మానవత్వం కవితా గానం 2021




నిర్వహణ

వీరా గుడిపల్లి

శివునూరి లలితా కృష్ణ

************

కవివరుల జాబితా

First post for this topic was posted by

తాత పూడి సోమ శేఖర శర్మ గారు

But you can find his poem in  last

Y.... అందరికీ తెలియాలని

********

శివునూరి లలితా కృష్ణ

1. ఆళ్ళ నాగేశ్వరరావు గారు

2. డా.ఆంజనేయులు గారు

3.ధనాశి ఉషారాణి గారు

4.తిప్పావఝల నరసింహ మూర్తి గారు

5. తరణి కంటి సూర్య లక్ష్మి గారు

6.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

7.బాలు కత్తులు గారు

8.మేకల రామ స్వామి గారు

9.పిల్లి హజరత్తయ్య గారుు

10.సయ్యద్ జహీర్ అహ్మద్ గారుు

11.అపరాజిత రెడ్డి గారు

12.ఏ.భూపతి గారుు

13.చేబియ్యం శ్రీనివాస్ గారుు

14.పిన్నక నాగేశ్వరరావు గారుు

15.సునంద వురిమళ్ల గారు

16.డా.బల్లూరి ఉమాదేవి గారు

17.మన్నె పిన్నక లలిత గారు

18. సి.హెచ్ విజయ లక్ష్మి గారు

19.డా.దీపక్ న్యాతి గారు

20.మర్రి జయశ్రీ గారు

21.కొంపెల్లి రామయ్య గారు

22.వల్లాల విజయ లక్ష్మి గారు

23. కవిత వెంకటేశ్వర్లు గారు

24. శ్రీ కాంత్ కడార్ల గారు

25. వనపర్తి గంగాధర్ గారు

26. దారల విజయ కుమారి గారు

27.జక్కిడి వెంకట్ రెడ్డి గారు

28.బి నాగేశ్వరరావు గారు

29.సునంద వురిమళ్ళ గారు.

30. అన్నాప్రగడగారు

31.అఫ్సర్ వలీషా గారు

32. కె దేవికా రాణి రత్నాకర్ తెనాలి గారు

33.కోరాడ నరసింహారావు గారు

34.సుగుణ మద్ది రెడ్డి గారు

35. జక్కిడి వెంకట్ రెడ్డి గారు

36.వినీల గారు

37.నీలా రంగనాధం గారు

38.కెసి నరసయ్య గారు

39.అన్నా ప్రగడ గారు

40.తాతపూడి సోమశేఖర శర్మ గారు

**********

నేటి అంశం

మానవత్వం


ఎనిమిది నుండి తొమ్మిదిన్నర

వరకు అంశానికి

కవితలు పంపగలరు.


ఆ సమయంలో

ఎలాంటి ఇతర

స్పందనలు

తెల్పకుండా

సహకరించగలరు.

**********

అంశం :పరిమళిస్తూనే ఉంది 


సవాళ్ళ సామ్రాజ్యంలో

అడుగు పెడితేనే కదా

ఎదురీతల వెతలఏకరువులు

వినిపించేది 


సంక్షోభపు గ్లోబును

సందర్శిస్తేనే కదా

మానవీయమ్రానులు

సానుభూతుల సంద్రాలూ...

ఉంటాయని తెలిసేది


విధి చిమ్మిన విషపుకోరల్లో

వీధులన్నీ నివ్వెరపోయిన వేళలోనే కదా 

కనికరపు కళ్ళాపి చల్లి

మానవత్వపు ముగ్గులు

పరచే వారుంటారని 

తెలిసేది


చెక్కిళ్ల పై కన్నీటి చుక్కలను

తుడవడానికి

శ్రీమంతపు చెక్కులతో పాటు 

కాయకష్టపుచుక్కలు 

దృక్కులుసారించి 

కదులుతాయని 

అప్పుడే కదా తెలిసేది 


అందుకే

గుండె తడిని

ఎడారిగా చూపుతున్న

గళాలకు కలాలతో సమాధానమిద్దాం 


పరిమళిస్తూనే ఉన్న మానవత్వాన్ని 

వాడిపోయిందంటున్న

వాడుకపదాలకు స్వస్తి

పలుకుతూ....


మానవత్వం 

మరణించిందన్న 

రాతలకు 

మరణశాసనం రాసేద్దాం


********లలితాకృష్ణ

1

 అంశం: మానవత్వపు పరిమళం

కవితా శీర్షిక:

    "" మానవత్వమే అభిమతం"

మానవ స్వయంకృతాపరాదానికి అపరాదాన్ని  విధిస్తూ

కల్లోల కరోనా తన మలిదశలో 

హైరానా సృష్టిస్తున్న తరుణంలో

కరీనాతో మృతి చెందిన శవాన్ని

ముట్టుకునేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాని దుస్థితుల్లో

మతాలసారం మానవత్వమని

మనిషికి ముఖ్యం సోదరతత్వమని తలంచి

చనిపోయిన కరోనా రోగులు తమ సోదర సోదరిమణులుగా తలచి

రంజాన్ నెల మాసంలోనూ

కఠిన ఉపవాస నియమాలను ప్రక్కకు నెట్టి

అందరూ ఉండిఎవ్వరూ రాని అనాధ శవాలకు

అన్నీ తామై,అంతటా తామై

కుటుంబ సభ్యుల పాత్రను తామే పోషిస్తూ

ఎవరి మత సంప్రదాయ రీతులను పాటిస్తూ

అనాధ కరోనా శవాలకు అంత్యక్రియలు గావించి

వారికి పరలోకప్రాప్తిని కల్గించే  ఆ ఆపద్భాంధవులు

మృగ్యమౌతున్న మానవత్వానికి మచ్చుతునకలు!

మానవసేవే మాధవసేవగా తలచి

కరోనా బిగి కౌగిలిలో చిక్కి

ఉక్కిరిబిక్కిరి జీవనాన్ని  గడిపే

ఒంటరి కరోనా పీడిత రోగస్టులకు

ఒక్క ఫోన్ కాల్ తో స్పందించి

వారికి కావాల్సిన అల్పాహార,భోజనాదులను కల్పిస్తూ

వారికి చేదోడువాదోడై నిలుస్తూ

మందుమాపులను ఉచితంగా అందిస్తున్న

సామాజిక సేవాతాత్పరులు

మానవ రూపంలోని దైవంశ సంభూతులు

పరిమళించిన మానవత్వానికి సజీవ తార్కాణాలు!

............................................రచన

ఆళ్ల  నాగేశ్వరరావు

నాజారుపేట

తెనాలి

గుంటూరు...జిల్లా

ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం

సెల్ నెంబర్.7416638823

........................................

పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.

2

[08/06, 8:06 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: మానవత్వం


అన్నింటికంటే ఎత్తైనది మానవత్వం గౌరీశంకర శిఖరం మానవత్వం


మానవత్వమే లేకుంటే మనుషులు అనుబంధం ఎక్కడిది


ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవత్వం


మానవత్వం మంచివాణ్ణి కంఠం పరిమళమై వికసిస్తుంది


మానవీయత లేకపోతే వాడు మనిషి కాదు



అన్నీ జాల సారాంశం మానవత్వమే

మానవత్వం మనిషికి ఆభరణం అదే లేని నాడు వాడు మనిషే కాదు మానవుడంటే అతనిలో మానవత్వం ఉన్న వాడే దైవం తో సమానం


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి

ఇది స్వీయరచన దేనికి అనుసరణ అనుకరణ కాదు

7702537453

3

[08/06, 8:08 PM] +91 70755 17538: శీర్షిక. మానవత్వం

......

నేటి కళికాలపు బతుకుపోరులో

పగ ప్రతీకారాలతో మనిషి అమాంతంగా నిండిపోయి

రక్త బంధాలను సమస్తము  స్వార్థం ముసుగులో కప్పుకోని

ప్రేమ అనేటి మాయవలలో విషము నింపుతూ

అవకాశవాదుల్లా కత్తులు దూస్తూ బుసకొడుతూవుoటే

స్నేహాన్ని కూడా బూటకముగాతలిచి తెంచుతుంటే

ప్రాణము పోయాలిసిన మనుషులు కూడా కాసుల మాయలో మనిషిని వెన్నుపోటు పొడుస్తూ ఉంటే

మానవత్వమును మసిపూసి మారేడు కాయ చేస్తుంటే

ఇంకెప్పుడూ 

భావి తరానికి విలువులను ఇవ్వగలడు

బాధ్యతలు నేర్పే మనిషిలా నిలిచి

నిండు జగతికి మార్గదర్శిగా నిలవాలి

మమత కోవెలగా సేవా భావమును నింపి

శువిశాల బారతీయుడుగా భరతమాత బిడ్డగాను నిలవాలి



ధనాశి ఉషారాణి

చిత్తూరు జిల్లా

4

తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం


అంశం.మానవత్వం

మానవత్వమా!ఎక్కడ నీ ఉనికి?

