అలక 20 012022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
****************************
కవివరుల జాబితా
1.కోరాడ గారు
2.టేకుమళ్ళ విజయ లలిత గారు
3.నాయకంటి నరసింహ శర్మ గారు
4.కవిత వెంకటేశ్వర్లు గారు
5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
6. జక్కిడి వెంకట రెడ్డి గారు
7.నాగమోహన్ యెలిశాల గారు
8.ఏడెల్లి రాములు గారు
9.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
10.మ మద్ది పుల్లారావు గారు
11.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
12.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
13.వేమూరి సత్యవతి గారు
14.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
15.సునంద వురిమళ్ళ గారు
16.జోషి పద్మావతి గారు
17.గొర్రెపాటి శ్రీ ను గారు
18.లదోసపాటి వెంకట రామచంద్రరావు గారు
19.వేదాంతం సురేష్ బాబు గారు
20.తరణికంటి సూర్య లక్ష్మి గారు
21. అపరాజిత రెడ్డి గారు
22.డా.బల్లూరి ఉమాదేవి గారు
23.గంగపురం శ్రీనివాస్ గారు
24.శివునూరి లలితా కృష్ణ
********************
1
కోరాడ నరసింహా రావు *హద్దుల్లో...అలకాఅందమె* 
    ********************
అలిగిన వేళనే చూడాలి... 
గోకుల కృష్ణుని  అం దా లు !
నిజమే... అలక లో... ముద్దొచ్చే అందం దాగునుంటుంది !
ఏదైనా... అతి సర్వత్రా వర్జయేత్ అన్నారుగా... !
ఏదైనా... మితముగా ఉంటేనే ముద్దు... !
అతి ఐతే..!హద్దులు దాటితే..!
చిరాకు, కోపం, అసహ్యం....!
కైకేయి అలక... దశరధుని ప్రాణం తియ్యలేదూ... !
శ్రీరాముడిని అడవులకు పంపలేదూ... !
భరతునికి కన్న తల్లిపైనే... 
అసహ్యాన్ని పుట్టించలేదూ !!
ఆ అలక రామాయణ చరిత్రలోనే... మాయని మచ్చయి... నిలిచిపోలేదు !!
అలక సమాయాసందర్భాలనుబట్టి 
అనర్ధాలు జరగకముందే... 
మురిపించి... ముగించేయాలి అప్పుడే... ఆ అలుక కు అందం 
అలుక తీర్చేవారికి ఆనందం !!
        ***************
      ..... కోరాడ.
2
త్రిలోకపావనా🌺
*****************
ఓ మురళీధర!! మానసచోరా!!మనోహరా!!
నా కేల  ఈ శాపం?
చేసితినేమో పాపం..
కాకున్న ఏల  ఈమనోవేదన?
నిను మరువలేక, దరిచేరలేక
మూగబోయిన మదితో...
బాధాతప్త హృదితో..ఎన్నాళ్ళీ విరహోత్కంఠిత??
విశ్వవ్యాప్తుడవైన నిను నా మనంబున  బంధించుట భావ్యమా?
నీ పై *అలక* పూనుట సమంజసమా?
భవబంధ రహితుడవై భగవద్గీత ద్వారా స్థితప్రజ్ఞత నేర్పిన నీపై నాకేల  మోహం?
నిను  మరువ మంత్రోపదేశం చేసి.......
ఈ తరుణి ని  తరింపజేయవా  త్రిలోకపావనా!!!!🙏🙏
*****************
టేకుమళ్ళ‌.విజయలలిత
ఉపాధ్యాయిని
8500099051
(నేటి అంశం:: అలక)
3
] నాయకంటి నరసింహ శర్మ గారు: కవితాగానం సీజేన్ 


అలక ఎంతో అనునయం 
అలకే ఒక తీయని అనుభవం 
అనుబంధాలకు సింహ కవాటం 
అలక మొలకలు వేస్తే 
చిలుకల కులుకులెన్నో!
 తళుకు బెళుకుల పందిరి 
సందడి చేస్తుంది 
అలక వదనానికి వన్నెలు తెస్తుంది
 కదనానికీ  తిన్నెలు వేస్తుంది
అలకే లేకుంటే జీవితం
 పులుపు లేని పులుసు వంటిది
అలసిన మనసులకు 
అలకే ఒక అందం ఆధారం ఆలంబన
అలక అలికానికి అలికిన
 చందనపు సుగంధం
 హద్దులుంటేనే అలక ముద్దు
అలకతో మనస్తాపాలు రద్దు
అలకతో అనురాగం పదింతలు 
ఏలికనైనా అలకతో మెలికలు తిప్పవచ్చు 
తిప్పలు పెట్టవచ్చు
ఏ వేలుపు పరిచాడో
 అలకపానుపు 
అది ఎంతో నునుపు 


