. బేతి నాగలక్ష్మి
అందమైన మొక్కదశనుంచి
తీగల పందిరిగా...
హృదయం లోని భావాలను. అక్షర కుసుమాలతో తీర్చిదిద్దిన నేర్పరి కవి
అని ప్రకృతి తో పోల్చి
బేతి నాగలక్ష్మి గారు
వివరించిన విధానం చాల బాగుంది. అభినందనలు మేడమ్ గారు👌👌👌👌💐💐💐💐 💐💐💐
అవకాశం కల్గించిన గ్రూప్
అడ్మిన్లకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏 🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
11
[19/05, 8:31 PM]
సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవన జ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*ఆత్మీయత కరువైతే*
19-05-20221(బుదవారం)
*మనిషి మనిషికీ మధ్య ఈర్ష్య , అసూయ, ద్వేషాలు ఎక్కడ చూసినా ఆత్మీయత అనురాగం నేడు మచ్చుకైనా కనిపించదు*అందరూ మనవాళ్లే కాని అవసరం వచ్చినప్పుడు ఎవరికి వారే ఒంటరిగా ఉన్నప్పుడు మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తే ఏమీ అర్థం కాదు*
*ఆత్మీయత కరువైనపుడు మనసు పడిన మనో వేదన
వర్ణనాతీతం మనసు అనేది గాయ పడిన వేళ ఆలోచనా శక్తి
లోపించినపుడు నేనున్నాను అని తోడుగా ఉండే ఒక మంచి
మిత్రుల సాంగత్యం లభించినప్పుడు వారికి కలిగే సంతోషం మిత్రులు కలిగించే
మనోధైర్యం, ఆత్మస్థైర్యం కొండంత బలం ధనంతో కొనలేని ఆత్మీయత మంచిని పంచే మిత్రుల వలన లభిస్తుంది*
*మంచి పుస్తకం చదివితే కలిగే
ఆనందం మంచి మిత్రులు
మాట్లాడే మాటల వలన కూడా పొందే అవకాశం ఉంటుంది 🙏👍
************************888
మనిషికి మనిషికి మధ్య ఆత్మీయత అవసరం
మిత్రుల సాంగత్యం ఎంతో అవసరం అప్పుడు సంతోషం మిత్రుల మధ్య పంచుకోవడం మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కొండంత బలాన్ని ఇస్తుందని ధనం ఇవ్వలేం అటువంటి ఆత్మీయత ఆనందం మంచి మిత్రులు తో మాట్లాడినప్పుడు మాత్రమే కలుగుతుందని సుధా కృష్ణం రాజు గారు తమ కవితలో అందించినటువంటి భావాలు చాలా చక్కగా చెప్పారు ఇది ఇది నా సమీక్ష
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
12
[19/05, 8:34 PM] మన్నె లలిత గారు కవయిత్రి: శీర్షిక :కరిగే కొవ్వొత్తి
పేరు :మన్నె పిన్నక లలిత.
హైదరాబాద్
చరవాణి సంఖ్య: 741 686 32 89.
**************************************
మానవత్వానికి కొలమానం లేక పోవడమే కాదు,దానికి
కులం లేదు , మతం లేదు, ప్రాంతం లేదు...
ఎల్లలూ లేవు
ఊపిరి వదిలే మనుషులకు
ప్రాణవాయువిస్తే కదా మానవత్వం
ఎండే చెట్టుకు నీరు
పండే కాయ దానం
నిరుద్యోగికి ఉద్యోగం
నిరుపేదకు ఆహారం
తల్లిదండ్రులకు చేయూత
ఇచ్చేదేగ మానవత్వం
ప్రకృతి విలయాల్లో
అనుకోని ప్రమాదాల్లో మృత్యు ఘంటికలు
మ్రోగినప్పుడు
ఎవరో వస్తారని ఏదో చేస్తారనే
ఆలోచన మాని
తక్షణ కర్తవ్యంగా వేస్తే ముందడుగు అదే
మానవత్వం
చూపించేవారు డబ్బు లేని రోజుల్లోనే
ఊరంతా కలిసికట్టుగా ఉండి
అన్నీ ఉన్న ఈ రోజుల్లో పెరిగిన స్వార్థం మార్చేసింది అర్థం
మానవత్వం చిరునామాకి
మన్సూద్ భాయ్ లాంటి కొందరు
ఆపదలో ఆదుకున్నా
కొొడిగట్టే మానవత్వపు
కొవ్వొత్తికి కొందరి చేతులే అడ్డు
ప్రజల సొమ్ముతో కోటీశ్వరులైన
సినీ, రాజకీయ రంగ ప్రముఖులు
ఏక తాటిపై నడుం బిగించి ఊపిరూదితే చిగురించదా మానవత్వం తిరిగి
మానవత్వమే మనిషి తత్వం జంతువులు చూపుతున్నాయి వదిలి పశుత్వం
ఈ రచన నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
*********************8
శీర్షిక. కరిగే కొవ్వొత్తి
కవయిత్రి పేరు. మన్నె పిన్నక లలితగారు
సమీక్షకురాలు :భేతినాగలక్ష్మి
మానవత్వ విలువలని చాలా బాగా విన్నవించారు
మనిషికి ప్రాణవాయువుని ఇస్తేకాదా మానవత్వం
అన్నీ ఉన్న ఈ రోజుల్లో పెరిగిన స్వార్థం
మార్చేసింది అర్థం
మానవత్వానికి చిరునామా అని
చాలా బాగా తెలిపారు మేడం
అభినందనలు
13
[19/05, 8:39 PM] Bupathi Sir: ......