వేసారి పోయాను నీకై వెతికి వెతికి.

మానవ శరీరంలో పేరుకుపోయిన పోయింది స్వార్థం.

మానవత్వాన్ని కమ్మేసింది స్వార్థపు పొర.

ఈపొర తొలగించు జర.

మానవత్వం పరిమళిస్తుంది బిరబిరా.

మానవత్వం లేని బ్రతుకు వ్యర్ధం.

అందించు ఆర్తులకు ఆపన్నహస్తం.

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వారికి

కావాలి నీవు నావ.

బతుకు బండిలాగలేని వారికిచూపాలి త్రోవ.

ప్రమాదాలలో ఉన్నవారికి అందాలి నీ సేవ.

తోటివారినిగూర్చిఆలోచించడం మానవత్వలక్షణం.

సాటి మనిషికి అండగా నిలబడాలని తక్షణం.

వృధ్ధాశ్రమాలపాల్చేయడం రాక్షసత్వం.

మనిషి జన్మ దుర్లభం.

మానవత్వం తో బ్రతికితేనే జన్మకు సార్థకం.

తిప్పావఝల నరసింహమూర్తి.

బుచ్చిరెడ్డి పాలెం.

నెల్లూరుజిల్లా

5

[08/06, 8:15 PM] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2)

8/6/2021/ మంగళవారము

అంశము:- " మానవత్వము "


సీ! మానవసేవయే  మానవత్వమనగ

భూతదయగలిగి  భువినిగాచు


జీవులయందుండు  జీవాత్మ యొక్కటె

అన్నిజీవులయందు  యాత్మగాంచు


సకలజీవులయందు  సమబుద్దిజూపుము

మానవత్వమొకటి  మహిని జూపు


తోటివారికెపుడు  తోడుగ నిలబడు

ఆకలితోనున్న  నాదరించు


ఆ! మానవత్వమెరిగి  మనుగడసాగించు

ధార్మికగుణములను  ధరణి కొసగు

కష్టసమయమందు  కారుణ్యమును జూపు

దీనజనులకింత  దాన మొసగు!

         తరణికంటి సూర్యలక్ష్మి.

                        ------------

6

[08/06, 8:16 PM] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం( సీజన్-2)

అంశం:-

మానవత్వం పరిమళం

పేరు:-

ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ఊరు:-విశాఖపట్నం

చరవాణి:-9963265762

శీర్షిక:-

మానవత్వమే ముముక్షత్వం

..............................


ఆకలిగొన్న వానికి పట్టెడు మెతుకులు చాలు

దాహం వేసిన వానికి గుక్కెడు నీళ్ళు చాలు

భాధాతప్త హృదయాలకు

సాంత్వన చేకూర్చే మాట చాలు.

దైవం మానుషరూపేణ అన్నట్లు సమయానికి సహాయంచేసే వారే పరదేవతా స్వరూపాలు...!!


సనాతనధర్మంలో  పురాణాల్లో కూడా రంతిదేవుడు, శిబి, హరిశ్చంద్రుడు.

నిన్నటి సమాజంలో జాతిపిత మహాత్మాగాంధీ, కందుకూరి, టంగుటూరి,దుర్గాబాయి, జ్యోతిరావు పూలేలు

నేటి సమాజాన "కరోనా కరాళ నృత్యములో 

ప్రాణాలు ఫణంగా పెట్టి

పగలనక రేయనక

పనిచేస్తున్న వైద్య, పారిశుద్ధ్య మరియు రక్షకభటులు సృష్టి, స్థితి, లయకర్తలే .సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే.

అందుకే మానవత్వం ముముక్షత్వమునకు దోహదపడుతుంది

ఇది సనాతన ధర్మానికి ప్రతీక.....!!

.............................

లోకా సమస్తా సుఖినో భవంతు.

ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు

ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

విశాఖపట్నం

.................................

7

[08/06, 8:32 PM] +91 96762 19655: అంశం మానవత్వం


మానవత్వమే లేకుంటే

మనిషికి మనిషికి..

తోడు ఎక్కడిది నీడ ఎక్కడిది బంధం ఎక్కడిది అనుబంధం ఎక్కడిది

సాయం చేయాలన్న గుణం ఎక్కడిది..

మానవత్వం పంచితెనే

మనిషికి మనిషి...

ధైర్యం నింపిన వాళ్ళం అవుతాం

భరోసా కల్పించిన వాళ్ళమవుతాం

కష్టాల్లో ఉన్న వాళ్లకి అండదండగా నిలుస్తాం బతుకు పై ఆశలు చిగురింప చేస్తాం

దిక్కు మొక్కు లేని వాళ్లకు ధీమాను కల్పిస్తాం

ఆపదలో ఉన్న వాళ్లకు అభయ హస్తం అవుతాం అందుకే...

ప్రతి మనిషి లో మానవత్వం పరిమళించాలి

మానవత్వపు ఆలోచనలతో మానవాళి వెల్లివిరియాలి

మానవత్వం పంచుటలో ఆచరణ దిశగా అడుగులు వేయాలి


బాలు కత్తుల


8

[08/06, 8:33 PM] Mekala Ramaswamy Poet: మానవత్వమా నీవెక్కడా?

*********************

మానవత్వమా నీవెక్కడా ?

నీ ఆనవాలు కనపడదెక్కడా ?

నాకు నేనే ,నాది నాదే

తీరు పెరిగింది

మేము మేమే ,మాది మాదనే

భావన కనుమరుగైంది

పక్కనే ఆరాచకత్వం జరిగినా

ముందు హత్య జరిగినా

వెనక మానభంగం జరిగినా

నా కెందుకులే నిర్లిప్తతత

నాకు సంబంధమేమిటనే ఉదాసీనత

కరోనా కరాళ నృత్యంతో

నిలువెల్లా భయం

తనువంత ఉద్విగ్నత

ఎప్పుడు ఏమౌతుందోననే జడుపు

బతుకు అతలాకుతలమౌతుందేమోననే కుదుపు

అడుగంటిన మానవత్వం

ఆవిరౌవుతున్న మానవ సంబంధాలు

అందుకే

మనం మానవత్వం దుస్తులు విడిచినం

స్వార్థమనే ఆధునిక వస్త్రాలతో ఊరేగుతున్నాం

మనిషి సాంఘిక జీవి

మరచిపోవద్దు మననం చేసుకొందాం

కాకులనుచూసి,చీమలనుచూసి

నేర్చుకుందాం

అడుగంటుతున్న మానవత్వంకు

ఆయువునిద్దాం

సాటి మనిషిపైన ,ప్రకృతి పట్ల

విధేయంగా మానవత్వాన్ని ప్రదర్శిద్దాం

మన ప్రగతికి దారులు వేద్దాం

*************************

మేకల రామస్వామి-చెన్నూర్

9912747214

9

[08/06, 8:49 PM] +91 98486 06573: కవితాగానం కొరకు రాయబడిన కవిత

అంశం: మానవత్వం

శీర్షిక: మానవత్వపు పరిమళాలు


నిద్ర లేచింది మొదలు 

ఉరుకులు పరుగులు

నశించిపోతున్న బంధాలు

మాయమవుతున్న మానవత్వాలు

కునారిల్లుతున్న మానవ జీవితాలు


కులమతాల కుమ్ములాటలు

నాగరికత పై తీరని మోజులు

కొండను తలపిస్తున్న పాపాలు

సుస్తీ చేసిన ఆరోగ్యాలు

కోల్పోతున్న మానవ సంబంధాలు


కరువైన మన:శ్శాంతులు

మరిచిన శాశ్వత ప్రయోజనాలు

గుర్తించలేక పోతున్న వాస్తవాలు 

సంభిస్తున్న మానవ జీవనాలు

మోడుబారిన మానవతా విలువలు


పాటించు మహాత్ముని సూచనలు

నిర్మించు వసుధైక కుటుంబాలు 

సాగించు జీవన యానాలు

బ్రతికిద్దాం మంచితనాలు

బ్రతకనిద్ధాం మానవత్వపు పరిమళాలు

10

కవితా గానం (సీజన్ 2)

అంశం: మానవత్వం


 *గుండెక్రింద తడి*


మంచిని పంచు సలక్షణాలు

మనిషి పదిలమవు

గుణాలు

చంచలమైన స్వభావం వున్నప్పటికి

అచంచలమైన కరుణరసార్ద్రత

గుండె కింద తడి

ఊరుతూ వుండాలి!


