తరంగిణి 2021 may
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*****************
కవివరుల జాబితా
లలితాకృష్ణ గారు
1. తరణికంటి సూర్యలక్ష్మి గారు
2.డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి గారు
3.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు
4.తిప్పావఝల నరసింహమూర్తి గారు
5.✍️అన్నాప్రగడ గారు
6.కవిత వేంకటేశ్వర్లు గారు
7.ధనాశి ఉషారాణి గారు
8.వురిమళ్ల సునంద, ఖమ్మం గారు
9.సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు గారు
10.వనపర్తి గంగాధర గారు
11.పిన్నక నాగేశ్వరరావు గారు
12.:మన్నె లలిత గారు
13.తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, గారు
14.నారు మంచి వాణి ప్రభా కరి గారు
తణుకు
15.మేకల రామస్వామి గారు
16.ఆళ్ల నాగేశ్వరరావు గారు
17.కొంపెల్లి రామయ్య గారు
18 ఆపరాజిత్ గారు
19.ఆంజనేయులుగారు
20.వురిమళ్ళ సునంద గారు
21.కందూరి సుజాతా రాణి గారు
22.గుండ్ల రాజు గారు
23.సుగుణ మద్ది రెడ్డి గారు
24.వల్లాల విజయ లక్ష్మి గారు
25.మర్రి జయశ్రీ గారు
26.కోరాడ గారు
27.కె.ఇ.నిలమంగై గారు
28.దీపక్ న్యాతి గారు
29.డా.బల్లూరి ఉమాదేవి గారు
30.కెసి నరసయ్య గారు
31.జల్లిపల్లి బ్రహ్మం గారు
32.మహ్మద్ అఫ్సర్ వలీషా గారు
33.వేదాల ఇందిర గారు
34.సుధారాణి కృష్ణం రాజు గారు
35.డా.సి.హెచ్ ఆంజనేయులు గారు
36.బేతి నాగ లక్ష్మి గారు
37.భరద్వాజ గారు
38.ఆపరాజిత్ గారు
39.గాజుల భారతీ శ్రీనివాస్ గారు
40.మిట్టాలక్ష్మి గారు
41.దీపక్ న్యాతి గారు
42.శివునూరి లలితా కృష్ణ గారు
*****************************
కవితాగానం
నేటి అంశం
తరంగిణి
సృష్టిలో నిత్యచైతన్యానికి ప్రతీకలు.....
పుడమిని సస్యశ్యామలం చేస్తున్న సజీవ స్రవంతులు...
లోయల్లో పడిపోయినా.....
పాయలుగావిడిపోయినా...
గమ్యం చేరుకునే దాకా
తమ గమనాన్ని ఆపకుండా.....
సతతమూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
అందుకే నాగరికతలన్నీ నదులఒడ్డున పుట్టాయి.
అక్కడే పునీత భావనలు పుట్టాయి.
నదులనే నేపథ్యం గా చేసుకుని కవితలల్లిన భావుకులెందరో....
స్ఫూర్తినిచ్చు నది
అన్న నేటి అంశానికి
రాత్రి ఎనిమిది నుండి
తొమ్మిదిన్నర వరకు
కవితలతో స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకూడదు.
****లలితాకృష్ణ
1
.కవితాగానం ( సీజన్ 2 )
" తరంగిణి "
తరగనినిధితర తరములవెలిగెడి
మనతరంగిణులన్ని మనకురక్షగ
పుణ్యనదులచూచి పులకరించె ధరణి
మహిని జీవులకవి మనుగడంచు
నిత్యసుమంగళి నీరందజేయుచు
కడలిచేరంగాను కదలిపోవు
సాగరముప్పొంగి స్వాగతమునుజెప్పి
తనలోనజేర్చును తనివితీర
పదిచినుకులతోడ పయనించునదులన్ని
ఒడిదుడుకులపడిన ఓర్చుకొనుచు
తమవునికినికూడ తమకెతెలియకుండ
కడలిచేరిపోవు కలతపడక!
తరణికంటి సూర్యలక్ష్మి.
----------
2
నది ప్రవాహం శీర్షిక
కొండ కోణాల నుండి దూకుతూ
లోయల్లోకి సాగుతూ పిల్లకాలువలు గా మారి
తరంగిణి వై తరలి తరలివస్తున్నావు
సర్వ రకాలుగా శుద్ధి చేయడానికి పొలాలకు పచ్చటి పంటలు పండించడానికి వస్తూనే ఉంటావు
అరణ్యాల ఎదలో నుంచి
మైదానాల సారాన్ని తీసుకొనివచ్చి
చక్కటి స్నానాలను చేయడానికి మంచినీళ్లు ఇచ్చి
నురుగుల పువ్వులం అందించి
సాగిపోయే తరంగిణి
తరంగిణి నీవు ప్రవహించే జలకన్య మా అందరికీ ఆప్యాయతలను అందించే రైతన్న ఆపద్బంధువు
తరంగిణి నీటి ఉయ్యాలలూగుతూ
అనేక విన్యాసాలు చేస్తూ
ఔషధాల పరిమళాలను మొక్కల పొదల్లో నుంచి
సాగి వచ్చి తరంగిణి
సదా స్వాగతం పచ్చని కార్పెట్ వేస్తూ స్వాగతిస్తున్నాం
చివరికి కడలి గుండెలోకి చేరిపోతావు
నదీనాం సాగరః కరోతి లాగా
తరంగిణి జలతారు కన్య
జల సంగీతాన్ని వినిపిస్తూనే ఉంటావు ఎప్పటికీ
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 77025374533
3.
అంశం:- తరంగణి
శీర్షిక:- మానవ మనుగడకు ఆధారములు
...............................
సనాతన ధర్మానికి నిలయమైన భరతావనిలో
నదీమతల్లులు దేవతా స్వరూపాలే.
సకలజీవకోటి మనుగడకు కారణమైన నదులు జీవప్రదాతలే .........!!
గంగైచ,యమునైచైవ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిమ్ కురు
అని నదీస్నానం ఆచరించటం భారతీయ సాంప్రదాయం.
తరంగణి ప్రవాహపు జలం ఔషధప్రయుక్తం........!!
నదీజలాలద్వారా సిరులోసగే పాడి పంటలు పండు. ఎన్నో జలచరాలకు ఆవాసం నదులు .
శ్రీరామచంద్రుని గుహుడు గోదావరిని స్తుతించి నదిని దాటించి పరమాత్మ ఆశీస్సులు పొందెను
పుష్కర, కుంభమేళా సమయాన నదీస్నానం జీవన్ముక్తి కి సోపానమని వేద ప్రామాణికం.
అందుకే తరంగణిలకు శతకోటి వందనములు...!!
............................
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
4.
అంశం.తరంగిణి
శీర్షిక.పరోపకారార్థం
పరోపకారార్థ మిదం శరీరమ్
అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ నది.
స్రవంతులుభగవంతుడు ప్రసాదించిన సహజ వనరులు.
మానవ నాగరికత ప్రజ్వరిల్లడానికిముఖ్యకారణాలు.వాహినులుమానవ మనుగడకు ఉపయుక్తాలు.
మనిషి తన మేధస్సుతో బ్యాంకులను నిర్మించి నదీ జలాలను త్రాగునీటి కి,సాగునీటికి వాడుకొంటున్నాడు.
తొండలుగుడ్లుపెట్టే బీడులను సైతం సస్యశ్యామలం చేసుకొంటున్నారు.బ్రహ్మంగారు చెప్పినట్లు నీటితో దీపాలు వెలిగించుకొంటున్నడు.
మనపురాణాలు నదీస్నానానికిచ్చాయిఅధిక ప్రాధాన్యత.
పవిత్రనదీస్నానం పాపవిమోచనం.నదీనాం సాగరోగతిః
శైవనులు మనకు పరబ్రహ్మ తత్వాన్ని ఉపదేసిస్తున్నాయి.
