నాన్న ౨౦౦౬ ౨౦౨౧
నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
**********************"
కవివరుల జాబితా
1. ,ఆళ్ళ నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు
2.కవిత వెంకటేశ్వర్లు గారు
3.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
4.మన్నె లలిత గారు
5.కొంపెల్లి రామయ్య గారు
6.పిల్లి హజరత్తయ్య గారు
7.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
8.వనపర్తి గంగాధర్ గారు
9.బి.నాగేశ్వరరావు గారు
10.అన్నా ప్రగడ గారు
11.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
12.పిన్నక నాగేశ్వరరావు గారు
13.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు
14.జంపని శ్రీనివాసమూర్తి గారు
15.డడా.బల్లూరి ఉమాదేవి గారు
16.: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు
17.డా.ఆంజనేయులు గారు
18.తరణికంటి సూర్యలక్ష్మి. గారు
19.నరేశ్ చారి గారు
20.మేకల రామస్వామి గారు
21.,బాలు కత్తుల గారు
22.పలుగుల సతీష్ కుమార్ గారు
******************
౧
[19/06, 8:00 pm] Aalla Nageshwar Rao Poet: కవితాగానం
అంశం: నాన్న
కవితా శీర్షిక;
"" త్యాగధనుడు""
దేశానికి వెన్నెముకైన రైతన్నలా
దేహానికి వెన్నుదన్నైన వెన్నుపాములా
జగతికి ఉదయంలా
జనులకు హృదయంలా
కంటికి రెప్పల్లా
కుటుంబానికి నాన్న అలా!
ఎండకు ఎండి నీడనిచ్చే వృక్షంలా
ధరికి చేర్చి దాహం తీర్చే నదీమతల్లుల్లా
తాను కాలుతూ వెలుగులు
పంచే క్రొవ్వొత్తిలా
త్యాగధనుడైన నాన్న!
తనను కన్న వారికి తనయుడులా
తను కన్న వారికి దైవంలా
తనను కట్టుకున్న వారికి అర్ధనారీశ్వరుడులా
త్రిపాత్రాభినయనం చేస్తూ
హక్కుల గురించి ఆలోచించక
బాధ్యతలను నెరవేర్చే
నిత్య శ్రామికుడు నాన్న!
..........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్...రాష్ట్రం
సెల్ నెంబర్.7416638823
.......................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
2
[19/06, 8:00 pm] +91 83099 20625: కవితా గానం (సీజన్ - 2)
నాన్న నీవే నా హీరో
--------------------------
నాన్న నీకు ఆలోచన లేదా
మాపై నీ ప్రేమ చావదా
ఏమడిగితే అది కొనిస్తావా
ఎంతంటే అంత ఖర్చు పెడతావా
నిన్ను ఏమనాలి నాన్న!
సంపాదన తక్కువే
మా మీద మక్కువ ఎక్కువే
సంపద లేకున్నా సంతోషామిస్థివే
నీకు చదువులేకున్న
కష్టపడి మమ్ముల చదివిస్థివి
నిన్ను ఏమని పొగడాలి నాన్న!
వేలు పట్టి నడిపిస్తివి
వేలు పెట్టి చదివిస్థివి
నూలు బట్టలు నీవు తొడిగి
బ్రా0డు మాకు తొడిగిస్తివి
మా కన్నా అదృష్టవంతులెవరు
నాన్న!
సినిమాలు నీవు చూడక పోయిన
మాకు సినిమాలు చూపిస్తివి
గంజి నీవు తాగి
వరన్నం మాకు తినిపిస్తివి
నీ కాళ్లకు చెప్పులు లేకున్న
మా కాళ్లకు షూస్ కొనిస్తివి
నీ ఋణ0 ఎలా తీర్చుకోవాలి
నాన్న!
పెద్ద చదువులు చదివిస్థివి
ఉద్యోగం వచ్చాక మా వెంట
రానంటివి
మాతో ఉండనంటివి
మీ ఋణము తీర్చుకునే
అవకాశం ఇవ్వనంటివి
ఉన్న ఇల్లు విడిచి రానంటివి
చావైన బతుకైనా ఇక్కడే నంటివి
నిన్ను ఏ దేవునితో పోల్చాలి
నాన్న
నీవే నా హీరోవి నాన్న!!
కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు ::: 8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ.
*************************
3
[19/06, 8:08 pm] తాతపూడి సోమశేఖర శర్మ: కవితా గానం
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం, 8328079336
అంశం.. నాన్న
శీర్షిక.. నా సర్వస్వం మా నాన్నే !
జన్మ నిచ్చావు
జగాన్ని చూపించావు
నడక నేర్పావు
నడవడిని దిద్దించావు
నీ అందం నాకిచ్చావు
నీ దయ నాకుపంచావు
ప్రేమ... పాశం
ఆలనా... పాలనా
దండన... ఖండనా
పాలనా... పరిపాలనా
నీవే అయావు అన్నీ
నీవనుకున్నావు.. అదే.. అదే
నేనే నువ్వని
కళ్ళలో నింపుకున్నావు నా సంతోషం
గుండెల్లో దాచుకున్నావు నా కోపం
నీవు నీదని ఏమీ అనుభవించకుండా
నీవు నీ జీవితాసంపాదన అంతా
అంటే నీ జీవన సర్వస్వం
నాకే ఇచ్చావు కదా నాన్నా !