హామీ
ఈకవిత స్వీయరచన
డా.నాయకంటి నరసింహ శర్మ
4.
కవితా గానం
తేదీ:: 20.1.22..గురువారం
అంశం:: అలక
శీర్షిక:: అలక ఆనందమే

చెలీ ఎలా అలక
ఇరువురికి తప్పదు పడక
కలిసి నడవాలి నడక
నీవుండాలి తడబడక

ఇప్పుడే మొదలయ్యే జీవితం
మూడుముళ్లతో పెనవేసే బంధం
రెండు హృదయాలు కలిసిన సందర్భం
కలిసి పనిచేసుకోవాలి మనం
ఆజీవం

అప్పుడప్పుడు అలకలు అందమే ఆనందమే
పట్టువిడుపులు ఉంటే సుఖమే
పట్టుదలలకు పోతే నాశనమే
నీవెంత నేనెంత అంటే నరకమే

భార్య భర్తలు సమస్యను
కూర్చోని మాట్లాడుకుని
పరిష్కరించుకోవాలి
తెగేదాకా లాగకుండావుండాలి
అవగాహనతో అర్థం చేసుకోవాలి
అప్పుడే జీవితంలో అలకైన
కాము సమాజంలో చులకన!!
       పై కవిత నా స్వీయ రచన
అని హామీ
5.
[20/01, 8:55 pm] +91 6281 697 982: నేటి అంశం...అలక...20012022
****************************
అలక
ఇదొకప్పుడు
అందాల చిలక
ఆహ్లాద మొలక

పాణిగ్రహణం
పిదప
అల్లుడి అలక 
హర్షాతిరేకాల కేక

ముదితల మోమున ముచ్చట్లు
ముసి ముసి నవ్వుల చప్పట్లు
చిటికెలు మీటి పోసిన దీవెనలు
చిరు దరహాసం వేసిన చిందులు

అలకల అల్లుడి పలుకు
మామకు ఒంట్లో వణుకు
వనితల మోమున కులుకు
పెరంటాళ్ళ పండగ చెరకు

మరదలు విసిరిన చెణుకులు
మగువలు కోసిన కోతలు
మల్లెల మాలల మెరుపులు
మత్తెక్కించే మరువం మాయ

బావ బావమరిది బుజ్జగింపులు
అలకలు వదిలి కదిలిన పెదవులు
బాణసంచా మిల మిల కాంతులు
పడక గదిలో పక పక నవ్వులు

స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
20012022
6
[20/01, 9:00 pm] Venkat Reddy Jakkidi Math Sa Poet: @@ కవితాగాణం @@
      అంశం : అలక 
     శీర్శిక  : అలకే బతుకుకు ఆరోప్రాణం .
      ......     ........     ............ 
  అనురాగానికి మరో రూపం అలక 
  అనుభూతికి  అందాలతాపడం అలక 
  అనుబంధాల పునాదికి అలకే 
  ఆరోప్రాణం 
  బాల్యంలో తల్లిదండ్రులపైన  అలాకాస్త్రం 
  అన్నీ సాధిస్తే .....
  కౌమార్యంలో గోముగా ప్రాణమిత్రులతో 
  ఉడికించే ఉబలాటం అలక .....
  వయసులో బతుకు భాగస్వామితో 
  ఆనందాల కేళికి రాచమార్గం అలక .....
  వృద్దాప్యంలో ఉడికించి ఊరించే 
  అనుభూతుల పరిమళగంధాన్ని 
  ఆస్వాదించే ఆయుధం అలక ....
    జీవితం అంతటా అనుక్షణం 
  అందుబాటులో అలకానందం .....
  ఆయువుపెంచే సంతోషాల 
  సంబరం అలక ......
  --- జక్కిడి వెంకటరెడ్డి .
7
[20/01, 9:01 pm] +91 99499 70398: అంశం: అలక
శీర్షిక:  అలకే అందం