ప్రతిఫలమాసించనిస్రవంతులను సైతం మనిషి కాలుష్యావాసాలుగా మారుస్తున్నాడు.తననెత్తిమీద తానేచేతులు పెట్టుకొంటున్నాడు.
నదులసంరక్షణ
మన భవితకు రక్షణ.
తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
94407349075.
5
పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
అంశం..తరంగిణి
శీర్షిక..సాగరునిపై వలపు
(వర్షాకాలంలో నీరు నదులలో నిలువక లక్షల క్యూసెక్కులు సాగరంపై కలవడం)
ఎందుకో ఆ పరుగు సాగరునిపై వలపు..
దారినడుమన ఆగరా మీ బిడ్డలను కానరా..
స్వామి పాదాలచెంత వెలసి ఈశుని నెత్తిపై నిలచి జనుల అవసరాలను గాంచక గంగమ్మ ఎందుకో నీకు ఆ పరుగు, సాగరునిపై వలపు...
గౌతముడు మరలా జన్మించవలనా,భద్రాద్రి రామన్న బతిమిలాడవలనా..
గోదారమ్మ ఎందుకో నీకు ఆ పరుగు, సాగారునిపై వలపు..
పుష్కరాలకు కొదవలేదు, ఆనకట్టలకు దిగులులేదు..
కృష్ణమ్మ ఎందుకో నీకు ఆ పరుగు, సాగరునిపై వలపు..
ప్రతి సంక్రమణకు నీకు పూజలు తగ్గలేదే, నీ మీద జనులకు ప్రేమ తగ్గలేదే..
కావేరమ్మ ఎందుకో నీకు ఆ పరుగు, సాగరునిపై వలపు..
దారినడుమన ఆగరా,మీ బిడ్డలను కానరా..
✍️అన్నాప్రగడ
6.
కవితా గానం(సీజన్ 2)
పేరు:: కవిత వేంకటేశ్వర్లు
అంశం::: ,తరంగిణి
తరంగిణి.. తరంగిణి
నవ జీవన నాగరికత కారిణి
పరుగులు తీసే పరమ పావని
నీ ఆధారం లేక మేము లేము జనని
పల్లెలు పట్నాలు ప్రగతి వైపు
పయనిస్తున్నాయంటే
అందుకు జలం ముఖ్యం
జలమే అన్నిటికీ ఆలంబనము
విష్ణువు పాదాల చెంత ప్రభవించి
శివుని జటాజూటంపై నిలిచి
భూతలంపై పాయలుగా
ప్రయాణించి
దారులంట పొలాలను సస్యశా
మలం చేసి
ప్రాజెక్టులలో ఆనకట్టలలో
పరిభ్రమించి
తాగు సాగులతో ప్రజలను
బ్రతికించి
తరంతరం నిరంతరం అవిశ్రాంత పయనం
సముద్రునితో కలిసి లీనమై
సముద్ర స్నానానికి సాక్షి భూతమై
మరణించిన వారి భస్మాన్ని
నీలో కలుపుకొని
వారికి మోక్షాన్ని ప్రసాదించే
పరమేశ్వరి రూపిణీ
సర్వలోక సంరక్షని
అందుకొమ్మా మా వందనం
నిత్య అనునిత్య సుగందచందనం!!
కవిత వేంకటేశ్వర్లు
ఈ కవిత నా స్వంతం అనువాదం,అనుకరణ గాని కాదు అని హామీ
7.
శీర్షిక.తరంగిణి
......
ఇంకి పోయిన పుడమి తల్లి కోసము
మేఘము వర్షించిన వర్షపు బిందువులనునిండుగా ఆలింగనము చేసుకోని
బీడువారిన పంటలను పచ్చదము చేస్తూ
లేలేత తీగలకు వయ్యారాలను వొలికిస్తూ
నిరంతరం మునుముందుకి అలా దూసుకుపోతూ
జగతికి బతుకును ఇచ్చే ధాన్యాలను సమకూర్చుతూ
సుగంధ భరిత కుసుమాలని అందిస్తూ
మునుముందుకు దూసుకుపోతున్న ఓ తరంగిణి
నిండు సృజనాత్మకతతో ఎన్నో పధకాలను చేపట్టి
నిండు ఆనకట్టలతోను మనము నదులను కాపాడాలి
రైతన్నకు బాసటగా నిలపాలి
ఎక్కడ బడ్డ గొంగళి అక్కడే వున్న మనిషి
మారాలి సేవా దృక్పథంతో
మానవ కోటికి మార్గదర్శిగా నిలవాలి
భావి జగతికి బంగారు బాటను ఇవ్వాలి
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట
8.
కవితా గానం (సీజన్ 2)
తేదీ:21-05-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: తరంగిణి
"""""""""""""""""""""""""""""""""
ఎందుకో ఆమెకు ఆరాటం
అచ్చం అమ్మ లాగానే..
పాయలు పాయలుగా విడిపోయిన కుటుంబాన్ని కలుపుకుని
మహోన్నత చరిత్రకు శ్రీకారం చట్టాలనీ...
బిడ్డల ఆకలి తీర్చేందుకు
చినుకులను ఒళ్ళో నింపుకుని
కొండలూ కోనలు లోయలూ అగాధాల్ని
వినయంగా పలకరిస్తూ..
గాయం చేసినా గౌరవంగా చూసినా
చెక్కుచెదరని స్థిత ప్రజ్ఞతతో
దారంతా పచ్చదనపు చిరునవ్వుల వెలుగులు పంచుతూ
అలసట లేకుండా నిరంతరం పయనిస్తూనే ఉంటుంది!
తన ఎదపై పురుడు పోసుకున్న పుణ్యక్షేత్రాలను చూసి మురుస్తూ
నాగరికత నేర్చుకున్న
మానవ జాతిని
జలాశయమై ఆశీర్వదిస్తూ
కాలంతో పరుగులు తీస్తూ
పరోపకారమే పరమార్థమై
గలగలా సాగిపోయే
హృదయ రాగ తరంగిణీ!
నీవే మా జీవన వాహినీ!
వురిమళ్ల సునంద, ఖమ్మం
9
నేటి అంశం: తరంగిణి
పేరు సయ్యద్ జహీర్ అహ్మద్ కర్నూలు
నదీనాం ప్రగతి
నదీ నాగరికతకు పునాది
చెట్టు చేమ గూడు గుట్టా
నీటి వనరులతో ఏర్పడిన
ప్రకృతి సౌందర్య ధనం
జనం నివసించు ఆవాసాలు
పాడి పంట పరిశ్రమ ఝరులతో
సస్యకేదారాలు సుసాధ్యాలు
గంగా యమునా సరస్వతీ
త్రివేణి నదుల సంగమం
భారతజాతి కి పుష్కల ధారలు
ఉపనదులు అభ్యున్నతికి సోపానాలు
నదీ పుష్కరాలు పుణ్యస్నానాలు
నవ నాగరిక ప్రపంచంలో
నరజాతి సంక్రమించి
నాక్రమించె నివాసాల
వ్యాపార ధోరణులు
అందుకే సంభవిస్తూ
ప్రకృతి వైపరీత్యాలు
తుపాను వరదల భీభత్సలు...
నదులు అంతరించెనా
జనజీవనం అతలాకుతలం.
**
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు
10.
పేరు:వనపర్తి గంగాధర్
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435
అంశం:తరంగిణి
శీర్షిక:జీవనది
తరంగిణి మానవ జీవన నాదం
సకల జీవ కోటికి ప్రాణం
సృష్టి నిత్య చైతన్య స్ఫూర్థులు
జీవిత పవిత్ర ప్రాణ దాతలు నదులు
కృష్ణ గోదావరులు పవిత్ర జీవనధులు
గంగా ,యమునా,నర్మదా
నదీమతల్లుల ఒడిలో స్నామమాచరించినచో
కలుగును మోక్షము,పుణ్యము
పాడిపంటలకు ఆధారం నదులు
వాహిణులు ప్రపంచ జీవనాధారాలు
ఆధ్యాత్మిక మోక్ష ప్రదాయినులు
సకల ప్రజా సౌభాగ్యులు నదులు
అమృత వాహిణులు మీకు వందనం
పుణ్య లోకాలకు మార్గాలు మీరు
ఆనంద జీవితానికి దారులు మీరు
నదీమ తల్లి నీకు అభివందనం
హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అనువాదం,అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను
11.
