పద్మశ్రీ 2022
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*************
1.అపరాజిత రెడ్డి గారు
2.కోరాడ గారు
3. కవిత వెంకటేశ్వర్లు గారు
4.బాలు కత్తుల గారు
5.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
6.తరణికంటి సూర్య లక్ష్మి గారు
7.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు కాజీపేట
8.మద్ది పుల్లారావు గారు
9. డా.బల్లూరి ఉమాదేవి గారు
10.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
11.వేదాంతం సురేష్ బాబు గారు
12.వురిమళ్ళ సునంద గారు
13.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
14.సింహాద్రి వాణి గారు
********************
1
[27/01, 6:58 pm] Lalita Sister:
కవితాగానం సీజన్ 2
నేటి అంశం
27.01.2022
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
మొగులయ్య గారు &గరికపాటి నరసింహారావు గారు
వీరి ఫై కవితలకు ఆహ్వానం పలుకుతున్నది మన కవితాగానం
రాత్రి ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు
అంశానికి కవితలతో స్పందించగలరు.
ఆ సమయంలో ఎలాంటి
ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు.
❇️❇️❇️❇️❇️❇️
1.
గరికపాటి మొగిలయ్యలు,,,,,!
జీవన విలువలను
చిరు చిరు పద్యాలతో
చిరునవ్వుల తొలకరి జల్లుల్లా
ప్రవచనాల హరివిల్లు పూయించి
ప్రేక్షకుల హృదయాలను తెరచి
చలోక్తులతో హాస్యం మేళవించి
యువతకు చురకలంటిష్తూ
గృహస్తులకు తన అనుభవాల అనుభూతులతో
వారి కళ్ళల్లో వెలుగు పూలు పూయించి
చక్కని తొవ్వను చూపించే మేటి గరికపాటి!
జానపద సాహిత్యానికి పట్టుకొమ్మ
తన పన్నెండు మెట్ల సంగీత వాయిద్యం
ఎప్పుడో పురాతన కాలంలోని
అలరారిన గొంతుతో పాట పాడుతుంటే
నిజంగా గిరిజన గొంతు ఇంత శ్రావ్యంగా ఉంటుందా,,,,,!?
మొగిలయ్య శ్రావ్యమైన గొంతులో ఇమిడి పోయిన సంగీతం
పులకించని శ్రోతల మదియంటూ ఉండదు!
అవును మొగిలయ్య జానపద కళా విద్వాంసుడు
తగునతనికి పద్మశ్రీ అలాగే గరికపాటికి!!
అపరాజిత్
సూర్యాపేట
2
Korada: అంశం :-
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు :-
* విద్వత్తు - మహత్తు *
కోరాడ నరసింహారావు
****************
ప్రతిభకు పట్టం కట్టి......
అవార్డులు - రివార్డులతో...
సన్మానించి, సత్కరిస్తూ....
కళామ తల్లిని ఆరాధించే...
సంస్కృతికి...శిరసానమామి!
విద్వత్తును గౌరవించటం...
ప్రతిభను ప్రోత్సహించటం....
సమాజవికాసానికి....
దోహదపడటమే.... !
నిస్కామ కర్మయోగంతో....
పరిశ్రమించేవారికి....
ఆశించకపోయినా... ఫలితం అందకుండాపోదుగా....!
అంకితభావంతో... కళ లను ఆరాధించేవారు... ఆ కళ లచేతే.... ఉద్ధరింపబడటం...
అనుభవైకవేద్యం.... !
సంగీతమైతేనం,సాహిత్యమైతే .నేం ..., సేవారంగమైనా ఇంకే రంగమైనా.... చూపించాల్సింది
చేసిన పనికి నూటికి నూరుపా ళ్లూ... న్యాయం చెయ్యటమే !
మొగులయ్యయితేనం, గరిక పాటి ఐతేనం... మరెవరైతేనం
కళ లతో చేసిన సమాజసేవ !
అవార్డులకోసం చేసారా !?
ఆత్మానందంకోసం చేసిన యే
మంచిపనైనా...సత్ఫలితాన్నిచ్చి... గుర్తింపుని, గౌరవాన్ని...