అతివకు అలకే అందం/
అతి కానంత వరకూ/
సుతిమెత్తగున్నంత వరకూ/

అలకంటే/
చిలకలా గారాలు పోవటమే/
కులుకుతూ మారాం చేయటమే/

కోపం కాదు/
అలకంటే/
అదొక అవ్యక్త మిక్కిలి మక్కువ/
ఎరుపెక్కిన/
చెక్కిలి టెక్కుల టక్కరి చక్కెర గుళిక/
తన వైపుకు తిప్పుకునే/
నాజూకు మోజుల మధుర రస మాజా గుటక/

బుంగమూతి/
పెట్టిందంటే శ్రీమతి/
హృదయంలో గిలిగింతల పులకరింత మొలకలే/

ఎంతటి మొనగాడైనా పతి/
తప్పాల్సిందే తన మతి/
లాగే మనసు ఊరించే సొగసుకు మెలికలే/

అవును మరి/
అతివకు అలకే ముద్దు/
అతి కానంత వరకూ/
శృతి మించనంత వరకూ/
సరసానికీ సల్లాపానికీ ఉండదు ఏ హద్దు/

హామీ :
8.
కవితా గానం
అంశం*అలక
శీర్షిక*అలక

అలక చిగురించే వేళ మొలక
అదే చిరుకోపమైతే వినాశన పిలక
వెన్నదొంగ అలక మొగ్గైతే
యశోదమ్మ మోమున నువ్వు పుష్పం

నానావిధ నలుపు నిరసనలన్నీ
కోర్కెల సాధనకు ఉపకరణం

రైతు చట్టాలకు వ్యతిరేకంగా
రాజధాని నలుమూలల నిరసన మేఘాలు
రైతులోకానికి విజయోత్సవ పతాక
రైతే అలిగి మేడీ కాడీ ఒదిలేసిన్నాడు
జగమంతా అన్నమో రామచంద్ర

అమ్మే అలిగి కుటుంబ సంరక్షణ
చేయనినాడు
సభ్య సమాజం చిందరవందర
విలువలు లేని నడత యువత

చిరు అలక మంచిదే
సత్యభామా కలాపం
రమాపతి విరహగీతం
భక్తుల అలకలన్నీ
సర్వేశ్వరుని లీలా విలాసం

 అలకలన్నీ పాలగొలకల బీజాలు కావాలి
ప్రేమకు సంకేతమై
శాంతికి స్వాగతం పలకాలి

ఏడెల్లి రాములు ✍️
ది*20*01*2022(21*04)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను....
          -- నాగమోహన్ యెలిశాల
9.
[21/01, 8:00 pm] Lalita Sister: కవితా గానం సీజన్ 2
తేదీ; 21/01/2021
అంశం: అలక
శీర్షిక:
    ""  జీవన తరంగాలు  ""

ఇష్టమైన వారి నుంచి
ఇష్టమైనది సాధించుకునేందుకు
సంధించే అస్త్రమే అలక
అదియే అతివలు వహించే కినుక!
సత్యభామ అలక వహించి
శ్రీకృష్ణుని పాదాక్రాంతుని చేసుకుంది
పారిజాతాన్ని సొంతం చేసుకుంది!
గోపికలు అలక వహించి
శ్రీకృష్ణుని తమ వశం చేసుకున్నారు
ప్రేమ పరవశంలోముంచెత్తారు!

పిల్లలు వహించే అలకలు
చిరు కోర్కెల సాధనకు చిట్కాలు
తీర్చితే చాలు సంతోషాల మొలకలు!
భార్యామణుల అలకలు
పట్టు చీరలతో సమాప్తఅలు
చిరు చిరు అలకలు
చిరు కానుకలతో అవుతాయి అంతాలు!
ఆ అలకలే పంతాలకు పోతే
అవుతాయి కుటుంబాలు అస్తవ్యస్తాలు
అల్లకల్లోలమై సృష్టిస్తాయి జీవన తరంగాలు!

₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య;7416638823

పై వచనకవిత నా స్వీయారచన అని.హామీ ఇస్తున్నాను.
10
[21/01, 8:01 pm] Maddi Pullarao Poet: కవితాగానం
శీర్షిక:అలుక
తేదీ:21-1-2022
మద్ది. పుల్లారావు
నందిగామ
9951287113
.................