.కరోనా పారిపో....
......................................
ఏ యుగం లో ,ఏ కాలం లో
వచ్చెనో ,ఈ కట కట కష్ట
విపత్హు లు , కరోనా మాట రాని
నోరే లేదు నేడు ప్రపంచం లో ,
హాస్పటల్ కు దారి దొరకక,
దొరికితే బెడ్ లేక ,ఉంటే మందు లేక ఉంటే ఆక్సిజన్ లేక ,ఉంటే వెంటిలేటర్ లేక , అన్ని దొరికినా
లక్షల కు లక్షలు లేక శవాల గుట్టలకు వాహనాలు లేక ,
తీసుకెళ్లే దారి లేక ,తుది స్థానం
దొరకక ,చివరి చూపు లేక ,
మానవ మనుగడ ప్రతి ని
అతలాకుతలం చేస్తుంది
కరోనా ,కంటి ధార లే
తప్ప కను చూపు లేదు ,
కంటికి కనబడని కరోనా ...
ఏ ప్రపంచ యుద్ధ మైనా నీ
కంటే తక్కువే ఐనది...
మా మానవ జాతిని రక్షణ కై
మా సైన్టిస్టులు పడే శ్రమ లో
నీవు కనుమరుగై పోతావు
ఏ గాలి అణువు నుండి
వచ్చావో ఆ దారిన పరిపో
కరోనా...కరోనా పారిపో...
ఈ కవిత నా సొంతం..
ఏ .భూపతి..19.5.21
********************88
సమీక్షకులు.ధనాశి ఉషారాణి
భూపతి గారి కరోనా పారిపో
ఏ నోటా చూసినా కరోనా ప్రపంచ యుద్ధము కన్నా బలమైందని.శవాలు గుట్టలై వాహనాలు దొరకని దుస్థితిలో మనిషి బాధను కళ్లకు కట్టినట్టుగా చూపించారు.లక్షల డబ్బులు పోసినా ప్రాణాలు నిలువలేదని చివరి చూపు కూడా నోచుకోలేక పోతున్నారని వాపోయారు.
కరోనా రక్కసిని శాస్త్రవేత్తలు కనుమరుగు చేస్తారనే ఆకాంక్ష
చాలా బాగున్నది. ఎక్కడ నుండి వచ్చావో అక్కడికే వెళ్లమని కరోనా ను తరిమి కొట్టిన తీరు బాగున్నది
అభినందనలు భూపతి గారు
14
[19/05, 8:42 PM]
Venkat Reddy Math
: *మౌనం *
.......
మాట లోటైనా
ఇబ్బంది లేదు ...
ఆ మాటే
చేటయ్యేటప్పుడు ...
మనసులోని
సుడులని సైతం
పన్నీటి ఝల్లులని చేస్తుందీ
ఈ మౌనం ....
మధుర భావాలు
పంచేందుకు
మాటలే కావాలా ?
చిరునవ్వును పులిమిన
మౌనం చాలదా .....
పెదవి దాటినా మాట
పృథ్వి దాటునట.....
పెదాలను
లాక్ చెయ్యి
ఇంకా .....
పదాలను సరిచెయ్యి ....
హృదయాలను
కలిపెయ్యి .....
అందుకే ...మౌనం
మధుర భాషణలకన్నా
మరింత మధురం .....
మదికి తెలిసినపుడు
ఎదను తడిమినపుడు .
......జక్కిడి వెంకటరెడ్డి .
ఈ అవకాశం ఇచ్చిన లలిత కృష్ణ మేడం గారికి వీరా గుడిపల్లి సర్ కు ధన్యవాదాలుకవి వెంకట రెడ్డి గారి కవిత
మౌనం,,,,,,,,,,,
మాటలు లోటైనా పర్లేదు
దుర్భాశ మనిషి మనస్సు గాయపరుస్తుందని
మౌనమే ఎదుటి వ్యక్తికి మనకు మధ్య వారధిగా పన్నీటి జల్లుల మాధుర్యాన్ని నింపుతుందని
కొన్ని మధుర భావాలు వ్యక్తం చెయడానికి మాటల్లో చేయలేనిది మౌనంతో పాటు చిరునవ్వును పులుముకుంటే చాలు,,,,,,,,,,,,
పెదవి దాటిన మాట
పృధ్వి దాటునాట,,,,,,,అంటూ రెడ్డిగారి మౌనం విలువ నొక్కి చెప్పారు
ఎన్ని మధుర భాషణలు చేసినా
మౌనం చాలా సందర్భాలలో అమృత తుళ్యం అంటూనే హృదయాలని తడుముతుంది మౌనం అంటూ
హృద్యంగా చెప్పిన తీరు చాలా బాగుంది
ఆపరాజిత్
15
[19/05, 8:50 PM] +91 94400 97002
: కవన జ్యోతి
19/5/2021
అంశం: స్వీయ కవిత
............................