తెచ్చి...సన్మానాలను, సత్కారా లను చేసి... అవార్డులు, రివార్డులతో.... అందరినీ ఆనం దపరచటం... భావితరాలకు
స్ఫూర్తి, ప్రేరణ....,మరింత మంచికి,ప్రతిభకుప్రోత్సాహం !!ఇది హర్షాతిశయం... !
అందిస్తున్నవారికి - పొందు తున్న వారికి అభినందనీయం !
****************
...... కోరాడ.
3.
కవితా గానం సీజన్ 2
అంశం::పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు
27.1.22..గురువారం
సెల్:: 8309920625
ప్రవచనాల ప్రభంజనం
వేల సభలు నిర్వహించిన పరిజ్ఞానం
అవధానములెన్నో సఫలీకృతం
చేసిన అఖండ తేజో జ్ఞానం
నీతులతో పిట్ట కథలతో
ఛలోక్తులతో చమక్కులతో
మధ్య మధ్య మంచి పురాణ
కథలతో కావ్యాలలోని
పద్యాలతో వేదాలలోని
శ్లోకాలతో
సభను రక్తి కట్టించే ప్రవచనాలతో
ఏకధాటిగా అనర్గళంగా
సాగే ఆ ప్రవచన జరీ
గరకపాటి ఘనాపాటి
ప్రవచనాల మేటి
కళకళ లాడాలి పద్మశ్రీ అవార్డు తోటి!!
జనపదుల పదమే జానపదం
వారి నోట వచ్చిన పాటైన
పదమైన
వారు పాడిందే గీతం సంగీతం
ఆ గొంతులో పలుకును శ్రావ్యం
పని చేసేటప్పుడు పదుగురితో
కలిసిపాడిన అది ఓ సంబరం
మొగిలయ్య గళంలో పలికిన
సంగీతం
వాయించిన పన్నెండు మెట్ల
వాయిద్యం
అది మొగిలయ్యాకే సాధ్యం
జానపద కళకు కళ తెచ్చిన
మొగిలయ్య
4.
మొగిలయ్య& గరికపాటి
ఒక్కరేమో గరికపాటి
ప్రవచనాలలో ఘనపాటి..
ఒక్కరేమో జానపద కళా మేటి
పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యంలో తనకు తానే సాటి...
ఒక్కరేమో సామాజిక చైతన్య మూర్తి..
జీవితపు విలువలు నేర్పే నేర్పరి..
ఒక్కరేమో పాటే ప్రాణంగా బతికిన మనిషి
పుడమితల్లి ఒడిలో ఓనమాలు దిద్దిన కసి..
ఒక్కరి మాటలు తూటాలు..
ఒక్కరి పాటలు కోకిల గానాలు..
ప్రతిభకు కట్టిన పట్టం పద్మశ్రీ పంటల పర్వం
ఇరువురికి అమాందానందము..
బాలు కత్తుల
గిరిజనుల ఆశా దీపమయ్యే
"పద్మశ్రీ" అవార్డుతో వచ్చే
అమందానందము
గిరిజన ప్రజకు అనంతానందం!!
పై కవిత నా స్వంత రచన అని
హామీ
5.
[28/01, 8:00 pm] +91 6281 697 982: అంశం...గరిక పాటి...మొగలయ్య
శీర్షిక.... పద్మాలు...27012022
**************************
పద్మం
ఉదయించిన కలాలను
ఉర్రూతలూగించిన గళాలను
ఊళికలందూరేగించింది ...
ఊహలకందనంతగా !!!!