అలుక ఆడువారికి ఓవరం
అలుక ఆడువారి పాలిటి అమృతభాండం
కొన్ని అలుకలు బహు తియ్యనివై
హృదయకుహురం లో నిలిచిపోవు
అర్థం లేని అలుకలు కొన్ని
అభాసుపాలయ్యె అలుకలు మరికొన్ని
అలుక అంటే చిరుకోపమే
అర్ధం చేసుకొనిన తీరును తాపమే
సత్యభామ అలుక కృష్ణుడికి
ధ్రౌపదీదేవి అలుక భీముడికి
భారతకాలం నాడే తప్పలేదు
నేటి భామల అలుక వర్ణింపతరమా?
మగవారికి అలుక ఉంటుంది
ఆ అలుకలో మమకారముంటుంది
పిల్లలకు,తల్లి దండ్రులపై అలుక
పనివారికి యజమానులపై అలుక
కార్యనిర్వహణా సాధనాలే గదా!
-------
ఇది నా స్వీయరచన
11

[21/01, 8:09 pm] Thippavajjala నరసింహ మూర్తి Poet Nellore: కవితా గానం సీజన్ 2

అంశం.   అలక

శీర్షిక,- అనురాగపు మొలక

తిప్పవఝల నరసింహమూర్తి

అలకలు అనురాగపు మొలకలు/
జీవితం అంటేనే అలకలు,బుజ్జగింపులు/
ఈ అనుభూతులు జీవితంలో తీపి గురుతులు/
అలకలు, బుజ్జగింపులుంటేనే నిజమైన సంసారం./
ఇవి లేకపోతే అవుతుంది సంసారం నిస్సారం/
సరికొత్త సంసారంలో అలకలు సామాన్యం/
అలకలతో బలపడుతుంది భార్యాభర్తలబంధం/
అలక అనేది అనుకున్నది సాధించుకోను వాడే బ్రహ్మాస్త్రం/
ఈ దివ్యాస్త్రానికి తలవంచక తప్పదు మనమందరం/
సత్యభామ అలకను తీర్చను శ్రీ కృష్ణుడంతటి వాడే పడ్డాడు పడరాని పాట్లు/
పారిజతవృక్షాన్నే యిచ్చి చేసుకొన్నాడు ప్రసన్నం/
ప్రేమికుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది అలక/
ప్రేయసి అలకతో ప్రియుడు అవుతాడు తికమక/
ప్రయోగిస్తాడు ఎన్నో అనునయపు బాణాలు/
అవసరానికి చేస్తాడు ఎన్నో ప్రమాణాలు/
చేసుకొంటాడు చివరకు ప్రసన్నం/
దాంతో అవుతుంది ప్రేమబంధం పటిష్ఠం/
ప్రాణ స్నేహితులమధ్యకూడా అపుడపుడు సాగుతుంది అలకలపర్వం/
పరస్పరం అర్థం చేసుకొన్నాక పెనవేసుకొంటుంది స్నేహబంధం/
జీవితమంటేనే సర్దుబాట్లమయం
శ్రీ కృష్ణుడంతటి వాడే భార్యకు దాసుడై అయ్యాడు మార్గదర్శకం/
మానవ మాత్రులం,మనమెంత
మనమూ సర్దుబాట్లతో చేసుకొందాం జీవితం నందనవనం/
12

[21/01, 8:19 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక
తేది: 21-01-2022

అంశం: అలక

సయ్యద్ జహీర్ అహ్మద్
కర్నూలు
చరవాణి:9505152560

    *కినుక వహిస్తే* 

అందం చందం అతివకు అలకే సొంతం
ప్రేమ కవచం తొడిగి
పూతరేకుల కోపం
నాసిక గొట్టాల ఊర్పులు
కోరికల చిట్టాను చదివించే నైపుణ్యం
పట్టు చీర కావాలనో
బంగారు నగలు కావాలనో
పట్టు పట్టి పంతం నెగ్గించుకునే మగువ ముగ్ధమనోహర భూషణం క
జామాతగ మగబుద్ధుల అలకలు వేరు 
అత్తామామల మీద వత్తిడి తెచ్చే పూనకం
అలిగిపోయిన అల్లుడికి ఆకలి కడుపే గతి
పొయ్యి మీద పాత్ర ఎక్కించదు శ్రీమతి!
      ***
      హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
13

[21/01, 8:27 pm] +91 98851 36308: 21-1-22.
           
