నేనెవరు ??2021
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
********************
కవివరుల జాబితా
1.అపరాజిత్ గారు
2.కోరాడ గారు
3.తిప్పావఝల నరసింహా మూర్తి గారు
4.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
5.తాతపూడి సొమశేఖర శర్మ గారు
6.జోషి పద్మావతి గారు
7. కవిత వెంకటేశ్వర్లు గారు
8.బి.నాగేశ్వర రావు గారు
9.వాణి సరోజిని లక్కరాజు గారు
10. సింహాద్రి వాణి గారు
11. సునంద వురిమళ్ళ గారు
12. గొర్రె పాటి శ్రీను గారు
13.ధనాశి ఉషారాణి గారు
14.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
15.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
16.డా.నాయకంటి నరసింహ శర్మ గారు
17.దారల విజయ కుమారి గారు
18.దార స్నేహ లత గారు
19.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
20.ఏడెల్లి రాములు గారు
21.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
22.తరణికంటి సూర్య లక్ష్మి గారు
23.మహేందర్ జవ్వాజి గారు
24.పిన్నక నాగేశ్వరరావు గారు
25.జక్కిడి వెంకట రెడ్డి గారు
***************
1.
❇️❇️❇️❇️❇️❇️
కవితాగానం సమూహం
09.11.2021
నేటి అంశం
నేనెవరు??
అంశానికి కవితలు
రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నరవరకు
పంపగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1
[09/11, 8:06 pm] Aparajith:
నేనెవరు??
అవును నేనెవరు?
నా శరీరమా నేను?
నా హృదయమా నేను?
నా మనస్సా నేను?
మరి నేనెవరు?
రివ్వున ఎగిసే ఆలోచనలు
మనిషిని మనిషి గా
బ్రతకకుండా చేస్తున్నాయి!
మనిషివన్న జ్ఞానం ఉందా అసలు?
ముప్పూటలా మేయటమేనా జీవితం?
అడవి పూచిన పూచిన పూవులావిరిసి రాలిపోతే
నీవన్నవాడు ఒకడున్నాడని ఎలా తెలుస్తుంది?
నేనైనా నీవైనా ఆకాశంలొ ఎగిరే పక్షుల్లా
జీవితంలో అలవిగాని ఆనందం అనుభవించాలి
నేనెవరు? అంటే
నన్ను నేను ఆవిష్కరించు కోవడమా?
లోకులు చెప్పే కాకి కబుర్లా నేను?
గతం తాలూకు పరుచుకున్న చీకట్లా
నేను?
నన్ను నన్నుగా చూడని లోకాన్ని
ఏమంటే ఏముందిలే?అని సరిపెట్టుకోవాలా
ఇంతకు నేనెవరు?
ఈదులాడే కష్టాల బ్రతుకుకు
చదువుకున్న అక్షరాలు నేర్పించవాయె
నేనెవరని
జీవితానుభవాలేవీ నన్ను నేనుగా బ్రతకనీయవాయె
స్నేహితులు,కుటుంబ సభ్యులు నన్ను వాడుకోవడమే గాని
నేనెవరో తెలియకుండా నిలువెళ్లా
తమ పేర్లు లిఖించుకున్నారు
నేను అనబడే వాడి ఆనవాళ్ళు కూడా లేవు
ఒకవేళ నీకు తెలుసా నేనెవరో???
అపరాజిత్
సూర్యాపేట
2
[09/11, 8:08 pm] Korada: కవితాగానం :-
నేనెవరు... ??
కోరాడ నరసింహా రావు... !
@ తెలుసుకుంటే..... !!@
*****************
నా ఇల్లు.... నా భూమి.... !
అలాగే...., నాకన్ను, నాకా లు
నాచెవి... నాముక్కు...
ఇవన్నీ నావే... గానీ ఇవేవీ "నేను" కాను కదా... !! ఆఖరికి నేను... నేను అనుకుంటున్న...
ఈ దేహం కూడా నేనుకానుగా !
ఈ 'నేనే 'వత్తి భ్రమైతే ఇంక ఈ ప్రపంచంలో "నాది "ఏముంటుంది.... !?
నీవేదాన్తమింక కట్టిపెట్టవోయి
మిత్రమా... !
నేను అంటే.... ఈ సృష్టి సమస్తంలో ఉన్న చైతన్యశక్తోయి.... !
* నేను * అంటే... పరిధులు లేనిది... పరిమితులకు కట్టుబడనిది... ఇక్కడ... నేను
నీవు,తాను, అది...అన్నీ,అంతా... ఏకమనేకమైనమహా సాగర కెరటాల్లో... నీటిబిందువులు
మాత్రమే.... !
నీకోరికలు,ఆశలు, ఆశయాలు
తీర్చుకుందుకు... ఈ అద్దెకొంప దేహానికొచ్చావ్... !
ఈ కొంప ఖాళీ చెయ్యవలసి
వచ్చినపుడు... నువ్వు సంపాదించినవన్నీ మూటగట్టు కు....మరో కొంపకు... !!
కర్మల మూలంగా... జన్మలు !
జన్మల వలన... కర్మలు... !!