మిట్టా లక్ష్మి
చిత్తూరు
చరవాణి:9440097002
...............................
నేను చెప్పేదేమిటంటే
చెప్పిందే చెప్పి చెప్పి
పదే పదే అవే మాటలు
మనుషులలో భయం
పెంచద్దు వద్దు
ఇక చాలు
ఏం చేయాలో
ఆలోచించు
ఆచరించు
ఎంతసేపూ
ఆ ఊళ్ళో ఇన్ని
ఈ ఊళ్ళో ఇన్ని
ఈ రోజు ఇంత
నిన్న ఇంత
ఇంతేనా ....ఇవేనా
ఆసుపత్రిలు ...పడకలు
బిల్లులు ... డబ్బులు
ఇవికాక తిండిలేక
ఐసలేషన్ లో ఉన్న వారికి
ఆహారం అందించేందుకు
ముందుకు వచ్చిన అమ్మలు
ఆక్సిజన్ సిలిండర్ లు
చేరవేసే యువత ....
ఊపిరిఆడనంత
పనిచేస్తూ ఊపిరి నిలపడానికి
ఆక్సిజన్ సిలిండర్ చేరవేత
పాఠశాలను క్వారంటైన్ గా
అప్పటికప్పుడు చేసిన ఘనత
చదువు సంధ్యలు లేని పిల్లలకు
చదువులు ....చూసేవారూ
ఒంటరి వృద్ధులకు
ఆసరాగా నిలబడినవారూ
ఓ మంచి మాట
ఓదార్పునిస్తూ
స్నేహితులు ....
చివరివీడ్కోలుకు
చేయందించేవారూ
ఎంత మంది సహాయం
చేయడానికి ముందుకు
వస్తున్నారు.. ఇస్తున్నారు
ఎందరో కార్యకర్తలు
ఆహారం...ఔషధం
ఆసుపత్రిలో....
ఆక్సిజన్
అంత్యక్రియలు....
ధనము.... దానము
ఇవి చెప్పండి
చాటండి...
మానవతను చాటండి
నిరాశ ను దరిజేరనీక
మార్గదర్శకాలు పాటిస్తూ
సాగుదాం.....
జీవితం ఎంతో గొప్పది...
వ్యాధులు, బాధలు
వచ్చి పోతూనే ఉంటాయి...
నిజాన్ని గుర్తించి సాగుదాం....
కూలిన బ్రదుకు లో
కోల్పోయిన వారికి
ఆసరా ఇవ్వండి 🙏🙏
.............................
ఈ కవిత నా స్వీయ రచన దేనికి అనుకరణ కాదు.
కవన జ్యోతిలో
కొత్త శీర్షిక కోసం
మిట్టా లక్ష్మి గారి అంశం స్వీయ కవిత గురించి నా మనసులో కలిగిన భావాలు
నేటి కోరోనా పరిస్థితుల గురించి వివరిస్తూ....
చెప్పిన మాటలే చెప్తూ విన్న మాటలనే వింటూ మనసులో భయం పెoచుకోవద్దన్నారు..
స్వీయ నియంత్రణ పాటిస్తూ నిబంధనలు అనుసరిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు...
భయాన్ని పారద్రోలి ధైర్యంగా ముందడుగువేయాలని...
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ముందుకు వచ్చి తోటి వారికి సాయపడే వారికి మనమూ చేతనైన సాయం చేయాలని.. కరోనా బాధితులకు ఆహారం మొదలుకొని ఆక్సిజన్ వరకు మరియు నిత్యావసరాలను తీరుస్తున్న మానవతా వాదులను ప్రోత్సహిస్తూ, వారి సేవలకు వందనాలు సమర్పిస్తూ.. ధైర్యంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని.. కరోనా తో పోరాడాలని... చుట్టూ ఉన్నవారికి సాయం చేయాలని.. మానవత్వం చాటుతూ చితికిన బ్రతుకులకు చేయూత నివ్వాలని మార్గదర్శనం చేశారు కవయిత్రి తనకవిత ద్వారా....