 శీర్షిక-"అలకే బంగారమాయెనే"

అలక  అదృష్టవంతులకే,అందరికీ కాదు!
ఒకే ఒక అలక-
రెట్టింపు అపురూపమైపోతుంది.
అలక తీర్చటం ఇద్దరి మనసుల్ని ఒకటిగా చేస్తుంది!!
ప్రణయంలో ప్రణవంలో కూడా అలక రసభరితమే!!
"ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవనే - భక్తుని అలక  జీవాత్మ- పరమాత్మల క్రీడగావచ్చు!!
అయినా అలక అదృష్టవంతులకే!
బుజ్జి పాపో,బుల్లిమనవడో అలిగి బుంగమూతిపెడితే 
అమ్మా,నాన్నా,అమ్మమ్మా,బామ్మా పంచే బహుమతులెన్నో!!
పరువాల పడతి అలక పాన్పెక్కితే,
పర్యవసానపు ప్రబంధాలెన్నో!!
అయినా అలక అదృష్టవంతులకే!!
నిత్యం మత్తులో మునిగి తేలే బాధ్యతల్లేని-బడుధ్ధాయి-భార్యకి
కొప్పెట్టి కొట్టటానికే  ఇల్లాలనుకునే మొరటోడు , మొగుడైన ఆలికి అలగటం కూడానా?
అమ్మెవరో,నాన్నెవరో తెలియని పసివాళ్ళకి 
పట్టించుకునే వాళ్ళే లేకపోతే అలక ఆచూకీ ఎక్కడ????
ఎవరిమీద అలగాలి??????

             -------
 "అలకే బంగారమాయెనే" -అనే ఈ కవిత నా స్వంత రచన.
      వేమూరి(కావూరి) సత్యవతి.
9885136308.
14
[21/01, 8:33 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం సీజన్ 2
తేదీ 21/01/2021
అంశం.. అలక
శీర్షిక...అలకతీరిస్తే స్వర్గతుల్యమే 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

అలుకమానవే చిలకలకొలికరో
తలుపు తీయవే ప్రాణసఖీ!
తలుపు తీయవే ప్రాణసఖీ!
ఇవి సత్యభామ అలుకకు
కృష్ణుని అలుక సరాగాలు 
అలిగిన వేళను చూడాలి
గోకులకృష్ణుని అందాలు
యశోదమ్మ గోపికలపాటలు
నిజమేమరి! అలకంటే సత్యభామదే
అందాలఅలకంటే శ్రీకృష్ణపరమాత్మునిదే 

అమ్మాయి అలిగినా అందమే
అందాలమ్మాయి అలకలోఅందం
అబ్బాయిలు ఆఅలకనుతీర్చేచందం
అటు ఇటు కూడా చూసే కమనీయమే

పిల్లలు అలకలో బుంగమూతి
చూడముచ్చట వేస్తుంది గదూ! 
ఆ అందాలముద్దుల మూటతో
పిల్లల అందం ద్విగునీకృతమేకదా!

భార్యలు అలకలు చేస్తుంటారు
భర్తలు వారిఅలకలు తీరుస్తారు
ప్రతి సంసారజీవితంలో తప్పదు
అలకను అందమైన ప్రక్రియగా
ఆనందంగా తీర్చే కుటుంబము  ఆనందదాయకస్వర్గతుల్యమేకదా!

హామీపత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
15

[21/01, 8:38 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:21-01-2022
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం: అలక
****************
ఆలుమగల అందాల బంధంలో
అలక అనురాగాల మొలక
ప్రేమను పెంచే ముచ్చటైన వేడుక!

ఒకరికొకరు అర్థం కాని వేళ
మనసును తెరిచి  మమతల నిల్వెంతో మస్తకంతో  శోధించేందుకు సాయపడే ఆత్మీయతా దివిటీ!

సరిగమల సంసారంలో 
స్వరాల వీణ మీటి పలికించే ఆనందభైరవి రాగం!

అలక కోరికల కొలిమిలో కాలనంత వరకు
చలికాలంలో వేసుకొనే నులివెచ్చని ఉషోదయపు మంటే..

 అవధులు దాటిందా..
పంతాలు పట్టింపులతో రాజుకున్న  అసహనాల నిప్పులతో చెలిమే..

చిగుళ్ళు వేసే బంధానికి చిరకాలం స్మరించుకునే
చిరునవ్వుల బహుమతి కావాలి!
అప్పుడే అలకందం 
ఆస్వాదించే బతుకందం!