నేను... నేననుకుంటున్న ఈ నేను అసలు" నేను "కానే కానని...ఈ నేను వట్టిభ్రమేనని
నన్ను నేను తెలుసుకుంటే...
ఈ యాతనలే ఉండవు కదా !
****************
....... కోరాడ.
3
[09/11, 8:09 pm]
Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం
9-11-2021
అంశం: నేనెవరు?
శీర్షిక:సాటి మనిషిని
అవినీతి తాండవం చేస్తుంటే అడగేదానికి నేనెవరు?
అరాచకం కరాళనృత్యం చేస్తుంటే అడిగే దానికి నేనెవరు?
రౌడీలు రాజ్యమేలుతుంటే అడిగేదానికి నేనెవరు?
మహిళలపై అరాచకాలు జరుగుతుంటే ప్రశ్నించేదానికి నేనెవరు?
సాటి మనుషులు పస్తులుంటుంటే భాదపడేదానికి నేనెవరు?
ధరలు చుక్కలంటుతుంటే అడిగేదానికి నేనెవరు?
రాజకీయాలు కంపుకొడుతుంటే నాకేమి?
సాటి మనిషి ప్రమాదంలో పడుంటే వాహనాన్ని పిలవడానికి నేనెవరు?
అని అందరం అనుకొంటే వీటికి ఉండనే ఉండదు అంతం.మనముందు జరిగే అన్యాయాలను ఎదుర్కొందాం
అవినీతి పరుల భరతంపడదాం
ఆపదాలలో ఉన్నోళ్శను ఆదుకొందదాం
ప్రకృతి వైపరీత్యాలొస్తే మనవంతు సాయం చేద్దాం
నీతి పరులనే అందలమెక్కిద్దాం
అపుడే నేనెవరు అనేదానికి లభిస్తుంది సమాధానం.
నేను భాధ్యతగల పౌరుణ్ణి,మానవత్వమున్న మనిషినని
4
[09/11, 8:19 pm] +91 99373 80136:
కావ్యాగానం
తేది09112021,మంగళవారం
అంశం:నేనెవరు??
నేనెవరూ?నాకు నేనే వేసుకొనే ప్రశ్న
నాకే తెలియదు నేనెవరినో?
ఆకారంలో మానవరూపం
మనుగడ సామాన్యజీవనం
పెకెదగకలేక
క్రిందకు దిగజారలేక
త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడుతున్నాను
నాకు నేనే ఒక ప్రశ్నలా
నాకు నేనే సమస్యలా
నాకు నేనే మరమనిషిలా
ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను
నన్నెవరూ గుర్తించరు
నన్నెవరు ప్రశ్నించరు
నన్నెవరు ప్రశంసించరు
నన్ను చేరదీసేవారు లేరు
నన్ను చేరుకొనేవారు లేరు
నేనొక శేషప్రశ్నలా మిగిలిపోయాను
ఇంతకి నేనెవరు???
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా.
చరవాణి7780594995.
5.
[09/11, 8:35 pm] Thathapudi Somashekara Sharma: కవితా గానం
అంశం.. నేనెవరు??
శీర్షిక..నేనంటే నేనే
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336
నేనంటే నేనే
నా మాటంటే నాదే
ఆలోచించి మాట్లాడుతాను
అర్ధం చేసుకుని చెపుతాను
ఎవరి మనసు నొప్పించను
ఎవరి మనసు బాధ పెట్టను
నేనెవరిని?? చెడ్డవాణ్ణికాదు
నేనంటే నేనే.. నా మాటంటే మాటే
పేదలకు సాయం చేస్తాను
పెద్దవారినందరిని గౌరవిస్తాను
విద్యార్థులకు విద్యాదానంచేస్తాను
తోటి వారందరను ఆదుకుంటాను
గ్రామస్టులతో మర్యాదగా వ్యవహరిస్తాను
నేనెవరని?? మర్యాద గలవాణ్ణి
నేనంటే నేనే.. నా మాటంటే మాటే
గ్రామభివృద్ధికై పాటుపడతాను
అభివృద్ధికార్యక్రమాలు చేస్తాను
అందరిని నిరక్షరాస్యులుగాచేస్తాను
వైద్యసదుపాయాలకోసం కంకణం కడతాను
రైతుల సమస్యలకోసం పోరాటంచేస్తాను
సేవే నా దృక్పధం.. సేవే నా ధ్యేయం
నేనెవరిని?? సేవా తత్పరుణ్ణి
నేనంటే నేనే.. నా మాటంటే మాటే
సాటిమనిషి సౌఖ్యానికి సాయపడతాను
నా ఊరు అభివృద్ధికి పాటుపడతాను
నా దేశాన్ని గౌరవముతో ప్రేమిస్తాను
సర్వమత సౌభాతృత్వాన్ని నెలకొల్పు తాను
నేనెవరని అని ఏనాడూ అనుకోను
నేనంటే నేనే.. నామాటంటేనాదేనంటూ
ధైర్యంగా సమస్యల వలయాన్ని చేధి స్తాను
దయతో కరుణతో సగర్వంగా మంచినే చేస్తాను.. చెడుకు దూరంగావుంటూ
జీవితాన్ని స్వర్గం ధన్యం చేసుకుంటాను
హామీ పత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
6
[09/11, 8:41 pm] +91 95420 10502: కవితాగానం సీజన్ 2
అంశం: నేనెవరు
తేదీ: నవంబర్ 09 2021
రచన :జోషి పద్మావతి
మహబూబ్నగర్
శీర్షిక:తెలియగలేరా!