పద్మాల మాలలు
మణి పూస హారాలు
మహనీయుల కంఠాన
మిరుమిట్లు గొలిపే మెరుపులే
తెలుగు నేలంతా
తేనె పాకం పట్టి
మట్టి మధువుగ మారి
అధరాలకందింది
పుడమి నాలుగు చెరుగులా
పరగు సుతులు జూచి
పులకించి పోయింది
పండుగే చేసింది
పురస్కారాలతో
పురి విప్పి ఆడింది
సుదతి తెలుగు తల్లి
సుజలమై విప్పారింది
గరిక పాటి వారి
గడుసు ఘనత
మొగలయ్య కిన్నెరలో
మోగిన పాట
తెలుగు భాషా ఔన్నత్యాన్ని
అవని ఆదరించి
తలవంచి మొక్కింది
సాగిల పడి సాగింది
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
6
[28/01, 8:02 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్2)28/1/2022/ శుక్రవారయి
అంశము:- పద్మశ్రీ అవార్డుగ్రహీతలు
మొగులయ్యగారు/గరికపాటినరసింహారావుగారు
గరికపాటివారు
ప్రవచనాలప్రవక్త మోమున చిరునవ్వులొలుక
ప్రజలహృదయాలు దోచెను
ఏపనిమొదలుబెట్టతల్లినిస్మరించు
అమ్మప్రేమలోని మాధుర్యము నెరిగించు
యువతనుసంప్రదాయాలనడువమంటు
అనువుగపెద్దలకు జెప్పునందనివిషయాలు
కావ్యాలరమ్యత వర్ణలను తనభావుకతతో
కళాతపస్విగనందించు సంస్కృతినిలుపుచు
స్వదేశీవస్తువిలువలదెలుపుచూ
సంసారయాత్రను సాగించే పండిత శిఖామణి
సహస్రావధానాల చక్రవర్తిగా
నేడుపద్మశ్రీ బిరుదు నందుకొన్న
గరికపాటి ఘనతఆబాలగోపాలనికి
ఆనందమే
మొగులయ్యగారు
గిరిజనుడుమొగులయ్యజానపదసాహిత్యం
పన్నెండు మెట్ల సంగీతవాయిద్యంతో
పురాతన జ్ఞాపకాలు జ్ఞప్తికొచ్చు
జానపదకళకు జీవమై
పాటేప్రాణమై పదుగురితోపనిజేస్తూ
ఆత్మానందాన పరవశానపాడేపాట
గిరిజనుల ఆశాదీపము
అంకితభావాన గిరిజనులారాధించేకళ
ఫలితమాశించక పరిశ్రమించేకళ
మొగులయ్యజానపదసాహిత్యం
జనావళిమెచ్చ ప్రతిభకు ప్రోత్సాహమై
పద్మశ్రీ బిరుదు నందించె
మొగులయ్యకు!
తరణికంటి సూర్యలక్ష్మి.
------------
7
[28/01, 8:14 pm] +91 90594 38068: కవితాగానం 2
అంశం: పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
గజవెళ్ళి శ్రీనివాసాచారి కాజీపేట
...
గరికపాటి
అవధాన ఘనాపాటి
ప్రవచన కిరీటధారి
ఆయన వాగ్దాటికి ఏది సాటి
ఆధ్యాత్మిక ప్రవచనాలు
సాహితీ ప్రసంగాలతో
తెలుగువారిని జాగృతపరిచిన మేటి
సహస్ర భారతి
అవధాన శారద
శతావధాన కళా ప్రపూర్ణ
ధారణ బ్రహ్మ రాక్షసుడు వంటి
బిరుదాంకితుడు
తెల్లచొక్కా, పంచెకట్టు
కోరమీసంతో
భుజంమీద మెట్ల కిన్నెర
సాదాసీదాగా కనిపించే
అధ్భుత కళాకారుడు
వారసత్వంగా వస్తున్న
కళకు వారసుడు
దర్శనం మొగిలయ్య
తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని
చారిత్రక గాధలను ఒడిసిపట్టి
మెట్ల కిన్నెర వాయిస్తన్న
కిన్నెర మొగిలయ్య
...
హామీ పత్రం
ఇది నా స్వంత రచన
8
[28/01, 8:25 pm] Maddi Pullarao Poet: కవితాగానం
మద్ది. పుల్లారావు
నందిగామ
28-1-2022
--------
గరికపాటి వారి గూర్చి తేటగీతులు
...........
