07102021 స్వేచ్ఛాంశం

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి 
*************
1.నరేశ్ చారి గారు
2.కోరాడ గారు
3.ఆపరాజిత్ గారు
4.జోషి పద్మావతి గారు
5.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
6.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
7.ధనాశి ఉషారాణి గారు
8.నాశబోయిన నరసింహ గారు
9.సింహాద్రి వాణి గారు
10.శివునూరి లలితా కృష్ణ గారు
11.ధర్మాగ్రహం
12.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
***********
1
ఎంత గొప్ప పాఠమో!
మొక్క
పువ్వులు పూయడం
కాయలు కాయడం మాత్రమే కాదు
మౌనంగా పాఠమూ చెబుతోంది
నీ లోపల
ఏకలవ్యుడు లాంటి శిష్యుడున్నప్పుడే కదా
మొక్కలోని ద్రోణాచార్యుడు కనబడతాడు
నోటితో పాఠం చెప్పడమేముంది
ఎవరైనా చెప్తారు
అసలు సమస్య ఆచరించడంలోనే కదా !
ఆచరించని నోటి పాఠాలకన్నా
ఆచరించే మౌన పాఠం చాలా గొప్పది 
అందుకేనేమో!
మొక్క రెండవదెంచుకుంది

బండ బరువులు
తనను ఊపిరాడనీయకుండా చేసినా
నీటిని నేర్పుతో వెతకడమొకపాఠం
కఠిన శిలలు
తననెదగనీయకుండా చేసినా
కసితో వాటినే పునాదిగా చేసుకోవడమొకపాఠం
అనాథలా తననందరొదిలేసినా
స్వయంకృషితో పైకెదగడమొకపాఠం
తుఫాన్లొచ్చిభయపెట్టినా
ఈదురుగాలులొచ్చి క్షోభపెట్టినా
నవ్వుతూ నవ్విస్తూ బతకడం మహాద్భుత పాఠం

బతుకు పాఠం నేర్పుతున్న మొక్కకు
ఏ చేతులు 
గొంతు నులుముతాయోనన్న దిగులులేదు
ఏ పశువుకు
 పలహారమౌతానేమోననే భయమూ లేదు
చేసేదల్లా ఒకటే 
తను బతుకుతూ ఇతరులను బతికించడం
చెప్పేదల్లా ఒకటే
చీకటి సముద్రాన్నీదిసూర్యుడు తూర్పు గట్టుకు చేరుకున్నట్టు
సమస్యల సుడిగుండాలకెదురీది విజయ తీరాన్ని చేరడం

                                   - Naresh Chary@369.
2
[07/11, 8:16 pm] Korada: నేటికవిత
 !.. రంగుల వలయమా ...!?!?
      కోరాడ నరసింహారావు 
          **************
*జీవితమే రంగుల వలయం *
అంటాడేంటీ కవి..... !
"జీవితం" కమ్మిన కరిమబ్బుల 
కారుచీకటైపోతేనూ... !!
ఏదీ.... మనుషుల్లో  ఆ తెల్ల దనాల స్వచ్ఛతేదీ... !?
 ఆ బుర్రల్లో... ఉషోదయపు కాషాయ త్యాగ సూచికెక్కడ !?
ఆబుర్రల్లో అంతటా స్వార్ధమే 
నిండిపోతేనూ..... !!
ఈ మనుషుల్లో ఆ నీలి విశాలత్వం కానరాదే.... !!
ఆ ఆకుపచ్చ విజయాలు.... 
ఆ పసుపు శుభ సూచికలూ కానరావే.... !
ఒక గెలుపుకు పది ఓటమిలు 
అవాంఛిత అశుభాలూ తప్ప !!
ఈ మనుషుల్లో ఆ నీలి విశాల త్వమెక్కడ... అన్నిటా సంకు చితత్వమే ఐతేను.... !
ఇంత జరువుతున్నా.... 
ఆ తిరుగుబాటు చైతన్యపు 
ఎరుపెక్కడా కానరాదే..... !!