 *వురిమళ్ల సునంద ఖమ్మం*
16


[21/01, 8:42 pm] +91 95420 10502: *కవితాగానం సీజన్ 2*
తేదీ:21/01/2022
అంశం:అలక
శీర్షిక:అందమైన మొలక
******************************
బతుకు బాటలో అడుగడుగునా కంటకాలెన్నో!ఆటంకాలెన్నో!
స్త్రీ పురుషులిరువురి నడుమా
తలెత్తే తగవులెన్నో!తప్పిదాలెన్నో!!
అజుని సృష్టిలో అందమైనవెన్నో!
స్వభావములలో వ్యక్తమయ్యేభావనలెన్నో!! 
ఆ భావనలో భవించినదే ఈ  అలక........ 
మరి మగువమోమున అలకా!
అలకకాదది అందాలమొలక!!
అలక చెందిననాతి పలుకా!
పలుకు కాదిది తేనె చినుకు!! 
అలకతో అతివనడచు నడకా!  
నడక కాదది నెమలి కులుకు!! 
అలకతో ముదిత మూతిముడుపా!
ముడుపు కాదది ఒక మలుపు  !!
అలకతో వనిత కళ్ళ ఎరుపా!
ఎరుపు కాదిది సూరీడి పొద్దు పొడుపు!!  
అలకతో నారి నాజూకు పరుగా!
పరుగు కాదది పరువాల హొయలు!!
అలకతో వెలది కెన్నెన్ని మార్పులో! 
మార్పులెన్నైనా మగువకన్నీ మెరుగులే!! 
వేల్పులెందరో ఇచ్చిన వింతైన వరములే!!
             ______________

జోషిపద్మావతి 
మహబూబ్ నగర్ 

హామీపత్రం:ఈ సమూహానికై ప్రత్యేకంగా రచించిన ఈకవిత నాస్వీయరచన
17.
[22/01, 8:04 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం (సీజన్ -2)
అంశం : అలక   

శీర్షిక :   "ఆత్మీయ సందేశం" 

రచన : గొర్రెపాటి శ్రీను 


ఇష్టమైన వారి దగ్గర..
కోరుకున్నది సాధించుకునేందుకు చేసే చిన్ని ప్రయత్నం..అలక !
' అలకలు 'ఆలుమగల మధ్య ..ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి !
"ఒకరికి ఒకరై" జీవనం సాగిస్తున్నా..
ఇరువురి మధ్య అక్కడక్కడా చిరు కోపతాపాలు సహజం !
శృతి మించని ' అలక 'ఆనందదాయకమే !
ఆలుమగల అనురాగం శుభమయమయ్యే సందర్భం అలక !
అదంతా.. టీ కప్పులో తుఫాను లా జరిగే ముచ్చటైన వేడుక !
అప్పుడప్పుడు..
బంధుమిత్రులతో ..అలకలు జరిగినా..!?
ఎదుటివారి మనస్సు తెలుసుకొని ప్రవర్తిస్తే..
అలక తీరాక అనుబంధాలు హృద్యమవుతాయి !
ఏదైనా..
"అలక" అంటే..
ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మనస్సు తెలుసుకోమని పలికే
ఆత్మీయ సందేశం !
   