గరికపాటి వారి ప్రతిష్ట ఘనమవంగ
అద్భుతావధానమునకు యర్ధమొసగ
తెలుగు సాహితీ లోకము తేజరిల్ల
పద్మశ్రీ వెతుకుతు వచ్చె పండితునకు
ప్రవచనాలతోనె ప్రజల బ్రతుకు మార్చె
మూఢనమ్మకాలన్నింటి ఫీడమణచె
జ్ఞాన జ్యోతిని వెలిగించి జయము జూపె
అమ్మ యాశీస్సులున్నట్టి యాత్మ జ్ఞాని
......
9
[28/01, 8:29 pm] Balloori Umadevi Poetess: కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
కామవరం/ ఆదోని
28/1/22
అంశము: గరికిపాటి నరసింహారావు గారు
తే.గీ:
భరతమాత కీర్తినిపెంచె భవ్యముగను
పద్య పటిమను చూపుచు వాసిగాను
వాణి మాతకు పుత్రుడై పరగుచున్న
*గరికపాటిసేయడు గదాగరికిపాటి.*
తే.గీ:
అంతులేనట్టిపాండిత్యమతనియాస్తి
యువతమెప్పును బడసిన యుక్తిపరుడు
నితనిసరిసాటి యైనవారిలనులేరు
*గరిక పాటిసేయడుగదా గరికిపాటి*
ఉత్సాహము:
నిరతము కొలిచిమది లోని నెమ్మి తోడ భారతిన్
పరిపరివిధములుగ సలిపి ప్రార్థనమ్ము చేయగన్
గరికపాటి సేయునొక్కొ గరికిపాటి సూడగన్
మొరకుగ నన భావ్య మౌనె భూరి యశమును గనకన్
కం:అష్టావధానములనిల
నిష్టముతోచేసెతానునెన్నియొ వినుమా
స్పష్టపునుచ్చారణతో
శిష్టులమదిదోచినకవిశేఖరుడితడే
ఆ.వె: గరికిపాటి యన్న ఘనమైన యవధాని
తెలుగుభాషయందుతెలియరండు
ప్రశ్నలేవియైన వడిగ బదులిడుచు
పృచ్ఛ కాళి కెల్ల ప్రీతి కూర్చు
ఆ.వె:పూర్వకవులు పేర్లు పుత్రుల కిడినట్టి
గరికిపాటి కవియు ఘనుడు గనుడు
సాధువర్తనుడగు సద్గుణశీలుని
పద్మ శ్రీ వరించి వచ్చి చేరె.
ఆ.వె:చదువులమ్మ తాను సర్వవేళలయందు
జయముకూర్చనెంచి సంతసాన
గరికిపాటివారి గంభీరమైనట్టి
గళము నందె దాగె ఘనము గాను.
10
[28/01, 8:36 pm] +91 99373 80136: కవితాగానం(సిజన్2)
తేది28012022,శుక్రవారం
అంశం:పద్మశ్రీ అవార్డుగ్రహీతలు
మొగలయ్య&గరికపాటి నరసింహరావుగారు.
ఇద్దరూ ఇద్దరే
ఉద్దండపిండాలు
ఒకరు అవధాని
ఇంకొకరు జానపదవాణి
వారే దర్శనం మొగలయ్య
గరికపాటి నరసింహరావు
చతురత చమత్కారంలో చతుర్వేదొకరు
పన్నెండుమెట్ల కిన్నెర పాటగాడొకడు
ప్రజలమనసును దోచుకున్నారు
పద్మశ్రీ బిరుదులందుకున్నారు
వారకివారే సాటి
వారికిలేదుపోటి
కాదెవరూ వారికిమేటి
ధన్యజీవులు వారు
మరింతధన్యులు శ్రోతలు!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం,శ్రీకాకుళం జిల్లా
చరవాణి 7780594995..
11.