సర్డుకుపోయే అసమర్థతే తప్ప 
జీవితమంతా... చేతగాక... 
చేతులు ముడుచుకు... మూల 
కూచుని కుమిలిపోయే నలుపే. 
ఇంక ఈ జీవితాల్లో....... 
 రంగుల వలయాల.... 😂😂😂😂😂😂😂😂😂😂
    @@@@@@@@@@
...........కోరాడ.
3
[07/11, 8:52 pm] +91 95420 10502: కవితాగానం (సీజన్2)
తేది: 07/11/2021 ఆదివారం
అంశం: ఐచ్ఛికాంశం

*శీర్షిక : కలం-బలం*
~~~~~~~~

న్యాయమార్గ పయనమే సముచితం. శాంతి సంరక్షణే పరమోత్కృష్టం. 
అన్యాయమునెదిరించి నేరస్థులుగా పరిగణింపబడితేనేమి?  నేరచరితులని ముద్రింపబడితేనేమి?
సమాజహితమును చేకూర్చితిమన్న తృప్తి చాలదా!విశ్వానికి శాంతి చేకూరదా!ఆ దైవమే నిను మెచ్చదా! 
అవకాశవాదులతో నిండిన అవని ఇది
అప్రమత్తతతో జీవించమని బోధించే కాలమిది
మంచితనమెంత వున్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లము కామా!
జ్ఞానమున్న వారితో వాదించిన లభించదా జ్ఞానము!
అజ్ఞానులతోడి వాదన తొలగించును నీ జ్ఞానము.
ధనంచూచి దగ్గరైనంత త్వరగా గుణంచూచి దరిజేరేరా ఈ జనులు!
నిస్వార్థులై నీ అంతరంగమును గ్రహింతురా స్వార్థపరులు! 
చెడు విస్తరించినంత వేగం మంచికి లేదు.
మంచిని పెంచే తరుణం సమాజాన రాకపోదు. 
ప్రయత్నమే పరమాస్త్రంగా, పట్టుదలే సడలనీకుండా కృషి చేసిన మనుషులు ఋషులుకారా!
మహాపురుషులుగా మెలగరా!
కలమే బలమై, కవనమే కాలమున పరిణామసాధనమై కవులంతాచేరి *నేను సైతం* అంటూ కలంకత్తులను చేపట్టి  
అరాచకాలకన్యాయాలకు అడ్డై విశ్వశాంతికి కారణమై విఖ్యాతిగడించాలి
వికాసమును తేవాలి.
వినీలాకాశాన శాంతి కపోతాలెన్నో స్వేచ్ఛగా ఎగరాలి
              --------------------
జోషిపద్మావతి 
మహబూబ్ నగర్
4
[07/11, 8:53 pm] Aparajith: అవనిపై ప్రకృతి!

వెలుగుల జ్యోతి 
దివ్యమైన వెలుగుల పరంజ్యోతి!
ఆ జ్యోతిలో రేగిన వెలుగుల మంటలు 
ఆ అగ్ని ఫటిల్లుమని విచ్చుకుని 
చెల్లాచెదురయ్యాయ్ అదే విశ్వాంతరాళం!
ఆ నిప్పుల వెలుగుల్లోంచి వేరయిన 
మంటల ధగధగల గ్రాహం భూమి 
అనంత కాల గమనంలో చల్లబడి 
అపురూప కళాఖండంగా భూమి అవతరించింది!
నీళ్ళు చేపలు,వృక్షాలు,జంతువులతో ప్రకృతి అతి సుందర రూపం 
ప్రకృతితో సల్పిన నిరంతర పోరాటంలో 
మానవుడు ఈ భూమిపై మనుగడ సాగిస్తున్నాడు 
సమస్త వృక్ష జంతుజాలాన్ని చెండాడుతూ 
తన ఉనికికి తానే దహించుకు పోయే 
ప్రచండ అగ్నిని రేపుకుంటున్నాడు!
