దీపావళి 2021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
***********
1. కేశరాజు వేంకట ప్రభాకర్ గారు
2.కోరాడ గారు
3.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
4.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు
5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
6.సింగీతం సంతోష్ కుమార్ గారు
7. మద్ది పుల్లారావు గారు
8. ధనాశి ఉషారాణి గారు
9. నాశబోయిన నరసింహ గారు
10.దార స్నేహ లత గారు
11. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
12. అపరాజిత్ గారు
13. తరణి కంటి సూర్య లక్ష్మి గారు
14. పిన్నక నాగేశ్వరరావు గారు
15. సింహాద్రి వాణి గారు
16. మన్నె పిన్నక లలిత గారు
17.గొర్రెపాటి శ్రీనివాస్ గారు
18. కవిత వెంకటేశ్వర్లు గారు
19. డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
20.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
21. వీరా గుడిపల్లి
22.వీరా గుడిపల్లి హిందీ వెర్షన్
23.శివునూరి లలితా కృష్ణ

******1
1.
[03/11, 7:53 pm] +91 6281 697 982: దీపావళి...03112021
*******************
వీధి వీధిన వెలుగులు
విరబూసిన దీపాలు
పాలపుంత లోని
తారలై మెరుస్తు

వెలిగించిన దీపాలు
వేయి చేతులు సాచి 
తొలగించు చీకట్లు
సూర్య నారాయణులై

గడప గడపకు జేరి
గంధాల నెగదోస్తు
గుండె కండగ వెలుగుండ
గండమెక్కడ నుండు

గుండ్ల పోచమ్మా
గండి మైసమ్మా
నరకుణ్ణి నరికిన
నారీ సత్యభామా !!!

మనిషి మనసు లోని
మలినాల ముష్కరుల
మట్టుబెట్టేందుకు 
ఎక్కుపెట్టిన బాణమా
వెలిగించిన దీపమా

దీపాల తోరణాలు
దివ్య కాంతులు విరజిమ్మి
అజ్ఞాన తిమిరాల అంతమొందించే
భవ్య భాగవతీ మూర్తి దివ్య ధరిత్రీ..!!!

స్వీయ రచన::::* కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.*03112021
2
[03/11, 7:53 pm] Korada: నేటి అంశం :- 🔥దీపావళి🔥
     ఇంతులు - కాంతులు 
కోరాడ నరసింహా రావు.... !
     ***************
తొలి సంధ్యవేళ.... ముస్తాబు లతో కల - కల లాడుతూ...
మిల -  మిలా  మెరిసిపోయే  మహిళలు !
దీపారాధనల దివ్య కాంతులతో 
దేదీప్యమానమైన ఇల్లు... !!
పండుగలకు శోభ నిచ్చేది... 
పడతులేగా.... !
ప్రతి ఇల్లూ ఒక స్వర్గధామమై 
కుటుంబ పరివారాల సందడులే.... !!
నోరూరించే పసందైన ప్రత్యేక వంటకాలు, ఉల్లాసాల సహ భోజ నానందాలు... !
కేపుల తుపాకులతో... దొంగా 
పోలీసులైపోయిన పిల్లల...  సిసింద్రీల సందడులు.... !!
మహిళ ల  మలిసంధ్య ముస్తా బులతో.... మసక వెలుగుల వేళ... ప్రతి ఇల్లూ... దీప తోరణాల హేల.... !
ఆ అమావాస్య రేయి.... 
దివ్య కాంతుల ఆనంద సందో హం.... !!
శ్రీమహాలక్ష్మికి...స్వాగతాంజలుల భక్తి, ప్రపత్తులు...... 
నక్షత్రాలు విరజిమ్మే చిచ్చు బుడ్లు... !
వెన్నెల ముద్దలు - ముద్దలుగ
కక్కె వెన్నముద్దలు... !
చిట - పట... చిట - పట మంటూ... కాకరొత్తులు... !
 గుండెలు అదిరే... బాంబుల డాం - డాం లు... !
బుస -  బుస మంటూ అనకొం డలు వచ్చేటి పాము బిళ్ళలు !
ఆ పోగలకు మటు మాయమైన 
దోమలు... క్రిమి, కీటకాలు !!
*దీపావళి*అంటే... ఆనందాల 
కల -  కల లే.... !
ప్రతి ఇల్లూ... కాంతులతో... 
మిల -  మిల లే.... !!
       ****************
       ...... కోరాడ.
3
[03/11, 8:00 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం (సీజన్ 2)
అంశం..దీపావళి 
శీర్షిక.. దీపావళిగా మార్చుకో
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

