విశ్వాసం 22022022

అంశం: విశ్వాసం
******
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******
కవి వరుల జాబితా
1.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
2.కోరాడ గారు
3.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
4.కవిత వెంకటేశ్వర్లు గారు
5.వింజమూరి సూర్య లక్ష్మి గారు
6.గొర్రెపాటి శ్రీ ను గారు
7.గజవెల్లి శ్రీనివాసాచారి గారు
8.శివునూరి లలితా కృష్ణ గారు
******************
1
అంశం: విశ్వాసం

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
**********************
      ఉత్తమ గుణం

మంచిని పెంచే విశేషణాలలో ముఖ్య గుణం

ఉప్పు పెట్టిన పుణ్యానికి
ఉప్పు తిన్న ఉపకారము
సేవావృత్తులందు లభ్యం
అల్ప ప్రాణి శునకానికి పెట్టు ఆహారము
తెల్లవార్లు కాపలాకాయు ఉపచారము

దీక్షతో ఆరాధించు
దేవుని పట్ల విశ్వాసంతో
సిద్ధించును దీక్ష సంకల్పము...

విశ్వాసము ప్రాణికి నిర్దేశిత మార్గము
రేపు అనే పదానికి
ఊపిరి పోసిన ఉచ్చ్వాసము..
నేటికి అంతిమమం అనుకునేది 
ఊపిరి తీసిన నిశ్వాసము...

మనసులో జీర్ణించుకున్న
ప్రాపంచిక దృక్పథము 
కృతజ్ఞతకు సంతకం
కృతఘ్నతకు తిలోదకం
      ***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
2
నేటిఅంశం :- 
@ విశ్వాసం @
    కోరాడ నరసింహా రావు !
శీర్షిక :-   *** వమ్ముకాదు ***
                    *********
న్యాయం లాంటి నమ్మకం కంటే 
ధర్మ స్వరూపమైన విశ్వాసం... 
గొప్పదోయ్... !
 నమ్మకం వమ్ము కావచ్చునేమో 
విశ్వాసమేనాటికీ వమ్ముకాద న్నది,చరిత్రచెబుతున్న సత్యం !
 కర్ణుడేదో ఉద్ధరిస్తాడని నమ్మిన దుర్యోధనుని నమ్మకం వమ్మై పోయిందిగా... !
ఎన్నాళ్ళైనా... ఎన్నేళ్ళైనా... 
రాముడు వస్తాడు, చూస్తాను అనుకున్న శబరి విశ్వాసం వమ్ముకాలేదుకదా !!
రామదాసుది కేవలం నమ్మకం కనుకనే అన్ని కష్టాలను అనుభ విoచాడు !
ప్రహ్లాదునిది పూర్ణవిశ్వాసం... 
కనుకనే... మరణవేదనలు సైతం ఆతని స్ఫురణకు సైతం రాలేకపోయాయి !
నమ్మకం నిరీక్షించేది కొంతవరకే 
విశ్వాసం, సాదించేవరకూ...
వైదొలిగదు !
విశ్వాసమంటే ప్రాణంపోతున్నా చెక్కు చెదరని నమ్మకం !! 
నేనిది సాధించ గలనుఅనుకునే
ఆత్మ విశ్వాసం దేన్నైనా సాధించగలదు !
మనుషులు నమ్మకాలకుపరిమి తులై పొతే ... సాధించేది స్వల్పమే !
విశ్వాసంతో నిలబడగలిగితే... 
అన్నింటా విజయమే !! 
సత్యమేనాటికైనా జయిస్తుంది అని విశ్వసించబట్టే హరిశ్చం ద్రుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు !
అహింసా,సత్యాగ్రహములతోనే  స్వాతంత్ర్యాన్నిసాధించగలమన్న గాంధీజీ విశ్వాసమే,మనకు స్వరాజ్యాన్ని తెచ్చిపెట్టింది !!
విశ్వాసులకే... విజయాలు. 
     *****************
     ........  కోరాడ.
3
 కావ్యగానం(సీజన్2)
తేది22022022,మంగళవారం
అంశం:విశ్వాసం