కరకు రాతికి వ్యతిరేక సంగీత స్వరం

అంతరంగాన మీటుతూ....


ఎడారిలో పన్నీటి జల్లు కురిసినా

ఎదారి చేసే స్పందన ద్విగుణీకృతమవ్వాలి


నిస్వార్థ రహిత లోకంలో

నిరాడంబర గమనంలో

అస్తిత్వం చాటుకొంటు

పరస్పర పోషకం

అందిపుచ్చుకుంటూ

కనికరం పూలు వర్షించాలి!

ఎదురుపడితే దృశ్యం సాక్షిగా

చక్షువుల వెంట అశ్రుధార కురిపిస్తూ

ఉద్విగ్న ఊపుతో పరామర్శించాలి!


శిలావిగ్రహం స్పందించదు

మృతకళేబరం

మసలుకోదు కదా!

మౌనవ్రతం విపత్కాలంలో అప్రసన్నం!

మనసు మనిషిని మెలిపెట్టాలి!

     ***


 *సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు* .

ఇది నా స్వీయ రచన అనుకరణ కానీ అనువాదం కానీ కాదు

పిల్లి.హజరత్తయ్య

శింగరాయకొండ

ప్రకాశం జిల్లా

......

11.

[08/06, 8:00 PM] Aparajith: రచయిత పేరు:ఎం ఆపరాజిత్ రెడ్డి 

ఊరు జిల్లా:సూర్యాపేట 

అంశం:  క్షమాగుణం 


జాలి కరుణ లాగానే 

క్షమాగుణం సుగుణాలలో పరమోన్నతం!

ఎంతటి బద్దశతృవునైనా 

కష్టసమయంలో క్షమించి ఆదుకోవడం 

మనిషయి పుట్టిన వాడి ధర్మం!

ఉరి శిక్ష పడ్డ ఖైదీని సైతం 

ప్రభుత్వం క్షమించగా లేనిది మనమెంత!

మనుషులై పుట్టిన మనం మానవత్వంతో సమయంవస్తే 

కఠినమైన కాలనాగులాంటి మనిషినైనా క్షమించాలి!

శరణన్న వాడిని క్షమించి వదిలేయాలి 

అలనాడు దాన వీర కర్ణుడు కుంతీని క్షమించి 

అర్జునునితో తప్ప మిగతా నలుగురితో 

యుద్దం చేయనని శపథం చేశాడు!

సత్యవంతంగా జీవించే వాడు 

క్షమయేవ దరిత్రి సుఖమయం అని నమ్ముతాడు!

తప్పుచేసినపుడు క్షమించండి 

మీయెడల తప్పుచేశాను అంటే 

ఎదుటి వ్యక్తి తిరిగి ఎంతటి సహాయాని కైనా సిద్దపడతాడు!

మూన్నాళ్ల జీవితానికి 

కక్షలు కార్పన్యాలు దేనికి!?

క్షమతో నరరూప రాక్షసునికైనా కనువిప్పు కలగాలి!

సాత్వికుడెపుడూ క్షమయేవ జయతే అని నమ్ముతాడు!

అగ్నికీలలు ఎగిసిపడే అంతరాలు 

క్షమ వళ్లనే సమసిపోతాయి!

మానవత్వం నిండిన మనిషికి పుట్టిన 

కవల పిల్లలు దయాగుణం క్షమాగుణం!

మహావటవృక్షం ఎంతటి క్షమాగుణంతో 

నీడనిస్తూ ఫలాలనిస్తూ ఖండ ఖండాలుగా నరికినా 

మళ్లీ మళ్లీ చిగురిస్తూ క్షమ తన ఊపిరి గా జీవం నింపుకుంటుంది!

ఆలోచనలు గల మనిసివై పుట్టి 

దయ క్షమాగుణాలు లేని మనిషి జన్మ వృదా!

మహాత్ముడు వినోబాబావే సత్యవంతమైన క్షమాగుణంతో 

ఎన్నెన్నో మహాకార్యాలు సాధించారు!

క్షమతో అంతరంగంలో శతకోటి దీపాలు వెలగాలి 

సృష్టిలో అద్భుతాలు క్షమతోనే సాధ్యం!

క్షమతోనిండిన మానవత్వం లేని చదువులు వృదా!

మృగం నుండి మనిషి చివరికి మనీషిగా మార్చేది క్షమాగుణం!


ఆపరాజిత్ 


హామీపత్రం: ఇది నా స్వీయ రచన

[08/06, 8:43 PM] Bupathi Sir: .....మానవత్వం.....

12.

....................................

మానవత్వం ఒక పరిమళం..

మానవత ఒక భావ సంపుటి...

క్షమ దాని వెలుగు...కరుణ దాని క్రాంతి....ఇతరులు

ఆపదలో ఉన్న స్థితి కి తన వంతు గా చేసే సహా కారం

సహాయం ,మానవత్వం లో 

దాగిన సహృదయం....

జీవితం లో కోట్ల ఆస్తుల కు

వారసు లు ఐనా ,మానవత్వం

కరువైతే    కరోనా  కంటే

ప్రమాదమే...ప్రక్క వారిని 

అవసరాని కి  ఆదు కోలేని

అంతస్తు లు,బంధువులను

చూడలేని ,ధనం ,కష్టాల ను

ఆదుకోలే ని  నట  ప్రేమ

 సమాజం లో చిన్న చూపు కు

నోచుకుంటారు...మానవ 

విలువలు మంట కలిసేది 

మానవత్వం లేని చోటనే...

నేడు ప్రతి చోట మోసం ,దగా ,

నటన ,వెన్నుపోటు , నమ్మించి

హత్యలు ,మరెన్నో దుష్ట కాండలు ,నిత్య కృత్యాలై

సాగుతున్నవి.....

మానవత్వం   మాడిన  సంఘటనలు ఎన్నో ,ఎనీన్నో..

కానీ నిజాయితీ మానవ విలువలు  నిత్య ప్రకాశాలే...

మానవత్వం తరగని నిధి ,....

మానవత్వం నిండు చందమామ.....


ఈ కవిత నా సొంతం...

ఏ. భూపతి..

13

కవితా గానం ( సీజన్ - 2 )

అంశం : మానవత్వం 

శీర్శిక   : మానవత్వమన్నదొకటుందని 


ప్రేమని 

ప్రణయమని 

ఒకరినొకరు విడలేమని 

మరచి మనం బ్రతకలేమని 

బాసలెన్నో చేసుకుని 

చాటు మాటుగా కలుసుకుని 

తల్లి అవగానే ముఖం చాటుకొని 

ఆ ప్రేమను వదిలించుకుని 

నాన్నగా నిలవలేని 

తొట్టి బిడ్డకు తండ్రి కాని 

అనాథగా తన బిడ్డను బ్రతకమని 

జన్మ రాతను గీస్తున్నామని 

తెలిసి ఏమి తెలియని 

మృగాలకు తెలుసునా మానవత్వమన్నదొకటుందని 


రచన : చేబియ్యం శ్రీనివాసరావు 

ఊరు : గుజరాతిపేట 

          శ్రీకాకుళం

14.

కవితా గానం (సీజన్ 2).       8--6--2021.

పిన్నక నాగేశ్వరరావు.

అంశము :-- మానవత్వం.


శీర్షిక :-- పరిమళించిన మానవత్వం.


మహమ్మారి కరోనా తల్లిదండ్రులను బలిగొంటే

అనాథలైన పిల్లలను ఆదరించి

అక్కున చేర్చుకున్న మానవత్వం

ప్రాణవాయువు లేక ఆసుపత్రుల్లో

ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే

ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తూ

ఆదుకుంటున్న మానవత్వం

ఆకలితో అల్లాడే నిరుపేదలకు

కరోనా కష్టకాలంలో కనికరం చూపి

ప్రతి రోజూ ఆహారం అందిస్తూ

మానవత్వం పరిమళించింది.

**************************************

15.

[08/06, 9:24 PM] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం (సీజన్ 2)*

తేదీ:08-06-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: మానవత్వం

********************

అరచేతిలో అంజనం వేసుకునో

కంట్లో కలికం వేసుకునో చూసినా

ఆ చిరునామా దొరుకుతుందనే నమ్మకం లేదు


సృష్టించిన బ్రహ్మకు తప్ప

నరమానవులు ఎవరికీ కనిపించని

 బ్రహ్మ పదార్థం నేడది..