కరోనా మరణాలు, పెరిగిన బిల్లులు, తీర్చలేని అప్పులు, అరాచక మైన వైట్ కాలర్ దోపిడీలను మనస్సులోకి రానివ్వక పుణ్యాపుణ్యాలను దేవునికి వదలి మానవత్వంతో మెలగాలని చాలా చక్కని సందేశం ఇచ్చిన కవయిత్రి మిట్టా లక్ష్మి గారికి అభినందనలు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టిన మంచి కవితకు సమీక్ష చేసే అవకాశమిచ్చిన సోదరి లలితాకృష్ణ గారికి కృతజ్ఞతలు.... చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్
16
[19/05, 8:57 PM]
Siimhadri Vani Poetess: శీర్షిక:--ప్రతిరోజూ పండుగ
రచన:--సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
సంతోషపు సంబరాలు అంబరాన్ని తాకుతుంటె
ఆలుమగలు ఒక్కటిగా అనురాగంపంచుకుంటె
ఒడిదుడుకుల పయనంలో
కలిసి మెలిసి సాగుతుంటె
ప్రతిరోజూ పండుగ
నట్టింట్లో పాపాయి నడయాడుతూ వుంటే
బోసినవ్వు వెన్నెలవే వెదజల్లుతూ వుంటే
మనసంతా పండుగ
కోట్ల ఆస్తి లేకున్నా,మెట్లమిద్దె లేకున్నా
ఆత్మతృప్తి వలన మనిషి ఆనందం పొందుతుంటె
సంతోషపు సంబరాలు అంబరాన్ని తాకుతుంటె
ప్రతిరోజూ పండుగ
పేదవాడి నోటికింత పప్పు ముద్ద దొరుకుతుంటె
ప్రతిరోజూ పస్తులేక కడుపు నిండుతూవుంటే
మనసంతా పండుగ
కూలినాలి శ్రమజీవి కి చేతినిండ పనివుంటే
ప్రభావితం అనుభవిస్తు ఆనందం పొందుతుంటే
సంతోషపు సంబరాలు అంబరాన్ని తాకుతుంటె
మనసంతా పండుగ
స్వార్థానికి సంకెళ్ళు వుంటె
కోరికలకు కళ్ళాలు వుంటె
పరోపకార చింతనుంటె
పదిమందితో మంచిగుంటె
మనసు నిండా మానవతే
పొంగిపొరలుతూ వుంటే
సంతోషపు సంబరాలు అంబరాన్ని తాకుతుంటె
ప్రతిరోజూ--ప్రతిరోజూ--ప్రతిరోజూ పండుగ.
********************88888
సింహాద్రి వాణీ గారు
******
శీర్షిక: ప్రతిరోజు పండుగ
కోట్ల ఆస్తి లేకున్నా
మెట్ల మిద్దె లేకున్నా
ఆత్మసంతృప్తి ఉంటే
మనసు దూదిపింజమై అంబరాన్ని తాకుతుంటే....
ప్రతిరోజు పండుగే..అని
అన్ని కోణాలను సృశిస్తూ కవితాత్మకంగా
కవికలం నుండి జాలువారిన పదాల మాలల పరిమళాలు
పండుగ ఆనందాన్ని,,ఆత్మ సంతృప్తిని ప్రస్ఫుటంగా నలుదిశలా వేదజల్లుతూ..ప్రతిరోజూ పండుగ శీర్షికతో ..చాలా బాగా రాసారండి
మీకు అభినందనలు మేడం గారు
గాజుల భారతి శ్రీనివాస్,ఖమ్మం
ధన్యవాదాలతో
👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
17
[19/05, 9:04 PM]
Veera Gudipally: *ఆయనో నక్సలైట్*
*************-**
అసలేముందని రాయడానికి ఆయనేం చెప్పాడని
ప్రతి ప్రాణి ఆకలి ,దాహం తానేనన్నాడు
భూతదయను మించిన భక్తేముందన్నాడు
ఆయనేంచెప్పాడని.
ఎన్నితావులు తిరిగినా తన్నెరుగలేవన్నాడు నిన్ను నీవెరుగనంతరకు
ఆయనేమన్నాడని రాయడానికి
కాసులుముట్టని కరుణామయుడనడానికి
వెళ్ళే సమయంలో యేడురూపాలున్నాయాయె.
యేరోజు బిక్షనారోజే పంచిన సాధువు కదా
ఆయనేమన్నాడని రాయడానికి
అసలేం రాయాలి ??
బూడిద లోనే వైద్యం చూపించిన వాడు
ప్రాణం ..ప్రయాణం బూమరాంగ్ అన్నోడు
ఏంరాయాలాయన గురించి
దళితవాడలో పాదంమోపి ఆ ప్రాంతాన్ని ప్రపంచ పటానికి మకుటం గా మార్చిపోయాడు
ఏం రాయాలి ఆయన గురించి
ఏంరాయగలనాయన గురించి
. *సాయి నాటి నక్సలైటంటే*
*సాయి ఆనాటి అవసరమంటే*
యేదైనా ఒప్పుకోడు కదా
చేసే పని పట్ల
శ్రద్ధా సబూరీ కోరుకునేటోడంతే
....... *వీరా గుడిపల్లి.*
ఏ .భూపతి...
ఆయనో నక్షలైట్ ..వీరా గుడిపల్లి గారి కవితకు సమీక్ష...