కవితా గానం(సీజన్ 2). 20--5--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- తరంగిణి.
శీర్షిక :-- జీవనదులు.
ఎక్కడో హిమవన్నగాలలో ప్రభవించి
రాళ్లూ, రప్పల మధ్య క్రిందకు దుముకుతూ
చిన్న కాలువలా ప్రారంభమై
మధ్యలో ఎన్నో సెలయేళ్లను తనలో
కలుపుకుంటూ
పెద్ద నదిగా ప్రవాహాన్ని పెంచుకుంటూ
ఒంపుసొంపుల ఒయ్యారాలతో
ఒడ్డులను ఒరసి ప్రవహిస్తూ
రెండు వైపులా ప్రకృతి అందాలను
తనలో ఇముడ్చుకొని సాగిపోతూ
బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ
పరీవాహక ప్రజల దాహార్తిని తీరుస్తూ
పన్నెండేళ్ళ కొకసారి ప్రజల పూజలందుకొని
పుష్కరాల పుణ్య ఫలాలను అందిస్తూ
సాగర సంగమమే పరమావధిగా
ఉరకలు వేస్తున్న జీవనదులన్నీ
మానవుల జీవప్రదాతలే.
12.
కవితాగానం (సీజన్ 2)
తేదీ :20/ 5/ 21 -గురువారం
అంశము: తరంగిణి
శీర్షిక: నదులు జీవనదులు
పేరు :మన్నె లలిత
హైదరాబాద్
చరవాణి సంఖ్య: 741 686 32 89
నదులు జీవన ప్రదాతలు
ఏ దేశంలో లేని నదులు
భారతదేశంలో పుట్టి ,ప్రవహించి
సత్య శ్యామల భారతాన్ని
ప్రపంచపటాన నిలిపాయి
నదుల ఒడ్డున నిర్మాణమైన గ్రామాలు
పట్టణాలు, దేవాలయాలు,
గ్రామ సీమలకు ఆధారభూతమైన
పచ్చని పంటలకు ఆధారాలు
ఆధ్యాత్మికతకు ఆదర్శ మై
పుణ్య జలాల పవిత్రత కలదై
మూలికా వృక్షాలకు నిలయమై
జలచరాలకు పుట్టిల్లై
మత్స్య సంపద నిస్తూ
జాలరుల జీవనాధారమై
ముక్కారు పంటలకు ఆధారమై
జన జీవితంలో మమేకమై
త్రాగే నీరు ఇస్తున్న జీవతరంగిణులు
ప్రతి నదికి పన్నెండు ఏళ్లకు
ఒకసారి వచ్చే పుష్కరాలు
భక్తి భావ ప్రబోధితాలు
అందరిని ఏక తాటిపై నడిపించే
ప్రబోధ గీతాలు
త్రివేణి సంగమాల స్నానాలు
ఆరోగ్యప్రద ముక్తి క్షేత్రాలు
జల జల నాదాలతో ప్రవహించే
తరంగిణులు
జలతరంగిణులే!
భారతీయుల హృదయ రంజకములే!!
13
అంశం.. తరంగిణి
శీర్షిక.. జీవనాధారం
🌹🌹🙏🌹🌹
తరంగిణి తరంగిణి
జలజీవన ప్రదాయిని
జన జీవిత దాయని
గల గల ధ్వనులతో
పారే ఓ తరంగిణి !
నదిలో స్నానం పుణ్యప్రదం
నదిలో కదిలే వీరప్రవాహం
నదిమనకిచ్చే జీవనాధారం
నదినే మ్రొక్కు పుణ్యప్రదం
ప్రతీ నదికి పుష్కరం
పన్నేoడేళ్లకు వచ్చే వరం
ప్రతీ జీవికి ముక్తిప్రదం
పుణ్యమే మనకి నదీమజలం
గంగ గోదావరి కృష్ణ కావేరి
తుంగభద్ర సింధు ప్రాణహిత
ఎన్నో ఎన్నో నదీమ తల్లులు
ప్రపంచ జీవన ఆధారములు
ఆధ్యాత్మికం మోక్షదాయకం
సుప్రసిద్ధము దేవాలయశోభలు
అన్నివున్నవి ఈనదులతీరాలు
అందుకేనదులు అమృతవాహినిలు
నీటికి కొరత ఉండనివ్వవు
జీవుల బ్రతుకుకు అండగవుండే
నదీమతల్లికి నీరాంజనాలూ
అమ్మా !అమ్మా !తరంగిణితల్లీ !
🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079346
14
నేటి అంశము
తరంగిణి
శీర్షిక. సాగర నాదము
అమృత రాగ భావాల
నాద తీరాలలో సాగర
నాదము అద్వితీయం
ఆ స్వరలలో ఎన్నో అనుభూతులు అనుభవాలు కథలు కవితలు ఆనంద.నందన
సాగర ఘోష లో
రాగ రాగిణి రాఙ్ని
విభిన్న భావాల తరంగిణి
రాగ రాగిణి అమృత వాహిని
ఓ రంజని తరంగిణి
నారు మంచి వాణి ప్రభా కరి
తణుకు
9849481823
15
నదీ జీవన చిత్రిక
*****
వడితో,వేగంతో
సుడులను జయిస్తూ
పొంగుతో,లయతో
సుస్వరంగా ధ్వనిస్తూ
అవరోదాలు,అడ్డంకులు
అన్నీ అదిగమిస్తూ
నిత్యనూతన గమనంతో
పయనిస్తూ
నిరంతరం చైతన్యంగా
నికషలనన్ని జయిస్తూ
మంచి,చెడులతో మమేకమై
ఉదాత్తగుణంతో ప్రభవిస్తూ
తనలో ఎంత మాలిన్యం చేరినా
తాను మాత్రం అమృత జలాలనందిస్తూ
చివరికి సాగరంలో
ఐక్యమై తన ప్రస్థానాన్ని ముగిస్తుంది
మనిషికి నదికి ఉన్నది
సజీవ సంబంధం
మానవ గతి,ప్రగతి
అంతా నది యే నిర్ద్యేశిస్తుంది
జన పురోభివృద్ధికి
తరంగిణులే మూలాలు
వినయం అణకువ చైతన్యం తెగింపు
అన్నీ నేర్చుకునేది నదులనుండే
అందుకే
నదికి,మనిషికి సజీవ సంబంధం
విడదీయరాని అనుబంధం
********
మేకల రామస్వామి- చెన్నూర్
9912747214
16
అంశం; తరంగిణి
శీర్షిక:
""జీవ ప్రదాతలు""
నిరంతరం ప్రవహించే
నదీమతల్లులు జీవనదులు
సకల జీవరాసుల కు జీవప్రదాతలు!
కొండల ప్రాంతాల్లో ఉద్భవించి
ఎత్తు పల్లాలను అదిగమిస్తూ
పాయలు పాయలుగా చీలి
మారుమూల ప్రాంతాలకు జలాలను అందిస్తూ
జల చ ర జీవులకు నివాస యోగ్యతను కల్పిస్తూ
భూచర జీవాలకు దాహార్తిని తీరుస్తూ
వాగులు వంకలను దాటుకుంటూ
ప్రకృతిమా తకు హరితవర్ణపు చీరను బహుకరిస్తూ
జాలరులకు జీవనోపాధిని అందిస్తూ
పన్నెండేండ్లకోసారి వచ్చి
జనులందరిచే పూజలందుకుంటూ
పుష్కర స్నా న పుణ్య ఫలాలను అందిస్తూ
బీడు భూములను సైతం సస్యశ్యామలం చేస్తూ
పసిడిపంటలను పండించేందుకు దోహదపడుతూ
అందరికి అన్న ప్రసాదాన్ని ప్రసాదిస్తూ
జనులందరికి జీవాన్ని అందించే
జీవ ప్రదాతలు మన జీవనదులు!