ఇప్పుడు అవని రూపురేఖలు మారిపోయాయి 
ఎప్పుడు జలరాశులన్నీ భూతలాన్ని 
కప్పేసుకుంటూ ప్రళయం వస్తుందో తెలీదు!
అది మృగప్రాయుడైన మానవుని చేతుల్లోనే వుంది,,,,,,,,!
మనిషి మేధస్సు మానవ కళ్యాణానికి ఉపయోగించాలి
ప్రకృతి విధ్వంసం సులభం కాని కాపాడుకోవడం మానవ ధర్మం!

అపరాజిత్ 
సూర్యాపేట
5
[07/11, 8:54 pm] +91 99373 80136: కవితాగానం
తేది07112021,ఆదివారం
అంశం:నేనొక బాటసారిని.
నేనొక బాటసారిని
నాకంటూ ఒక దారిలేదు
నాదంటూ ఏమిలేదు
నాకంటూ గమ్యంలేదు
నాకంటూ ఒక లక్ష్యంలేదు
నేనొక బాటసారిని
నాదారి ముళ్ళబాట
నాదారి గతుకులమయం
లేస్తూపడుతూవుంటాను
నా పయనం ఆగదు
నేనొక బాటసారిని
నన్ను పట్టించుకునేవారు లేరు
నన్ను అనుసరించేవారు లేరు
ఎడారైనాసరే సాగాల్సిందే
ఒంటరిగానే నడవాల్సిందే
నేనొకబాటసారిని!

ఇది నాస్వీయరచన .
దోసపాటి వెంకటరామచంద్రరావు.
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
చరవాణి7780594995.
6.
[07/11, 9:00 pm] +91 6281 697 982: *శీర్షిక...... భూతాపం*
**************************************
ఎటు పోతున్నాము మనం ?
కర్బన ఉద్గారాల ఉధృత ప్రవాహంలో
మైమరచి రంగు రంగుల నియాన్ బల్బుల
జిలుగు వెలుగుల ఊళిక నెక్కి....??
ఎటు పోతున్నాము మనం?

శిలాజ ఇంధనాలు మండిస్తు భీకర జ్వాలలు
రగిలిస్తు పర్యావరణాన్ని పాడె నెక్కించి
ప్రగతి రథం పైన ప్రచండులమని ప్రగల్భాలు
పోతు.... ఎటు పోతున్నాము మనం ?

స్వార్థం దురాశతో వన హననం చేస్తూ
పర్వతాలు పడద్రోసి పారుతున్న వాగులు
వంకలను పూడ్చేసి నదీనదాలను కట్టేసి
*భూతాపం పెంచేస్తున్న మనం*....

మనకెవరొ తవ్వాల్సిన సమాధులను మనమే తవ్వుకుంటూ
భవిష్యత్ తరాలకు అందించటానికి బంగారు బాటల బదులు ,... విధ్వంసక వినాశపూరిత
వాతావరణాన్ని వారసత్వ సంపదగా ప్రోది చేసి
సమస్త మానవాళిని డూమ్స్ డే యంత్రం పైన
నిలుచోబెట్టి ........

ఎటు పోతున్నాము మనం అంటూ ఆవేదనతో
ఆక్రోశించిన ప్రపంచ దేశాధి నేతలు....

 అంటే....* విషయం ఎంత భయంకరమో కదా*

అందుకే,
ప్రకృతికి హాని తలపెట్టని రీతుల్లో  
జీవనాన్ని సాగించె సాంప్రదాయ పద్ధతులపై
అనేకానేక జాతులకు ఉన్న అవగాహనను
వాతావరణ మార్పులకు అనుగుణంగా
సర్దుబాటు చేయుటకు ప్రాధాన్యతనిస్తూ

పునరుత్పాదక ఇంధన వనరులు పెంచుకొని
అంతర్జాతీయ సౌర సంకీర్ణ వ్యవస్థ నందుకొని
*శూన్య ఉద్గారాల స్థితి స్థాపనకు* స్థిర చిత్తంతో
*శిఖరాగ్రాన చేరుటకు పోదాం మనము వడివడిగా సుడి బడక*

భూతాపాన్ని కట్టడి చేయడానికి
భద్రమైన భరణిలో ధరణిని భద్రపరచడానికి పోదాం!!!!!