అందుకే......
నా సర్వస్వం నీవే నాన్నా !
నీవే నా సర్వస్వం నాన్నా !
హామీపత్రం..
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
4
[19/06, 8:08 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితా గానం
తేదీ :19/ 6/ 21 -శనివారం
అంశము: నాన్న
పేరు :మన్నె లలిత
హైదరాబాద్
చరవాణి సంఖ్య: 741 686 32 89
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
నాన్నంటే నా పుట్టుక
నాన్న అంటే అనురాగం
నాన్న నా రక్షణ
నాన్న ఒడి నా బడి
నాన్న సాన్నిహిత్యం నా సాహిత్యం
నాన్న కోపాన్ని తెలియని నేను
నాన్న అనురాగాన్ని మాత్రమే తెలిసిన నేను
నాన్న పరమతసహనం తెలిసిన నేను
నాన్న పేదల పెన్నిధి అని తెలిసిన నేను
నాన్న 'పుంభావ సరస్వతి 'అని తెలిసిన నేను
నాన్న అడుగుజాడల్లో అడుగులు వేస్తూ
ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్నా
నాన్నా! నీకు వందనం !!అభివందనం!!!
5
[19/06, 8:10 pm] Kompelli Ramaiah Poet Kmm: అంశం:నాన్న
శీర్షిక: నాన్న మీకు నా సెల్యూట్...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
చరవాణి:7032504646
నాన్న...!
అమ్మ ప్రేమకు మారు పేరైతే నిండైన బాధ్యతకు మరో రూపం
నేనున్నాననీ నిండు మనసుతో చెప్పగల ఏకైక ధైర్యం
గౌరవంతో వెలుగొందే వందమంది ఆచార్యులతో సమానం
బిడ్డల సుగుణ సంపన్న స్వభావాల ప్రతిబింబం...!
నాన్న...!
అమ్మ లాలించి లాలపోసి బువ్వపెడితే
అన్నీ తానై అడుగులు వేయించి అక్షరాలు పలికించిన తోడు నీడైన భరోసా
సముద్రంలా గంభీరంగా ఉన్నా ప్రశాంతత నిండిన నీలాకాశం
కుటుంబం కోసం ఎంత శ్రమించినా నిత్యం తెర వెనుక ఉండే సూత్రధారి...!
నాన్న...!
అత్యున్నత శిఖరం అధిరోహించేది మనమైతే
మార్గంలో తన వెన్ను పూసలను మెట్లుగా చేయూత నిచ్చిన త్యాగి
అద్భుత విజయ సారథి మనమైతే
మన అడుగులు మోసే సహన శీల వారధి...!
నాన్న...!
తల్లి ఒక నిజమైతే తను ఒక నమ్మకం
తల్లి భావోద్వేగమైతే తను ఒక జ్ఞాన దీపం
తల్లి వాత్సల్యమైతే తను ఆప్యాయత సంద్రం
తల్లి పురుటి నొప్పి భరిస్తే తను కాలిపోతు వెలుగునిచ్చే దీపం...!
నాన్న...!
పిల్లల కోసం జీవితాంతం తపించే మార్గదర్శి
అమ్మలా ప్రేమను కన్నీళ్ళను బయటకు చూపడం ఎరగని మనోనిబ్బర మహారాజు
బిజీ బిజీగా ఉంటూ రాత్రి పూట ఎప్పుడో కౌముది లా వచ్చి
మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూసి ఆనందపడే చంద్రుడు
పిల్లలు కూడా తనను మిస్సైనా
నిజానికి తనను తానే మిస్సౌతూవుంటాడు...
అలాంటి నాన్నలందరికి నా కవిత అంకితం...
నాన్న ...!మీకు నా సెల్యూట్...!
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
6
[19/06, 8:12 pm] +91 98486 06573: కవితా గానం కొరకు
తేదీ19/6/21
కవి పేరు:పిల్లి.హజరత్తయ్య
శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
అంశం:నాన్న
శీర్షిక :అమృత కలశం నాన్న..!
విషవ్యాధి దేహాన్ని ఆవహించి
శరీర శక్తిని దహించినా ..
బిడ్డల బాగుకై
ఏటికి ఎదురీదే అభయత్వం..!
ఓటమి భయం కుంగదీసినా
అజ్ఞాన అంధకారం చుట్టిముట్టినా..
వెలుగుదివ్వెను ప్రసాదించే
కాంతి పుంజం ..!
ఎద గూటిలో
గువ్వలకు గూడు కట్టి..
వారి ఆశల పల్లకికి
ఊపిరిలూదే త్యాగధనుడు..!
కష్టాల కడలి చుట్టుముట్టి
బతుకులను ముంచెత్తినా..
బిడ్డల చిరునవ్వుతో
తన్మయత్వం పొందే ప్రేమస్వరూపం ..!
కాలము కాలనాగై బుసలు కొట్టి
జీవితంలో విషం చిమ్మినపుడు
నేనున్నా కన్నా అంటూ
భరోసానిచ్చే అమృతకలశం నాన్న..!