                              -    గొర్రెపాటి శ్రీను
18
[22/01, 8:07 pm] +91 99373 80136: కావ్యగానం (సిజన్2)
తేది22012022,శనివారం
అంశం:అలక
శీర్షిక:అలక అలంకారమే!
అలక అలంకారమేగదా
ఆడువారైననేమి మగవారైననేమి
అతివల అలుక పెంచును వారి అందము
అలకలకొలికి సత్యభామ సాధించెనుగా పారిజాతము
అలకయే ఎరుంగని ఆ కృష్డుణుడలిగితే జరిగెనుకదా కురుక్షేత్రము
దొరికెను కొందరికి విశ్వరూపదర్శనము
చిన్నారుల అలకలు చింతలు పొగొట్టునులే
పొన్నారుల అలకలు పరుగులు పెట్టించునులే
అలకలతో సాధించుదురు ఎన్నొ ఆశలు
అలకలు సృష్టించును ఎన్నో కలతలు
అలిగినవేళలో చూడగలము కొందరి వదనము
అలకలు తీర్చలేము జీవితాంతము
విరిగిన మనసులు కలవవు అజన్మాంతము!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
19
[22/01, 8:07 pm] +91 94236 90615: కవితా గానం (సీజన్ 2)
*************************
అంశం:- అలక
""""""""""""'''''''""""""""""""
అలకన్నది ఆడవారి
అద్భుతమగు ఆయుధం
కోరికలను తీర్చుకొనగ
అమోఘమగు సాధనం
పరువాలను ప్రదర్శించి
చూపుల బాణాలు వేసి
కులుకుల హొయలను చూపి
వలపులతో వలలు వేసి
అలకల అస్త్రాలు వేసి
పంతాలతో చింత రేపి
చిరుచిరు కోపం చూపి
చిరునవ్వుల సిరులొలికి
అలకలతో మెలిక తిప్పి
కలకలముల మనసు విప్పి
ప్రణయ గీతం ఆలపించి
ప్రణయ ధనువు సారించీ
ఒకరికి ఒకరై నిలిచీ
ఇరువురు ఒకరై నిలిచీ
శృతిలయలై నవ జీవన
సరిగమ లాలాపించీ
శృతి మించక గతి తప్పక
అలకల విలువలు తెలిసీ
జీవయాత్ర సాగించిన
జీవిత విలువలు పెరుగు
అలకలు అలసట దీర్చు
జీవన గతులను మార్పు.

🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్
      మహారాష్ట్ర
20
[22/01, 8:08 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌2 )22/1/2022) శనివారము
అంశము:- " అలక "

అలకలోదాగినఅందాలు
అలకతీర్చేవారికి అంతుపట్టు
అమ్మాయి అలక అమ్మనాన్నలకిముద్దు
మనుమల అలక మామ్మకుముచ్చట్లు
భార్యామణి అలక భర్తకు వినోదం

చిగురంటసాగ అలక చీకాకు పెట్టు
మితముగనున్న అలకముద్దుగనుండు
హద్దుమీరిన అలక అసలుకె మోసం
పట్టువదలని అలకపతనానికిదారి
హద్దులోనుంచిన అలకనందరికి ముద్దు

తళుకుబెళుకు చూపించు అలకతగనిముద్దు
అలుకలేనిదే జీవితానికి అందమేలేదు
అలకపాన్పుపై అల్లునిఅలక మామకి ఆరాటం
పెండ్లికి అదో వినోదం

కోరరాని అలక కొంపలు ముంచు
తీర్చగలిగిన అలక తీరుగ అలిగినచాలు
అతివలకుఅలకఅందం శృతిమించకున్నచాలు
అడపతడప భార్యా భర్తలు అలిగితేనే అందం
అలిగినవేళనేచూడాలి కన్నయ్యఅందాలన్నారు
సత్యభామ అలకతీర్చ గోపాల కృష్ణయ్య అవస్త చూడాలి
అలకలకర్ధముతెలుసుకున్న చాలు
అలక అనేకరకాలు
సాగని అలకల సాగదీయనేల
సాగిన అలక సాగితే అందం!
     తరణికంటి సూర్యలక్ష్మి.
             --------------
21
[22/01, 8:22 pm] Aparajith: అలక!

అలకలో చిన్ని కృష్ణుడు 
అలవంక జాబిలిని చూపుతూ 
నెలవంక తలలో తురుమమని 
గారాలు పోతూ అమ్మ చెంత చేరి 
మురిపాల ముద్దు కృష్ణుడు 
ఇంట్లో వెన్నముద్దలన్నీ తనవేనని,,,,,
అమ్మతో పోట్లాడి అలిగి!
పండువెన్నెల్లో ఆటపాటల్లో ఆకలితో 
ఉట్టిపై పాలమీగడ కోసం 
ఎత్తు పీట ఎక్కి వెన్న మీగడలు జుర్రుతూ,,,,,,!
అమ్మ యశోద అది గమణించి 
ముసి ముసి నవ్వులతో దగ్గరికి తీసుకుని 
వెన్న దొంగా! నీ అలక దేనికో తెలీదా,,,! అంటూ 
చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి 
మరులు గొలిపే సన్నని పిల్లగాలుల్లో 
ఆదమరిచి తల్లి ఒడిలో నిదురించే కన్నయ్య 
అలకబూని అన్నీ సాధించిన మొనగాడు!
నిదురలో తీయని కలలు కంటూ 
చందమామను జున్ను ముక్కలా తిన్నట్లు కలగాంచి,,,,!
అందచందాల నీలి మేఘచ్చాయుడు 
అలిగినా అందమే గారాలు పోయినా అందమే!
నింగిలోని నక్షత్రాలన్నీ కోసుకొచ్చే ధీశాలి తానని 
పసివాడు తానెరుగకున్నా!మనకు తెలుసుగా!