ఇళ్ళన్నీ దీప కాంతులతో  
కళ కళ లాడే రోజు
ముంగిళ్ళన్ని వెలుగుపూలతో
విరబూసే రోజు
మోములన్ని నవ్వుల వెలుగుతో
శోభిళ్ళే రోజు
పున్నమి రాత్రిని తలపించే వెలుగు
జిలుగుల రోజు
దీపావళి.. దీపావళి
దీపావళిరోజు

దేదీప్యమైన దీపజ్యోతులకాంతులు
ఒకవైపు
మతాబుల వెలుగుల వన్నెలుచిన్నెలు
రొండొకవైపు 
ఉత్సాహంతో పరవళ్లు త్రొక్కేపిల్లల
సందడి ఒకవైపు
ఆనంద పారవశ్యాలతో నిండిన పెద్దల        
సందడి మరొకవైపు
దీపావళి.. దీపావళి
దీపావళిరోజు

భూచక్రం జీవితమంతా పరిశ్రమించాలని నేర్పితే
తారాజువ్వ ఉన్నత లక్ష్యాలను
చేరూకోవాలని నేర్పితే
కాకరపువ్వొత్తు ఎవరికీ హాని కల్గించవద్దని నేర్పితే
చిచ్చుబుడ్డి మనం జీవించి ఉన్నంత కాలం మన్నన పొందాలని చెపితే
దీపావళి.. దీపావళి..
దీపావళి రోజు

జగమంతా శాంతినిలయం కావాలనుకుంటే
జీవితాలు నిరంతరం ఆనందంగా ఉండాలంటే
ఈ శాత్యానాందాలు కేవలం ఈ ఒక్కరోజుకే పరిమితం కాకూడని
మనమనుకుంటే 
దీపావళి ప్రభోదించే జీవన సూత్రాలను
విలువల పాఠాలను ఆచరించు 
నీజీవితాన్నే ఒక దీపావళిగా
మార్చుకో.....
దీపావళి..దీపావళి 
దీపావళి రోజు 

తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

హామీపత్రం 
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
4
[03/11, 8:00 pm] +91 99373 80136: కావ్యగానం
తేది03112021,బుధవారం
అంశం:దీపావళి
శీర్షిక:దివ్వెలవెలుగులు.
దివ్వెల పండగ దీపావళి
చీకటివెలుగుల పండుగ దీపావళి
అమావాస్య నాడు వచ్చె వెన్నలపండుగ దీపావళి!
ఇంటింటా దీపాల వరుసలు
ఆనందకేళి
వినోదాల హేల
చిరుకాంతులు విరజిమ్మె సంబరాలే!
నరకాసరుని చంపెనట శ్రీకృష్ణసత్యలు
నరులందరు సంతోషకాంతులే నలుదిశలా
నిశిలో నింగినితాకే తారాజువ్వలకాంతులే!
చెడుపై మంచి విజయం
దుష్టసంహారం
దీనులకు దీవెనలొసెగే దివ్యదీపావళి!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు.
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
5
[03/11, 8:01 pm] Aalla Nageshwar Rao Poet: అంశం : దీపావళి  పర్వదినం
కవితా శీర్షిక : " దివ్య  దీపావళి"
చెడుపై  మంచి
సాధించిన  విజయానికి ప్రతీక
దీపావళి  పర్వదిన  వేడుక!
ఆడది  అబల  కాదు
సబల  అని  నిరూపించి
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ  గావించి
ప్రతి పురుషుడి  విజయం  వెనుక
స్త్రీ  పాత్ర  ఉంటుందని  నిరూపించిన  విజయగాదె  దీపావళి!.
శ్రీ కృష్టుడి  సాయంతో
సత్యభామ  ఉగ్రమూర్తియై
దుష్టుడైన  నరకుడ్ని  వధించి
లోకానికి  శాంతిని, క్రాంతి
ప్రసాదించిన  ఓ  స్త్రీ మూర్తి
సాధించిన  విజయవానికి  ప్రతి రూపం
దివ్య దీపావళి  పర్వదినం!
నాడు  ఒక  నరకాసుర  సంహారానికి
ఒక  సత్యభామే  చెప్పింది  జవాబు
మరినేడు.....
గల్లీకో  నరకుడున్న తరుణంలో
ఇంటికో  సత్య భామ  తక్షణ  ఆవశ్యకం!
కాకర పువ్వొత్తులిచ్చే  చిటపటలు
కడిగేయాలి  మనలోని  కులాల  కుళ్ళును
మతాబులిచ్చే  వెలుగులు
మనలోని  మతాల  మూఢతను  తొలిగించి
పూయించాలి  మమతానురాగాల మధురిమలను
చిచ్చు బుడ్లు  ఇచ్చే చెమ్కి రంగులు
నిజజీవితంలో  పూయించాలి
ఆనందపు నవ్వులు
ఇదే  నవ్య  దీపావళి  మనకిచ్చే
దివ్య  సందేశం!
............................................. రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
నాజారు పేట
తెనాలి
గుంటూరు... జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రము
సెల్ నెంబర్ :  7416638823
6
సింగీతం సంతోష్ కుమార్: నేటి అంశం:- దీపావళి