అసలేముందని రాయడానికి
అంటూనే ,అసలున్నదే ఆ నక్సలైట్ లో అని సాయి కృప తోరణాలలో తిప్పుతూ ,ఏ వాడాలో ,తిరిగి నా ,ఏ ఇంటి భిక్ష
ఐనా , ఏ క్రోధ పరుగైనా ,సబురే
అంటూ దేశ పటం లో ,మన
మనో ఫలకం లో నిలిచి పోయారు సాయి అంటూ ..ఇంకేముంది చెప్పా
అని అన్నీ చెప్పారు ,వీరా గుడిపల్లి గారు...చాలా అద్భుతంగా ఉన్నది సార్...లేదంటూ నే అన్ని ఇవ్వడం ...తన వైపు తిప్పుకునే వారుజ్ఞానులు పేరేదైతే నేమ్...
మాలాంటి వారికి సాయి కటాక్షం ,మీరందించిన దారి
ఓ వెన్నెల...... వీరా గారికి ధన్యవాదాలు...
18
[19/05, 9:04 PM]
ల్యాదాల గాయత్రి: కవనజ్యోతి
19.5.2021
రచన : ల్యాదాల గాయత్రి
లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా
*ప్రకృతి ఓ వరం..*
ప్రాణవాయువు నందించే హరితవనాలు
పాడిపంటల ముల్లెలైన పల్లెసీమలు
గలగలపారే సెలయేళ్ళు
కువకువలాడే చిట్టిగువ్వలు
వనంలో కొలువుదీరే వన్యప్రాణులు
భూమాతపట్టుకోకలై మెరిసే పచ్చికబయళ్ళు
కో అంటె హోయనే కొండకోనలు
గిరులు తరులు విరులు
దైవదత్తమైన సిరులు
మానవ జీవనప్రగతికి వరాలు..
కానీ..కానీ..
నేడు నాగరికపు మోజులో
భీకరమైన మానవస్వార్థ కోరల్లో
హరిత వనాలు మోడువారాయి..
పల్లెసీమలు పరిశ్రమల ఉచ్చులో
కాలుష్యపు సెగలలో పొగలుగక్కుతున్నాయి..
పంటపొలాలకు పనికిరాని సెలయేళ్ళు రంగునీళ్ళతో ఖంగుతిన్నాయి..
కానలలో తిరుగాడే వనజీవులు
భీతిల్లి పట్నవాసపు దారులు పట్టాయి.
ఆకుపచ్చని తివాచీలైన పచ్చిక
మోడువారి బీటలువారే పగుళ్ళయ్యాయి..
మానవా ఇకనైనా మారవా..
ప్రకృతి ప్రకోపించి బడబాగ్నిని
చిమ్మకముందే ..
పిల్లాపాప భోరున విలపించకముందే..
అడుగు సవరించుకో..
చరాచర జీవకోటికి
ప్రకృతి ఓ వరమని గుర్తించు..
నీలిరంగు ఆకాశంలో మెరిసే
నక్షత్రాలను ఆస్వాదించు..
పచ్చని మొక్కలే
ప్రగతికి చిహ్నాలని గుర్తించు..
ప్రకృతిని ప్రేమించు..
భావితరాలకు కానుకగా అందించు.
*********************
ఈ కవిత నా స్వీయ రచనే యని హామీ ఇస్తున్నాను.
సమీక్షకురాలు :శివునూరి లలితాకృష్ణ
సమూహంలో
మీరూ.. స్పందించరూ..!!!
అన్నశీర్షికకు అందిన స్వీయరచనలలో
రెండు కవితలకు స్పందించే అవకాశం కల్పించిన
కవిమిత్రులకు ముందుగా ధన్యవాదాలు
తెలియజేసుకుంటున్నాను.
ల్యాదాలగాయత్రి గారి ప్రకృతి ఓ వరం
అన్నశీర్షిక తో అందించిన కవిత చక్కని సందేశాత్మాక కవిత
పాడి పంటలముల్లెలు పల్లెలు..
సెలయేళ్ళు.....
చిట్టిగువ్వలు...అంటూ
ఎత్తుగడ తోనే
అందమైన పల్లె సీమను
కళ్ళముందుంచారు.
భూమాత పట్టు కోకలై మెరిసే పచ్చికబయళ్ళు....
ఆకుపచ్చని తివాచీలైనపచ్చిక..
అన్న వాక్యాలలో
పచ్చికను
భూమాతకు పట్టు కోకలా..ఒకసారి
ఆకుపచ్చని తివాచీ అనీ
మరొక సందర్భంలో
వేరు వేరు ఉపమానాలప్రయోగం తో
కవితకు సందర్భోచితంగా సొబగులద్దారు
కవయిత్రి గాయత్రి గారు.
విరులు ..సిరులు.. వరాలు అంటూ
అంత్యానుప్రాస ప్రయోగం తో అలరించారు..
పచ్చని ప్రకృతి ని
అభివర్ణిస్తూనే...
వర్తమానాన్ని దృశ్యమానం చేశారు.
నాగరికత మోజులో స్వార్థపు కోరల్లో పల్లె చిక్కుకున్నదని..
పల్లె సీమలు కాలుష్యపు సెగల్లో పొగలు కక్కుతున్నాయని
సెలయేళ్ళు రంగునీళ్లతో ఖంగు తిన్నాయి
అన్న
పదునైన భావస్ఫోరక వాక్యాలతో
ప్రస్తుతపరిస్థితిని తెల్పిన తీరు బాగుంది.