ఆర్థికాన్ని ఆలిగా చేసుకున్న బంధాల్లో

అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న పలకరింపుల్లో

ఇమడలేని మానవత్వం 

ఆవిరిలా ఎప్పుడో ఇగిరిపోయింది..


కలి పాలనలో 

కరిమింగిన వెలగపండులా

మానవతా గుజ్జు లేని మనుషులయ్యారు...


జరుగుతున్న పరిణామాలు చూసైనా

మారని నైజాలను చూసి

మానవత్వం కలవర పడుతోంది..

మనిషిగా ఏం మిగుల్చుకుంటారీ లోకంలో అని....


 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

16.

[08/06, 9:24 PM] Balloori Umadevi Poetess: కవితా గానం

డా బల్లూరి ఉమాదేవి

అంశం: మానవత్వం

శీర్షిక:మానవత


ఆ.వె:పుడమి యందు జన్మ పొందిన  జనులెల్ల

        మానవతను పొంది మసలుచుండ

        దైవకృపయు కలుగు ధరలోన సతతమ్ము

        నదియె సృష్టిధర్మ మరయుడయ్య.


ఆ.వె:జనన మందినట్టి జనులు సుబుద్ధితో

        మానవతను జూపి మంచి గాను

        బ్రతుకుచుండ నదియె వసుమతి లో  సృష్టి  

        ధర్మమగుచు దైవతత్త్వ మమరు.


ఆ.వె: మానవతను చూప మానుగా మహిలోన   

      మెత్తు లెల్ల  జనులు మేటివనుచు

      మరణ మొందునాడు మనలననుసరించి 

        వచ్చునది యు మానవత్వ మొకటె


ఆ.వె:స్వార్థ రహిత  లగుచు సాయ పడుచునున్న 

      మరువలేరు వారి మంచితనము

       మానవతకు సాటి మహినేది లేదని 

        తెలుసుకొనవలయును తీరుగాను

17

[08/06, 9:26 PM] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం

 తేదీ :8/ 6/ 21 -మంగళవారం

 అంశం :మానవత్వం 

శీర్షిక :మానవత్వం పరిమళిస్తే....

 పేరు  :మన్నె లలిత

 హైదరాబాద్ 

చరవాణి సంఖ్య :741 686 32 89.


 మానవత్వం పరిమళిస్తే ఒక  శ్రీ శ్రీ

 మానవత్వం  పరిమళిస్తే ఒక జాషువా

 మానవత్వం పరిమళిస్తే  ఒక మదర్ థెరిసా

 మానవత్వం పరిమళిే స్తే ఒక సోనూసూద్

 

 కష్టకాలంలో కన్న తల్లిదండ్రులను కోల్పోయిన

 అనాథ పసిపిల్లలకు ఆశ్రయమిచ్చి 

అన్ని విధాల ఆదుకునేవారు

 ఆకొన్నవారికి అన్నం పెట్టి 

ఆకలి తీర్చే వారు

 ఈతి బాధలలో నిస్వార్ధంగా

 పాలుపంచుకునే వారు

 తమ కష్టసుఖాలు మరచి 

ఆరోగ్య సేవలలో పాల్గొనే వారు

 చెత్త కుండీలలో విసిరి వేయబడిన

 చిరు ప్రాయం కలవారిని 

కంటికి రెప్పలా చూచేవారు

 వీరు .....వీరు ......

మానవత్వం పరిమళించిన

 మరపురాని మనుషులు.

18.

[08/06, 9:22 PM] Vijayalakshmi Ch KS 38: కవితా గానం 

చెన్నా విజయలక్ష్మి, బీర్కూర్ 

అంశం :మానవత్వం 

శీర్షిక :మది నిండాలి 


మనిషికి ఉండాల్సిన మహోన్నత గుణం 

నేడు మరచి పోయిన లక్షణం 


ధైర్యలక్ష్మి తోడుంటే అష్టలక్ష్ములు వెంట వచ్చినట్లు 

మానవత్వం మది నిండితే సర్వ సులక్షణ సమన్వయులైనట్లే 


కరుణ, దయ చూపాలన్నా 

పరులకు సాయం చేయాలన్నా 

స్వార్ధం వీడి బ్రతకాలన్నా 

అందరి మేలు తలచాలన్నా 

అందరి మనసుల్లో 

మంచి తనము విత్తులు నాటి 

నిస్వార్ధపు నీళ్లు పోసి 

మహోన్నత వృక్షాన్ని పెంచి 

మానవత్వపు పూలు పూయించి 

సర్వ మానవ సౌబ్రాతృత్వపు పరిమళాలు 

జగతికంతా వ్యాపించేలా 

ఆనందపు హరివిల్లులు వెలిసేలా 

ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

మరచిపోయిన మానవత్వాన్ని నిద్ర లేపాలి 

జాగృతం చేయాలి 

వెలుగు పూలు పూయించాలి 

ఆనందం సంతోషం అమృతమై మది నిండాలి

19

[08/06, 9:25 PM] దీపక్ న్యాతి: *కవితాగానం* సీజన్ 2

పేరు     : డా.దీపక్ న్యాతి

తేదీ     : 08-06-2021

అంశం : మానవత్వం

శీర్షిక    : ఎక్కడుంది మానవత్వం


మనిషికి ఉండాల్సింది మానవత్వం

నేడు మరుగున పడిపోయింది మానవత్వం

ఒకనాడు సమస్తమనుకునే పొట్టకోసం

ఎదుటి వాడిని పొడిచిన మానవత్వం

అలనాడు అతివ కోసం ముష్టి యుద్ధంతో

పిడిగుద్దులు గుద్దిన మానవత్వం

నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నానంటూ

ఎదుటివారిపై దూకి దోచుకున్న మానవత్వం

నా వర్గం అంటూ అజ్ఞానంతో

ఇతరుల వధించిన మానవత్వం

మా మతం అంటూ మూఢత్వంతో

మధించి మొరిగిన మానవత్వం

పనికిరాని పరువు పంతాలకు పోయి

ప్రేమను పొడిచి పొడిచి చంపిన మానవత్వం

ధనార్జనలో స్వార్థం మితిమీరి పోయి

మనిషిని మనిషిగా గుర్తించలేని మానవత్వం

నమ్మకాన్ని మోసంతో వమ్ము చేసే

నీతి నిజాయితీల మరచిన మానవత్వం

నేడు ఎవరితో నాకేంటని

వ్యాపారమే సర్వస్వమని

కృత్రిమ రుగ్మతలను అంటగట్టి

చికిత్స పేరుతో సొమ్ము చేసుకునే మానవత్వం

ఎక్కడుంది మానవత్వం ఎవరి దగ్గర ఉంది మానవత్వం

మానవత్వం మరిచిన మనిషికి

మనుగడ సాగదనేది సత్యం తథ్యం


డా.దీపక్ న్యాతి

హైదరాబాద్

 హామీ పత్రం:

 ఇది కేవలం కవితాగానం సమూహం కోసం మాత్రమే వ్రాయబడినది అని హామీ ఇస్తున్నాను.

20

కవితాగానం

మర్రి జయశ్రీ

అంశం..మానవత్వ పరిమళం

శీర్షిక..కాంతికిరణం



మానవత్వ పరిమళం

దాచినా దాగాని సత్యం

అల్లంత దూరంలో ఉన్నా

ఆదరణతో  గుబాళిస్తుంది

మనుషుల్లో స్వార్థం

అంతకంతకూ పెరిగిపోతూ

అనుబంధాలు తరిగిపోతున్నా

సాంకేతికత పరిఢవిల్లి

మనిషితనమే జాడలేక 

ఆవేదనతో తల్లడిల్లుతున్నా

ఎక్కడో ఓ చోట

ఏ మదిలోనో మానవత్వం

కాంతికిరణమై ప్రసరిస్తుంది

దయతో దాపుకు చేరుతుంది

కరోన కష్టకాలంలో

టాటా,సోను సూద్ లాంటి

ఉన్నత వ్యక్తిత్వమున్న

ఉదార స్వభావులను

మానవతా మూర్తులను

మరింత దగ్గర చేర్చింది

మానవత్వమే

మనిషికి చిరునామా

అది వాడిపోని చల్లని సుమగంధం

సాటి వారికి సాయమందిస్తూ

తృప్తిగా జీవించడమే

మానవతా మూర్తుల సుగుణ0

ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.

21.

అంశం:మానవత్వం

శీర్షిక:అవును! మానవతను సుస్థిరం చేద్దాం...!

_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

చరవాణి:7032504646


సామాజిక బాధ్యత విస్మరించే

నిర్లక్ష్య నీచపు పడగ విప్పిన రక్కసి నీడలో 

సామాజిక భద్రత పట్టని

నిర్లిప్త నిర్ధాక్ష్యిణ్య సమాజంలో

గురకపెట్టి నిద్రిస్తున్న  మానవత్వం...!