*****************
గాలిలో గాలినై అశరీరిగా ఉంటూ
నీటిలో నెలవైవుంటూ.....
జీవుల దాహార్తిని తీరుస్తూ,
భూ నభోంతరాళాల యందు నిగూఢమై
వ్యవహారములన్నీ యెరిగి ,
ఆపదలందు కాపాడినా,
అణకువ లేని వారిని అగుపడకచేసినా.......,
కలహాలను కలిగించినా,
ప్రళయాలను సృష్టించినా,
ఆత్మీయాను రాగాలను పంచుతూ ఆదమరచేలా చేసినా
నమ్మిన వారిని నట్టేట
ముంచే నైజం లేని
దూషణ తిరస్కారములను
సైతం స్వీకరించి
శ్రేయోభిలాషియై శ్రేయస్సునిచ్చేది
ఎవరో యెరుగరా!
_______
హామీ పత్రం :ఈ కవిత నా స్వీయ రచన
7.
[[09/11, 8:55 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2
అంశం:: నే నెవరు?
శీర్షిక :: ఇంతకీ నే నెవరు?
అవును నే నెవరు
నా వారెవరు
నా భార్య పిల్లలెవరు
నా బంధుమిత్రులెవరు
వీరంతా నా వెంట వచ్చేవారా
కలిసిన వారంతా వస్తారా
తెలిసిన వారంతా విచ్చేస్తారా
నేనంటే నా శరీర భాగాలా
ఈ శరీరం నాదా
ఈ ఇల్లు నాదా
ఆస్తి పాస్తులు నావా
ధనం దస్కమ్ నావా
ఏవీ నావి కావని తెలుసు
ఏవీ నా వెంట రావని తెలుసు
నేనెవరో నాలో ఉన్నదేవరో
అన్ని తెలిసి మాయలో పడతాను
సంసారంతో సమస్యల వలలో
చిక్కుకుంటాను
ఎందుకొచ్చానో
ఏ పనికోసం వచ్చానో
అన్ని మరచి పోయాను
తామరాకుపై నీటి బొట్టులా
ఉండాలి
తాపసిలా జీవించాలి
సమానత్వం కలిగివుండాలి
సంతోషంగా జీవించాలి
భక్తి భావం కలిగివుండాలి
సతతం సర్వదా సదా
దైవ నామ స్మరణ చేయాలి
అప్పుడు 'నేను' తెలుసుకోవాలి
నేను వెళ్ళిపోతే
నేనే జీవుడు నేనే దేవుడు!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
పై కవిత నా స్వీయ రచన అని హామీ
8
[09/11, 9:02 pm] +91 88015 26321: కవితా గానం సీజన్ (2)
తేది:09/11/2021
అంశం: నేనెవరు?
శీర్షిక: విజ్ఞత
రచన:బి నాగేశ్వరరావు
ఊరు: వైజాగ్
చరవాణి:8801526321
నేనెవరు?
ఏ అమ్మ నిలబెట్టిన బొమ్మను?
ఏ తండ్రి అంటుకట్టిన కొమ్మను?
వారి ఆశల ఫలాలందిస్తున్నానా?
దురదగొండిలా ఎదుగుతున్నానా?
బతుకుదారిలో ముళ్ళ కంచైమొలుస్తున్నానా?
ప్రశ్నించుకుంటే ప్రయోజనకర, సంతృప్తి కర
సమాధానం పొందగలిగినపుడే ఆ జన్మసార్ధకమౌతుంది!
ఎవరు నేను?
మొక్కనా,మోడునా,విశాలమైన వృక్షాన్నా?
నా రెక్కల కింద ఎన్ని మొక్కలు మొలిచాయి,?
ఎన్నిటిని రక్షించాను ఎన్నిటిని భక్షించాను?
ఎన్ని ఎదిగి ఎన్ని అమృత ఫలాలందిస్తున్నాయి?
సమీక్షించుకుంటే సత్ఫలితాలు ఎక్కువవుంటే
ఆ బ్రతుకు ఫలప్రదమౌతుంది ఆదర్శనీయ మౌతుంది!
ప్రశ్నే ప్రగతికి తొలిమెట్టు!
గమ్యానికి,గవాక్షనికి,గమన మార్గాలు కి ఆయువుపట్టు
తమని తాము ప్రశ్నించుకున్నవారెందరో మహత్ములైనారు!
మార్గదర్శకులైనారు దైవాలుగా కొలువబడుతున్నారు!
అవలోకనం అంతర్మధనాలకు దిక్సూచి ప్రశ్న
నేనెవర నే ప్రశ్నకు జవాబు వెదకడం లోనే దివ్యనేత్రం
తెరుచుకుని బ్రతుకు లక్ష్యం ద్యోతకమవుతుంది!