పుణ్య తీర్ధాల్లో ప్రవహిస్తూ
భక్తులకు ముక్తిమార్గాన్ని అందిస్తూ
జన్మ రాహిత్యాన్ని కలిగిస్తూ
పుణ్యక్షేత్రాలకు పవిత్రతను సెకూర్చేవి మన తరంగిణిలు!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
apsrtc కండక్టర్
నాజారుపేట
తెనాలి...522201
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
..........................................
పై కవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
17
అంశం: తరంగిణి
శీర్షిక: నదీ దేశం నాదేశం...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
విశిష్ట చరిత్రను విశ్వమంతా కలిగి
విలక్షణ సంస్కృతి సంప్రదాయాలతో
విశేషమైన సహజ వనరులు సిరులైన
నదులతో వినుతికెక్కిన విశ్వంభర నా దేశం...!
సింధూ పరివాహక ప్రాంతాల్లో
పరిఢవిల్లిన నాగరికత
వికసించిన సాంస్కృతిక
సారస్వత వైభవాల తోరణాలు గల
ఘనమైన వారసత్వం నా దేశం...!
నదీతీరాలు మోక్ష కారకాలైన పుణ్య క్షేత్రాలతో
ఆధ్యాత్మిక అమృతవాహిని శోభను సంతరించుకొని
దేవీప్యమానంగా శత సహస్ర కాంతులతో
మంగళ హారతి పట్టిన మోక్ష భూమి నా దేశం...!
ప్రజల దాహార్తిని తీరుస్తూ
క్షుద్భాదను పోగొడుతూ
పసిడి సిరులు కురిపించే పంటలు పండిస్తూ
తమ పావన తరంగాలతో పునీతమై
పుణ్య భూమిగా నిలిచింది నా దేశం...!
పురాణ పురుషులకు నిలయమై
చరిత్రలకు సాక్షిభూతమై
సాహితీ మూర్తులకు కావ్య వస్తువై
నాగరికతకు మూలమై
నదుల సమూహం కలిగిన
నదీ దేశం నాదేశం....!
18
[23/05, 10:10 PM] Lalita Sister: తరంగిణి
హృదయంలోంచి పెల్లుబికే తరంగిణి కొండల్లో నుంచి కోణాల్లోంచి స్వచ్ఛమైన మనసుతో హృదయంలో జీవన కాంతులతో
కొండలపై నుండి దూకి పడుతున్నది పడుతున్న
జీవన కాంక్షల వెల్లువలో
రకరకాల రకరకాల భావాలతో
రంగురంగుల పూలతో
అరణ్యాల దేహాలపై నుండి పరిసరాలను చూడకుండా
తెల్లని నురుగుల పూలతో
మట్టికి మనిషికి అనుబంధాన్ని ఆవిష్కరించే
జీవన మార్గంలో నుండి
ప్రకృతి శోభ గుడ్లను పొందుతూ
తెలుగు ఈ ప్రకృతిలో లీనమై
నవ్య కల భావనతో సాగిపోతూ సముద్రంలో కలిసి పోయే తరంగిణి
తరంగిణి నా హృదయ భావాల తరంగిణి
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం బోనగిరి 7702537453 నుంచి జీవన ప్రస్థానంలో నుండి
19
వెన్నెల్లో గోదారి!
పాపికొండల నడుమ
పర్వత సానువుల్లో
వెన్నెల కౌగిలిలో
ప్రకృతి సోయగాల నడుమ!
పరువంలొ వున్న పడుచులా
అందాలొలికే సుందరి
పరుగెతే గోదారి!
పున్నమి వెన్నెలలో
వీక్షించే కళ్లు జ్యొతులై
తెల్లని పాలవెల్లిలా నీళ్లు!
అప్సరసలు జలకాలాడే వేళ
వెన్నెలలో వన్నెలారబోస్తు!
ప్రశాంత వెన్నెల రాత్రి
రామబానంలా పయనిస్తూ
కలల తీరాల్లో
చల్లని పిల్లగాలుల నడుమ
గిరిపుత్రుల చేపల వేట!
ఆహ్లాద యామినిలా
కళాకారుని దృగ్గోచర చిత్రం
కన్నెలేడి పరుగులు,,,,,,,,, !
సున్నిత హృదయం పొంగి
కవనాంగనయై!
గోదారిలో వెన్నెల జాబిలి
తన సుందర మోమును
తనివి తీరా వీక్షిస్తు!
జన్మ తరియించి నటుల
ప్రవాహం వెంట
పిచ్చివాడిలా పరుగెడుతూ
చందమామ ప్రియురాలు
గోదావరి !!
ఆపరాజిత్
20
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: తరంగిణి
*********************
తరంగిణీ!తరంగాల వెల్లువై
తరలిపోయే తరుణీమాతవు,!
అడుగిడిన నేలంతా ఆర్ద్రంగా హత్తుకుని
ఆకుపచ్చని స్వప్నాలను నిజం చేస్తూ
పసిడి పంటలనిచ్చే నదీమతల్లివి..
అమ్మల గన్న అమ్మ గంగమ్మవు
తొలకరి జల్లులతో తుళ్ళి పడే కేరింతవు!
మలి వలపుల చినుకులతో
మైమరచి సాగే
సంతోషాల ఎద పొంగువు!
పుణ్య క్షేత్రాలతో పునీతం చేసి
మానవ నాగరికతకు నడకలు నేర్పిన మహోన్నత జీవనదివి!
స్వచ్ఛమైన మనసుతో స్వేచ్ఛగా సాగిపోయే నీ పాదముద్రల చెంతేకదా!
మా జీవన ప్రస్థానం...
నీవు కళకళలాడితేనే
మాలో జీవం మొదలవుతుంది""""
21
🌷ధన తరంగిణి 🌷
........ ............... .......
తరంగిణీ ధన తరంగిణీ .
లక్ష్మీనివాస వాహిణీ
మానవ వాంచ మోహిణీ
కామరూపా దారిని
తరంగిణి ధన తరంగిణి.
అహం ధర్పం దారగ పోస్తూ అధికారం చేజిక్కిస్తూ ...
దర్జా దౌర్జన్యం అరాచక వంతెనలేస్తూ ...
పాపం పుణ్యం విడనాడి
మానవతా గోడలు కూలుస్తూ..
పెద్దరికం శూన్యం చేస్తూ ఆప్యాయతను నశింపజేస్తూ...
తరతరాలుగా అధిరోహిస్తూ
తాండవ నృత్యకేళిన సాగు
ధన దాహ తరంగిణీ.
యావత్ మానవ మనుగడ మూలం
ధనం.
ఆర్థిక స్తోమత కై స్వార్థ బిలం.
గుణం వీడుతూ పొందిన ధనం
పరువును లాగు గాలం.
ఉచితములైన పంచభూతములు
ధనముతో తూచక తప్పని తరుణం.
మరమనిషి కవచములొలిచిన పొడుచు మది వెలుగు తోరణం.
ధనలక్ష్మి కటాక్షం ధనం శుభప్రదం .
చీకుచింతలు తుంచు అభయ ప్రదానం.
ధన నిలువలు త్యాగాల మదితో సాగే అనంత మాన్య శుభఫలితం .
ఆదిలక్ష్మి అనుగ్రహ భామిణీ
ధన్య ధన తరంగిణి.
కందూరి సుజాతారాణి
రాజంధ్రనగర్, హైదరాబాద్
22
కవితా గానం*
అంశం : *తరంగిణి*
ఏ కొండ కోనల్లో
పురుడుపోసుకున్నావో...
ఏ పర్వత సానువుల్లో
ప్రాణం పోసుకున్నావో....
నీ జన్మ రహస్య మేమిటో
అంతు చిక్కదు కదా!
కడలికి సాగే నీ జీవన యానంలో...
ఎన్ని వలపులు...
ఎన్ని తలపులు...
ఎన్ని మలుపులు...