స్వీయ రచన::::* కేశరాజు వేంకట ప్రభాకర్ రావు*.
07 నవంబర్ 2021 మొదటి ఆదివారం
7
[07/11, 9:01 pm] +91 70755 17538: శీర్షిక..ఓ మాయాజాలమా
........
మనసులోగిలో గిలిగింతలు పెట్టి
ముద్దుగాను మనసును ముస్తాబు చేసి

రంగుల ప్రపంచములో
 మనిషిని విహరింపచేసి
సీతాకోకచిలుక వలెను ముద్దుగా ముస్తాబు చేసేవు

బంధాలను చిన్నవిగా చేసేవు
బాధ్యతలను విడిచి ప్రేమకు బందీని చేసెను
కాలము ఒడిలో ఊసులును చిగురింపచేసేను
గుండెల్లో కన్నీటి ఉప్పెనలో నిలిపేను

ఆకాశమంత ఆశతో ఆనందములో నిలిపి
స్వార్థము మరిచి సర్వస్వము నిండేను

ఊపిరి పోయినట్టుగా క్షణము యుగముగా తలిచేను
దూరము కాలేను అంటూ నిట్టూర్పుతో
నిండుగా మదిని తడిపేవు
నిరీక్షణతో బతుకును నిలిపేవు


ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
భాకరాపేట

హామీ పత్రం: ఇది నా స్వంతమని హామీ ఇస్తున్నాను.
8.
[07/11, 9:11 pm] +91 85550 10108: *కవితా గానం సీజన్ 2*
తేదీ:07-11-2021
రచన: *నాశబోయిన నరసింహ(నాన)*
ఊరు: చిట్యాల,నల్గొండ
చరవాణి:8555010108
🔱🔱🔱🔱🔱♦️🔱🔱🔱🔱🔱
*విశ్వ విజేత*
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
నృష్టి ప్రసవించినపుడు
నమస్య శిశువుతో పాటు
ఉమ్మనీటి సమాధానం పుట్టింది
ప్రతీ దారిద్ర్య విషానికి విరుగుడు కషాయం ఉంది!

*ధీరోధాత్తా*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన పుష్పించే ఉత్పత్తి వనరులు 
విశృంఖల శ్రమశక్తి వినియోగంతో
ఆర్థిక దరిద్రాన్ని తరిమే కలియుగ కుబేరుడివి

*స్నేహితుడా*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన పారిశుద్ధ్య పోషకాహార పరిజ్ఞానం                                          అవగాహణామృత ఆచరణతో 
ఆరోగ్యదారిద్ర్యం తరిమే స్వస్థ సురక్షకునివి

*నెచ్చెలీ*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన నివురుగప్పిన అక్షరాగ్ని                                                                                                  నిరంతర అభ్యసన సాధనతో                                                                     అక్షర దరిద్రం తరిమే బహుముఖ ప్రజ్ఞాశాలివి

*ఆజానుబావా*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన నిరహంకార నిర్మలత్వం
అనంత విశ్వశాంతి పరివ్యాప్తితో ఆధ్యాత్మిక దరిద్రాన్ని తరిమే జ్ఞాన ప్రబోధకుడివి

*భజరంగభళీ*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీలో అపార నైపుణ్య సృజన దీప్తి నీలాకాశానికి నిచ్చెనేసి అతికించిన తళుకుల ధృవతారలా ప్రకాశిస్తూ ఉద్యోగదరిద్రాన్ని తరిమే విశ్వవిజేతవి

*బాహుబలీ*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
నీ అంతరాన అమోఘ సేవా తపన
కొమ్మ రెమ్మలకు వేలాడే కుసుమ ఫలాలు
ఆర్హులకందించే మహా మార్గదర్శివి

*సేవకుడా*! ఆత్మవిశ్వాసం తోడైతే!!