ఆధునికత పోకడ లో
హరిత వనాలు మోడువారాయని
ఆవేదన వ్యక్తం చేస్తూ నే
ప్రకృతి ప్రకోపం లో లయం కాకముందే మేల్కొమ్మని
అడుగు సవరించుకొమ్మంటూ
చక్కని సందేశాన్ని అందించారు మేడమ్
అభినందనలు మేడమ్
19
KC Narsaiah KS 26:
కవనజ్యోతి
19-5-2021
అంశం: స్వచ్ఛాకవిత
పేరు: కెసి నరసయ్య
చరవాణి: 7981814784
శీర్షిక: పురుగు పుట్టుక రహస్యం
కరోనా క్రిమి పుట్టుకకు
కారణం ఏమో
దిమ్మతిరిగి తిక్కరేగిన
అభివృద్ధి చెందిన దేశాలు
సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి పాపాన్ని
ఏ ఆధిపత్యం మూటకట్టుకుందో
ప్రపంచాధిపత్యంలో ఈ క్రిమి ఏ పక్షమో
ఏ నామ సంవత్సరం ఎరుగునో
ఆధిపత్య దేశాలన్నీ కుక్కిన పేనులా
నాలుగు గోడల మధ్యలో చేరి
కాటేస్తున్న పురుగుకు
టీకా జపం
అణ్వస్త్ర ఆయుధ సంపదలపై
తర్జన భర్జనలు
జనన మరణాలన్నింటికీ ఒక చిట్టా
పురుగు పుట్టుక చిట్టా ఏ పుట్టలో దాగుందో
లేస్తే మనిషి కాదంటున్న ఓ పెద్దమనిషి
విమానాలలో
పురుగునెందుకెక్కించుకుని విహరించావయ్యా
చంద్రమండలాన్ని జయించినోడా
భూమండలాన్ని కబళిస్తున్న
పురుగునెందుకు జయించలేక పోయావయ్యా
డబ్ల్యూ హెచ్ ఓ డబల్ గేమ్ లో
ప్రపంచ మార్కెట్ చుట్టూ
చక్కర్లు కొడుతున్న పురుగు పుట్టుక రహస్యంం
మర్రి జయశ్రీ
కె సి నరసయ్య గారి కవిత పురుగు పుట్టుక రహస్యం శీర్షికతో రాసిన కవితకు నా సమీక్ష.
నేడు ప్రపంచమంతా దిగులు చెందుతున్న పరిస్థితి.కరోన చేస్తున్న కరాళనృత్యానికి అభివృద్ధి చెందిన దేశాలు చేసేదేమిలేక కుక్కిన పేనులా పడి ఉన్నాయనే పదం ప్రయోగించారు.టీకా పేరుతో జపం చేస్తూ కూర్చున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని తెలిసీ విమానంలో వెంట తెచుకున్నాడని,ఎంతో ప్రగతి సాధించినా,కనిపించని క్రిమితో పోరాడలేకపోతున్నాడని తేలిక పదాలతో చక్కటి భావం వ్యక్తం చేశారు.కవిత ఎత్తుగడ బాగుంది.ముగింపులో అర్థం కాని పురుగు రహస్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ,ప్రపంచ మార్కెట్ చుట్టూ చక్కర్లు కొడుతుందనే ప్రశ్నగా మిగిల్చారు.పురుగు పుట్టుక లేదా పురుగు రహస్యం అంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం.
చక్కటి కవితను అందించిన మీకు అభినందనలు సార్.💐
అవకాశం కల్పించిన సమూహ నిర్వాహకులు వీరా గుడిపల్లి గారికి,లలితాకృష్ణ గారికి ధన్యవాదాలు.🙏🙏
20
*కవితా గానం (సీజన్ 2)*
తేదీ:19-05-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
*శీర్షిక:: గెలుపు తీరం చేరేందుకు*
*******************
సాధ్యాసాధ్యాల తక్కెడలో
సగటు మనిషి గెలుపెప్పుడూ
తెగి పోతున్న ఆశల తీగపై చేసే సాహస సర్కస్ విన్యాసాలే!
సలపరిస్తున్న ఓటమి గాయాలకు
రాసుకున్న గెలుపు ఊహల లేపనం..
జీవిత పద్మవ్యూహంలో
అరిషడ్వర్గాలతో
నిత్యం పోరాడేందుకు
హృదయ గుమ్మానికి కట్టుకున్న
స్థైర్య తోరణమవుతుంది!
సమస్యల పాకుడు రాళ్ళపై
జారిపోకుండా చేసే విఫల యత్నాలను
నిరామయంగా ప్రవహిస్తున్న కాలం
తలెత్తుకునే నమ్మకపు గరిక పోచను చేస్తుంది
మరో సారి ధైర్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించుకు పోతూ..
సగటు మనిషి బతుకునొక
తగలని లాటరీ టికెట్ చేసి
తమాషా చూస్తుంది!
అయినా..
పట్టు వదలని విక్రమార్కుడై
ఆకాంక్షను భుజానేసుకుని
గెలుపు తీరం చేరేందుకు
సాగిపోతుంటాడు..