జీవన పయనం సాగుతుంది.విజ్ఞత దాన్నినడిపిస్తుంది!
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
బి నాగేశ్వరరావు
9
[09/11, 9:03 pm] వాణి సరోజిని లక్కరాజు Poetess Vijaywada: కవితా గానం సీజన్ 2
9-11-21 మంగళవారం
అంశం నేను నేనుగా నేవుంట
రచన. వాణి సరోజిని లక్కరాజు
విజయవాడ.
నేను నేనుగాననే వుంట
అర్ధం లేని ఆలోచనలు
అంతులేని ఆశలకు
ఆమడ దూరంలో వుంట.
వున్నంతలో తృప్తి చెందుతూ.
బాధ్యత లను బరువనుకోకుండ
నీతి నిజాయితీ తోని బధ్ధతగల
జీవన యాత్ర చేయటమే నాధ్యేయం
నిత్యసంతోషిగా నిర్మల హృదయంతో
హెచ్చు లు ఆర్భాటాలకు పోకుండా
ఒకరిని నొప్పించక నే నొవ్వక
సత్యమేవ జయతే అనే సూక్తిని
మనస్పూర్తిగా నమ్మి
మనుగడ సాగించటమే నాధ్యేయం.
10.
[కవితా గానం
అంశం:-- నేనెవరు?
శీర్షిక:--నేనెవరిని?
జీవరాసులన్నిటికీ నేను నేస్తాన్ని
కొండలూ గుట్టలూ నదీనదాలకు తప్ప
చివరకు సూర్యచంద్రులకు నక్షత్రాలకూ కూడా నేను నేస్తాన్నే
కాకుంటే చంద్రునికీ, నక్షత్రాలకు
ఇక్కడో ప్రత్యేకత
అన్ని జీవరాసులకూ సూర్యునికీ రాత్రివేళ నేస్తాన్నైతే
నక్షత్రాలకూ చంద్రునికీ మాత్రం
పగటి పూట వేస్తాన్ని
మనసు ప్రశాంతంగా లేని వాళ్ళకూ
మోసపూరితమైన ఆలోచనలు మదినిండా వున్న వాళ్ళకు
ఎదుటి వారి సొమ్మును దోచాలనుకునే వాళ్ళకు
ద్రోహ చింతన కలవాళ్ళకూ
నేను దూరంగా వుంటాను
అది వారి స్వయంకృతాపరాధం
మంచి ఆలోచనలున్న వాళ్ళకు
శారీరక కష్టం చేసే వాళ్ళకు
నేను ప్రశాంతత నిస్తాను
మనసుదీరా ఆదరించి మైమరపింప చేస్తాను
వారు పెట్టుకున్న సెలవు చీటీని ఆమోదిస్తూ
తేనె సంతకం చేసి
అలసిన శరీరాలకు, మనసుకు సేదదీర్చి
జీవన గమనంలో, నూతనోత్సాహంతో ముందుకు నడిచేలా చేసే మాంచి నేస్తాన్ని నేను
కొందరు సోమరిపోతులూ, బద్ధకస్తులూ
రాత్రితో పాటు పగలు కూడా నాతో స్నేహాన్ని కోరుకుంటారు
ఒక్కోసారి యిష్టం లేకున్నా సంతకం చెయ్యాలి
తప్పదుగా మరి
గుర్తించారా నన్ను?
మీ అందరి నేస్తాన్ని
నేను " నిద్ర " ని
రచన:--సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872నాధ్యేయం.
11.
[09/11, 9:29 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:09-11-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: నేనెవరు?
******************
నేనెవరు?
నాకంటూ కనిపించే దేహాన్నా?
కనిపించని మానసాన్నా?
అమ్మా నాన్నల అనురాగ సంగమాన్నా?
వారి ఆశలకు ప్రతి రూపాన్నా?
ఇంతకూ నేనెవరు?
ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ దేనికోసం
ఏ కర్మ ఫలం అనుభవించేందుకు..?
పుట్టలోని చెదను గాకుండా
గట్టు మీద చెట్టులా బతకాలని ఉంది
పశు పక్షాదులకు ఆశ్రయమిచ్చే
విశాల హృదయాన్ని కావాలని ఉంది..
నేనెవరో తెలిసినా తెలియకపోయినా
భూమిపై జన్మించినందుకు
తల్లి ఋణం తీర్చుకోవాలని ఉంది..
విశ్వ జనీన ప్రేమతో మనుగడ సాగించాలని ఉంది!
అందుకే తరచి తరచి నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా ..
నేనెవరిని! అంతులేని
ఈ ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ వెళుతున్నా...
*వురిమళ్ల సునంద ఖమ్మం*
12
[09/11, 9:29 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం (సీజన్ -2)
అంశం : "నేనెవరు?"
శీర్షిక : "ఫ్రశ్న!?"
రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
నింగిలో తేలుతున్న మబ్బుల మాటున దాగిన వాన చినుకు
చల్లని చిరుగాలి స్పర్శకి కరిగి నేలతల్లిని ముద్దాడుతూ..
చినుకు అడిగింది.. నేనెవరినని !?