శీర్షిక :- వెలుగుల పండుగ

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ
నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే 
జరుపుకునే పండుగు 
 పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకునే పండుగ
ప్రతీ యేటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపకాంతుల వెల్లువ దీపావళి పండుగ
దీపావళి అంటే దీపముల వరుస
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా  జరుపుకునే పండుగ
చీకటిని తోలుతూవెలుగులు తెచ్చే పండుగ
విజయానికి ప్రతీక
దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు
సంబరంగా జరుపుకొనే
పండుగ
రంగు రంగుల మిరుమిట్లు గొలిపే కాంతుల టపాసుల పండుగ
ఆచారాలు,సంప్రదాయాలతో జరుపుకొనేపండుగ....

____________________________

ఇది నా స్వీయ రచన..

సింగీతం సంతోష్ కుమార్
కామారెడ్డి జిల్లా..
7
[03/11, 8:05 pm] Maddi Pullarao Poet: కవితాగానం(సీజన్ 2)
శీర్షిక:దీపావళి
మద్ది. పుల్లారావు
నందిగామ
3-112021
ప్రక్రియ:ఇష్టపదులు

..............
1)

దీపాల వరుసయే దీపావళి పండుగ 
ఆశ్వయుజ మాసాన అమావాస్య దినము

కృష్ణ, సత్యబామలు కృపతో ద్వాపరాన
నరకుని చెరనుండీ నరులను కాపాడిరి

అవని జనులందరికీ ఆనందమయమాయె
లక్ష్మీ పూజ చేయ లాభించు సర్వులకు

నారాయణ నామమె..నరులకు మోక్షమిచ్చు
రాయుదును యిష్టపది.. రామచంద్రుని దలచి

2)

దుష్ట భావనలన్ని దునిమివేయాలిపుడు
కోటి దీపకాంతుల కొత్త ఆశలు నిండు

చీకటి ని చేధించు చిచ్చుబుడ్ల వెలుగులు
కామితములీడేర్చు కాకరపువ్వొత్తులు

మహిలో ప్రకాశించె...మతాబుల కాంతులూ
భూ చక్రాల వెలుగు...భువిని స్వర్గమొనర్చు

విష్ణుచక్ర కాంతితొ విశ్వం విరాజిల్లు
రాయుదును యిష్టపది.. రామచంద్రుని దలచి

3)

ధ్వనించు టపాసులతొ..దడ పుట్టు దుష్టులకు
హరి హరులకిష్టమగు యద్బుత మాసమైన

కార్తీకానికది ఘనమైన స్వాగతం
సంప్రదాయాలలో శాస్త్రీయతలు గలవు

ధూప ధీపాలతో దోమలన్నియు జచ్చు
ప్రకృతి ధోషములన్ని పటాపంచలగునూ

సర్వజనావళికీ సద్భావనలివ్వుమ
రాయుదును యిష్టపది.. రామచంద్రుని దలచి
....
ఇది నా స్వీయరచన
8
[03/11, 8:16 pm] +91 70755 17538: కవితా గానo
అంశము.దీపావళి
.......
వెలుగుల జిలుగులు పంచేను
అందరికీ ఆనందము పంచేను
నరకాసురుడిని సత్యభామ వధించి
పిల్లలకు పెద్దలకు ఆనందము పంచినది

దీపమాలికల వరుసలతోను
ఇల్లు నందనవనము అయ్యేను
హరిత దీపావళితో ప్రకృతిమాతను కాపాడుము
కాలుష్యరహిత సమాజమును స్థాపించుదాము


 పిండివoటల ఘుమఘుమలుతోను
ఆనందాల హరివిల్లుతోను మది పులకించిపోయెను
ఆకాశాన్ని అంటేటి ఆనందముతో
సకల ఆనందాల లోగిలిలోన
అందరూ ముద్దు ముద్దుగా మురిసిపోయెరు

ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
9.
*కవితా గానం సీజన్ 2*
అంశం: దీపావళి
తేది:03/11/2021
కవి పేరు: నాశబోయిన నరసింహ (నాన)
ఊరు: చిట్యాల,నల్గొండ జిల్లా
చరవాణి:8555010108

🪔🪔🪔🪔🪔♦️🪔🪔🪔🪔🪔

*అసుర ప్రవృత్తికి చరమగీతం*
"""""""""""""""""""'"''"""""""""""""""""
రండి! వరుస క్రమంలో ఒక్కో దీపం వెలిగిద్దాం!!
మదిలో దాగిన ఒక్కొక్క దుర్గుణం దగ్ధం చేద్దాం
దీపం పరబ్రహ్మ తేజోమయ స్వరూపం
దివ్యమైన దీపకాంతి సోకిన మన దేహం
అజ్ఞాన తిమిరం తరిమి జ్ఞానజ్యోతిగా వెలగాలి!

