kalam గారి వర్ధంతి 2021

నిర్వహణ 
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******************
కవివరుల జాబితా
1.దోసపాటి వెంకటరామచంద్రరావుగారు
2.మేకల రామస్వామి_టీచర్ గారు
3.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు
4.బాలు కత్తుల గారు
5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
6.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
7.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
8.కవిత వేంకటేశ్వర్లు గారు
9.డాక్టరు సి హెచ్ ఆంజనేయులు గారు
10.గొర్రె పాటి శ్రీను గారు
11.పిన్నక నాగేశ్వరరావు గారు
12.దార స్నేహలత గారు
13.సునంద వురిమళ్ల గారు
**********************
1.
 కవితాగానం
అంశం:కలాం నీకు సలాం!
ఆదర్శపురుషుడవు నీవు కలాం
విజ్ఞానఖనివి నీవు
వినయవిధేయతలేనీకు  ఆభరణములు
విశ్వంతారళములో అవిష్కరణలెన్నోచేశావు
భారతదేశఖ్యాతిని ఎంతో పెంచావు
కలలు కనమన్నావు
కన్నకలలను సాకారం చేసుకోమన్నావు
దేశప్రధమపౌరునిగా పదవినలంకరించావు
శాస్త్రసాంకేతికరంగాలలో విశేషకృషి చేసినావు
రోదసిరంగంలో క్షిపణులను కనిపెట్టినావు
క్షిపణిమనిషిగా  పేరుపొందినావు
భారతరాష్ట్రపతి పదవినలంకరించినావు
భారతరత్నగా బిరుదాంకితుడవైనావు
కలాం నీకు సలాం!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా.
చరవాణివ7780594995
2
కలాం మీకు మా సలాం
          *******************
సామాన్యుండవే నీవు
స్వయంకృషిని నమ్మినావు
కలాం మీకు మా సలాం
అసామాన్యుడివైనావు,,1
      కలలు కనండని చెప్పిన
      కమ్మని మాటలు చెప్పిన
      కలాం మీకు మా సలాం
      మార్గదర్శనం చూపిన,,2
పేదరికపు రుచి తెలుసు
పెద్దరికపు శుచి తెలుసు
కలాం మీకు మా సలాం
హోదా రత్నపు గొలుసు,,3
        చిత్తశుద్ధిగా చదివిన 
        క్షిపణి శాస్త్ర నిపుణుడైన
        కలాం మీకు మా సలాం
        జాతి గర్వకారణమున,,4
భారత అధ్యక్షుడవై
అభివృద్ధికి సారధివై
కలాం మీకు మా సలాం
దార్శనికతకు దారివై,,5
         విద్య అంటే తగని మోజు
         విద్యార్థుల మహారాజు
          కలాం మీకు మా సలాం
          విద్య పంచుటయె రివాజు,,6
లక్ష్యం విఙ్ఞానమ్ములు
ధృడదీక్షా పట్టుదలలు
కలాం మీకు మా సలాం
మరువలేము మీ మాటలు,,7
************************************
  డా"ఎపిజె అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భముగా
***************************************
  మేకల రామస్వామి_టీచర్_చెన్నూర్
***************************************
3
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag
: కవితా అంశం: కలాం నీకు సలాం
కవితా శీర్షిక: కర్మయోగి- అబ్దుల్ కలాం 

కలలుకనండి ఆ కలలను సార్ధకం చేసుకోండి
స్వయంకృషే మీ ప్రగతికి సోపానం
ఎన్ని అవరోధాలు వచ్చిన ఆశయాన్ని వీడకు 
నీ గమ్యాన్ని చేరటానికి ప్రయత్నించు  
తప్పక విజయం సాధిస్తావు. అనే నినాదంతో విద్యార్థులను 
ప్రేరేపించిన భారతరత్న
అబ్దుల్ కలామ్...
మీరు నిజంగా భరతమాత ముద్దుబిడ్డ!
సామాన్య కుటుంబంలో రామేశ్వరంలో జన్మించి
స్వయంకృషితో శాస్త్రవేత్తవై 
పృథ్వి, అగ్ని వంటి క్షిపణుల రూపకర్తవై
పోఖ్రాన్ అణుపరీక్షతో
ఖండాంతరాలకు భారతదేశ ఖ్యాతిని విస్తరింపచేసి
దేశానికి పదకొండవ 
అధ్యక్షునిగా, అజాతశత్రువుగా ప్రజలమన్ననల్ని 
పొంది భగవద్గీత లో శ్రీకృష్ణపరమాత్మ 
చెప్పిన స్థితప్రజ్ఞతకు మీరే దర్పణం! 
కర్మయోగీ...అందుకోండి శతకోటి 
భారతీయుల వందనములు!! 
          ------ 
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
9963265762