ఈ అద్భుత విశ్వంలో 
పరిమళించే మానవత్వం ఆచంద్ర తారార్కం
తనువు తాత్కాలికం సేవే శాశ్వతం.

🌀🌀🌀🌀✒️ *నాన* 🏹🌀🌀🌀🌀
9
[07/11, 9:12 pm] Siimhadri Vani Poetess: కవితా గానం( సీజన్ 2)
తేదీ:--7-11-2021
అంశం:-ఐశ్ఛికం
శీర్షిక:-- ప్రకృతి--మనిషి
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872

పచ్చదనం, పరిశుభ్రత
ప్రకృతికీ మనిషికీ
అందాన్ని, ఆరోగ్యాన్ని యిస్తాయి.
చెట్లు లేని ప్రకృతీ, ఆరోగ్యం లేని మనిషీ ఒకటే
ప్రకృతికి పచ్చదనం చెట్లతో వస్తుంది
మనిషికి ఆరోగ్యం‌ పరిశుభ్రతతో వస్తుంది
ఎత్తైన కొండలూ లోతైన నదులూ
సూర్యచంద్రులు నక్షత్రాలు
కోటానుకోట్ల జీవరాశులూ వున్నా
చెట్లు లేని ప్రకృతి అసంపూర్ణం
కోట్ల కొలదీ  ధనరాశులున్నా
ఆరోగ్యం లేని జీవితం అంధకారం
రోజురోజుకూ పెరిగే జనాభాకు సరిపడా
మొక్కలు నాటి పెంచకుండా
పెరిగిన చెట్లనూ వృక్షాలనూ నరికేస్తుంటే
ప్రాణవాయువు తగ్గి కాలుష్యం పెరిగి
వాతావరణంలో సమతౌల్యత లోపిస్తుంది
అప్పుడు చల్లగాలులు లేక, వాన చినుకులు రాలక
వాతావరణం అగ్ని గుండంలా‌మారుతుంది
అందుకే
పచ్చదనాన్ని పెంచుదాం
ప్రాణవాయువు‌ ను‌పంచుదాం
అంతులేని అందమైన
ఆరోగ్యాన్ని పొందుదాం.
10
[07/11, 9:29 pm] Lalita Sister: అంశం :సబర్మతీ ఆశ్రమం 

సత్యం ధర్మం
సాకారమొందిన 
రూపం
సంకల్పదీపాన్ని
 వెలిగించడానికి 
సతీమణి తో 
సాగించిన
*పోరుబాట*

పరాయిపాలన
 పలాయనం
చిత్తగించడానికి  
పన్నెండేళ్లమజిలీగా 
చరిత్రలో నిల్చిన
 *పవిత్రపుట* 

గాంధీ
 హరిజన 
సత్యాగ్రహమను 
మువ్వన్నెలతో 
మురిసి 
మెరిసిన
స్వేచ్ఛాగీతపు
 *బావుటా* 

కాలి నడకకు 
శ్రీకారం చుట్టి 
గుప్పెడు ఉప్పు 
ఉప్పెనై ఎగసిన  
దండయాత్రల
దండి యాత్రకు 
*బాసట*

మహాత్ముని
 మనోరథబీజపు  
అంకురమై  
జాతి జనుల 
బానిసత్వపు
బతుకు పాటకు 
స్వస్తి పలకడానికి 
వేసిన 
*కొత్త బాట*

*******శివునూరి లలితాకృష్ణ
11.