ఆశ్వయుజ చతుర్థశి నరకాసుర సంహారం
అబల సబలని చాటే సత్యభామ సాహాసోపేతం
కష్టాలు తొలగాలని వేడుకునే దివ్య దీపోత్సవం
అధర్మంపై ధర్మపోరాట విజయ పతాక పర్వదినం
ప్రతికూలతని సానుకూల శక్తిగ మార్చే అద్భుతం!

జిలుగు వెలుగుల నవ్య వైభవ అద్భుతకేళి
అఖండ దీపమాల అలంకరించిన గృహావళి
సౌభాగ్యవతులు కేదారీశ్వర వ్రతమాచరించే దినం
శివుడు అర్ధనారీశ్వరుడై అన్యోన్యత చాటిన వైనం
దుఃఖపు ఛాయలు దూరం తరిమే ఆనంద రవళి!

అసుర ప్రవృత్తికి పాడాలి చరమ గీతం
చెడు సమాధి చేసి పరిమళించాలి మానవత్వం 
అవినీతి అరికట్టే జ్ఞాన నేత్రం తెరవాలి
అనుక్షణం అంతర సంస్కార ఉద్దీపన జరగాలి
విశ్వం దేదీప్య శోభాయమానంగా విలసిల్లాలి!
🌀🌀🌀🌀🌀♦️🌀🌀🌀🌀🌀
10.
కవితాగానం సీజన్ @2
అంశం : దీపావళి
శీర్షిక :  మానవతా తోరణాలు

అతివ అబల కాదు సబలగా
సత్యభామ వీర శిరోమణి 
నరకాసురుడిని సంహరించి
జగత్తుకు సుఖసంతోషాలు
ప్రసాదించిన శుభదినముగా 
లోకకళ్యాణ పర్వదినం దీపావళి

అమలిన ఆత్మీయతల అనురాగం 
సునిశిత సౌశీల్య సుగుణాలు
కడలి లాంటి అంతరంగమైనా
నవ్వుపూలు పూయిస్తారు 
ఔదార్యమే ఆభరణముగ
మగువల సంతసపు లోగిళ్ళన్నీ 
దివ్య జ్యోతుల  దీపావళి

ఇలన వెలసిన మాతృమూర్తులుగా 
ఆదిశక్తిగా మానవసృష్టికి మూలమని 
మానవతా దివిటీలు వెలిగించినపుడే 
అన్యాయం అణచివేత అత్యాచారాల్లేని 
సమతా మమతలే దీపాలుగ వెలిగినప్పుడే 
సమాజ నిర్దేశకులకు పర్వదినం దీపావళి 

దార. స్నేహలత
గోదావరిఖని
పెద్దపల్లి

11

[04/11, 8:02 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితా గానం... సీజన్ 2.....ఆధ్వర్యంలో నిర్వహించు కవితల పోటీలు
అంశం :- దీపావళి
శీర్షిక:- ఆనందహేళి.
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
చరవాణి:-9963265762
................................
అజ్ఞాన మనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగును పొందటానికి ప్రతీక.
మనలోని చెడును తొలగించి మంచిని ప్రసాదించే పండుగ.
అమావాస్య రాత్రి నాడు పున్నమి వెలుగులను ప్రసాదించే ఏకైక పండుగ.
చిన్న పెద్ద, పేద గొప్ప అనే తారతమ్యం లేక అందరు ఆనందోత్సాహాలతో జరుపుకొనే దీపావళి సనాతన సంప్రదాయంలో
అత్యంత ముఖ్యమైన పండుగ.
విపత్తులనుంచి, రోగాలబారినుంచి సమాజాన్ని ,ముఖ్యంగా పిల్లల్ని రక్షించమని
"దుబ్బు దుబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి"
అంటూ చెరుకు,లేదా ఆముదపు చివర నువ్వులు దూది కలిపి తెల్లటి గుడ్డలోకట్టి నూనెలో ముంచి వెలిగించి దివ్వెలతో దిష్టి తీయుటచే
రక్షింపబడుతారని అనాదిగా వస్తున్న ఆనవాయితి.
కాకరపువ్వొత్తుల,మతాబుల చిచ్చుబుడ్ల, తారాజువ్వలతో అంబరాన్ని ప్రకాశవంతమైన  కాంతితోనింపి తదుపరి లక్ష్మిదేవికి ఆరాధన చేసే దీపావళి అందరికీ ఆనందహేళి.........!!
.............................
హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత దేనికి అనువాదం కాదు .
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం.
9963265762
.............................
12
[04/11, 8:04 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2 ) 4/11/2021/ గురువారము
అంశం:- " దీపావళి "