హామీ పత్రం !
పై కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను
7.
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
అంశం:- నాన్న
శీర్షిక:-
పరమేశ్వరుని ప్రతిరూపం
..................................బాల్యంలో మాకు నాన్న చండశాసనుడు.
అమ్మ మేము అల్లరిచేసినపుడు నాన్నతో చెపుతాను అంటే వద్దమ్మా చెప్పకు అనడం ఇప్పటికీ గుర్తు.
జ్ఞానం వచ్చిన తరువాత తెలిసింది తాను తినిన,తినకపోయిన అహర్నిశలు మా ఉన్నతికై కష్టపడ్డారని.....!!
నన్ను గుడికి తీసుకెళ్ళి తన భుజాలపై ఎక్కించుకొని ఆలయ గర్భంలో దేముని చూపించినపుడు తెలియలేదు నేనే దేముని భుజస్కంధాలపై ఉన్నానని
మాకు, అమ్మకు పండగకి క్రొత్తబట్టలుకొని, తాను చినిగిన పాత బట్టలతోనే సరిపెట్టుకున్నప్పుడు అనుకున్నాను పిసినారి వాడని
నేను బిడ్డలకి తండ్రిగా మారిన తరుణాన తెలిసింది నిజంగా త్యాగానికి నిదర్శనం నాన్నని....!!
నైతికప్రవర్తన కలిగిన వ్యక్తులుగా సమాజంలో మారడానికి, మా అభివృద్ధికై, శ్రామికుడిగా, రక్షకుడిగా,విశ్రాంతి లేని జీవితాన్నిగడిపాడని,
మమ్మల్ని దెబ్బలాడిన ,నీతులు చెప్పిన విషయం
తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సమయాన అవగతమైంది..!!
నాన్న కంటిలో నీరు నేనెప్పుడూ చూడలేదు
ఎనిమిది పదులవయస్సులో అమ్మ భగవంతుని దరి చేరిన సమయాన
ఇద్దరి పిల్లలకి తండ్రినైన నాచేతిని తీసుకుని నీ బాధ్యత నాదిరా చిన్నా అని నాన్న అన్న క్షణాన
ఆర్ద్రత నిండిన హృదయంతో అనుకున్నా
సాక్షాత్తు పరమేశ్వరుని ప్రతిరూపమే పితృదేవులని...!!
..............................
పేరు:-
సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
చరవాణి:-9963265762
..................................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత. దేనికి అనువాదం కాదు
...................................
8
[19/06, 8:29 pm] Vanaparthy Gangadhar Poet: *కవితా గానం సీజన్ 2*
----------------------------------------
పేరు: *వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435
తేదీ:19.06.2021
*అంశం:నాన్న*
*శీర్షిక:త్యాగమూర్తి*
నవమాసాలు మోసి అమ్మ ప్రాణం పోస్తే
నీ జీవితానికి బతుకు బాటచూపి
కంటకాలు, కన్నీళ్లు లేకుండా
కమనీయ దారిచూపిన అమృతమూర్తి నాన్న...
నీ నిరుత్సాహంలో ఉత్సాహమై
నీ నిరాశలో ఆశాదీపమై
నీ పురోగమనానికి పునాదియై
నీ నిస్సత్తువకు సత్తువనిచ్చిన ధైర్యశీలి నాన్న...
మాటలు అమృతం కాకపోవచ్చు
కానీ హృదయం మాత్రం వెన్న
చూపులు చురకలే కావచ్చు
కానీ అవి ప్రసరించేవి వెన్నెల వెలుగులే
కనిపించని కరుణామూర్తి నాన్న...
కష్టాలను, కన్నీళ్లను నీ కంటికి
కనిపించనీయక బ్రతుకుబారాన్ని
మోస్తూనే ఎన్ని బాధలు పడ్డాడో
తన చెమట రక్తాన్ని ఎన్నిసార్లు చిందించాడో
నీకు తెలియకుండా దాచిన సహనమూర్తి నాన్న...
జీవితమే నువ్వనుకున్నాడు
బాధలను,భారాలను ఆనందంగా మోశాడు
నీకై నీ జీవిత సుఖాల దారికై
నువు తనతోడుగా ఉంటావనే ఆశావాది నాన్న...
హామీపత్రం:
ఈ కవిత నా స్వీయ రచన ఎక్కడ అనువాదము అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను
9.
[19/06, 8:33 pm] +91 88015 26321: కవితా గానం పోటీ
అంశం: నాన్న
శీర్షిక: నువు మరచిన దేవుడు
రచన:బి నాగేశ్వరరావు వైజాగ్ 8801526321
అతడే అతడే అతడే
నీ జన్మకు కారణమతడే
నీ ప్రజ్ఞకు ప్రేరణ అతడే
నీ ప్రతిభకి మూలం అతడే ..అతడే!
నువు నేలకు వచ్చిన తొలినాడే
నిను ప్రేమతొ చేతులు కెత్తుకొని
నడకను నేర్పి,నడతను నేర్పి
నీ గెలుపోటములతోడై నిలిచి
బతుకు బాటలో నిను కదిలించిందతడే
నీప్రగతిని వెన్నుదన్నైమలచిందిఅతడే అతడే!