దేనినైన పొందవచ్చు 
దేనినైనా పొగొట్టుకొనవచ్చు
కాని పొందలేనిది
పోగొట్టుకోలేనిది
విశ్వాసం....
ఉప్పు తిన్నామనే విశ్వాసం
పాలు తాగామనే విశ్వాసం
సాయం పొందామనే విశ్వాసం
జీవితాంతం గుర్తుండిపోయేదే....
ధనం కన్నా మిన్నా...
ఒక్కక్షణం ఆలోచిస్తే చాలు....
విశ్వాసం కన్నా మించినది ఏముంది....
అది మనిషిని మనీషిగా చేస్తుంది...
జంతువైనా సరే అదొక
దొరకని పెన్నిధి...

ఇది నాస్వీయరచన.
దోసపాటి వెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
4

అంశం:: విశ్వాసము
పేరు:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625

విశ్వాసం
నమ్మిన వారికి మేలు చేయడం
చెప్పిన పనిని చేసి పెట్టడం
వచ్చిన పనిని రాదని చెప్పక పోవడం

విశ్వాసానికి సమానార్థము
నమ్మకము
శ్వానానికి నాల్గు రోజులు
నాలుగు ముద్దలు పెడితే
జీవితాంతము నీ వెనకాలే
తిరుగుతుంది
ఇంటికి కాపలా ఉంటుంది
నీ రాకకోసం ఎదురు చూస్తోంది
నీ నీడలా వెన్నంటి ఉంటుంది

మనకు ఎవరైనా మేలు చేస్తే
మేలు చేసిన వారిని చచ్చేదాక
మరువకూడదు
దుర్యోధనుడు కర్ణుడికి చేసిన
మేలు మరువక చచ్చేదాక
విశ్వాసంతో వున్నాడు
కృతజ్ఞతతో ఉండడము
మనిషి సుద్గుణము
కృతఘ్నత కలిగి ఉండడం
మనిషికున్న దుర్గుణము!!
           పై కవిత నా స్వీయ రచన అని హామీ
5.
[24/02, 8:08 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగాన C సీజన్‌ 2 ) 
24/2/2022/ గురువారము
అంశము --- విశ్వాసం

విశ్వాసమేభవితకుపునాది
లక్ష్యసాధనకు విశ్వాసమవసరము
చేసేపనిలోవిశ్వాసమున్నచేకూరు విజయము
విశ్వాసమన్నదే నమ్మకము
నమ్మకమేవిశ్వాసము 
విశ్వాసమున్న చాలు విశ్వమేలవచ్చు
విశ్వాస మనగచేసిన మేలు మరువక పోవడమే
సేవకునికి విశ్వాసమున్న లక్ష్యము సాధించగలడు
పరమాత్మునిపై విశ్వాసము 
పూజాపునస్కారాలు
గురువుపై విశ్వాసముశిష్యుని పురోగతి
జగతివిశ్వాసమే ' సత్యమేవజయతి '
విశ్వాసమేదేశ సంపద
ఆత్మవిశ్వాసమనగ ఆనందమే చేకూరు
శాంతిసహనములన్నియు విశ్వాసముతో కూడిన అన్నియు సాధించవచ్చు
గాంధి మహాత్ముని విశ్వాసమే
స్వాతంత్ర్యభాగ్యము !
         తరణికంటి సూర్యలక్ష్మి.
                   ----------
6
[24/02, 8:20 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం
అంశం : విశ్వాసం
శీర్షిక :  "స్ఫూర్తి మంత్రం"

రచన : గొర్రెపాటి శ్రీను  

"విశ్వాసం" ప్రపంచాన్ని నడిపే మహామంత్రం !
చేస్తున్న పనిలో విజయం సాధించగలమన్న నమ్మకం..
నిన్నెప్పుడూ ముందుకు నడిపించే చైతన్యమే !

"విశ్వాసం" బలమైన ఆయుధంగా మలుచుకుని ..
జీవిత పయనంలో ఎదురవుతున్న ఆటుపోటులను తట్టుకుంటూ..
లక్ష్యం దిశగా ధీమాగా కృషి చేస్తుంటే..తప్పకుండా నిన్ను వరించేను అద్భుతం !