సీ!  నరకునిరాజ్యము  నరకముచూపించ
నరులబాధలనన్ని  నరయగాను

తనయునిచేష్టలు  తల్లికిభారమై
మోయలేకభువియు  మోయుచుండె

చెరబట్టియింతుల  చెరసాలనుంచెను
నరకబాధలుతీర్చు  నాధుడెవరు

తనసతిసత్యతో  తరలెనుకృష్ణుడు
నరకునిజంపర  ణావళికిని

ఆ!  నరకుతోడ బోర  నాకృష్ణుడంతట
మూర్చనొందశౌర్య  మంతజూపి
సత్యభామ నారి  సంధించి నరకుని
నేలగూల్చెసత్య  నెంతవింత!

                      ( 2 )
కందము:-  భూమిసుతుడైననరకుడు
భూమికె మోయంగలేని  బరువుగదోచెన్‌
నేమిచలించకయేనా
భూమికినరకాసుచావు  భాగ్యంబాయెన్‌!
                  ( 3 )
కందము:-  నరకుడు మడసిన భూమిని
నరకముదొలగెనని మురసి  నజనులు కడువే
డ్కరమణియముగను పండుగ
జరిపిరిదీపములతోర  ణాలను బెట్టెన్‌!
              తరణికంటి సూర్వలక్ష్మి.
                             ------------
13
[04/11, 8:06 pm] Aparajith: అంశం:దీపావళి 
శీర్షిక: దీపావళి ఎవరికి?

వెలుగుల పందిరిలా జ్యోతుల దివ్వెలు 
కుటుంబ సభ్యులంతా కలిసి ఆహ్లాదంగా జరుపుకునే పండుగ 
మతాబులు పటాసులు వెలుగులు చప్పుళ్లతో చెవులు గింగురుమను 
ఇంటిల్లిపాదీ తీపి వంటకాల రుచులతో ఆనందాల హరివిల్లు!
పేదవాడి గుడిసెలో గుడ్డిదీపం ముందు 
ఆకలిగొన్న పిల్లల పలవరింతలు!
కష్టజీవి శ్రమల మూగ కళ్ళలో 
మలిగిపోయిన దీపాల కారుచీకట్లు!
తిమిరం పై వెలుగుల విజయం దీపావళి!
తలతిరిగిన శ్రీమంతులకు దీపావళి దేదీప్యమాన సంబరాలు 
మధ్యతరగతి జీవితాలకు పండుగ కావడి మోతే!
కంటక రాక్షసుని సంహరించిన దినం దీపావళి 
నేడు ప్రజాసేవ పేరుతో కోట్లకు కోట్లు దోచుకునే దగుల్బాజీల 
మస్తక ఛేదము చేసే వాళ్లేరీ!?!
జనానికి మందు మాంసానికి మంచిరోజు దీపావళి 
పిల్లలు కాల్చే టపాసులు పేదింటి యజమానికి చింతనిప్పులు!
మదినిండా కోరి తెచ్చుకున్న ఆనందం ఇల్లాలికి!!

అపరాజిత్ 

పేరు:యం.అపరాజిత్ రెడ్డి 
సూర్యాపేట 
చరవాణి:9848532031

హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
14
[04/11, 8:31 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్2).       4--11--2021.
పిన్నక నాగేశ్వరరావు.         

శీర్షిక :-- దీపావళి.

1. తే.గీ.
వరము పొందిన నరకుడు గర్వమ్ము తోడ
మునులు,మహిళలు,సురలను మూర్ఖమతిని 
పట్టి బంధించి హింసలు పెట్టుచుండ
వేడె వారంత  హరిని కాపాడమనుచు. 

2. తే.గీ.
అభయమిచ్చి వారిని సాగనంపి హరియు
ననికి సిద్ధపడ సతి 'సత్య' యును తాను
వచ్చెదనన, సమ్మతిఁ దెల్ప భవితెఱింగి 
కృష్ణ ,సత్య లు రణభూమి కేగిరపుడు.

3. తే.గీ.
పోరు సల్పుచు మూర్ఛిల శౌరి యంత
సత్య గమనించి స్థితిని తక్షణమె తాను
విల్లు, శరములను గొని యా వీరనారి 
శౌర్యమును జూపి నరకుని సంహరించె. 