ముళ్ళ బాటలో తన అడుగులు కదిపి
పూలబాటలో నిను నడిపించి
తన రెక్కల కష్టం నీ చేతిలో ఉంచి
నినురెక్కల గుర్రం ఎక్కించి
నీ కలలను తన కలలుగ కన్నది అతడే
తన కలలొనిను నింపుకున్న దిఅతడే
నీ మెరుపులు మేఘం అతడే అతడే!
ఎదిగిన బిడ్డను తలచుకొని
అరిగిన రెక్కల బాధ విడి
మురిసిన మనిషి అతడే
విరిగిన రెక్కలు తడుముకొని
కదలని జఠాయువైతినని
వగచిన శ్రామికుడు అతడే
నువు మరచిన దేవుడు అతడే అతడే!!
ఈ కవిత నా స్వీయ రచన, ఎవరికి అనుసరణ అనుకరణ కాదని తెలియజేయుచున్నాను
బి నాగేశ్వరరావు
10
[19/06, 8:35 pm] +91 93900 99056: *కవితాగానం*..2
పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
నరసరావుపేట,గుంటూరు జిల్లా..
9390099056
అంశం..నాన్న
శీర్షిక..ఒక్కసారి నాన్నలా ఉండటం మానేయి
నాన్న ఒక్కసారి నా మాట విను..
నేను ఎవరికీ చెప్పను ఒక్కసారి నాన్నలా ఉండటం మానేయి..
సైకిలు కొనలేనని చెప్పు..
ఖరీదైన బట్టలు కొనలేనని చెప్పు..
నీవు చిన్నప్పుడు ఉన్నట్టుగా మమ్ములను ఉండమని చెప్పు..
కానీ ఇంటికి త్వరగా వచ్చేయి, అర్ధరాత్రి దాకా ఆఫీస్లో ఓవర్ టైం మానేయి..
నేను ఎవరికి చెప్పను ఒక్కసారి నాన్నలా ఉండటం మానేయి..
కార్పొరేట్ కాలేజ్లో చేర్పించలేనని చెప్పు..
సినిమాలకు, పార్టీలకు డబ్బులివ్వలేనని చెప్పు..
వినోదాలకు,విహారయాత్రలకు పంపించలేనని చెప్పు..
కానీ నడక నాకు అలవాటేనని అన్నన్ని కిలోమీటర్లు నడచిరావద్దు..
ఆకలి లేదంటూ ఒక్క రొట్టెముక్కతిని అర్ధాకలితో పడుకోకు..
నేను ఎవరికి చెప్పను, ఒక్కసారి నాన్నలా ఉండటం మానేయి..
శరీరం సహకరించడం లేదని ఒక్కసారైనా చెప్పు..
మీ బాధ్యతలు మీవే అని ఒక్కసారైనా చెప్పు..
మమ్మల్ని ఉన్నతంగా పెంచడానికే మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పు..
నీ బీపీ, షుగర్లు మా పుణ్యమేనని చెప్పు..
వయసుకన్నా ముందే ఆ ఊడిన జుట్టు, ఆ కనులకింద చారలు సాక్షిగా ఇప్పుడైన చెప్పు..
మా కళ్ళల్లో ఆనందంకోసం లోపలపడిన ఆవేదనను దాచిన విషయం ఇప్పుడైనా చెప్పు..
నాన్న నేను ఎవరికి చెప్పను, ఒక్కసారి నాన్నలా ఉండటం మానేయి..
✍️అన్నాప్రగడ
11.
[19/06, 8:50 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్ 2) నిర్వహిస్తున్న కవితా సమాహారం
అంశం: నాన్న
పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
************************
*నీ నీడే నా ఉనికి*
అమ్మ కడుపులో పడ్డాక
అది కాయా పండా తెలియని అమాయకత్వం
నాన్న పదవి వస్తుందన్న సంతోషం
గుండెలో దాచుకోలేక
పలరించిన ప్రతివాణ్ణి
మిఠాయితో తీపి చేశావు!
కొడుకు పుట్టాడని చెప్పగానే
నర్సుల కోరిక మీద
పర్సును తీసి కానుకలిచ్చావు!
అస్తిత్వం లేని నా బతుక్కి ఆసరా అయ్యావు
నీ భుజం మీద వాలిపోయినప్పుడు
చిగురాకు కొమ్మకు
అట్టి పెట్టినట్టు...
నా వీపు తట్టి నిమిరినపుడు ఎల్లలోకాలు
మైమరిచి భరోసాతో
ఏడుపును ఆపేశాను.
నేను వేసే తప్పటడుగులకు వేలు పట్టించి నడిపించావు!
నువ్వు చిరుగుల చొక్కా ధరించి
నాకు కొత్త చొక్కా
తొడిగించావు!
రెక్కా ముక్కా కష్టపడి
నన్ను పోషించావు
బడికి వెళ్ళేటప్పుడు
పుస్తకాల సంచితో నన్ను మోసావు!
అమ్మ కోప్పడితే నాపై
చిరునవ్వులు చిందిస్తూ
అక్కున చేర్చుకున్నావు!