ఇది వీరా గుడిపల్లి కవిత
ధర్మాగ్రహం
(సత్యాగ్రహం)
**********************
ప్రకృతి ధర్మానికి విఘ్నం కలిగినపుడు
అవాక్కయ్యేలా ,న్యాయమైన ఆగ్రహం

అవసరం లేకున్నా
జిల్లేడాకు తెంపితే కంట్లో పడిన పాలచుక్క
కన్నూమిన్ను కాదనకుండా నడిచేటప్పుడు
తాకుర్రాయి తగిలినట్లు
ఉప్పు పైన పన్ను వేస్తే
మతకలహాలు సృష్టిస్తే
రాయబారాలు విఫలమైతే
పగవాడి పరాభవం కోరకుండా
ధర్మాగ్రహం కనబరచడం
తప్పనలేమది సత్యాగ్రహం.

హేరాం అన్నాడా లేదా అని కాదు
ధర్మాచరణ చూద్దాం
సత్యశోధన చేద్దాం
సత్కర్మలాచరిద్దాం
కళ్ళెర్రబడితే, కాలరెగరాయాల్సి వస్తే
సత్యాగ్రహం పాటిద్దాం.
నడిచింది గాంధీ యుగం
గెలిచింది గాంధీ మార్గం
ఆయుధం పట్టడం తప్పెప్పుడూ కాదు
ఆయుధం  సత్యాగ్రహమవ్వాలి
...... *వీరా గుడిపల్లి*

12.


కవితాగానం సీజన్ 2

అంశం.. ఐచ్చికం 

శీర్షిక.. బాల్యం మరపురానిది 


బాల్యం మరపురానిది

బాల్యం మరువలేనిదిg

బాల్యం మహాత్తరమైనది

బాల్యం మహోన్నతమైనది


అమ్మఒడిలో గోరుముద్దలు

అమ్మ లాలనలో పులకరింతలు 

నాన్న పాలనలో పలకరింపులు

అత్తదగ్గరచేసిన గారాలసరదాలు

అక్కనన్ను ఎత్తుచేసిన గిలిగింతలు   అన్న నాపై చూపిన ప్రేమభిమానాలు

అమ్మమ్మనేర్పిన మంచిమంచిమాటలు

తాతయ్య చెప్పిన కథలలోమెలకవలు

నానమ్మ చెప్పిన నీతి కథల సూక్తులు

ఆ బాల్యంమరచిపోనిది మరపురానిది


నా తోటి పిల్లలతో ఆడిన ఆటలు

నా చెలికాండ్రతో పాడిన పాటలు

నా స్నేహితులతో చదివిన పాఠాలు

నాపాఠశాలలోపొందిన అనుభూతులు

ఆ బాల్యం మరువలేనిది మరపురానిది


పక్కింటి అత్తయ్యగారింట్లో పూరీలు

పెద్దత్తగారింట్లో బావలతో గొడవలు

చిన్నత్తగారిట్లో మరదళ్ళతో సరసాలు

సినిమాకెళ్లే ఎద్దులబండిలపై గెంతులు

ఆబాల్యం మరువలేనిది మరపురానిది


తోటలో దొంగిలించిన మామిడికాయలు

కోటికోమ్మచ్చి ఆటలో ఎక్కినచింతచెట్లు

వెన్నెలలో ఆడిన సబ్ జోర్ విన్ డోర్ లు

ఉప్పుపట్టీలు ఉరకలు పరుగుపందాలు

కాలవలలో కొట్టిన ఈతలు పందాలు

ఆ బాల్యం మరువలేనిది మరపురానిది


భగవంతుడు ఎదురై ఏమీకావాలంటే

ధనమువద్దు ధాన్యంవద్దు డబ్బువద్దు

అందలాలేకూడా నాకు అసలొద్దంటాను

నాకు ఆ బాల్యం ఇయ్యి భగవంతుడా!

ఆ చిరుబాల్యాన్ని మరోసారి నాకీయ్యి  అని ప్రాధేయపడి మరీ కోరిప్రార్ధిస్తాను!


తాతపూడి సోమశేఖర శర్మ

యానాం,8328070336


హామీ పత్రం

                  ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