వలస కూలీల వలస బాటలో

ఆకలి దప్పుల అలసట మూటలో

కరోనా విష నాగు కోరల కాటు

దిగ్భ్రాంతిని కలిగించి

ముచ్చెమటలు పట్టిస్తుంది...!

వలస కూలీల వాడలు వల వల ఏడుస్తూ

వెలి వేయ బడ్డ వాడల్లా

అల్ల కల్లోల అభాగ్య జీవనం

నిర్భాగ్య జీవనంలో

అగ్గిలో బుగ్గై అలమటిస్తుంది...!

కన్నవాళ్లు బంధు మిత్రుల

కడచూపులు కరువై

అనాధ శవాల్లా సామూహిక దహన సంస్కార పర్వంలో

సమాజంలో మానవ సంబంధాలు కరువై 

అమానవవత్వం చితి మంటల్లో

వికటాట్టహాసం చేస్తూ వెక్కిరిస్తోంది...!

సామాజిక చైతన్య వారసులారా

అన్నార్తుల అవసరార్ధులారా

మానవత్వం మూర్తీభవించిన మానవతా వాదులారా 

మానవతను సుస్థిరం చేద్దాం...!

అవును ...! మానవతను సుస్థిరం చేద్దాం...!

22.

శీర్షిక;:*మానవత్వం*

*****.  ********


మనిషిని మనిషని నిరూపించే 

మహత్తర సాక్ష్యం *మానవత్వం*

మనిషికి నిజమైన విలువను పెంచే

అసలు ఆభరణం మనిషితత్వం


మన జన్మకు సార్థకత కల్పించే

సావకాశం ఇతరులకు చేసే సాయం

మనసుమొక్కకు తప్పక పూయాల్సిన

వాడని పరిమళ పుష్ఫం మానవత్వం


మూడోప్రపంచ యుద్ధాన్ని మించిన

విపత్తునెదుర్కుంటున్న ఈ ఆపత్కాలాన

తప్పకచేద్దాం తోచిన చేతనైనసాయాన్ని

వెదజల్లుదాం మానవతా పరిమళాలను


పరులకష్టాన్ని చూసి సంతసించే 

పైశాచికత్వాన్ని వదిలేద్దాం మనస్ఫూర్తిగ

ప్రాణాలకు తెగించి సాయపడకున్నా..

మానవతాబాలను బ్రతికించుకుందాం ఇష్టంగా


వందనీతులు చెప్పినా వ్యర్థమే కదా!

ఒక్కసాయానికి ముందుకేగని నాడు

*బ్రతుకుదాం-బ్రతుకనిద్దాం-బతుకునిద్దాం*

జీవిద్దాం ఇదే సమస్త జీవనవిధానంగా


;వల్లాల విజయలక్ష్మి

ఆలేరు

23.

[09/06, 8:18 PM] +91 83099 20625: మానవత

-------------


మనుషులం మనం

మనకుండాలి మానవత్వం


ఈ కరోనా కష్ట కాలంలో

ఈ విపత్కర సమయంలో

ఈ దుర్ఘటన తరుణంలో

ముందుండాలి మానవతా

అందించాలి చేయూత


ఎందరో చేస్తున్నారు ఉపకారం

ఆహారంతో మమకారం

ధన ధాన్యరూపేన సహకారం

అవసరాలకు అందించాలి పరోపకారం


మానవత్వం మరణించలేదు

మానవత చావలేదు

పరిమళాలిస్తోంది నలుదిశలా

గుబాలిస్తోంది అన్ని దిక్కులా!!

             కవిత వేంకటేశ్వర్లు

కర్నూలు....8309920625

పై న స్వంతము అని హామీ

*************************

24

[09/06, 8:32 PM] శ్రీకాంత్ కడార్ల Poet: అంశం:మానవత్వం....

నేను: శ్రీకాంత్ కడార్ల 

-----------------------------



ఓ తెలియని హృదయం

విలపిస్తుంటే

హయ్యో అంటూ మరో హృదయం

ఆవేదన చెందడం

ఆసరాగా నిలబడగలగడం



ఫలితం రాదని తెలిసిన

మంచి చేయడానికే పాటుపడటం

మనిషి మూలాల్లోకి వెళ్లగలగడం


భూతదయతో మూగజీవాలపై

లాలన కలిగియుండటం


అన్నీ కోల్పోయి నిస్సహాయతలో

ఉన్నవారికి  అండగా నిలబడగలగడం


నాది నాదీ అని కుంచిత భావం

నుండి మనది అనే జీవన నదివైపు

నడవగలగడం


మానవత్వం...


మానవత్వం మనుషులకే సొంతమైన

మానస సరోవరం..


కరుడు గట్టిన యదలను

కదిలించగల ఆయుధం మానవత్వం


హాని తలపెట్టాలని చూసిన

జాలి చూపించగలగడమే

అసలైన మానవత్వం...


నిండైన మానవత్వమే

నిజమైన మూర్తీమత్వం...


సర్వజన హితమై

సర్వ ప్రాణుల శ్రేయస్కమై

నీలో నాలో లోలో

కలిగే దివ్యత్వమే నిజమైన మానవత్వం...

25

[09/06, 9:00 PM] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం సీజన్ 2*

*****************************

*పేరు:వనపర్తి గంగాధర్*

ఊరు:హన్మకొండ

తేదీ:09.06.2021

*అంశం:మానవత్వం*

*శీర్షిక:మానవత్వమా...నువ్వెక్కడ...*


నేడిక్కడ బంధాలు,అనుబంధాలు లేవు

ఆప్యాయతలు,అనురాగాలు లేవు

రక్త సంబంధాలు,ప్రేమలు లేవు

అన్నీ ఆర్థిక సంబంధాలే

మనిషి మనిషికి మధ్య స్వార్థపు గోడలే

మానవత్వమా....నీ జాడెక్కడ...


సొంత రక్తంలో పరాయితనం

ఆస్థి కోసం తోబుట్టువులే చంపుకుంటున్న వైనం

కన్న వారిని కాసుల కోసం

కాటికి పంపుతున్న తరుణం

స్వార్థ ఆశల ఎండమావులకై

చేస్తున్న దారుణ మారణ హోమం

మానవత్వమా...నువ్వెక్కడ...


ఓట్లకోసం, పదవుల కోసం

కాళ్ళుపట్టుకునే నాయకులు

అందళమెక్కాక  కాలరులు పట్టుకునే నీచులు

మనిషిని రాక్షసంగా పీడిస్తున్న దుర్మార్గులు

సమాజాన్ని స్మశానంగా మారుస్తున్న పిశాచులు

మనిషి నువ్వెక్కడ...మానవత్వమా... ఏది నీ చిరునామా...


కన్ను మిన్ను కానక అన్నెంపున్నెం

ఎరుగని పసి హృదయాలను

రాక్షసంగా కాలరాస్తున్న కౄర నీచ

దానవ మానవ దుష్ట సమాజమిది

మానవా నీ దారెటు...మానవత్వమా నీ దారెటు


ఈ కవిత నా స్వీయ రచన

26


[09/06, 9:03 PM] దారల విజయ కుమారి Poetess: కవితా గానం సీజన్2

అంశం : మానవత్వం

శీర్షిక : చిరునవ్వుల పంపకాలివ్వు

9-6-2021

************************

ఆకలి డొక్కలనో..పొదల్లోని పసికందు ఆక్రందనలనో

స్త్రీ అరణ్య రోదనో..శ్రామికుని వడలిన దేహాన్నో

అన్నదాత ఆక్రందనలనో...చూసి

నీ గుండె లోంచీ తన్నుకొచ్చిన ఆరాటం

చేతుల సాయమై ముందుకొస్తే అదే మానవత్వం


నీ కోసమే.. నీ సుముఖాని కొచ్చే

ఏ కుచేలుడి అటుకులో..ఎన్ని పిడికిళ్లు తింటావో..

నీ పళ్ళెం లో ని రొట్టెముక్క కోసం చూసే బడుగు జీవుల కేమిస్తావో


ఒక్క క్షుద్బాద ను అపగలిగి..ఒక దేహాన్ని తడిమి చూసి 

జాలి వాగులో మునకలేసి..కష్టమైనా కళ్ళకద్దుకుని

మనిషితనాల కోసం పడిగాపులు పడాలి


మూన్నాళ్ళ జీవితం ముగిసేది నీ చేతుల్లో లేకున్నా..