బతుకు బాట చూపించావు
నన్నీ స్థితికి తీసుకువచ్చింది
నీ లాలన వల్లే!
నాకు ఏమీ ఆస్తి పెట్టలేదని విచారించే
నీకు ఋణపడే వుంటానీ లోకంలో
చెట్టు పేరు చెప్పుకుని
విఖ్యాతి గడించాను!
నేనే కొడుకునై ఏమివ్వలేక పోతున్నాను ఒక్క సాంబ్రాణి ధూపం తప్ప!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు ప్రసారం కాని ప్రచురణ కాని కాలేదు అని నేను హామీ ఇస్తున్నాను.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
12
[19/06, 9:00 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: నాన్న నా కుటుంబానికి ఎల్లప్పుడు అండదండలుగా అందించి ముందుకు నడిపించేది నాన్న కష్టాలను బాధలను విషాదాలను భరించే నాన్న మనసులో ఎన్నో
కుటుంబానికి సంబంధించిన ఎన్నో
కుటుంబానికి సంబంధించిన
మంచిని కుటుంబానికి సమాజానికి అందిస్తూనే
బాధలను కడుపులో దాచుకొని
దూరమానాలు నీ లెక్క చేయక
తన కొడుకులకు బిడ్డలకు
పోషణ కోసం త్యాగం చేస్తూ నాన్న సేవ నాన్న త్యాగం
మరువలేని తండ్రి మహామనిషి అటు సమాజం లోనూ ఇటు కుటుంబంలోనూ బంధువులను అందరికోసం బ్రతుకుతూ తాను మాత్రం పది మంది కోసం మంచి పేరు తెచ్చి ఎటువంటి
నాన్న మా ఊరిలో అందరి ప్రేమ పొందడం అపూర్వం
తండ్రికి నా అభినందనం వారికి స్వాగతం
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453
13
[19/06, 9:05 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం (సీజన్ 2). 19--6--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- నాన్న.
శీర్షిక :-- కారణజన్ముడు.
1. తే.గీ.
జన్మ కారకుండగువాడు జనకుడైన
తల్లి కని, పెంచి,పోషించ పిల్లలంత
నాన్న యడుగుల జాడలో నడచి వారు
పెరిగి పెద్దయై జనకుని పేరు నిలుపు.
2. తే.గీ.
బాల్యమందున వేయు తప్పటడుగులకు
మొదటి సారిగ తండ్రియె మురిసిపోవు
కాని, తప్పుటడుగు మనుగడను వేయ
బాధపడినను సరిచేయు బాధ్యతగను.
3. తే.గీ.
అష్టకష్టాల కోరిచి యహరహమ్ము
పాటుపడుచు ధనార్జన పరముగాను
పిల్లల భవితవ్యమునకె పెద్ద పీట
వేయు జనకుడు నీ పాలి వేల్పు గాదె!
4. తే.గీ.
మార్గనిర్దేశమున్ జేసి మలచు నిన్ను
హితవు చెప్పుచునుండు స్నేహితుని వోలె
యున్నతంబగు స్థానాన నిన్ను గాంచి
సంతసించెడు తొలి వ్యక్తి జనకుడౌను.
5. తే.గీ.
ఆశలీడేర్చు నందరి యాప్తుడతడు
మంచి విలువలు బోధించు మాన్యగురువు
దిశను సూచించు మార్గ నిర్దేశకుండు బంధములను నిల్ప కుటుంబ బాధ్యతలను
సలుపు జనకుడెపుడు దైవసముడు గాదె!
**************************************
14
[19/06, 9:06 pm] +91 80742 97465: కవితాగానం సీజన్ 2
*జంపని శ్రీనివాసమూర్తి*,
గుంటూరు
80742 97465
అంశము : *నాన్న*
శీర్షిక : *నాన్న - గజ దొంగ*
గెలుపు - ఓటమి, సుఖం - దుఃఖం
జీవన పోరాటంలో నాన్న *దొంగ*.
అవును నాన్న ఓ దొంగ..🙏
తమ సంతానం కష్ట పడకూడదని
ఎండనకా - వాననక చెమటోడ్చి,
పైసా పైసా పోగేస్తూ, మన కంట్లోని
నీటిని కాజేసే నాన్న *దొంగ*.
చిరు తిండ్లకై రాత్రిళ్ళు ఎదురు చూసే
తన చిన్నారి పిల్లల కోసం తెచ్చిన
మిఠాయి పొట్లం తన పిల్లలకు ఇచ్చి,
నేను కూడా తిన్నాలే అని ముద్దుపెట్టే
అబద్దాల కోరు నాన్న *దొంగ*.