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
19-05-2021
జక్కిడి వెంకటరెడ్డి ,
సహ ఉపాధ్యాయులు ( భౌతికశాస్త్రం ),
భువనగిరి.
శ్రీమతి పురిమళ్ళ సునంద ,ఖమ్మం గారి కవితా శీర్శిక : "గెలుపుతీరం చేరేందుకు " కవితపై సమీక్ష .
కవయిత్రి శ్రీమతి సునంద గారు వ్రాసిన కవితపై సమీక్షకు అవకాశం కల్పించిన కవనజ్యోతి సమూహ పెద్దలు శ్రీయుత గుడిపల్లి వీరారెడ్డి
గారికి మరియు శ్రీమతి లలితాకృష్ణ గారికి ధన్యవాదములు.
సగటుమనిషియొక్క జీవనచిత్రాన్ని పాఠకుని మనోనేత్రంలో సజీవంగా చిత్రించడంలో కవయిత్రి సునందగారు సఫలమయ్యారు.
సగటుమనిషెప్పుడూ ఆశాజీవేఅని అవసరమైతే ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనగలడని, ఓటమి గాయాలు బాధిస్తున్నా లెక్కచేయక
గెలుపుకోసం కొత్త ప్రయత్నం చెయగలడని చెప్తూ గెలుపు ఊహలే పాత గాయాలకు లేపనం అనడం మనిషిలోని ఆశావాదదృక్పదాన్ని
వినూతనంగా తెలియజేసినట్లైంది .
పద్మవ్యూహం లాంటి జీవనపోరాటంలో అరిషడ్వార్గాలతో పొరాటం చెయ్యడానికి హృదయాగుమ్మటానికి" స్థైర్యం " అనే తోరణాన్ని
కట్టడం అనే భావన కొత్తగా మరియు సహజ ఉద్దీపనగా చేయడం బాగుంది.
వాస్తవ పరిస్థితికి నిదర్శనంగా నిలిచే కాలప్రవాహంలో పాకుడురాళ్ళపై ప్రయాణం కష్టమైనా "నమ్మకం" అనే గడ్డిపోచను ఊతంగా
చేసుకోవడమనేది సందర్భానికి బలం చేకూర్చినట్టయింది. అయినా కొన్నిసార్లు విఫలం కావడం అనేది సహజం .నమ్మకం కుకటివేళ్ళతో
కూలిపోయినా పట్టువదలని విక్రమార్కునివలె ఆకాంక్షను భుజానేసుకొని గెలుపుకై అనునిత్యం సాగిపోయే సగటుమనిషి జీవన ప్రస్థానాన్ని
వర్ణించిన తీరు అత్యద్భుతం .
మనిషి తగలని లాటరికోసం ఆశతో ప్రయత్నం చేయడమనేది సహజాతంగా మనిషి యొక్క కోరికలను తెలియచేసే లక్షణం.
ఆకాంక్షలు వయసునిబట్టి కాలంతో పాటు మారుతుంటాయి .కాని మనిషియొక్క జీవన సాఫల్యంకోసం కాలప్రవాహంలో తనదైన ముద్రను
లేదా గుర్తింపును ఆశిస్తాడు. ఇక్కడ కవయిత్రి తన కవిత ముగిపులో ఇంకొంచెం ముందుకెళ్లి కాలప్రవాహంలో తన అస్థిత్వంను
నిలబెట్టే రేపటితరంకోసం విలువలవలువలు కూడ కప్పివుంటే తను చిత్రించిన సగటుమనిషి జీవనచిత్రం నిండుగా వుండేదనిపించింది .
చివరగా ఒక మాట ...మంచి కవితకి సమీక్ష అందించడం ఆనదంగావుంది .
అందరికి నమస్కారములు .
కృతజ్ఞతలతో .....
---జక్కిడి వెంకటరెడ్డి .
21
కవన జ్యోతి
పేరు. మర్రి జయశ్రీ
అంశం..స్వీయకవిత
శీర్షిక.జ్ఞాపకాల పరిమళం
కష్టాల సుడిగుండాలు
చుట్టుముట్టిన వేళ
కల్లలైన కలలు
కలవర పెట్టిన వేళ
ఎద తడిని ఎరిగి
ఊపిరి పోసే అనురాగ వారధి
తప్పులను హెచ్చరిస్తూ
ఒప్పులను సత్కరిస్తూ
కులమతాల హద్దులను చెరిపి
ఆర్థిక అసమానతల అడ్డుగోడలను కూల్చి
అసూయాద్వేషాలకు
మోసాలకు నెలవులేక
నమ్మకంతో ముడిపడిన ఆత్మీయ బంధం
ఆప్యాయతతో కలసి పఠించే పుస్తకం
అవసరంతో కాకుండా
అత్యవసరంలో చేసే వైద్యం
బతుకు పోరాటాల దారుల్లో
నీడ నిచ్చి సేద తీర్చే మహావృక్షం
మదిలోని మాలిన్యాన్ని తొలగించే
జ్ఞాన కాంతి పుంజం
మట్టిలో కలిసే వరకు సువాసన వెదజల్లే
వాడిపోని జ్ఞాపకాల పరిమళం
మనం ఎంచుకునే అవకాశమివ్వక
మనకొరకె దిగివచ్చిన దేవుడి మరో రూపం
ఆ తియ్యని వరమే స్నేహబంధం.