హామీ పత్రం : నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
4
: మీరే మా బలం

ఏ.పి.జె.అబ్దుల్ కలాం
మీ జననం మాకు పుణ్య ఫలం
మీ ఆలోచనలు చేకూర్చును బలం
మీ సేవలకు యావత్ భారత్ చేస్తుంది సలాం కారణ జన్ముడు కలాం
పేదింటి రామేశ్వరపు గడ్డ భారతావని గర్వించ దగ్గ ముద్దు బిడ్డ
పిన్న వయసు నుంచే
ఉన్నత శిఖరాలకు అధిరోహించిన దేశ తొలి పౌరుడు
నిత్య అన్వేషి నిరంతర విద్యా పిపాసి విజ్ఞానపు ఘనుడు
భారత్ దేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల జాబితాలో చేర్చిన ఘనత మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా
ఎల్లలు దాటి హద్దులు చెరిపి ప్రఖ్యాతి గాంచిన గొప్ప శోధన శాలి
కలలు కనడం కాదు కన్న కలలు సాకారం చేసుకోవాలని హిత బోధ చేసిన సృజనాత్మకత శీలుడు
తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ ద్వారా యువతను చైతన్య పరిచిన మేధావి
ఇండియా 2020 రచన ద్వారా అభివృద్ధి పధంకై ప్రణాళికలు సిద్ధం చేసిన
పద్మ భూషణుడు..
కలాం ఇదిగో మీకు సలాం

బాలు కత్తుల
5
[27/07, 8:12 pm] +91 6281 697 982: అంశం.. గానం కోసం

అబ్దుల్ కలాం
************
రామేశ్వరమ్మున
ఇసుక తిన్నెల పైన
సైకత గూళ్ళు పేర్చిన
ఓ బాలకా

చిరు ప్రాయంలోనే
చిట్టి చిట్టి చేతులతో
పట్టెడన్నం కొరకు
పేపరమ్మిన శ్రామికా

కష్టాలెన్నో ఎదురైనా
కన్నీళ్లే తోడైతే
సోదరి స్వర్ణం అమ్మి
నీ చదువుకు అండైనిలిచె

విద్యను శ్రద్ధగ గరిపి 
శాస్త్రాలెన్నో నేర్చి
మిసైల్ మ్యానుగ
లక్ష్యం చేరిన అర్జునా

భారత దేశపు కీర్తి
నీవు ఎగరేసిన పి స్ ల్ వి
మాతృభూమికి రక్షణ కవచం
అణుశక్తితో కప్పిన యోధ్ధ

నిద్రలో కలలు కనటం కాదు
నిద్ర పోనివ్వని కలలు కనండని
యువతను జాగృతం చేసిన
స్వాప్నికుడా, ఆచార్యదేవుడా.

భారత మాత ముద్దు బిడ్డ
పదిహేడు డాక్టరేట్లతో
పద్మ భూషణ్ పద్మ విభూషణ్
భారత రత్న వై విలసిల్లిన

ఓ మా అబ్దుల్ కలాం 
సదా మా జ్ఞాపకం లో
అందుకే
మా గుండెల్లో గుడి కట్టాం.

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.27721
6.
సందర్భం;  అబ్దుల్ కలాం వర్ధంతి
శీర్షిక;
    "" కలాం కు సలాం  ""