బ్రతుకు తెరువును, సంస్కృతి - సాంప్రదాయాలను,
వ్యక్తిత్వాలను నేర్పుతూ,
*తన వెంట త్రిప్పుకుంటు పని తనాన్ని నేర్పుతూ*, తన శ్రమను,
కష్టాన్ని పిల్లలకు కనబడకుండా,
తన స్వేదాన్ని ఉత్తరీయంతో తుడుచు
కుంటూ, పైకి ఆనందంగా కనిపించే
నాన్న *దొంగ*
తెల్లవారు ఝామున పిల్లలు చదువుకోవాలని,
తను నిద్ర లేచి,
వారికి తోడుగా ఉంటూ... మధ్య మధ్యలో తొంగి తొంగి చూసే
నాన్న *దొంగ*
తలకు మించిన భారంతో తన కుమార్తెలకు
మంచి మంచి సంబంధాలను చూడాలనే
ప్రేమతో, ఇబ్బందులను పిల్లలకు
చెప్పక, తన సౌఖ్యాలను, ఇష్టాలను
తనలోనే దాచుకునే నాన్న *దొంగ*
పిల్లల ఉద్యోగాలకై అక్కడో సమాచారం,
ఇక్కడో సమాచారం సేకరిస్తూ,
తన ఆర్ధిక నిలువలను సమకూరుస్తూ, ఎవరికి చెప్పక
రాత్రి - పగళ్ళు కష్ట పడే నాన్న *దొంగ*
నెలాఖరులో ఇంటి నిండా బంధువులతో,
పిల్లలతో సంబరాలు జరుపుకుంటుంటే
ఆనందంగా, బరువులేని తన జేబుల్ని
కనబడకుండా దాచుకునే నాన్న *దొంగ*
తన కుటుంబం కోసం కొవ్వొత్తిలా
కరుగుతూ, అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ,
అందరి బాగోగులను ఓ కంట కనిపెడుతూ
తన దిగుళ్ళను తన హృదయంలో
దాచుకోని, కళ్ళల్లో వెలుగులు పంచే
నాన్న ఓ *దొంగ*
ఇన్ని రకాలుగా అందరి హృదయాలు
దోచుకునే నాన్న ఓ పెద్ద *గజదొంగ*
*ప్రతి జీవి " నాన్న స్థానంలో " తమ పిల్లల పట్ల " దొంగ " స్థానం పొందుతూనే వుంటారు* 🙏🦜
---------------------------------------------------
*హామీ*
ఇది నా స్వీయ రచనగా తెలియచేస్తూ.
15
[19/06, 9:12 pm] Balloori Umadevi Poetess: 19/6/21
కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
అంశం:నాన్న
జన్మకారకుడు ఆవనిలోన తండ్రి
పసితనమ్ము నందు గుండెలపై వ్రాల
జోలపాటపాడి నిదురపుచ్చు
వీపుపై భుజముపై నెక్కి తిరుగునపుడు
వాహనమ్మటంచు మురిసిపోవు
అమ్మాయికైనా అబ్బాయికైనా
నాన్న అంటే ధైర్యం నాన్న అంటే ప్రోత్సాహం
నాన్న అంటే భరోసా నాన్నే సర్వస్వం
బిడ్డ పాదంలో చిన్నముల్లు గుచ్చినా
తపనపడే సున్నిత మనస్కుడు నాన్న
అహరహం చెమటను చిందిస్తూ
ఇంటి బాగోగులు చూసే పెద్దదిక్కు నాన్న
వేలు పట్టి నడిపించి విద్యా బుద్ధులు నేర్పి
వ్యక్తిత్త్వాన్ని పెంచు గురువు నాన్నే
అమ్మ కోపగించినపుడు అలకబూన
బుజ్జగించి మేను నిమురు
రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషిస్తూ
కన్నీళ్ళను రెప్పలచాటునే అదిమి పెట్టి
సంతు కంట నీరు రానీక అపురూపంగా
చూసుకొనే అమృతహృదయుడే నాన్న
బ్రతుకు బాటచూపునట్టి మార్గదర్శి యతడౌను
కన్నసంతు ప్రయోజకులౌగా నిజమైన పుత్రోత్సాహమంటూ
సంబర పడిపోతు అందరితో ఆనందం
పంచుకొనే ప్రేమమూర్తి నాన్నేరా
తప్పు చేయ శిక్షవేయు నీతడే
బాధలందు బాసటౌనుకవచంలా కాపాడే
నాన్నంటే అగుపించే దైవమే సుమా.!
16.
[20/06, 8:12 pm] +91 99087 06218: అంశం: నాన్న
శీర్షిక: అమ్మను మించి.....
రచన: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
_------------------------_------_-----------------
ప్రేమ అనే గర్భంలో జీవితకాలం హృదయంతో మోసి
బాధ్యత అనే ప్రసవవేదన నిరంతరం అనుభవిస్తూ
భవితవ్యాన్ని శిశువుకు జన్మగా ఇచ్చి
మైమరచిపోయే నాన్న కర్పూర హారతి.