ఎన్ని ఒంపులు...
ఎన్ని సొంపులు...
ఎన్ని ఒయాగారాలు...
ఎన్ని నయగారాలు...
ఎన్నో నవీన నాగరికతలకు
నాందీ వాచకం పలికిన
నవ జీవన స్రవంతివి...
ఎన్నో పుణ్యక్షేత్రాలకు
ఆట పట్టై సాగే
చైతన్య తరంగిణివి...
జీవ నదివై సకల ప్రాణులకు పెన్నిధివై
అలుపు సొలుపు లేని
నీ గమనం
స్ఫూర్తి దాయకం...
నీ ప్రస్థానం నిస్వార్థం
*గుండ్లరాజు*
*సిద్దిపేట*
23
శీర్షిక. తరంగిణి.
హిమ గంగనది పవిత్ర నదివై
నాగరికథలకి పుట్టినిల్లు
*చిరునవ్వుల సింధుగా
గంగ, యమునలుకలసిన
*సృష్టి రచనల బ్రహ్మపుత్ర వై
*తీయని తపతి గా.
పుష్కరాలుగా కలిసి
పునీతంచేస్తూ
*నవ్య కాంతుల నర్మద లా *
*గల గల పారే గోదావరి లా *
పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ
*కిలకిల నవ్వుల కృష్ణమ్మగా *
* మహాశక్తి వంతమైన*
* మహానదిగా*
* కమ్మని కావేరిలా ఎన్నోవలపుల మలుపులతో
గుట్టలు అడవులు దాటి ప్రవహిస్తూ సమస్త జీవకోటికి ప్రాణధారల తరంగిణి
ప్రకృతి వర ప్రదాయిని.
సుగుణ మద్దిరెడ్డి
ఐలవారిపల్లె
ఐరాల..
ఇది నా స్వీయరచన
24
*జల తరంగిిణీ!*
***********************
పచ్చని పశ్చిమకనుమలలో పుట్టి
రాళ్ళభూముల పంటసీమలుగా మార్చి
దక్షిణ భారతాన పొడవైనదానవైన
ద్వీపకల్ప వాసులoదరి ప్రాణదాతా!
దేశాన మూడోపెద్ద పరివాహకప్రాంత సృష్టికర్తవై
తెలుగుప్రాంతాలకు బహుళప్రయోజనకారివై
మా జీవితాలను మలుపు తిప్పు వరదాతా!
మంచిమలుపు తిప్పుమా మా ప్రియమాతా!
నీ నడుము ఒంపుల్లో ఎన్ని నగ(రా)లో!
నీ నురగలపరుగుల్లో ఎన్ని న(యా)గారాలో!
నీ ప్రవాహవేగానికి ఎన్ని ఆనకట్టలో!
మా పచ్చనిజీవితాలకు చల్లనిదిక్కువే!
కాటన్ మహాశయుని కృషికి నెలవా!
కనువిందు జలపాతాల ఆక్సిబో కొలువా!
పాపికొండలు కోనసీమ అందాలనిలయమా!
మా ఆరాధ్యదైవాల ఆలయాలతీరమా!
హొయలొలికె నడకల అందాల చిరునామా!
నీ బిడ్డల సంతోషసుమాల వాడనీయకుమా!
ప్రాణాధార నీ జలామృతాన్నే గ్రోలనీయమ్మా !
మా కన్నీటి ఉప్పుధారల తాగలేమమ్మా!?
అందమైన నీ ఇసుకతిన్నెల్లోని
వెన్నెల్లోనే ఆడుకోనీయమ్మా!
చల్లని నీ అడుగులు కాస్త తడబడినా
మా జీవనం చీకటేనమ్మా *జల తరగిణి!*
ఆగ్రహాన నువ్వు ఉప్పొంగి వస్తే
మా బక్కప్రాణాలెదురొడ్డి నిలువగలవా?
వరదపడగలెత్తి బతుకుల్లో కాటేయకమ్మా!
జీవితాలతో ఆడుకోకమ్మా"దక్షిణగంగమ్మా!
మా గుండెల నిండిన గోదారమ్మా!
*వల్లాల విజయలక్ష్మి*
ఆలేరు
25
కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం..తరంగిణి
శీర్షిక...నిత్య చైతన్యానికి ప్రతీకలు
పంచభూతాలలో భాగమై
ప్రాణకోటికి జీవనాధారమయ్యే నదులు
దేవతకు ప్రతిరూపాలు
మలినమెంత సోకినా
తన ప్రవాహ స్వభావంతో
పవిత్రమయ్యే
పావన గోదావరులు
పుడమిని హత్తుకొని
పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ
నిరంతరం సాగే సజీవ స్రవంతులు
ఎక్కడో పురుడుపోసుకొని
ఏ దిక్కులకో పయనిస్తూ
ఎదురయ్యే ఎత్తు పల్లాలను అధిగమిస్తూ
లోయల్లో దిగిపోయినా
పాయలుగా విడిపోయినా
గమ్యం చేరుదాకా నడక సాగిస్తూ
పుణ్య క్షేత్రాలలో
గంగమ్మలా గమనం సాగిస్తూ
నాగరికతకు నడకలు నేర్పిన నదీమ తల్లులు
నిత్య చైతన్యానికి ప్రతీకలు
మానవునితో ముడిపడిన బంధమై
కదలాడే నురగలలో
బాధలున్నా,నవ్వులున్నా
మదిలోనే దాచుకొని
సహనమే ఆభరణమై
ఆనందం పంచుతూ
కడలి ఒడికి చేరడమే
లక్ష్యంగా సాగే తరంగిణి
నిత్యం స్ఫూర్తి నింపే వాహిణి
26
అంశం:- * తరంగిణి *
కోరాడ .నరసింహా రావు...!
******************
గంగా గోదావరి సింధూ...
కృష్న...కావేరీ.... పవిత్ర
గంగా తరంగాలు....
పుడమి తల్లిని పూనీతంచేస్తూ
స స్యస్యామల ఢరిత్రిగా మార్చి
ప్రానీకోటికీ జీవనాధారమై...
భాసిల్లు తున్నన్దాకా.... ఈ జగతి ఆనంద నఁదనవనమే !
అమిత కృ తకానఁదాల
నాశిస్తూ ఓ మనిషీ...
ఏందుకలా కాలుష్యాలతో నిమ్పేస్తూ... నీ బ్రతుకును నీవే
నరకమ్గా మార్చేసు కున్టావు!?
వాటి సహజ నర్మల్యాన్ని...
పరిరక్షీన్చు...నీ బ్రతుకును
ఆనంద మయం చేసుకో...!!
******************
......కోరాడ.
27
[కవితా గానం (సీజన్1)
పేరు:కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
శీర్షిక: *తరంగిణి*
వచన కవిత్వం
తేది:21/05/2021
చరవాణి సంఖ్య:8897155600
ప్రకృతమ్మ పచ్చనిపట్టు పరికిణీని కట్టుకొని మురిసిపోయే వేళ.. ,
వసంతుని చిరు ఆగమనం చిత్రమైన విచిత్రాలను చూపిస్తుంటే..,
వేప చిగురులు చిట్టి పాపల చేతి వేళ్ళలా ముద్దొస్తుంటే..,
మావి గుబుర్లలో దాగున్న కోయిల కూతలు సడి..,
చల్లని పిల్లగాలులకు చెట్ల తలలన్నీ ఊపుతూ ఊయలలూగే కొమ్మ బాలికల సవ్వడి..,
చిరుగాలికి సెలయేటి తరంగాల శబ్దం చిరుగంటల నాదంలా వినిపిస్తూ..,
కోవెల గంటల గణగణలు..,
గోవత్సాల అంబారావాలు..,
ఆనంద భైరవి రాగాల తరంగిణిలో తేలిపోతే..,
గతస్మృతుల జ్ఞాపకాల పొత్తం తెరుచుకుంటుంది వనమయూరపు నర్తనంలా...!!!!!