రామేశ్వరంలో జన్మించి
పేపరుబాయ్ గా పని చేసి
పేదరికాన్ని జయించిన
నిత్య కృషివలుడు అబ్దుల్ కలాం!
గెలుపు భారత జాతికిచ్చి
ఆశయాల అగ్ని లో జ్వలించిన
అవతార పురుషుడు అబ్దుల్ కలాం!
పిల్లలంటే మిక్కిలి ప్రీతి
వారికి పాఠాలు చెప్పడమంటే అమిత ప్రీతి
భారతదేశ ప్రధమ పౌరుడిగా  పనిచేసినా
అధ్యాపక వృత్తికే మిక్కిలి ప్రాముఖ్యత నిచ్చిన
ఆదర్శ అధ్యాపకుడు అబ్దుల్ కలాం!
సృష్టిలో జననం సహజం
మరణము సహజమే
కానీ మరణించి కూడా
జీవించే భారతరత్నాలు
యుగానికొక్కరే సహజం
ఆ సహజాతి సహజమే
మన భారత రత్నం అబ్దుల్ కలాం!
నీతి నిజాయితీలకు ప్రతిరూపుడవై
భారతీయ చరితలో ఆణిముత్యమై
అవినీతి రహిత పాలకుడవై
బంధుప్రీతి.రహితుడవై
ఆదర్శ పాలన అందించి
అంతరిక్ష క్షేత్రంలో భారతావనిని
అనంత ఎత్తులో నిలిపిన
ఓ.బహుముఖ ప్రజ్ఞాశాలీ
అబ్దుల్ కలాం జీ
అందుకో మా సలాం!
.........................................
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని.7416638823
.......................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.

7.
తిప్పావఝల నరసింహ మూర్తి Poet Nellore: ,
 కవితా గానం
అంశం: అబ్దుల్ కలాం
శీర్షిక:: స్పూర్తి ప్రదాత


పదవి వల్ల వన్నెవస్తుంది కొందరికి.
పదవికే వన్నెతెచ్చారుమిస్సైల్ మేన్.
ఎక్కడ పేపర్ బాయ్?
ఎక్కడ భారతదేశ ప్రధమ పౌరుడు?
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు,
మహాపురుషులౌతారు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ
పద్మవిభూషణ్.
బహుశా రాష్ట్ర పతి కావాలని కాదు కన్నారేమో.
కఠోర దీక్ష తో ఆకలలనుసాకారం చేసికొన్నారు.
వారు వినయ విధేయతలకు పుట్టినిల్లు
నిరాడంబరత అందానికి నిలువెత్తు నిదర్శనం.
ఆయనకు కోటు, సూటు ,బూటుకానేకావుఅలంకారం.
పద్మవిభూషణే నిజమైన అలంకారం
‌యువతకు స్పూర్తి ప్రదాత.
 కలాం గారు నిజంగా
 భారతరత్న.
మరణించిన సజీవులు
ఘనంగా అర్పిద్దాం శ్రద్ధాంజలి.

తిప్పా వఝల నరసింహమూర్తి

బుచ్చి రెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
8
[27/07, 8:42 pm] +91 83099 20625: కవితా గానం సీజన్ - 2
డా: అబ్దుల్ కలాం 

పుట్టితివి రామేశ్వరంలో
రాణించితివి చదువులో
గట్టిపడితివి కష్టాలలో
విహరించితివి కలలో

ఇల్లిల్లు తిరిగి పేపరిస్తివి
గురువుకు ప్రశ్నలు వేసి
సముద్రపు ఒడ్డున సమాధానాలు రాబట్టితివి
విహంగాల విహరము అరసి
ఆ దిశగా విజ్ఞాన గనివైనావు
వైజ్ఞానిక ధని వైనావు
శాస్త్రవేత్తవై క్షిపణుల రూపకర్త
వైనావు
భారతదేశ భాగ్యదాతవు
భారత కీర్తిని ఖండాంతరాలలో
నిలిపినావు
రాష్ట్రపతివైన సామాన్యుడిగా
జీవించినావు

విద్యార్థులంటే ప్రాణము నీకు
విద్య0టే పంచ ప్రాణాలు నీకు
చదువు చెప్పుట ఎంతో ఇష్టం
మీకు టీచరు స్థానమే గౌరవం

రెండవ సారి చేపట్టమనిరి
రాష్ట్రపతిగా వుండమనిరి
సున్నితంగా వద్దని తప్పుకొంటిరి
గురువు స్థానమే గొప్పదట్టిరి
కీ!!శే!!అబ్దుల్ కలాం
అందుకోండి మా అభినందనల
జోహార్లు
మా హృదయపూర్వక హారతులు!!
                 కవిత వేంకటేశ్వర్లు
కర్నూలు.     8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
9
[27/07, 8:56 pm] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: అతడు బాల్యంలో