4. తే.గీ.
దుష్టుడైనట్టి నరకుని దునిమినట్టి 
దినము నందున ప్రజలెల్ల తిమిరమింక 
తొలగె ననుచును ప్రతియింట తోషముగను
దీపముల వెలిగించ దేదీప్యముగను 
నదియె దీపావళీ పర్వమయ్యె నేడు.
**************************************
15
[04/11, 8:34 pm] Siimhadri Vani Poetess: కవితా గానం (సీజన్--2)
అంశం:--దీపావళి
గజల్
రచన:--సింహాద్రి వాణి

అనునిత్యం కురిపిస్తే నవ్వులనూ దీపావళె
చెరిపి వేస్తె కులమతాల దూరాలను దీపావళె

నిర్మలంగా మనసుంటే పొంగిపొరలు ఆనందం
వెలిగిస్తే అనురాగపు దీపాలను దీపావళె

విశ్వమంతా శుభాలనే కాంక్షించుము యెల్లపుడూ
అదుపులోన వుంచుకుంటె కోరికలను దీపావళె

చెడ్డ పైన పోరాటం చేసుకుంటు సాగాలీ
మూసివేస్తె దుర్మార్గపు దారులనూ దీపావళె

పొందికైన మాటవుంటె తగాదాలు పెరుగవులే
పెంచుకుంటె మంచిమంచి భావాలను దీపావళె

మనసు పూల పరిమళాలు మరీమరీ కురవాలీ
ఆందుకుంటె పెద్దవాళ్ళ దీవెనలను దీపావళె

వాణి మనసు కోరుతోంది ఇంటింటా దీపావళి
కాలిస్తే ద్వేషభావ పటాసులను దీపావళె
16
[04/11, 8:41 pm] మన్నె లలిత గారు కవయిత్రి: కవితాగానం సీజన్ -2
 అంశం :దీపావళి  
శీర్షిక :సంఘాసురుల అంతం
తేదీ :4 /11 /21
 పేరు :మన్నె లలిత 
ఊరు :హైదరాబాద్  
చరవాణి సంఖ్య: 7416 86 32 89
********************************
 ఆశ్వయుజ చతుర్దశి
  స్త్రీ  శక్తి సాహసం 
 'సత్య 'చేసింది  నరకాసుర సంహారం
 తొలగించారు   అసుర తిమిరాన్ని 
 వెలిగించారు  దివ్య దీపాలు
ఈనాడు కావాలి  స్ఫూర్తి నాటిసాహసం

 శివ ,రామ ,నరకాసుర కథలు వినాలి 
ఇస్తున్న సంకేతాలు
 పెరిగిన సంఘ సురులు చేస్తున్నారు సాంకేతికాలు చూస్తున్నారు ప్రేక్షకులు 
ఎంత కాలమే వినాశనం 
ఇంకెంతకాలం చేతగానితనం
 చేయండి సంఘాసురుల అంతం 
వెలిగించండి  దీప ఆవళులు
 తొలగించండి సంఘాసుర తిమిరాన్ని
 వెలిగించండి ఆనందజ్యోతులు.
17.
[04/11, 8:12 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం (సీజన్ -2)
అంశం : దీపావళి
శీర్షిక :  "వెలుగుల పండుగ"  
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

అమావాస్య చీకట్లను పారద్రోలుతూ
మనందరి జీవితాల్లో వెలుగుల్ని చైతన్యాలని తెచ్చే పండుగ దీపావళి !
లోక కంటకుడైన నరకాసురుడనే రాక్షసుడు
అధర్మ కృత్యాలు ఎన్నో చేస్తూ ప్రజలను పీడిస్తుంటే
శ్రీకృష్ణ సమేతమైన సత్యభామ నరకాసుడ్ని వధించి
లోకానికి శాంతి ని సౌఖ్యాన్ని ప్రసాధించిన శుభతరుణం దీపావళి !
సీతాపహరణం గావించిన దశకంఠుడ్ని సంహరించి
శ్రీరాముడు అర్ధాంగి తో అయోధ్యలో అడుగిడిన శుభసమయం సూచికగా
మనమంతా సంబురంగా జరుపుకునే ఆనందాల వేడుక దీపావళి !
జగతికి సిరిసంపదలని వరుములల్లే గుప్పించే
లక్ష్మీదేవిని స్తుతిస్తూ జనులదరూ ఇష్టంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి ! 
ప్రతి ఇల్లు దీపాల కాంతులతో  విరాజిల్లుతుంటే
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ
వెలుగుదివ్వెల మెరుపుల నడుమ మనమంతా జరుపుకునే 
అనురాగం ఆత్మీయతల కలయికల వేడుక దీపావళి !  