కవనజ్యోతి
20.5.2021
మీరూ..స్పందించరూ..
స్పందన : ల్యాదాల గాయత్రి
రచన : జ్ఞాపకాల పరిమళం
మర్రి జయశ్రీ గారు
మనసును కదిలించి, మమతలు పెనవేసి, జ్ఞాపకాల దొంతరలను పేర్చేది ఉత్తమ రచన.
మర్రి జయశ్రీ గారి జ్ఞాపకాల పరిమళం మనసును కదిలించి,స్నేహపరిమళాలు వెదజల్లింది.
కష్టాల సుడిగుండాలు చుట్టుముట్టినవేళ
ఊపిరిపోసే అనురాగవారధి.. అని మొదలైన కవిత..
తప్పులను హెచ్చరిస్తూ
ఒప్పులను సత్కరిస్తూ..
ఎంత చక్కటి పదబంధాలు...
బతుకు పోరాటాల దారుల్లో
నీడనిచ్చి సేద దీర్చే మహావృక్షం
నిజమే కదా..
మనం ఎంచుకునే అవకాశమివ్వక
మనకొరకే దిగివచ్చిన దేవుడి మరో రూపం
అనే ముగింపు చెలిమికి బలిమినిచ్చే నిత్యసత్యం.
కవయిత్రి గారికి స్నేహపూర్వక అభినందనలు.
🌹🤝🌹🤝🌹
22
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:నవ్వు
ఆ.వె:పరుల నిలను నెపుడు వాసిగానవ్వించి
మరియు తా వగవక మనములోన
సతము నవ్వు కొనుట చక్కని గుణమగు
దాన మేలు కలుగు దప్పకెపుడు.
కం:మనసారగ తా నవ్వుచు
మనమలర పరుల వదలక మన్నింపంగన్
గొనకొని నవ్వునటుల చే
యననవరతమును వెతలవి యంటవు సుమ్మీ.
తే.గీ:తాను నవ్వుటయేగాక తనదు జనుల
నెల్ల నవ్వించుచుండగ నింపు తోడ
నొడిదు డుకులను సులువుగా నుత్సుకతన
దాటవచ్చునండ్రు బుధులు ధరణి యందు
ఆ.వె:తాను నవ్వు చుండు తనవారి నెల్లను
నవ్వచేయు చుండు నవని యందు
నాటుపోట్ల నెల్ల నలవోకగా గెల్వ
వచ్చు ననుచు నుంద్రు వాసిగాను.
డాక్టర్ బల్లూరి ఉమాదేవిగారి " నవ్వు" శీర్షికతో వున్న పద్యాలకు నా సమీక్ష
మన పెద్దలు నవ్వు నాలుగు విధాల చేటు అని అన్నారు.ఆమాట అక్షరాలా నిజం.
కానీ, యెలాంటి నువ్వు నవ్వితే నష్టమో చూడండి.
వెకిలి నవ్వు, వెగటు నవ్వు, ఎగతాళి నవ్వు, అవహేళన నవ్వు నవ్వితే మాత్రం తప్పకుండా నష్టమే.
బల్లూరి ఉమాదేవిగారు నువ్వు ఎలా వుండాలో చెప్పారు తమ పద్యాలలో.
ఇతరులను ఎప్పుడూ సంతోషంగా నవ్విస్తూ,తానూ బాధ పడక నిత్యమూ నవ్వుకోవడమే శుభాలనిస్తుందనీ,మనసారా తాను నవ్వుతూ,ఇతరులు సంతోషించే విధంగా గౌరవిస్తూ
నవ్వించేటట్లు చేస్తే,ఎప్పుడూ బాధలు కలుగువనీ,అలా నవ్వుతూ నవ్విస్తూవుంటే ఆటుపోట్లను అలవోకగా అధిగమించి విజయాలను సాధింపవచ్చుననీ, ఉమాదేవి గారు "నవ్వు" శీర్షికతో రాసిన పద్యాలలో తెలియజేశారు.
అంటే స్వచ్ఛమైన నువ్వు,మానవత్వం వెల్లి విరిసే నవ్వు,మమతాను రాగాలు పొంగిపొర్లే నవ్వు, ఎదుటి వారి మనసును దోచే నువ్వు,బాధలను మరపిస్తూ, తామూ మార్చి పోయే నవ్వు
సుకుమారంగా నవ్వుని తమ పద్యాల ద్వారా తెలియజేశారు.
నాకీ అవకాశం కల్పించిన వారికి, ధన్యవాదములు
సింహాద్రి వాణి
నేను చేసిన మొదటి సమీక్ష.

Congratulations all
ReplyDeleteWonderful.....it's new to enjoy the poems. Thank you very much 💐🙏
Delete