కష్టజీవుల కుటుంబం నుంచి పైకి వచ్చిన వాడు
అతడు పక్షుల ఎగిరిన వాడు పక్షిని చూసి

మిసైల్ ను సృష్టించిన మహానుభావుడు

సంగీత సాహిత్యాల పట్ల ఎనలేని మమకారం కలిగిన వాడు

డి ఆర్ డి ఏ లో అద్భుతమైన మెసేజ్ సృష్టికి పథకం వేసిన మహనీయుడు

భారత భాగవతాలు అంటే
నిరంతరం సాధన చేసి అధ్యయనం చేసే ఘనుడు

వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత
కలలు కనండి వాటిని నిజం చేసుకోండి

బాలలకు కూడా బోధన చేశాడు చివరి వరకు

గిటార్ వాద్యంలో మిన్న అయిన వాడు

అతడే మన భారత రాష్ట్రపతి ఇ భారతరత్న అబ్దుల్ కలాం అతడికి కవిత నివాళి


డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు బోనగిరి ఖమ్మం కోట 7702537453 🌞
10.
కవితా గానం (సీజన్ 2)

"జయహో కలాం !"


భారతరత్న మై మెరిసిన అబ్దుల్ కలాం పుట్టింది
సనాతన భారతీయ ముస్లిం కుటుంబంలో !
అతడు విద్యను అభ్యసించింది
తమిళనాడులోని రామేశ్వరం లో!
దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేషమైన ప్రగతి సాధించడంలో ముందుండి  
దేశ అభ్యున్నతికి కృషి చేసి
ఎన్నో కీలక భూమికలు పోషించాడు కలాం !
రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా ప్రయోగించడంతో
అతడి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్త మయ్యాయి..
వ్యక్తిగత ప్రాముఖ్యత కంటే
దేశం పేరు కోసం పాటుపడిన సిసలైన దేశభక్తుడు కలాం !  
మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచిన అబ్దుల్ కలాం
భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతి గా పని చేసి
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల లో ఉత్సాహంగా పాల్గొని
యువతకు స్ఫూర్తినిచ్చే లా
తన ఆత్మకథను "వింగ్స్ ఆఫ్ ఫైర్ " అనే పుస్తకం లో పొందుపరిచి
రేపటి అందమైన సృజనాత్మకమైన భారతావనిని స్వప్నించిన
మాతృభూమి ముద్దుబిడ్డడు అబ్దుల్ కలాం !  
అతడు అందుకున్న పురస్కారాలు ఎన్నో ..ఎన్నెన్నో ..
ఎప్పుడూ నిరాడంబర జీవితాన్ని గడిపి
సదా దేశ మాత సేవలో నిమగ్నమై
భారతీయుల గుండెల్లో మరపురాని మహోన్నత వ్యక్తిగా
నిలిచిపోయిన సహృదయుడు కలాం !

  - రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

"జయహో కలాం ! " అను రచన నా స్వంత రచన ఆని హామీ ఇస్తున్నాను.
11.

కవితా గానం(సీజన్2).      27--7--2021.
పిన్నక నాగేశ్వరరావు.

అంశము :-- అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం.

అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం
ప్రొఫెసరు, శాస్త్రవేత్త, రచయిత
రామేశ్వరం లో పేద కుటుంబంలో పుట్టాడు
చిన్నప్పుడు పేపర్ బాయ్ -- పెద్దయ్యాక
                                               రాష్ట్రపతి
కలలు కన్నాడు -- లక్ష్యాన్ని సాధించాడు
ఆయన జీవితం యువకులకు ఆదర్శం
నేటి తరానికే కాదు -- రాబోయే యువ
                                   తరానికి మార్గదర్శి
పోఖ్రాన్ అణు పరీక్షలో కీలక పాత్ర
అంతరిక్ష పరిశోధనా రంగంలో శాస్త్రవేత్త
భారతదేశం ముందడుగు వేయుటలో కృషి
ఉపగ్రహ ప్రయోగాల విజయకేతనంలో
                                      పోషించిన పాత్ర
అజరామరం ,అద్వితీయం, అసామాన్యం
విద్యను, విజ్ఞానాన్ని పదిమందికీ పంచే
                                                  తత్త్వం
నిస్వార్థం, నిరాడంబరత మూర్తీభవించిన
                                                వ్యక్తిత్వం
సాధించిన పురస్కారాలు ఎన్నో
పద్మభూషణ్, పద్మవిభూషణ్ లే కాదు
"భారత రత్న" వెతుక్కుంటూ వచ్చింది
భారత దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికై
రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి
రాష్ట్రపతి ఐనా బోధన అంటే ఆసక్తి ఉండి
విలువలు బోధిస్తూ కలలు కనమన్నాడు
ఆ కలల సాకారానికే యత్నించమన్నాడు
రచయితగా ఎన్నో పుస్తకాలు వ్రాసి
" మిస్సైల్ మ్యాన్ " గా ఖ్యాతి గాంచిన
అబ్దుల్ కలాం గారికిదే నా అక్షరాంజలి!!!
************************************
౧౨.
కవితా గానం @సీజన్ 2
శీర్షిక :సర్ అబ్దుల్ కలాం -ఓ విద్యా శిఖరం