[28/01, 9:27 pm] +91 94236 90615: కవితా గానం (సీజన్ 2)
**********************
అంశం:- పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
*****************************
శ్రీ గరికిపాటి, శ్రీ మొగిలయ్య
*****************************
పద్మం వికసించింది
తెలుగు నేల పులకించింది
తెలుగు లోగిళ్లలో పద్మం
సౌరభాలు విరజిమ్మింది
ప్రతిభకు పట్టం కట్టింది
తెలుగు తేజం విలసిల్లింది
''''''''''"""""""""'""""""""""""""""""""""""
గరికిపాటి
''''''''''''''''''''''''''''''''''''''
కలంపట్టి కవితలల్లి
అవధానపు ఆటలాడి
ఆధ్యాత్మిక ప్రవచనాల
రసధారలు కురిపించీ
వెరపులేక మెఱుపు లాగ
వాగ్ధాటిని ప్రసరించీ
తన సాహితి ప్రసంగాల
ప్రజలను జాగృత పరచీ
అనాచార పద్ధతులను అద్భుతముగ ఖండించీ
నైతిక విలువలు పెంచగ
రేయి బవలు శ్రమియించీ
ధారణలో బ్రహ్మ యతడు
శారద ముద్దుల తనయుడు
అనధానపు ఘనాపాటి
వియద్గంగ వాగ్ధాటి
కవికులమున అతడు మేటి
లేరు లేరు వారి సాటి
లేరు వారి కెవరు పోటీ
వారే మన గరికిపాటి
*****************************
మొగిలయ్య
''''''’'''''''''''''''''''''''''''''''''''''''
తెలంగాణ పలుకుబడులు
జానపదుల జీవనములు
పన్నెండు మెట్ల కిన్నెర పాట
మొగిలయ్య నోటి మాట
వారసత్వ కళల ఊట
మనసేమో తేనె తేట
చారిత్రక గాథలను
తెలగాణపు జీవనమును
తేట తెల్ల పరచు కళల
సెలయేరుల చల్లని అల
కళకు జీవధార నొసగి
నిరంతరం శ్రమియిస్తూ
జనావళి మది దోచిన
ఆత్మయోగి మొగిలయ్య
కళకు అతడు జీవగడ్డ
తెలంగాణ ముద్దు బిడ్డ.
🖋️ వేదాంతం సురేశ్ బాబు
చంద్రపూర్
మహారాష్ట్ర
12
[28/01, 9:29 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం సీజన్ 2*
తేదీ:28-01-2022
పేరు వురిమళ్ల ఖమ్మం
అంశం: పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మొగలయ్య, గరికపాటి నరసింహారావు
******************
దాగదు పూవులోని పరిమళం
మరుగుపడదు మనిషిలోని ప్రతిభ
పన్నెండు మెట్ల సంగీత వాయిద్యంతో
సంగీత ప్రపంచంలో తనదైన ఉనికిని చాటుకున్న గిరికూన!
జానపద కళతో జనాలను
ఉర్రూతలూగించి
మనసు దోచుకున్న మొగులయ్య..
రామాయణ భారత గాథలకు
ఆధునికతను మేళవించి
మానవీయ విలువలతో
మనిషెలా మనుగడ సాగించాలో
ప్రవచనములు అవధానాలతో
ఆబాల గోపాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గరికపాటి
ఘనాపాటి
ఒకరిది కలం ప్రవచనం
మరొకరిది గళం సంగీతం
దశదిశలా ప్రసరించాయి
తెలుగు దివ్వెల వెలుగులు
నేడు వరించాయి పద్మశ్రీ అవార్డు పురస్కారాలు
పులకించాయి దేశం లోని
అశేష ప్రజానీక హృదయాలు
*వురిమళ్ల సునంద, ఖమ్మం*
13.
[16/02, 8:19 pm] Lalita Sister:
కవితా గానం సీజన్ 2 నిర్వహించు కవితల మాలిక
తేది: 29-01-2022
అంశం: పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
తెలుగు జాతి కీర్తి కిరీటాలు
మొగిలయ్య పాట:
మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ
తెలకపల్లి మండలం
గుట్టరాయిపాకుల పురిటి గడ్డ
పూట గడవని పస్తులుండే పేదరికం
అతని పాట జానపదుల కట్టిన కోట
ఊరూరా ఇంటింటా తిరిగి పొట్ట పోసుకునే
పాట అతని జీవన తీరం....
పన్నెండు మెట్ల మీద కిన్నెర వాయిద్యంపై పాట జాలువారుతుంది అలవోకగా....