సంస్కారాన్ని లాలలుగా పోసి
మూర్తిమత్వాన్ని కొత్తబట్టలు గా వేసి
సాహచర్యాన్ని వేలు గా పట్టుకుని
ఋజు వర్తన అనే మార్గంలో నడిపిస్తాడు నాన్న
తన కారణంగా జన్మించాడని శిశువు బ్రతుకులో
ఒడిదొడుకులను ప్రాణాన్ని పణంగా పెట్టి
రక్తాన్ని డబ్బుగా మార్చి ప్రేమ ను ఆహారంగా పంచి
పెంచి పోషించి ఉన్నత శిఖరాలను ఎక్కించి
సోపానంగామిగిలిపోతాడు నాన్న
సమాజాన్ని పరిచయం చేస్తాడు
సంఘ జీవనానికి మెళకువలు చిత్రీకరిస్తాడు
మానవీయ సామాజిక సాంస్కృతిక విలువలు
కట్టుబాట్లు నూరి పోస్తాడు నాన్న
ప్రపంచ పటంలో నిన్ను ఒక ముఖ్యపట్టణంగా
నిలబెడతాడు నాన్న
బ్రతికి ఉన్నంతకాలం నీడై కాపాడుతాడు
కాలం చెల్లిన తర్వాతకూడా స్వాస్థ్యం నీకిఇవ్వాల
నుకుంటాడు
ప్రేమించడంలో స్వార్థాన్ని త్యజించడం లో
బిడ్డల ఔన్న త్యాన్ని కోరడంలో
అమ్మను మించి పోయాడు నాన్న..
నాన్నా నీవు దేవుళ్ళ కన్నా మిన్న.
17
[20/06, 8:14 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: నాన్న
ధైర్యసాహసాలు నూరిపోసిన వెన్నుదన్ను అందించిన
ఆగ్రహంతో కన్నెర్రజేసిన
మా ఇంటి దీపం నాన్న
కట్టల కొద్దీ డబ్బులు సంపాదించిన
బూడిదలో పోసిన పన్నీరు
జాతరలో మిఠాయి బండి లు పెట్టి శ్రీరాముల బండ
బొల్లేపల్లి మల్లికార్జున స్వామి
నాగిరెడ్డిపల్లి జాతరలో
పడమటి సోమవారం
వలిగొండ దాటి అవసరమైతే వలిగొండలో ఆ రాత్రి గజ్జల నారాయణ దుకాణం ముందు
నిద్రపోతు tikane ఏర్పాటు చేసుకున్న రోజులు
మర్చిపోలేని వలిగొండ చాకలి మంగలి జాతర
చెరువుగట్టు జాతర కు బండి తోసుకుంటూ పోయిన రోజులు నాకు ఇంకా జ్ఞాపకం
బొల్లేపల్లి లోనే రావి నారాయణ రెడ్డి ని మల్లికార్జున స్వామి జాతర లో మనసు తీరా చూసిన జ్ఞాపకం
చేతిలో చార్మినార్ సిగరెట్ పీలుస్తూ రావి దశరథ రెడ్డి గారి ఇ తో పలకరిస్తూ
ఆనాటి ఇ తాటి వనం లో ముంజలు తింటూ
12 గ్లాసుల కల్లు తాగుతూ
మా అమ్మా నాన్న తో గడిపిన నా బాల్యం నాటి ఆనంద దృశ్యాన్ని ఇప్పటికీ తలుచుకుంటూ కళ్ళలో ఆనంద డోలికల్లో మునిగి పోతాను
నా జీవితమంతా అమ్మానాన్నల ప్రేమతో
హైదరాబాద్ నెలనెలావెన్నెల అంజయ్య ఆడిటోరియంలో సి.వి కృష్ణారావు కవితా సమ్మేళనం లో కవిత చదివి వచ్చిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేను
ఒక అద్భుత దృశ్యం
తొలిసారి సాహితీ గవాక్షం లో లో నా తొలి కవిత రుణం తీరింది రైతు కవిత ప్రచురించిన తీయటి తలపు ఎప్పటికీ మర్చిపోను గొప్ప అనుభూతి
సేదతీరుతూ నే ఉంటాను
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి
7702537453 జ్ఞాపకాలలో ఇప్పటికీ
18
[20/06, 8:34 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్ 2 )
తేది:- 20/6/2021/ ఆదివారము
అంశము:- " నాన్న "
యయాతి ముదిమిని తీసుకుని
తనయవ్వనమును ధారబోసిన
శర్మిష్టికుమారుని పితృభక్తి
యాదర్శము మెచ్చదగినది
తండ్రిశంతను దిగులు నెరిగి
దాశరాజుకోరినవిధమున
సత్యవతిసంతానమేరాజ్యమేలగ
తానుబ్రహ్మచారిగ జీవించెదనని
గంగాపుత్రుడు ప్రతిజ్ఞజేసిభీష్ముడయ్యె
శంతనునితోసత్యవతికి
పాణిగ్రహణము జరిపిన
పితృభక్తికితడుతార్కాణము
కళ్ళులేని ముసలితల్లిదండ్రుల
కావడి బెట్టిమోయుచు
నడవులదిరుగుచు జీవనముగడుప
శ్రవణకుమారుడు విధివశమున
దశరధునిబాణము తగిలి
నశువులుబాయుచుకూడ
తల్లిదండ్రులదాహార్తి దీర్చుమని
దశరధునివేడెను
తల్లిదండ్రుల సేవానిరతిని
శ్రవణకుమారునిచరితదెలుపు
పరమాత్మయేరఘురాముడుగ
నవతరించితండ్రియాజ్ఞపాలించ
తానడవులకరిగిఆదర్శమూర్తిగ
మహిలోని బిడ్డలకుసందేశమందించె
పితృదేవోభవ
---------
తరణికంటి సూర్యలక్ష్మి.
19
------------
[20/06, 8:34 pm] Naresh Chary Siddipet Bixapaty Friend: సరదాగా ఓ పద్యం....