అబ్దుల్ కలాం ..
చిన్న వయస్సులోనే ..
ఎదురుగా వున్న సంద్రాన్ని దాటుతున్న పక్షుల్ని చూస్తూ..
ఎన్నో ఆశల రెక్కలు చాస్తూ..తనపై తనకు గల విశ్వాసాన్ని నిలుపుకుంటూ..
రామేశ్వరమనే చిన్న దీవి నుండి బయలుదేరి ..
జగమంతా స్ఫూర్తిని నింపేలా..రాష్ట్రపతి గా ఎదిగి..
దేశం గర్వించేలా "భారత రత్న" మై నిలిచిన ఘనత.."ఒక విజేత ఆత్మకథ !"

గాంధీజీ మహాత్ముడు,స్వామి వివేకానంద,అబ్రహం లింకన్,నెల్సన్ మండేలా..
ఎవరి జీవిత గాథలు చదివినా..తెలిసే మంచి విషయం..
"అచంచలమైన విశ్వాసమే" సకల విజయాలకు స్ఫూర్తి మంత్రం !  


                                  - రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్) చరవాణి: 9652832290
7.
కవితా గానం 
అంశం: విశ్వాసం 
శీర్షిక: సుగుణం
రచన: గజవెళ్ళి శ్రీనివాసాచారి 
...
విశ్వాసం 
దేవుడు మనకిచ్చిన సుగుణం 
విశ్వాసం కోల్పోతే 
మనిషి బతికివున్నా విలువ ఉండదు 
నీడ నిలువ ఉండదు 
సమాజంలో గౌరవం శూన్యం

విశ్వాసం 
మనిషికి కొండంత అండ 
సంతానం తెలివితేటలపైన 
ప్రతిభాపాటవాలపైన 
తల్లిదండ్రులకు ఎనలేని విశ్వాసం
మన సైనికులపైన 
దేశప్రజలకు ప్రగాఢ విశ్వాసం

మన ప్రజాప్రతినిధులు 
ప్రజల విశ్వాసం కోల్పోయినా 
పదవులు వీడని మూర్ఖులు 
నైతికత విలువలకు తిలోదకాలు

నేటిరోజుల్లో 
విశ్వాసం శ్వాస కోల్పోతున్నది 
నిర్జీవమై కొట్టుమిట్టాడుతున్నది 
విశ్వాసానికి జీవంపోసే
విశ్వాసపాత్రులేరి
8.
కవితాగానం సీజన్ 2

విశ్వాసం 
***************"******
ఎలా వదులుకోగలను?
అపజయపు అంచుల వరకు వెళ్లొచ్చిన నన్ను విజయబావుటా
ఎగరేసేలా చేసావే..
ఆణువణువునా అలదుకున్న
నిన్నెలా వదులుకోగలను..?

అంతర్లీనంగా 
అంతకంతకు పెరుగుతున్న నిర్లిప్తతను

లిప్తపాటు కాలంలోనే తప్పించి
పలువురితో మెప్పించావే..

ఆ క్షణాలనెలా మరువగలను..??

ఓటమి బాట పట్టించాలనుకున్న వారికి
 గట్టి పాఠమొకటి చెప్పి..

ఏ అమ్మకాలకు కొమ్ము కాయక 
నన్ను కమ్ముకున్నావే

సవాళ్ళనన్నింటిని
 తెల్లముఖం వేయించి
నీ ముందు వాలి పోయేలా చేసావే..

నీ నిబ్బరానికి 
 నింపాదిగా నివ్వెర పోయిన ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోకుండా ఎలా ఉండగలను ..?

విజయపథం వైపు నడిపించే పదమా..!! 
ఉచ్వాస నిశ్వాసలలో
నిండిన విశ్వాసమా!!!

వాడని పరిమళపు గంధమై 
మొన్న నిన్న రేపు లలో 
 నన్ను గెలిపించాలనుకునే
 నమ్మకమా..
నిన్నెప్పటికీ వదులుకోలేను
నన్నట్టిపెట్టుకుని ఉండవూ.!

********శివునూరి లలితాకృష్ణ

Comments

  1. ప్రతీ అంశాన్ని స్పృశించే వారు కొందరు ఉంటారు వారి ఓపిక బాధ్యత నిజంగా గ్రేట్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