రోజూ నీ పరం చేసుకోవచ్చు

కాలం నిండుగా నిన్ను నువ్వు నింపుకోవచ్చు


పావురాలకు గింజలిసరడం..అక్వేరియం లో ఫీడ్ చల్లడం

అంధున్ని రోడ్డు దాటించడం..ఇవేనా..మానవత్వమంటే ?


ఏ ఒక్క జీవనంలో నైనా..అతలాకుతలాల నాపగలిగితే


వంద చోక్కాల నీ వార్డ్రోబ్..ఒక్క అనాచ్చాదిత దేహాన్ని కప్పగలిగితే

ఏ అక్షరాలకో నీ చేయూత పలక నివ్వగలిగితే


పశు పక్షాదులను చూస్తూ ఉండు..పాఠాలను నేర్పిస్తాయి

కాసిన్ని గింజలు దొరికితే...సమిష్టి పంపకాలెలాగో

ఒక్క రెక్క తెగి పడితే.. పరామర్శ లెలాగో

శత్రువు చేత చిక్కితే ఉమ్మడి పోరాట మెలాగో..


బుద్ధిజీవులం..కన్నీటి విలువ నెరిగినోళ్ళం

చిరునవ్వుల ను సమంగా పంచుకుందాం


దారల విజయ కుమారి గారు

27

 అంశం : మానవత్వం .

   పేరు  : జక్కిడి వెంకటరెడ్డి 

    శీర్శిక :మానవత్వమా చెరువగా ..

    ...... ........ .........   ......

    భయమేసి తల్లిసంకనెక్కిందో 

     పసిబిడ్డ 

    అరిచేకుక్క కరుస్తుందేమోనని ....

    ఎగిరేపక్షి నేలనవాలింది 

      చల్లినగింజలను తిందామని .....

    తెలియని బతుకుపోరాటం 

       ఒకదగ్గరైతే 

     దొరికిందితిని బతికిపోదామని 

       ఇంకోదగ్గర ...

    విషయం చిన్నదే చూసేటోల్లకు ....

      విషమపరీక్షే అది అనుభవించేటోళ్లకు ....

   అడుగడుగున పోరాటాలు సహజం 

      బతకాలంటే ....

   కానీ బతికే బాటలొ కొందరిని 

     బలిపశువులుగా మార్చటం ఆటవికమే ...

   అవసరాల కోసం ప్రతిజీవి  

     పరిగెడుతూనేవుంటుంది 

      బతికిఉన్నంతకాలం ....

    బతుకు బరువైనకాడనే 

      చేయందించే జాడదొరకాలి 

    అన్నీవున్నకాడ అవసమేముంది 

      పైమెరుగులకు పాకులాడటం తప్ప ....

   ఆలోచనవున్న మనిషే 

     మాటువేసి వేటాడుతుంటే 

   అడవిలో జంతువుల తప్పేముంది 

     వాటికి తప్పదుగామరి ....

   భయం పురుడు పోసుకున్నాకాడ 

      మానవత్వం మసైపోయినట్లే ...

   మాటవరసకు మానవత్వం కూడ 

     ఓ ఫ్యాషన్ ఐపోయింది 

   గాలికెగిరే కాగితం ఎక్కడపడతదో

     తెలియనట్లు ....

   మన మానవత్వమూ కాటుకల్సిపోయింది 

     చెత్తకుప్పలకాడ, చీకటి బాజార్ల చౌరస్తాలల్ల 

   ఎప్పుడు మేల్కయితదో

     ఈ మొద్దునిద్రకు....

   బక్కపానాన్ని బొక్కేనేసి తోడేందుకు 

     ఏ పాతాళగరికే కావాల్నో .....

   వెతకాలేమఱి  రేపటి రోజున 

      ఎదురొచ్చే కొత్తరూపానికై ....

    మానవత్వమా మూగజీవాలకే కాదు 

      మాట జీవాలకు చేరువగా 

   పదికాలాల పాటు బతికేందుకు 

     ఈ భుమిపై జీవం నిలిపేందుకు ...

  ----  పై రచన నా స్వంతం ...

      జక్కిడి వెంకటరెడ్డి .

28.

అంశం: మానవత్వం

శీర్షిక: బంధుత్వం లేని అనుబంధం


కష్టం చూసి ద్రవించిన

హృదయం స్పందించి

బాధితుడిపై చూపించిన

ప్రేమే మానవత్వం

అతనికి చేయందించడమే

మానవతా ధర్మం

బంధుత్వం లేని అను బంధం

ఇష్టంతో అందించే సహాకారం

శత్రువు నైనా క్షమించగలిగేది

మూర్ఖుడినైనా కదలించగలిగేది

అసలైన మానవత్వం

కరోనా కష్ట కాలంలో వేలాది 

మందికిఆలంబనై ఆదుకున్నది

 మనుషుల మనసులు ప్రతిబింబించింది

మానవత్వం   మౌని తత్వం!


ఈ రచన నా స్వంతం

 బి నాగేశ్వరరావు 8801526321

29.

*సీజన్ 2*కవితా గానం**

తేదీ:09-06-2021

పేరు వురిమళ్ల సునంద ఖమ్మం

అంశం: మానవత్వం

********************

మానవత్వం అంటే ఏమిటి ఎలా ఉంటుందో చెప్పమని

పిల్లలడిగిన ప్రశ్నకు ఎలా అర్థం చేయించాలో తెలియక తికమక పడ్డాను..

 సాటి మనిషి కష్టాల్లో ఆదుకోవడమే అన్న మాటలు

 వారికి ఇంకా రుచించలేదు..

మరి మా  తాతను  ఆసుపత్రిలో చేరిస్తే పైసల కోసం 

మస్తు ఇబ్బంది పెట్టిండ్రు

వాళ్ళు చిన్నప్పుడు ఇలాంటి మాటలు వినలేదా మేడం అన్నాడొకడు..

అవును మేడం..  

అదేదో సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ కి పోతే

డబ్బులు ఇయ్యమని బల్లకింద చేతులు పెట్టిండ్రట మేడం.

వాళ్ళు న్యాయం ధర్మం అంటే తెల్వదా మేడం..

అంటుంటే నిరుత్తరురాలనైన..


వాళ్ళ గురించి కాదు మంచోళ్ళెవరో ఆలోచించాను...

 ఒరేయ్ నాన్నా! 

మీ ఊర్లో ఎవరికైనా ఆపతి వస్తే అట్లాగే చూస్తారా?

 అయ్యో అదేం లేదు మేడం

మేమంత ఎవ్వలికి కష్టమొచ్చినా  ఆదుకునేందుకు ముందు కొస్తం..


అదేరా నాన్నా మానవత్వం అంటే..

స్వచ్చమైన మనసుతో సాటి వారికి సాయపడే సహృదయతే మానవత్వం...

 పిల్లల మోములో మెరుపు

నాలో ఆత్మ సంతృప్తి..

30.

[10/06, 8:21 PM] +91 93900 99056: అంశం..మానవత్వం..

శీర్షిక..తప్పిపోయిందేమో..

పేరు... అన్నాప్రగడ వేంకట నరసింహారావు

ప్రాంతం...నరసరావుపేట,గుంటూరు జిల్లా..


మానవత్వం తప్పిపోయింది...

మానవత్వం తప్పిపోయింది...

మనుషుల  మదిలోన చెత్తకుప్పలో...


బహుశా డబ్బు కట్టల మాటున మడిచివుందేమో...

బహుశా నేతాశ్రీల కుర్చీల కింద నలిగివుందేమో...


మానవత్వం తప్పిపోయింది...

బహుశా మతోన్మాదం పాదాలకిందపడి పగిలివుందేమో...

బహుశా కామాంధుని

కోరల్లో కమిలివుందేమో...


మానవత్వం తప్పిపోయింది..

బహుశా మనిషి అహంకారపు చేస్టల్లో విసిగిపోయిందేమో...

బహుశా మనిషి స్వార్ధపు పోకడల్లో మసిబారిపోయిందేమో...


వెతకండి వెతకండి...

దాని అవసరమున్నది మనసుకు,ఈ జగతికి..

అమ్మ ప్రేమలో భద్రంగా దాచండి..

నాన్న నడవడికలో భద్రంగా దాచండి..

ఆచార్యుని బోధనలలో భద్రంగా దాచండి.

పెద్దల బుద్దులలో భద్రంగా దాచండి..


తనకు తాను చితిమంటల్లో కాలిపోయేలోపు మానవత్వాన్ని భద్రంగా దాచండి..

బాధ్యతగా దాచండి..