అపరాజిత్ 
సూర్యాపేట
22.
[22/01, 8:50 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
అంశం:అలక

చిరు అలకే ఆభరణం
అలకే ఆడవారికే స్వంతం బుంగమూతితో మొదలయ్యె బాల్యం
అన్నదమ్ములతో గిల్లికజ్జాలు  అలకలోభాగమే
వివాహమయ్యాక సంసారం లో
ప్రారంభంలో ప్రణయకలహం
శ్రుతి మించితే చిరుఅలక ఔతౌంది
ముసురు లేని తుఫాను
సంతు కోరి అలకబూని
దితి పొందెనుసంతానం
అలకబూని కైకేయి పంపెను
రాముని వనవాసం
పారిజాత సుమమే సత్యభామ
అలకకయ్యె కారణం
మగువలకే కాదు మగవారికి సైతం 
అయింది అలకే ఆభరణం
చిన్నికన్నయ్య అలక రేపల్లె కే
అయింది ఆనందకారకం
శ్రీరాముడు చంద్రుడు కావాలని పూనాడు అలక అలనాడు
అలిగి సాధించుకోవడం
నాడైనా నేడైనా సర్వసాధారణం
పిల్లల శృతిమించన అలకను
చూసి ఆనందిద్దాం.

డా బల్లూరి ఉమాదేవి
23
[22/01, 8:51 pm] Gangapuram Srinivas Poet: కవితా గానం

అంశం: అలక

తేది: 22.01.2021

*అలకాభరణం!*

అలల సుడిగుండాల విసుర్లకు
అలకల మొగ్గ ముడుచుకుంటే
అవసరమైనప్పుడు సురక్షితమై
అరవిరిసిన మందారమైతది

పిల్లలకు అలక పూల పాన్పైతే
ప్రేయసికి అపురూప ఆభరణం
పడతికి అరచేతిలో ఆయుధం
పురుషులకు అలక అలలమీద కల
కొత్తల్లుడికి కోరిక తీర్చే దీపం
వృద్ధుల అలక వృద్ధికి బాట!

ఆడపిల్ల అలిగి పుట్టింటికెళ్తే
వెనకనే కోకను పట్టి కాకా
బతిమాలి బహుమానాల విందు!

రాజుల అలక రాజ్యానికి బూజు
రాణుల అలక యుద్దానికి హేతువు
బూరెల బుంగమూతి పెట్టి
ఓడిపోయిన చరిత్ర ఒక్కటీ లేదు!

అలక అనువైన సమయంలోనే
వాకిట్లో అలుకులా మొలకేయాలి
అసంధర్భంగా గడపదాటితే
అల్లరి పాలయ్యే చిలకైతది!


            ...గంగాపురం శ్రీనివాస్
                   9676305949 

24.
అలక 

ఆశల 
చిట్టాను తెరవ లేదని
బహుమతుల
బావుటా ఎగరేయలేదని...
అల్లరి వెల్లువయి
బుంగ మూతిపెట్టిన....
 నా  గారాలపట్టి

ఎంతకీ 
ముచ్చట్లమువ్వల్ని మ్రోగించదే.....
మౌనపు 
మకుటాన్ని ధరించి
మారాల హారాలతో
అలవోకగా
 అలకను అలంకరించుకుంటుందా..

ఆవేళ....
చిరు అలకలు చిగుర్లు వేసి
బుగ్గలు 
కెంపులమొగ్గలు తొడిగితే 
మాటలమారాకులేయగా 
పాటలపల్లవింపుల్లో 
నవ్వుల 
పువ్వుల్ని పూయించి  తను నర్తించగా.....

బుజ్జగింఫుల
 బాలగా 
అనునయింపుల
పూమాల గా 
బతిమాలే  మాలిగా 
 మారక తప్పదు..

అలకను అలదుకుని 
పక్షానికో మారు 
చిన్న బోయే మా జాబిల్లి
వెన్నెల పూలతో....
వెలిగే తరుణమే
నిండు పున్నమి నాకు

*******  శివునూరి లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