*ఈ కవిత ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను.*
*నీలా రంగనాధం*
28
కవితా గానం*
పేరు : డా.దీపక్ న్యాతి
తేది : 21-05-2021
అంశం : తరంగిణి
శీర్షిక : అమ్మ గంగమ్మ
పాలపుంత విశ్వాన కొంత
భూగ్రహానికుంది విశిష్టత
జీవం బతుకుతుంది దాని చెంత
జలం ఉన్నది కావలసినంత
సాగర జలాలు భూమిలోనుండు నంతా
మేఘాలై పయనించు కుంత
తీపి జలాలై మారడం వింత
భూమినుండి ఉబికి పైకొచ్చినా
మేఘాలుగా వర్షించి కురిసినా
తరంగిణి గా అవతారమెత్తుతుంది
జీవనానికి ఆధారమైపోతుంది
తరంగిణి పల్లాలకు పారుతుందంటే
ఒదిగి ఉండాలని సూచిస్తుంది
నిస్వార్ధంగా సేవ చేయాలని చూపుతుంది
అందరినీ ఆదుకోవాలని నేర్పుతుంది
అమ్మ ప్రేమను కలిగి ఉన్న గంగమ్మ
తల్లిలా గౌరవించు ప్రేమించు
జీవిత పయనాన్ని సాగించు
తరంగిణిని దేవతలా పూజించు
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
29
కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
అంశం:తరంగిణి
శివుని జటాజూటం నుండి ఉబికిన గంగవా
ప్రకృతి సోబగు చూసి మురిసి ముదితావా
ధవళ వస్త్రధారణ పైపైకి చూస్తున్న
స్త్రీ రూపుదాల్చిన అందాల అవని వా
జలపాతమై వచ్చు జలతరంగిణి వా
ఏకాంతమాశించి వచ్చిన కాంతవా
నిలువెత్తు నీరూపు సమ్మోహనం
జలపాత హోరులో తడిసి పోవాలని
తహ తహ తహ నయనాలు ఎన్నెన్నో
కనువిందు చేయగా కదలిరా నేస్తమా
ఊహ జగతిలో మమ్ము ఊరించకా వడిగ
నీ హంగు పొంగు లతో మురిపించరావా
శిఖరాల పై దృష్టి ఉంచి కేంద్రీకరించక
అవని జనులను కరుణించగా రావె
నీ పాదస్పర్శతో పంట చేలు తడుపుతూ
అన్నదాతలకు ఊరట కలిగించు రావమ్మ
ఉరవళ్ళు పరవళ్ళతో ఉబికి ఉబికి జగతికే ఆనంద ఆనందమొసగ రావమ్మ
డా బల్లూరి ఉమాదేవి
30
కవితాగానం సీజన్ వన్
కేసీ నరసయ్య
పుట్టిన ఒడిని వదిలి
కడలి గమ్యంకు పయనం
వాగులు వంకలును
అక్కున చేర్చుకుని ఆగని నీ పయనం
అడ్డంకులు ఎన్ని ఎదురైనా
అడ్డు తొలగించుకుని సాగుతున్న పయనం
ధరణి తాపం చల్లార్చుతూ
నేలతల్లికి పచ్చని చీర కట్టిన వైనం
అడవులు కొండలు దాటుకుంటూ
అందకుండ సాగుతున్న మహాయానం
సుడిగుండాలతో వడివడిగా
కలివిడిగా కలియతిరుగుతూ కదులుతున్న ప్రవాహం
నీ గమ్యం నీ లక్ష్యం
ఆగని ఆరాటం సాగుతున్న మహా పోరాటం
31-----------
తరంగిణి
----------------
అలా.....అలా..
అలరించే అలలతో
పాడుతూ సాగిపోతావు
చల్లని నీమనసు
సుతిమెత్తని నీ హృదయం
నీ ఒడి చేరినపుడే నాకర్థమైంది౹
గర్భంలో ఎన్ని విపత్తులు దాచుకుంటావు౹
బాహ్యంలో ఎందరి రసపిపాసకుల హృదయం దోచుకుంటావు౹
కవి కలంలోని సిరలో రసమైంది నీవే కదా౹
నీ రసమైన మాహృదయంలో ఉత్సాహం నింపింది నీ పరుగే కదా౹
నీకు ఒరిగేదేముంది అనుకోవు౹
అడుగడుగునా
పుడమికి పచ్ఛదనాన్నద్దుతావు౹
ఆర్తుల ఆకలి తీర్చడంకోసం
వారి నోటిలో అన్నపు ముద్దౌతావు౹
నీలో అడుగిడగానే
నాకు నేనే పొంగి పోయేటట్లు
నాగరికతను బోధిస్తావు౹
సంస్కృతీ సంప్రదాయాలను కథలు కథలుగా చెప్తావు౹
ఓ తరంగిణి
గమ్యాన్ని మరువని గమనం నీది౹
నన్ను మరువకు
నీతో కలసిన పలుగు రాళ్ళకు మృదుత్వాన్ని అలదినావు
నేనూ రాయినే
రాస్తూనే ఉంటాను
నిను చూస్తూనే ఉంటాను..
నీవు పాడుతూనే ఉండాలి
పుడమిని కాపాడుతూనే ఉండాలి౹
★★★★★★★★★★★★
జల్లిపల్లి బ్రహ్మం
★
32
కవితా గానం( సీజన్...2)*
*అంశం....తరంగిణి*
*శీర్షిక.....జీవశ్వాస*
నదిని నేను
జల జల పారే అందాల
హరివిల్లును నేను.....
జల జీవనానికి
జీవ శ్వాసను నేను....
జీవరాసులకు ఆవాసం నేను
జలచరాలకు నివాసం నేను....
అందమైన హొయలతో
కదలివచ్చే కృష్ణమ్మను నేను...
అనుక్షణం గలగల లతో
గానామృతాన్ని పలికే
గోదావరి ని నేను...
అలవికాని అందాల
యమునా సింధూను నేను...
అణుకువ నాదాల
నర్మదా కావేరిని నేను...
ఆపన్నహస్తం లో రైతుల
అండా దండా నేను...
ఆనకట్టలకు ఆలంబన నేను
ఆహ్లాదానికి విహారయాత్రను నేను....
అన్ని అందాల లంకలకు
వలపు వారధిని నేను...
పుష్కరాన్ని నేను
పూజనీయం నేను....
పవిత్రతకు మారుపేరును నేను..
పునీతులుకు నాందిని నేను...
కవి హృదయంలో
మధురమైన కవితా
భావానికి పునాది నేను...
కన్నె వయసు జంటలకు
మరపురాని వేదికను నేను...
నదిని నేను అదరి అందాల
మదిని దోచే హరివిల్లును నేను...
కాలుష్య రహితం చేయకండి నన్ను
కరుణతో కాపాడుకోండి నన్ను....