నేను నేలతల్లి బిడ్డనా !? మేఘాల చెలికత్తెనా !?
సాయంత్ర సంధ్య వేళ తమ గూటికి పయనమవుతూ పక్షులు
తనకు ..పగలంటే శ్రమించే సమయమని
రాత్రంటే నిదురించే సమయమని నిర్ణయించుకుంటూ సృష్టి ధర్మాన్ని పాటిస్తుంటే..
కాలం ప్రశ్నిస్తుంది..నేనెవరినని !?
శ్రమించే కాలంగా పక్షులకి నేస్తాన్నా!? నిదురించే కాలంగా పక్షులకి స్వంతాన్నా !?
కులాలు మతాలు అంటూ
మనుష్యులు గొడవలు పడుతూ ఒకరికి ఒకరు శత్రువులుగా మారి
పలు వర్గాలు , కూటములుగా ఏర్పడుతూ అశాంతితో జీవనం సాగిస్తుంటే..
మానవత్వం అడుగుతుంది..నవ్య సమాజాన్ని..నేనెవరినని !?
మానవత్వంటే ..
మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడనా !? ఇరువురినీ ఏకం చేసే సంఘటితమా !?
నా మదిలో మెదిలిన భావాలకి అక్షర రూపం ఈ కవిత.ఎటువంటి కాపీ కాదని హామీ ఇస్తున్నాను .
_ గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
13
[09/11, 9:34 pm] Lalita Sister: శీర్షిక.నీనేవరు
......
దేవుడి సృష్టికి ప్రతిరూపముగా
భూమిపై నిలిచినట్టి నేను
పరోపకారపు భావములో నిలిచి
సమాజానికి దిక్సూచిగా నిలిచి
సేవా బావములో పులకించిపోవాలని
మునుముందుకు కదులుతూఉంటే
ఈర్ష్యపడేటి కళ్లునాకేసి చూసి
గుండెను నిండుగా పిండుతున్నాయి
విజయాల వెనుక పరుగెత్తినా
అసూయకోరల్లోను చిక్కిచితికిపోయినా
ఓపిక దారిలో శ్రమను నమ్ముకోని
సాగిపోమ్మని అనుభవము చెప్పింది
మానవసేయే మాధవసేవని
బతుకు దారిలో సాగిపొమ్మనీ
జీవితము నిండుగా చెబుతున్నది
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
14.
[10/11, 7:52 pm] Aalla Nageshwar Rao Poet: కవితా గానం (సీజన్ 2)
నేటి అంశం;, నేనెవరు?!
శీర్షిక:
"" మానవతామూర్తివి ""
సృష్టిలోని అన్ని జీవరాసుల కన్నా.మిన్నగా
అమితమైన విచక్షణా జ్ఞానాన్ని అమర్చి
సృష్టికర్త బ్రహ్మ
సృష్టించాడు నిన్ను!
మానవజన్మ మహోన్నతమైనదని మరచి
అజ్ఞానంతో అకృత్యాలు చేస్తూ
దానం చేయాల్సిన చేతుల్తో
దారి దోపిడీలు చేస్తూ
గౌరవించాల్సిన పెద్దలను అగౌరవ పరుస్తూ
పూజించాల్సిన పడతులపై
అఘాయిత్యాలకు పాల్పడుతూ
నీ కన్నా మృగాలే నయమన్న చందంగా
సిగ్గు ,ఎగ్గు లేకుండా ప్రవర్తిస్తూ
సమాజానికి చిదపురుగులా పట్టి పిడిస్తున్నావు!
కులాల కురుక్షేత్రంలో
మతాల మరణహోమాల్ని సృష్టిస్తూ
మనిషికి, మనిషికి మధ్య అంతరాలను సృష్టిస్తూ
సామాజిక అశాంతికి కారకుడవౌతున్నావు
సృష్టికర్త బ్రహ్మకు తలవంపులు తెస్తూన్నావు!
మహోన్నత మానవ జన్మను పొందడం
నీ పూర్వ జన్మ సుకృతం
ఆ సుకృతాన్ని సత్కార్యాలకు వెచ్చించి
మానవజన్మను సార్ధకం చేసుకో!
మూర్తీభవించిన మనవతామూర్తివై జగతిలో వెలిగిపో!
..........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
apsrtc కండక్టర్
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య:7416638823
.........................................
ఇది నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
15
[10/11, 8:00 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక
తేది:10-11-2021
అంశం: నేనెవరు??
*శేష ప్రశ్న*
నీవెవరని నిలదీసిన ప్రశ్నే
నేనెవరను ఆత్మస్పర్శకు ప్రశ్న!
ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రతి ప్రాణికి ఆహారం
అవసరం పంచుతున్న దేవునికి తెలుసు...
సానువులను సాగరాలను ఏక స్థాయిలో ప్రత్యేకతలనిచ్చిన సృష్టికర్తకు తెలుసు...
గాలి లేదని ఊహించుకొంటున్న జనానికి ప్రభంజనం
విచిత్రంగా
సృష్టి లయల ఉత్పాతమని తెలుసు...