"వెలుగుల పండుగ"  అను కవిత నా స్వంత రచన్ అని హామీ ఇస్తున్నాను.
 - గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
18
[04/11, 8:54 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2
అంశం::దీపావళి
తేదీ::4.11.21..గురువారం
శీర్షిక::అంతరార్థం

నరకాసురులుండే
ఈ నరలోకంలో
తల్లులందరు సత్యభామలే
భూమాత ప్రతిరూపాలే
ఆడపిల్ల పుడితే అరిష్టమని
అన్నిటికి నష్టమని
పదితోనే చదువు నిలిపేయమని 
ఇంట్లో పని చేసుకోమని
చూసుకోమని
ఆంక్షలు షరతులు
విధిస్తారు ఎందుకని?
ఆడపిల్లలు బలహీనులు కారని
అంతరంగమున ఎంతో బలమున్నవారని 
సమస్యలనన్ని పరిష్కరించే
సత్తువ జ్ఞానము కలవారని
చదివిస్తే ఎంతదాకైనా పోగలరని 
ఏదైనా సాదించగలరని
నమ్మకం ఉండాలని
తెలిపేదే దీపావళి
మతాబులతో మతాలు కాలి పోవాలని
కాకరొత్తులతో కులాలు కూలిపోవాలని
లక్ష్మి బాంబులతో లక్ష్మీదేవి రావాలని
చిచ్చుబుడ్లతో చిల్లర పనులు
మానుకోవాలని
సీమ టపాకాయలతో సీమలు
బాగుపడాలని
రాకెట్లతో దేశము అంతరిక్ష
విజయాలతో దూసుకుపోవాలని
విష్ణు చక్రాలతో విశ్వ0లోని
కరోనా భయపడి పారిపోవాలని
పాము బిళ్ళ బుసలతో
ప్యాక్షనిజం అంతరించాలని
భూచక్రాలతో భూకబ్జాలు
లేకుండాపోవాలని
దీపావళి పటాసులలోని పరమార్థం తెలుసుకోవాలని
దీపావళి అంతరార్థం!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.       8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
19
[04/11, 8:56 pm] Balloori Umadevi Poetess: కవితా గానం సీజన్:2
అంశం: దీపావళి
తేది :4/11/21
డా బల్లూరి ఉమాదేవి
కామవరం/ఆదోని
చరవాణి:9493846984
శీర్షిక:దీపకాంతులు

కనరండి కనరండి దీపావళి ధగధగల
నిశి రేయిన వెలిగేటి స్వచ్ఛదీప కాంతుల
దుష్టులను శిక్షించగ అలనాడా కృష్ణుడు
సాగాడు సతితోడ భూదేవి సుతు నణచ
అర్ధాంగికి అసలు అర్థ మొసగునట్టులాసత్య
పతిని కూడి సారించె నారిని యలవోకగ
శరము తాకగానె సమరంలో కూలాడా నరకుడు
నాటినుండె మొదలైంది రంగుల దీపావళీ
ఇలలోని దేవతలు భువిలోనిమానవులు
పొందారు ఆనందం జరిపేరు సంబరం
ఇంటవెింటా వెలుగులే వూరంతా కాంతులే
రంగులీను కాంతులతో జరుపుదాం పండుగను
పండుగను విజయవంత మొనరించగ
వినిపిద్దాం కవితలను మురిపిద్దాం శ్రోతలను
శుభమైన తరుణమిది మించపోవ దొరకనిది
కవితా శంఖం పూరించగ త్వరితగతిన 
 తరలిరండు కదలి రండు .
20.
కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మణిహారం

అంశం: దీపావళి

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు

  దేదీప్యమానం ఎక్కడ

కరోనా కాటేసిన కరువులో వచ్చింది దీపావళి!

వరుస దీపాలు వెలిగి
వైవిధ్యమైన అంధకారాలని  తొలగిస్తుందని సంప్రదాయం

ఉవ్వెత్తున ఎగసి పడే
అంతరిక్షంలోకి క్షిపణి
అధిక ధరల పోటుకి
నేల మీద ఒరిగింది
మధ్య తరగతి కుటుంబం!

ఇంధనం ధర పెంపుతో సైలెన్సర్ తీసిన ఢమ ఢమ మోగుతుంది జనం జనం!

మతాబులా వెలిగి పోతున్న ఆశాకిరణం
పేద కుటుంబాలు
చేసుకోని పండుగ సంబరం!

కాకర వత్తులు వెలుగు చూడని పిల్లలకు కొనలేని ధరలకు అమ్మకం!

ఎక్కడని దీపావళి
ఏటా జరిగే సంబురం
బాణాసంచా లక్ష్మి బాంబుల కంటే ధరల సూచి బెంబేలెత్తి పోతుంది!