నోట వచ్చింది మాట పాట రాగాలొలుకుతూ
చదువు లేదు రాత లేదు
వేదిక మీద దర్జాలేదు
వంశపారంపర్యంగా అబ్బిన కళ నమ్ముకున్న మొగిలయ్య
ప్రాచీన కళకు ప్రాణప్రతిష్ట
అతని ప్రతిభకు పట్టం
పద్మశ్రీ బిరుదుతో
గౌరవ సత్కారం!!!
గరికపాటి నరసింహారావు:
వృత్తికి అంకితమైన ఉపాధ్యాయుడు
వందలాది అవధానాలు చేసిన దిట్ట
దేశ విదేశాల్లో కీర్తి గడించిన సహస్రవధానాల స్రష్ట
పలు ఆధ్యాత్మిక, సాహిత్యాంశాలపై ప్రసంగాలు చేసిన ఘనత
కనకాభిషేకాలు, స్వర్ణకంకణాలు
గౌరవించాయి
పురస్కారాలు ఎన్నో సాష్టాంగపడ్డాయి!
ప్రవచనాలు మూఢనమ్మకాలపై కొరడా
మతేతరుల మన్ననలు అందుకున్న
బహుముఖ ప్రజ్ఞాశాలి
అభ్యుదయ భావాల నిధి
అనంత ప్రవచనాల విధి
కళా రత్న, అవధాన విశారద,
ధారణ బ్రహ్మ రాక్షసుడు
బిరుదుల ముందు
చిన్నబోయిందెపుడో డాక్టరేటు
శ్రీశ్రీ, గురజాడ పుట్టారతని కడుపున మరు జన్మగా
అభ్యుదయ ప్రవాహం అతని నరనరాన
పద్మశ్రీ పరంపరకి తగిన వారసుడు
సాటి రావు ఏదీ గరిగపాటి నరసింహారావు!!
తెలుగు జాతి కీర్తి కిరీటాలు
***
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
15
[16/02, 8:19 pm] Lalita Sister:
గవితాగానం(సీజన్--2)
పద్మశ్రీ గరికపాటి
నరసింహారావు గారు
సీ.విశ్వమందు వెలుగు విజ్ఞాని యాతడు
సత్య వాక్కుల దెల్పు సాధు జీవి
నీతి బోధన జేయు జాతి రత్న మతడు
మనుజ లోకమునకు మాన్య గురువు
సాధువర్తనుడును సద్గుణశీలుడు
అవధానముల జేయు నార్యుడతడు
తెలుగు భాష మిగుల తేజరిల్లగ జేయు
నాంధ్రుడే యాతడు నవని పైన
తే.గీ. పద్మశ్రీ వరించె నతని ప్రతిభ మెచ్చి
ఘనుడు శ్రీ నరసింహుడు గరికపాటి
తెలుగు జాతికి యాతడు వెలుగు రేఖ
అందుకొనుమయ్య వందనాలవధి లేక
సింహాద్రి వాణి
విజయవాడ
[27/1, 4:48 pm] Naga: భారతీయ తనగ భరత జాతి నడత
ReplyDeleteగౌర వమును పొందు కన్న తల్లి
భావి తరము వారు భాద్యతగ మెలగ
ఆధునికము తెలిపె నాంధ్ర కవి
ప్రతిభ కలవారు సాహితీ పండితులును
గరిక పాటి సింహమును పొ గడగ వశమె
ధరణి లోధారణబ్రహ్మ తరగ నిగని
బహుముఖప్రజ్ఞ చూపిన భాగ్య శాలి
అమ్మ దీవెన లనుపొంది హర్ష మొంది
నిత్య సత్యాలనెన్నోవినికిడి చేసె
సరస రస ఛలోక్తులతోడ నార సింహ
మాన వాళి మనుగడకు మార్గ దర్శి
శారదా పుత్రుడవధాని సాహ సించి
నిర్భ యంబుగ వాక్రుచ్చె నిజము రావు
శంకలునిక గరికపాటి వంక లేక
ముద్దుబిడ్డ పద్మశ్రీ కి బద్ధుడయ్యె
గరికపాటి వారికి గౌరవ పద్య కుసుమాలు
డా. తంగిరాల నాగ లక్ష్మి