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి 
ఓ విజ్ఞాన శిఖర విద్యాలతల ప్రభంజనం
విద్యార్థి లోకాన్ని ప్రయోగాన్వేషణలకు
పురిగొల్పిన నవ్య మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వం

రామేశ్వరం పేపర్ బాయ్ నుండి పీపుల్స్ ప్రసిడెంట్ 
ఎదిగిన నిరాడంబర దేశభక్తుడు ఆజన్మ బ్రహ్మచారి 
నిరంతర దీక్షా పట్టుదలతో శాస్త్రవేత్తగా రాణించి
విశ్వ జగతిలో అణ్వస్త్ర క్షిపణులకు సూత్రధారి 

విద్యా సాంకేతికత సమాచారాన్ని యువతకు
దేశ విదేశాల్లో అందించిన అలుపెరుగని గురువతడు 
అసామాన్య ప్రజ్ఞాశాలి వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత
తుదిశ్వాస వరకు విద్యార్థులతో గడిపిన తపస్వి 

నింగిన ఎగిరిన స్వప్న సాకారమే బాలిస్టిక్ క్షిపణి 
భారత రత్న దేశభక్తి స్పూరించిన మిస్సై ల్ మ్యాన్
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన చైతన్య కెరటం
డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులుబ్దున్ అబ్దుల్ కలాం

పేరు : దార. స్నేహలత
ఊరు : గోదావరిఖని
జిల్లా : పెద్దపల్లి

హామీ : ఇది నా స్వీయ రచన. దేనికీ అనువాదం కాదు.
13.

*కవితా గానం సీజన్ 2*
తేదీ:27-07-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: కలాం నీకు సలాం
శీర్షిక:
******************
సంకల్పానికి దీక్ష పట్టుదల కృషి తోడుంటే
ఏదైనా సాధ్యమే అని ఋజువు చేసిన మహనీయుడు!

అవరోధాలు ఆశయాన్ని సడలించలేవని
కన్న కలల్ని సాకారం  చేసుకోవడమెలాగో చూపిన క్రియాశీలి!

సామాన్య జీవితాన్ని సానపట్టుకుని
దేశానికే ప్రథమ పౌరుడిగా 
ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన  
అవుల్ ఫకీర్ జైనులబిదీన్ అబ్దుల్ కలాం!
నేటి యువతకు మార్గదర్శి!

పేపర్ బోయ్ గా సాగిన జీవనం
అంతరిక్ష పరిశోధనా రంగంలో
మిస్సైల్ మ్యాన్ గా సాగిన ప్రయాణం...

దేశానికే రాష్ట్రపతిని చేసిన క్రమం
కష్టాల కొలిమిలోంచి ఎగిసిన దివ్య జ్యోతి కలాం!

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం
పదవులకే వన్నతెచ్చిన  ఆదర్శం కలాం సొంతం!

పద్మ భూషణ్,పద్మ విభూషణ్ భారత రత్న పురస్కారాలకు
అత్యుత్తమ గౌరవం కలిగేలా చేసిన మహనీయుడు!

పెద్దల్లో హుందాగా
బాలలకు స్నేహితుడిగా 
ఆత్మీయత అభిమానం పొందిన కలాం నీకు సలాం!
నిను మరువలేదు దేశ జాతి సమస్తం!
నీకిదే అక్షర నీరాజనం!

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