దీపావళి దేదీప్య మానం కానరాలేదేమి?
****
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
21.
ఇది వీరా గుడిపల్లి కవిత
దీపావళి
04/11/2021
***********************
రామ విజయమో
రావణ పతనమో కాదు

హనుమ గెలుపో
రాకాసి ఓటమో కాదు 

సత్య విజయమో
కృష్ణ గాథనో కాదు దీపావళి

నీ కుటుంబానికి
 యేదైనా మేలు జరిగిందా
నీ దేశానికి 
యేదైనా లాభం జరిగిందా

పొరుగింటి లో
 నవ్వులు వినబడుతున్నాయా

బడిలో 
అంతా పాసయ్యారా
మీ ఊరి గుడిలో
 అందరూ దైవ దర్శనం చేసుకో గలుగుతున్నారా
............
నిన్ను నీవు 
నిజాయితీగా ప్రేమిస్తున్నావా

అమ్మ నవ్వుతుందా
నాన్న నీ దగ్గరే ఉన్నాడా
చెల్లి.... 
అన్నయ్యా అని పలకరిస్తుందా
తమ్ముడప్పుడప్పుడు కలుస్తున్నాడా
కనీసం మాట్లాడుతున్నాడా

కనబడగానే నవ్వుతూ మీ ఆవిడ ను పలకరించావా

నీవు కనబడగానే
నాన్నొచ్చాడని పిల్లలు అరిచారా

ఒక్క రోజు సెలవు బెడితే
నిన్న ఎందుకు రాలేదని పిల్లలడిగారా

సెలవు పెట్టాల్సి వస్తే
మనసు విలవిలలాడిందా


..... దీపావళి వచ్చిందని తెలిపే
సంకేతాలెన్నని.. 

అందరికీ ఒకే రోజు దీపావళి
రాదు నేస్తం

ప్రతీ ఇంట్లో దీపావళి రావాలని 
మనసారా కోరుకుంటూ......
****************
..... *వీరా గుడిపల్లి*

22.

Dear all best batch
నా దీపావళి కవిత ను నచ్చి మెచ్చి
హిందీ లోకి అనువదించారు
శ్రీ మైలారం సత్యం గారు

మీతో పంచుకోవాలని అనిపించింది
******
****************

*दीपावली*
                        दि. 04-11-2021.
सत्तय्या मैलारम (सत्यम) 


राम का विजय
रावण का अपजय नहीं

हनुमा का जीत
राक्षसों के संहार नहीं

सत्या की वीरनारित्व
श्रीकृष्ण का गाथा नहीं
..... दीपावली

समाज में सहीं
परिवर्तन आया क्या
अपने परिवार को
भलाई कुछ हुआ क्या

अडोस पडोसी
हँसी खूशियाँ बांट रहें क्या

पाठशालाओं में परिवर्तन कुछ आया नहीं
गांव के किसान फसलों के पर्व मनारें क्या

अपने मन में
प्यार की कलियाँ
खिल रहें हैं क्या

माँ की ममता हँसती है क्या
बाप अपने पास ही है क्या
बहनें...
भाईचारा से राखी बांधती हैं
 क्या
भाई लोग मिलजुल कर
बातचीत करते हैं क्या

घरवाली की मुस्कान क्या
आपको आनंद दिलाती क्या

बच्चे अपने हाथ फैलाकर
बापू❗कह कर पुकारते हैं क्या

छुट्टी लगाया तो आप
छात्र कहेंगे क्या
सर❗कल कहाँ थे
छुट्टी लगाना होतो
मन पूछे जरूरी है क्या

..... दीपावली का संकेत
कितनी बातों में है.......

मित्रों❗
सबको एक ही दिन
आता नहीं दीपावली
हरदिन हरमन आना है 
दीपावली।
23.
దీపావళి

వెలుగుపువ్వులు రువ్వుతూ....
మరుక్షణంలో మరుగవుతున్న 
దివ్వెలు...
తారాజువ్వలు
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి 

మనినంత కాలం 
మమతలను పంచుతూ
మన అన్న తలపులతో 
మన్ననలు తెలుపుతూ 
మది మదిని గెలుచుకొమ్మని 

పసిడి దివ్వెల వరుసలమిసిమి 
పదే పదే చెప్తున్నాయి 
పసి హృదయాలలో 
సమైక్య భావనను నింపమని 
 
తామసిలో కురిసే నవ్వుల వాన
తరతరాలుగా చెప్తుంది 
వీధుల్లో వెలుగులు నింపడమే కాదు 
గుండె గుండెల్లో ఆత్మీయదీపాలు
వెలిగిస్తూ....
సంతసపు చిహ్నాలుగా
హృదంతరాళలో 
నిలిచి పొమ్మని

నిండు పున్నమికి
నిజమైన నిదర్శనమై 
వికాసాన్ని దర్శింపజేసే
దివ్య దీపావళియై 

**********శివునూరి లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