హామీ....నమస్తే 🙏
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
మొహమ్మద్ అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి
33
కవనజ్యోతి:
అంశం: తరంగిణి
శీర్షిక: జీవనవాహిని
పేరు: వేదాల ఇందిర
సువిశాల భారతావని పెక్కు నదులతో విలసిల్లుతోంది పవిత్ర గంగా కృష్ణ గోదావరి బ్రహ్మపుత్ర మొదలైన జీవనదులతో అలరారుతోంది
భారతీయులకు నదులు కన్నతల్లులవంటివి
జీవుల దాహార్తి తీర్చడమే కాక పాడిపంటలకు వృక్షాదులకు ఆధారభూతమైంది
ఏ ఖర్చూ పెట్టి తెల్లని పెద్ద పెద్ద మంచినీటి ప్రవాహాలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరాలు
నది జీవధార లోకానికి ప్రాణధార
కొండలపై పర్వతాలపై కురిసిన వాన యేరులుగా సెలయేరులుగా మారి నదులుగా ప్రవహిస్తాయి
మబ్బులు కురిస్తేనే నదులు పారతాయి నేలపండుతుంది పొట్ట నిండుతుంది
నదులని యేరులని కూడా ఎరుక
యేరు లేని ఊళ్ళో ఉండకూడదంటాడు సుమతీశతకకారుడు
ఉప్పొంగి పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి అంటూ బాపిరాజు గారు చక్కని కవిత రాసారు కవిసామ్రాట్ విశ్వనాధ వారైతే ఏకంగా గోదావరి కి దాని ఉపనది కిన్నెరసాని కి అత్తాకోడళ్ల సంబంధతో బహు చక్కగా కవిత్వం వెలువరించారు
కృష్ణానదిని తెలుగింటి విరిబోణి గా అభివర్ణించారు ఒక సినీ కవి
ఇంకొంతమంది రసహృదయులైన కవులు వెన్నెలలో ఎగిసిపడే కెరటాలు యౌవని మృదుమంజీరాలుగా ప్రశాంతవాహిని పై నావ నడిపే సరంగు పండు వెన్నెల ను ఆస్వాదించే చకోరంలా వర్ణించడం జరిగింది
మబ్బులు కురవాలంటే కాలుష్యం అరికట్టాలి నదులు ఎండిపోరాదంటే కొన్ని నదుల అనుసంధానం జరగాలి
నదులు నిండుగా ప్రవహిస్తున్నంత కాలం పవిత్ర భారతికి నాశనం ఉండదు
34
🙏🙏కవనజ్యోతి🙏🙏
🙏సుధారాణి కృష్ణంరాజు🙏
*అంశం*తరంగిణి*
30-03-2021(మంగళవారం)
*నదులతో మానవ జీవితం పోల్చుకుంటే అవినాభావ సంబంధం ఉంది నదులు వాగులు వంకలు ఇసుక దిబ్బలు దాటడానికి ఎంతో ఇబ్బంది కలిగినా సముద్రం చేరాలన్న ఆశయం లక్ష్యం గా చేసుకుని ఆ దిశగా పయనించి
చిరరకు గమ్యం చేరే దాకా
ప్రయత్న లోపం ఉండదు*
*ఆవిధంగానే ప్రతి వారి జీవితం నదీ సాగర సంగమం
లాంటిదే కష్టాలు బాధించిన జీవితంలో అనేక అనుభవాల తో బ్రతుకు బండిని నడిపించే ది ఆత్మస్థైర్యం
బంధాలు ,బాధ్యతలు నెరవేరాలంటే ఎన్నో కష్టాలు
కడలిలో మునిగి తేలుతూ గమ్యం చేరాలంటే తరంగాల తాకిడికి జీవితంలో కలిగే అటు
పోట్లను ఛేదించి అనుకున్న ఆశయం మాత్రమే చూడాలి
ఆశయం ముందు ఎన్ని అవరోధాలు కలిగిన వేసే అడుగు ఆలోచించి వేసినపుడు
గమ్యం ఎంతో దూరం లో ఉండదు
ఉబికి వచ్చే కన్నీరు ఆపే శక్తి గుండె ధైర్యం నీ ఆయుధం కావాలి ఆ ఆయుధం తో పోరాడినపుడు అన్నీ విజయాలే
నదులను చూసి తరంగిణి లా ఈ జీవన తరంగాలను ఈదగలిగితే సమర్థవంతంగా
జీవన ఫలాలు సఫలాలు అవుతాయి🙏🙏
35
చైతన్యం ప్రవాహమై సస్యశ్యామలం చేస్తున్నాయి
పైరు పచ్చళ్లను తడుపుతూ స్వచ్ఛమైన జలాలను అందిస్తూ కాలానికి సమాధానంగా అనేక అనేక ప్రాంతాలను దాటుతూ
కొండకోనలను దాటి అరణ్యాలను తగులు కుంటూ
అనేక మైలు రాళ్ళు
దాటుకుంటూ వడిగా వడివడిగా గోదావరమ్మ
తరంగాలలో కృష్ణవేణి లా గౌతమి శబరి కిన్నెరసాని నడక వయ్యారంతో
ఉధృతంగా ఉద్రేకంగా ఉత్సాహంగా ప్రవహిస్తూ తరంగాలతో జలకళను ఆవిష్కరిస్తూ ఎన్నో మైలురాళ్లను దాటే
తరంగిణులకు స్వాగతం ప్రేమ పూర్వక స్వాగతం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 77025374
36
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
🦚కవనజ్యోతి☂️💐
మంగళవారం
అంశం- *తరంగిణి*
శీర్షిక-అపురూపం
------------------------------------------
అలజడి రేకెత్తించే అలవు-
నిదురలో నేను కన్నకలవునీవు
ఆదమరచిన అలజడివి నీవు
నా కనుల ముందు నిలిచిన రూపానివినీవు-
పెదవి దాటని నాఅంతరంగసంద్రపు కెరటానివినీవు-
నావయసును కాలుస్తున్న తాపపు సింధూరానివి -
నాపెదవులు దాటిబయటకు రానినాభావ సంద్రపు మాటవు-
జలాజలా పారేమోహన రాగపు కుసుమానివి-
ఎవరివంటే ఏమి చెప్పను-
ఒక్క క్షణం తోడుగా ఉంటావు-
నిన్నునమ్మిఆశలతీరం ఏర్పరుచుకునే లోపు కదిలి పోతావు కాలంలా-
వేటగాని చేతిబాణంలా-
నినునమ్మిన నాకు
నీరాక ఎండమావి-
నీ సాన్నిహిత్యం ఆకాశాన అరుంధతి-
సృష్టిచైతన్యపు శంఖారావ నాదం నీవు,-
ఎవరడ్డం వచ్చినా ఆగదునీ పయనం-
నన్ను వదిలివెళ్ళిన ప్రతి సారి నాగరికతకు మారు పేరు అవుతావునువ్వు-
తరంగిణి ...నీవు మాఎద మాగాణాన పూచిన పువ్వు---!
---------------------------------
ఇది నాస్వీయరచన
భరద్వాజ రావినూతల
37
తరంగిణి!
అలలు అలలుగా సాగిపోయే తరంగిణీ
హొయలొలుకు కెరటాల లయల్లో
మదిని దోచు అందాల సిరులు
నదీమ తల్లి చెంతన సేదదీరగ!
నీ సుడిగుండాల పరవళ్లలో
ధుఖిత మది ఊరడిళ్ళు
శివుని శిరస్సునుండి పాయలుగా జాలువారు గంగలా
తనువులు పులకరించి సయ్యాటలాడు!
తరంగిణీ నెలవుగా దేవాలయాలు
ఊహల ఊయలలో మనసు తేలియాడు
పట్టణాలకు నగరాలకు పట్టుగొమ్మ నదీమతల్లి
బంగరు రంగుల చీరలతో పడతులు స్నానమాడ
కవుల కల్పనలో నీవు నవయవ్వన కోమలాంగివి!
గళ గళలాడుతూ పరుగులిడుతూ కోపం
కొండ కోనలు దాటుతూ
పట్టణాల మురికినంత నీలో ఇముడ్చుకుని
పేదా సాదా ధనిక అని తేడా లేకుండా ఆసరా అవుతూ
రైతు పంటపొలాలకు సేద్యపు నీళ్ళవుతూ,,,,,,!
జల జలమంటూ కొండల మీదనుంచి దూకుతూ
రంగు రంగుల గుభాలింపు పూల చెట్లమధ్య
ఆనంద సరాగాల భామినులు నృత్యం చేయ
దివి నుండి భువికి స్వర్గం దిగి రాదా,,,,,,
ఈ తపోభూమి ధన్యతనొందు నటుల ఓ తరంగిణీ!