పంచభూతాలతో సృష్టింపబడిన దేహ
ప్రక్రియ అంతిమంగా ప్రకృతిలో లీనమవుతుందని తెలుసు...
తెలిసీ తెలియక నమ్మీ నమ్మక చేసిన పొరపాట్లను సరిదిద్దే
ప్రయత్నంలో నేను...
చిన్న విషయాలను భూతద్దంలో వెదికి
విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నంలో నేనూ...
గొప్ప విషయాలను అలుసుగా తీసుకుని
అపనిందలు మోపే నేనూ...
నిమిత్తమాత్రుడైన మానవునడికి నిత్యం సందేహాల పుట్ట!
జవాబు దొరకని ప్రశ్నకు
నాకు నేనే శేష ప్రశ్న!
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
ఇట్లు మీ
సయ్యద్ జహీర్ అహ్మద్
16
[10/11, 8:11 pm] +91 94413 57400: కవితాగానం(సీజన్2 )
అంశం నేనెవరు ?
రచన.డా.నాయకంటి నరసింహ శర్మ
నేనవర్ని ?
అద్వైతాన్నా, ద్వైతాన్నా ?
ద్వంద్వాతీతుడనా
మనసులో పరిమళాలను
విహారం చేయించే స్వేచ్ఛా విహంగాన్నా ?
నాలోనేనేనా ?
అందరిలో ఒకడినా ?
కొందరిలో ఒకరినా?
చెమటను అమృత జలంగా మార్చే శ్రమైక జీవుల అనుయాయినా?
వసివాడని పసిపాపల నవ్వులను ఆస్వాదించే
భాగ్యోపజీవినా ?
మల్లెపందిరికి మురిసిపోయే
అల్పసంతోషినా ?
నేనెవరిని ?
ఈకవిత స్వీయరచన
17
[10/11, 8:29 pm] దారల విజయ కుమారి Poetess: కవితా గానం సీసన్ 2
అంశం : నేనెవరు ?
10-11-2021
****************
మనసులో..
చీకట్లు ముసురుకున్నపుడల్లా
హృది తలుపును..ఓరగా తెరుచుకుని
ఒక ప్రశ్న తొంగిచూస్తుంది
మెదడులో
ఏ మూలనో నక్కి ఉంటుంది
సుళ్లు తిరుగుతూనే ఉంటుంది
కులం లోగిళ్లలో..కాలుమోపినపుడు
వెంటాడి వేధిస్తుంది
ఏ ఉన్నత వర్గాల
దరిదాపుల్లో తలదాచుకున్నా
హింసపెడుతుంది
నా దేశానికి
జెండా ఒకటే
జాతీయ గీతమూ ఒక్కటే..
ఇన్ని భిన్నత్వాలలో..
నన్ను నేనెక్కడని దాచుకోను
నెత్తురు రంగు ఒకటేనని
ఎక్కడెక్కడని నిరూపించను..?
తల్లీ భారతీ..
నువ్వైనా ఒక్క సారి వచ్చి చెప్పు
నేనెవరో..!
దారల విజయ కుమారి
18.
కవితాగానం సీజన్ @2
అంశం :నేనెవరు?
శీర్షిక : ప్రజ్వలితమైన జ్యోతిని నేనేనేమో
ఇంతకీ నేనెవరు
బంధాల అల్లికలలో
చిక్కుకున్న ఆత్మీయతనా
కర్తవ్య నిర్వహణలో
బాధ్యతలకు బానిసగా
విధి రాతకు బందీనా
బతుకు నావకు
బండి గీరలు నావి నీవని
ఎంచుతున్న త్రాసులో
తూకపు రాయినా....
ఇంతకీ నేనెవరు
పరహితము యోచనగా
నడిచే తోవలో నేను లేనా
స్వార్ధమే నిండుకున్న
నిలువెత్తు సాక్ష్యాన్ని
నేనేనా ఇంతకీ నేనెవరు
సమాజమున జరిగే
అసమానతల వివక్షతలకు
అమానవీయ అకృత్యాలకు
స్పందించని జడత్వరూపం
నేనేనా ఇంతకీ నేనెవరు
అంతరాత్మను నిలువునా
దహిస్తున్న బదులు లేని
ప్రశ్నలతో సందిగ్ద కొలిమిలో
ప్రజ్వలితమైన జ్యోతిని
నేనేనేమో అది నేనేనేమో
పేరు :దార. స్నేహలత
ఊరు : గోదావరిఖని
హామీ : ఇది నా స్వీయ రచన. ఎక్కడ పోస్ట్ చేయబడలేదు.
19.
అంశం...నేనెవరు...10112021
శీర్షిక...... ఎవరిని
***************************
ఎవరిని నేనెవరిని
పంచ భూతాల
పాంచ భౌతిక దేహాన్ని
తోలుతిత్తిని తొడుక్కున్న
తోలు బొమ్మను
అంతరాత్మ తోటి
పరమాత్మ
ఆడుతున్న నాటకంలో
పాత్రధారిని
సూత్రధారి సూత్రము
చేబూని
చదల నిండుగ నిండి
చేసెడి చేతల చమక్కుల
చమక్కును
ఆత్మ ఈదెడి సాగరాన
జీవుడను
పరమాత్మ ఆడించె ఆటలో
ఆటబొమ్మను
సచ్చిదానందాన్ని వదిలి
పిచ్చి ఆనందాలకు
అలవాటు పడిన
అల్పజీవిని
అందుకే
అన్నీ వదిలి
ఆత్మను
అంతరాత్మతో
అనుసంధానించిన
పరమాత్మ ప్రియతముణ్ణి
స్వీయ రచన::::::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
10112021
20.