✒అన్నాప్రగడ

31

[10/06, 8:27 PM] Lalita Sister: కవితాగానం సీజన్ 2

అంశం.. మానవత్వపు పరిమళం


శీర్షిక: చుట్టేసే సుగంధం

మల్లెపూల సౌరభం

మానవతా పరిమళం

అనుసరిస్తే ఆసాంతం

అనుభవైకవేద్యం


పువ్వులోని పరిమళం

మనసులోని తడి దనం


కన్నులొలుకు కారుణ్యం


చేతలోన పరహితం

చేస్తేనే మనిషితనం

పల్లవించు మంచితనం.



కాట్ న్యాయమే కరుణిస్తే కమనీయమె జీవితం

పర వారికి సాయపడితే


నీవే వారి పర దైవం


క్రూర గుణం శిల అయితే

సెలయేరైప్రవహించును

చల్లనైన మానవత

టాటా లు సోనుసూద్ లు

యువ వీరులు అన్నదాతలు

ఎందరెందరో త్యాగధనులు

మానవులలో దేవతలు



రచన:

కే దేవికారాణి రత్నాకర్ తెనాలి

31

[10/06, 8:28 PM] Lalita Sister: కవితాగానం సీజన్ 2

అంశం....మానవత్వం 

శీర్షిక.....సంతృప్తి 


మానవత్వ దుప్పటి ఎప్పుడైనా

కప్పుకుంటే తెలుస్తుంది

దాని వెచ్చదనం ఏంటో.....


మానవత్వం కుసుమం

విరబూసినప్పుడు చూడాలి

దాని పరిమళం ఎంత దూరం

పయనిస్తుందో.....


ఉషోదయాన మురిపించే 

మయూఖాల నడుమ 

ఉత్సాహంగా వినిపించే 

కుహు కుహుల నడుమ....


ఉజ్వల మోముతో 

తులసికోట చుట్టూ 

ఉదయానే చిరు

చిరునవ్వులు చిందిస్తూ.....


పిల్లలకు దూరం 

భారమైన జీవితం ...


పొరుగున మేమున్నామనే

భరోసా బామ్మ స్వంతం....


ఓర్పు ఆమె స్వగతం

ఓపిక లేనినాడు నా ఆతిథ్యం.....


ఎదుటి వారికి  సహాయం 

చేయడంలోని సంతృప్తి...


ఎంత ధనానికి సరి

సమానం కాని సంతోషార్తి...


ఎక్కడో ఎవరికో సహాయ కర్ర

అందివ్వాలని లేదు...

ఎదురుగా కనపడుతున్న

కష్టాల కడలి కెరటాలను

ఓ మారు ప్రేమగా తాకితే చాలు....

మానవత్వానికి దర్పణం

పడుతుంది 

మనసు సంతోషాల నావ

నెక్కుతుంది.....!!


హామీ....ఈ కవిత నాస్వంత మని సేవ సమూహం కొరకే వ్రాశానని హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్ . అఫ్సర వలీషా 

ద్వారపూడి( తూ గో జి )

32

[10/06, 8:33 PM] +91 99087 06218: కవితాగానం సీజన్ 2

అంశం.. మానవత్వపు పరిమళం

శీర్షిక: చుట్టేసే సుగంధం

మల్లెపూల సౌరభం

మానవతా పరిమళం

అనుసరిస్తే ఆసాంతం

అనుభవైకవేద్యం

పువ్వులోని పరిమళం

మనసులోని తడి దనం

కన్నులొలుకు కారుణ్యం

చేతలోన పరహితం

చేస్తేనే మనిషితనం

పల్లవించు మంచితనం.

కాట్ న్యాయమే కరుణిస్తే కమనీయమె జీవితం

పర వారికి సాయపడితే


నీవే వారి పర దైవం


క్రూర గుణం శిల అయితే

సెలయేరైప్రవహించును

చల్లనైన మానవత

టాటా లు సోనుసూద్ లు

యువ వీరులు అన్నదాతలు

ఎందరెందరో త్యాగధనులు

మానవులలో దేవతలు

రచన:

కే దేవికారాణి రత్నాకర్ తెనాలి

33.

[11/06, 8 PM] Lalita Sister: కవితాగానం 

   * మానవత్వపు పరిమళం *

 కోరాడ నరసింహా  రావు... !

    *********************

జాలి... దయ... ప్రేమల పూలు 

పూసి.... మానవత్వపు సేవా పరిమళం గుభాళించింది అప్పుడప్పుడూ...! అక్కడక్కడా.... !!

కష్టాలలో ఉన్నవారిపై.... కనికరం పుట్టకపోతే... మనం 

మనుషుల మెలా అవుతాం !?

ఆకలితో  డొక్కలెండిన 

ఏ ఒక్కరి కైనా పట్టెడన్నం పెట్టావా.... ?

ఒంటి మీద గుడ్డలేక... చలికి గజ గజ లాడే ఏ ఒక్క దేహాన్నైనా నీ దయా దుప్పటితో కప్పగలిగావా... ?

" అమ్మా కాసిన్ని మంచినీళ్లు " 

అని  గొంతెండిపోతూ దాహార్తితో అడిగిన ఏ ఒక్కరికైనా కనీసం గుక్కెడు నీళ్లిచ్చ్చావా.... ?

ఆవేదనతో కుమిలిపోతూ బాధపడుతున్న ఎవరికైనా.... 

"నీకేం భయంలేదు...మేమంతా లేమా...అని భరోసా యిస్తూ... కనీసం ఓ  మాటసాయమైనా చేసావా.... ?!

ఇన్నిట్లో... ఏ ఒక్కటి నువ్ చేసినా.... నీలో మానవత్వ మున్నట్లే.... !నీలో ఈ మానవత్వ సారం ఉంటేనే నీ హృదయం సారవంతమైన 

దౌతుంది...!ఇలాంటి హృదయాల నుండే జాలి... దయ.... ప్రేమ పూలు పూచేది!

మానవత్వ నిస్వార్ధ సేవాసుగంధాన్ని  పరిమళించ గలిగేది యిట్టిహృదయాలే...!!

 పేరుకోసం ప్రచారం చేసుకునే సేవలలో.... మానవత్వ పరిమళమా..... !?స్వార్ధపు దుర్గంధం తప్ప.... !

తృప్తి... ఆత్మానందాల  కోసం 

చేసే యిట్టినిస్వార్ధ  సేవలేకదూ 

మానవత్వాన్ని పరిమళించేది !!

    *********************

       ........  కోరాడ.

34

[11/06, 8:00 PM] Lalita Sister: అంశం 


*మానవత్వపు పరిమళం*


 పువ్వు వికసించగనే పరిమళాలను వెదజల్లి ఎన్నో జీవులను ఆకర్షించినట్టుగా 

మానవత్వపు పరిమళాలుగల మనసు...... 

 చిరునవ్వుల మోముతో స్వాగతిస్తుంది 

అందమైన కళ్ళతో పలకరిస్తుంది 

తియ్యని మాటలతో హృదయాన్ని తాకు తుంది

హాయినిచ్చే  పలుకుల కోసం పరితపిస్తుంది

 మంచి మనసుతో మార్గదర్శకం అవుతుంది

 దండం పెట్టే వంద చేతులుఉన్నా

  తన రెండు చేతులతో దానంచేస్తే చాలు అనుకుంటుంది

 మంచికోసం పోరాటం చేసి విజేత అవుతుంది

 నీతి, నిజాయితీ కోసం పరితపిస్తుంది

 ప్రేమ నిండిన హృదయమై దారి చూపుతుంది 

కరుణ నిండిన హృదయంతో ద్రవిస్తుంది 

తనకు తెలిసిన జ్ఞానం పంచుతుంది

 తాను దీపమై వెలుగుతుంది ఈ లక్షణాలు గల మనసుండే మనిషిలో మానవత్వపు పరిమళాలు ఎల్లప్ఫుడూవెదజల్లుతూనే ఉంటాయి.

విశ్వంలో ప్రకాశిస్తూనే ఉంటారు. 🌷


సుగుణ మద్దిరెడ్డి

ఐలవారిపల్లె 

ఐరాల 


ఇదినా స్వీయరచన.

35

[11/06, 8:00 PM] Lalita Sister: ** మానవత్వపు పరిమళం **

     శీర్శిక :మానవత్వం .

   పొత్తిళ్ళలో పసిబిడ్డను చూస్తే తల్లి 

    ఎదపొంగడం మాతృత్వపు మమకారం ...

  ఎదిగిన బిడ్డలను చూసి మది నిండడం 

     అనురాగం  పొందడం తండ్రికి సహజం....