ఆపరాజిత్
38
కవన జ్యోతి
అంశం. తరంగిని
శీర్షిక. జీవనది
🌊🌊🌊🌊🌊
నిశ్చలమైన నది అయిన
ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు అయిన
అలలు గా ఎగసిపడే కెరటాలు అయినా
సునామీల ముంచెత్తే ఉపద్రవమైన
ఏదేమైనా అన్నింటిని భరించాల్సిందే
ఆనందాలని ఆవేశాలను అనుభవించాల్సిందే
పడుతూ లేస్తూ ఉండే కెరటం నేర్పింది
పడిన మళ్లీ పైకి లేవమని ప్రయత్నం ఆపకు మనీ
ప్రశాంతమైన నది నేర్పింది
నీ లో ఎన్ని ఉద్వేగాలున్నా పైకి నిశ్చలంగా ప్రవర్తించమని
కలుపుగోలుతనం కడలి నేర్పింది
అందరిని మన వారిలా కలుపుకుపోతూ
నీ జీవనయానం సాగించమని
కడవరకు కొనసాగించమని
జీవితం ఓ జీవన తరంగాలుగా ప్రహించాలని 🌊🌊🌊
ఈ కవిత నా స్వీయ రచన
ధన్యవాదములు 🙏
బేతి నాగలక్ష్మి
ఆలేరు.
39
కవనజ్యోతి కవిసమయం
*************
పేరు:గాజుల భారతి శ్రీనివాస్
ఊరు:-ఖమ్మం
అంశం: తరంగిని
శీర్షిక:-జలమే జీవం
సర్వకాల సర్వావ్యవస్థలకు ప్రాణదారం నీరు
చరాచరజీవుల గమనలయకారి నీరు
జలమే జీవనాధారం
జలమే జగతికి ప్రధానం!
ప్రకృతి సమస్తజీవులకు ప్రసాదించిన అపురూపమైన వరం నీరు
ప్రప్రథమంగా జీవం నీటి నుండే ఆరంభమైనది
నీరు విశ్వవ్యాప్త ద్రావణి
నీరు ఆరోగ్యాన్ని రక్షిస్తూ.
శరీరంలో రవాణా వాహకంగా ఉంటూ..
వ్యర్థాలను బయటకు విసర్జిస్తూ..
నీరు మానవ మనుగడకు పరమౌషదమగును
గృహ..పరిశ్రమలకు..వ్యవసాయానికి నీరే ఆధారం
విద్యుత్ ఉత్పత్రిలో నీరే ఆధారం
నేడు నీరు ఖరీదైన..అరుదైన వస్తువు అయింది
సతతం..హరితం కావాలంటే నీరే ప్రధానం
మొక్కల్ని నాటుదాం పుడమితల్లికి పచ్చల హారంతో తోరణం కడదాం
నేలపై పచ్చని పరదాలను పరచి
హరిత తీవాచిలపై ఆనందించాలన్నా నీరే ఆధారం!
నీటిని వృధా చేయక..
పొదుపుగా వాడుతూ..
భవిష్యత్తు తరాలకు బహుమతిగా ఇద్దాం
ప్రాణకోటి మనుగడకు ప్రాణాదా రాన్నీ అందిద్దాం!
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను.
40
కవన జ్యోతి
30/3 /2021
అంశం :తరంగిణి
........................
మిట్ట లక్ష్మి
చిత్తూరు
చరవాణి: 9440097002
...........................
శీర్షిక: జీవన స్రవంతి
........................
భారతావనిలో ఒక దేవతగా కొలువబడుతున్నది .. నది
పంచభూతాలలో
జలం.. సుజలం నది
ఇలకు దిగి వచ్చిన గంగా స్వరూపం...నది
వయ్యారాల నడకలతో
వంపుసొంపుల పారలతో
తరంగాల తరంగిణి
గల గల శబ్దముల
జలతరంగిణి
జనజీవన స్రవంతిలో పెనవేసుకుపోయిన
జల స్రవంతి ...
ఎన్నో కుటుంబాలకు ఆధారము
ఉదయ ఆస్తమానాలు
తాగునీరు సాగునీరు
ఊర్ల మధ్య వారధి
తరంగిణి ....
భూమాతను తన నీటితో తడిపి పచ్చని పైర్లు గా పంటలుగా సాగేది తరంగిణి
దాహార్తితో అల్లాడుతున్న జనాలకు గొంతు తడిపి
దాహం తీర్చే తరంగిణి నది
నది ఒడ్డున ఎన్నో చెట్లకు ఆలవాలమై... చెట్లను అంచుగా గల స్త్రీమూర్తి
ఒడ్డున బాల్యంలో ఆటలు
చల్లని సమీరా లతో సేదతీరడం
జీవితం లో నదితో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు
కొండలలో కోనలలో
అలుపెరగని పయనం
కవుల కలంలో సిరాగా
నది కవితలు జాలువారింది చరిత్రలు తిరగరాసింది
నాగరికతలన్నీ...
నది ఒడ్డునే
చరిత్రకు అద్దం పట్టి
ఆ నాటి కాల పరిస్థితులను
నేటికి ప్రవహింప జేసే నది
సంప్రదాయాలలో
ముఖ్యభూమిక నది
తీర్థాలు గా గుడి గోపురాలు తో
తరింప జేసే తరంగిణి
స్పూర్తి , జీవం , జీవితం
నదీమ తల్లి ..
41
పేరు : డా.దీపక్ న్యాతి
తేదీ : 30 i3 2021
అంశం : తరంగిణి
శీర్షిక : వడి వడిగ వడి చేరు
జీవిత పయనానికి ప్రేరణ
స్వార్థమెరుగని సేవగుణ నిదర్శన
అలసటకు అర్థం తెలియని ప్రదర్శన
నిరంతర నిజాయితీకి నిలువుటద్దం
ప్రకృతి తోబుట్టువుల పలకరింపు
లక్షల జీవాల జీవాశ్రమ నిలయం
పదనిసలకు తీసిపోని సవ్వడి
ఎత్తుపల్లాల దూకే ఆదర్శ సాహసి
రాళ్ళను దొర్లించి శిల్పాల చెక్కే శిల్పి
ప్రకృతిని స్పర్శించే పవిత్ర పావని
సర్వ రుగ్మతల నిరోధిని ఆయుర్వేదిని
అందమైన పరవళ్ళ నఃదించే నందిని
సస్యశ్యామలాన్ని పోషించే సాధ్వి
అంతరంగాల తరంగాలను తరలించి
మనిషిని సేవించ యేతెంచిన తరంగిణి
తరంగిణి వడి చేరుకో సేదదీరు
సేంద్రియ వనరులు వదులుకోకు
పూజించి తరంగిణందించిన పోషణలు
అందుకో పామురుడవై వెలిగిపో
డా.దీపక్ న్యాతి
హైదరాబాద్
42
అంశం :తరంగిణి
పుట్టింది ఎక్కడైతేనేం.....
ప్రస్థానమంతా ప్రవాహమై సాగుతూనే ఉంది
సంగమ స్థానం లో చేరేంతవరకు.....
ఎన్ని మలుపులు తిరిగినా
సరిగమలొలికించే తన స్వరం మూగ బోయింది లేదు
కనిపించిన కొండా కోనల్ని పలకరించడం లో అలసిపోయింది లేదు
తనకు తెలిసిందల్లా....
అలసిన మనసులకు అలల...వీవెనలతో...
సాంత్వనల దీవెనలనందివ్వడమే...
దారంతా సత్తువలసారాన్ని మోస్తూ
నీరసించిన నేలపై సంతసపు గుర్తుగా
పచ్చదనపు పచ్చబొట్టొకటి ముద్రించి మరీ పరుగులు తీయడమే...
అంతేనా.....
తీరంపై నాగరికతల నవ్వుల్ని మొలిపించి
పునీత భావనల దివ్వెల్ని వెలిగించి
ఆధ్యాత్మికత ల కథలకు అలవాలమై ఆదరించడమూ తెలుసు
స్వచ్ఛదనం...
తీయదనాలతో
తరలి పోయే
తరంగిణీ......!!!
ప్రేరణల పరవళ్లు
వితరణల తరంగాలతో పయనించే పయస్వినీ.......!!!
గమ్యమెంతైనా
గలగలలు వెల వెల బోవద్దంటూ...
మార్గమేదైనా స్వర్గం లా
మలచుకొమ్మంటున్న
నీవొక
సందేశాల స్రవంతివే కదా..!!!
*********లలితాకృష్ణ
Comments
Post a Comment