సీసం.
ఎన్ని బాధలువున్న యెన్ని బాధ్యతలున్న
మమతల్నిబంచుట మరువబోడు
సంతానమందున సమభావమునుగల్గి
బంగారు భవితకై బాటవేయు
బతుకుపోరాటాన మెతుకుపాఠము నేర్పి
యుద్ధవీరునిజేయునుర్వియందు
కష్టాలు కన్నీళ్లు కడుపులో దాచేసి
చిరునవ్వులనుబంచు చివరివరకు
ఆటవెలది:
నడక నడత నేర్పి నవజీవితమునిచ్చి
దిగులురేయిలోన దివ్వెయగును
ధైర్య స్థైర్యమొసగె దైవమ్ము నాన్నరా!
మదిని గొల్వు తనను మరచిపోక
- నరేశ్ చారి@369.
20
[20/06, 8:44 pm] Mekala Ramaswamy Poet: అంశము
*"*""""""**
ఘనుడురా నాన్నా
****************
నాటికి నేటికి మరి యే
నాటికి నైనన్ మనింటి పునాదిగ యుండీ
పాటికి సాపాటుకు ప్రతి
పూటకు గాసమును దెచ్చు బూజ్యుడునాన్నా
పంటి బిగువునా బాధను
ఒంటిగనె భరించుచుండునోపిక తోడన్
కంటికి రెప్పల కాపా
డొంటరి సైనికుడుధీరుడోడనినాన్నా
ప్రేమను బయటికి జెప్పడు
ప్రేమను తన ఎదలనిండ పేర్చుకు నుండీ
ప్రేమగ పెంచు మనసుగల
ప్రేమించే సుగుణమూర్తి పెన్నిది నాన్నా
తన సంతానము కొరకై
తన ధన మనమ్ములన్ని దారగ బోసీ
తనకంటేగొప్పోళ్ళుగ
గనుటకు శ్రమసల్పుచుండు ఘనుడుర నాన్నా
*******************
మేకలరామస్వామి చెన్నూర్
9912747214
21
[20/06, 8:44 pm] +91 96762 19655: ప్రేమను నింపి
మా ఇల్లు రంగుల ప్రపంచం
కలల సౌధానికి అదొక ఊహాలోకం
పాత గోడకు పూత అందం అన్నట్టు
పాతది కూల్చి కొత్తది కడదామంటే మనసు ఒప్పలేదు
మట్టి గోడలే కదని పెకిలిస్తే మా అమ్మానాన్న గుండెలు పెకీలించినట్టు అనిపించింది
ఎంతైనా మట్టి మీద మమకారం ఉన్నోళ్లము
మట్టితో చెలిమి చేసే వాళ్ళం
సింగిడిలో రంగులను అద్దితే చెక్కును మెరిసింది
ఉన్నంతలో ఉన్న ఊర్లో బొమ్మరిల్లుకు రూపం పోసాడు మా నాన్న
ఇటుక ఇటుక పేర్చి ఇష్టంగా కట్టాడు
మా నాన్న
చెమట చుక్కలను మట్టికుప్పలుగా చేసి అందంగా ముస్తాబు చేశాడు మా నాన్న
మమతానురాగం ముద్దచేసి సహకారం అందించింది మా అమ్మ
గంపెడు ప్రేమను కలగలిపి గడపగడపకు జోడించి తలుపులు బిగించింది
మా అమ్మ
కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కన్నీళ్లు కలిపి బండెడు అసాలతో పెంకుటిల్ల గూడు తయారు చేశారు మా అమ్మ నాన్న.. అందుకేనేమో
మా నాన్న కట్టిన భవంతే మా కిష్టం
ఏ మార్పులు చేయకుండా అట్లానే ఉండటం మా ఇంకా ఇష్టం.
బాలు కత్తుల
9676219655
౨౨
నాన్నా! నీ కన్నా
గొప్పెవ్వరులేరు
అరకచేత పట్టి
ఆరుగాలం కష్టపడినా
పలుగుచేతబూని
పదునైన రాళ్లు తీసినా
నెత్తిన రుమాలు కట్టినా
నడుముకు మాసిన దోతిచుట్టినా
చుట్టా,బీడీ కాల్చినా
చెప్రాసియైనా, తెల్ల చొక్కా ఉద్యోగం అయినా
ఖరీదైన బట్టలు ధరించిన
నాన్న నాన్నే
నాన్నను మించిన తీయని
రూపం ఏమున్నది
తనివితీరా ముద్దులు పెట్టిన
తప్పు చేస్తే చెంప చెల్లుమని
పగలగొట్టినా
నా కుమారులు, కుమార్తెలంటూ
ఆనందంగా చెప్పుకొని
నాన్న సంబరపడిన ఆ క్షణాలు
మా జీవితంలో చెరిగిపోని జ్ఞాపకాలు
ఆస్తులివ్వకపోయినా
అనురాగ బంధాలుగా
అన్న, తమ్ముడు, అక్క, చెల్లిలను ఇచ్చావు
వారికన్నా గొప్ప ఆస్తులు
ఏమున్నవి నాన్నా.
పలుగుల సతీశ్ కుమార్.
Comments
Post a Comment