కవితా గానం
ఏడెల్లి రాములు
అంశం*నేనెవరు?
శీర్షిక* శివయ్య పంపిన కాపరిని
అవును నేనెవరు
నీవెవరు మీరెవరు
ఈ ప్రశ్నలకు నిజమైన జవాబేదీ
తర్కానికి అందనిదీ
వేదాల్లో ఇమిడి ఉంది
మనిషీ జీవే
అనంతమైన జీవరాశులను
అదుపుచేస్తూన్నా
అఖండ విశ్వాన్ని చుట్టి వస్తున్నా
తనదాకా వచ్చాకే అంతులేని ప్రశ్న
సృష్టి సృజన నీవున్నా లేకున్నా
ఆగదు
అయితే నీ పాత్రేంటీ
జీవంలో ఆత్మను
ఆత్మలో లీనమై పరమాత్మను
దర్శించావా
ప్రతీ ప్రాణీ ఆకలికి ప్రకృతి పై ఆధారపడితే
నేనేంటో ఈ ప్రక్రియ లో
ప్రకృతి ఒడిలో ఓలలాడే నెలవంకలా
ఉండలేకపోతున్నాను
సమతను సమస్తంలో చూస్తానా
ఎందుకో ఈ కప్పుకున్న ముసుగులన్నీ
ఎండమావుల్లో ప్రగతి ప్రస్థానమేనాయే
నన్నూ నిన్నూ
నడిపించే తోటమాలిని గుర్తెరిగి నడిస్తే
అహం తెరలు చీల్చుకుంటూ
ఈ విద్వంసాలు ఆగవా
ఈ ప్రకృతి ప్రకోపం ఆగిపోదా
సృష్టిని సృజించని నేను
కాపాడే కాపరి పాత్రే ఈ జీవితం
ఆ దేవ దేవుని అనుగ్రహమే నేను
గాలి బుడగ లో నడిచే నావను నేను
21.
[11/11, 8:06 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం(సీజన్-2)
అంశం:- నేనెవరు?.
శీర్షిక:- అశాశ్వతుడివి.
...............................
పుడమి పై పుట్టిన ప్రతిమానవుడు ప్రశ్నించు కోవలసిన ప్రశ్న నేనెవరిని అని
పరమేశ్వరుని సృష్టిచే ధరణి పైకి వచ్చి
అహంతో, అంతానేనే ,అన్ని నేనే అని
కులమత, పేద గొప్ప అని సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న
ఓ మనిషీ
కనుతెరిస్తే జననం
కనుమూస్తే మరణం
లిప్తపాటు జీవిత కాలం అన్నది మరువక
మానవ సేవే మాధవసేవ అని పరోపకారార్ధం ఇదం శరీరం అన్నది ఆచరణలో పెట్టి రాగ ద్వేషాలని దరి రానీవక రమణ మహర్షి సందేశాన్ని ఆచరిస్తే అవుతావు ఆదర్శ మనీషివి.........!!
...............................
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
...........................
ఇది స్వీయకవిత
...............................
22
[11/11, 8:06 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్2 )11/11/2021/ గురువారము
అంశం:- " నేనెవరిని"
నేనెవరిని?
సూత్రధారి ఆడించే నాటకంలో ఒక పాత్రని సృష్టిని నడిపిస్తున్నా కాని సృష్టినాశనమవకుండా తిరిగి ఆ సృష్టినేనడిపించే సూత్రధారిచేతిలో కీలుబొమ్మను నేను.
బ్రహ్మ సృష్టి లోనాపాత్రలు లెక్కింప నాకేతెలియదు. చెట్టుపుట్ట కావచ్చు, కొండ రప్ప కావచ్చు, క్రిమి కీటకాన్ని కావచ్చు, పశుపక్షిని కావచ్చు లేక మనిషినైనాకావచ్చు
నేనటించినపాత్రలు నాకేతెలియనప్పుడు నేనెవరనిచెప్పగలను నేనెవరని యితరులుచెప్పగలరు సృష్టికర్తకైనా గుర్తుతెలియునా యుగయుగాల సృష్టిపాత్రలో నేనెవరని చెప్పగలను? ఏమో పరమాత్మకదా బహుసాఆపరమాత్మ నేనెవరినో చెప్పగలడేమో
నేనటించిన పాత్రలలోని పుణ్యఫలములు పూర్ణముకాగా పరమాత్మలోలీన మయిపోతానేమో సముద్రములో సంఘమించిన నదితనవునికిని తానెరుగనట్లు నావునికినేనెరుగక పోతే నేనెవరినని నడిగితే నేనేమని చెప్పగలను
నేనెవరోనాకే తెలియదు!