   చరాచర   జగత్తులో 

   కోటానుకోట్ల జీవులలో  మనిషి మాత్రమే 

    అవసరానికి కొందరు 

     అందలంకోసం ఇంకొందరు 

   సహాయపడటం సహకారంఅందిచడం సహజమే 

    ఏ బంధం లేకున్న అది 

   ఏ ప్రాణి అయినా అవసరమైనప్పుడు వానిపై 

    దయచూపడమే మానవత్వం ...

  బక్కజీవిని చుస్తే పక్కచూపులే 

    డొక్కనిండినవాడితో దోస్థానమే 

  తానూ మనిషన్నది మరచి ప్రలోభాల 

    మత్తులో ఉంటున్నాడు మనిషి 

  కాడి దించి పాడెకు చేరువైన నాడు 

    వచ్చే ఆలోచనకాదు మానవత్వం 

  సత్తువఉన్ననాడు నీ చేతలతో 

   పక్కనోడికి చేసే దానితో కలిగే వెలుగే మానవత్వం

  అందుకే ...

   అస్థిత్వమున్నప్పుడే 

      మానవత్వంను  మేల్కొల్పు 

   ఆ మానవత్వపు పరిమళం ఉన్నచోటే 

     ఈ భూమికి బ్యూటీస్పాట్ ....

  ----జక్కిడి వెంకటరెడ్డి .

36

[11/06, 8:00 PM] Lalita Sister: కవితాగానం

పేరు: విజయదుర్గ

కవితా శీర్షిక : మానవత్వపరిమళం

కవితా సంఖ్య: 47

తేదీ: 01/06/21


చమురు వాసనతో మలినమై

న దేహాలను ఎక్కడ వదలాలి

గతిలేని తిప్పల కుప్పల

దిబ్బల పైనా....!!


సమకాలీనత లేని సంఘటనలన్నీ

మండే కట్టెలా తరుముతుంటే

అరిచే వారేకానీ

ఓదార్చే వారెవరు సమాజ గదిలో......!!


అగ్నికి ఆజ్యం పోసేవారే

చుట్టూ అల్లుకున్న ముళ్ళతీగలా

పుండుమీద కారం చల్లేవారే

మానవత్వాన్ని నింపేదెవరు....!!


స్వచ్చమైన పాల మనస్సుతో

ఘనీభవించిన హృదయం తో

నిండుమనస్సుతో మంచితనాన్ని

విరబూయించిన నాడే 

మానవత్వ పరిమళం ఆఘ్రాణించగలం....!!



                                🌹వినీల🌹

37

[11/06, 8:00 PM] Lalita Sister: కవితా గానం (సీజన్1)

పేరు:కె.ఇ.నిలమంగై

కలం పేరు:నీలా రంగనాధం

ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.

శీర్షిక: *మానవత్వపు పరిమళం*

       వచన కవిత్వం

తేది:01/06/2021

చరవాణి సంఖ్య:8897155600


గుండెనిండా దయ..కరుణల మేళవింపు గుభాళింపులను నింపాడు విధాత..!

కష్టాలలో వున్న వారిపై కనికరపు జల్లులు కురిపించటం నేర్పించాడు..!


మనిషి మనుగడకు సాయమనేది సాంత్వన నిచ్చే గుణం..!

మంటలు పెట్టేవారు ఎక్కువై..,

మంటలార్పటం మరచారు..!


సాలున్నర నుంచీ సాగుతున్న మారణ హోమంలో..,

మట్టిన చేరుతున్నాయ్ అనాధ శవాలల్లా..,


కఠిన కర్కశ హృదయాలను ఏ ముహుర్తాన నింపాడో కొందరికి బ్రహ్మ..!

దిక్కులేని వారిగా మార్చి కాల్చటమే మరచారు..!


ఏమార్చటం మొదలై..,

తాముగూడా అలాగే మారతామనుకున్నారేమో..?

కొందరిలో మార్పు మొదలై మానవత్వపు పరిమళాలు విరబూసి పనిచేయటం మొదలెట్టాయి..!!!!!

*ఈ కవిత ఈ సమూహం కొరకే రాసానని హామీ ఇస్తున్నాను.*


*నీలా రంగనాధం*

38

[11/06, 8:00 PM] Lalita Sister: కవితా గానం సీజన్ 1

01-06-2021

పేరు కెసి నరసయ్య 

అంశం : మానవత్వపరిమళం 

శీర్షిక : నిజస్వరూపం 



ఆశల కోరికలు 

ఆకాశానికి నిచ్చెనలు


నిలువెత్తు స్వార్థం

కొలువైన ధనదాహం


నీతిలేని రాతలు

అవినీతి దోబూచులాటలు 


నిలకడ లేని పోకడలు

ఊహలలో కొట్టుకుపోతున్న కలలు


 ప్రాణంపై మమకారం

 మానవత్వానికి నిలువెత్తు పాతర


 కరోనా కోటలో

 రోధిస్తున్న మనిషి నిజ స్వరూపం


 ప్రాణంలేని దేహాలు

 గెంటేసిన రక్త సంబంధీకులు


 దిక్కులేని శవాలకు

 దిక్కయిన గంగమ్మ ఒడి


 శానిటైజర్ కంపులో

 కొట్టుకుపోతున్న మానవత్వ పరిమళం

39

 అంశం..మానవత్వం..

శీర్షిక..తప్పిపోయిందేమో..

పేరు... అన్నాప్రగడ వేంకట నరసింహారావు

ప్రాంతం...నరసరావుపేట,గుంటూరు జిల్లా..


మానవత్వం తప్పిపోయింది...

మానవత్వం తప్పిపోయింది...

మనుషుల  మదిలోన చెత్తకుప్పలో...


బహుశా డబ్బు కట్టల మాటున మడిచివుందేమో...

బహుశా నేతాశ్రీల కుర్చీల కింద నలిగివుందేమో...


మానవత్వం తప్పిపోయింది...

బహుశా మతోన్మాదం పాదాలకిందపడి పగిలివుందేమో...

బహుశా కామాంధుని

కోరల్లో కమిలివుందేమో...


మానవత్వం తప్పిపోయింది..

బహుశా మనిషి అహంకారపు చేస్టల్లో విసిగిపోయిందేమో...

బహుశా మనిషి స్వార్ధపు పోకడల్లో మసిబారిపోయిందేమో...


వెతకండి వెతకండి...

దాని అవసరమున్నది మనసుకు,ఈ జగతికి..

అమ్మ ప్రేమలో భద్రంగా దాచండి..

నాన్న నడవడికలో భద్రంగా దాచండి..

ఆచార్యుని బోధనలలో భద్రంగా దాచండి.

పెద్దల బుద్దులలో భద్రంగా దాచండి..


తనకు తాను చితిమంటల్లో కాలిపోయేలోపు మానవత్వాన్ని భద్రంగా దాచండి..

బాధ్యతగా దాచండి..


✒అన్నాప్రగడ

40

 కవితా గానం( సీజన్ 2 )

అంశం.. మానవత్వo

శీర్షిక.. మంచే మానవత్వం 


మంచిగా వుండు 

మంచినే చేయి 

మంచినే కోరు

మంచిగా మసలు 


మానవత్వం ఎక్కడో లేదు 

మంచిలోనే పరిమలుస్తుంది 

మానవత్వం పొంగి పొరలే 

మంచి మనసుకు స్వాగతమే 


చేతల్లో  పనుల్లో అన్నింటా 

కనబడాలి నీ మంచితనం 

న్యాయం ధర్మం నీతి నియమం 

అన్నింటా విజయఢంకా మ్రోగించాలి 


కష్టంలో వున్న మనిషిని 

ఆదుకుందుకు లేదు 

పట్టెడన్నం కడుపునిండా 

పెట్టడానికి లేదు 

పెద్దవారైన పాదచారులను 

తన వాహనంపై ఎక్కించుకుని 

తీసుకెళ్లడానికి అవకాశం లేదు 

ప్రేమగా దగ్గరికి ఎవరిని చేరదీయ 

వీలులేని పరిస్థితి అయిపొయింది 

కరోనాతో ప్రపంచమంతా బాధలతో 

అల్ల కల్లోలమయి పోయింది 

అతాకుతలమయిపోయింది 

మానవసేవే మాధవసేవగా 

భావించే దయార్ద్రహృదయులు 

కూడా వెనకాడ వలసి వస్తుంది 

మానవత్వమే మంటగలసిపోయింది 

కరోనా కరుణించాలి 

మానవత్వం పరిమళించాలి 

మనుషులలో మార్పు రావాలి 

మంచిమనసు ప్రసాదించాలి 

భరతభూమి స్వర్గతుల్యమవాలి 


తాతపూడి సోమశేఖర శర్మ 

యానాం, 8328079336

ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079346


Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