తరణికంటి సూర్యలక్ష్మి.
-----------
23
[11/11, 8:12 pm] Mahender Javvaji: అంశం. నేనెవరు
శీర్షిక:-లోకంతీరు
అమ్మ నాన్న ల ఆశాదీపం
ప్రేమాణురాగాల ఆణిముత్యం
మమతానుభందాల భావితరబీజం
అలలవలె సాగేపయణం..
నాదీనీదంటూ తారతమ్యం
అయినా నెనెవరునాకెందుకు..!
మంచిచెడులన్నిమంటగలిసే
పుట్టుకచావు ఈధరణిపైనేకదా
మానవత్వంలేనిఓమని"షి"మారవా
అయినా నెనెవరు నాకెందుకు..!
మారుతున్నకాలనుగునంగా
మానవత్వంమంటగలిసే...
అణువణువునానిచివేత
విచిత్ర వేష భాషలు తీరంచేరనివాంచలాయో
అయినా నెనెవరు నాకెందుకు..
మహేందర్ జవ్వాజి...
24
[11/11, 9:22 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్2). 11--11--2021.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- నేనెవరిని?
శీర్షిక :-- నేను మనిషిని.
కులాల కుమ్ములాటలు సృష్టిస్తున్నా
మతాల మారణహోమాలు కల్పిస్తున్నా
నేను మనిషిని... ...
అర్ధం మీది ఆశతో
అవినీతిని అందలం ఎక్కిస్తున్నా
పదవులపై కాంక్షతో
స్వార్ధంతో ప్రవర్తిస్తున్నా
నేను మనిషిని... ...
ఉచితాలకు అలవాటుపడ్డాను
బ్రాందీ, విస్కీలకు బందీనయ్యాను
డబ్బుకు దాసోహమంటూ
ఓటును అమ్ముకొంటున్నా
నేను మనిషిని... ...
కామంతో కళ్లు మూసుకుపోయి
పసిపిల్లలని కూడా చూడకుండా
హత్యాచారాలు చేస్తున్నా
నేను మనిషిని... ...నేను మనిషినే... ..
మనిషి మనీషిగా మారాలంటే...
మార్పు రావాలి...అవును... మారాల్సిందే...
నన్ను మార్చండి...మనీషిగా ... ...
**************************************
నిత్యం
ఈ ప్రశ్నకు ఇంకా విద్యార్థినే
ఆ సర్వేశ్వరుని కృపచే
జవాబుకై తపస్సు చేయాలి
లోక కల్యాణం కోరుకోవాలి
ఏడెల్లి రాములు 🙏
ది*09*11*2021(21*25)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
25.
* కవితాగాణం -2 *
అంశం : నేనెవరు ?.
పేరు : జక్కిడి వెంకటరెడ్డి .
..... ...................... .....
ఆశలమూటను భుజానమోస్తు
బతుకుబాటలో అలసిపోతున్నా !..
ఆలు బిడ్డల చింతలో
ఊపిరి సలపని వత్తిడికి చిత్తవుతున్నా! ...
కీర్తి ప్రతిష్ఠలకై వెంపర్లాడుతూ
ప్రతీ నిత్యం గారడీలు చేస్తున్నా !...
చేసేపనిని కేవలం జీవనభృతిగా చుస్తూ
మొక్కుబడిగా పూటగడుపుతున్నా !....
ప్రతిపూటకు ఒక కొత్త పుట జతకలుస్తున్నా
బతుకు పుస్తకంలో వెతుకుతూ వేసారిపోతున్నా! ...
సాంతం నాదే, సర్వం నేనే అంటూ
ప్రలోభాల ఊబిలో కూరుకపోతున్నా !...
ఆశ చావక, ఆలోచన తగ్గక
అరకొర ఆరోగ్యంతో ప్రాణం ఉగ్గబట్టి నిలబడ్డా! ...
ఇంకా ఆరటం ....
చచ్చేదాకా అలుపెరగని పోరాటం....
అయినా .....ఇంకా తట్టట్లేదు మనిషికి
నేనెవరని ?....
నాదేముందని , నాతో వచ్చేదేదని ?....
ఆలోచన రానేరాదు ....
ఊయలనుండి పాడెపై ఊరేగేదాకా
అంతటా వ్యామోహమే ......
ఎక్కడా ...ఎప్పుడూ ....నేనెవరనే ప్రశ్నే రాదే !....
ప్రకృతి ప్రతినిత్యం పాఠాలు నేర్పుతున్నా
పరాకే మనిషికి ......
నిండిన చెరువులో ఎండిన చెట్లు సంధ్యావేళలో
తెల్లని పూలు పూస్తున్నాయ్!.....
చావుపుట్టుకల చక్రం ఇంకా .....
అవగతం అయితలేదు మనిషికి !....
నేనెవరని తెలిసేవరకు
ఇంతే మనిషి బతుకు ...
ఆశల కోరల రంపపు కత్తుల బోనులో చిక్కిన మృగమే..... మనిషి .
---- పై రచన నా స్వంత రచన .
జక్కిడి వెంకటరెడ్డి .
Comments
Post a Comment